
గుండాల: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 33 మందికి గాయాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు.
కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కల్తి రామయ్య కుమారుడు మహేశ్‌కు.. నర్సాపురం గ్రామానికి చెందిన జోగ నర్సింహారావు కుమార్తె అనూషతో బుధవారం పెళ్లి జరగనుంది. దీంతో వరుడి కుటుంబసభ్యులు, బంధువులు మొత్తం 35 మంది ట్రాక్టర్‌లో పెళ్లి కుమార్తె ఇంట ప్రదానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి ట్రాక్టర్‌లో వస్తుండగా.. మామకన్ను సబ్‌స్టేషన్ మూలమలుపు వద్ద అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులోని 33 మందికి గాయాలు కాగా, వారిని గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment