van
-
వెచ్చగా ఉంచే ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ వ్యాన్‌లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. (చదవండి: ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
ఫ్రీగా దొరికిన కూరగాయలు..ఎగబడ్డ జనాలు
-
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
బీర్ల వ్యాన్ బోల్తా
-
ట్రాక్టర్, వ్యాను ఢీ.. చెలరేగిన మంటలు.. 26 మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు. చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో.. -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్‌లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్‌పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు. చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం -
ఉదయ్‌పూర్ యువరాజు మనసు దోచిన వెహికల్ ఇదే! నెట్టింట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్లు చేరాయి. ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్లు, ఇండియూజువల్ AC వెంట్లు , ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్లున్నాయి. ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్‌ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు. -
సందడిగా పెట్ గ్రూమింగ్ వ్యాన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
దేశంలో తొలి మోడల్.. ఫోర్స్ మోటార్స్ అర్బేనియా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్స్ మోటార్స్ తయారీ అర్బేనియా కొద్ది రోజుల్లో రోడ్డెక్కనుంది. యాత్రలు, కార్యాలయ సిబ్బంది ప్రయాణానికి ఇది ఉపయుక్తం. మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌నుబట్టి డ్రైవర్‌తోసహా 18 మంది కూర్చునే వీలుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది. 115 హెచ్‌పీ, 350 ఎన్ఎం పీక్ టార్క్‌తో మెర్సిడెస్ ఎఫ్ఎం 2.6 సీఆర్ ఈడీ టీసీఐసీ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. ఈ సెగ్మెంట్లో దేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రోల్ఓవర్ ప్రొటెక్షన్‌తో తయారైన తొలి మోడల్ ఇదే. మోనోకాక్ స్ట్రక్చర్, హిల్ హోల్డ్ అసిస్ట్, కొలాప్సిబుల్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీల్డ్ పనోరమిక్ విండోస్, 17.8 సెంటీమీటర్ల ఎల్సీడీ టచ్‌స్క్రీన్ వంటి హంగులు ఉన్నాయి. 15 రోజుల్లో డీలర్‌షిప్‌లకు అర్బేనియా వాహనాలు చేరనున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. రూ.1,000 కోట్లతో అర్బేనియా వాహనాల అభివృద్ధి, తయారీ ప్రాజెక్టును ఫోర్స్ మోటార్స్ చేపట్టింది. -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫొటోలో ఉన్నది కొత్త మోడల్ వ్యాన్లా కనిపిస్తోంది కదూ! ఇది కొత్త మోడల్ వ్యాన్ మాత్రమే కాదు, దాదాపు ఉభయచర వాహనం. దాదాపు ఉభయచర వాహనమేంటి అనుకుంటున్నారా? ఔను! ఇది పూర్తి ఉభయచర వాహనం కాదు గాని, ఆపద్ధర్మానికి ఉభయచర వాహనంగానే పనికొస్తుంది. ఇది ఎలాంటి రోడ్ల మీదనైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది. అంతేకాదు, వరదనీరు ఉధృతంగా రోడ్లను ముంచెత్తినప్పుడు కూడా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. ‘ఎస్ట్యువరీ హోపర్’ పేరిట బ్రిటిష్ ఆటోమొబైల్ డిజైనర్ జోర్డాన్ బేమ్స్ ఈ విచిత్ర వాహనానికి రూపకల్పన చేశాడు. ఇది ‘సెమీ యాంఫీబియస్ వెహికల్’ అని చెబుతున్నారు. అంటే దాదాపు ఉభయచర వాహనమన్న మాట! వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు తరచుగా వరదల బారినపడే మన రోడ్ల మీదకు వస్తే బాగుంటుంది కదూ! చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
సీఆర్ ఫౌండేషన్‌కు ఎస్బీఐ వాహనం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్బీఐ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్‌ను శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ జానకిరామన్ తెలిపారు. బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
పోలీసులపై దూసుకెళ్లిన వ్యాన్!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా పుదుచత్రం ఏకే సముద్రం జాతీయ రహదారిలో ఆదివారం వేకువ జామున ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో మరో లారీ సైతం అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పుదుచత్రం, రాశిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న నలుగుర్ని రక్షించారు. స్వల్పగాయాల పాలైన వారికి అక్కడే ప్రథమ చికిత్స అందించారు. రోడ్డుకు అడ్డంగా ఆగిన కారు, లారీని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వేగంగా దూసుకొచ్చి.. తొలగింపు పనుల్లో నిమగ్నమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపైకి ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే భారీ నష్టం.. జరిగిపోయింది. పుదుచత్రం స్టేషన్ స్పెషల్ ఎస్ఐ చంద్రశేఖర్(55), రాశిపురం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవరాజన్(35) ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రాశిపురం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తురు. దేవరాజన్, చంద్రశేఖర్ మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, తలా రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. రిటైర్డ్ ఇన్స్పెక్టర్ను బలిగొన్న బైక్ రేసింగ్ చెన్నై శివారులోని వండలూరు ఎక్స్‌ప్రెస్ వేలో యువకులు బైక్ రేసింగ్‌లో దూసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం అరుంబాక్కంకు చెందిన రిటైర్డ్ మహిళా ఇన్స్పెక్టర్ సెల్వకుమారి మేల కోట్టై పోలీసు క్వార్టర్స్ నుంచి బైక్‌లో బయలు దేరారు. మార్గం మధ్యలో బైక్ రేసింగ్‌లో ఉన్న యువకులు ఆమె వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. బైక్ రేసింగ్‌లో దూసుకొచ్చిన ఓ యువకుడు ఒకడు గాయపడ్డాడు. మిగిలిన వారు పరారయ్యారు. -
పెళ్లి వ్యాన్ బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం
గూడెంకొత్తవీధి : వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ పెళ్లి వ్యాను అదుపుతప్పిన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం వివరాలివి. మండలంలోని గాలికొండ గ్రామానికి చెందిన వధువు, లక్కవరం గ్రామానికి చెందిన వరుడికి బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఓ వ్యానులో గాలికొండ నుంచి లక్కవరం గ్రామానికి రాత్రి వారంతా చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విందు భోజనం అనంతరం స్వగ్రామానికి పయనమయ్యారు. బూసుల ఘాట్ రోడ్డులో బొలేరో వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. ప్రమాదంలో గుమ్మాలగొంది గ్రామానికి చెందిన కాకూరి నర్సింగరావు(45), బత్తునూరు గ్రామానికి చెందిన శ్రీహరి(18), శామ్యూల్(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జి.కె.వీధి పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారి రామ్‌నాయక్ వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 15 మంది కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. వాహనంలో ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఘాట్‌లో రక్షణ గోడ లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెను ప్రమాదం సంభవించేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సమీర్ తెలిపారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
ఇదీ రూట్.. ఒరిస్సా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్.. కానీ మధ్యలో..
సాక్షి, సిటీబ్యూరో: ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, అమరావతికి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు, రిసీవర్ పరారీలో ఉండగా.. గంజాయి లోడ్ వాహన డ్రైవర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. వీరి నుంచి 560 కిలోల గంజాయి. కారు, డీసీఎం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అమరావతికి చెందిన నౌషాద్ ముంబై, అమరావతి ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఉస్మాన్‌నగర్‌కు చెందిన సలీమ్ ఉల్లా అలియాస్ రాజు, షేక్ రెహాన్, షేక్ వసీం సహకరించేవారు. ఒరిస్సా చిత్రకొండకు చెందిన సంతోష్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నౌషాద్.. సంతోష్‌ను సంప్రదించి, 1,000 కిలోల ఎండు గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు. దీంతో సంతోష్ 560 కిలోల గంజాయిని సిద్ధం చేసి నౌషాద్కు సమాచారం అందించాడు. (చదవండి: హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్.. ) నౌషాద్ భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బంగాళదుంపలను రవాణా చేయాలని కోరుతూ.. హైదరాబాద్‌కు చెందిన ఇక్బాల్‌ను సంప్రదించాడు. ఈనెల 15న సలీం, రెహాన్, వసీం కారులో ఖమ్మం వెళ్లారు. అక్కడ ఇక్బాల్ ఏర్పాటు చేసిన డీసీఎం తీసుకున్నారు. సలీం డీసీఎం నడుపుతూ భద్రాచలం వెళ్లి అక్కడ 3 టన్నుల బంగాళా దుంపలు లోడ్ ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి ఈనెల 18న చిత్రకొండ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డీసీఎంను పార్క్ చేసి సంతోష్‌కు సమాచారం అందించాడు. సంతోష్ డీసీఎంలో 560 కిలోల గంజాయి లోడ్ చేసి మిగిలిన ముగ్గురికి సమాచారం అందించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. సలీం డీసీఎంను డ్రైవ్ చేస్తుండగా రెహాన్, వసీం కారులో ఎస్కార్ట్‌గా అమరావతి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దులో తనికీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నిందితులు టోల్ రోడ్లు రాకుండా డీసీఎంను దారి మళ్లించారు. హిమాయత్‌సాగర్ మీదుగా వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీసులు పీడీపీ క్రాస్‌రోడ్ వద్ద డీసీఎం, ఎస్కార్ట్‌గా వెళుతున్న కారును అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విషయం బయటపడింది. కిలో 1,250 చొప్పున కొనుగోలు చేసి.. వినియోగదారులకు రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్నా డ్రైవర్‌తో సహ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
శ్రీశైలం: లోయలో పడిన వ్యాన్
-
శ్రీశైలం ఘాట్‌రోడ్డు: లోయలో పడిన వ్యాన్
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్‌రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వ్యాన్ లోయలో పడింది. అందులో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ధూల్‌పేటలోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది క్వాలీస్ వాహనంలో శ్రీశైలం బయల్దేరారు. ఈగలపెంట సమీపంలో మైసమ్మగుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న నమ్రతాసింగ్, హేమలత, అనిల్ సింగ్, అస్మిత్ సింగ్, ధర్మేష్, సుమన్లత, నీతూ సింగ్, రాజకుమారి, ధార్మిక్ గాయపడ్డారు. (స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లో ఈగలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నీతూ సింగ్ (40), రాజకుమారి (55), ధర్మిక్ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. మిగతావారిని కూడా ఈగలపెంటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. (సారు చెబితేనే చేశాం..) స్థానికుల సహాయం దోమలపెంట ప్రాంత యువకులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావు దేవస్థానానికి చెందిన రెండు అంబులెన్స్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓ అంబులెన్స్‌ను ఈగలపెంటకు పంపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ధులే జిల్లా వించూర్ సమీపంలో అర్థరాత్రి సమయంలో ఓ వ్యాన్ అదుపు తప్పి వంతెన పైనుంచి లోయలో పడింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు సంఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బర్త్‌డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్‌డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్‌ను దుల్కర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్‌తో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్‌కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
చెత్తవ్యానును ఢీకొన్న ఎన్టీపీసీ రైలు
యైటింక్లయిన్‌కాలనీ(గోదావరిఖని): రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లోని చెత్తను రైల్వేట్రాక్ దాటి డంపింగ్ చేసి వస్తున్న క్రమంలో శుక్రవారం ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేస్తున్న రైలు ఢీకొంది. ఈసంఘటనలో ఎవరికీ ఏలాంటి గాయాలు కాలేదు. ఎప్పటిలాగే చెత్తను డంపింగ్‌చేసేందుకు ట్రాక్ దాటి వెళ్లిన వ్యాను తిరిగి ట్రాక్ దాటుతుండగా నిలిచిపోయింది. దీంతో బొగ్గు లోడ్‌తో వస్తున్న ఎన్టీపీసీ రైలు ఢీకొంది. పక్కన రెయిల్ ఉండటంతో దాన్ని ఆనుకుని వ్యాన్ నిలిచిపోయింది. లేకంటే కట్టపైనుంచి కిందపడే ప్రమాదముండేంది.