ద్వీపకల్ప దేశం సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అయితే మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు.
చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment