సాక్షి,న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. ఆ ప్రభావంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలుపై 1.6 తీవ్రత నమోదైంది. మణిపూర్, ఉత్తరాఖండ్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఇక పొరుగు దేశం నేపాల్‌లో బుధవారం ఉదయం 12 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది.
Earthquake tremors felt across Delhi
— ANI (@ANI) November 8, 2022
భారీ భూప్రకంపనల ధాటికి నేపాల్ దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ భూవిజ్ఞాన కేంద్రం అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో మంగళవారం 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 24 గంటల్లోనే రెండోసారి మరో భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది.
Update | Death toll after a house collapse in Doti district of Nepal after earthquake last night now at 6: Police https://t.co/iibsAfAF9j
— ANI (@ANI) November 9, 2022
Earthquake strikes with epicentre in Nepal, tremors felt across Delhi
Read @ANI Story | https://t.co/a3TImWKoy3#Earthquake #Delhi #Nepal pic.twitter.com/QXZpuaaGR4
— ANI Digital (@ani_digital) November 8, 2022
నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment