వ్యాను బోల్తా: ముగ్గురు మృతి | 3 Killed, 3 injured as Van turns turtle in besthavaaripeta | Sakshi
Sakshi News home page

వ్యాను బోల్తా: ముగ్గురు మృతి

Published Wed, May 27 2015 8:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

వ్యాను బోల్తా: ముగ్గురు మృతి

వ్యాను బోల్తా: ముగ్గురు మృతి

ప్రకాశం(బేస్తవారిపేట): బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహీంద్ర వాహనంలో విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు, పిల్లలు సోమవారం బయలుదేరి వెళ్లారు. పిల్లలకు కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె వద్ద వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాదారుడు చిలకల కృష్ణా రెడ్డి(26)ని ఢీకొట్టడంతో అక్కడిక్కడిక్కడే మరణించాడు. మహీంద్ర వాహనం పల్టీ కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న సోమశేఖర్, కురుణ రమణలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కృష్ణారెడ్డికి పెళ్లిచూపులు జరిగిన రెండు రోజులకే..
పందిల్లపల్లెకు చెందిన చిలకల క్రిష్ణారెడ్డికి రెండు రోజుల క్రితమే పెళ్లి చూపులు జరిగాయి. నేడు అక్క, బావలకు చూపించి వివాహం నిశ్చయం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో బెంగుళూరులో ఉన్న అక్క, బావలు బస్‌లో పందిలపల్ల్లెకు వస్తున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు బస్టాండ్‌కు మోటార్ సైకిల్‌పై వచ్చాడు. మోటార్ సైకిల్‌ను రోడ్డు పక్కన పెట్టి నిలబడి ఉండగా జైలో వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు. తండ్రి మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉన్న ఒక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి పద్మావతి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement