turns turtle
-
హోలీ వేళ విషాదం... ఆటో బోల్తా
న్యూఢిల్లీ: పండుగలు అందరూ సరదాగా ఆనందంగా జరుపుకోవడానికే. కానీ వాటిని ఎవరైన సరే ఎవరికీ ఇబ్బందీ కలిగించకుండా చేసుకోవాలి. అంతేగానీ మన సరదాతో ఇతరులకు ప్రాణాపాయ స్థితి కలిగిలే చేయకూడాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చేసి అతనే కటకటాల పాలయ్యే స్థితి కొని తెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్లే..హోలీ చక్కగా ఒకరి మీద ఒకరు రంగుల జల్లుకోవడం లేదా కలర్స్ వాటర్ లేదా బెలూన్లతో జల్లుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ల మీద మన స్నేహితుల మీద జల్లుకోవాలి. అంతేకాదు వాళ్లు ఏదైన సీరియస్ పనిలో ఉన్న ప్రమాదకరమైన వస్తువులతో పని చేస్తున్నప్పుడూ ఇలాంటి పండుగకి సంబంధించిన చిలిపి పనులు అసలు చేయకూడదు. కానీ యూపీకి చెందిన ఒక వ్యక్తి ప్రయాణికులతో వేగంగా వస్తున్న ఆటో పై వాటర్ బెలూన్ విసిరాడు అంతే ఒక్కసారిగా ఆటో ఒకవైపుకు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఎంతమంది గాయాలపాలయ్యారో పూర్తి సమాచారం తెలియలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో చోటు చేసుకుందని పేర్కొన్నారు. पानी का गुब्बारा मारने पर पलटा ऑटो, सोशल मीडिया पर वायरल हुआ वीडियो#ViralVideo #Holi pic.twitter.com/83G9QhwHbk — Zee News (@ZeeNews) March 20, 2022 (చదవండి: జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!) -
బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లిలో అద్దంకి రహదారిపై గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఏపీ 04 వై7191 బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
కారు బోల్తా : యువకుడి మృతి
రాజమండ్రి : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎస్వీజీ మార్కెట్ వద్ద జరిగింది. మోరంపూడి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఎస్వీజీ మార్కెట్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీకి చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. -
బీరుసీసాల లారీ బోల్తా
నార్కట్‌పల్లి(నల్గొండ జిల్లా): నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్, క్లీనర్లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కొన్ని బీరు సీసాలు మాత్రం పగిలిపోయాయి. ఇదే అదునుగా కొందరు బీరుబాబులు తమ చేతికి పనిచెప్పారు. దొరికిన బీరుసీసాలను వెంట తీసుకెళ్లారు. -
జూబ్లీహిల్స్‌లో ర్యాష్ డ్రైవింగ్
-
ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు
-
ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు
పామర్రు(కృష్ణా): కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన ఒక పెళ్లి బృందం ట్రాక్టర్లో వేమవరంలోని కొండాలమ్మగుడి నుంచి ట్రాక్టర్లో బయలుదేరింది. వారి వాహనం కొరిమెర్ల వద్ద మలుపులో ట్రాక్టర్ లింకు ఊడిపోవటంతో ట్రక్కు బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రక్కులోని 20 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. -
బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా
చివ్వెంల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలో సోమవారం ఉదయం బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపైనే పడిపోయింది. ట్యాంకర్‌కు పగుళ్లు రావటంతో లీక్ అవుతున్న ఆయిల్‌ను చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి బిందెలు, బకెట్లు, డ్రమ్ముల్లో పట్టుకెళుతున్నారు. ట్యాంక్‌లో సుమారు రెండు వేల లీటర్ల ఆయిల్ ఉంటుందని చెబుతున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన ప్రజలు
గొల్లప్రోలు(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. గ్యాస్ లీక్ అవుతుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి సమీపంలోని గుమ్మళ్లదొడ్డి హెచ్‌పీ గ్యాస్ ఫిల్లింగ్‌స్టేషన్‌కు గ్యాస్ తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగనట్లు తెలిసింది. -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తూ టిప్పర్, బైక్‌లు శనివారం ఉదయం ఢీకొన్నాయి. అనంతరం అదుపుతప్పిన టిప్పర్ పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటీవలే చిన్నారి రమ్య కుటుంబం కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
బ్రిడ్జ్ పైనుంచి పడిపోయిన ట్యాంకర్
డ్రైవర్ దుర్మరణం.. క్లీనర్‌కు తీవ్రగాయాలు కరీమాబాద్: వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదవశాత్తు ఆరుుల్ ట్యాంకర్ కింద పడింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏలూరులోని దెందులూర్ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బల్క్ క్యారియర్ లారీ ట్యాంకర్ ఆర్బీ ఆరుుల్తో ఢిల్లీ వెళ్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైకి రాగానే ట్యాంకర్ అదుపు తప్పి ఫుట్‌పాత్ పైకి ఎక్కింది. అంతే కాకుండా బ్రిడ్జి గోడను బలంగా తాకి పైనుంచి కిందపడిపోయింది. దీంతో లారీ ట్యాంకర్ ధ్వంసమవ్వడంతో పాటు లారీ డ్రైవర్ శ్యాంవీర్సింగ్ మృతి చెందగా, క్లీనర్ దినేశ్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. ఇదిలా ఉండగా లారీ ట్యాంకర్ కింద పడగానే బయటకు వచ్చిన ఆర్బీ ఆయిల్(తౌడు ఆయిల్)ను సమీప ప్రాంత ప్రజలు తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు
మంగపేట(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారు. చుంచుపల్లి ఇసుక క్వారీలో ఇసుక లోడ్ చేసుకుని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంగపేట ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎడ్డిప గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు కాగా వారిని 108 వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం గన్నవారం గ్రామానికి చెందిన యువతికి రోలుగుంట మండలానికి చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వ్యానులో తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి
ఆలమూరు(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీసాకోడేరు గ్రామంలో మహేష్‌రాజు, దేవీప్రియాంక వివాహం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరిగింది. అనంతరం నూతన దంపతులు బంధువులతో కలసి మొత్తం 12 మంది కారులో అన్నవరం దర్శనానికి బయలుదేరారు. వారి వాహనం ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలోని మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న కృష్ణశ్రీ, మాధవీశ్రీ అనే పదేళ్లలోపు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 10 మంది గాయాలపాలయ్యారు. నూతన వధూవరులకు స్వల్పగాయాలయ్యాయి. మిగతా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. -
టైల్స్ లారీ బోల్తా: ముగ్గురు మృతి
మునగాల(నల్లగొండ): నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు టైల్స్ లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో టైల్స్‌పై కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. -
స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి
కిషోడ్(గుజరాత్): స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు చిన్నపిల్లలతో పాటూ మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన గుజరాత్‌లోని కిషోడ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కారు బోల్తా: ఇద్దరు మృతి
పూడూరు(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చిలాపూర్ గ్రామ శివారులోని కేశవరెడ్డి పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు గుల్బర్గా నుంచి ఫార్చ్నర్ వాహనంలో నగరానికి వస్తుండగా.. కేశవరెడ్డి పాఠశాల సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్కా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం స్టేజీ వద్ద గుట్కాలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. డీసీఎం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. -
ఆటో బోల్తా పడి విద్యార్థిని మృతి
గజపతినగరం(విజయనగరం): పండుగ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ బాలిక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విజయనగరం జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గజపతినగరం మండల కేంద్రానికి చెందిన షేక్ చాంద్‌బాషా, నసీమా దంపతుల కూతురు బషీరున్నీసా(12) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సెలవులు రావటంతో మూడు రోజుల క్రితం అమ్మమ్మ గారి ఊరైన దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామం వెళ్లింది. బుధవారం సాయంత్రం మేనమామతో కలసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరింది. గ్రామ సమీపంలో ఆ ఆటో బోల్తా పడి బషీరున్నీసా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడింది. -
రోడ్డుపై ప్రవహించిన నూనె.. పలువురికి గాయాలు
కాటేదాన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై నూనె ప్రవహించింది. పాత కర్నూలు రోడ్డు, మధుబన్ కాలనీ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న పలువురు వాహనదారులు జారి కిందపడిపోగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి
బాన్సువాడ(నిజామాబాద్): ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ తండాలో చోటుచేసుకొంది. బాన్సువాడ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం...తండాకు చెందిన బరావత్ లకియ బాయి బుధవారం ఇద్దరు కొడుకులు రాజు, రవీందర్‌తోపాటు కోడళ్లు హన్నీబాయి(20), సీతాబాయి (20)తో పొలానికి ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే, నాగ్లూర్ సమీపంలో మలుపులో వారి ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న హన్నీబాయి, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ నడుపుతున్న రవీందర్, లకియాబాయి, సీతాబాయిలకు తీవ్రగాయాలయ్యాయి. -
తాబేలును తప్పించబోయి
సేలం: అకస్మాత్తుగా రోడ్డుమీదకు వచ్చిన ఓ తాబేలును తప్పించబోయి ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. తమిళనాడు సేలం జిల్లా ఈతాపూర్ లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు బస్సు పాండిచ్చేరి నుండి కోయంబత్తూరు కు వెళుతోంది. రోడ్డు మీద వెళుతున్న తాబేలును రక్షించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపపడటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు గోదావరిఖని నుంచి బెల్లంపల్లి వైపు వెళుతుండగా ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రహదారి మార్జిన్ దాటిపోయి బోల్తాపడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉండగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జ్వాలాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు మదనపల్లి టీజీఎం కోర్టు సూపర్డెంట్ టి. రమేష్ బాబుగా పోలీసులు నిర్ధరించారు. అనంతపురంలోని ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
పెట్రోలింగ్ జీప్ బోల్తా.. ముగ్గురికి గాయాలు
గుంటూరు: వేగంగా వెళ్తున్న పోలీస్ జీప్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి రామాపురం వెళ్తున్న పెట్రోలింగ్జీప్ క్రాస్‌రోడ్డు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జీపులో ముందు కూర్చున్న ఏఎస్సై సాంబశివరావుకు తీవ్ర గాయాలవ్వగా.. మరో కానిస్టేబుల్, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు 108 సాయంతో వారిని గుంటూరులోని లలిత ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
పుష్కరాల్లో మరో అపశ్రుతి
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గేదెల్లంక పుష్కరఘాట్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. గేదెల్లంక వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద మరింత మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులు, గాయపడ్డవారు ఐనవిల్లి మండలం సేనపల్లిలంక గ్రామస్తులుగా గుర్తించారు. ట్రాక్టర్‌ను తొలగించేందుకు అధికారులు క్రేన్‌ను తెప్పిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో 18 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి అనంతపురం పట్టణానికి వెళుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించే ఏర్పాటు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి
మహబూబ్‌నగర్: పొలం పనులు చేయడానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంతాండా వద్ద జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్ నాయక్(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌పై పొలం వద్దకు వెళ్తుండగా బోల్తాపడి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీపు బోల్తా..ఇద్దరు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలం కుడియా గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ జీపు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. సుమారు 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. శివర్ల నుంచి దేవరాపల్లి వైపు జీపు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడినట్టు సమాచారం. పది మంది క్షతగాత్రులను 108 వాహనంలో దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు క్షతగాత్రులను కూడా వేరొక వాహనంలో తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లివ్యాను బోల్తా: నలుగురు మృతి
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురుమృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. పెళ్లి వ్యాను బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పందిరిమామిడి నుంచి పెళ్లి వ్యాను రంపచోడవరం వెళ్తుండగా గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాను బోల్తా: ఇద్దరు మృతి
-
వ్యాను బోల్తా: ముగ్గురు మృతి
ప్రకాశం(బేస్తవారిపేట): బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహీంద్ర వాహనంలో విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు, పిల్లలు సోమవారం బయలుదేరి వెళ్లారు. పిల్లలకు కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె వద్ద వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాదారుడు చిలకల కృష్ణా రెడ్డి(26)ని ఢీకొట్టడంతో అక్కడిక్కడిక్కడే మరణించాడు. మహీంద్ర వాహనం పల్టీ కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న సోమశేఖర్, కురుణ రమణలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డికి పెళ్లిచూపులు జరిగిన రెండు రోజులకే.. పందిల్లపల్లెకు చెందిన చిలకల క్రిష్ణారెడ్డికి రెండు రోజుల క్రితమే పెళ్లి చూపులు జరిగాయి. నేడు అక్క, బావలకు చూపించి వివాహం నిశ్చయం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో బెంగుళూరులో ఉన్న అక్క, బావలు బస్‌లో పందిలపల్ల్లెకు వస్తున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు బస్టాండ్‌కు మోటార్ సైకిల్‌పై వచ్చాడు. మోటార్ సైకిల్‌ను రోడ్డు పక్కన పెట్టి నిలబడి ఉండగా జైలో వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు. తండ్రి మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉన్న ఒక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి పద్మావతి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి
మహబూబ్‌నగర్(పాన్‌గల్): పాన్‌గల్ మండలం చిట్యాపల్లి శివారులో ఇసుక ట్రాక్టర్ శనివారం ఉదయం బోల్తా పడింది. ఈ సంఘటనలో శివ రాము(33) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. చిట్యాపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
నల్గొండ(భువనగిరి): భువనగిరి మండల కేంద్రం శివారులో యాదగిరిగుట్ట బైపాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన భువనగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గుండాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఆటో బోల్తా: ఒకరి మృతి
నెల్లూరు: కూలీలను తరలిస్తున్న ఆటో అడవిపందిని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురం దగ్గర గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని చిట్టెడు గ్రామం నుంచి వంజివాత గ్రామానికి కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఆటో చంద్రశేఖరపురం గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అడవిపంది అడ్డువచ్చింది. దీంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న శ్రీనివాసులు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.