చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్‌పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్‌గా ఓ రాకాసి అల అతని బోట్‌ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్‌లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు.
శనివారానికి ఓ కోస్ట్‌గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్‌గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్‌కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు.
ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్‌బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్‌ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
#FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida.
— USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023
Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8
Comments
Please login to add a commentAdd a comment