Tremors felt
-
కొమురంభీం జిల్లాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
కౌటాల/చింతమానెపల్లి: చింతమానెపల్లి: కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. కొద్ది సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. సిర్పూర్(టి) నియోజకవర్గం కేంద్రంగా భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. కౌటాల, సిర్పూర్(టి), చింతల మానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోని వస్తువులు కింద పడటంతో గమనించిన పలువురు భయాందోళనలతో బయటకు పరుగెత్తారు. భూప్రకంపనల ద్వారా ఎలాంటి నష్టం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికా వొద్దని అధికారులు తెలిపారు. చదవండి: ‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు.. -
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
ద్వీపకల్ప దేశం సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం -
Earthquake: ఢిల్లీలో భూకంపం
సాక్షి,న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. ఆ ప్రభావంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలుపై 1.6 తీవ్రత నమోదైంది. మణిపూర్, ఉత్తరాఖండ్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఇక పొరుగు దేశం నేపాల్‌లో బుధవారం ఉదయం 12 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. Earthquake tremors felt across Delhi — ANI (@ANI) November 8, 2022 భారీ భూప్రకంపనల ధాటికి నేపాల్ దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ భూవిజ్ఞాన కేంద్రం అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో మంగళవారం 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 24 గంటల్లోనే రెండోసారి మరో భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. Update | Death toll after a house collapse in Doti district of Nepal after earthquake last night now at 6: Police https://t.co/iibsAfAF9j — ANI (@ANI) November 9, 2022 Earthquake strikes with epicentre in Nepal, tremors felt across Delhi Read @ANI Story | https://t.co/a3TImWKoy3#Earthquake #Delhi #Nepal pic.twitter.com/QXZpuaaGR4 — ANI Digital (@ani_digital) November 8, 2022 నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: ‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ -
అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
-
అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
గువాహటి: ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత భయపెడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ భూకంపం వణించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అందించిన సమాచారం ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. పలుభవనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులు బీటలు వారాయి. అసోంలోని తేజ్‌పూర్‌కు పశ్చిమాన 43 కిలోమీటర్లు, లోతు 17 కిలోమీటర్లు భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు సమాచారం. అసోం, ఉత్తర బెంగాల్, ఈశాన్య ప్రాంతాలలోని గౌహతిలో ప్రకంపనలు సంభవించాయి.దీంతో సోషల్ మీడియాలో భూకంపం ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. మరోవైపు దీనిపై అసోం ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్ కూడా ట్వీట్ చేశారు. భారీ భూకంపం సంభవించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా కూడా భూకంపంపై స్పందించారు. సీఎం సోనోవాల్‌తో మాట్లాడానని ప్రధాని ట్వీట్ చేశారు. అన్ని విధాలా కేంద్రం సహాయం చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ ఆపద సమయంలో అసోం ప్రజల భద్రతపై ప్రార్థిస్తున్నానన్నారు. Spoke to Assam CM Shri @sarbanandsonwal Ji regarding the earthquake in parts of the state. Assured all possible help from the Centre. I pray for the well-being of the people of Assam. — Narendra Modi (@narendramodi) April 28, 2021 Earthquake of Magnitude:6.4, Occurred on 28-04-2021, 07:51:25 IST, Lat: 26.69 & Long: 92.36, Depth: 17 Km ,Location: 43km W of Tezpur, Assam, India for more information download the BhooKamp App https://t.co/sayMF9Gumd pic.twitter.com/lWRDtIAWh5 — National Center for Seismology (@NCS_Earthquake) April 28, 2021 Earthquake North East India Assam Taj Hotel Vivanta Guwahati Retweet#earthquake pic.twitter.com/ienCKz3Woc — gautam gada (@GautamGada) April 28, 2021 #earthquake in Assam Received this video from a friend claiming to be from Tezpur, the epicentre pic.twitter.com/7fnFiAJaY0 — Geetima Das Krishna (@GeetimaK) April 28, 2021 -
ఉత్తరఖండ్‌లో పలుచోట్ల భూ ప్రకంపనలు
ఉత్తరఖండ్: ఉత్తరఖండ్‌లో పలుచోట్ల గురువారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు న్యూస్ ఏజెన్సీ నివేదిక ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరఖండ్ తోపాటు సమీప ప్రాంతాలైన నయినైతల్, చామౌలి, భిమతాల్, పిథోఘడ్ లలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జియోలాజికల్ విభాగ కేంద్రం పేర్కొంది.