కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు.
పామర్రు(కృష్ణా): కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన ఒక పెళ్లి బృందం ట్రాక్టర్‌లో వేమవరంలోని కొండాలమ్మగుడి నుంచి ట్రాక్టర్‌లో బయలుదేరింది.
వారి వాహనం కొరిమెర్ల వద్ద మలుపులో ట్రాక్టర్ లింకు ఊడిపోవటంతో ట్రక్కు బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రక్కులోని 20 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.