మహబూబ్‌నగర్: పొలం పనులు చేయడానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంతాండా వద్ద జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్ నాయక్(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌పై పొలం వద్దకు వెళ్తుండగా బోల్తాపడి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి
Published Sun, Jun 14 2015 10:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM
Advertisement
Advertisement