మనం విదేశాల్లోనో లేక మరేదైనా రాష్ట్రంలోనూ దారితప్పిపోతే భాష రాకపోయిన ఏదో రకంగా మనం బయటపడగలం కానీ సముద్రంలో అనుకోకుండా బోటు మునిగిపోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనో సముద్రంలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఇద్దరు వ్యక్తులకు. సోలమన్ దీవుల్లోని సమద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు దాదాపు నెల రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వారు ఎవరు ? ఎందుకు అలా జరిగిందనే వివరాలు..
(చదవండి: కదిలే టాటుల అద్భుతమైన వీడియో)
విషయంలోకి వెళ్లితే సోల్‌మన్ దీవులకు చెందిన లివే నంజికానా, జూనియర్ కోలోని అనే ఇద్దరూ వ్యక్తులు సోలమన్ దీవులలోని పశ్చిమ ప్రావిన్స్‌కి సెప్టెంబర్ 3న చిన్న మోటారు బోట్‌పై బయలుదేరారు. పశ్చిమ తీరంలోని వెల్ల లావెల్లా ద్వీపం, గిజో ద్వీపాలను ఆధారంగా చేసుకుని ప్రయాణిచారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికే జీపీఎస్ పనిచేయడం మానేసింది. దీంతో వారు దాదాపు 29 రోజులు సముద్రంలో చిక్కుకు పోయారు. ఈ సోలామాన్ సమద్రంలో ప్రయాణించటం ఎంత క్లిష్టతరమైనదో ఈ పర్యటనలోనే వారికి అర్థమైంది.
ఈ పర్యటన కోసం తెచ్చుకున్న నారింజపళ్లు, కొబ్బరికాయలు, వర్షపు నీటితో ఆ 29 రోజులు గడిపారు. ఆఖరికి న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినియా తీరంలోని ఒక మత్స్యకారుడి సాయంతో బయటపడ్డారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తేనే ఏదోలా అనిపిస్తోంది అలాంటిది నిజ జీవితంలో ఎదురైతే ఇక అంతే సంగతులు. కానీ నిజంగా ఇది చాలా ఒళ్లు గగుర్పోడిచేలాంటి పర్యటన కదా!.
(చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’)
Comments
Please login to add a commentAdd a comment