ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్‌పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్‌లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment