Oil Tanker Overturns At Masab Tank, Leads Huge Traffic Jam - Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. మాసబ్‌ ట్యాంక్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published Wed, Jun 7 2023 11:18 AM | Last Updated on Wed, Jun 7 2023 11:44 AM

Oil Tanker Overturns At Masab Tank Leads Huge Traffic Jam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాసబ్‌ ట్యాంక్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మాసబ్‌ట్యాంక్‌ ఎన్‌ఎండీసీ వద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్‌ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. మాసబ్‌ ట్యాంక్‌, మోహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం1, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి .

విషయం తెలుసుకున్న ట్రాఫఙక్‌ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తోశారు. ట్రాఫిక్‌ క్లియన్‌ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్‌ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్‌ ట్యాంక్‌ ఫైఓవర్‌ నుంచి ఆయిల్‌ కిందకి పడిపోతుంది. మాసబ్‌ ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement