Boat travel
-
రూ.600కే మూడు గంటల్లో చెన్నై-కోల్‌కతా ప్రయాణం
చెన్నై-కోల్‌కతాకు రూ.600 ఖర్చుతో కేవలం మూడు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. నమ్మట్లేదు కదా.. నిజమేనండి.. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేసిన ఇ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ కంపెనీ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్‌ను బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించారు. దీనివల్ల కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం సాగించవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఇ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌక.ఈ ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ బోట్‌ను జీరో-కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాంప్రదాయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంపై, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: జియో హాట్‌స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!భవిష్యత్తు ప్రణాళికలువాటర్ ఫ్లై టెక్నాలజీస్ వచ్చే ఏడాది నాటికి నాలుగు టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 2029 నాటికి చెన్నై-సింగపూర్ వంటి ఖండాంతర మార్గాల్లోనూ ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. -
సార్.. నా కొడుకు బతికున్నాడా.?
రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో బోటు నుంచి బాణసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, కుషాయిగూడ నాగారానికి చెందిన సిల్వేరు అజయ్ (21) అనే బీటెక్ విద్యార్థి రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. ఉదయం నుంచి ఆ యువకుడి కోసం లేక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరక లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉండగా..ప్రణీత్‌కుమార్, సునీల్ అదే ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా డిశ్చార్జ్ చేశారు. స్నేహితుడితో కలిసి వచ్చిన... కుషాయిగూడ నాగారానికి చెందిన ఆటో డ్రైవర్ జానకిరాం, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్‌తో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అజయ్ స్నేహితుడు రాఘవేంద్రకు టపాకాయల వ్యాపారి మణికంఠ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆదివారం సాయంత్రం మణికంఠకు రాఘవేంద్ర ఫోన్ చేయగా తాను ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్నానని, ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో మరో స్నేహితుడు సాయిసందీప్తో కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మణికంఠకు ఫోన్ చేయగా బోటులో సాగర్ లోపల నుంచి ఒడ్డుకు వచ్చి వారికి డబ్బులు చెల్లించాడు. తాము బోటులో లోపలికి వస్తామని చెప్పడంతో అందరూ కలిసి బాణసంచా కాల్చే దగ్గరకు వెళ్లగా అదే సమయంలో అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బోటు సిబ్బందితో పాటు మరికొంత మంది బోటు సిబ్బంది అక్కడ ఉన్నారు. బాణసంచాను కచాప్లో ఉంచగా దానికి అనుసంధానంగా మెకనైజ్డ్ బోటు, మరో స్పీడ్ బోటు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుకు కూడా మంటలు అంటుకోవడంతో అందరూ అందులో నుంచి కిందకు నీళ్లలోకి దూకేశారు. అక్కడే ఉన్న బోటు సిబ్బంది నీళ్లలోకి దూకి కొందర్ని రక్షించగా..అజయ్ మాత్రం గల్లంతయ్యారు. అజయ్‌తో పాటు వచి్చన రాఘవేంద్ర, సాయి సందీప్‌లకు ఈత రావడంతో కొద్ది దూరం ఈదుకుంటూ రాగా అక్కడికి వచి్చన స్పీడ్ బోట్ సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు. తెల్లవారు జామున గుర్తించిన స్నేహితులు గాయపడిన వారిని మొదట పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ తెల్లవారు జామున 2 గంటలకు రాఘవేంద్ర, సాయిసందీప్లు కలుసుకుని అజయ్ గురించి ఆరాతీశారు. అయితే అప్పుడు అజయ్‌కి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ ఉంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. కుటుంబ సభ్యుల ఆందోళన.. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారు జామున హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అజయ్ కోసం ఆరా తీశారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా అజయ్ కోసం లేక్ పోలీసులు, డీఆర్‌ఎఫ్‌లకు చెందిన 5 బృందాలు సోమవారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్‌లో గాలింపు చేపట్టాయి. ఉదయం నుంచి బోట్లు, గజ ఈత గాళ్ల సహాయంతో సాగర్ మొత్తం సాయంత్రం 6.30 గంటల వరకు గాలించినా యవకుడి ఆచూకీ మాత్రం కనిపించ లేదు. మంగళవారం మరో మారు గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా..సోమవారం అజయ్ కుటుంబ సభ్యులు ఇచి్చన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హన్మంతు తెలిపారు. లేటుగా వస్తానని చెప్పి.. రాత్రి 8.30కి ఫోన్ చేస్తే ట్యాంక్‌బండ్‌పై ఉన్నా..కొద్దిగా లేటుగా వస్తాను అని చివరి మాటలు చెప్పాడంటూ అజయ్ తల్లి నాగలక్ష్మి, తండ్రి జానకిరాం కన్నీరుమున్నీరుగా రోదించారు. -
రాకాసి అలల పని పడుతూ గస్తీ కాసే బోట్లు (ఫొటోలు)
-
లాంచీ సర్వీసుల లాంచింగ్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు. -
26 నుంచి సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం
కొల్లాపూర్: సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లాంచీలో ప్రయాణానికి చిన్నపిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించారు. వన్‌వే ప్రయాణానికి పెద్దలకు రూ.2,000, చిన్నపిల్లలకు రూ.1,600, వెళ్లి రావడానికి (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి పెద్దలకు రూ.3,000, చిన్నపిల్లలకు రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రయాణికులకు భోజన వసతులు కల్పించనున్నారు. ఈ నెల 26 నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్ శివకృష్ణ తెలిపారు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు మొబైల్ నంబర్ 7731854994కు సంప్రదించవచ్చు. -
వేటకు వెళ్లిన బోటుకు అగ్ని ప్రమాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ): సముద్రంలో వేటకు వెళ్లిన బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. విశాఖ దక్షిణం వైపు 28 నాటికల్ మైళ్ల దూరం పూడిమడక సముద్ర తీరంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గనగళ్ల అప్పయ్యమ్మ బోటు ఈనెల 15న వేటకు వెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పూడిమడక ప్రాంతంలో బోటు నంబర్ ఐఎన్డి–ఏపీ–వి5–ఎంఎం–17తో చేపలు, రొయ్యల వేట సాగుతోంది. తొలుత బోటు ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. సిబ్బంది వెళ్లి ఇంజన్‌ను పరిశీలించగా, ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో బోటు సిబ్బంది వెంటనే సముద్రంలో దూకారు. వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే బోటు కాలిపోయింది. వేటాడిన మత్స్య సంపద, ఇతర సామగ్రి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మత్స్యకారులు మంగళవారం ఉదయానికి స్థానిక ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన వారిలో వాసుపల్లి రాజు (36), వాసుపల్లి అప్పన్న (58), వాసుపల్లి దాసీలు (41), వాసుపల్లి అప్పారావు (41), గనగళ్ల ఎరికొండు (40), మైలపల్లి ఎరయ్య్ర (50), గనగళ్ల పోలిరాజు (20) ఉన్నారు.బోటు దగ్ధం కావడంతో యజమానికి రూ.30 లక్షలు మేర నష్టం కలిగిందని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మీడియాకు తెలిపారు. సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులకు ఆశ్రయం కల్పించామన్నారు. ఘటనలో నష్టపోయిన బోటు యజమానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని కోరారు. ప్రమాదం విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తానని సంఘం మాజీ అధ్యక్షుడు పి.సి.అప్పారావు తెలిపారు. -
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
కడలిలో కరెంట్ బోట్.. ఆసక్తికర విషయాలు..
విద్యుత్ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన పెరుగుతోంది. రానున్న రోజుల్లో వీటి వినియోగం మరింత హెచ్చవుతుందని భావిస్తున్నారు. అయితే ఈవీలు కేవలం రోడ్లకే పరిమితం కాకుండా నీటిలో సముద్రంపై వాటి మార్కును నిలుపుకోనున్నాయి. చాలా కంపెనీలు నీటిలో వినియోగించే చిన్నబోట్లను నడిపేందుకు సైతం విద్యుత్తును వినియోగించేలా పరిశోధనలు సాగిస్తున్నాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అమెరికాకు చెందిన ‘క్రౌలి’ సంస్థ ‘ఈ-వోల్ఫ్’ అనే షిప్పింగ్ వెజెల్‌ను తయారుచేసింది. 70 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ వెజెల్ 82 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని క్రౌలికు చెందిన ఇంజినీర్లు మాస్టర్బోట్ బిల్డర్స్ షిప్‌యార్డ్‌లో రూపొందించినట్లు తెలిసింది. ఇందులో ప్రయాణించే వారికి చుట్టూ(360 డిగ్రీ వ్యూ) ప్రదేశాలు కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ వెజెల్‌ను ఈ ఏడాది చివర్లో శాన్ డియాగో పోర్ట్‌లో విధుల్లో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని తీరప్రాంతంలో పెట్రోలింగ్ కోసం వినియోగంచనున్నట్లు సమాచారం. ఈ వెజెల్లో 6.2 మెగావాట్ హవర్ మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్‌ను అమర్చారు. ఇది దాదాపు గంటకు 30 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 2,100 కిలోవాట్ శక్తినిచ్చే రెండు థ్రస్టర్ మోటార్లతో కూడిన ప్రొపల్షన్ సిస్టమ్‌కు అమర్చారు. అయితే ఇందులో అత్యవసర సమయాల్లో బ్యాటరీ అయిపోయినా మరింత దూరం ప్రయాణించడానికి వీలుగా రెండు చిన్న డీజిల్ జనరేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీన్ని భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో సాన్‌డియాగో పోర్ట్ తీరప్రాంతంలో మైక్రోగ్రిడ్ ఛార్జింగ్, స్టోరేజ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ-వోల్ఫ్ సేవలు వినియోగించుకోనున్నారు. సాంప్రదాయ వెజెల్‌తో పోలిస్తే ఇది మొదటి 10 సంవత్సరాల కాలంలో 2.5 టన్నుల డీజిల్ పార్టికల్స్, 3,100 మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను ఆదా చేస్తుందని క్రౌలీ తెలిపింది. సముద్రగర్భంలో ఏర్పడుతున్న శబ్దకాలుష్యం వల్ల జీవులకు ఎంతో హానికలుగుతుందని అయితే అది ఈవీ బోట్లతో నివారించవచ్చని చెప్పింది. -
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా..
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు. ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..! -
కృష్ణానదిలో పర్యాటకుల 'లాంచీ.. రెడీ'..!
మహబూబ్‌నగర్: ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. నదీ అందాలతోపాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందు కోసం పర్యాటక శాఖ లాంచీలు ముస్తాబయ్యాయి. సోమశిల సమీప ప్రాంతాలతోపాటు శ్రీశైలం వరకు నదిలో ప్రయాణాలు సాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో పర్యాటక శాఖ రెండు లాంచీలను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సోమేశ్వర అనే పేరుతో మినీ నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం కల్పించింది. అప్పట్లో లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో 2019లో స్వదేశి దర్శన్ నిధులు రూ.2.5 కోట్లతో 120 మంది ప్రయాణించేందుకు వీలుగా మరో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. దీనినే ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో ప్రయాణించేందుకు వినియోగిస్తున్నారు. మినీ నాన్ ఏసీ సోమేశ్వర లాంచీని మాత్రం సోమశిల పరిసర ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. సోమశిల పరిసరాల్లో.. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదిలోకి నీరు చేరడం ఆలస్యమైంది. కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సోమశిల సమీపంలో పుష్కర ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో మినీ నాన్ఏసీ లాంచీ ప్రయాణాలను పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ప్రయాణాలు ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రెండు లాంచీలను శుభ్రం చేసి నది ప్రయాణాలకు సిద్ధంగా ఉంచారు. త్వరలోనే ప్రారంభిస్తాం.. కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు లాంచీ ప్రయాణాలు ప్రారంభించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమశిలలోని రెండు లాంచీలను నదీ ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చాయి. అలాగే శ్రీశైలం టూర్‌కు దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉంటేనే లాంచీ తిప్పుతాం. లేదంటే నిర్వహణ భారం మీదపడుతుంది. మినీ లాంచీ టికెట్ల ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవు. శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ధరలను ఈనెలాఖరులోగా అధికారులు నిర్ణయిస్తారు. – రాజేష్‌గౌడ్, లాంచీ నిర్వహణ పర్యవేక్షకుడు టూర్‌కు పర్యాటకుల కొరత.. శ్రీశైలం లాంచీని 2019లో ప్రారంభించాక ఇప్పటి వరకు కేవలం 20 సార్లు మాత్రమే సోమశిల– శ్రీశైలం మధ్య తిప్పారు. 2019లో నాలుగు సార్లు, 2020లో 11 సార్లు తిప్పగా.. 2021లో ఒక్కసారి కూడా తిప్పలేదు. 2022లో మాత్రం 5 సార్లు లాంచీ ప్రయాణం సాగింది. శ్రీశైలానికి లాంచీలో ప్రయాణించాలంటే కనీసం 70 మంది ప్రయాణికులు ఉండాలి. లేదా రూ.1.30 లక్షలకు పైగా చార్జీల రూపంలో చెల్లించాలి. అలా అయితేనే లాంచీ ప్రయాణం ప్రారంభిస్తారు. అంతమంది ఒకేసారి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో శ్రీశైలం టూర్ ప్రయాణాలు పెద్దగా సాగడం లేదు. పాతాళగంగ వరకు.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఏసీ లాంచీ ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అది శ్రీశైలం వరకు కాకుండా ఈగలపెంట వద్దే ఆపుతున్నారు. అక్కడి నుంచి మరో 21 కి.మీ., మేరకు బస్సులో ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దుల కారణంగా పర్యాటక శాఖ లాంచీ పాతాళగంగ వద్దకు వెళ్లడం లేదు. పర్యాటక శాఖ అధికారులు స్పందించి పాతాళగంగ వద్దకు పర్యాటకులను చేర్చేలా చర్యలు చేపట్టాలి. అలాగే నదీ ప్రయాణంలో ఒకటి లేదా రెండుచోట్ల కొద్దిసేపు పర్యాటకులు విరామం తీసుకునేలా షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – శ్రీనివాసులు, కొల్లాపూర్ మినీ లాంచీకి డిమాండ్.. సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పే సోమేశ్వర లాంచీ (మినీ నాన్ఏసీ లాంచీ)లో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లాంచీలో 15 నిమిషాలపాటు తిప్పేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50, చిన్నపిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులు జమ అయితే ఈ లాంచీని నదిలో తిప్పుతారు. ఒకవేళ ఎవరైనా రూ.4 వేలు చెల్లిస్తే గంటపాటు వారి బృందం మొత్తాన్ని నదిలో తిప్పుతారు. ఈ ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు సోమేశ్వర లాంచీలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ లాంచీ ద్వారా పర్యాటక శాఖకు ప్రతినెలా రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది. శ్రీశైలం టూర్‌కు తిప్పే ఏసీ లాంచీ ప్రయాణ చార్జీలు అధికంగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే..చివరికి ఒక్కడే సముద్రంలో..
చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్‌పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్‌గా ఓ రాకాసి అల అతని బోట్‌ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్‌లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు. శనివారానికి ఓ కోస్ట్‌గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్‌గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్‌కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు. ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida. Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8 — USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023 (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. (చదవండి: ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
వారెవ్వా!, నీటి మీద ప్రయాణించేలా.. ఎలక్ట్రిక్ వాటర్ టాక్సీ వచ్చేసింది
ఇది పడవే గాని, అడుగు భాగాన్ని నీటిపై మోపకుండా ప్రయాణిస్తుంది. దీనిలోని ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వల్ల ఇది నీటి ఉపరితలానికి దాదాపు ఒక అడుగు ఎత్తున ప్రయాణిస్తుంది. దీని లోపలిభాగం ఒక వ్యాను లోపలి భాగం మాదిరిగానే ఉంటుంది. అందువల్ల దీనిని వాటర్ టాక్సీగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఆర్టెమిస్ టెక్నాలజీస్ సంస్థ ఈ విచిత్ర వాహనాన్ని ‘ఈఎఫ్–12 ఎస్కేప్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది.ఇందులో ఇద్దరు సిబ్బంది కాకుండా, మరో పన్నెండుమంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం గంటకు 52 నాటికల్ మైళ్లు (96.3 కి.మీ.). ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని, ప్రయాణికుల జల రవాణాలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలదని ఆర్టెమిస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీని ధర 3.75 లక్షల డాలర్లు (రూ.3.07 కోట్లు). -
నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..
ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు. حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين. المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7 — RedSea_Anglers ⚓ 🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
పెను విషాదం.. పదుల సంఖ్యలో మరణాలు!
మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. వివరాల ప్రకారం.. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు. కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అయ్యో పాకిస్తాన్.. రంజాన్ వేళ దారుణ పరిస్థితులు! -
నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్, కళ్యాణ్, త్రినాథ్, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు) -
వారణాసిలో సీఎన్జీ బోట్లు
వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్‌కు బదులు సీఎన్జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు. మరో 2వేల బోట్లను సీఎన్జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు. -
పాపికొండల యాత్రకు పచ్చజెండా.
భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తిరిగి రంగం సిద్ధం అవుతోంది. భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో జూన్ మొదటి వారంలో నిలిచిపోయిన యాత్ర సోమవారం పునఃప్రారంభం కానుంది. పాపికొండలు యాత్రను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే సమాచారంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జూన్ 4న నిలిచిన యాత్ర.. ఏపీలోని కచ్చలూరు వద్ద 2019లో జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన పాపికొండల యాత్ర గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. సందడిగా మారిన గోదావరి తీరం.. వరదల నేపథ్యంలో జూన్ 4న ఆగిపోయింది. సెప్టెంబర్ వరకూ వరదల భయం వీడలేదు. దీంతో యాత్ర ముందుకు సాగలేదు. దీంతో భద్రాచలంలో కొంతకాలంగా వ్యాపారాలన్నీ నిస్తేజంగా మారాయి. పాపికొండల యాత్ర పునఃప్రారంభం అవుతుండడంతో వ్యాపారులు, లాడ్జీలు, హోటళ్లు, ట్రావెల్ వాహనాల యజమానుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. భద్రాచలం పరిసర ప్రాంతాలు మళ్లీ సందడిగా మారనున్నాయి. పర్యాటకులకు కనువిందు.. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పూర్తిగా గోదావరి నదిపై సాగే లాంచీ ప్రయాణం, ఆ లాంచీలోనే ఆటపాటలు, నృత్యాలు, రుచికరమైన భోజనం, గిరిజనులు తయారు చేసే వెదురు బొమ్మలు, వస్తువులతో పాటుగా అక్కడ మాత్రమే దొరికే ‘బొంగు చికెన్’ వంటివి ప్రత్యేకం. పోచవరం నుంచి పాపికొండలు వెళ్లి, తిరిగి వచ్చేంతవరకు ‘సెల్ ఫోన్ సిగ్నల్స్’ లేని ప్రశాంతమైన యాత్ర ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు! కార్తీక మాసం సీజన్ కావడంతో భద్రాచలానికి యాత్రికులు, భక్తులు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు, ప్రత్యేక రోజుల్లో భారీగా పోటెత్తుతారు. ఇలా చేరుకోవచ్చు.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్, దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఫెర్రీ పాయింట్ వద్ద నుంచి బోటింగ్ ఉంటుంది. సోమవారం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏపీ టూరిజం లాంచీలు ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లాంచీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలనుంచి, హైదరాబాద్ నుంచి పాపికొండలకు వెళ్లాలనుకునేవాళ్లు.. అక్కడ రాత్రి బయలుదేరితే తెల్లవారి ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రైలు ద్వారానైతే కొత్తగూడెం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భద్రాచలానికి చేరుకోవచ్చు. ఉదయం 8గంటల లోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని పాపికొండల యాత్రకు వెళ్లవచ్చు. యాత్ర ప్రారంభమయ్యే పోచవరం.. భద్రాచలానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. పోచవరం పాయింట్ నుంచి ఉదయం 9.30 – 10.30 గంటల మధ్య ‘జలవిహారం’ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 – 5 గంటల వరకు తిరిగి పోచవరానికి చేరుకుంటుంది. పాపికొండల ప్యాకేజీ... పోచవరం నుంచి పాపికొండల యాత్రకు టికెట్ ధర పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730 ఉంటుంది. కళాశాల విద్యార్థులు గ్రూç³#గా టూర్‌కు వస్తే వారికి రూ.830 చొప్పున వసూలు చేస్తారు. ఈ టికెట్లు భద్రాచలంలో లభిస్తాయి. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులో సాగే ఈ ప్యాకేజీలో భద్రాచలం, పర్ణశాల రామచంద్రస్వామి దర్శనం, పాపికొండల యాత్ర ఉంటాయి. వసతి, భోజన సదుపాయం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3999గా నిర్ణయించారు. టికెట్లు టూరిజం శాఖ వెబ్సైట్లో లభిస్తాయి. కాగా.. టూరిజం అధికారులు ఈ సీజన్లో అ«ధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంతోషిస్తున్నాం.. పాపికొండల యాత్రికులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గోదావరి వరదల కారణంగా ఐదు నెలలుగా ఉపాధిని కోల్పోయాం. మళ్లీ బోటింగ్ ప్రారంభానికి అధికారులు ఒప్పుకున్నారని తెలిసి సంతోషిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్లు విక్రయిస్తాం. – పఠాన్ హుస్సేన్ ఖాన్, టికెట్ విక్రయ కేంద్రం, భద్రాచలం లాంచీలన్నీ సిద్ధంగా ఉంచాం లాంచీలను పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద సిద్ధంగా ఉంచాం. పర్యాటకుల భద్రత మా ప్రధాన బాధ్యత. అందుకు అనుగుణంగా పలు రకాల రక్షణ సామగ్రి ఏర్పాటు చేశాం. – పూనెం కృష్ణ, లాంచీల నిర్వాహకుడు -
తనిఖీలు చేస్తుండగా గాయపడ్డ నితీష్‌కుమార్
పట్నా: బిహార్‌లో గంగానది ఒడ్డున అట్టహాసంగా జరిగే ఛత్ పూజ నిమిత్తం ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఘాట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు. ఐతే ఈ వారం తనిఖీలు పడవలో కాకుండా కారులో పర్యవేక్షిస్తున్నారేంట? అని విలేకరులు నితీష్‌ని ప్రశ్నించారు. దీంతో నితీష్ కుమార్ వివరణ ఇస్తూ... గతవారం తాను పడవలో తనిఖీలు చేస్తుండగా తమ బోటు జేపీ స్తంభాన్ని ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో తాను గాయపడ్డానంటూ తన కుర్తా ఎత్తి మరీ బ్యాండేజ్‌లను చూపించారు. ఐతే పడవలో ఉన్నవారందరు సురక్షితంగా ఉన్నారని, తమను వేరే పడవలో తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. తన పొట్టకు బ్యాండేజ్‌ఉండటంతోనే సీటు బెల్టు వేసుకోలేక కారు ముందు సీటులో కూడా కూర్చొలేదని వివరణ ఇచ్చారు. ఛత్‌పూజ బిహార్‌లో అత్యంత ప్రసిద్ధమైన పండుగ, అందువల్ల మూడు రోజుల పాటు గంగానది వద్ద ఉండే ఘాట్లన్నీ జనసందోహంతో కిటకిటలాడుతుంటుంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు) -
సీఎం నితీశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు ఆయనతో బోటులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. పాట్నా సమీపంలోని గంగానదిలో బోటు ప్రయాణం చేస్తున్న క్రమంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పాట్నాలోని ఛత్‌గట్‌ను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించారు సీఎం నితీశ్. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు, అధికారులు సైతం బోటులో ఉన్నారు. ఈ క్రమంలో జేపీ సేతు పిల్లర్‌ను బోటు ఢీకొట్టింది. అయితే, బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదం తప్పింది. బోటులో ఉన్న సీఎం నితీశ్‌తో పాటు మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH — ANI (@ANI) October 15, 2022 ఇదీ చదవండి: కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి -
సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!
అమలాపురం రూరల్: వరద నీటిలో వెళ్లేందుకు బాధితులు తాత్కాలికంగా అరటి బొందలు, కలపతో తెప్పలు తయారు చేసుకోవడం పరిపాటి. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ శివారు దొమ్మేటివారిపాలెంలో వరద నీటిలో చిన్న పిల్లల కోసం వారి కుటుంబీకులు ఖాళీ డ్రింక్ బాటిల్స్‌తో చిన్న తెప్పలను తయారు చేశారు. వాటిపై పిల్లలు కూర్చుని వీధుల్లోనే తిరుగుతున్నారు. వీడని ముంపు గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వివిధ పనులపై స్థానికులు పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రజారోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. వరదల కారణంగా పొలాలతో అన్ని ప్రాంతాలు నీట మునగిపోవడంతో పశువుల మేతకు ఇబ్బంది వచ్చింది. దీంతో రైతులు పడవలపైనే పశువుల కోసం గడ్డిని తరలిస్తున్నారు. (క్లిక్: నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు) -
అలా.. జల విహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్ నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్ ప్రారంభమవగా సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ విరామం అనంతరం సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. బోటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది! పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. – ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి
సాక్షి, సిటీబ్యూరో: వివిధ థీమ్‌లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకర్షణీయంగా, ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్న జీహెచ్ఎంసీ తగిన సదుపాయాలున్న చోట ప్రత్యేకాకర్షణలు కలి్పంచేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు అందుబాటులో ఉండి.. కొంతకాలంగా మరుగున పడిన సదుపాయాలను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతోంది. ఇలాంటి వాటిల్లో భాగంగా ఇందిరాపార్కులో ఒకప్పుడుండి కొంతకాలంగా లేని బోటింగ్ షికారును తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వేసవిలో చల్లని నీటి మధ్య బోట్ షికారు సరదాగా ఉంటుంది కనుక పార్కుకు వచ్చేవారికి ఆహ్లాదంగానూ ఉంటుందని భావించి వచ్చే వేసవిలోగా బోటు షికారు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. బోటు షికాకు ధరలను కూడా ఖరారు చేసి ఔత్సాహికులైన కాంట్రాక్టర్లు ఇందిరాపార్కు కొలనులో వాటి విహారానికి ఏర్పాట్లు చేసుకునేందుకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. పెడల్, మోటార్ రెండు రకాల బోట్లు కాంట్రాక్టరు అందుబాటులో ఉంచవచ్చని, 20 నిమిషాల షికారుకు పెడల్ బోటుకు రూ.30, మోటార్ బోటుకు రూ.50గా గరిష్ఠ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే రద్దీని బట్టి ఇంకా తక్కువ చార్జీనైనా వసూలు చేసుకోవచ్చు కానీ, అంతకుమించి గరిష్టంగా వసూలు చేయడానికి వీలుండదన్నారు. -
మోటర్బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. చూస్తుండగానే ఏడుగురి ప్రాణాలు..
Cliff Breaks Off, Falls On Boat In Brazil Lake: బ్రెజిల్‌లోని సరస్సులో ప్రయాణికులతో ఉన్న టూరిస్ట్ పడవలపై భారీ కొండ చరియ విరిగిపడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు 32 మంది గాయపడినట్లు వెల్లడించారు. అయితే కాపిటోలియో ప్రాంతంలోని పర్యాటక ప్రాంతమైన ఫర్నాస్ సరస్సుకి వారాంతపు పర్యటనలో భాగంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక పెద్ద రాతిపలక రెండు పడవలపై విరిగిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!) నిజానికి బ్రెజిల్‌లోని ఈ సరస్సు సమీపంలో రాతి కొండలు, పచ్చని జలపాతలు, జలవిద్యుత్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వీటిని చూసేందుకు తరలివస్తారు. అయితే ఇటీవల ఆగ్నేయ బ్రెజిల్లో కురిసిన వర్షాల కారణంగా ఈ కొండ కూలి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: ఈ బుడ్డోడు కరోనా వ్యాప్తిని ఎలా విశ్లేషించాడో చూడండి!) Terrible video out of Lake Furnas, #Brazil, captures the moment a canyon cliff collapses on boats full of tourists. Latest reports say at least 5 dead 20 missing.pic.twitter.com/03LrGX0kIL — Albert Solé (@asolepascual) January 8, 2022 -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్‌లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్‌కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్‌లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!
ఇటివల కాలంలో పారాసెయిలింగ్ చేయడానికి యువత తహతహాలాడుతున్నారు. పైగా ఆకాశంలో పక్షుల మాదిరి విహరిస్తుంటే ఆ అనుభవమే వేరు. అంతేకాదు యువత అడ్వెంచర్స్ చేయడానికే మొగ్గు చూపుతుంది. అందుకోసం ఎంత రిస్క్ అయిన చేస్తున్నారు. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో అవి ఫెయిల్ అవుతున్నాయనే చెప్పాలి. ఈ మధ్య ఒక జంట పారాసెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి కింద పడిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. అచ్చం అలానే ముంబైలోని ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్ చేయాలని సన్నద్ధమయ్యారు. కానీ వారికి కూడా చేదు అనుభవం ఎదురైంది. (చదవండి: ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్, క్రిస్మస్ వేడుకలు బ్యాన్) అసలు విషయంలో కెళ్లితే..ముంబైలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలకు సముద్రం వద్ద పారా సెయిలింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే వారు పడవ మీద నుంచి పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మోస్తారు ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగిపోతుంది. దీంతో వాళ్లు ఒక్కసారిగా సముద్రంలో పడిపోతారు. అయితే అదృష్టవశాత్తు లైఫ్ జాకెట్లు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆ మహిళలు తాము తాడు కొంత భాగంలో నలిగి తెగిపోయే విధంగా ఉండటం గమినించాం అన్నారు. పైగా రైడ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తాడు దెబ్బతిన్న భాగం గాలిలోకి వెళ్లదని హామీ కూడా ఇచ్చారని అన్నారు. దీంతో పలువురు భారతదేశంలో సాహస క్రీడల భద్రతా ప్రమాణాల గురించి మరోసారి తీవ్రస్థాయితో విమర్శలు లెవనెత్తారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?
Meghalaya Cleanest Umngot River Images: ఇక్కడ ఉన్న ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది.. పడవ ఏంటి గాల్లో ఎగురుతుంది.. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బాహుబలి చిత్రం గుర్తుకు వస్తుంది. కాసేపు పరీక్షగా చూస్తే.. ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి అవుతాయి. అబ్బ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కదా.. ఎక్కడబ్బా.. ఇంత పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన నది.. ఓ సారి వెళ్లి చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది. నది అడుగు భాగంలో ఉన్న ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే.. పడవ ఏదో అద్దం మీద ఉన్నట్లుంది. ఇంత స్వచ్ఛమైన నది ఏ దేశంలో ఉందో కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత అందమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది మన దేశంలోనే ఉంది. ఈ ఫోటోని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!) కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం తన ట్విటర్లో ఈ నది ఫోటో షేర్ చేసింది. ‘‘ప్రపంచలోని అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఇది ఒకటి. భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంగోట్ నది. నదిలో పడవ మీద వెళ్తున్న ఫోటో చూస్తే.. అది గాల్లో తేలుతుందేమో అనిపిస్తుంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. దేశంలోని నదులన్ని ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్ మేఘలయ ప్రజలు’’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫోటో గంటల వ్యవధిలోనే వైరలయ్యింది. (చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘భారత దేశంలో ఇంత స్వచ్ఛమైన నది ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు.. యమునా నది ఎప్పుడు ఇంత సుందరంగా మారుతుంది... గంగా నది మాట ఏంటి.. ఏది ఏమైనా నదిని పదిలంగా కాపాడుకుంటున్న మేఘలాయ ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటి వరకు ఈ ఫోటోకి 19 వేలకు పైగా లైక్‌లు, 3 వేల రీట్వీట్లు వచ్చాయి. One of the cleanest rivers in the world. It is in India. River Umngot, 100 Kms from Shillong, in Meghalaya state. It seems as if the boat is in air; water is so clean and transparent. Wish all our rivers were as clean. Hats off to the people of Meghalaya. pic.twitter.com/pvVsSdrGQE — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) November 16, 2021 చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..! -
లాహిరి..లాహిరి..లాహిరిలో..
ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆన్లైన్ బుకింగ్‌కు అవకాశం.. ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్‌కు ఆన్లైన్ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్ పరిశీలించాకే అనుమతులు పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్ పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి. ట్రయల్ రన్ సక్సెస్.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే.. ► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ► కంట్రోల్ రూమ్ మేనేజర్‌గా డిప్యూటీ తహసీల్దార్. ► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్‌లు చేపడతారు. మేనేజర్ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. ► పైలెట్ స్పీడ్ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్‌తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి. ► చివర ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంచారు. ► ప్రతి పాయింట్ దాటాక శాటిలైట్ ఫోన్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలపాలి. ► పైలెట్ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు. ► ప్రయాణించే లాంచీని లైసెన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే నడపాలి. ► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి ► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి ► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు. జాగ్రత్తలు తీసుకునే అనుమతి గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం. –జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి నిర్వాహకులకు మంచి రోజులు గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. –మాదిరెడ్డి సత్తిబాబు, బోట్ యజమాని పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ రేట్లు కూడా నిర్ణయించలేదు. -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్‌ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
సరదా.. సరదాగా
సిద్దిపేటజోన్: సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం రాత్రి కోమటిచెరువుౖ వద్ద రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో సందడి చేశారు. కోమటిచెరువులో సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి, మున్సిపల్ చైర్మన్ మంజుల, మహిళా ప్రజాప్రతినిధులు కవిత, వినితతో పాటు పలువురితో బోటింగ్ చేశారు. తానే స్వయంగా బోట్ నడుపుతూ చెరువు చుట్టూ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నెక్లెస్ రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, గ్లో గార్డెన్, నైట్‌పార్క్‌లో మంత్రి హరీశ్‌రావు కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రజలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. ఆయన వెంట కడవేర్గ్ రాజనర్స్, మచ్చ వేణు, కొండం సంపత్ తదితరులు ఉన్నారు. -
దాదాపు నెలరోజలు సముద్రంలోనే!
మనం విదేశాల్లోనో లేక మరేదైనా రాష్ట్రంలోనూ దారితప్పిపోతే భాష రాకపోయిన ఏదో రకంగా మనం బయటపడగలం కానీ సముద్రంలో అనుకోకుండా బోటు మునిగిపోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనో సముద్రంలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఇద్దరు వ్యక్తులకు. సోలమన్ దీవుల్లోని సమద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు దాదాపు నెల రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అసలు వారు ఎవరు ? ఎందుకు అలా జరిగిందనే వివరాలు.. (చదవండి: కదిలే టాటుల అద్భుతమైన వీడియో) విషయంలోకి వెళ్లితే సోల్మన్ దీవులకు చెందిన లివే నంజికానా, జూనియర్ కోలోని అనే ఇద్దరూ వ్యక్తులు సోలమన్ దీవులలోని పశ్చిమ ప్రావిన్స్‌కి సెప్టెంబర్ 3న చిన్న మోటారు బోట్‌పై బయలుదేరారు. పశ్చిమ తీరంలోని వెల్ల లావెల్లా ద్వీపం, గిజో ద్వీపాలను ఆధారంగా చేసుకుని ప్రయాణిచారు. కొంత దూరం ప్రయాణించేటప్పటికే జీపీఎస్ పనిచేయడం మానేసింది. దీంతో వారు దాదాపు 29 రోజులు సముద్రంలో చిక్కుకు పోయారు. ఈ సోలామాన్ సమద్రంలో ప్రయాణించటం ఎంత క్లిష్టతరమైనదో ఈ పర్యటనలోనే వారికి అర్థమైంది. ఈ పర్యటన కోసం తెచ్చుకున్న నారింజపళ్లు, కొబ్బరికాయలు, వర్షపు నీటితో ఆ 29 రోజులు గడిపారు. ఆఖరికి న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినియా తీరంలోని ఒక మత్స్యకారుడి సాయంతో బయటపడ్డారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తేనే ఏదోలా అనిపిస్తోంది అలాంటిది నిజ జీవితంలో ఎదురైతే ఇక అంతే సంగతులు. కానీ నిజంగా ఇది చాలా ఒళ్లు గగుర్పోడిచేలాంటి పర్యటన కదా!. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) -
చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గిజౌప్రావీన్స్‌లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు) ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్‌కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!
సాక్షి, మాదాపూర్: ఇటు ఆకాశ హార్మ్యాలు.. అటు ఎత్తైన కేబుల్ బ్రిడ్జి.. చుట్టూ పచ్చని చెట్లు.. కొలువైన వివిధ రకాల విగ్రహాలు...సరస్సులోని నీటిని ముద్దాడుతున్న సూర్యకిరణాలు... విదేశాల్లో ఉన్నామా .. అనే అనుభూతి.. ఇలాంటి వాతావరణంలో బోటింగ్ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి?.ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌గా ఉన్న మాదాపూర్ దుర్గంచెరువులో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చదవండి: దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ? చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాతి జంట చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నా.. పెద్దా అంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా బోటింగ్ చేస్తున్నారు. సందర్శకులు బోటింగ్ చేసేందుకు కలి్పంచిన ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనల అమలుకు తీసు కున్న చర్యలు తదితర అంశాలపై దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి? జవాబు: మొత్తం ఏడు ఉన్నాయి. నాలుగు పెడల్ బోట్లు, ఒకటి డీలక్స్ బోటు, ఒకటి స్పీడ్ బోటు, ఒకటి ఫ్యామిలీ బోటు ఉన్నాయి. సాక్షి: బోటింగ్ ఫీజుల వివరాలు తెలపండి. జవాబు:బోట్లు పూర్తి కండీషన్‌తో ఉండేలా చూస్తున్నాం. పెడల్ బోటింగ్ ఒకరికి రూ.50 (15 నిమిషాలు), డీలక్స్ బోట్ రూ.50 (15 నిమిషాలు), స్పీడ్‌బోట్ రూ.400 (నలుగురికి 6 నిమిషాలు)క్రూస్ బోట్ (ఫ్యామిలీ బోట్) 50 మంది కెపాసిటీ ఉంటుంది. ఒకరికి రూ.50 (15 నిమిషాలు) సాక్షి: కోవిడ్ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? జవాబు:కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాం. సందర్శకులు దిగిన వెంటనే బోట్లకు శానిటైజ్ చేయడం, తప్పని సరిగా సందర్శకులు మాస్‌్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం., ప్రతి సందర్శకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నాం. సాక్షి: సందర్శకుల తాకిడి ఎలా ఉంది? జవాబు: సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శకులు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. అదే శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. ఆదివారం సుమారు 600 నుంచి 800 మంది బోటింగ్ చేస్తుంటారు. సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సాక్షి: కొత్త ప్రణాళికలు ఏమైన ఉన్నాయా? జవాబు:పిల్లలకు, పెద్దలకు, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్ వంటి పర్యావరణ అనుకూల క్రీడలను నేర్పించడానికి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరా>బాద్ ముందుకొచి్చంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాక్షి: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా? జవాబు: సీనియర్ సిటిజన్లు తమకు రాయితీ ఇవ్వాలని, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని, సేద తీరేందుకు కూర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. పై విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు
పట్నా: బిహర్లో దారుణం చోటుచేసుకుంది. పడవ ఛార్జీ అడిగినందుకు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు. సికల్ యాదవ్ తన బోట్లో ప్రయాణించినందుకు రూ.10 చార్జీగా అడిగాడు. దీంతో ఆ వ్యక్తులు యువకుడుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న గ్రామస్తులు జోక్యం చేసుకుని వారి నుంచి ఆ యువకుడిని రక్షించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం సికల్ యాదవ్ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని వెల్లడించారు. చదవండి: 22 రోజులుగా ఫ్రీజర్‌లో కుమారుడి మృతదేహాం.. చివరకు.. -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
పర్యాటకులకు గుడ్‌న్యూస్; సాగర్‌లో లాంచీ ప్రయాణం షురూ
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో పర్యాటక శాఖ నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీలను నడుపుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ జలాశయంలో జాలీ ట్రిప్పులు మాత్రమే తిప్పుతోంది. నాగార్జునకొండ (ఆర్కియాలజీ మ్యూజియం) ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో తెలంగాణ ఏర్పాటైన దగ్గరినుంచి ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలను నాగార్జునకొండకు అనుమతించలేదు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్‌రావు సోమవారం తెలిపారు. మ్యూజియం తెరుచుకుంటే లాంచీలను నాగార్జునకొండకు నడపనున్నట్లు వెల్లడించారు. నాగార్జునకొండకు వెళ్లడానికి పెద్దలకు టికెట్ ధర రూ.150, పిల్లలకు రూ.120లుగా ఉంది. చదవండి: మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి -
‘పుష్ప’ ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..
పడవ ప్రయాణం చేశారట అల్లు అర్జున్. ఇది మనసుకి ఉల్లాసాన్నిచ్చే ప్రయాణం కాదు. శత్రువులకు పంచ్‌లు ఇచ్చే ప్రయాణం అని టాక్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు అల్లు అర్జున్. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ఇందులో పడవ ప్రయాణం బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సీన్స్ ‘పుష్ప’ సినిమాలో వన్నాఫ్ ది హైలైట్స్‌గా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
వారణాసి పర్యటనలో కేసీఆర్ భార్య, కూతురు
వారణాసి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఆమె కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్ నుంచి దశాశ్వేమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం చేశారు. అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: ‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’) pic.twitter.com/yHUh0ZdpTw — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021 -
పడవెక్కి భద్రాద్రి పోదామా..!
భద్రాద్రి రామయ్యను దర్శించాలంటే.. నల్లని నునుపైన తారురోడ్డు మీద.. బస్సులు, కార్లు, వ్యాన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ దూసుకుపోవడమే ప్రస్తుతం చాలామందికి తెలుసు. ఏదో వెళ్లాం వచ్చాం అన్నట్టే తప్ప.. ఇటువంటి ప్రయాణం పూర్తి ఆనందాన్నిస్తుందని చెప్పలేం. కానీ.. అదే ప్రయాణం– మంద్రంగా వీచే గాలి తరగలు తనువును సుతారంగా స్పృశిస్తుండగా.. గోదావరి అలల తూగుటుయ్యాలపై.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో అన్నట్టుగా.. కనులను కట్టిపడేసే ప్రకృతి అందాల నడుమ.. హాయిహాయిగా.. సాగితే.. ఆ అనుభూతి ఎప్పటికీ పదిలమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘పడవెక్కి భద్రాద్రి పోదామా.. భద్రాద్రి రాముడిని చూద్దామా..’ అని పాడుకుంటూ వెళ్లే ఆనంద క్షణాలు త్వరలోనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా గోదావరిపై జల రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచీపై ప్రయాణం అంటే ఎవ్వరికైనా ఆనందదాయకమే. చిన్నారులకు, కుర్రాళ్లకైతే మరీ ఉత్సాహం. కానీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లాంచీల్లో ప్రయాణమంటేనే వెనకడుగు వేయాల్సిన దుస్థితి. గతంలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో 58 మంది మృత్యువాత పడిన విషయం ఇంకా కన్నుల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదం తరువాత రాష్ట్ర ప్రభుత్వం నదిలో ప్రమాద రహిత ప్రయాణానికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు పర్యాటకానికి తెర పడుతుందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అటువంటి అనుమానాలకు తావు లేకుండా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ సంకల్పించింది. చదవండి: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇందులో భాగంగానే నాలుగు దశాబ్దాల కిందట ఆగిపోయిన జలరవాణాను పునరుద్ధరించే దిశగా చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జల రవాణాను ప్రోత్సహించేందుకు ‘సాగరమాల’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తోంది. అదే తరహాలోనే ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అఖండ గోదావరిపై జలరవాణా చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం – పోచవరం మధ్య జలరవాణాకు అనువైన పరిస్థితులపై బాథ్ మెట్రిక్ సర్వేకు ఇటీవల ఆదేశించింది. ఇందుకు రూ.45 లక్షలు కేటాయించింది. దీంతో రాజమహేంద్రవరం – భద్రాచలం మధ్య జల రవాణాకు మొదటి అడుగు పడినట్టయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలనుకునే వారు కూడా త్వరలో మళ్లీ గోదావరిపై లాంచీల్లో వెళ్లి వచ్చే అవకాశం కలగనుంది. తెల్లవారకుండానే ప్రయాణం అప్పట్లో భద్రాచలం వెళ్లే లాంచీ రాజమహేంద్రవరంలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరేది. దేవీపట్నం మండలం కొండమొదలుకు మధ్యాహ్నం 12 గంటలకు, అక్కడి నుంచి భద్రాచలానికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకునేది. ప్రారంభంలో రూపాయి, ఐదు రూపాయలు ఉండే చార్జీ జల రవాణా ముగిసిపోయే నాటికి రూ.100కు చేరింది. ఒక లాంచీలో ట్రిప్పునకు 70 నుంచి 80 మందిని తీసుకువెళ్లేవారు. అటు గోదావరిలో ప్రయాణం మాదిరే ఇటు ధవళేశ్వరం నుంచి కోనసీమలోని పంట కాలువల్లో కూడా లాంచీలు, పడవలపై ప్రయాణం సాగేది. అప్పట్లో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్ సరిహద్దు వరకూ మొత్తం అంతా గోదావరి పైనే రవాణా. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్) వరకూ మధ్యలో ఉన్న గిరిజన పల్లెలకు నిత్యావసర వస్తువులు, అటవీ ఉత్పత్తుల తరలింపునకు జల రవాణాయే ఆధారం. భద్రాచలం దాటిన తరువాత దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట పైనుంచి వెంకటాపురం వరకూ ఐదారు లాంచీలు తిరిగేవి. రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకూ లాంచీ ప్రయాణం చేస్తే.. అక్కడి నుంచి ప్రైవేటు బస్సులలో ప్రయాణించేవారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి మహారాష్ట్ర వరకూ 10 లాంచీలు, రాజమహేంద్రవరం – ఛత్తీస్‌గఢ్‌లోని సాలాపూర్ మధ్య నాలుగు, పోలవరం, దేవీపట్నం, కొండమొదలు వరకూ రెండు లాంచీల చొప్పున నడిచేవి. భద్రాచలం సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి పడవల మీద వెదురు, పొగాకు, తునికాకు, పసుపు, మిర్చి వంటి సరకులు తరలింపు జల రవాణా పైనే జరిగేది. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లాంచీపై 25 టన్నుల వరకూ రవాణా చేసేవా రు. ఇందుకు బస్తాకు 75 పైసల నుంచి రూపాయి వరకూ తీసుకునేవారు. గోదావరిపై రాజమహేంద్రవరం వద్ద రోడ్ కం రైలు బ్రిడ్జి, శబరి నదిపై చింతూరు – చట్టి మధ్య, గోదావరిపై భద్రాచలం – సారపాక మధ్య వంతెనల నిర్మాణం జరిగిన జలరవాణాకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. 1978కి ముందే.. రాజమహేంద్రవరం నుంచి పోచవరం వరకూ రోడ్డు మార్గంలో దూరం160 కిలోమీటర్లు. అదే గోదావరి జల మార్గంలో 100 కిలోమీటర్లు మాత్రమే. అంటే 60 కిలోమీటర్లు తక్కువ. గతంలో రోడ్డు సౌకర్యం లేనప్పుడు గోదావరి జిల్లాల్లోని 100 గ్రామాలకు జల రవాణాయే దిక్కు. 1978కి ముందే గోదావరిలో జల రవాణా ఉంది. రాజమహేంద్రవరం నుంచి కూనవరం, భద్రాచలం, కుంట వరకూ ప్రతి రోజూ 80 నుంచి 100 లాంచీలపై ప్రజల రాకపోకలకు, నిత్యావసరాల తరలింపునకు జల రవాణా తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. మారేడుమిల్లి రోడ్డు నిర్మించిన తరువాత ఆ మార్గంలో కలప, వెదురు రవాణా మాత్రమే జరిగేవి. 1986లో తారు రోడ్డు వేశాక రాజమహేంద్రవరం నుంచి బస్సు సర్వీసు ఏర్పాటుతో లాంచీ ప్రయాణాలు తగ్గాయి. అలా 80వ దశకం వరకూ జల రవాణా సాగింది. పూడికలు తెలుసుకునేందుకు.. నీటి లోపలి స్వరూపాన్ని అంచనా వేసేందుకు, ఇసుక, పూడిక ఎంతవరకూ ఉన్నయో తెలుసుకునేందుకు బాథ్ మెట్రిక్ సర్వే నిర్వహిస్తాం. ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందనే విషయాలు కూడా సర్వే ద్వారా తెలుస్తాయి. దీనివలన పడవల రాకపోకలకు ఏ మేరకు అనువుగా ఉందో అంచనా వేయవచ్చు. జల రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ సర్వే సహాయ పడుతుంది. – ఆర్.మోహనరావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం లాంచీ ఓనర్ అంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం 1983లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. అప్పట్లో నాకు 16 సంవత్సరాలు. ఇప్పుడు 55 సంవత్సరాలు. జల రవాణాను మూడు దశాబ్దాలు చూశాను. లాంచీ ఓనర్ అంటే మండల ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్లా ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ ఉండేది. ప్రయాణికుడికి రూపాయి నుంచి రూ.100 చార్జీ వరకూ నేను చూశాను. తక్కువ చార్జీ చేసినప్పటికీ ప్రయాణంలో ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్లం. అప్పట్లో తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఆ శాటిస్ఫేక్షన్ వేరుగా ఉండేది. ఇప్పుడు వేలు ఆర్జిస్తున్నా ఆ రోజుల్లో ఉన్న శాటిస్ఫేక్షన్ లేదు. – పాదం వెంకట రమణమూర్తి (బుల్లు), లాంచీల యజమాని, పట్టిసీమ -
బోటులో వంద కేజీల హెరాయిన్
సాక్షి, చెన్నై/మల్కాపురం (విశాఖ పశ్చిమ): శ్రీలంకకు చెందిన ఓ బోటు ద్వారా పాకిస్తాన్‌కు రవాణా చేస్తున్న వంద కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ నెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు నావికాదళ విన్యాసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాలలో భాగంగా భారత నావికాదళం ఒక శ్రీలంక బోటును గుర్తించింది. అనుమానం వచ్చి ఆ బోటును పట్టుకొని అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని ప్రశ్నంచగా.. వారు హెరాయిన్‌ను పాకిస్తాన్‌కు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. వీటిని పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు అమ్ముతారని తెలిసింది. 99 ప్యాకెట్ల హెరాయిన్‌ను, 20 చిన్న పెట్టెల సింథటిక్ డ్రగ్స్‌ను, ఐదు 9 ఎంఎం పిస్టళ్లను, ఒక శాటిలైట్ ఫోన్ సెట్‌ను గస్తీ దళం స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతోంది. -
వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీ: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ: భవాని ఐల్యాండ్‌ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. బోటింగ్‌కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వస్తుందన్నారు. పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తుందని, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు. చదవండి: నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి -
కొత్తగా 60 బోట్లకు అనుమతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 60 పర్యాటక బోట్లకు అనుమతులు మంజూరు చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నదీ ప్రాంతాలు, రిజర్వాయర్లలో బోటింగ్ కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. 174 ప్రైవేట్ బోట్లు నడిపేందుకు దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. కరోనా కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దిండి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 9 చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బోట్ల స్థితిగతులు, లైసెన్సులు వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాపికొండలు ప్రాంతంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నావిగేషన్ సర్వే చేయాల్సి ఉన్నందున అక్కడ మినహా అన్నిచోట్లా త్వరితగతిన బోటింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సాగర సంగమం, అంతర్వేది, హంసలదీవిలో పర్యాటక బోట్లు నడపనున్నట్టు తెలిపారు. కొల్లూరు, ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విధానంలో కొత్తగా పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతర్వేది నుంచి నరసాపురం, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, నాగార్జున సాగర్, కడప జిల్లా బ్రహ్మంసాగర్, కర్నూలు జిల్లా అవుకు, మంత్రాలయం ప్రాంతాల్లో పీపీపీ విధానంలో కొత్తగా పడవలు కొనుగోలు చేసి నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. విజయవాడ, విశాఖలో సీ ప్లేన్ సౌకర్యం విజయవాడతోపాటు విశాఖకు కూడా సీ ప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఖేల్ ఇండియా కింద కడప జిల్లాలోని వైఎస్సార్ క్రీడా పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపికైందని, దీనివల్ల ఏడాదికి రూ.3 కోట్లు ఆ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. త్వరలో ఏపీ యూత్ సర్వీసెస్ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తామని చెప్పారు. -
స్మార్ట్ బోట్ జల ప్రవేశం.. 60 మంది ఒకేసారి
సాక్షి, నాగార్జునసాగర్ : స్మార్ట్ బోటు శుక్రవారం జలప్రవేశం చేసింది. విశాఖపట్టణానికి చెందిన సెకాన్ కంపెనీ ఈ బోట్‌ను తయారు చేసింది. అక్కడినుంచి లారీలో తెచ్చిన బోటును దయ్యాలగండి సమీపంలోని సమ్మక్క–సారక్క పుష్కరఘాట్‌నుంచి నీటి ఒడ్డున దింపారు. అనంతరం రబ్బరు ట్యూబులను బోట్ కింది భాగంలో అమర్చి వాటిలోకి గాలి నింపారు. నాలుగు ట్యూబ్‌లను పెట్టి ముందు దాంట్లో గాలి తక్కువగా ఉంచుతూ వెనుక భాగంలోని ట్యూబ్‌లోకి గాలి ఎక్కువగా పంపడంతో బోట్ ముందుకు జరుగుతూ వచ్చి నీటిలోకి జారేలా చేశారు. అనంతరం మరో లాంచీ వచ్చి దూరంగా నిలబడి తాడు సాయంతో ఈ బోట్‌ను నీటిలోకి లాగింది. జలాశయంలోకి దిగిన అనంతరం లాంచీ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఈ స్మార్ట్‌బోట్‌లో 60 మంది పర్యాటకులు ప్రయాణం చేయవచ్చు. -
ఆమె పరీక్ష కోసం ఏకంగా బోటునే..
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర జల రవాణా శాఖ (ఎస్‌డబ్ల్యూటీడీ)కు చెందిన 70 సీట్ల పడవ కేవలం ఒక ప్రయాణీకురాలి కోసం అలప్పుజ జిల్లాలోని ఎంఎన్ బ్లాక్ నుంచి కొట్టాయంలోని కంజిరామ్ బయలుదేరింది. ఓ విద్యార్థినిని హెచ్ఎస్సీ (ప్లస్ వన్) పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం కేరళ ప్రభుత్వం ఏకంగా ఓ బోటునే ఏర్పాటు చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఆ వివరాలు.. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్టాలు పరీక్షల తేదీలను వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలో ప్లస్ వన్ పరీక్షలు జరుగుతున్నాయి. సాండ్ర బాబు(17) అనే విద్యార్థిని పరీక్షలకు హాజరు కావాలి. అయితే లాక్డౌన్ కారణంగా కుట్టనాడ్ ప్రాంతంలో ప్యాసింజర్ బోట్లు నిలిపివేశారు. దాంతో ఏం చేయాలో పాలుపోని విద్యార్థిని ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు సమాచారం అందించింది. (ఇప్పుడే ముప్పెక్కువ) సాండ్రా బాబు పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు ఆమె కోసం బోటు పంపిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం పూర్తి అనుభవజ్ఞులైన ఐదుగురు సిబ్బందితో, 70 సీట్ల బోటును పంపించారు అధికారులు. ప్రతి రోజు సాండ్ర ఇంటి దగ్గర ఉన్న జెట్టీ నుంచి ఉదయం 11.30 గంటలకు బోటు బయలుదేరుతుంది. కంజీవరంలోని ఎస్ఎన్డీపీ హైయ్యర్ సెకండరీ స్కూల్ దగ్గర ఉన్న జెట్టీ వద్ద దింపుతుంది. ఆమె పరీక్ష అయిపోయేంత వరకు అక్కడే ఉండి తర్వాత విద్యార్థినిని ఇంటి దగ్గర వదులుతుంది. ఈ క్రమంలో సాండ్ర మాట్లాడుతూ.. ‘పాఠశాలకు చేరడానికి నాకు వేరే మార్గం లేదు. బోటు నడవకపోతే నేను పరీక్షలు రాయడం కుదరదు. దాంతో నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు నా పరిస్థితి గురించి తెలియజేశాను. వారు నా కోసం బోటు నడుపుతున్నారు. నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధికారుల మేలు ఎప్పటికి మరవలేను. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’ అన్నది. (నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!) ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూటీడీ డైరెక్టర్ షాజీ వి నాయర్ మాట్లాడుతూ.. ‘సాండ్రా సహాయం కోరినప్పుడు అధికారులు మరో ఆలోచనకు తావియ్యలేదు. వెంటనే స్థానిక మంత్రిని కలిసి సమస్యను వివరించారు. బోటును నడపడానికి ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అని తెలిపారు. -
బిల్‌గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు
ప్రపంచంలోనే సంపన్నుడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ విలాసవంతమైన యాట్(విహార నౌక)ను కొన్నారు. గతేడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్‌గేట్స్ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. వెంటనే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా.. ఈ నౌక విశేషాలు: ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్ రూమ్‌లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్ ఉంటుంది. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఈ బోట్లో ఉన్నాయి. కాగా ఈ బోట్‌ను బిల్‌గేట్స్ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. ఇక ఈ బోటు ధర రూ.4600 కోట్లు కావడం విశేషం. కాగా లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. బిల్‌గేట్స్ కొనుగోలు చేసిన సూపర్‌యాచ్ పొడవు 370 అడుగులు. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్‌కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్ చేతికి రానుంది. -
వంగపండు ఓడ పాట
-
కన్నీరే మిగులుతోంది.!
సాక్షి, చింతలమానెపల్లి(సిర్పూర్) : గమ్యం చేరే వరకూ భరోసా లేని పడవ ప్రయాణాలు విషాద రాత రాస్తున్నాయి. గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న పడవల ప్రయాణం ఇంకో మార్గానికి చేర్చుతున్నాయి. పడవ ప్రమాదాలు చోటుచేసుకుని కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండగా, మృతుల కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. పూట గడవడానికి పడవ నడుపుతున్న వారి నిర్లక్ష్యం మూలానికి ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నదీ మీద నిత్యం పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార యంత్రాంగం గుణపాఠం నేర్వడం లేదు. దీంతో విషాద సంఘటనలు పునరావృతమవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యాపార, ఇతర అవసరాల రీత్యా నిత్యం ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. నదులపై వంతెనలు లేకపోవడంతో రేవుల నుంచి నాటు పడవల్లో గట్టు దాటాల్సి వస్తోంది. కౌటాల మండలంలోని వీరవెల్లి, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, రణవెల్లి, చింతలమానెపల్లి మండలంలోని చిత్తామ, గూడెం, బెజ్జూర్ మండలంలోని తలాయి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడెం ఓడరేవుల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. చింతలమానెపల్లి మండలం లోని చిత్తామ, గూడెం వద్ద మహారాష్ట్రలోని అహేరి, ఆళ్ళపల్లి, ఏటపల్లి, సిరోంచ, సహా చత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు భారీ రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం కంటే పడవల్లో నదిని దాటితే దూరం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అందుకే చూపుతున్నారు. ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. నాటు పడవల నిర్వహకులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సి ఉండగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాటు పడవలను నడిపేవారు సంబంధిత అధికారుల నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్సు, అనుభవం లేని వారు నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పడవలను నాసిరకంగా తయారు చేయడంతో ప్రయాణ సమయంలో పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. పడవలకు రంధ్రాలు పడ్డప్పుడు వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నామమాత్రపు మరమ్మతులు నిర్వహించి నడుపుతున్నారు. పడవల్లోకి చేరితో నీటిని బకెట్లతో తోడుతుంటారు. ఈ క్రమంలో నీళ్లు అధికమై పడవలు మునిగిపోతున్నాయి. ఆదివారం బీట్ ఆఫీసర్ల ప్రమాదంలోనూ ఇదే జరిగింది. వంతెనలు లేక ఇబ్బందులు.. మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధాలున్నాయి. ఈనేపథ్యంలో రవాణా మార్గాలుగా ఇరు ప్రాంతాలకు వెళ్లేందుకు నదిలో నాటు పడవలను ఆశ్రయిస్తారు. చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద వంతెన నిర్మాణంలో ఉండగా ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. కౌటాల మండలంలోని గుండాయిపేట వద్ద పెన్‌గంగా నదిపై వంతెనకు ప్రతిపాదనలు పూర్తయినట్లు అధికారులు తెలుపుతున్నారు. వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇబ్బందులు దూరంకానున్నాయి. వంతెనలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈక్రమంలో ఏమాత్రం వరద ఎక్కువగా ఉన్నా, నడిపే వారు అజాగ్రత్తగా ఉన్నా జరగరానిది జరిగిపోతుంది. అనుమతులు లేకుండానే.. నదులపై లేదా ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రయాణికులను తరలించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. దీంతో పాటు ఏటా నిర్ణీత కాలవ్యవధిలో రెన్యూవల్ ఉంటుంది. ఆయా సమయాల్లో పోలీసులు, ఇతర శాఖలు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కాని సరిహద్దులో ఉన్న ప్రాణహిత నదిలో ప్రయాణికులను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కేవలం చేపలు పెంచడానికి అనుమతులు పొందిన వారే ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి చేరవేస్తున్నారు. ఇలా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తుండడంతో వర్షాకాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఏడాదిలో ప్రాణహిత నదిలో నలుగురు మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల వైఫల్యాన్ని తాజా ఘటన ఎత్తి చూపడంతో పాటు గుణపాఠం నేర్చుకోవాలి్సన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు.. 1. ఫిబ్రవరి 16న కాగజ్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ పోరెడ్డి దినకర్‌రెడ్డి, అతని మామ బాపిరెడ్డి నదిలో నీటి ప్రవాహంలో పడి మృతిచెందారు. 2. 23 మే 2016న మంచిర్యాలకు చెందిన వెంకటేశ్, రాజు, మమత కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద పడవ మునగడంతో మృతిచెందారు. 3. కౌటాల మండలంలోని వీరవెల్లి వద్ద 2011 ఏప్రిల్ 24న పడవ మునగడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 4. గతేడాది గూడెం వద్ద నదిని దాటుతున్న ప్రయాణికుల పడవ మధ్యలో ఆగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సి వచ్చి ంది. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చిన పడవ సైతం చెడిపోవడంతో మరో పడవను ఆశ్రయించారు. ఇలా పడవలు చెడిపోయి ఇబ్బ ందులకు గురైన సంఘటనలు అనేకం ఉన్నా యి. బీట్ ఆఫీసర్ల మరణమే ఆఖరు అయ్యేలా, మరో ప్రమాదం చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
‘కచ్చలూరు’ ఎఫెక్ట్ : గిరాకీ లేక నిలిచిన బోటు ప్రయాణం
సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లాల్సిన బోటు ప్రయాణాన్ని అధికారులు శనివారం నిలిపివేశారు. గిరాకీ లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల గోదావరిలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోటు సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్ టు శ్రీశైలం బోటు ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులిచ్చినా ప్రయాణీకులు ఆసక్తి చూపడం లేదు. లాంచీ ప్రయాణం అంటేనే ప్రయాణీకులు హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో టిక్కెట్లు అమ్ముడుపోక టూర్‌ను రద్దు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. -
ఇడుపులపాయలోనూ శిల్పారామం
సాక్షి, తాడేపల్లి : యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. నదిలో బోటు రవాణాపై త్వరలోనే కమిటీ వేసి నివేదిక అందిస్తామని తెలిపారు. అలాగే నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోట్ల ఫిట్నెస్ చూశాకే అనుమతి ఇక్కడి నుంచే ఇస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టేడియల ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, మండల, నియోజకవర్గ స్థాయి స్టేడియం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. త్వరలోనే ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని, భాషా, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. సంస్కృతి వికాస కేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్తో ఇంటిగ్రేడ్ చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. కోటి రూపాయలతో శిల్పారామాలకు మరమ్మత్తులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు అవంతి తెలిపారు. -
కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్
కొత్త లాంచీలే పర్యాటకుల ప్రాణాల్ని హరిస్తున్నాయా. నిండు గోదారిలోనూ దశాబ్దాల తరబడి సాఫీగా ప్రయాణించిన పాత లాంచీ డిజైన్లను పక్కనపెట్టి.. కొత్త డిజైన్లతో రూపొందించటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయా.. అవుననే సమాధానమిస్తున్నారు సీనియర్ సరంగులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదానికి లాంచీ బరువు, డిజైన్ కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. వేలేరుపాడు (పశ్చిమ గోదావరి జిల్లా): రహదారి వ్యవస్థ లేనికాలంలో.. 1986 వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లాంచీలే ప్రజల రవాణా అవసరాలు తీర్చేవి. భద్రాలం నుంచి రాజమండ్రి (150 కిలోమీటర్లు), కూనవరం నుంచి రాజమండ్రి (100 కిలోమీటర్లు), కూనవరం నుంచి భద్రాచలం (50 కిలోమీటర్లు), కూనవరం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంట (15 కిలోమీటర్లు) మధ్య లాంచీలు పెద్దఎత్తున తిరిగేవి. అప్పట్లో ప్రతి లాంచీలో 200 మంది ప్రయాణికులతోపాటు విత్తనాలు, ఎరువులు, కిరాణా సామగ్రి, నిత్యావసర సరుకుల వంటివి టన్నుల కొద్దీ రవాణా చేసేవారు. అధిక లోడు ఉన్నప్పుడు ఫుట్ బోర్డును సైతం గోదావరి నీరు తాకుతూ ఉండేది. అయినా ఏనాడూ ప్రమాదాలు సంభవించలేదు. ఆ‘రామ్’గా వెళ్లొచ్చేవారు.. 1917లో ఆయిల్ ఇంజిన్‌తో నడిచే ‘శ్రీరామ’ అనే లాంచీ ఉండేది. ఆ తర్వాత చాలా లాంచీలు గోదావరిలోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనవి ఝాన్సీరాణి, ఉదయ భాస్కర్, శ్రీరాములు, రాజేశ్వరి, ముద్దుకృష్ణ, మురళీకృష్ణ, సావిత్రి, విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి పేర్లతో లాంచీలు నడిచేవి. గోదావరిలో సుడిగుండాలు కొత్త కాదు. పాత లాంచీలు ఉన్నప్పుడు ఏనాడూ సుడిగుండాల ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతి అధికారులు కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త బోటు తయారు చేయించేటప్పుడు సదరు యజమాని పోర్టు అధికారులకు దరఖాస్తు చేయాలి. బోటు డిజైన్‌ను పోర్టు అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఎలాంటి డిజైన్ ఉన్నా గుడ్డిగా అనుమతులు ఇస్తున్నారు. బోటు బరువు ఎంత ఉండాలన్నది చెప్పడం లేదు. ఫలితంగా పర్యాటకుల ప్రాణాలు గంగ పాలవుతున్నాయి. మారిన డిజైన్లతో కొత్త చిక్కులు పూర్వం లాంచీలు ‘యూ’ ఆకారంలో ఉండేవి. వాటి ముక్కు సూదిగా ఉండేది. లాంచీ తయారీకి ఎక్కువగా టేకు. ఇనుము తక్కువగా వినియోగించేవారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చాక లాంచీలన్నీ పర్యాటక రంగానికే పరిమితమయ్యాయి. వీటి డిజైన్లు మారిపోయాయి. ఇప్పటి బోట్లు, లాంచీల ఎత్తు భారీగా పెంచారు. లాంచీపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పర్యాటకులు లాంచీ పైభాగంలో కూర్చుని సుందర ప్రదేశాలను తిలకించేందుకు వీలుగా సిట్టింగ్ సౌకర్యం కల్పించారు. దిగువ భాగంలో ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో వాటి బరువు భారీగా ఉంటోంది. ఎత్తు పెరగడం వల్ల బ్యాలెన్స్ లేకుండా పోతోంది. ఎటు బరువు పెరిగితే అటు ఒరిగే పరిస్థితి తలెత్తుతోంది. పాత లాంచీల బరువు 15 నుంచి 20 టన్నులకు మించి ఉండేవి కావు. ప్రస్తుత లాంచీలు 35 నుంచి 40 టన్నుల వరకు బరువుంటున్నాయి. సరంగు నిర్లక్ష్యం.. డిజైన్ లోపాలే కారణం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీని అనుభవం లేని సరంగు నడిపాడు. అతడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. లాంచీ డిజైన్ లోపం కూడా ప్రమాదానికి మరో కారణం. ఆ లాంచీకి తల బరువు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రమాద ప్రాంతంలో రెండు కొండలు దగ్గరగా ఉంటాయి. అక్కడ నదిలో నీటి వడి ఎక్కువ. సరంగు ఈ విషయాలను గమనించకుండా నడపడం వల్లనే లాంచీ పల్టీ కొట్టింది. పాత లాంచీలు బరువు తక్కువ కావటం వల్ల సునాయాసంగా ప్రయాణిస్తాయి. 1986, 1990 సంవత్సరాల్లో సంభవించిన వరదల్లో వేల కుటుంబాలను పాత లాంచీలతోనే కాపాడాం. – చవ్వాకుల ప్రకాశరావు, సీనియర్ సరంగు, కూనవరం -
గోదావరి ఘటనపై అలర్ట్ చేసిన సీఎం !
సాక్షి ప్రతినిధి, వరంగల్: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఈ ఘటన నుంచి కడిపికొండ వాసులు 14 మందిలో ఐదుగురు బయటపడగా హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం రెండు, మంగళవారం మూడు.. మొత్తం ఐదుదగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఇందులో బస్కె అవినాష్, బస్కే రాజేందర్ అంత్యక్రియలు మంగళవారం జరగ్గా... సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్ల మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఐదుగురిని వరంగల్‌కు చేర్చడం.. ఇద్దరి మృతదేహాలను కడిపికొండ చేర్చడంపై జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్‌తో కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇక కేసీఆర్, కేటీఆర్ ఆదేశం మేరకు చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మంగళవారం కడిపికొండకు చేరుకున్నారు. బాధిత కుటు ంబాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్న ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటే మరో రూ.2 లక్షలు, అసంఘటిత కార్మికులైతే రూ.6 లక్షల వరకు వస్తాయని చెప్పి భరోసా కల్పించారు. కాగా, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరి రాజ్‌కుమార్ ఆచూకీ లభించేవరకు రాజమండ్రిలోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ‘సాక్షి ప్రతినిధి’కి ఫోన్లో తెలిపారు. రాజమండ్రి హెల్ప్ డెస్క్‌లో మనోళ్లు గోదావరి నదిలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన, మృతి చెందిన వారి సమాచారం కోసం రాజమండిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. అందులో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఆర్ఐ సుంరేందర్, వీఆర్వో జోసెఫ్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, బాధిత కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. అలాగే, కడిపికొండకు చెందిన పలువురు కూడా తమ వారిని గుర్తించేందుకు అక్కడే ఉన్నారు. -
కిషోర్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఆర్కే
-
లాంచీ ప్రమాదం పై సీఎం వైఎస్ జగన్ సీరియస్
-
మర్రిలంక.. మరి లేదింక
సాక్షి, యలమంచిలి (పశ్చిమ గోదావరి): చుట్టూ గోదావరి.. మధ్యలో మర్రిలంక. అక్కడ విద్యుత్ లేదు. రోడ్లు లేవు. అక్కడకు వెళ్లాలన్నా, రావాలన్నా పడవ ప్రయాణమే ఆధారం. అయినా అక్కడ సుమారు 50 గడపల్లో 60కి పైగా కుటుంబాలు దశాబ్దాలపాటు నివసించాయి. ఈ ద్వీపం ఇప్పుడు కాల గర్భంలో కలసిపోయింది. ఇళ్లన్నీ గోదావరిలో కలసిపోవడంతో ఆ కుటుంబాలన్నీ కనకాయలంక తరలివచ్చాయి. కనకాయలంకలో స్థిరపడిన వారిలో యువకులు చాలామంది ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలివెళ్లినా మర్రిలంకలో పుట్టిన వృద్ధులు మాత్రం ఇప్పటికీ మర్రిలంకపై అభిమానాన్ని చంపుకోలేక నిత్యం అక్కడికి వెళ్లి గడుపుతున్నారు. అటువంటి వారిలో చిల్లే నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మర్రిలంకలోని ఇళ్లన్నీ కోతకు గురవడంతో అక్కడి నుంచి కనకాయలంక వచ్చిన నారాయణమూర్తి ఇప్పటికీ ప్రతి రోజు పడవపై మర్రిలంక వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పశువులను మేపుకుని ఇంటికి వస్తాడు. అలా ఎందుకని నారాయణమూర్తిని ప్రశ్నిస్తే అక్కడే పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కూడా అక్కడే కలిగారు. మర్రిలంకతో నా బంధం విడిపోనిది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ లంకలో తాగిన నీళ్లు, జొన్న అన్నం, రాగి తోపు చలవే. అయితే మర్రిలంక నుంచి అందరూ వచ్చేయడంతో కనకాయలంకలో ఇల్లు కట్టుకున్నాను. కాని ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రోజూ ఉదయమే చద్దన్నం తిని పడవపై మర్రిలంక వెళ్తాను. మధ్యాహ్నం భోజనం పడవపై వస్తుంది. సాయంత్రం వరకూ అక్కడే పశువులు మేపుకుని వస్తానన్నాడు. మరో వృద్ధుడు చిల్లే చినరామన్నను పలకరిస్తే తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చాం కాని మా మనసంతా మర్రిలంకలో ఉంటుందన్నారు. అక్కడ 70 ఏళ్లు ఉన్నానని, ఎప్పుడు చిన్న రోగం కూడా రాలేదన్నారు. అక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, కల్తీలేని ఆహారమే అందుకు కారణమని చెప్పాడు. చిన్నతనంలో కూలి పనికి వెళితే అర్ధ రూపాయి కూలి ఇచ్చేవారు. ఆ డబ్బు హాయిగా బతకడానికి సరిపోయేది. ఇప్పుడు రూ.500 కూలి వస్తున్నా సరిపోవడం లేదని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసిన ఒకే వ్యక్తి మర్రిలంకలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి, ఆఖరి వ్యక్తిని నేనే. అక్కడ నుంచి పడవపై దొడ్డిపట్ల వచ్చి 10వ తరగతి చదువుకున్నాను. అనంతరం పాలకొల్లులో ఇంటర్, వీరవాసరంలో హాస్టల్లో ఉండి డిగ్రీ చదివాను. మా తాతలు, నాన్నలు మర్రిలంకలో ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వ్యవసాయం ఒక్కటే చేసేవారు. రాజకీయాల గురించి అసలు తెలిసేది కాదు. అయితే ఎన్నికలు వస్తే అందరూ కాంగ్రెస్‌కే ఓటేసేవారు. – చిల్లే వసంతరావు కల్మషం తెలియని రోజులవి నా చిన్నతనమంతా మర్రిలంకలోనే గడచిపోయింది. మర్రిలంకలో ఉన్నన్ని రోజులు కల్మషమంటే తెలియదు. అందరికీ కలిపి సొంత పడవ ఉండేది. శుక్రవారం వచ్చిందంటే ఆ పడవపై దొడ్డిపట్ల వెళ్లి సంత చేసుకు వచ్చేవారు. సంతలో తెచ్చే మిఠాయిలు కోసం పిల్లలందరూ ఎదురు చూసేవాళ్లం. అందరిదీ ఒకే మాటగా ఉండేది. వరదలు వచ్చినా అక్కడే ఉండేవాళ్లం. అక్కడ ఎన్నో విషసర్పాలు ఉండేవి. కాని ఒకసారి కూడా ఎవరినీ కాటేసిన దాఖలాలు లేవు. - చిల్లే శ్యామ్‌సుందర్ -
షికారు.. సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: సాగర్ అలలపై సరికొత్త పయనం.సాయం సంధ్య వేళల్లో చల్లగాలుల నడుమ ఆహ్లాదకరమైన అనుభూతి. ఇంటిల్లిపాదీ కలిసి చేసుకొనే వేడుకలు, విందు, వినోదాలకు అనువైన బోటు షికార్లు హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులో కి వచ్చాయి. ఒకేసారి పది మంది నుంచి 35 మంది వరకు కలిసి పయనించే రెండు అందమైన డీలక్స్ ఫ్యామిలీ స్పీడ్ బోట్లను తెలంగాణ పర్యాటకాభివృద్ధి తాజాగా ప్రవేశపెట్టింది. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, స్నేహితులతో కలిసి చేసుకొనే పార్టీలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. కొద్ది రోజుల క్రితమే వీటిని పుణే నుంచి తెప్పించారు. ఒకటి, రెండు రోజుల్లో డీలక్స్ స్పీడ్ బోట్ల సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ రెండు డీలక్స్ బోట్లతో పాటు ఒకేసారి 80 మందితో ప్రయాణించేందుకు అనువైన మరో ‘ క్యాటమెరిన్ పాంటమ్’ బోట్‌ను కూడా పుణే నుంచి తెప్పించారు. అన్ని హంగులతో సిద్ధమవుతున్న ఈ ఓపెన్‌టాప్ బోట్ సాగర్ అలలపై పరుగులు పెడుతూ పర్యాటకలకు చక్కటి అనుభూతిని అందించనుంది. 90 హార్స్పవర్ విద్యుత్ సామర్థ్యంతో నడిచే ఇంజిన్లను ఈ బోట్‌కు అమర్చారు. దీంతో అది చాలా వేగంగా పరుగెడుతుందని హుస్సేన్‌సాగర్ బోట్స్ యూనిట్ మేనేజర్ సంపత్ తెలిపారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో ఈ అత్యాధునిక బోటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2 డీలక్స్ ఫ్యామిలీ బోట్లు, క్యాటమెరిన్ పాంటమ్ బోట్లతో పాటు, కొత్తగా 150 మంది ప్రయాణించే సదుపాయం ఉన్న ఫ్లోటింగ్ జెట్టీలు కూడా సాగర్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రద్దీకి అనుగుణంగా బోట్లు... ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో ఒకేసారి 60 మందితో ప్రయాణించ గలిగే గౌతమి, లుంబిని, కోహినూర్,తదితర బోట్లతో పాటు 100 మందిని తీసుకు వెళ్లే భగీరథ, భాగమతి క్రూయిజ్ బోట్లు ఉన్నాయి. మరో 6 స్పీడ్ బోట్లు సైతం పరుగులు తీస్తున్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న డీలక్స్ ఫ్యామిలీ బోట్లతో స్పీడ్ బోట్ల సంఖ్య పెరగనుంది. చుట్టూ అద్దాలతో, పసుపు, తెలుపు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన డీలక్స్ బోట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. నగరానికి వచ్చే సందర్శకులు బుద్ధ విగ్రహాన్ని సందర్శించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు... ప్రతి రోజు సగటున 5000 మంది పర్యాటకులు లుంబిని పార్కును సందర్శించి బోట్ షికారుకెళ్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ సంఖ్య 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది.గత ఏడాది మే చివరి నాటికి 1.67 లక్షల మంది బుద్ధ విగ్రహాన్ని సందర్శించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1.53 లక్షల మంది సందర్శించుకున్నారు. గతేడాది రూ.97.64 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది రూ.93.49 లక్షలు లభించింది. గతేడాదితో పోల్చితే పర్యాటకుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరోవైపు పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 600 లైఫ్జాకెట్లను అందుబాటులో ఉంచారు. 10 మంది గజఈతగాళ్లు ప్రతి క్షణం విధి నిర్వహణలో ఉంటారు. ఎలాంటి విపత్కరపరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని యూనిట్ మేనేజర్ సంపత్ ధీమాను వ్యక్తం చేశారు. -
మేల్కోకుంటే..కన్నీటి గోదారే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో సుమారు 19 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతోనైనా మన అధికారులకు కనువిప్పు కలగాలని జిల్లా ప్రజలు కోరుకొంటున్నారు. లేకుంటే అటువంటి విషాద ఘటనలే మన జిల్లాలో చోటుచేసుకునే ప్రమాదముంటుందని ఆందోళన చెందుతున్నారు. మన జిల్లాకు సుదీర్ఘ నదీ తీరం ఉంది. అటు తెలంగాణలోని భద్రాచలం నుంచి.. ఇటు అంతర్వేది, యానాం వరకూ గోదావరి నదిపై ఎన్నో బోట్లు తిరుగుతుంటాయి. పాపికొండల పర్యాటకులను తీసుకువెళ్లేవి కొన్నయితే, ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులను తరలించేవి మరికొన్ని. వీటిల్లో చాలా బోట్లు కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదు. వాస్తవంగా చెప్పాలంటే జిల్లాలో తిరుగుతున్న బోట్లపై అధికారులకు కనీస అజమాయిషీ కూడా ఉండడం లేదు. సరైన పర్యవేక్షణ, తనిఖీలు, నిఘా లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు ప్రమాదాలు ⇒ పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో 2012 నవంబర్ 18వ తేదీ సాయంత్రం మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 మందితో వెళ్తున్న ఇంజిన్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన కుటుంబాల వారు అదే జిల్లాకు చెందిన మాచేనమ్మ అమ్మవారి గుడికి నదీ మార్గంలో ఉదయం వెళ్లారు. సాయంత్రం తిరిగి బోటుపై ఇళ్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ⇒ గత ఏడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదిలేయడంతో లంక పొలాలకు వెళ్లే రైతుల్లో నలుగురు చనిపోయారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల రైతులు బోటు మీద వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ⇒ పలుమార్లు గోదావరి నదిలో పర్యాటక బోట్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంఘటనలున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి జిల్లాలో పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లు సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. కానీ, ప్రైవేటు ఆపరేటర్లకు చెందిన బోట్లు 75 వరకూ ఉన్నాయి. వీటిలో నిర్దిష్ట ప్రమాణాలతో ఉన్నవెన్ని అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వరకూ, దిండి, కోరంగి, యానాం, ఎదుర్లలంక, కోటిపల్లి రేవుల్లో పడవలు తిరుగుతున్నాయి. పురుషోత్తపట్నం – పోలవరం మధ్య, దేవీపట్నం – సింగన్నపల్లె మధ్య, కొండమొదలు – శివగిరి మధ్య, కొండమొదలు – దేవీపట్నం మధ్య, మరికొన్ని గ్రామాలకు పడవలు తిరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి తీరాన ఉన్న ప్రజలు రాకపోకలకు ఎక్కువగా బోట్ల పైనే ఆధారపడుతున్నారు. ఇవి కాకుండా వేటకు వెళ్లే మత్స్యకారులు మరో 200 బోట్లు వినియోగిస్తున్నారు. వీటి పరిస్థితిపై తరచుగా తనిఖీ చేసే నాథుడే లేడు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. తరువాత పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలోని బోట్లను పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఒక కమిటీ వేశారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. జాగ్రత్తలు తీసుకోని నిర్వాహకులు జిల్లాలో అనుమతి ఉన్నవాటికంటే అనుమతి లేని బోట్లే ఎక్కువగా నడుస్తున్నాయి. అత్యధిక బోట్లలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ప్రధానంగా ఉండాల్సిన లైఫ్ జాకెట్లే ఉండటం లేదు. కొన్నింటిలో ఉన్నా వాటిని ఓ మూలన పడేస్తున్నారు. కొన్ని బోట్లలో లైఫ్ జాకెట్లు ఇచ్చినా అసౌకర్యంగా ఉంటున్నాయని పర్యాటకులు సహితం వేసుకోవడం లేదు. దీనిపై వారికి అవగాహన కూడా కల్పించడం లేదు. లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే అనుమతిస్తామని బోటు నిర్వాహకులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. పలు బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను యథేచ్ఛగా ఎక్కిస్తున్నారు. నిబంధనలు పాటించేవెన్నో.. జిల్లాలోని బోట్లలో నిబంధనల మేరకు ఉన్నవెన్ని అన్నదానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్‌లో రెన్యువల్ చేయడం, ఫిట్నెస్ సర్టిపికెట్ ఇవ్వడమనేది షరా మమూలుగా మారిపోయింది. వాస్తవానికైతే, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పర్యాటక అధికారులు నిబంధనలు పాటించని బోట్లపై ఓ కన్ను వేయాలి. కానీ, అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. పర్యాటక బోట్లు సీజ్ దేవీపట్నం: కృష్ణా నదిలో బోటు ప్రమాదం నేపథ్యమో ఏమో కానీ.. పాపికొండల విహార యాత్రకు వెళుతున్న నాలుగు పర్యాటక బోట్లను అధికారులు సీజ్ చేశారు. ఆదివారం పాపికొండల పర్యటనకు విపరీతమైన రద్దీ ఏర్పడడంతో బోట్ సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్ బోట్లను సాయంత్రం తనిఖీ చేశారు. జెమిని, గోదావరి గ్రాండ్, సాయి శ్రీనివాస్, పున్నమి ఎక్స్‌ప్రెస్ బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని 15 రోజులపాటు రద్దు చేసినట్టు తెలిపారు. -
పడవ ప్రయాణం కాదు... బుడగ ప్రయాణం!
హైదరాబాద్‌కు ఓ మూసీ... ముంబైకి మీఠీ నది, అక్కడే విశాలమైన అరేబియా సముద్రం, ఢిల్లీలో యమునా నది! దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ మహానగరాల్లో నదులు, లేదంటే సుముద్రతీరం ఉన్నాయి. రోడ్డుపై వాహనాలతో వెళ్లడం కంటే నీటిపై పడవల్లో వెళ్లడం చౌక, కాలుష్యరహితం కూడా. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి చూస్తే... పక్కనున్న ఫోటోలేమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. అవునండి... ఇవి నీటి ట్యాక్సీలు! పడవలు, ఫెర్రీలతో అయ్యే కాలుష్యాన్ని, సమయం వృథా అవడాన్ని కూడా నివారించేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ‘సీ బబుల్స్’ అనే సంస్థ వీటిని అదే పేరుతో అభివృద్ది చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది జల రవాణా కోసం ఊబర్ లాంటిది. స్మార్ట్‌ఫోన్ ఆప్ ద్వారా పనిచేస్తుంది. ఒక్కో సీబబుల్‌లో ఐదుగురు మాత్రమే వెళ్లగలరు. కాబట్టి... ఫెర్రీ, పడవ నిండేంత వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. పైగా దీని డిజైన్ కారణంగా ఇది అతితక్కువ ఇంధనాన్ని వాడుతుంది. నీటి ఉపరితలంపైకి విసిరేసిన కుండ పెంకు మాదిరిగా గాల్లో ఎగురుకుంటూ వెళుతుంది. బ్యాటరీల నుంచి శక్తిని గ్రహించి ఇంజిన్ దాదాపు 240 కిలోల చోదక శక్తిని అందుకుని గంటకు 13 కిలోమీటర్ల నుంచి 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌరశక్తి ద్వారా బ్యాటరీలను నింపుకునే అవకాశమూ ఉంది. అలెన్ థీబాల్ట్, ఆండర్స్ బ్రింగ్‌డాల్ అనే ఇద్దరు ఔత్సాహికులు అభివృద్ది చేసిన సీబబుల్‌ను ఎయిర్‌బస్, రాఫేల్ విమాన కంపెనీల్లో పనిచేసిన బోరిస్ ప్రాట్, ఫిలెప్పీ పెరియర్‌లు డిజైన్ చేశారు. వచ్చే నెలలో తొలిసారి ఈ సీబబుల్‌ను ప్యారిస్‌లో పరీక్షించనున్నారు. వచ్చే ఏడాదికల్లా మరో 10 - 15 వాహనాలను తయారు చేసి పరీక్షిస్తారు. ఆ తరువాత 15 భారతీయ నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆలోచన. ప్రస్తుతానికి వీటిని డ్రైవర్ల సాయంతోనే నడుపుతున్నా... త్వరలోనే డ్రైవర్ల అవసరం లేని విధంగానూ మార్పులు చేయనున్నారు. -
సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 40 మంది పర్యాటకులతో అగస్త్య లాంచీ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకుసాగర్ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి బయల్దేరింది. ఈ సందర్భంగా సాగర్ రైట్ బ్యాంక్ లాంచీస్టేషన్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండాయని, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు లాంచీ ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కృష్ణా నదిలో 110 కిలోమీటర్లు దూరాన్ని 5.30 గంటల్లో చేరుకోవచ్చని, అగస్త్య లాంచీ గ ంటకు 20 కిలోమీటర్లు వేగంతో నదిలో ప్రయాణిస్తుందన్నారు. రెండు రోజుల ప్రయాణానికి పర్యాటక సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. లాంచీలో పర్యాటకులతో పాటు సాగర్ పర్యాటక సంస్థ డీవీఎం జోయల్, మార్కెటింగ్ మేనేజర్ మనోహర్ తదితరులు వెళ్లారు. ప్యాకేజీ వివరాలివీ...లాంచీ ప్రయాణం (మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే)..హైదరాబాద్ నుంచి పర్యాటక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ నుంచి ముందుగా సాగర్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక శాఖ కల్పిస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు. పెద్దలకు రూ. 3150, పిల్లలకు రూ. 2520 చార్జిగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి అయితే..రెండు రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు చార్జీ రూ. 2500, పిల్లలకు రూ. 2000. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక సంస్థ ఏర్పాటు చేస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు. కేవలం అప్ అయితే...నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో కేవలం అప్ మాత్రమే వెళితే ఎవరికైనా రూ. 600 చార్జ్ చేస్తారు. వీరిని శ్రీశైలంలో దింపుతారు.