tractor
-
డ్రైవర్ లేకుండా నడిచిన ట్రాక్టర్
-
ట్రాక్టర్ బోల్తా.. కూలీల దుర్మరణం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముప్పాళ్ల: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్‌పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్యంత బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్ ఇది
చూడటానికి కొంచెం విచిత్రంగా కనిపించే ఈ వాహనం రోబో ట్రాక్టర్ (Robot Tractor). ఇది ఎలాంటి నేలనైనా నిమిషాల్లో ఇట్టే దున్నేస్తుంది. సమతలమైన నేలల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలల మీద కూడా సునాయాసంగా ప్రయాణిస్తుంది.ఈ రోబో ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. జపానీస్ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్ కార్పొరేషన్’ (Kubota Tractor Corporation) ఇటీవల ఈ రోబో ట్రాక్టర్‌ను ‘కుబోటా ఆల్ టెరేన్ రోబో–కేఏటీఆర్’ పేరుతో రూపొందించింది. దీనికి అధునాతన సెన్సర్లు, శక్తిమంతమైన కెమెరా అమర్చడం వల్ల ఇది అవరోధాలను గుర్తించి, తన దిశను ఎంపిక చేసుకోగలదు.ఇది డీజిల్తోను, బ్యాటరీతోను కూడా పనిచేయగలదు. ఈ ట్రాక్టర్ సునాయాసంగా 130 కిలోల బరువును కూడా మోసుకురాగలదు. చిన్న చిన్న పొలాల్లో వాడటానికి అనువుగా తీర్చిదిద్దిన ఈ ట్రాక్టర్‌కు సీఈఎస్-2024 (CES-2024) ప్రదర్శనలో సందర్శకుల ప్రశంసలు లభించాయి. -
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఐదుగురు మృతి
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 45 మంది గాయపడ్దారు. పండరీపూర్‌కు వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో బస్సు, ట్రాక్టర్ రెండూ అదుపు తప్పి కాలువలో పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పరుగుపరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబై పోలీస్ డీసీపీ వివేక్ పన్సారే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. #WATCH | DCP Navi Mumbai, Vivek Pansare says, "The people were going to Pandharpur through a private bus on the occasion of Asadhi Ekadashi. The bus collided with a tractor and fell into a ditch. 42 people, who were injured have been shifted to MGM Hospital, while 3 have been… https://t.co/nIaIt4kgrM pic.twitter.com/BOIAvHkSJE— ANI (@ANI) July 15, 2024 -
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
రాఘవ లారెన్స్ బాటలో మరో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులు, రైతు కూలీలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు త్రీవీలర్ వాహనాలు అందజేసిన ఆయన.. ఇటీవల పది మంది పేద రైతు కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్స్ అందించారు.రాఘవ లారెన్స్ సేవలు చూసిన మరో హీరో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కలిసి నటించిన ఎస్జే సూర్య తన వంతు సాయం చేశారు. తన సొంత డబ్బులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి 11వ ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్జే సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hi Friends and fans, You are all aware that I handed over 10 Tractors to Farmers through the Maatram Foundation with my own money. Today @iam_SJSuryah Brother gave me a pleasant surprise by adding another Tractor with his own money. Together, We handed over the 11th Tractor to… pic.twitter.com/Bwe6sjyET5— Raghava Lawrence (@offl_Lawrence) June 18, 2024 -
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను తానే స్వయంగా అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #serviceisgod DAY TWO JOURNEY! I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024 -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపేశారు.ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్ ఎస్సై మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రసాద్ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్ ఓనర్, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్ ఓనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ ఓనర్ కోసం గాలిస్తున్నారు.ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రన్ చిత్రాలతో అలరించారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సాయంగా మాత్రం ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు. పేదల కోసం ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మన కోలీవుడ్ స్టార్.తాజాగా మరో పది పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచారు లారెన్స్. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పది ట్రాక్టర్లు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ తన ట్విటర్లో పంచుకున్నారు.రాఘవ తన ట్విటర్లో రాస్తూ..' స్నేహితులు అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్మీట్లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!' అంటూ పోస్ట్ చేశారు. Hi friends and fans! I am excited to announce that Maatram's service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024 -
రూ.68 వేల కోట్ల కంపెనీకి గుడ్ బై: మల్లికా శ్రీనివాసన్ సక్సెస్ స్టోరీ
అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల మాత్రమేకాదు, ఎంత పెద్ద రిస్కే అయినా చేసే సాహసం ఉండాలి. ? సక్సెస్ సాధిస్తామా లేదా అనే భయాలు ఒక ప్రయాణ ప్రారంభంలో చాలా ఉంటాయి. కానీ తప్పదు. విజయతీరాలను అందుకోవాలి అంటే సాహసం చేయాలి. అలా దృఢ సంకల్పంతో "ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా" గా పేరు సంపాదించుకున్న సాహసి గాథ మీకోసం.. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్.కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోకి దూకి చాలా పెద్ద సాహసమే చేశారు. ఆమె పట్టుదల ఆత్మ విశ్వాసం అలాంటిది మరి. రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా ఎదిగారు. మహిళలు కూడా సమర్ధులని ఏ రంగంలోలోనై సత్తాచాటగలరని ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా పారిశ్రామికవేత్త, షీరో మల్లికా శ్రీనివాసన్. 1959లో జన్మించిన మల్లికా శ్రీనివాసన్ మద్రాస్ యూనివర్సిటీ డిగ్రీని, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత అమెరికా నుంచి తిరిగొచ్చి 1986లో కుటుంబ వ్యాపారంలో చేరారు. ఈ కంపెనీని చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన , దివంగత, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త S అనంతరామకృష్ణన్ 1960లో చెన్నైలోప్రారంభించారు. వ్యాపారంలో అడుగు పెట్టింది మొదలు తన కృషి సాహసోపేతమైన నిర్ణయాలతో కంపెనీని బహుళ-మిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చింది. రైతులు ఆకాంక్షల్ని, ట్రెండ్లను గుర్తించి దానికనుగుణంగా సంబంధిత ఉత్పత్తు లుండేలా చూసుకున్నారు. మధ్యతరగతి, వ్యవసాయ ప్రజల కోసం తన చౌకైన ట్రాక్టర్లను అందించడం మొదలు పెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు, అక్కడ టీ షాపుల వద్ద ఆగి, వ్యవసాయ పద్ధతులు, సమస్యలు, తెలుసుకోవడం, ఎలాంటి పరిష్కారాలు కావానుకుంటున్నారో అడిగి తెలుసుకునేవారట. అయితే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మల్లిక పట్టుదలతో ముందుకు సాగారు. సహేతుకమైన ధరలతో వృద్ధిని కొనసాగించారు. చివరికి మహీంద్రా & మహీంద్రా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా కంపెనీని నిలబెట్టారు. 1961లో కేవలం ఒక ట్రాక్టర్ మోడల్‌తోన కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు. ఆమె టర్కీలో ఒక కర్మాగారాన్ని కూడా స్థాపించారు. వ్యాపారం రంగంలో ఆమెచేసిన సేవలకు గుర్తింపుగా 2014లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మల్లికా భర్త ఇండియన్ బిలియనీర్ వేణు శ్రీనివాసన్ టీవీఎస్‌మెటార్ సీఎండీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మల్లికా శ్రీనివాసన్ AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్, అలాగే చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), ఎగ్జిక్యూటివ్ బోర్డు బోర్డులలో కూడా ఉన్నారు. మల్లికా స్విగ్గీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. స్విగ్గీ నెట్‌వర్త్ రూ.68918 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం రూ. 23,625.96 కోట్ల నికర విలువతో 83వ సంపన్న భారతీయురాలిగా నిలిచింది.ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు, ఫోర్బ్స్ ఆసియా టాప్ 50 ఆసియన్ పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా నిలిచారు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకుఎప్పటికీ తలొగ్గకూడదని ఆమె చెబుతారు.ఎల్లప్పుడూ అవకాశాల కోసం వెతుకుతూనే ఉండాలంటారు. అంతేకాదు చేసే పనిని ప్రేమించడమే తన సక్సెస్ మంత్రా అంటారు మల్లికా శ్రీనివాసన్. డౌన్ టు ఎర్త్‌గా ఉండే ఆమె వ్యక్తిత్వం, వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఎందరో అమ్మాయిలకు నిజమైన ప్రేరణ. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
Crime: పొలాల్లో మాయం.. OLXలో ప్రత్యక్షం!
హైదరాబాద్, సాక్షి: పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు. ఆపై సెకండ్ హ్యాండ్ కింద ఆన్లైన్లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్ఎక్స్ తరహా ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో.. మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్ 31న ట్రాక్టర్ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. -
అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. -
ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్ మహీంద్ర: ట్వీట్ వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకమైన, వినూత్న వాహనాలు అంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు రకాల వెహికల్స్ గురించి ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ ఉంటారు. అధునాతన టెక్నాలజీ, ఇంజనీరింగ్, వింటేజ్ ఇలా అనేక రకాల వాహనాల వీడియోలు, చిత్రాలను పంచు కోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఒక విచిత్రమైన వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆసక్తికరంగా ఉంది.. కానీ ఇలా ఎందుకు? అంటూ ఒక క్వశ్చన్‌మార్క్ వదిలేరు. ఇంకేముంది ఫ్యాన్స్ ఫన్నీ..ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోలో సాధారణ ట్రాక్టర్‌లా కుండా, ట్రాక్టర్లో సీటు ప్లేస్మెంట్ వెరైటీగా చాలా ఎత్తులో ఉంచారు. సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను నడుపుతూ కనిపిస్తాడు. సీటు ఎడ్జస్ట్మెంట్ కూడా కనిపిస్తోంది. కానీ ఈ సర్దుబాటు వెనుక ఉద్దేశ్యం మాత్రం అస్పష్టం. దీని పైనే మహీంద్ర ఆరా తీసారు తన ట్వీట్లో. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడనుకుంటా..అందుకే అక్కడ కూర్చున్నాడని ఒకరు, ట్రాఫిక్ గురించి ముందుగానే తెలుసుకుందామని కొందరు వ్యాఖ్యానించారు. JCB ఆపరేటర్ ట్రాక్టర్ యజమాని లేదా డ్రైవర్ అయితే ఇలానే ఉంటుందని మరొకరు కమెంట్ చేశారు. కాదు. కాదు.. అతను ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలనుకుంటున్నాడేమో అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. Interesting. But I have only one question: WHY? pic.twitter.com/Iee9NZC48E — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ట్రాక్టర్ స్టంట్స్‌లో యువకుడి మృతి.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. "ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్‌ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్‌లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి -
క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి
చంఢీగర్: పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. Video | Man Crushed To Death Performing Tractor Stunt During Punjab Sports Fair Read here➡️https://t.co/TZIq7d6bvw pic.twitter.com/V2z6beZzey — NDTV (@ndtv) October 29, 2023 ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
భూవివాదంలో ఘోరానికి పాల్పడ్డ అన్న
క్రైమ్: అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘోరానికి దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘోరం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ అన్నదమ్ములు. చాలా కాలంగా భరత్‌పూర్‌లోని ఉన్న కాస్త భూమి కోసం కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్ కుటుంబం వివాదాస్పద స్థలంలోకి ట్రాక్టర్‌తో వచ్చింది. ఆ విషయం తెలిసి కాసేపటికే అతర్ సింగ్ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు కుటుంబాలు కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో అతార్ సింగ్ కొడుకు నిర్పత్ కిందపడిపోగా.. అది గమనించిన బహదూర్ కొడుకు దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్ మీదుగా పోనిచ్చాడు. నిర్పత్ వరుసకు దామోదర్‌కు తమ్ముడు అవుతాడు. తమ్ముడిని ఏం చేయొద్దని అక్కడున్న కుటుంబ సభ్యులు బతిమాలుతున్నా.. దామోదర్ వెనక్కి తగ్గలేదు. నిర్పత్ మీద నుంచి ముందుకు వెనక్కి ట్రాక్టర్‌ను ఎక్కించి తొక్కించాడు. చనిపోయాడని నిర్ధారించుకునేదాకా దామోదర్ ఆ ఘోరాన్ని ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. వీడియో కోసం క్లిక్ చేయండి ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయని.. ఆ ఘర్షణలో బహదూర్ సింగ్, ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనకు సంబంధించి అతర్ సింగ్ తో పాటు నిర్పత్‌పైనా కేసు నమోదు అయ్యింది. తుపాకీ మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఈ ఘటన రాజకీయ విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రియాంక గాంధీని ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. -
ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్
ఢిల్లీ: జీ20 సదస్సుకు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దాదాపు లక్ష మంది పోలీసులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. అవసరమైన ప్రాంతాలలో చెకింగ్ ఏర్పాట్లు చేశారు. నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | In view of the upcoming G20 Summit, Delhi Police is patrolling the Raj Ghat area with the help of a tractor. pic.twitter.com/lJo0Wevrvs — ANI (@ANI) September 7, 2023 వీడియోలో యమునా నది దృశ్యాలు కనిపిస్తున్నాయి. మట్టి రహదారిలో పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రపంచ స్థాయి నేతలు ఢిల్లీకి రానున్నందున పోలీసులు ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుంటా చెకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. సమావేశం నిర్వహించనున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నందున యమునా ఖాదర్ ప్రాంతంలో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఈరోజు టియర్ గ్యాస్ ప్రాక్టీస్ కూడా చేశాం' అని షహద్రా డీసీపీ ఇన్ఛార్జ్ హర్ష్ ఇండోరా తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. ఎవరెవరికి బస ఎక్కడంటే..? -
రివర్స్ గేర్‌లో 75 కి.మీ.లు
కర్ణాటక: ట్రాక్టర్‌ను రివర్స్‌లో నడుపుతూ ఓ యువకుడు తమ ఇలవేల్పు యల్లమ్మ దేవికి మొక్కుబడి తీర్చుకున్నాడు. హుబ్లీ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన బాబుగౌడ(22) అనే ఈ భక్తుడు గత కొన్నేళ్లుగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. అయితే రివర్స్ గేర్‌లో ఇలా 75 కి.మీ. వెళ్లడం ఇదే మొదటిసారి అని, కోర్కె తీరడంతో మొక్కు తీర్చానన్నాడు. ఆ మేరకు ఉదయం 6.15 గంటలకు మంటూరు వలంబేశ్వర దేవస్థానం నుంచి రివర్స్ గేర్‌లో బయల్దేరాడు. కుసుగల్, బ్యాహట్టి, తిర్లాపుర, అళగవాడి, హంచనాళ, తిక్కుంబి, హిరేకుంబి, ఉగరగోళ, సౌదత్తికి వెళ్లి అక్కడి నుంచి యల్లమ్మన గుడ్డను మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకొన్నాడు. మొత్తం 75 కి.మీ.ల దూరాన్ని 7.30 గంటల్లో ప్రయాణించాడు. -
మద్యం తాగి.. పలుమార్లు రైతు పైనుంచి ట్రాక్టర్ని.. ఘోర విషాదం..
పెద్దపల్లి: మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ రైతును బలితీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబారిపేటకు చెందిన ముడిమడుగుల పోచయ్య(50) తన వ్యవసాయ పొలం దున్నడానికి మంగళవారం అదే గ్రామానికి చెందిన జాడి బానయ్యను పిలిచాడు. అతను అతిగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. వెనక ఉన్న పోచయ్యను గమనించకుండా వేగంగా నడపడంతో ట్రాక్టర్ అతన్ని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ సంఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న బానయ్య పలుమార్లు ట్రాక్టర్‌ను మృతదేహం పైనుంచి తిప్పడంతో నుజ్జునుజ్జయి, తల, మొండెం, కాళ్లు, చేతులు వేటికవే పూర్తిగా తెగిపోయాయి. పొలం దున్నడం పూర్తయిన తర్వాత పోచయ్య కనిపించడం లేదని అతని కుమారుడు సతీశ్‌కు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి సమయంలో పొలంలో వెతకగా రక్తం, పోచయ్య శరీర భాగాలు కొద్దిగా కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బుధవారం పొలంలో పూర్తిగా తెగిపడిన మృతుడి శరీర భాగాలను బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి, ట్రాక్టర్ నడిపి, పోచయ్య మృతికి కారణమైన బానయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
బైకుకు ట్రాక్టర్ టైర్
-
ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. ఏకంగా కాలేజ్‌కి
చెన్నై: ఇంటర్నెట్ గ్రామాలకు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా నెట్టింట ఒక్క వీడియో చాలు.. సామాన్యులు సెలబ్రిటీలుగా మారిని ఘటనలు బోలెడు ఉన్నాయి. వీడియోలతో లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. దీంతో యూజర్లు కొందరు కంటెంట్ క్రియేటర్లుగా మారుతూ.. వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ప్రస్తుతం యువత చేసే పనులు కొన్ని పనులు సాధారణంగా నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా విద్యార్థులు నడిచి లేదా బైక్, సైకిల్,లేదా కారు ఇలా వాళ్లకు అందుబాటులో ఉన్న వాహనాలపై కళాశాలకు వస్తుంటారు. అయితే నల్లూరులోని జయరాజ్ అన్నపాకియం కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి మాత్రం కాలేజ్‌కి ఏకంగా ట్రాక్టర్ తీసుకువచ్చాడు. కళాశాల పూర్తయిన అనంతరం ఆ స్టూడెంట్ ట్రాక్టర్ తోలుకుంటూ వెళ్లగా దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వీడియో చూసిన నెటిజెన్లు ”ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు”, “ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఎలెవషన్స్ ఇచ్చావ్ చూడు తమ్ముడు నువ్వు తోపు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Tractor esuku vacchesav entra😂😝😜 pic.twitter.com/4KIQxz7P1x — Poley_Adiripoley (@poleyadiripoley) August 3, 2023 -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్‌సేల్‌గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్‌రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
చరిత్రలోనే తొలిసారి.. అమ్మకాల్లో సోనాలికా సరికొత్త రికార్డ్‌లు
హైదరాబాద్: భారత్ నెంబర్ 1 ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ బ్రాండ్ సోనాలికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)లో రికార్డు స్థాయిలో 40,700 ట్రాక్టర్ల అమ్మకాలు జరిపింది. సోనాలికా వ్యాపార చరిత్రలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరపడం ఇదే తొలిసారి. మార్కెట్ షేర్లో కూడా సంస్థ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే తరహా రికార్డు విక్రయాలు మున్ముందు త్రైమాసికాల్లో కూడా కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. వ్యవసాయం–పర్యావరణ వ్యవస్థల మధ్య సమతౌల్యత సాధిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్లు అలాగే ఇతర సరసమైన వ్యవసాయ ఉత్పాదకతలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (సోనాలికా అండ్ సోలిస్)జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. రైతులను మరింత ఉత్పాదకత దిశగా నడిపించడానికి, ప్రగతిశీల బాటలో వారిని సంపన్నులుగా మార్చడానికి సంస్థ తన వంతు కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఇసుకాసురులు.. భారీగా ఇసుక అక్రమ రవాణా
వనపర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ అధికారులు ఇరవై రోజులుగా బిజీగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉదయమంతా కృష్ణానది నుంచి ఇసుకను తోడి రాంపూర్, రంగాపూర్ శివారులోని పొలాల్లో నిల్వ చేయటం, అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తెర వెనుక ఉంటూ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలో ఎంత తవ్వినా.. ఎగువ నుంచి వరద వస్తే మట్టి, ఇసుక కొట్టుకొస్తుండటంతో గుంతలన్నీ మూసుకుపోతాయి. దీంతో ఏటా వేసవిలో ఈ ప్రాంతాల నుంచి భారీగా ఇసుకను తోడుతూ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి చర్యలేనా? గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసినా.. ఏనాడు ప్రభుత్వం వేలం వేయలేదు. తూతూమంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేయటం, తర్వాత వదిలేయటంతో అక్రమార్కులు సైతం ఇందుకు అలవాటు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు రాయించుకోవటం మినహా చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇసుక నిల్వలు సీజ్.. రంగాపూర్ శివారులోని ఇసుక డంప్‌లను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మావతి మంగళవారం రంగాపూర్, రాంపూర్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మూడు భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తంగా ఇటీవల అధికారులు సీజ్ చేసిన ఇసుక సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కలిసొచ్చిన పుష్కర రోడ్లు.. కృష్ణా పుష్కారాల సమయంలో నిర్మించిన రోడ్లు అక్రమార్కులకు కలిసొచ్చిన అంశంగా చెప్పువచ్చు. ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లు వాహనాలు (జేసీబీ, ట్రాక్టర్లు) నేరుగా నది వరకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. పెబ్బేరు మండలం రాంపూర్ శివారు నుంచి గద్వాల జిల్లా గుర్రంగడ్డ ప్రాంతానికి వంతెన నిర్మాణానికి గుర్తించిన ప్రాంతం నుంచి జేసీబీ సాయంతో నదిలో పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దందాకు సహకరిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది జోక్యం చేసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలరోజులుగా విచ్ఛలవిడిగా ఇసుక రవాణా పెబ్బేరు మండలంలోని కృష్ణానది కేంద్రంగా సాగుతూ.. ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. మంగళవారం నాలుగు ఇసుక డంప్‌లతో పాటు ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. – పద్మావతి, ఆర్డీఓ, వనపర్తి -
వెంటపడిన కుక్కలు.. ట్రాక్టర్ కిందపడి విద్యార్థి దుర్మరణం
కమలాపూర్: వీధి కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్–స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్ తోట విజయేందర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్ తండ్రి జయపాల్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి ధనుష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో
మహీంద్రా పాపులర్ వెహికల్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా థార్. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, డిజైన్, రగ్గడ్ లుక్స్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టయిల్ ఎస్‌యూవీగా పేరొందింది.అయితే థార్‌కు సంబంధించిన ఒకవీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) థార్ ఢీకొనడం వల్ల ట్రాక్టర్‌ను రెండు భాగాలుగా విడిపోవడం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. యూట్యూబర్ ప్రతీక్ సింగ్ తన ఛానెల్లో షేర్ చేసిన వీడియో ప్రకారంప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోవడం, అలాగే రోడ్డు పక్కన దెబ్బతిన్న మహీంద్రా థార్ ఎస్యూవీ కనిపిస్తుంది. గుజరాత్‌లోని ఉనా-భావనగర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది అస్పష్టం. అయితే ట్రాక్టర్ డ్రైవర్ యు-టర్న్ తప్పించుకోవడానికి రాంగ్ సైడ్ నుండి రావడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఈ వార్తపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.! (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) -
అత్యంత విచిత్రంగా తృటిలో తప్పిన రైలు ప్రమాదం
జార్ఖండ్‌లోని బొకారోలో డ్రైవర్ సమయస్ఫూర్తి కారణగా రైలు ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం బొకారోలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక ట్రాక్టర్ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో అటువైపుగా న్యూఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. అయితే రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. డీఆర్ఎస్ మనీష్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బొకారో జిల్లాలోని భోజూడీహ్ రైల్వే స్టేషన్ పరిధిలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు మూసుకుపోవడంతో ఒక ట్రాక్టర్ మధ్యలో చిక్కుకుపోయింది. అదేసమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్(22812) అటుగా వస్తోంది. ఆ ట్రాక్టర్‌ను గమనించిన రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 45 నిముషాలు ఆగిపోయింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతోపాటు గేట్ మ్యాన్‌ను విధుల నుంచి తొలగించారు. కాగా జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. చదవండి: రైలు నుండి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు -
కరీంనగర్: రైతు మీద నుంచి ధాన్యం లోడ్ ట్రాక్టర్ వెళ్లి..
సాక్షి, కరీంనగర్: తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతు మీద నుంచి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ వెళ్లింది. దీంతో రైతు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన రైతును 60 ఏళ్ల వయసున్న ఉప్పులేటి మొండయ్యగా గుర్తించారు. ఐకేపీ సెంటర్‌కు చేరుకున్న మొండయ్య.. వర్షానికి ధాన్యం తడవకుండా ఉండే కవర్‌ను కప్పుకుని పడుకున్నాడు. ఈ క్రమంలో అది గమనించని ట్రాక్టర్ డ్రైవర్.. అటుగా పోనివ్వడంతో మొండయ్య స్పాట్లోనే కన్నుమూశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ హవా.. డ్రైవర్ లేని రోబో ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్!
అమెరికన్ ట్రాక్టర్ల తయారీ సంస్థ ‘జాన్ డీరె’ ఇటీవల ఎరువులు చల్లే రోబో ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘ఎగ్జాక్ట్ షాట్’ పేరుతో రూపొందించిన ఎలక్ట్రిక్ రోబో ట్రాక్టర్, నేలను బట్టి ఎక్కడ ఎంత ఎరువు అవసరమో, కచ్చితంగా అంత ఎరువు మాత్రమే చల్లుతుంది. ఇందులోని అధునాతనమైన సెన్సర్లు భూసారాన్ని గుర్తించి, నేలలోని లోపాలను బట్టి ఎక్కడ ఎంత మోతాదులో ఏ ఎరువు అవసరమో అంత మేరకు మాత్రమే ఎరువును చల్లుతాయి. దీనివల్ల భూసారంలోని సమతుల్యతకు అవరోధాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎరువుల అధిక మోతాదు కారణంగా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఇది ఎరువుల వృథాను గణనీయంగా అరికట్టగలదని నిపుణులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం దీనివల్ల అమెరికాలో ఏటా వేసే మొక్కజొన్న పంట సాగులోనే ఎరువుల్లో 9.3 కోట్ల గ్యాలన్ల పరిమాణంలోని ఎరువులు ఆదా కాగలవని, మిగిలిన పంటలను కలుపుకొంటే ఎరువుల వ్యయం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇది వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించగలదని అంటున్నారు. -
ట్రాక్టర్, వ్యాను ఢీ.. చెలరేగిన మంటలు.. 26 మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు. చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో.. -
పెళ్లింట విషాదం: అదుపు తప్పిన ట్రాక్టర్, 30 అడుగుల లోయలో పడటంతో
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి బోడపుట్ ఘాటీలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోడపొదర్ పంచాయతీకి చెందిన 15మంది గాజులమమ్ముడి పంచాయతీ తంట్లగూడ గ్రామంలో జరుగుతున్న వివాహానికి బుధవారం ఉదయం ట్రాక్టర్‌పై వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో ఖరిమాల్ సమీపం బోడపుట్ ఘాటీలో వాహనం అదుపు తప్పి, 30అడుగుల లోయలోకి బోల్తా పడింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే అక్కడికి చేరుకొని, లోయలో పడి ఉన్న వారిని బయటకు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడగా చిత్రకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సమయానికి ఓ వ్యక్తి మృతిచెందారు. గురువారం ఉదయం 9గంటల సమయంలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి సహా ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందిచి గాయాలుకాగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చిత్రకొండ ఎమ్మెల్యే పూర్ణచంద్ర బక్క ఆరోగ్య కేంద్రానికి చేరుకొని, క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిచేందుకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
ట్రాక్టర్ టెంపో ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల తోసహా నలుగురు మృతి. ఈ ఘటన రాజస్తాన్‌లో అల్వార్‌లోని కథూమర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అక్రమ తవ్వకాలతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరే కారణమంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు రహదారులను దిగ్బంధించి..సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గ్రామస్తులు రాళ్లు రువ్వారు. ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరికి పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. తదనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: గుడ్‌న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు, నల్లగొండలో వందేభారత్‌కు హాల్ట్!) -
నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్
అమెరికన్ టెక్నాలజీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ త్వరలోనే పూర్తిస్థాయి సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేనుంది. విద్యుత్తుతో పనిచేసే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్‌ను ‘మోనార్క్ ట్రాక్టర్’ పేరుతో రూపొందిస్తోంది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్ పూర్తిగా విద్యుత్ వాహనం. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి పది గంటలు పడుతుంది. దీని మోటార్ 70 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎంతటి పొలాన్నయినా ఇది సునాయాసంగా దున్నేస్తుంది. అంతేకాదు, దీనికి హార్వెస్టర్స్, సెపరేటర్స్ వంటి గాడ్జెట్స్‌ను కూడా అమర్చుకోవచ్చు. వాటితో పంట కోతలు, కలుపు ఏరివేత పనులు కూడా ఈ ట్రాక్టర్ తేలికగా చేయగలదు. ‘ఫాక్స్‌కాన్’ దీని ధరను ఇంకా ప్రకటించలేదు గాని, భారీగానే ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
బాప్రే! ఎత్తు ఎక్కాలంటే.. రిస్క్ చేయాలంతే!
-
డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత..
ఏదో మిరాకిల్ లేక ఏదైనా దెయ్యమా! తెలియదుగానీ ఒక్కసారిగా ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయ్యింది. అదీకూడా పట్టపగలే అలా జరగడంతో.. ఒక్కసారిగా అక్కడున్న వారికెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ భయానక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..బిజ్నోర్‌లోని చెప్పులకు సంబంధించిన చైనా షాపు ఉంది దానికి సమీపంలో ఓ టాక్టర్ పార్క్ చేసి ఉంది. ఏమైందో ఏమో! హఠాత్తుగా ఆ ట్రాక్టర్ దానికదే స్టార్ట్్ అయ్యి ఆ చెప్పుల షాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆ షాప్‌లోని ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ..బయటకు వచ్చేశారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రాక్టర్ ఇంజన్ని ఆపి పెద్ద మొత్తంలో షాప్‌కి డ్యామేజ్ జరగకుండా కాపాడాడు. ఈ ఘటనలో ఆ షాపు అద్ధం మొత్తం పగిలిపోయి కొద్ది మొత్తంలో ఆ షాపు ఓనర్‌కి మాత్రం నష్టం వాటిల్లింది. దీంతో ఆ షాపు ఓనర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ ట్రాక్టర్ యజమానిపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఐతే స్థానికుల సమాచారం ప్రకారం..రాబోయే హోలీ పండుగ కోసం పోలీసులు బిజ్నోర్ పోలీస్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆ ట్రాక్టర్ యజమాని కిషన్ కుమార్ కూడా పాల్గొన్నారు. అతను తన ట్రాక్టర్ని ఈ చైనా చెప్పుల దుకాణం వద్ద పార్క్ చేశాడు. సుమారు గంట తర్వాత ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతటే అదే స్టార్ట్ అయ్యి చెప్పుల దుకాణంలోకి వచ్చేయడంతో..ఆషాపు అద్దం మొత్త పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో.. ఈ వింత ఘటన అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. #Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE — Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023 (చదవండి: ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!) -
ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రైతు అవతారంలో తళుక్కుమన్నాడు. ధోని ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్‌గా, ఆర్మీ మేజర్‌గా, ఇటీవలే పోలీస్ ఆఫీసర్‌గా విభిన్న అవతారాల్లో కనిపించిన ధోనిని ఇలా రైతు లుక్‌లో చూడడం అభిమానులకు పులకింతలు పెట్టింది. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ధోని.. ''కొత్తది నేర్చుకోవడం బాగుంది.. అయితే పని పూర్తి చేయడానికి మాత్రం చాలా సమయం పట్టింది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఎంఎస్ ధోనికి గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా..రైతుగా మారుతాడు. ఇప్పటికే ధోని కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ ప్రాక్టీస్‌లో భాగంగా రాంచీ స్టేడియానికి బైక్‌పై వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తాజాగా రైతు లుక్‌లో అభిమానులను అలరించాడు. ఇక 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని.. ఆ తర్వాత ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తనకు తానుగా తప్పుకున్నాడు. ఆ తర్వాత జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి ఒత్తిడిని తట్టుకోలేక జడ్డూ సీజన్ మధ్యలోనే వదిలేశాడు. దీంతో ధోనినే మరోసారి దిక్కయ్యాడు. ఇక 2023 ఐపీఎల్ కోసం ధోని సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చూసుకుంటే ధోని అన్ని ఫార్మాట్లు కలిపి 538 మ్యాచ్‌లు ఆడాడు. 44.96 సగటుతో 21,834 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్థసెంచరీలు చేశాడు. View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) చదవండి: జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది 'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్ మాజీ క్రికెటర్‌కు చురకలు -
ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న ధోని.. ఫోటోలు వైరల్
-
సూపర్ ట్రాక్టర్.. ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే!
గోమయమే ఇంధనంగా నడిచే ఈ ట్రాక్టర్‌ను ఇటాలియన్ కంపెనీ ‘న్యూహాలండ్’ కంపెనీ భాగస్వామ్యంతో ‘బెన్నామాన్’ అనే బ్రిటిష్ కంపెనీ రూపొందించింది. ఆవుపేడ నుంచి వచ్చే మీథేన్ గ్యాస్‌ను మైనస్ 162 డ్రిగీల ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించుకునేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించారు. వంద ఆవుల మంద నుంచి సేకరించిన పేడ నుంచి వచ్చే మీథేన్ ఈ ట్రాక్టర్‌కు ఏడాది పొడవునా ఇంధనంగా సరిపోతుంది. గోమయం నుంచి సేకరించిన మీథేన్‌తో నడిచే వాహనాల్లో ఇదే ప్రపంచంలో మొట్టమొదటిదని బెన్నామాన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు క్రిస్ మాన్ చెబుతున్నారు. ఇది సాధారణ డీజిల్ ట్రాక్టర్లకు దీటుగా పనిచేస్తుందని, డీజిల్ ట్రాక్టర్లతో పోల్చుకుంటే, దీని నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏడాదికి 2500–500 టన్నులు తక్కువేనని ఆయన వెల్లడించారు. అమెరికాలో గత డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ట్రాక్టర్ పనితీరును ప్రదర్శించారు. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర! నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు -
ఇసుక మాఫియా బరితెగింపు
బషీరాబాద్: ఇసుక మాఫియా బరితెగించింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్‌పై ట్రాక్టర్ ఎక్కించడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలతో తాండూరు డీఎస్పీ శేకర్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.శంకర్, హోంగార్డు శివరాం రాత్రి బ్లూ కోట్ విధుల్లో భాగంగా ఇందర్‌చెడ్ గ్రామంలో ఉన్నారు. ఈ సమయంలో ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్‌ను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బైక్ పైకి తీసువెళ్లాడు. ట్రాక్టర్ కింద పడిన కానిస్టేబుల్ శంకర్‌పై నుంచి ఇసుక ట్రాక్టర్ చక్రాలు వెళ్లాయి. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్‌ను వేగంగా తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఇసుక మాఫియా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ట్రాక్టర్‌తో ఢీ కొట్టిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా అయ్యాళం గ్రామానికి చెందిన భీమారాయగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిందని డీఎస్పీ తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన శంకర్‌కు తాండూరులో ప్రథమ చికిత్స చేయించి, మె రుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విరిగిన కాళ్లకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగని ఇసుక మాఫియా.. బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా ఆగడా లు పెచ్చుమీరాయి. ఐదేళ్లుగా క్యాద్గిరా, నవాంద్గి, గంగ్వార్, ఇందర్‌చెడ్ గ్రామాల వద్ద కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందన్న ఆ రోపణలున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’పలు మా ర్లు కథనాలు సైతం ప్రచురించింది. పోలీసు, రెవె న్యూ, భూగర్భశాఖ అధికారులు నిర్లక్ష్యంతోనే ఇసు క మాఫియా రెచ్చిపోతోందనే వాదనలున్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్.. వామ్మె అంత స్పీడ్!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్ ఇది. భారీ వాహనాల తయారీ సంస్థ జేసీబీ దీనిని రూపొందించింది. ఎంతటి అధునాతనమైన ట్రాక్టర్లయినా వాటి గరిష్ఠ వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జేసీబీ తాజాగా రూపొందించిన ఐదు టన్నుల ఈ భారీ ట్రాక్టర్ గరిష్ఠవేగం గంటకు 247 కిలోమీటర్లు. ఆరు సిలిండర్ల డీజిల్మ్యాక్స్ ఇంజన్‌తో తయారు చేసిన ఈ వాహనం అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రాక్టర్‌గా గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. జేసీబీ ఇదివరకు రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ట్రాక్టర్ గరిష్ఠంగా 217.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ట్రాక్టర్ పనితీరును బ్రిటన్‌లోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. దీని సాంకేతికతలో మార్పులు చేసి కొత్తగా రూపొందించిన ట్రాక్టర్ ఏకంగా 247 కిలోమీటర్ల వేగం అందుకోవడం ఆనందంగా ఉందని జేసీబీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ టిమ్ బమ్హోప్ తెలిపారు. శరవేగంగా పరుగులు తీసే ఇలా ట్రాక్టర్లు సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో పనులను వేగంగా చేయడానికి ఉపకరిస్తాయని, సాంకేతికంగా మరిన్ని మెరుగులు చేసిన తర్వాత దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నామని బమ్హోమ్ తెలిపారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
వనపర్తి: చెరుకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు
-
అర్ధరాత్రి ఘోర ప్రమాదం
కొత్తకోట: అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెరకు లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గరుడ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాడ్ల ఆంజనేయులు (42), క్లీనర్ తుప్పతూర్తి సందీప్‌యాదవ్ (19), వడ్డె శివన్న(47) అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. కాగా, ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీగా నిలిచిన ట్రాఫిక్ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటలపాటు వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. భారీ క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతుల్లో బస్సుడ్రైవర్ ఆంజనేయులుది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కాగా.. క్లీనర్ సందీ‹ప్‌యాదవ్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవేడు వాసి. ప్రయాణికుడు శివన్నది ఏపీలోని అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం వెంకటంపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు, క్లీనర్ సందీప్ మృతిచెందడంతో హైదరాబాద్‌లోని మియాపూర్ డిపో సిబ్బంది వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: అద్దె బస్సులు కొంటాం! -
సూర్యాపేట : మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
-
వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా దూసుకుపోతుంది!
డ్రైవర్ లేకపోయినా ఫర్వాలేదు. ఎలాంటి పొలాన్నయినా ఇట్టే దున్నిపారేస్తుంది ఈ ట్రాక్టర్. డ్రైవర్‌లేని ట్యాక్సీలు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వాడుకలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫాక్స్‌కాన్’ తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘మోనార్క్ ట్రాక్టర్’ సంస్థతో కలసి ‘ఫాక్స్‌కాన్’ పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ డ్రైవర్‌లెస్ ట్యాక్సీని అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా తయారు చేసింది. దీనిని ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా పదిగంటలు పనిచేస్తుంది. ఈ ట్రాక్టర్‌కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 70 హార్స్పవర్ సామర్థ్యంతో ఎలాంటి పొలంలోనైనా ఇట్టే పనిచేయగలుగుతుంది. దీని పనితీరుపై ‘ఫాక్స్‌కాన్’ పరీక్షలు జరుపుతోంది. త్వరలోనే దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్! -
మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది. జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం. 22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది? మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది. జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది. ‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు. మంజు జంకలేదు ‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా? ఎందుకు? ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు. వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం. ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా. ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. – మంజూ ఉరవ్ -
ములుగు జిల్లా: ముత్తారం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్
-
రాజన్న సిరిసిల్ల: ట్రాక్టర్ హత్య.. పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. భూవివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట గొడవకు దిగారు. దీంతో రుద్రంగి పోలీస్‌స్టేషన్ హైటెన్షన్ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని నేవూరి నరసయ్య (42 ) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే బైక్‌పై వెళ్తున్న నరసయ్యను.. కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో కావాలనే ఢీకొట్టి హతమార్చాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం ఉందని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక హత్య అనంతరం నిందితుడు రుద్రంగి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు మృతుడి బంధువులు. తన భర్తను అన్యాయంగా చంపేశారంటూ పీఎస్ ముందు మృతుడి భార్య బైఠాయించింది. తన తాళి కూడా తీసుకొండంటూ సీఐకి చూపించిందామె. ఈ క్రమంలో బంధువులు పీఎస్‌లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నరసయ్య బంధవులు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో.. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు ఉన్నతాధికారులు. -
సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి: మంత్రి రోజా
-
ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్
-
కొత్త ట్రెండ్!...అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చాలా చాలా వైరైటీగా జరుగుతున్నాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టించి మరీ విన్నూతన రీతిలో పెళ్లి చేసుకుంటున్నారు. కొత్తదనం కోసం విచిత్రమైన వేషధారణ లేదా అందరూ ఆశ్చర్యపోయేలా వివాహతంతు చేసుకునేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందులో భాగంగానే వరుడుని సర్ప్రైజ్ చేసేలా డ్యాన్స్‌లు వేయడం లేదా ఆటపట్టించడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే చేసింది మధ్యప్రదేశ్‌కి చెందిన పెళ్లికూతురు. వాస్తవానికి పెళ్లికూతురు మండపానికి కారులోనో లేదా పల్లకిలోనే వస్తుంది. ఐతే మరింత విన్నూత్నంగా రావలనుకుందో ఏమోగానీ చాలా వెరైటీ ఎంట్రీ ఇచ్చింది ఆమె. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో జావా గ్రామంలో పెళ్లి జరిగింది. ఐతే ఈ పెళ్లి ఊరేగింపులో వధువు ఎంట్రీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు వధువు భారతి తాగ్డే నల్ల కళ్లజోడు ధరించి, ట్రాక్టర్ పై పెళ్లి మండపానికి విచ్చేసింది. అంతేకాదు ఆమె స్వయంగా నడుపుతూ తన సోదరులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో వధువు మాట్లాడుతూ..పల్లకీలోనో, కారులోనో ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ పాతబడిపోయిందని, అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాని తాగ్డే చెబుతోంది. గతంలో కూడా ఇలానే ఓ వధవు చేతితో కత్తి పట్టుకుని గుర్రం పై స్వారీ చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. A bride in Betul arrived at her wedding on a tractor. The bride, Bharti Tagde, is seen entering the wedding pavilion wearing black glasses and riding a tractor. On the tractor, she is accompanied by her two brothers @ndtv @ndtvindia pic.twitter.com/apdqrIBvyA — Anurag Dwary (@Anurag_Dwary) May 27, 2022 (చదవండి: ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు.. ఫన్ ఫన్ మోర్ ఫన్..!) -
వరంగల్ జిల్లా: చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా
-
వరంగల్: చెరువు కట్ట నుంచి ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం
సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు అదనపు సమాచారం అందించాల్సి ఉంది. -
కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. ప్రజలు ఆ పార్టీపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ నేతలది నరుకుడు ఎక్కువ.. పని తక్కువ. వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తేసి సిలిండర్ ధరను రూ. వెయ్యికి పెంచారు. ఎన్నికలప్పుడు పెట్రో ధరలను తగ్గించి ఆ తర్వాత లీటరుకు రూ. వంద దాటించారు. పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు’ అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై మండిపడ్డారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌తోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలపై తెలంగాణ బీజేపీ నేతలు బదులివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దళితబంధు లబ్ధిదారులకు ఆయన యూనిట్లను పంపిణీ చేశారు. వైన్ షాపుల గల్లాపెట్టెపై దళితులు.. దళితుల సంక్షేమం కోసం దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తోందని హరీశ్‌రావు చెప్పారు. ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టులు, మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులతోపాటు మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, దీంతో దళితులు వైన్ షాపుల గల్లాపెట్టె మీద కూర్చొనే అవకాశం కలిగిందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో దళితబంధుకు రూ. 17,800 కోట్లు కేటాయించామని, ఈ పథకం ద్వారా ఈ ఏడాది 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మండలి మాజీ ప్రొటెంౖ చెర్మన్ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, యాదాద్రి: ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైవేపై పనిచేసే దినసరి కూలీలుగా గుర్తించారు. అంకర్ల లక్ష్మి, ఊరేళ్ల శ్యామ్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. అంకర్ల కవిత, ఊరేళ్ల లావణ్య తీవ్రంగా గాయపడటంతో ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు. -
విషాదం: ఆడుకుంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో..
ఊట్కూర్: ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్‌ను పిల్లలు ఆడుకుంటూ స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలి ఒక బాలికను బలిగొంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్ మండలం ఎర్గాట్‌పల్లిలో మంగళవారం మైసమ్మ జాతర నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు కుటుంబ సభ్యులతో ట్రాక్టర్‌పై జాతరకు వెళ్లి వచ్చి.. ఇంటి ముందు వాహనాన్ని ఆపాడు. రాత్రి 8 గంటల సమయంలో కొందరు చిన్నారులు ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. వీరిలో ఒకరు ఇంట్లోకి వెళ్లి ట్రాక్టర్ తాళం తెచ్చి స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. అదే సమయంలో ట్రాక్టర్ ముం దు ఆడుకుంటున్న రూప (8), కల్పన, వెంకటేష్‌లను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఊట్కూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రూప మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కల్పన, వెంకటేశ్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషాదం: ఆడుకూంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో -
ట్రాక్టర్ టైర్ కింద రాయి తీస్తుండగా..
దేవరకొండ: ట్రాక్టర్ కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోల్‌ముంతల్‌పహాడ్ గ్రామపంచాయతీ బాపూజీనగర్‌కు చెందిన సంపెంగల సతీశ్, జంగమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమార్తెలు, కుమారుడు చరణ్ (15)ఉన్నారు. సతీశ్ కంకర మిల్లులో రాయి కొట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సతీశ్ ఇంటి సమీపంలో గల బండరాయి వద్ద ట్రాక్టర్లో రాళ్లను నింపే క్రమంలో ట్రాక్టర్ ముందు టైరు కింద ఓ రాయిని ఉంచారు. రాళ్లను నింపిన తర్వాత టైరు కింద ఉంచిన రాయిని తీయాలని అక్కడే ఉన్న చరణ్‌ను ట్రాక్టర్ డ్రైవర్ అడిగాడు. దీంతో అతను రాయిని తీసే క్రమంలో ట్రాక్టర్ ముందుకు కదలడంతో చరణ్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టినట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో మృతుడు చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికులు కొండమల్లేపల్లి–దేవరకొండ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న దేవరకొండ సీఐ బీసన్న, కొండమల్లేపల్లి సీఐ రవీందర్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు. -
Mallika Srinivasan: ట్రాక్టర్ మహారాణి
విజయానికి వయసు అడ్డు పడుతుందా? వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని చెబుతూ తమను తాము నెంబర్ వన్‌గా నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. ‘మహిళలకు పరిమితులు ఉన్నాయి’ అంటూ ఎక్కడైనా అడ్డుగోడలు ఎదురొచ్చాయా? ఆ అడ్డుగోడలను బ్రేక్ చేసి, కొత్త మార్గం వేసి దూసుకుపోయి తమను తాము నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. తమ శక్తియుక్తులతో భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఫోర్బ్స్ ‘50 వోవర్ 50: ఆసియా 2022’లో మెరిసిన మహిళా మణులలో మన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. మల్లికా శ్రీనివాసన్... అనే పేరుతో పాటు కొన్ని విశేషణాలు కూడా సమాంతరంగా ధ్వనిస్తాయి. అందులో ముఖ్యమైనవి... ‘ట్రాక్టర్ క్వీన్’ ‘మోస్ట్ పవర్ఫుల్ సీయివో’ ట్రాక్టర్ ఇండస్ట్రీని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా చెబుతారు. అలాంటి ఇండస్ట్రీలో విజయధ్వజాన్ని ఎగరేఓఆరు. కంపెనీని ప్రపంచంలో మూడో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిపారు. ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారుగానీ అది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మల్లికకు చిన్న వయసు నుంచే వ్యాపార విషయాలపై ఆసక్తి. తనకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ‘ఇది ఏ రాగం?’ అని కమనీయమైన రాగాల గురించి తెలుసుకోవడంలో ఎంత ఆసక్తో, జటిలమైన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే ఆసక్తి ఉండేది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’ నుంచి ‘ఎకనామెట్రిక్స్’లో గోల్డ్‌మెడల్ అందుకున్న మల్లిక ప్రతి విజయం వెనుక కొన్ని ‘గోల్డెన్ రూల్స్’ ఉంటాయని బలంగా నమ్ముతారు. ఆ సూత్రాలు పుస్తకాల్లో తక్కువగా కనిపించవచ్చు. సమాజం నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు. చదువుల్లో ఎప్పుడూ ముందుండే మల్లిక పుస్తకాల్లో నుంచి ఎంత నేర్చుకున్నారో, సమాజం నుంచి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫే–(చెన్నై) లో జనరల్ మేనేజర్‌గా మొదలయ్యారు మల్లిక. ఆ తరువాత చైర్పర్సన్ అయ్యారు. జనరల్ మేనేజర్ నుంచి చైర్పర్సన్ వరకు ఆమె ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జటిలమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కోవడంలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని అడిగితే ఆమె చెప్పే సమాధానం... ‘నాకో మంచి ట్రాక్టర్ కావాలి...అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్ వైపే చూడాలి’ కేవలం వ్యాపార విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజసేవపై కూడా దృష్టి పెడుతుంటారు మల్లిక. పేదలకు వైద్యం అందించే వైద్యసంస్థలు, విద్యాసంస్థలకు ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. -
సొంతంగా దున్నేస్తుంది
రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్ డీర్ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్ కొనియాడారు. ప్రత్యేకతలు.. ► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి. ► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. ► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది. ► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది. ► ఈ కెమెరాలను, కంప్యూటర్ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ► రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు. ► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్ను (జీపీఎస్ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్ పని చేస్తుంది. ► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా. -
ట్రాక్టర్‌తో ఢీకొట్టించి.. చక్రాలతో తొక్కించాడు..!
సాక్షి, హుజూర్నగర్(నల్లగొండ): పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహేష్ అదే గ్రామానికి చెందిన సైదులు భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని గొడవలు జరుగుతున్నాయి. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. మహేష్ మంగళవారం గ్రామ శివారులోని డొంకదారి గుండా బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో సైదులు ట్రాక్టర్‌తో వచ్చి ఢీకొట్టాడు. దీంతో మహేశ్ ఎగిరి పక్కన పొలంలో పడిపోయాడు. అనంతరం ట్రాక్టర్‌తో మరోమారు ఢీకొట్టడంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి కుటుంబంతో సహా నిందితుడు పారిపోయాడు. రైతులు గమనించడంతో.. ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్తున్న రైతులు వ్యవసాయ పొలంలో బైక్, మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పాతకక్షల నేపథ్యంలో సైదులే ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కుమార్తెలు స్పందన, హారికలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైదులుపై హత్య కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.వెంకట్‌రెడ్డి తెలిపారు. -
ఎంఅండ్ఎం లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో మూడు రెట్లు ఎగసి రూ. 1,929 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 615 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 19,227 కోట్ల నుంచి రూ. 21,470 కోట్లకు జంప్ చేసింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 8 రెట్లు ఎగసి రూ. 1,432 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో కేవలం రూ. 162 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 15 శాతం పుంజుకుని రూ. 13,305 కోట్లయ్యింది. వాహన విక్రయాలు 9% పెరిగి 99,334 యూనిట్లను తాకాయి. అయితే ట్రాక్టర్ల విక్రయాలు 5% క్షీణించి 88,920 యూనిట్లకు పరిమితమయ్యాయి. మెరుగుపడే చాన్స్: 2022లోనూ సరఫరా సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నట్లు ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ పేర్కొన్నారు. అయితే 2021లో తలెత్తిన స్థాయిలో సవాళ్లకు అవకాశంలేదని భావిస్తున్నట్లు తెలియజేశారు. గత క్యూ2లో అధికస్థాయిలో ట్రాక్టర్ల విక్రయాలు నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్)తో తాజా సమీక్షా కాలంలో గణాంకాలు మందగించినట్లు వెల్లడించారు. కాగా.. ఎక్స్‌యూవీ700 వాహనానికి భారీ డిమాండ్ నెలకొన్నట్లు ఎంఅండ్ఎం పేర్కొంది. 70,000 వాహనాలకుపైగా బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేసింది. మేరు ట్రావెల్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను మహీంద్రా లాజిస్టిక్స్‌కు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 4% జంప్‌చేసి రూ. 893 వద్ద ముగిసింది. -
గ్రామానికో ట్రాక్టర్.. ఏపీ సర్కార్ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక్కొక్క ట్రాక్టర్ చొప్పున సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ట్రాక్టర్లను సంబంధిత గ్రామ పంచాయతీలు బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఆదాయం రూపంలో సదరు గ్రామ పంచాయతీలకు లభించేలా చర్యలు చేపడుతోంది. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్ ద్వారానే నీటి తడులు అందించడం, నూరు శాతం మొక్కలను బతికించడం, గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడం వంటి పనులను సులభతరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 5,228 గ్రామాలకు ఉచితంగా అందజేత రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 5 వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాలు 1,252 ఉన్నాయి. వీటిలో 1,161 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సొంత ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. 5 వేల జనాభాకు పైబడిన గ్రామాల్లో 91 చోట్ల మాత్రమే పంచాయతీలకు సొంతంగా ట్రాక్టర్లు లేవు. ఇవి కాకుండా 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5,137 వరకు ఉన్నాయి. వీటికి కూడా సొంత ట్రాక్టర్లు లేవు. ఈ నేపథ్యంలో 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని 91 పంచాయతీలతోపాటు, 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు కలిపి మొత్తం 5,228 గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వీటిని ఉచితంగా సమకూరుస్తుంది. గ్రామాల్లో రోడ్లపక్కన పోగయ్యే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన నాటే మొక్కలకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటి తడులు అందించడం ద్వారా ప్రతి మొక్కను బతికించేందుకు ఈ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా అవే ట్రాక్టర్లను ఉపయోగించుకునేలా చూస్తారు. పంచాయతీలపై నిర్వహణ భారం పడకుండా.. ట్రాక్టర్ రోజువారీ నిర్వహణ సంబంధించి పంచాయతీకి భారం కాకుండా ఉండేలా కొన్నేళ్లపాటు ఆ గ్రామానికి అదనపు ఆదాయం పొందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దానిపై పంచాయతీ అధికారులకు అవగాహన కల్పిస్తారు. రోడ్ల పక్కన నాటే మొక్కల పెంపకానికి గాను.. నాటిన ప్రతి మొక్కకు రెండేళ్లలో 56 విడతలుగా నీటి తడులు ఇవ్వడానికి (ఒక్కొక్క తడికి రూ.5 చొప్పున) రూ.280 చొప్పున ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు చెల్లిస్తోంది. ఇలా 400 మొక్కలు ఒక యూనిట్‌గా చేసుకుని ప్రతి యూనిట్‌కు రూ.1.12 లక్షల చొప్పున అందజేస్తోంది. ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే అప్పగిస్తారు. తద్వారా ఆ మొత్తం గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయంగా సమకూరుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ గత ఏడాది రాష్ట్రంలో 15 వేల కిలోమీటర్ల మేర, ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల మేర మొక్కలు నాటింది. సగటున ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 1.60 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం మొక్కల పెంపకం కొనసాగుతుంది. పంచాయతీల ఆధ్వర్యంలోనే ట్రాక్టర్ ద్వారా నీటి తడులు అందజేస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సరాసరి రూ.1.80 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సొమ్మును ట్రాక్టర్ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు. -
అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి..
ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు
బెంగళూరు: చిన్నప్పుడు ఎప్పుడో పోలాల్లోనూ లేదా సరదాగానో ట్రాక్టర్లు ఎక్కి ఉంటాం. కానీ పరిస్థితి అనకూలించక లేక ఇతరత్రా కారణాలతోనో ఎక్కాలసి వస్తే ఎవరూ ఏం చేయలేం కదా ప్రస్తుతం అలాంటి పరిస్థితే బెంగుళూరు వాసులు ఎదుర్కొన్నారు. మాములుగా వర్షలు ఎక్కువగా పడితేనే రహదారుల బాగోక ఒక పక్క ట్రాఫిక్ ఏర్పడి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనలవి కాదు. అలాంటిది మెట్రోనగరాల్లాంటి బెంగుళూరు నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ వర్షాల కారణంగా బెంగళూరు వాసులు విమానశ్రయం చేరుకోవడానికి ఎన్ని పాట్లు పడ్డారో చూడాండి (చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?) వివరాల్లోకెళ్లితే.....బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కేఐఏ) వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. టాక్సీలు ప్రైవేట్ వాహనాలు, విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి. అయితే ప్రయాణికులు కూడా టెర్మినల్స్‌లోకి ప్రవేశించలేకపోతున్నారు. దీంతో ప్రజలు విమానాశ్రయం చేరుకోవటం అత్యంత అసాధ్యమైంది. ఈ క్రమంలో వేరుదారిలేక ప్రయాణికులంతా ట్రాక్టర్లను ఆశ్రయించక తప్పలేదు. ప్రయాణికులంతా ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేశాయి. దీంతో ఎంతటి గొప్పోడైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదు కదా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) -
రోడ్డు సరిగా లేక ట్రాక్టర్లో ఆస్పత్రికి
సాక్షి, మహబూబాబాద్: అసలే నిండు గర్భిణి... ఆపై పురిటి నొప్పులు... ట్రాక్టర్‌పై ఆస్పత్రికి ప్రయాణించి నరకయాతన అనుభవించిందామె. మనసును కదిలించే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారంలో జరిగింది. గ్రామానికి చెందిన నిండు గర్భిణì మద్దెల పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఆమెను చికిత్స నిమిత్తం... ట్రాక్టర్లో కోమట్లగూడెం పీహెచ్‌సీకి తరలించారు. పురిటి నొప్పులకు తోడు ట్రాక్టర్ ఎత్తేయడంతో గర్భిణీ నరకయాతన అనుభవించింది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా... ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మాత్రం దుర్భరంగా ఉన్నాయి. సరైన రోడ్డు మార్గాలు లేవు. దీనికి వర్షాలు కూడా తోడు కావడంతో వాహనాలు అస్సలు వెళ్లలేని పరిస్థితి. దీంతో అత్యవసర సమయాల్లో ట్రాక్టర్ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో నుంచి వెళుతున్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పంచ్ తండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టు రంపాల్ కొండాపూర్ గ్రామం నుంచి ట్రాక్టర్లో ఫ్రిజ్, కూల్ డ్రింక్స్ డబ్బాలు తీసుకుని వెళ్తుండగా మొండి వాగులో ట్రాక్టర్ దిగబడింది. అదే సమయంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి భారీగా వరద వచ్చింది. ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ ట్రాక్టర్ దిగి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. -
ట్రాక్ట్రర్పై బయటకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతి
-
తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లింది.. చివరికి ఏమైందంటే!
గాంధీనగర్: ఇటీవల గుజరాత్‌లోని దాహోద్‌లో టూవీలర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే మరోసారి దాహోద్‌లో చోటుచేసుకుంది. ఈసారి ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దహోద్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్నారితో కలిసి వెళ్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉండటంతో నీటిలో గుంత కారణంగా వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. అంతలోనే బైక్‌పై ఉన్న ముగ్గురు పక్కన వెళ్తున్న ట్రాక్టర్ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్‌కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. కానీ ఆ వ్యక్తి తలపై మాత్రం ట్రాక్టర్ వెనక టైర్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Gujarat: A man had a narrow escape in #Dahod when the wheel of a tractor trolley passed on his head. The man was wearing a helmet which is believed to have rescued him. This is the second incident of its kind in Dahod in as many days. pic.twitter.com/v3n39MSU1B — TOI Vadodara (@TOIVadodara) September 15, 2021 చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! -
కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. ఆస్పత్రికి చేరేలోపే భార్య, కొడుకు మృతి
కొణిజర్ల: కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోతే తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకుంది. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కలెక్టరేట్లో గన్‌మెన్‌గా ఉన్న భర్తకు తీరిక లేకపోవడంతో మరిదిని వెంట పెట్టుకుని బయలుదేరిన క్రమంలో ఆస్పత్రికి చేరకుండానే జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం విదితమే. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన జెర్రిపోతుల సంధ్య తన కుమారుడు మహంత్‌ను తీసుకుని మరిది పుల్లారావుతో ఖమ్మంలోని ఆస్పత్రికి బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. (చదవండి: తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్) మార్గమధ్యలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. పుల్లారావు, మహంత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడగా సంధ్య హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి మృతదేహాలను గురువారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రికి బయలుదేరుతున్నప్పుడు గంటలో వస్తామని చెప్పిన వారు మృతదేహాలుగా రావడంతో కుటుంబీకులు రోదించిన తీరు అందరికీ కన్నీళ్లు పెట్టించింది. డ్యూటీ నిమిత్తం ఎక్కడకు వెళ్లినా గంటగంటకూ తనతో వీడియో కాల్లో మాట్లాడే కుమారుడు, భార్య మృతదేహాలను చూస్తూ నాగరాజు ఏడుస్తూ స్పృహ తప్పారు. ఇక ఆయన కుమార్తె రిషిత తల్లి, సోదరుడిని చూస్తూ అమాయకంగా రోదిస్తుండడం కలిచివేసింది. అలాగే, అన్న నీడలా వెన్నంటి ఉండే పుల్లారావు మృతితో ఆయన భార్య పద్మ, 8 నెలల కుమారుడు భార్గవ్ రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు. ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌పై ఉంచి అంతిమయాత్ర నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం
పేరుకేమో సంక్షేమ పథకం. తీరుకు మాత్రం దోపిడీకి వేసిన పథకం. టీడీపీ పాలనలో పాటించిన సూత్రమిది. నీరు–చెట్టు నుంచి మొదలుపెడితే రైతు రథం వరకు అన్ని పథకాలు ఈ సూత్రం ప్రకారం పనిచేసినవే. ఆ అవినీతి ఆనవాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతలు తమ బినామీలను లబి్ధదారులుగా చేర్చి ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టారో బయటపడుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రైతు రథాలను టీడీపీ నాయకులు అవినీతి పథాల్లో నడిపిన తీరు విస్మయపరుస్తోంది. తమ బినామీలను లబ్ధిదారులగా చేర్చి ఏకంగా రూ.33 లక్షల సబ్సిడీ మొత్తాన్ని కొట్టేసిన బాగోతం వెలుగు చూసింది. రైతు రథం కింద నాడు మంజూరు చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద లేవంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడో అక్రమార్కుల ఇళ్ల వద్దకు చేరిపోయాయి. జిల్లాకు 24 యూనిట్లు మంజూరైతే ఇప్పుడు లబి్ధదారుల వద్ద ఉన్న ట్రాక్టర్లు రెండే రెండు. మిగతావన్నీ హాంఫట్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ స్కామ్ టీడీపీ నాయకుల అసలు స్వరూపాన్ని వివరిస్తుంది. ‘పథకం’ ప్రకారమే... 2018 డిసెంబర్, 2019 ఫిబ్రవరి, మార్చి నెలలో రై తు రథం పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఒక్కో యూనిట్ ఖరీదు ఒక్కో రకంగా ని ర్ణయించి, యూనిట్‌కు రూ.లక్షా 50వేల సబ్సిడీని ప్ర కటించింది. అప్పట్లో రైతు రథం పథకంపై పెద్ద ఎ త్తున ప్రచారం చేసింది. అంతా చేసి ఆ ట్రాక్టర్లు ఇ చ్చింది మాత్రం వారి బినామీలకే. దీనిపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని నేడు తేలు తోంది. ట్రాక్టర్లు మంజూరయ్యాక వాటిని నాటి పా లకుల అనుచరులు లాగేసుకున్నారు. ఇందులో ఎంత మొత్తంలో చేతులు మారాయో తెలీదు గానీ రైతు రథం పథకం ఆశయం మరుగున పడిపోయి అనర్హుల చేతికి ట్రాక్టర్లన్నీ వెళ్లిపోయాయి. అక్రమాలు ఇలా.. ►జిల్లాలో రైతు రథం పథకం కింద 24 యూని ట్లు(ట్రాక్టర్లు) మంజూరు చేశారు. ►అత్యధికంగా రూ. 6,28,021 నుంచి అత్యల్పంగా రూ.5,64,720 ధర నిర్ణయించారు. ►ఇందులో ప్రతి దానికి లక్షా 50వేల రూపాయలు చొప్పున సబ్సిడీని అందజేశారు. అయితే మంజూరులో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత వ్యవసాయ అధికారులు రైతు రథం కింద మంజూరు చేసిన ట్రాక్టర్లపై విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగు చూశాయి. ►మంజూరైన 24 ట్రాక్టర్లలో ప్రస్తుతం రెండు మాత్రమే అసలైన లబ్దిదారుల వద్ద ఉన్నాయి. ►ఓ రెండు యూనిట్లు ఏకంగా గ్రౌండ్ కాలేదు. మ రో రెండు ట్రాక్టర్లకు సంబంధించి మంజూరైన చాసిస్ నంబర్లు ఒకటుంటే, ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఉన్న ట్రాక్టర్ల చాసిస్ నంబర్ మరోలా ఉంది. ►అంటే అప్పట్లో పాత ట్రాక్టర్లను చూపించి సబ్సిడీ మొత్తాన్ని కొట్టేశారన్న అనుమానాలు ఉన్నాయి. ►ఇక 18 ట్రాక్టర్లు లబి్ధదారుల వద్ద ప్రస్తుతం లేవు. అవన్నీ చేతులు మారిపోయాయి. ►అవన్నీ అప్పట్లో వెనకుండి కథ నడిపించిన పెద్దల చేతిలోకి వెళ్లిపోయాయని తేలింది. ►అధికారులైతే ప్రస్తుతానికి వాటిని లబ్దిదారులు అమ్మేశారని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా వ్యవసాయ అధికారులు పంపించారు. ►మొత్తానికి అక్షరాలా రూ. 33లక్షల సబ్సిడీ మొత్తాన్ని గత ప్రభుత్వంలో కొట్టేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఆ ట్రాక్టర్లు ఎవరి చేతికి వెళ్లా యి? అప్పట్లో నడిచిన బినామీ బాగోతం తదితర అవినీతి గుట్టు అంతా బయటపడనుంది. -
పొలంలోనే ప్రాణం విడిచిన రైతు
గుండాల: వరి పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో కింద నలిగిపోయిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జోగ వెంకయ్య కుమారుడు సుధాకర్(23) తన పొలంలో ట్రాక్టర్‌కు కల్టివేటర్ అమర్చి దమ్ము చేస్తున్నాడు. చివరి మడి చేస్తుండగా బురదలో ట్రాక్టర్ దిగబడింది. దిగబడిన ట్రాక్టర్‌ను బయటకు తీసే యత్నంలో ఒక్కసారిగా పల్టీకొట్టింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న సుధాకర్ ట్రాక్టర్ కింద బురదలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కంగారులో ఇంజిన్ ఆఫ్ చేయకుండానే దుకాణంలోకి.. ఇంకేముంది..
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. పార్కింగ్లోని ద్విచక్ర వాహనాలపైకి ట్రాక్టర్ దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పార్క్ చేసి ఉన్న 12 బైకులు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్ గ్రామానికి చెందిన రమేష్ తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్ చేయించి మెదక్ మార్గంలో గల ఓ వైన్స్ షాప్ సమీపంలో పార్క్ చేశాడు. కంగారులో డ్రైవర్ ట్రాక్టర్ ఇంజిన్ ఆఫ్ చేయకుండానే పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు. ఇంతలో ట్రాక్టర్ ఉన్నట్టుండి ముందుకు కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్‌ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు ఉద్యమానికి మద్దతుగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ
-
కారు వదిలి ట్రాక్టర్‌పై కలెక్టర్ రయ్ రయ్
సాక్షి, యాలాల: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటిక పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పౌసమి బసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగెంకుర్దు, బెన్నూరు, అగ్గనూరులో పర్యటించి, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. సంగెంకుర్దులో శ్మశానవాటికను పరిశీలించేందుకు బయలుదేరగా కలెక్టర్ కారు బురద రోడ్డుపై ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన ఆమె స్థానికులు తెప్పించిన ట్రాక్టర్‌పై వెళ్లి పనులను పరిశీలించారు. క్రిమిటోరియం నిర్మాణా లకు సంబంధించిన బిల్లులు రావడం లేదని పలువురు సర్పంచ్‌లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీలత, పటేల్‌రెడ్డి, భీమప్ప, పీఆర్ డీఈ కరణాకర్‌చారి, ఎంపీడీఓ పుష్పలీల, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ ఉన్నారు. వర్షం ముసిరేసి.. దంచేసి వికారాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వాన కురిసింది శుక్రవారం ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు కాస్త శాంతించిన వరుణుడు ఆతర్వాత మళ్లీ దంచేశాడు. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కాగా గురువారం అత్యధికంగా పూడూరులో 25.2, దౌల్తాబాద్‌లో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్ 21, వికారాబాద్, కుల్క చర్లలో15, పరిగి14, దోమ, ధారూరు, బంట్వారంలో 12, మోమిన్‌పేట 9, నవాబుపేట్ 8.8, మర్పల్లి 7.8, తాండూరు 8.8, కొడంగల్‌లో 6.2, బషీరాబాద్ 5.8, బొంరాస్‌పేట్ 4.2, యాలాలలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్నా డ్రైవర్‌తో సహ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్ : పట్టించిన పెన్ క్యాప్
సాక్షి,చిత్తూరు(ఎర్రావారిపాళెం): ట్రాక్టర్‌ను బైక్ ఢీకొన్న ఘటనతో భయపడి పరారైన ట్రాక్టర్ డ్రైవర్‌ను పెన్‌క్యాప్ పట్టించింది. కేసును ఎస్ఐ వెంకటమోహన్ గంటలో ఛేదించారు. వివరాలు.. మండలంలోని ఆవులయ్యగారిపల్లెకు చెందిన గురవయ్య దామలచెరువులో ట్రాక్టర్ మామిడికాయలు దించి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. నెరబైలు గ్రామం పులిబోనుపల్లె సమీపంలో సిద్దలవాండ్లపల్లెకు చెందిన కంచన ఈశ్వరయ్య, రెడ్డెప్ప బోడేవాండ్లపల్లె నుంచి బైక్‌పై ఎదురుగా వస్తూ ట్రాక్టర్‌ను ఢీ కొన్నారు. ఈ సంఘటనలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రెడ్డెప్ప స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కేసు తనమీదకు వస్తుందని ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ గురవయ్య పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటమోహన్ స్థానిక యువకులను అప్రమత్తం చేశారు. గురవయ్య ట్రాక్టర్‌ను గుర్తించి విచారణ చేశారు. ఎంతకీ తన ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని అతను అంగీకరించలేదు. అయితే ఈశ్వరయ్య పెన్ క్యాప్ ట్రాక్టర్ ట్రాలీకి తగులుకుని ఉండటాన్ని గుర్తించి ట్రాక్టర్, గురవయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. -
లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!
సాక్షి,డోర్నకల్: ఇందులో ఏముంది? ట్రాక్టర్ నుంచి లోడ్ దించుతున్నారంతే అనుకుంటున్నారా? సరిగ్గా చూస్తే.. ట్రాలీ కింద ప్రత్యేకంగా అమర్చిన అరలో బాక్స్‌లున్నాయి కదా.. అవన్నీ 3 క్వింటాళ్ల గంజాయి నింపిన పెట్టెలు. ఒక్కో దానిలో 2 కిలోలు ప్యాక్‌చేసి ఇలా 150 బాక్స్‌లను తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అమ్మపాలెం క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నారు. మరిపెడ మండలం తండాధర్మారానికి చెందిన బానోత్ కిరణ్‌కుమార్, కొత్తగూడెం జిల్లా కోయగూడెంకు చెందిన ఆర్ఎంపీ బాదావత్ సూర్య ఏపీలోని చింతూరులో గంజాయి కొని తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. కిలో రూ.3 వేలకు కొని మహారాష్ట్రలో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
గాలివీడు: వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తూముకుంట పంచాయతీ పరిధిలోని మరికుంటపల్లెకు చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కుడుముల బయారెడ్డిపై ప్రత్యర్థి వర్గీయులు సోమవారం హత్యాయత్నం చేశారు. పొలం వెళుతున్న బయారెడ్డిని ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన బయారెడ్డి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పరుగున అక్కడకు వచ్చారు. గమనించిన ప్రత్యర్థులు అక్కడినుంచి పారిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన బయారెడ్డిని రాయచోటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరుకు తరలించారు. రౌడీషీటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు ఈ హత్యాయత్నానికి సంబంధించి బయారెడ్డి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు గాలివీడు ఎస్ఐ ఇనాయతుల్లా తెలిపారు. భూతగాదాలు, రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే తమ తండ్రిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామానికి చెందిన రౌడీషీటర్ ఈశ్వరరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భూషణ్‌రెడ్డిల ప్రమేయం ఉందని తెలిపారు. దీంతో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ హత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బయారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరా తీశారు. ఫోన్లో బయారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ -
'ప్రాణంగా పెంచుకున్నా.. న్యాయం చేయండి సారూ..'
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్‌స్టేషన్.. రాత్రి 8 దాటింది. మరికాసేపట్లో రాత్రి కర్ఫ్యూ.. దాని అమలు తీరుతెన్నులపై ఠాణా సిబ్బంది తర్జనభర్జన పడుతూ బిజీగా ఉన్నారు. అంతలో చేత్తో చచ్చిన కోడిని పట్టుకుని ఓ యువకుడు స్టేషన్లోకి ఎంటరయ్యాడు. ‘నేను ప్రాణంగా పెంచుకుంటున్న కోడిపెట్టను ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారు. న్యాయం చేయండి సారూ..’ అంటూ యువకుడు అనేసరికి ఏం చేయాలో, అతడికేం చెప్పాలో పోలీసులకు తోచలేదు. కానీ, తరువాత విషయం అర్థమై కడుపుబ్బా నవ్వుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గసికంటి రాజు (32) గల్ఫ్‌లో ఉండేవాడు. కరోనా నేపథ్యంలో ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేస్తూనే పది కోళ్లనూ పెంచుకుంటున్నాడు. అందులోని ఓ కోడిపెట్ట మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. ఇసుక ట్రాక్టర్‌తో దాన్ని ఢీకొట్టి చంపేశారంటూ రాజు అదేరోజు రాత్రి ఠాణా మెట్లెక్కినప్పుడు పై సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేమగా పెంచుకుంటున్న తన కోడిని ఢీకొట్టి చంపిన వారిపై కేసు పెట్టి, తనకు న్యాయం చేయాలని రాజు వేడుకోగా, ‘మాకున్న కేసుల పంచాయితీకి మళ్లీ ఇదొకటా.. చూద్దాంలే’ అంటూ పోలీసులు సర్దిచెప్పి ఇంటికి పంపేశారు. -
ఆడుకుంటూ అగ్నికి ఆహుతియ్యారు!
మహబూబ్‌నగర్: ఆట సరదా విషాదం మిగిల్చింది. కేజీవీల్ నుంచి బయటికి రప్పించేందుకు గడ్డికి నిప్పు పెట్టడంతో అందులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఘ్నేష్ (9), ప్రశాంత్ (13), శివ ముగ్గురు స్నేహితులు. గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టి వాటిని కాల్చుకొని తినాలనుకున్నారు. వెంట ఓ అగ్గి పెట్టెను సైతం తీసుకెళ్లారు. ఎంతకూ చేపలు పడకపోవడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో ఆడుకునేందుకు వరి కల్లం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న కేజీవీల్ ఎక్కి దిగుతూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్, విఘ్నేష్ కేజీవీల్‌లోకి దిగి బయటికి రాలేదు. దీంతో శివ వారిని బయటికి రప్పించేందుకు అక్కడ ఉన్న గడ్డికి నిప్పుపెట్టాడు. గడ్డి వేగంగా అంటుకుని కేజీ వీల్ చుట్టూ పొగ, మంటలు వ్యాపించాయి. దీంతో కేజీవీల్లో ఉన్న ప్రశాంత్, విఘ్నేష్ అందులో నుంచి బయటికి రాలేక మంటల్లో చిక్కుకున్నారు. దీంతో భయపడిన శివ పక్కనే వరి పొలంలో దోసిళ్లతో నీళ్లు తెచ్చి పోసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, శుక్రవారం ప్రశాంత్ జన్మదినం ఉండటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా..ముగ్గురి పరిస్థితి విషమం
గుండాల: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 33 మందికి గాయాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కల్తి రామయ్య కుమారుడు మహేశ్‌కు.. నర్సాపురం గ్రామానికి చెందిన జోగ నర్సింహారావు కుమార్తె అనూషతో బుధవారం పెళ్లి జరగనుంది. దీంతో వరుడి కుటుంబసభ్యులు, బంధువులు మొత్తం 35 మంది ట్రాక్టర్లో పెళ్లి కుమార్తె ఇంట ప్రదానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి ట్రాక్టర్లో వస్తుండగా.. మామకన్ను సబ్‌స్టేషన్ మూలమలుపు వద్ద అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులోని 33 మందికి గాయాలు కాగా, వారిని గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి : అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు? -
రైతుల కోసం 19 ఏళ్ల కుర్రాడి అద్భుత ఆవిష్కరణ!
రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలోని బమోరికల గ్రామానికి చెందిన 19 ఏళ్ల యోగేష్ అనే ఒక యువ రైతు ఎవరూ సహాయం లేకుండా నడిచే సరికొత్త డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ను ఆవిష్కరించాడు. డ్రైవర్ సాయంతో నడిచే ట్రాక్టర్లో మార్పులు చేసి ఈ ఘనత సాధించాడు. యోగేష్ బీఎస్సి ఫస్ట్ చదువుతున్నాడు తన తండ్రికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇంటికి రావాలని అని ఫోన్ వచ్చింది. తండ్రి ఆరోగ్యం కుదుట పడే వరకు అక్కడే ఉన్నాడు. యోగేశ్ తండ్రి ట్రాక్టర్ నడపవలసి వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నాడు. తండ్రి పడుతున్న భాదలు గమనించి డ్రైవర్ లెస్ ట్రాక్టర్ తయారు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో ప్రయోగం మొదలుపెట్టాడు. ఇది ఎలా పనిచేస్తుందో తండ్రికి చెప్పినప్పుడు ట్రాక్టర్ ఎవరు సహాయం లేకుండా టెస్ట్ చేసి తండ్రి చుపించామన్నాడు. యోగేశ్ రెండు వేల రూపాయలతో కొన్ని పరికరాలను కొనుగోలు చేసి రిమోట్ సాయంతో ట్రాక్టర్ ను వెనుకకు ముందుకు నడిపించాడు. తండ్రికి కొడుకు ఆలోచనలపై నమ్మకం కలిగి అప్పుడు యోగేష్ కు రూ.50 వేలు అప్పు చేసి డబ్బు ఇచ్చాడు. పట్టుదలతో యోగేశ్ డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తయారు చేశాడు. ఈ ట్రాక్టర్ తో రైతుకు ఎన్నో లాభాలు అంటున్నాడు యోగేష్. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుందని, డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపాడు. యోగేష్ రూపొందించిన రిమోట్ కంట్రోలర్ ట్రాక్టార్ ను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు మైలేజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు -
పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
-
పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెం బైపాస్‌లోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడగా.. 20 మందికి గాయాలయ్యాయి. ఓ ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. -
విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి..
జలుమూరు (శ్రీకాకుళం జిల్లా): ట్రాక్టర్ టైరుకు అధికంగా గాలి నింపడంతో పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. సూర్యనారాయణ టైర్ డిస్‌్కతో పాటు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ గోవిందరావును 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాంక్ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ -
వైరల్ : ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
జైపూర్ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలలకు పైగా తమ నిరసన తెలియజేస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా రాజస్తాన్ కాంగ్రెస్‌కు చెందిన మీనా అనే మహిళా ఎమ్మెల్యే వినూత్న రీతిలో తన మద్దతు ప్రకటించారు. స్వయంగా తనే ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైతుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు తాను ట్రాక్టర్‌పై వచ్చినట్లు ఎమ్మెల్యే మీనా తెలిపారు. కాగా రైతు నిరసనలకు కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. (ఐటీ శాఖ వ్యాఖ్యలు : ముదురుతున్న ట్విటర్ వివాదం) #WATCH| Congress MLA Indira Meena reaches Rajasthan Assembly on a tractor "to show support for farmers", she says pic.twitter.com/0RHsGEAF8Q — ANI (@ANI) February 10, 2021 రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర సాగు చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించింన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గడిచిన రెండు నెలలకు పైగానే రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే రైతులు కేంద్రం మధ్య పలుమార్లు చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ( ‘40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం’) -
ఎర్రకోట ఘటన: ‘మోస్ట్ వాంటెడ్’ అరెస్టు!
న్యూఢిల్లీ: ఎర్రకోట హింసాత్మక ట్రాక్టర్ ర్యాలీ ఘటనలో ప్రధాన నిందితుడు దీప్ సిధ్దూని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కర్నాల్‌లో ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే ఘటనకు సంబంధించి మరో నిందితుడు ఇక్బాల్సింగ్ను హౌషియాపూర్ పంజాబ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా, వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాడు రైతన్నలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో కదం తొక్కారు. ఆక్రమంలోనే కొందరు పోలీసులను దాటుకుని వెళ్లి ఎర్రకోటపై ఖలీస్తాని జెండా ఎగురవేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దేశ ఖ్యాతిని పలుచన చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు బయటి వ్యక్తులు రైతులను రెచ్చగొట్టి ర్యాలీ హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారని పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఎర్రకోట ఘర్షణల నిందితుడు ఇక్బాల్‌సింగ్‌పై ఇప్పటికే 50వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. అతన్ని పోలీసులు ‘మోస్ట్ వాంటెడ్’ గా పేర్కొనడం గమనార్హం. ఇదిలాఉండగా.. మరో నిందితుడు సుఖ్‌దేవ్ సింగ్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గత ఆదివారం పట్టుకున్నారు. -
మట్టిలో కలిసిపోయిన కానిస్టేబుల్
సాక్షి, చోడవరం టౌన్(విశాఖపట్నం): మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబం వారిది. కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చినా ఆ పని మానలేదు. ఇటుకల తయారీకి మట్టిని సిద్ధం చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడడంతో ఆ మట్టిలో కూరుకుపోయి ఓ వ్యక్తి మృత్యువాతపడిన హృదయవిదారక సంఘటన జుత్తాడలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జుత్తాడ గ్రామానికి చెందిన అంబటి సూర్యనారాయణ(33) విశాఖపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగిసిన తరువాత స్వగ్రామం వచ్చాడు. ఇతని తండ్రి ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. దీంతో సూర్యనారాయణ రాత్రి భోజనం చేసిన తరువాత ఇటుకల బట్టీ వద్ద మట్టిని ట్రాక్టర్‌తో తొక్కించడానికి వెళ్లాడు. మట్టి తొక్కిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. సూర్యనారాయణపై ట్రాక్టర్ పడడంతో మట్టిలోకూరుకుపోయి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ ఉన్న కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సూర్యనారాయణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య రేవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మునాఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సూర్యనారాయణ 2013లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులు,భార్య,ఇద్దరు కుమార్తెలున్నారు. సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఇదే!
సాక్షి, ముంబై: సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది. ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు. (అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 వచ్చేసింది) నాలుగు గంటల్లోనే ఫుల్ చార్జింగ్... ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ. అని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని(రెండు టన్నుల ట్రాలీతో) మిట్టల్ వివరించారు. నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్ చేశామని, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తయారు చేశామన్నారు. -
ఆ దృశ్యం నన్ను కదిలించింది: సోనూసూద్
మన చుట్టూ సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్నిటిని చూస్తూ వెళ్లిపోతాం, కొన్నింటి దగ్గర ఆగి ఓ క్షణం జాలిపడ్డ తర్వాత అక్కడి నుంచి కదులుతాం. కానీ సినీ విలన్, రియల్ హీరో సోనూ సూద్ అలా చేయలేదు. తనకు కనిపించే కష్టాన్ని చూసి కదిలిపోయారు. జాలిపడితే ఫలితం రాదని ఆయనకు బాగా తెలుసు. అందుకే కష్టమైనా నష్టమైనా వారికి సాయం చేయాలని తలిచారు. ఆ సంకల్పమే అతడిని ముందుకు నడిపించింది. తన ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ అండగా నిలబడుతున్నారు. ఈ లాక్డౌన్లోని ఎన్నో కథలను ఆయన పుస్తక రూపంలో తీసుకొచ్చారు. "ఐయామ్ నో మెస్సయ్య"(నేను రక్షకుడిని కాదు) పేరుతో ఇటీవలే ఇది మార్కెట్లోకి వచ్చింది. అందులో సోనూ చిత్తూరువాసి నాగేశ్వర్ రావు గురించి ప్రస్తావించిన రియల్ స్టోరీ ఇది.. రైతును ఆదుకున్న ట్రాక్టర్.. రైతు పేరు: నాగేశ్వర్ రావు, అతడి కుటుంబం ప్రాంతం: చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ సమస్య: పేదరికంతో కూతుళ్లతో పొలం దున్నించడం పరిష్కారం: రైతుకు ట్రాక్టర్, అతడి కూతుళ్లకు విద్యను అందించడం సమయంతో సంబంధం లేకుండా పొలాల్లో పని చేసేవారికి ఇది అంకితం. ఇది నా సొంతంగా చెప్తున్న లైను కాదు. ఓసారి ఎక్కడో చదివాను, ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అనిపించింది. క్రిష్ణమూర్తి అనే వ్యక్తి చిత్తూరులోని మదనపల్లికి చెందిన టమాట రైతు పడుతున్న కష్టాలను వీడియో తీసి జూలై 25న షేర్ చేశాడు. అందులో ఆ రైతు కాడెడ్లకు బదులుగా కన్న కూతుళ్లతో పొలం దున్నించాడు. అది చూసి నా మనసు చలించిపోయింది. చదువుకోవాల్సిన పిల్లలు పొలం దున్నడం ఏంటని బాధపడ్డాను. ఆ దృశ్యం నా మెదడులో బలంగా నాటుకుపోయింది. కేవలం బాధపడితే ప్రయోజనం ఉండదు. అందుకే వాళ్లకు ఆపన్నహస్తం అందించాలనుకున్నా. ఆంధ్రాలో ఉన్న నా స్నేహితులను అడిగి రైతు వివరాలు అడిగితే అతడిది చిత్తూరులోని మదనపల్లివాసి అని తెలిసింది. ఆ రాష్ట్రంలో ఎన్నోసార్లు షూటింగ్‌కు వెళ్లాను కానీ చిత్తూరుకు వెళ్లలేదు. అప్పుడే అనుకున్నా, ఒక్కసారైనా అక్కడికి వెళ్లి తీరాలని! (చదవండి: నా బంగారు తల్లి.. డాషింగ్ బావ: వరుణ్ తేజ్) అది శనివారం రాత్రి 9.30 గంటలు. నా ఫ్రెండ్స్ రైతు ఫోన్ నంబర్ ఇవ్వడంతో అతడికి కాల్ చేసి మాట్లాడాను. తనకో టీ స్టాల్ ఉండేదని, కానీ కరోనా వల్ల అది మూతపడటంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటించాల్సి వస్తుందని నాగేశ్వర్ చెప్పాడు. అప్పుడే అతడికి మాటిచ్చాను. అమ్మాయిల భుజాల మీద కాడిని తీసేయండి, మీకు నేను ఎద్దులను కొనిస్తాను అని చెప్పాను. అతడు దానికి చాలా సంతోషించాడు. తిరుపతిలో ఎద్దులు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని సంబరపడ్డాడు. అంతలోనే నా బుర్రలో ఓ లైటు వెలిగింది. ట్రాక్టర్ కొనిస్తే సరిపోతుంది కదా అనిపించింది. అదే మాట అతడితో చెప్పాను. కానీ దీనికి ప్రతిఫలంగా తన కూతుళ్లను చదివించాలని మాట తీసుకున్నాను. మాటిచ్చానన్న మాటేగానీ అది ఆచరణలో పెట్టగలనా అని నాలో సంఘర్షణ మొదలైంది. లాక్డౌన్లో అతడికి ట్రాక్టర్ పంపించగలనా? అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. తర్వాతి రోజు ఉదయం చత్తీస్‌ఘడ్‌లో ఉన్న నా స్నేహితుడు కరన్ గిల్హోత్రా సాయంతో ఇండియాలో టాప్ ట్రాక్టర్ కంపెనీలలో ఒకటైన సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్‌తో మాట్లాడాను. అతడు ఆ రోజు సెలవులో ఉన్నప్పటికీ మా కోరిక బలమైనది గ్రహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకల్లా ట్రాక్టర్‌ను రైతు కళ్ల ముందుంచాడు. (చదవండి: మా ఆత్మకథ చెబుతాం) ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రైతు రైతు నాగేశ్వరరావు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అతనికి అందిన సహాయం వివరాలు... 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరు, జనవరిలో బదిలీ 3. నాగేశ్వర్రావు చిన్న కుమార్తెకు ‘జగనన్న అమ్మ ఒడి’ కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం 4. పెద్ద కూతురుకు ‘జగనన్న తోడు’ కింద లబ్ధికోసం దరఖాస్తు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది. 5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది. 6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250 అందుకుంటున్నారు. 7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం పొందింది. ఉచిత రేషన్ కూడా తీసుకుంది. 8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలను నాగేశ్వర్రావు తీసుకున్నారు. -
రైతులకు మద్దతుగా.. పెళ్లి కొడుకు వినూత్న ఆలోచన
చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో హరియాణాకు చెందిన ఓ పెళ్లికొడుకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్‌పై పెళ్లి మంటపానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం సిటీకి మారి ఉండవచ్చు. కానీ మన మూలాలు మాత్రం వ్యవసాయమే. రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి జనాల మద్దతుందని తెలపడం కోసమే ఇలా ట్రాక్టర్‌పై మండపానికి వచ్చాను అని తెలిపాడు. (చదవండి: రైతులకు బాసటగా..లంగార్ సేవలు) Haryana: Groom in Karnal leaves his luxury car behind & rides a tractor to his wedding venue to show support to farmers' protest. “We might be moving to city but our roots are farming. Farmers should be priority. We want to send message that farmers have public support,” he says pic.twitter.com/KUgJkLleAy — ANI (@ANI) December 4, 2020 ఇక వరుడి తల్లి మాట్లాడుతూ.. ‘పెళ్లికి కూడా భారీగా ఖర్చు చేయాలని మేం అనుకోవడం లేదు. సింపుల్‌గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మిగతా డబ్బుని రైతులకు భోజనం అందిస్తున్న గురుద్వార స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తాం’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. -
పండుగ వేళ విషాదం
వర్గల్(గజ్వేల్): కాసింత నిర్లక్ష్యం పసిబాలుడి ఉసురు తీసింది. ఇంటి ఎదుట రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు చిదిమేసింది. పండుగ సంబురాలకు సిద్ధమవుతున్న వేళ శుక్రవారం ఈ విషాదకర ఘటన మండల కేంద్రం వర్గల్లో చోటు చేసుకుంది. గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన ప్రకారం..వర్గల్‌కు చెందిన బోయిని సాధు–మాధవి దంపతులకు శశివర్ధన్(7), యశ్వంత్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యశ్వంత్ ఇంటి ఎదుట రోడ్డుపై ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పక్కింటికి మామిండ్ల సంపత్ అజాగ్రత్తగా ట్రాక్టర్‌ను నడుపుతూ వచ్చి బాలుడిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్నారి యశ్వంత్‌ను వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించగా అప్పటికే మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరుమన్నారు. నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయని హృదయవిదారకంగా విలపించారు. సరిగ్గా దీపావళి పండుగ వేడుకలు జరుపుకోవాల్సిన తరుణంలో ఆ కుటుంబం పెనువిషాదంలో కూరుకుపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి బోయిని సాధు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరన్న తెలిపారు. -
నారా లోకేష్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ట్రాక్టర్ నడిపారు. అయితే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి ఒరిగింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్‌ను అదుపు చేసి లోకేష్‌ను కిందకు దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నారా లోకేష్ ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదం
-
ఇండియా గేట్: ట్రాక్టర్‌ను దగ్థం చేసిన రైతు సంఘాలు
-
30 ఏళ్ల కృషి; ఆనంద్ మహింద్రా ఔదార్యం
పట్నా: ఊరి బాగుకోసం 30 ఏళ్లు కష్టపడి నీటి కాలువ తవ్విన బిహార్‌లోని లంగీ భుయాన్‌పై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రశంసలు కురిపించారు. భుయాన్ తవ్విన కాలువ పిరమిడ్స్, తాజ్‌మహల్ వంటిదని అన్నారు. ఆయన కృషికి చిరు బహుమానంగా ట్రాక్టర్ ఇవ్వనున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. ఆ పెద్దాయనకు తమ మహింద్రా ట్రాక్టర్‌ను అందించడం గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు. కాగా, బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి లంగీ భుయాన్.. ఆ ఊరి కొండలపై కురిసిన వాననీరు వృథా పోకుండా 30 ఏళ్ల క్రితం ఓ బృహత్తరమైన ఆలోచన చేశాడు. కొండ దగ్గర నుంచి కాలువ తవ్వి వర్షం నీరును ఊరికి తరలిద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాడు. అప్పుడు మొదలైన కాలువ తవ్వకం తాజాగా పూర్తయింది. అయితే, భుయాన్ కష్టానికి గ్రామస్తులు పెద్దగా సాయం చేయలేదు. ఒక్కడే 3 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల అతని ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే రోహిన్ వర్మ అనే వ్యక్తి భుయాన్‌ను ఆదుకోవడం ఆనంద్ మహింద్రా అదృష్టంగా భావిస్తారనుకుంటా అని ఆయన్ని ట్యాగ్ చేశాడు. (చదవండి: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?) అప్పటికే భుయాన్ గొప్పతనంపై ట్విటర్లో స్పందించిన ఆనంద్ మహింద్రా.. ఆ పెద్దాయనకు ట్రాక్టర్ ఇస్తానని రిప్లై ఇచ్చాడు. ఇదిలాఉండగా.. బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. (చదవండి: సామాన్యుడి 30 ఏళ్ల కృషి, ఆ ఊరికి వరప్రదాయిని) उनको ट्रैक्टर देना मेरा सौभाग्य होगा। As you know, I had tweeted that I think his canal is as impressive a monument as the Taj or the Pyramids. We at @MahindraRise would consider it an honour to have him use our tractor. How can our team reach him @rohinverma2410 ? https://t.co/tnGC5c4j8b -
చిన్నారిని చిదిమేసిన రొటావేటర్
మిడుతూరు(కర్నూలు జిల్లా): రొటావేటర్లో పడి ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తాత అప్రమత్తతతో మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఖాజీపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా(మాబాషా), షంషుద్దీన్ బేగంకు సుహాన, రిజ్వాన్, అస్లాం కుమారులు. మొక్కజొన్న చేనులో రొటావేటర్ కొట్టడానికి తాత ఖాసీంవలి వెళ్తుండగా రిజ్వాన్(6), అస్లాం(4) వెంటపడ్డారు. స్టీరింగ్ వద్దే మనవళ్లను కూర్చోపెట్టుకుని పొలానికి వెళ్లాడు. అక్కడ రొటా వేటర్‌తో పొలాన్ని దున్నుతుండగా కుదుపులకు మనవళ్లు ఒక్కసారిగా కిందపడబోయారు. డ్రైవింగ్ చేస్తూనే అస్లాంను ఓ చేత్తో పట్టుకోగా రిజ్వాన్ రొటావేటర్లోకి పడిపోయాడు. కళ్ల ముందే నుజ్జునుజ్జు కావడంతో గుండెలు బాదుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. -
మూడెకరాల కోసం ట్రాక్టర్‌నే తయారు చేశాడు..
పెద్దపప్పూరు: పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు పెద్దపప్పూరు మండలం పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన హబీబ్‌బాషా. వృత్తి పరంగా మోటార్ రీవైండింగ్, లేత్ వర్క్, వెల్డింగ్ పనులు చేస్తున్న ఇతను చదువుకుంది తొమ్మిదో తరగతి మాత్రమే. తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయ పనుల కోసం సొంతంగా ఓ యంత్రాన్నే తయారు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఏడాది పాటు శ్రమించి రూ.60 వేల ఖర్చుతో ఓ మినీ ట్రాక్టర్‌నే సిద్ధం చేశాడు. ఇందు కోసం గ్రామాలన్నీ వెదికి మూలన పడేసిన ఓ డీజిల్ ఇంజన్‌ను రూ.8,500కు కొనుగోలు చేశాడు. తర్వాత కమాండర్ జీప్‌కు వచ్చే గేర్ బాక్స్‌ను కూడా సమకూర్చుకుని నెలల పాటు శ్రమించి తన వర్క్‌షాప్‌లో ఈ ట్రాక్టర్‌కు రూపకల్పన చేశాడు. దీని సాయంతో తన మూడు ఎకరాల పొలంలో వ్యవసాయ పనులను విజయవంతంగా చేసి చూపించాడు. తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసి తన తయారీకి తిరుగులేదని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వాహనాన్ని రైతులకు అందుబాటులో ఉంచాడు. ఎవరైనా రైతులు సంప్రదిస్తే తక్కువ బాడుగకు అందజేస్తున్నాడు. రూ.400 డీజిల్ వేసుకుంటే ఆరు గంటల పాటు వ్యవసాయ పనులు చేసుకోవచ్చని హబీబ్‌బాషా చెబుతున్నాడు. అన్నీ బాగున్నా.. ఈ వాహనానికి లైటింగ్ సమస్య ఒక్కటే వేధిస్తోందని, త్వరలో అధిగమిస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. -
న్యూహాలెండ్ అగ్రికల్చర్ కొత్త ట్రాక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ పనిముట్ల సంస్థ న్యూహాలెండ్ అగ్రికల్చర్ (సీఎన్ హెచ్ ఇండస్ట్రియల్ బ్రాండ్) సరికొత్త 5620 టిఎక్స్ ప్లస్ ట్రాక్టర్ని లాంచ్ చేసింది. ఈ క్రొత్త 65 హెచ్ పీ 5620 టిఎక్స్ ప్లస్ అద్భుతమైన ట్రాక్టర్ నూతన వ్యవసాయ సాంకేతికతల ఆధారంగా రూపొదించినట్టు తెలిపింది. విశిష్టతలు ప్రత్యేకతలు ఈ నవతరపు ట్రాక్టర్‌కి అత్యాధునికమైన ఎఫ్ పి టి ఇంజన్ ను అమర్చింది. మెరుగైన ఇంధన సామర్ధ్యం, పవర్, టార్క్ విశిష్టతలు దీని సొంతం. డ్యూయల్ క్లచ్ సిస్టం, పవర్ స్టీరింగ్ ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ ఫ్యాక్టరీ ఫిట్టేడ్ ఆర్ఓపిలు అండ్ కేనోపీ ప్రధాన ఆకర్షణ. న్యూహాలెండ్ 5620 టిఎక్స్ ఒక ఆధునిక సీట్, ఫ్లాట్ ఫ్లోర్, ఆధునిక డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుంది. దీంతోపాటు ఈ ట్రాక్టర్ చక్కని స్టైలింగ్ , అద్భుత డిజైన్ విశేషంగా నిలుస్తోంది. స్కై వాచ్ ఈజీ తో ట్రాక్టర్ని ప్రో-యాక్టివ్ అలర్ట్స్ ద్వారా ట్రాక్ ట్రేస్ చేసుకోవచ్చు. అలాగే 24 సెన్సింగ్ పాయింట్స్ అన్నిరకాల నేలల్లోనూ అందించే మెరుగైన సెన్సింగ్‌తో మరింత ఇంధనం పొదుపు అవుతుందని కంపెనీ తెలిపింది. మరికొన్ని ఇతర ఇన్ బిల్ట్ విశిష్టతలు: హెవీ డ్యూటీ 12+3 యూజీ గేర్ బాక్స్ ఇండిపెండెంట్ పీటీవో క్లచ్ లీవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్ సౌకర్యవంతమైన ప్లాట్ఫారం ఫ్రంట్ వెయిట్ క్యారియర్ 55 కేజి న్యూట్రల్ సేఫ్టీ స్విచ్ క్లచ్ సేఫ్టీ లాక్ ట్రాన్స్మిషన్ కవర్ 60 లీటర్ల ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అత్యుత్తమ విశిష్టతలు, సాంకేతిక లక్షణాలుతో క్రొత్త ట్రాక్టర్ ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని సీఎన్ హెచ్ ఇండస్ట్రియల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ తరుణ్ ఖన్నా తెలిపారు. ఇది రైతు సోదరులకు డీలర్లకు బాగా నచ్చుతుందనటంలో సందేహం లేదని, ఈ క్రొత్త మెషీన్ డిజైన్ వ్యవసాయ కార్యకలాపాలు మరింత తక్కువ అలసటతో, ఎక్కువ ఉత్పాదకతతో జరిగేలా సాయపడుతుందన్నారు. -
వైరల్: ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికాడు..
-
వైరల్: ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికాడు..
ముంబై: ఓ రైతు ఇంజనీర్లా వినూత్న ఆలోచన చేశాడు. చేతులకు పని చెప్పకుండానే ట్రాక్టర్‌తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర బుధవారం ట్విటర్లో పంచుకున్నారు. ‘గ్రామాల్లో మా ట్రాక్టర్లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు. అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇంజనీర్ కానీవారు ఇలా చేయగలరా’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. (చదవండి: నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ..) People keep sending me clips of how our tractors are used as ‘multi-tasking’ beasts of burden in rural areas. This one was a new one for me. Can the non-engineers amongst you figure out what essentially they have rigged out here? pic.twitter.com/OcKRYWXDyK — anand mahindra (@anandmahindra) August 5, 2020 అయితే 1.12 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మహరాష్ట్రకు చెందిన ఈ రైతు ట్రాక్టర్ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు. నాబ్లను ఉపయోగించి ట్రాక్టర్ ఇంజన్ సాయంతో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా 2, 3 నిమిషాలలో పాలను పితకొచ్చు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకుంటోంది. అతడి వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అందుబాటులో ఉన్న సాంకేతికతను అతడు ఉపయోగించిన తీరు అద్భుతం’ అంటూ నెటజన్లు కామెంట్స్ పెడుతున్నారు. -
సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో పనులు ప్రారంభం
-
సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో పనులు ప్రారంభం
సాక్షి, చిత్తూరు: కరోనా కాటుతో యావత్ భారతం లాక్డౌన్లో చిక్కుకు పోయింది. జనజీవనం స్థంభించి ఆర్థిక కుంగుబాటు దిశగా సాగడంతో అన్‌లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ వ్యాపారాలన్నీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు కేవీపల్లి మండలం మహల్‌కు చెందిన నాగేశ్వర్రావు పరిస్థితి కూడా ఈ కోవలోనిదే. కరువు కాటకాలవల్ల కుటుంబంతో సహా గ్రామం వదలిన ఆయన మదనపల్లిలో ఏడాదిగా టీకొట్టు నడిపిస్తున్నాడు. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌తో పరిస్థితి తల్లకిందులైంది. చేసేదేమీ లేక తిరిగి ఇంటిబాట పట్టాడు. వర్షాలు కూడా పడటంతో ఉన్న భూమిలోనే వ్యవసాయానికి సిద్ధమయ్యాడు. అయితే, ఎద్దులు కొనే స్థోమత లేకపోవడంతో ఇద్దరు కుమార్తెలు, భార్య సాయంతో సాగు ప్రారంభించాడు. (చదవండి: రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు) ఇద్దరు కుమార్తెలు కాడెద్దులుగా మారి సాళ్లు చేయగా.. దంపతులిద్దరు విత్తనాలు వేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన నటుడు సోనూ సూద్ వారికి ట్రాక్టర్ ఇస్తానని ప్రకటించి, గంటల వ్యవధిలోనే హామీని నిజం చేశారు. నిన్న మధ్యాహ్నం ట్విటర్ ద్వారా రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇస్టున్నట్టు చెప్పిన సోనూ, సాయంత్రం తన మనుషుల ద్వారా ట్రాక్టర్, రోటవేటర్‌ను రైతు నాగేశ్వరరావు కుటుంబానికి అందించారు. దీంతో ఆ రైతు కుంటుంబం ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందంలో మునిగిపోయింది. తమ కష్టాలను తీర్చిన సోనూ సూద్ చల్లగా ఉండాలని రైతు కుటుంబం వ్యాఖ్యానించింది. రియల్ హీరోకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో రైతు నాగేశ్వర్రావు సోమవారం ఉదయం వ్యవసాయ పనులు ప్రారంభించాడు. (సోనూ.. నువ్వు సూపర్) -
రైతుకి సాయం
కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను బస్సుల్లో, విమానంలో వారి సొంత ఊర్లకు పంపించారు నటుడు సోనూ సూద్. అంతేకాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓ యాప్‌ని ప్రారంభించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు వ్యవసాయం కోసం ఓ ట్రాక్టర్ని కొనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా కె.వి. పల్లి మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకి కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బుల్లేవు. ఖరీఫ్ విత్తనాలు విత్తేందుకు ఎద్దులకు డబ్బులు లేకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలను ఎద్దుల స్థానంలో ఉంచి పొలం దుక్కి దున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. వీడియో చూసిన సోనూసూద్ ఆ కుటుంబానికి ఎద్దులు కొనిస్తానని ట్వీటర్ వేదికగా ఆదివారం ప్రకటించారు. ఆ తర్వాత మరో పోస్టులో ‘‘ఆ రైతు ట్రాక్టర్‌కి అర్హుడు.. అందుకే ఎద్దులు కాదు.. ట్రాక్టర్ కొనిస్తాను.. ఈ రోజు సాయంత్రంలోపు ట్రాక్టర్ వారికి అందుతుంది.. వారి పిల్లలు చదువుపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. అన్నట్టుగానే ఆదివారం సాయంత్రానికి నాగేÔ¶ ్వరరావు కుటుంబానికి దాదాపు రూ.8లక్షలు విలువ చేసే ట్రాక్టర్, రోటోవేటర్ అందేలా చేశారు సోనూసూద్. -
8 లక్షల ట్రాక్టర్, రొటావేటర్..
మదనపల్లె: ప్రముఖ నటుడు సోనూసోద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి తమవంతు సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియోను చూసి చలించిపోయారు. గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి రూ. రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను బహూకరించి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. (గంటల వ్యవధిలోనే సోనూసూద్ సాయం) అసలు ఏం జరిగిందంటే.. మదనపల్లెకు చెందిన పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు పట్టణంలో టిఫిన్ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్వగ్రామం పీలేరు నియోజకవర్గం కేవీ పల్లె మండలం మహల్ రాజుపల్లె. కరోనా విపత్తు కారణంగా హోటల్ వ్యాపారం నిలిచిపోవడంతో స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో తమ పొలంలో దుక్కులు దున్నేందుకు ఎద్దులు లేకపోవడంపై తన బాధను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. దీంతో ఇద్దరు కూతుళ్లూ తామే ఆ పనులు చేస్తామన్నారు. దీంతో కాడెద్దుల పాత్రలోకి మారిపోయారు. కుమార్తె సాయంతో పొలాన్ని దున్నారు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విపరీతమైన స్పందన లభించింది. దీనిని చూసిన కృష్ణమూర్తి రైతు నాగేశ్వరరావు, కూతుళ్ల సహాయంపై సోనూసూద్‌కు ట్విటర్లో ట్యాగ్ చేశారు. రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ ఇస్తున్న సోనాలికా కంపెనీ ప్రతినిధులు స్పందించిన సోనూసూద్ దీంతో చలించిన సోనూసూద్ తానున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మొదట రేపు ఉదయానికల్లా ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. కాసేపటికే ఆయన మనసు మార్చుకున్నారు. వారికి కావాల్సింది ఎద్దులు కాదు...ట్రాక్టర్. అది సోమవారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మదనపల్లె నుంచి సోనాలికా కంపెనీకి చెందిన సుమారు రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చారు. సోనాలికా కంపెనీ ప్రతినిధి మహమ్మద్ ఫయాజ్ ట్రాక్టర్‌ను రైతు నాగేశ్వరరావుకు అందజేశారు. వైరల్ అయిన వీడియోపై సినీ నటులు సోనూసూద్ స్పందించి అండగా నిలవడంపై పేదరైతు నాగేశ్వరరావు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ కష్టం సోనూసూద్‌ను కదిలించడం, తమ కుటుంబంపై ఔదార్యం కనపరచడంపై స్పందిస్తూ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని, ఆయన పెద్దమనస్సుకు కుటుంబం మొత్తం పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కష్టాన్ని మాధ్యమాల్లో ప్రసారం చేసి ట్రాక్టర్ వచ్చేందుకు కారణమైన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించారు. సోనూసూద్ స్పందన స్ఫూర్తిదాయకమని పేర్నొన్నారు. -
గంటల వ్యవధిలోనే సోనూ సూద్ సాయం
సాక్షి, చిత్తూరు: కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నటుడు సోనూ సూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ రైతు కుటుంబానికి ఇచ్చిన మాటను గంటల వ్యవధిలోనే నిజం చేశారు. చిత్తూరు జిల్లా కేవిపల్లి మండలం మహల్‌కు చెందిన ఓ రైతు పేదరికంలో మగ్గిపోతున్నాడు. కుటుంబ పోషణకు వ్యవసాయమే ఆధారం కాగా, నేల సాగు చేసేందుకు అతని వద్ద ఎద్దులు కూడా లేవు. దాంతో అతని ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి తండ్రికి వ్యవసాయంలో దన్నుగా నిలిచారు. ఆ అమ్మాయిలిద్దరూ కాడి లాగడంతో వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేశారు. వారి దీన స్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్ వెంటనే స్పందించారు. (చదవండి: ‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన సోనూసూద్) ఈరోజు సాయంత్రానికల్లా రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. అన్నమాట ప్రకారమే ఆదివారం సాయంత్రానికి సదరు రైతు ఇంటి ముందు ట్రాక్టర్ ప్రత్యక్షమైంది. సాయం చేస్తానని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రాక్టర్ ఇవ్వడంతో సోనూపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్ హీరో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నటుడి తక్షణ సాయంపై రైతు కుటుంబం సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయింది. ఆయన దయార్థ్ర హృదయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. (వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్) -
చిత్తూరు ఘటన: చలించిపోయిన సోనూసూద్
సినీ పరిశ్రమలో ఎంతమంది హీరోలున్నా కరోనా సమయంలో పేదల జీవితాల్లో హీరోగా నిలుస్తున్నది మాత్రం ఒక్కరే. అతనే సోనూసూద్. లాక్డౌన్ వల్ల వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున తరుణంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్ వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. (సోనూ సూద్ గొప్ప ప్రయత్నం) మరికొద్దిసేటికే ఆయన మరోసారి స్పందిస్తూ వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్. అది ఆదివారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్లో సేద్యం పనులు చేయడానికి ఆ రైతుకు కాడెద్దులు లేకపోవడంతో అతని ఇద్దరు కూతుళ్లే కాడెద్దులుగా మారారు. ఆ అమ్మాయిలు ఇద్దరు కాడి లాగడం, వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేయడం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన సోనూసూద్ నేనున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చి మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. This family doesn’t deserve a pair of ox 🐂.. They deserve a Tractor. So sending you one. By evening a tractor will be ploughing your fields 🙏 Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD — sonu sood (@SonuSood) July 26, 2020 -
ఎక్కడా చూసి ఉండరు.. ఇండియాలోనే సాధ్యం!
డెహ్రాడూన్: మీరెప్పుడైనా మెట్లపై నుంచి ట్రాక్టర్ నడపడం చూశారా? ఇలాంటివి సినిమాల్లోనే కదా.. అది కూడా గ్రాఫిక్స్‌తో చేస్తారు కానీ నిజజీవితంలో అది అసాధ్యం కదా అని అనుకుంటున్నారా? కానీ కేదార్నాథ్ ఆలయం మెట్లపై ఇది సాధ్యం చేశారు కొందరు యువకులు. ఆలయ నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ యంత్రాలను ట్రాక్టర్‌పై ఉంచి తీసుకెళ్లారు. వారికి సహాయంగా మరికొంతమంది ట్రాక్టర్‌ను మెట్లపై బ్యాలెన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ఆదివారం ట్విటర్లో షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జత చేశారు నందా. ఇప్పటికే ఈ వీడియోను 72,000 మంది చూశారు. అయితే ఈ వీడియోకి సంబంధించి చాలామంది పొడగ్తల వర్షం కురిపించగా, ఆలయ మెట్లపై అంత భారీ యంత్రాలను ఇలా తీసుకెళ్తే మెట్లు పాడవుతాయంటూ కొంత మంది అభ్యంతరం తెలిపారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి ట్రాక్టర్ దొర్లితే వారి ప్రాణాలకే ముప్పు అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. (‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’ ) ఈ ట్రాక్టర్ తయారీసంస్థ లింక్డ్ ఇన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ స్పందిస్తూ.. మా చిన్న ట్రాక్టర్ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. స్థానిక సమస్యలకు సృజనాత్మక పరిష్కారం చూపారు ఆ యువకులు అంటూ ప్రశంసించారు. 2013లో సంభవించిన వరదల దాటికి కేదార్నాథ్ ఆలయం స్వల్పంగా దెబ్బతింది. 2017లో ఆలయ పునర్నిర్మాణానికి ప్రధానికి మోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి తదితర అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను మరింత అభివృద్ధి చేయాలని వాతావరణ మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా ) -
ట్రాక్టర్లనే టార్గెట్‌గా..
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గుంటురు జిల్లా పిడుగురాళ్లలోని మారుతినగర్‌కు చెందిన వేముల శంకర్, కాకుమాను మండలం వల్లూరుకు చెందిన పత్తిపాటి గోపికృష్ణ, పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్‌కు చెందిన నేలటూరి ప్రకాష్, దారివేముల ఏసుబాబు, ప్రకాశం జిల్లా ముల్లమూర్ మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన బాలకోటిరెడ్డి స్నేహితులు. వీరంతా జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. పగలు రెక్కీ.. రాత్రి వేళ చోరీలు ఈ ముఠా సభ్యులు కేవలం ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. జనావా సాలు తక్కువగా ఉన్న పదేశాలను ఎంచుకుని పగలు రెక్కీ నిర్వహించారు. రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి ట్రాక్టర్లను అపహరించుకుని వెళ్తున్నాంటారు. ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో విక్రయించుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. ఈ ముఠాపై ఉమ్మడి రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డారు ఇలా.. పెద్దఅడిశర్లపల్లి మండలం దుబ్బాతండాకు చెందిన రమావత్ మోహన్ గత మార్చి 21న తన ట్రాక్టర్‌ను ఇంటిఎదుట నిలిపి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ ట్రాక్టర్‌ను అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం మండలంలోని రంగారెడ్డిగూడెం స్టేజి వద్ద ఎస్ఐ గోపాల్‌రావు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ట్రాలీలు, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన కొండమల్లేపల్లి సీఐ పరుశురాం, గుడిపల్లి ఎస్ఐ గోపాల్‌రావు, కొండమల్లేపల్లి ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది అన్నిమల్ల శ్రీను, హేమునాయక్, గణేశ్‌లను డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అభినందించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిరప కోత కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఇవాళ సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కూలీ పనులు ముగిసిన అనంతరం కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపడి ట్రాక్టర్ మీద పడటంతో పాటు, విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మృతులు మాచవరం ఎస్సీ కాలనీకి చెందినవారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మాచవరం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రకాశం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
గంటన్నర పాటు ట్రాక్టర్ కింద నలిగి..
భువనేశ్వర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి గంటన్నర పాటు ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని బొయిపరిగుడ సమితిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బొయిపరిగుడ సమితి దశమంతపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు గోరా మాలి, రమేష్ మాలిలు ట్రాక్టర్ నడపుకుంటూ అక్కడి జీడిమామిడి తోటకు బయలుదేరారు. ఆ సమయంలో ఓ పెద్ద గోతిలో పడ్డ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ ట్రాక్టర్ ఇంజిన్ కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడివారు ట్రాక్టర్ క్రిందనుంచి గోరా మాలిని బయటకు తీశారు. అయితే రమేస్ మాలిని బయటకు తీయటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నర కాలం పాటు ఇంజిన్ కింద నలిగిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్‌ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు. -
గడ్డిలారీకి మంటలు..తప్పిన పెను ముప్పు
-
అంతర్ జిల్లాల ట్రాక్టర్ల దొంగలకు సంకెళ్లు
ప్రకాశం, మార్కాపురం: ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులు, యజమానుల నుంచి వాటిని మళ్లీ కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీలకు సకాలంలో వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన కలగొట్ల శ్రీనివాసరెడ్డి, అర్ధవీడుకు చెందిన వై.మహేష్‌లు మార్కాపురంలోని మహీంద్రా షోరూమ్‌లో ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత ట్రాక్టర్‌ను గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన మొలక రమేష్‌కు విక్రయించారు. ట్రాక్టర్‌కు తాము చెల్లించాల్సిన ఫైనాన్స్‌ను రమేష్ చెల్లిస్తాడనే ఒప్పందంతో విక్రయించారు. ఫైనాన్స్ కంపెనీకి ప్రతి నెలా చెల్లించాల్సిన నగదు రమేష్ చెల్లించకపోవటంతో గత నెల 10న స్పందనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు శ్రీనివాసరెడ్డి, మహేష్‌లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్రను ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సుందరరావు, రమేష్‌లు అర్ధవీడు మండలం నాగులవరంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులు మూడు రకాలా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్లు కొన్న రైతులు, యజమానులను మొలక రమేష్ ద్వారా సంప్రదించి వారికి రూ.40 వేలు, రూ.50 వేలు ఇలా చిన్న మొత్తాల్లో డబ్బులు చెల్లిస్తారు. ఫైనాన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మిగిలిన బకాయిలు తామే చెల్లిస్తామని నమ్మకంగా చెబుతారు. ట్రాక్టర్ తెచ్చుకుని ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించకుండా ట్రాక్టర్‌ను అమ్ముకుని తప్పించుకుని తిరుగుతుంటారు. జిల్లాలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లిలో రైతులు, యజమానుల నుంచి మొత్తం తొమ్మిది ట్రాక్టర్లను తీసుకెళ్లి మూడు ట్రాక్టర్లను అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బంధువులు, తెలిసిన వారిని ప్రొత్సహించి వారిలో ఒకరి ద్వారా ట్రాక్టర్ షోరూమ్ వారికి రూ.30 వేలు చెల్లించి అవసరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇతరులకు అమ్ముతున్నారు. ఈ విధంగా మూడు ట్రాక్టర్లను రైతుల పేర్లపై తీసుకుని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పక్కా మోసం గుంటూరు జిల్లాలో ఫైనాన్స్ నుంచి ఏడు ట్రాక్టర్లు, కొటక్ మహింద్రా ఫైనాన్స్ నుంచి మూడు ట్రాక్టర్లు, మణప్పురం ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్‌ను, ఇండస్ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్, ఇతర ఫైనాన్స్ కంపెనీల నుంచి 13 ట్రాక్టర్లు.. ఇల్లా మొత్తం 31 ట్రాక్టర్లు తీసుకున్నారు. మొలక రమేష్ తీసుకున్న రెండు ట్రాక్టర్లను కూడా వేరే వారికి విక్రయించారు. పిడుగురాళ్లలోని శ్రీలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ నుంచి తన పేరు మీద ఒక ట్రాక్టర్, తనకు తెలిసిన వారి పేరు మీద మరో నాలుగు ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించి ఫైనాన్స్ చెల్లించకుండా తప్పించుకుని నిందితులు తిరుగుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రైవేటు ఫైనాన్స్‌ల నుంచి తీసుకున్న 20 ట్రాక్టర్లకు వాయిదాలు చెల్లించలేదు. మొత్తం మీద 67 ట్రాక్టర్లకు సంబంధించి ఇద్దరు నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుందర్రావు చేసిన మోసం గురించి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తున్నామన్నారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాయమాటలు నమ్మి అపరిచితులకు ట్రాక్టర్లను అప్పగించి మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ కేవీ రాఘవేంద్ర, అర్ధవీడు ఎస్ఐ సాంబశివరావులను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అభినందించారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం రూరల్ ఎస్ఐ కోటయ్య ఉన్నారు. -
భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సెలెస్ట్రియల్ ఈ–మొబిలిటీ రూపొందించింది. వినియోగానికి వీలున్న నమూనాను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఉద్యానవనాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ దురైరాజన్ మీడియాకు తెలిపారు. ‘ధర రూ.5 లక్షల లోపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందుకోవచ్చు. డీజిల్ ట్రాక్టరుతో గంటకు రూ.150 ఖర్చు వస్తే, దీనికి రూ.20–35 మధ్య ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వేగం గంటకు 20 కిలోమీటర్లు. 5–8 ఏళ్లు బ్యాటరీ మన్నికగా ఉంటుంది. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యంతో బాలానగర్‌లో ఫ్యాక్టరీ ఉంది. రూ.60 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని వివరించారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
-
నందిగామలో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు ఖమ్మం జిల్లా మధిరకు పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న టాక్టర్.. ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అతివేగం వల్లే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. -
పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..
కర్లపాలెం(బాపట్ల): బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న తన బంగారాన్ని తనకు ఇవ్వాలని అడిగిన సొంత పెద్దమ్మను.. ఓ యువకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన గుంటూరు జిల్లా కొత్తపాలెంలో శనివారం చోటు చేసుకుంది. చందోలు ఎస్ఐ మణికృష్ణ తెలిపిన మేరకు.. కొత్తపాలెంకు చెందిన డేగల శ్రీనివాసరెడ్డి భార్య సుబ్బమ్మ (50)కు చెందిన 16 సవర్ల బంగారాన్ని చెరుకుపల్లి మండలం మార్వాకపాలెంలో ఉంటున్న ఆమె చెల్లెలు పగడం శ్యామల, చెల్లెలి కుమారుడు రాజశేఖరరెడ్డి మూడేళ్ల క్రితం బాపట్ల, చెరుకుపల్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఆ నగదును సుబ్బమ్మ, శ్యామల సొంత ఖర్చులకు వినియోగించుకున్నారు. కొంతకాలం తరువాత బ్యాంకుల్లో ఉన్న తన బంగారం విడిపించమని, తాను తీసుకున్న నగదును సుబ్బమ్మ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చింది. అయితే బంగారం తెచ్చి ఇవ్వకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి మట్టితోలే పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకుని కొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. సుబ్బమ్మ ట్రాక్టర్ తీసుకుని తన ఇంటి వద్ద పెట్టి.. బంగారం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ‘నిన్ను ట్రాక్టర్‌తో తొక్కి చంపేస్తాను.’ అంటూ రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ముందుకు పోనివ్వడంతో.. బంపర్‌పై కూర్చున్న సుబ్బమ్మ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయింది. స్థానికులు ఆమెను రాంబొట్లవారిపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు సుబ్బమ్మ -
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
సాకక్షి, అనంతపురం : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నంబులపూలకుంట సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి సోలార్ పవర్ ప్రాజెక్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్లోబల్ బ్రాండ్‌గా ‘ప్రీత్’ ట్రాక్టర్ !
హైదరాబాద్: పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీత్ గ్రూప్‌నకు చెందిన ‘ప్రీత్ ట్రాక్టర్’ గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించింది. ఇటీవలనే నేపాల్ దేశానికి 111 ప్రీత్ ట్రాక్టర్లను ఎగుమతి చేశామని ప్రీత్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీత్ ట్రాక్టర్లు 25 దేశాల్లో అమ్ముడవుతున్నాయని, యూరప్ దేశాల్లో తమ ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ డైరెక్టర్, గుర్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమండ్‌ను తట్టుకోవడానికి 20 నుంచి 26 హార్స్పవర్ ఇంజిన్ సామర్థ్యం గల కొత్త మోడళ్లను అందించనున్నామని తెలిపారు. -
నవ వరుడి మృతి.. పది రోజుల క్రితమే పెళ్లి..
సాక్షి, కొండపాక(గజ్వేల్): ట్రాక్టర్ అదుపు తప్పి బావిలో పడిన యువకుడు మృతి చెందిన సంఘటన కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దేవి ధర్మయ్య – యాదవ్వల రెండో కుమారుడు దేవి విక్రం (27) దినచర్యలో భాగంగా గురువారం సొంత ట్రాక్టరును గ్రామ శివారులో ఓ రైతు పొలం దున్నుడానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో అడవి పందులు అడ్డంగా రావడంతో తప్పించబోయిన క్రమంలో ట్రాక్టరు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయిందని తెలిపారు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న దేవివిక్రం బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పది రోజుల క్రితమే పెళ్లి.. లకుడారం గ్రామానికి చెందిన దేవి విక్రం తండ్రి ధర్మయ్య గత రెండేళ్ల కిందట మృతి చెండదంటో తల్లి యాదవ్వకు సేవ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విక్రంకు పది రోజుల కిందట మర్కుక్ మండలంలోని ధామర కుంటకు చెందిన భవితతో వివాహం జరిగింది. దీంతో గ్రామంలో విశాధచ్చాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కందూరి కనుకవ్వ–ఐలయ్య కోరారు. ఈ విషయమై మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్
సాక్షి, తెనాలిరూరల్: అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారుల్లో ఒకరిని మృత్యువు రూపంలో పొంచి ఉన్న ట్రాక్టర్ కబళించింది. ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండడంతో ఆందోళనకు గురైన బాలుడు కేకలు వేస్తుండగా, ఆ బాలుడిని రక్షించేందుకు వచ్చిన వారిలో ఓ తల్లి, తన బిడ్డ ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమారుడి పార్థివదేహాన్ని తన పొత్తిళ్లల్లోకి తీసుకుని బోరుమని విలపించింది. మూడేళ్ల బాలుడు ఇంజిన్ స్టార్ట్ చేయగా, 18 నెలల బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన కందుకూరి సులోచన తన భర్త రోశయ్యతో మనస్పర్థల కారణంగా విడిపోయి, 18 నెలల కుమారురు పవన్‌తో సహా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తన స్నేహితురాలయిన అమరావతి ప్లాట్స్‌కు చెందిన తిరుపతమ్మ క్యాటరింగ్ పనులకు వెళుతుండడంతో, జీవనోపాధి కోసం సులోచనా కూడా వెళుతోంది. వారం రోజులుగా అమరావతి ప్లాట్స్‌లో స్నేహితురాలి వద్దే కుమారుడితో కలసి ఉంటోంది. పవన్, స్థానికంగా ఉన్న కొంత మంది చిన్నారులు అక్కడికి సమీపంలోని ఖాళీ స్థలంలో రోజూ ఆడుకుంటుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం అందరూ కలసి ఖాళీ స్థలంలోని ఇసుక గుట్టల వద్ద ఆడుకుంటున్నారు. పవన్‌తో పాటు లోకేష్ అన్న పేరు గల ఇద్దరు చిన్నారులూ అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్ వద్ద ఆడుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ఓ బాలుడు(పేరు లోకేష్) ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చున్నాడు. తాళాలు వాహనానికే ఉండడంతో తెలిసీ తెలియక తిప్పాడు. వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండగా, ఆందోళనకు గురైన లోకేష్ కేకలు వేస్తుండడంతో అక్కడికి సమీపంలోని ఇళ్లలో ఉన్న వారు పరుగు పరుగున ట్రాక్టర్ వద్దకు చేరుకున్నారు. సులోచనా అక్కడకు వెళ్లి, కదులుతున్న ట్రాక్టరుపై ఉన్న లోకేష్‌ను దించేందుకు ప్రయత్నించింది. వాహనం ముందుకు వెళ్లాక చూడగా, దాని కిందే తన ఏకైక కుమారుడు నలిగిపోయి ఉండడంతో షాక్‌కు గురైంది. బిడ్డ మృతదేహాన్ని పొత్తిళ్లలోకి తీసుకుని గుండలవిసేలా కన్నీరు పెట్టింది. భర్తతో విభేదాల వల్ల విడిగా ఉంటున్నా, బిడ్డే తనకు సర్వస్వం అనుకుని, వాడి ఆలనా పాలనాకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పనులకూ వెళుతోంది. అలాంటిది ఆ కుమారుడే మృత్యు ఒడిలోకి వెళ్లడంతో తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తోంది. సమాచారమందుకున్న త్రీ టౌన్ సీఐ బి.హరికృష్ణ ఘనాస్థలాన్ని పరిశీలించారు. విరాలు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ట్రాక్టరును నిర్లక్ష్యంగా ఉంచిన యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కూలీలపై ఘాతుకం
రెక్కలు ముక్కలు చేసుకున్నాడు.. అన్నపానీయాలు మాని ఒళ్లు కూడా హూనం చేసుకున్నాడు.. నిద్రాహారాలు మాని యజమాని చెప్పిన పనులన్నీ చేశాడు.. జబ్బు చేయడంతో ట్రాక్టర్ తోలడానికి వెళ్లలేకపోయాడు.. డబ్బులిస్తే జబ్బు నయం చేసుకుంటానని యజమానిని అభ్యర్థించాడు.. తన పని కాలేదని అతనుకోపం పెంచుకున్నాడు.. డబ్బులడుగుతావా..? అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు.. అంతటితో ఆగక బైక్‌పైవెళ్తున్న అన్నదమ్ములను అతి కిరాతకంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దాష్టీకంమదనపల్లె మండలంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యేనవాజ్బాషా పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె టౌన్ : కూలి డబ్బు ఇవ్వాలని అడిగితే కనికరించకపోగా కూలీలను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేసిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. ఈ ఘటనతో బిడ్డల రెక్కల కష్టంతో బతుకుతున్న రెండు పేద కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ విషాదకర సంఘటనపై రూరల్ ఎస్ఐ దిలీప్ కుమార్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం మొలకలదిన్నెకు చెందిన దంపతులు గంగులప్ప, పార్వతమ్మలది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు హరికుమార్(32) బసినికొండ చంద్రానాయక్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య రెడ్డెమ్మ పిల్లలు స్వర్ణలత(9), సుదర్శన్(5), యశ్వంత్ సాయి(3)లను పోషించుకుంటున్నాడు. పక్కనే నివాసం ఉంటున్న హరికుమార్ పినతండ్రి గంగులప్ప రెండో కుమారుడు నాగభూషణం(18)ది కూడా నిరుపేద కుటుంబం. ఇతన్ని కూడా హరికుమార్ తనవెంట కూలి పనులకు చంద్రానాయక్ వద్దకే తీసుకుపోయేవాడు. అయితే రెండు వారాలక్రితం మరో బండికి వెళ్లిన హరికుమార్, నాగభూషణంలకు ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ డబ్బులు ఇవ్వకుండా మొండిచేయి చూపాడు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్సల నిమిత్తం డబ్బు అవసరమై, అన్నదమ్ములు ట్రాక్టర్ యజమాని వద్దకు వెళ్లిడబ్బులు అడిగారు. అతడు ఇవ్వకపోగా, కూలీలపైనే గొడవకు దిగాడు. తాను డబ్బులిచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని హెచ్చరించి పంపేశాడు. చేసేదిలేక వారు ఎస్టేటుకు చేరుకుని చంద్రానాయక్ ట్రాక్టర్లో ఇసుకను మదనపల్లెకు తరలిస్తుండగా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన చంద్రానాయక్ ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరినీ వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న బిడ్డల మృతితో మొలకలదిన్నెలో రెండు పేద కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాలు వీధినపడ్డాయి. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ ట్రాక్టర్ యజమాని దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే నవాజ్ బాషా పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలోని కూలీల మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ట్రాక్టర్ కింద పడీ మహిళ మృతి
-
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. 8 మందికి గాయాలు
-
ట్రాక్టర్ నడిపిన రాహుల్ : పంజాబ్ సీఎం ఇంట్రెస్టింగ్ ట్వీట్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో బుధవారం పర్యటించిన ఆయన శ్రేణులను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ట్రాక్టర్‌ను నడిపి కొద్దిసేపు హల్ చల్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జాతీయ కాంగ్రెస్ స్టీరింగ్ చేతబట్టిన రాహుల్ గాంధీకి నాయకుడిగా తిరుగేలేదని నిరూపించుకున్నారని కమెంట్ చేశారు. అంతేకాదు 2014లో నరేంద్రమోదీ తమనుంచి లాక్కున్న జాతి అధికార పగ్గాలను రాహుల్‌కు అందించే సమయమిది అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైతులకు భరోసాగా ఉంటాననే హామీ ఇచ్చేందుకే రాహుల్ ట్రాక్టర్ నడిపారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ట్రాక్టర్‌పై రాహుల్‌తోపాటు పంజాబ్ సీఎం లూథియానా ఎంపీ అభ్యర్థి రవ్నీత్ బిట్టు, కాంగ్రెస్ నేత ఆశా కుమార్ లూథియానా బహిరంగ సమావేశం అనంతరం వీధుల్లో ప్రచారం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల చివరి దశలో భాగంగా పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు మే 19 న పోలింగ్ జరగనుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పంజాబ్‌లో సరదాగా ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ Found @RahulGandhi to be greater driver when he took @INCIndia steering wheel. But today’s enjoyable tractor ride with him showed he could drive anything, most of all our nation. Any day better than the ride @narendramodi took us on in 2014! Time to hand over the wheels to Rahul! pic.twitter.com/At99fWamzO — Capt.Amarinder Singh (@capt_amarinder) May 15, 2019 -
పంజాబ్‌లో సరదాగా ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ
-
ట్రాక్టర్ బోల్తా,ఒకరు మృతి
-
ట్రాక్టర్ దొంగల అరెస్టు
కర్నూలు, డోన్ రూరల్: మండల పరిధిలోని చిన్నమల్కాపురం గ్రామంలో గత నెల 30న ట్రాక్టర్ చోరీకి పాల్పడిని ఐదుగురు దొంగలను డోన్ రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు వెళ్లడించారు. చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన గోవర్ధనగిరి వెంకటేష్ గత నెల 30న తన ట్రాక్టర్‌ను ఇంటి వద్ద నిలిపి రాత్రి నిద్రించాడు. ఉదయం లేచి చూడగా ట్రాక్టర్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రామానికే చెందిన కంబగిరి, ప్యాపిలి బీసీ కాలనీకి చెందిన పేట రాజు, పురుషోత్తం, హరిప్రసాద్‌రెడ్డిలను అదుపులోకి తమదైన శైలిలో విచారించగా ట్రాక్టర్‌ను చోరీ చేసి అనంతపురం జిల్లా గార్లదిన్నె గ్రామంలోని సోమలింగారెడ్డి ఇంట్లో ఉంచినట్లు ఒప్పుకున్నారు. దీంతో అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నలుగురితో పాటు సోమలింగారెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు. -
అధికార పార్టీ నేత నిర్వాకం
సాక్షి, ప్రొద్దుటూరు : అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీసిన సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని చర్చాంశనీయంగా మారింది. వాస్తవానికి 20 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కుందూనదిలో ట్రాక్టర్ బోల్తాపడి తీవ్రంగా నష్టం జరిగింది. డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అప్పుడు ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపునకు గడువు ముగి యడంతో యజమాని ట్రాక్టర్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి బీమా కోసం అదే ప్రాంతంలో ట్రాక్టర్‌ను మళ్లీ పడేశారు. తద్వారా ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ దువ్వూరు మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా రోజూ ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామం వద్ద ఉన్న కుంటకు వచ్చి మట్టి తీసుకెళుతున్నారు. ఇలా వచ్చి వెళుతుండగా గత నెల 27న ఉదయం 7.30 గంటలకు మార్గం మధ్యలోని కుందూ నదిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ పడింది. టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరుకు చెందిన రామముర్తి కుమారుడు డ్రైవర్‌గా ఉన్నాడు. వాస్తవంగా ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ప్రమాద సమయంలో చాలా వరకు డీజల్ కారిపోయి కిందపడింది. ఇది జరిగిన సంఘటన. ప్రస్తుతం జరిగిన సంఘటన ప్రమాదం జరిగిన రోజున క్రేన్ సహాయంతో చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఈ ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు చెల్లింపు ఆలస్యమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివనాగిరెడ్డి ఇటీవల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇన్సూరెన్స్ కోసం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డ్రైవర్ ద్వారా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి అదే కుందూ నదిలో పడేశారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి బంధువులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. -
ట్రాక్టర్ కింద పడి ఇంటర్ విద్యార్ధిని మృతి
-
రంగరాజన్న రైతు రథం
పశ్చిమగోదావరి, ఆచంట: రైతులకో శుభవార్త. రూ.లక్ష సబ్సిడీపై పెద్దట్రాక్టర్లు అందించేందుకు వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శ్రీకారం చుట్టారు. అంతేకాదు. పన్నులు సైతం చెల్లించకుండా మినహాయింపునిచ్చారు. ఈ అవకాశం జిల్లాలోని రైతులందరికీ రాజకీయాలకతీతంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకంతో అవస్థలు ప్రస్తుతం ప్రభుత్వం రైతు రథం పథకం కింద రూ.1.50 లక్షల సబ్సిడీతో రైతులకు పెద్ద ట్రాక్టర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో రైతులు ట్రాక్టరు పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. కాళ్లరిగిపోయేలా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టరుకు రూ.50 వేల వరకూ అనధికార మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇంత చేసినా చివరకూ ట్రాక్టర్ అందుతుందో లేదో భరోసా ఉండడం లేదు. అధికార పార్టీ నేతలకే ట్రాక్టర్లు అందుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినబడుతున్నాయి. రైతుల కష్టాలకు చలించి.. ఈనేపథ్యంలో రైతులు పడుతున్న అవస్థలు తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేత శ్రీరంగనాథరాజు చలించిపోయారు. తాడేపల్లిగూడెంలోని మహీంద్రా ట్రాక్టర్ డీలర్‌తో సంప్రదింపులుజరిపారు. రైతులకు ఇన్వాయిస్పై రూ.లక్ష తగ్గింపుతోపాటు, పన్ను కూడా చెల్లించకుండా నేరుగా ట్రాక్టరు చేరేలా ఏర్పాట్లు చేశారు. డీలరు తగ్గించే మొత్తం తానే చెల్లిస్తానని శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడానికి ముందుకొచ్చారు. మొదటి ట్రాక్టరు పంపిణీ : ఆచంట మండలం శేషమ్మచెరువులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇదే మండలం భీమలాపురం గ్రామానికి చెందిన రైతు కుడిపూడి వెంకటరత్నం(చిన్నా)కు మొట్టమొదటి ట్రాక్టరును శ్రీరంగనాథరాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల సాధకబాధలు తెలుసునని, ట్రాక్టరు కోసం వారు పడుతున్న కష్టాలు తెలుసుకుని వారికి తగ్గింపుతో ట్రాక్టర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. కుల మతాలకు అతీతంగా జిల్లాలోని సన్న,చిన్నకారు రైతులందరికీ ట్రాక్టర్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షలాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీరంగనాథరాజు రైతన్నకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకోవడం పట్ల రైతుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుంకర సీతారామ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడవర్తి వెంకన్నబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పాల వెంకటేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావు, కర్రి వెంకటనారాయణ(వాసు), వైట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
‘గంగా స్నానం చేసి వస్తేనే గ్రామంలోకి రానిస్తాం’
భోపాల్ : అనుకోకుండా జరిగిన ఘటనకు ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల ఆవు మృతికి కారణమైన వ్యక్తి, అతని కుటుంబానికి గ్రామ పంచాయతీ సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానం చేశారు. గంగానదిలో మునిగి వస్తేనే తిరిగి గ్రామంలోకి రావాలని హుకుం జారీ చేశారు. దాంతోపాటు ఊరంతా భోజనాలు (కన్య అండ్ బ్రాహ్మణ్ భోజ్), ఒక గోవును దానంగా కూడా ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో తిరిగి ఊర్లోకి రానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ ఘటన భోపాల్‌కు 402 కిలోమీటర్ల దూరంలోని షియోపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు.. పప్పు ప్రజాపతి (36) ఎప్పటిలాగానే తన ఇంటివద్ద ట్రాక్టర్‌ను పార్కింగ్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఆవును అతను గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచమ్ సింగ్ పంచాయతీ నిర్వహించాడు. ప్రజాపతి గో హత్య చేశాడని తేల్చిన పంచాయతి సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానించారు. ‘ట్రాక్టర్ని పార్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ట్రాలీ వెనక చక్రాల కిందపడి ఆవు చనిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు చాలా బాధగా ఉంది. కానీ, పంచాయతీ పెద్దలు నేను గో హత్య చేశానంటూ దోషిగా నిలబెట్టారు. నాతో సహా కుటుంబం మొత్తానికి శిక్షలు ఖరారు చేశారు’ అని ప్రజాపతి వాపోయాడు. ఘటనపై సమాచారం అందిందనీ, అవసరమైన చర్యలు తీసకుంటామని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేంద్ర రాయ్ చెప్పారు. కాగా, పంచాయతీ తీర్పునకు కట్టుబడి ప్రజాపతి కుటుంబంతో సహా గంగానదిలో స్నానానికి బయలుదేరారు. పాపం మూటగట్టుకున్నారు.. గో హత్య చేసి ప్రజాపతి కుటుంబం పాపం మూటగట్టుకుంది. పంచాయతీ విధించిన శిక్షను వారు అనుభవిస్తే పాపపరిహారం జరుగుతుంది. -ఓం ప్రకాశ్ గౌతమ్, పంచాయతీ మెంబర్ -
మృత్యుబావి
ఎస్.రాయవరం(పాయకరావుపేట): నేలబావి మృత్యు కూపమైంది. ఇద్దరి నిండు ప్రాణాలను మింగేసింది. నీరు లేకుండా నిరుపయోగంగా పడి ఉన్న నూతిని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఆ బావి పెను ప్రమాదానికి కారణమైంది. అందులో నీరు ఉండి ఉంటే మరికొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. హైవే సమీపంలో ఉన్న బావిని పూడ్చివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మండలంలోని గోకులపాడు వద్ద ప్రయాణిస్తున్న ట్రాక్టర్ తొట్టె ఊడి నీరులేని నేలబావిలో పడి గురువారం ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్.రాయవరం నుంచి పాయకరావుపేట మండల శ్రీరాంపురం కొబ్బరికాయలు తీసుకెళ్లేందుకు గురువారం ఉదయాన్నే బయలు దేరిన ట్రాక్టర్లో డ్రైవర్, మరో ఏడుగురు ఉన్నారు. ట్రాక్టర్ గోకులపాడు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా అకస్మాత్తుగా వచ్చిన మోటారు సైక్లిస్టును తప్పించడానికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ తొట్టె ఊడిపోయి సమీపంలోని నేలబావిలో పడింది. ఇంజిన్ వేరుపడడంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కర్రివానిపాలెం గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి పినపాత్రుని సన్యాసిరావు(60), లింగరాజుపాలెం గ్రామానికి చెందిన కూలీ పుణ్యవంతుల అర్జున్ (50) తొట్టె కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. ఎస్.రాయవరానికి చెందిన దేశాబత్తుల సురేష్, బొల్లం సత్యనారాయణ, కర్రి వెంకటసూరి, లింగరాజుపాలెం గ్రామానికి చెందిన గొర్ల గోవిందు, సర్వసిద్ధి రమణ తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రాక్టర్‌ను ఢీకొని బైక్ బోల్తాపడి చిన్నగుమ్ములూరుకు చెందిన చుక్కా వరలక్ష్మి తలకు తీవ్ర గాయమైంది. వీరందరికీ నక్కపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్.రాయవరం ఎస్ఐ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 17రోజుల్లో కుమార్తెకు పెళ్లి ఉందనగా.. కూలి పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పుణ్యవంతుల అర్జున్ కుమార్తెకు డిసెంబర్ 2న పెళ్లి నిశ్చయమైంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి పనులు చూసుకుంటూనే కూలి పనులకు వెళుతున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అర్జున్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా గోనె సంచుల వ్యాపారి పినపాత్రుని సన్యాసిరావు తెలిసిన వారి ట్రాక్టర్‌పై వెళితే దారి ఖర్చులు మిగులుతాయని భావించాడు. ఎస్.రాయవరం నుంచి గోకులపాడు వచ్చే సరికి ట్రాక్టర్ రూపంలో మృత్యువు అతడిని కబళించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారంతా రోజు కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వారంతా సంఘటన స్థలానికి చేరుకుని బావిలో పడిన వారిని ఒడ్డుకు చేర్చారు. బావిలో నీరు ఉంటే పడిన ఏడుగురు చనిపోయి ఉండేవారని, నీరు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని పలువురు పేర్కొన్నారు. బాధితులకు బాబూరావు పరామర్శ ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ గొల్ల బాబూరావు నక్కపల్లి ఆస్పత్రికి చేరుకుని మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాబూరావు వెంట నాయకులు మధువర్మ ఉన్నారు. -
పులిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు
లఖిమ్‌పూర్‌ఖేరీ: ఓ వ్యక్తిపై ఆడపులి దాడిచేయడంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ఆ క్రూర జంతువును ట్రాక్టర్‌తో తొక్కించి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. లఖిమ్‌పూర్‌ఖేరీ జిల్లాలోని చైతువా గ్రామానికి చెందిన దేవానంద్(50) ఆడపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జంతువు దాడేనని ధ్రువీకరించుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అటవీప్రాంతంలో ఆడపులిని చుట్టుముట్టి కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు.. పులి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
వెల్గటూరు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం కంకరక్రేషర్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. మృతుడు స్థానికంగా నివాసముంటున్న దండుగుల సాయిలుగా గుర్తించారు. సాయిలు మృతితో సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ట్రాక్టర్ నడిపిన ధోని..!!
చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ధోని ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇక్కడ పర్యటించి అభిమానులను అలరించారు. మైదానమంతా కలియ తిరిగిన ధోని అభిమానులకు అభివాదం చేశాడు. టీఎన్‌పీఎల్‌లో భాగంగా తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్ సమయంలోనూ ధోనీ మైదానంలోనే ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్‌కు చెప్పారు. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానని వివరించారు. ఈ ఏడాది టోర్నీలో నేను చూసిన తొలి గేమ్ ఇదేనని వెల్లడించారు. -
రేకుల షెడ్డూ ఎక్కిన వందల మంది.. ఒక్కసారిగా...
-
కుప్పకూలిన భారీ షెడ్డు.. తొక్కిసలాట
జైపూర్: రాజస్థాన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ గంగానగర్ జిల్లా పదంపూర్ పట్టణం అజాజ్ మండిలో ట్రాక్టర్ల రేసు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే రేసును తిలకించేందుకు ఈసారి భారీ సంఖ్యలో(సుమారు 5 వేల మంది అని అంచనా) జనం హాజరయ్యారు. అత్యుత్సాహంతో వందల మంది అక్కడే ఉన్న ఓ షెడ్డూపై ఎక్కి వీక్షిస్తున్నారు. అదే సమయంలో బరువుకు తాళలేక ఆ షెడ్డూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే తొక్కిసలాట చోటు చేసుకోగా.. పరిస్థితి అదుపులోకి రావటానికి రెండు గంటలకు పైగానే పట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో ట్రాక్టర్ బోల్తా
-
కారు ఢీకొట్టంతో రెండు భాగాలైన ట్రాక్టర్
చౌటుప్పల్ (మునుగోడు) : కారు ట్రాక్టర్‌ను ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని లక్కారం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కొత్త ట్రాక్టర్‌ను నల్లగొండ జిల్లా కోదాడకు తీసుకెళ్తున్నారు. లక్కారం శివారులోని ఎల్డీఆర్ ఎస్టేట్ గేటు ముందుకు రాగానే వెనుక నుంచి వచ్చిన వర్నా కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయి రహదారిపై పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కుట్టి రామకృష్ణ(62) తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ట్రాక్టర్‌ను డీకొట్టిన కారులోని వ్యక్తులకు ఎలాంటి గాయాలవ్వలేదు. కారుఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన వెనుక నుంచే వస్తున్న మరో ట్రాక్టర్ డ్రైవర్ అద్దంకి వీరయ్య పోలీసులకు సమాచారమిచ్చాడు. చికిత్స నిమిత్తం ట్రాక్టర్ డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. వీరయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్‌తో తొక్కించి.. కల్టివేటర్‌తో చుట్టేసి..
సారంగాపూర్ (జగిత్యాల): ఆస్తి ముందు వారికి అనుబంధాలు కనిపించలేదు. భర్తతో కలసి కూతురే తన తండ్రి ప్రాణాలను తీసింది. ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పూరెల్లి మల్లయ్య(48) కుమార్తె జల అలియాస్ కావ్యను పదేళ్ల క్రితం రేచపల్లికి చెందిన దీటి కొమురయ్యకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కట్నం కింద రెండెకరాల భూమి, రూ.5 లక్షలు ఇచ్చాడు. మల్లయ్య మిగిలిన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ నాలుగెకరాలను సైతం తామే సాగు చేసుకుంటామని అల్లుడు, కూతురు ఇటీవల దున్నారు. విషయం తెలుసుకున్న మల్లయ్య తిరిగి అదే భూమిని ట్రాక్టర్ తో దున్నించాడు. ఈ క్రమంలో అల్లుడు, కూతురు ఆదివారం ఉదయం అదే భూమిలో పసుపు, మొక్కజొన్న వేసేందుకు వెళ్లగా మల్లయ్య, అతని తండ్రి గంగారాం అక్కడికెళ్లి నిలదీశారు. ట్రాక్టర్‌కు అడ్డుగా వెళ్లి నిల్చున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కూతురు తండ్రిని నెట్టివేసింది. అల్లుడు ట్రాక్టర్‌ను మల్లయ్య మీదికి తోలాడు. ట్రాక్టర్ అతనిమీది నుంచి దాట గానే కల్టివేటర్‌తో మల్లయ్య చనిపోయే వరకు పొలంలోనే చక్కర్లు కొట్టించాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న పక్క పొలంలో ఉన్న మల్లయ్య అన్న గంగారెడ్డి అడ్డుకునేందుకు పరుగెడుతూ వస్తుండగా.. ‘రారా! మీ తమ్ముడిని చంపినట్లు నిన్ను కూడా తొక్కిస్తా..’అంటూ కొమురయ్య అరవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు గంగారెడ్డిని అడ్డుకున్నారు. మల్లయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న అల్లుడు, కూతురు ట్రాక్టర్‌పై ఇంటికెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. అల్లుడు, కూతురు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది దుర్మరణం
-
మూసీలో బోల్తా పడిన ట్రాక్టర్
-
మూసీలో ఘోర ప్రమాదం.. 15మంది మృతి
సాక్షి, యాదాద్రి : పేద కుటుంబాల్లో పెనువిషాదం అలుముకుంది. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీలను మృత్యువు కబళించింది. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో బోల్తా పడింది. వలిగొండ సమీపంలోని లక్ష్మాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 14మంది పెద్దవాళ్ళు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు విలపించిన తీరు వర్ణణాతీతం. మృతులంతా వేములకొండ గ్రామానికి చెందినవారు. వీరిలో తల్లీకొడుకు, తల్లీకూతురులు కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. మృతుల వివరాలు.. కడింగుల లక్ష్మీ, లక్ష్మి కూతురు అనూష, ఇంజమురి లక్ష్మమ్మ, ఇంజమురి శంకరమ్మ, అంబల రాములమ్మ, చుంచు నర్మదా, కందల భాగ్యమ్మ, ఏనుగుల మాధవి, జడిగి మరమ్మ ,పంజల భాగ్యమ్మ, బిసు కవిత, బంధారపు స్వరూప,గానే బోయిన అండలు, అరూర్ మణెమ్మ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన తల్లీ కొడుకులు ఉన్నట్లుగా గుర్తించారు. యాదాద్రి ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. యాదాద్రి జిల్లా ట్రాక్టర్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వలిగొండ ప్రమాదంపై గట్టు శ్రీకాంత్ రెడ్డి దిగ్ర్భాంతి.. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అంతేకాక క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భాంత్రి వలికొండ ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోనగిరి- యాదాద్రి జిల్లాల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, డీసీపీలతో ఫోన్లో సమీక్షించారు. అంతేకాక సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ విధమైన సంఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. -
కొడుకు కాదు రాక్షసుడు
-
ఏది ముగింపు
‘‘రేపు మనం పులుకుర్తికి వెళ్తున్నాం’’ భార్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు ధనుంజయ. ‘‘రేపు ఎప్పుడు?’’ ఉత్సాహంగా అడిగింది శారద.‘‘సాయంత్రం అయిదు అయిదున్నరకి బయలుదేరుదాం. ముప్పావు గంటలో అక్కడ ఉండొచ్చు’’. అభినవ్, అభిషేక్ మొహాల్లో వెలుగును గమనించాడు. లోలోపలే నవ్వుకున్నాడు. పులుకుర్తి అంటే తనకు ఒక రకమైన పులకరింత కలుగుతుంది. పుట్టిన ఊరు అంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. ‘‘డాడీ! మనం ఎన్ని రోజులుంటాం?’’ ఆసక్తిగా అడిగాడు అభిషేక్. ‘‘అయిదు రోజులు’’ గంభీరంగా జవాబిచ్చాడు.తమ చెవులను తామే నమ్మలేకపోయారు. కుటుంబ సమేతంగా పులుకుర్తికి వెళ్ళక దాదాపు పది సంవత్సరాలు దాటింది. అప్పుడప్పుడు పిల్లలు కూడా వెళ్లి వచ్చేవారు. తను ఒక్కడు వెళ్ళినప్పుడు మాత్రం చిన్ననాటి మిత్రులు సాంబమూర్తి, యాకయ్య, రాజేందర్‌లతో కలిసి ఊరవతల మామిడి తోటలో పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసి వచ్చేవాడు. యావత్ కుటుంబంతో కలిసి పులుకుర్తికి వెళ్ళడం అరుదైపోయింది. చాలాకాలం తర్వాత ఇప్పుడు వచ్చింది అవకాశం.ధనుంజయ ప్రతిభ గల ఆర్టిస్టుగా, రేడియం స్టిక్కర్ డిజైనర్‌గా కొద్దికాలంలోనే పేరు ప్రఖ్యాతులు గడించాడు. తీరిక సమయం అనేది లేకుండా అయిపోయింది. పులుకుర్తి నుండి కేవలం డబ్బు సంపాదించాలనే పట్టుదలతో వరంగల్ వచ్చాడు కాబట్టి, సంపాదనే ధ్యేయంగా తను నమ్ముకున్న వృత్తిలో మునిగిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళిరావడం అనేవి దాదాపు కనుమరుగైపోయాయి. తన పెద్దమ్మాయి పెళ్ళికి చిన్ననాటి మిత్రుడు యాకయ్య కుటుంబ సమేతంగా వచ్చి వారం రోజులపాటు ఉండి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా స్నేహధర్మం నిర్వర్తించాడు. ఆ సమయంలోనే యాకయ్య కూతురి పెళ్ళికి తను కూడా పులుకుర్తికి వచ్చి వారం రోజులుంటానని మాట ఇచ్చాడు. ఎల్లుండే యాకయ్య కుమార్తె పెళ్ళి! ‘‘పులుకుర్తికి రావడానికి ఏర్పాట్లు అవుతున్నట్లేనా?’’ మొన్న ఫోన్ చేసి అడిగాడు. వాస్తవంగా తనకు ఒక్క రోజు కూడా తీరిక అనేది లేదు. చేతి నిండా ఒప్పుకున్న పనులు.. ‘పెళ్ళికి ఖచ్చితంగా కుటుంబంతో సహా వెళ్ళాలి’ అనేది మనస్సాక్షి ప్రబోధం. మొత్తానికి అంతరాత్మ గెలిచింది. సాయంత్రం ఆరుగంటలకల్లా యాకయ్య ఇంటిముందు ధనుంజయ ఫ్యామిలీతో దిగాడు. ధనుంజయ రాకతో పెళ్లి పనులతో బిజీగా ఉన్న యాకయ్య కుటుంబం ఆనందంతో మునిగిపోయింది.అర్ధగంటలో అతిథులందరూ ఫ్రెషప్ అయిపోయారు. మిత్రులిద్దరూ పార్టీలో మునిగిపోయారు.పెళ్ళిసందడి ఉదయం అయిదు గంటలనుండి మొదలయింది. ధనుంజయ ప్రత్యేకంగా చేయాల్సిన పనులేవీ లేకపోయినా తన వెంట ఉండటం కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది యాకయ్యకి. సరిగ్గా పదకొండున్నరకి ముహూర్తం. అన్ని పనులు సజావుగా అయిపోయాయి. కట్నాలు రాసే బాధ్యతని అభినవ్‌కి అప్పజెప్పాడు. బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న అభినవ్‌కి ఈ పనిని చేపట్టడం థ్రిల్ అనిపించింది. సంతోషంగా ఆ పనిలో నిమగ్నమైపోయాడు. ‘అభిషేక్ ఎక్కడున్నాడు? కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అసలు టెన్త్ చదివేవాణ్ని ఈ పెళ్ళికి తీసుకురావడం పొరపాటైపోయింది’ అనుకుంటూ పెళ్లి ప్రాంగణమంతా కళ్ళతో గాలించాడు ధనుంజయ. ఎక్కడా కనిపించలేదు. ‘కొంపదీసి చెరువుకి ఈత కొట్టడానికి వెళ్ళాడా! వీనికి ఈత పిచ్చి!!’ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అభిషేక్‌కి ఫోన్ చేశాడు. రెండుసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. మూడోసారి లిఫ్ట్ చేశాడు. ‘‘అభీ! ఎక్కడికెళ్లావు?’’ తండ్రి గొంతులోని ఆదుర్దాని పట్టించుకోకుండా ‘‘కృష్ణప్రసాద్, మోహన్, నేను ఇక్కడ చెరువులో ఈత కొట్టడానికి వచ్చాం’’ అని కూల్‌గా సమాధానం చెప్పాడు.రాజేందర్ రెండో కొడుకు కృష్ణ ప్రసాద్, సాంబమూర్తికి ఒక్కడే కొడుకు మోహన్. వాళ్ళతో తన కొడుకు ఉన్నాడనే నిశ్చింత కలిగి నెమ్మదిపడ్డాడు. జలకాలాటలలో ముగ్గురు మిత్రులు ప్రపంచాన్ని మరిచిపోయారు. కృష్ణప్రసాద్‌కి ఆకలి దంచేస్తున్నది. ‘‘ఇక చాలు.. వెళ్దాం...’’ అన్నాడు. మిగతా ఇద్దరికీ కూడా అదే ఆలోచన వచ్చింది.‘‘అదిగో! అటు చూడండి.. అక్కడ నీళ్ళల్లో ఆ గుండు... బండరాయి... కనబడుతోందా?’’ కవ్విస్తున్నట్లుగా అన్నాడు మోహన్.‘‘ఆ! కనబడుతూనే ఉంది. అయితే ఏముంది అక్కడ?’’ కృష్ణప్రసాద్ అసహనంగా ప్రశ్నించాడు. మోహన్ ఉద్దేశం అభిషేక్‌ని రెచ్చగొట్టాలని. అతననుకున్న దానికి విరుద్ధంగా కృష్ణ స్పందించాడు. ‘‘ఎక్కడా ఆగకుండా అక్కడిదాకా వెళ్లి వెంటనే ఇక్కడికి తిరిగి రాగలిగినోడే నిజమైన మొగోడు!’’ మోహన్ మాటలకి తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు కృష్ణప్రసాద్.‘‘చూడు.. నేను అక్కడికి వెళ్లి వస్తాను. ఎన్నోసార్లు ఆ గుండు దాటి వెళ్లి వచ్చినవాణ్ని!’’ అంటూనే నీళ్ళల్లోకి డైవ్ చేశాడు. ఈ సవాల్‌ని స్వీకరించడం తను చేస్తున్న అతిపెద్ద తప్పు అని ఆ సమయంలో తెలియలేదు. సరిగ్గా ఆ గుండుకి నాలుగు అడుగుల ముందు, పోయిన ఎండాకాలంలో మొరం మట్టి కోసం ట్రాక్టర్ వాళ్ళు పదిహేను అడుగుల లోతైన గొయ్యి తవ్వారు. చెరువులోకి నీళ్ళు చేరిన తర్వాత అక్కడ లోతైన గొయ్యి ఉందని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. సరిగ్గా అక్కడే అందమైన తామరపూలు పుట్టుకొచ్చి ప్రకృతి అందమంతా పరచినట్లు కనబడుతున్నది. నీళ్ళ అడుగున తామర తీగలు దట్టంగా ఒకదానికొకటి అల్లుకొని ఒక వలలా ఏర్పడి ఉన్న సంగతి ఎవరికీ తెలిసే అవకాశం లేదు.కృష్ణప్రసాద్ సునాయాసంగా అక్కడిదాకా వచ్చేశాడు. ఎడమకాలికి ఏదో సన్నని పాము చుట్టుకున్నట్లనిపించింది. ఒళ్ళు గగుర్పొడిచినట్లయింది. అసంకల్పితంగా కాలును బలంగా విదిల్చాడు. అంతే బలంగా తామర తీగ అతని కాలును చుట్టేసింది. ఏదో తెలీని భయం మనసులో ప్రవేశించింది. ఆ వెంటనే కుడికాలును కూడా మిగతా తీగలు అల్లుకుపోయాయి. సెకన్లలో ఉచ్చు అతన్ని లోపలకి లాగేసింది. శ్వాస అందడం కోసం నీటిని గుటకలు వేయడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాలపాటు ఆగుతూ, ఆగుతూ బుడగలు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. ఒడ్డున ఉండి ఇదంతా చూస్తున్న ఇద్దరు తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. మోహన్‌కి చిరుచెమటలు పట్టాయి. అపరాధ భావన తినేయడం మొదలైంది. ‘తన మూలంగానే స్నేహితుడు కళ్ళ ముందే మరణిస్తున్నాడు’ అనే భావన మోహన్‌కి ఒక రకమైన తెగింపుని కలిగించింది. ఏదీ ఆలోచించకుండా ముందుకు దూకాడు. ఆ ‘స్పాట్’కి చేరుకోగానే ఆకలిగా ఎదురుచూస్తున్న తామర తీగలు అతన్ని కూడా లోపలకు లాక్కున్నాయి. చావు భీకర రూపాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అభిషేక్ ఆపాదమస్తకం వణికిపోయాడు. మైండ్ బ్లాంక్‌గా మారిపోయింది. ఏమీ వినబడటం లేదు. జరుగుతున్నది వాస్తవమా అబద్ధమా అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయాడు. రెండు నిండు ప్రాణాలను మింగిన ఆ చెరువు ఆ సమయంలో నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా అవకాశం దొరికితే మళ్ళీ ప్రాణాలను కబళించేందుకు సిద్ధంగా ఉంది. అక్కడికి వెళ్తే తన గతి ఏమవుతుందో అభిషేక్‌కి అర్థమయింది. అసంకల్పితంగా అభినవ్‌కి ఫోన్ చేశాడు. దాదాపుగా కట్నాలు రాయడం పూర్తయింది. చేతిలో ఉన్న నోట్‌బుక్ పక్కనపెడుతూ ఉంటే ఫోన్ వచ్చింది. తమ్ముని వద్ద నుండి. ‘పదవ తరగతి చదివే వానికి ఫోన్ వద్దు అంటే డాడీ వినలేదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఫోన్ చెయ్యడం వీనికి అలవాటయిపోయింది’ విసుక్కుంటూనే ‘‘హలో!’’ అన్నాడు. తమ్ముని గొంతులోని దుఃఖాన్ని వెంటనే పసిగట్టాడు. మనసు ఏదో కీడును శంకించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ అభిషేక్ చెప్తున్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ‘‘నేను వస్తున్నా!’’ అంటూ ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపు తీవ్రంగా యోచించాడు. ‘నీళ్ళలో పడ్డవారు అయిదు నుండి పది నిమిషాల కంటే ఎక్కువ బతికే వీలుండదు. ఇక్కడి నుండి ఎంత తొందరగా చెరువు వద్దకి వెళ్ళినా కూడా పది నిమిషాలపైనే సమయం పడుతుంది. వాళ్ళను కాపాడటం కష్టం..’ దిగ్గున లేచాడు.‘‘చెరువులో ఇద్దరు పడ్డారు. మునిగిపోతున్నారు..’’ బిగ్గరగా అరిచాడు. అక్కడి జనాలకు వెంటనే అర్థం కాలేదు. ఆ తర్వాత బోధపడి కొందరు హడావుడిగా మోటార్ బైకులపై చెరువు వైపు బయలుదేరారు.రాజేందర్, సాంబమూర్తి కొడుకులు చెరువులో పడి చచ్చిపోయారన్న వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఊరు మొత్తం చెరువు వద్దకి కదిలి వచ్చింది. చెరువు గట్టు మీద విగత జీవులైన కృష్ణప్రసాద్, మోహన్‌లను చూస్తూ ఊరిజనం కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లల తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరి తరం కావడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ అభిషేక్ చెప్తున్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ‘‘నేను వస్తున్నా!’’ అంటూ ఫోన్ పెట్టేశాడు. దిగ్గున లేచాడు. కొద్దిదూరంలో ఉన్న యాకయ్య వద్దకి వెళ్లి బైక్ కీ అడిగి తీసుకొని వేగంగా చెరువు వైపు బయలుదేరాడు. ‘స్పీడ్‌గా ఎటు వెళ్తున్నాడో’ అర్థంకాక నివ్వెరపోయి చూశాడు యాకయ్య. పదినిమిషాలలో చెరువు వద్దకి వచ్చాడు. శ్మశాన నిశ్శబ్దంలో అభిషేక్ ఏడుపు సన్నగా వినిపిస్తూంటే అభినవ్ గుండె పిండినట్లయింది. అన్నను చూస్తూ తన ఫ్రెండ్స్ మునిగిపోయిన చోటును చేతితో చూపించాడు. వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా చెరువులోకి దూకాడు. ఇంకా దాహం తీరని మృత్యువు అదృశ్యరూపంలో ఆబగా, ఆశగా ఎదురు చూస్తూ ఉంది. కొద్దిసేపట్లో అత్యంత దయనీయ స్థితిలో అభినవ్ జలసమాధి అయిపోయాడు.రాజేందర్, సాంబమూర్తి, ధనుంజయ కొడుకులు ముగ్గురూ చెరువులో పడి చచ్చిపోయారన్న వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఊరు మొత్తం చెరువు వద్దకు కదిలివచ్చింది. చెరువు గట్టు మీద విగత జీవులైన ముగ్గురిని చూస్తూ ఊరిజనం కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లల తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరి తరం కావడం లేదు. కథ పూర్తిగా చదివి రాంబాబు విస్మయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘చంద్రా! ఈ కథకి రెండు ముగింపులు ఇచ్చావు. నాకేమీ అర్థం కాలేదు..’’ అంటున్న స్నేహితుణ్ని చూసి చంద్రకాంత్ చిన్నగా చిరునవ్వు చిందించాడు. ‘‘ఈ రెండు ముగింపులలో నీకేది నచ్చిందో చెప్తే అప్పుడు నా ఆలోచన వివరిస్తాను’’ అన్నాడు.‘‘రచయితలు ఎప్పుడూ ఆశావహ దృక్పథాన్ని తమ రచనల్లో చూపాలని నేను విశ్వసిస్తాను. నాకైతే మొదటి ముగింపు నచ్చింది. నీకు రెండో ముగింపు నచ్చినట్లుంది. ఇప్పుడు నీ వివరణ చెప్పు!’’ అంటున్న మిత్రుని వైపు సాలోచనగా చూశాడు. ‘‘వాస్తవంగా జరిగిన సంఘటనని కథగా రాశాను. ముందుగా చూపిన ముగింపు రచయితగా నా ఊహాశక్తితో రాశాను. ఇహ రెండవ ముగింపు, అది నిజంగా గత నెలలో జరిగిన దుస్సంఘటన!! ఈ కథను చదివేవారు తమకు నచ్చిన ముగింపును ఎంపిక చేసుకోవాలనేది నా ఉద్దేశం. అందుకే ఇలా రాశాను’’. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం హర్దోయి వద్ద ట్రక్కు ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
నిర్మల్‌లో రోడ్డు ప్రమాదం