overturns
-
గుడిసెపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి గుడిసెలో ఆదమరచి నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు హర్దోయ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.భల్లా కంజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. మెహందీఘాట్, కన్నౌజ్ నుంచి హర్దోయ్‌కు వెళ్తున్న ఇసుకతో కూడిన ట్రక్కు ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మాసబ్ ట్యాంక్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్ నెం1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి . విషయం తెలుసుకున్న ట్రాఫఙక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తోశారు. ట్రాఫిక్ క్లియన్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫైఓవర్ నుంచి ఆయిల్ కిందకి పడిపోతుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
దైవ దర్శనానికి వెళ్తూ జీపు బోల్తా.. ఆరుగురు యాత్రికులు మృతి
బెళగావి: దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7 -
విహారయాత్రలో విషాదం..బస్సు బోల్తా ఇద్దరు మృతి
ముంబై: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన బస్సు తిరిగి వస్తుండగా.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ముంబైలో రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలిలో చోటు చేసుకుంది. ముంబైలో చెంబూర్‌లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న సుమారు 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లతో కలిసి బస్సులో విహారయాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో పాత ముంబై-పూణె హైవే వద్ద కొండలు దిగుతుండగా బస్సు బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారని, గాయపడిన ఇతర ప్రయాణకులు లోనావాలా, ఖపోలీ సమీప ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతి వ్యాయామంతో గుండెపోటు! ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ఎందుకంటే..) -
విశాఖ: పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. గ్యాస్ లీక్..
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ ట్యాంకర్‌ను లిప్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిప్ట్ చేస్తుండగా ట్యాంకర్‌కు రంథ్రం ఏర్పడింది. ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్ సరాఫరా నిలిపివేశారు. ట్యాంకర్ పడిన ప్రాంతంలో కంపెనీలను అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో -
ORR పై భారీ ట్యాంకర్ బోల్తా
-
పెళ్లి ట్రాక్టర్ బోల్తా..ముగ్గురి పరిస్థితి విషమం
గుండాల: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 33 మందికి గాయాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కల్తి రామయ్య కుమారుడు మహేశ్‌కు.. నర్సాపురం గ్రామానికి చెందిన జోగ నర్సింహారావు కుమార్తె అనూషతో బుధవారం పెళ్లి జరగనుంది. దీంతో వరుడి కుటుంబసభ్యులు, బంధువులు మొత్తం 35 మంది ట్రాక్టర్లో పెళ్లి కుమార్తె ఇంట ప్రదానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి ట్రాక్టర్లో వస్తుండగా.. మామకన్ను సబ్‌స్టేషన్ మూలమలుపు వద్ద అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులోని 33 మందికి గాయాలు కాగా, వారిని గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి : అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు? -
డివైడర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
డివైడర్‌ను ఢీకొట్టి పల్టి కొట్టిన కారు
-
ట్రాక్టర్ బోల్తా : ఒకరు మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం పురపాలక సంఘంకి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఆరుగురు సజీవ సమాధి
లుథియానా: దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతోంటే పంజాబ్‌లోని ఓ కుటుంబం మాత్రం సజీవ సమాధి అయింది. అర్థరాత్రి ఓ వాహనం పటియాలాలోని కుటుంబం ముంగిట మృత్యుఘంటికలు మోగించింది. దీంతో నలుగురు చిన్నారులు సహా దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు. వివరాల్లోకి వెళితే...నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి ఇసుకలోడ్‌తో వెళుతున్న ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న రాజు(32) భార్య మాన్సి(30) నలుగురు పిల్లలు ఖుషి(1) షీతల్ (3) నిహాల్(5) అశు(10) ఆ ఇసుక కింద కూరుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా : మద్యం బాటిళ్లు ధ్వంసం
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై మద్యంలోడ్తో వెళ్తున్న లారీ ఆదివారం బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని దాదాపు రూ.12 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమైనాయి. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. లారీని రహదారిపై నుంచి నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. -
'పుష్కర' మార్గంలో ఆర్టీసీ బస్సు బోల్తా
కరీంనగర్: గోదావరి పుష్కరాల్లో ప్రధాన ఘాట్ గా కొనసాగుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం నుంచి కరీంనగర్ వెళుతోన్న ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి మంథని సమీపంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితులు గోదావరి పుష్కరాలకు వెళ్లివస్తున్నవారా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, పుష్కరాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ఇదే రహదారిలో ప్రయాణిస్తుండటంతో బస్సు బోల్తా వార్త పలువురిని కలవరపెడుతోంది. -
స్కూల్ బస్సు బోల్తా: 10 మంది చిన్నారులకు గాయాలు
న్యూఢిల్లీ: కాశ్మీరి గేట్ సమీపంలోని బస్సు టెర్మినల్ వద్ద స్కూల్ బస్ మంగళవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. విద్యార్థులను బస్సులోని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షహదార నుంచి తీస్ హాజారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు శివారులోని కాగ్నా నదిలోకి శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రెండు రోజుల క్రితం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో బ్రేకులు ఫెయిల్ అయి.. నిలిచిపోయింది. సదరు బస్సును బాగు చేయడానికి ఈ రోజు తెల్లవారుజామున తాండూరు డిపోకు తరలిస్తున్న క్రమంలో బ్రిడ్జ్‌పై నుంచి కాగ్నా నదిలోకి దూసుకెళ్లింది. అయితే బస్సు వెనుక భాగం మాత్రం బ్రిడ్జ్‌పైనే ఉండిపోయింది. దాంతో బస్సు డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దూకేశాడు. బస్సుని నదిలో నుంచి బయటకు తీసేందుకు ఆర్టీసీ అధికారులు స్థానికుల సహాయంతో చర్యలు చేపట్టారు. -
అదుపు తప్పి గుడిసె పై పడ్డ కంప్రెషర్ ట్రాక్టర్
-
నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
-
ఉల్లిపాయల ట్రక్ బోల్తా