Solomon Islands
-
ప్రపంచంలో అతిపెద్ద పగడం
ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్)ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
ద్వీపకల్ప దేశం సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం -
అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?
హోనియారా: ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు ఓ చిన్న దేశం గట్టి షాక్ ఇచ్చింది. తమ తీరప్రాంత జలాల్లోకి అమెరికాకు చెందిన మిలిటరీ నౌక వచ్చేందుకు నో చెప్పింది. పసిఫిక్ దేశమైన సోలమన్ ఐలాండ్స్ ప్రధాని అధికార ప్రతినిధి ఈ మేరకు వెల్లడించారు. విదేశాలకు చెందిన మిలిటరీ నౌకలు సోలమన్ ఐలాడ్స్ నౌకాశ్రయాల్లోకి రావటంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని నౌకాశ్రయంలో ఇంధనం నింపుకోవాలని భావించిన అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌కు అనుమతించలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో నిషేధం అంశాన్ని మంగళవారం వెల్లడించారు సోలమన్ ప్రధాని మనస్సే సోగవరే. ‘ఈ నిర్ణయం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక అనుమతి లేదు. నౌకల అనుమతి ప్రక్రియను పునఃపరిశీలించే అంశంపై నిర్ధిష్ట సమయం ఏమీ లేదు.’ అని ప్రధాని ప్రతినిధి తెలిపారు. తాత్కాలిక నిషేధం దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు.. ఈ నిర్ణయంతో సోలమన్ ఐలాడ్స్ తమ మిత్ర దేశం చైనాకు మరింత దగ్గరవుతోందని సూచిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాలు భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు.. పశ్చిమ దేశాల మీడియా తమ దేశంలో అధికార మార్పిడికి, గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని సోలమన్ ఐలాడ్స్ ప్రధాని కార్యాలయం ఇటీవలే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ నౌకలపై తాత్కాలిక నిషేధం విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం.. చినూక్ హెలికాప్టర్లు నిలిపివేత.. ఆందోళనతో భారత్ లేఖ -
దాదాపు నెలరోజలు సముద్రంలోనే!
మనం విదేశాల్లోనో లేక మరేదైనా రాష్ట్రంలోనూ దారితప్పిపోతే భాష రాకపోయిన ఏదో రకంగా మనం బయటపడగలం కానీ సముద్రంలో అనుకోకుండా బోటు మునిగిపోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనో సముద్రంలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఇద్దరు వ్యక్తులకు. సోలమన్ దీవుల్లోని సమద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు దాదాపు నెల రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వారు ఎవరు ? ఎందుకు అలా జరిగిందనే వివరాలు.. (చదవండి: కదిలే టాటుల అద్భుతమైన వీడియో) విషయంలోకి వెళ్లితే సోల్మన్ దీవులకు చెందిన లివే నంజికానా, జూనియర్ కోలోని అనే ఇద్దరూ వ్యక్తులు సోలమన్ దీవులలోని పశ్చిమ ప్రావిన్స్‌కి సెప్టెంబర్ 3న చిన్న మోటారు బోట్‌పై బయలుదేరారు. పశ్చిమ తీరంలోని వెల్ల లావెల్లా ద్వీపం, గిజో ద్వీపాలను ఆధారంగా చేసుకుని ప్రయాణిచారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికే జీపీఎస్ పనిచేయడం మానేసింది. దీంతో వారు దాదాపు 29 రోజులు సముద్రంలో చిక్కుకు పోయారు. ఈ సోలామాన్ సమద్రంలో ప్రయాణించటం ఎంత క్లిష్టతరమైనదో ఈ పర్యటనలోనే వారికి అర్థమైంది. ఈ పర్యటన కోసం తెచ్చుకున్న నారింజపళ్లు, కొబ్బరికాయలు, వర్షపు నీటితో ఆ 29 రోజులు గడిపారు. ఆఖరికి న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినియా తీరంలోని ఒక మత్స్యకారుడి సాయంతో బయటపడ్డారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తేనే ఏదోలా అనిపిస్తోంది అలాంటిది నిజ జీవితంలో ఎదురైతే ఇక అంతే సంగతులు. కానీ నిజంగా ఇది చాలా ఒళ్లు గగుర్పోడిచేలాంటి పర్యటన కదా!. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) -
సాల్మన్ దీవుల్లో భూకంపం.. సునామీ అలర్ట్
సిడ్నీ: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సాల్మన్ దీవుల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.38 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.08 గంటలకు) సముద్రంలో 49కి.మీ. లోతున భూకంపం ఏర్పడిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సాల్మన్ ఐలాండ్స, వనౌటు, పపువా న్యూగినియా, నౌరు, తువలు, కోషయ్ ్రదీవుల వెంట సునామీ అలలు తాకవచ్చని హెచ్చరించింది. హవాయ్ ద్వీపానికి కూడా ముప్పు ఉండవచ్చని భావిస్తున్నారు. -
సోలోమన్ దీవుల్లో భూకంపం
హొనియారా: సోలోమన్ దీవుల్లో సోమవారం సాయంత్రం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దాడ్లీలోని నైరుతి ప్రాంతంలో 180కిలోమీటర్ల మేర భూమి కంపించిందని తెలిపారు. దాడ్లిలో భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. -
సోలోమన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ: సోలోమన్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. రాజధాని హనోరియాకు 214 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. -
సోలోమన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ : సోలోమన్ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సోలోమన్ రాజధాని హోనియారాకు 583 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే భూకంప తీవ్రత 7.5 ఉంటే సునామీ వచ్చే సూచనలున్నాయని దీనిపై సమీక్ష నిర్వహించిన జియోసైన్స్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 2013లో సోలోమన్ దీవుల్లో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా సంభవించిన సునామీలో 10 మంది మృతి చెందగా...వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. -
సోలమన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ: సోలమన్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు అయిందని యూఎస్ జియాలజిస్ట్‌లు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదిక అందలేదని తెలిపారు. సోలమన్ దీవుల రాజధాని హోనియారాకు 334 కిలోమీటర్ల దూరంలో 8.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. -
సొలొమన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ: సొలొమన్ దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8 గా నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. సునామీ వచ్చే హెచ్చరికలు లేవు. రాజధాని హనియర్కు 448 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. గత మూడు రోజుల నుంచి మూడోసారి భూమి కంపించింది. -
సాల్మన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ : పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రపంచంలో భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఇది ఒక్కటని పేర్కొంది. గత మూడేళ్ల కాలవ్యవధిలో దాదాపు 30 స్వల్ప భూకంపాలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. -
సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం
ఆస్ట్రేలియా సమీపంలోని సోలోమన్ దీవులు ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయింది. ఈ మేరకు చైనాకు చెందిన సీఈఎన్సీ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 4.14 నిముషాలకు ఆ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం తీవ్రంగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. అనంతరం సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నట్లు చెప్పింది. అయితే భూకంపం వల్ల ఎంత మంది మరణించింది... ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు అందవలసి ఉంది.