Masab Tank
-
Hyderabad : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. -
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషకు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు.ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని రెడ్ క్రాస్ గవర్నమెంట్ స్కూల్ మసాబ్ టాంక్‌లో సేవా డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్సీసీ బృందంతో టీటీఏ సభ్యులను సాదరంగా “గాడ్ ఆఫ్ ఆనర్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. టీటీఏ సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిన్నారుల పాటలు ఆహుతులను ముఖ్యంగా టీటీఏ సభ్యులను ఆకట్టుకుంది. ఇక ఈ విద్యార్థులకు టీటీఏ నుంచి నగదు బహుమతి అందించారు. జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిందన చిన్నారికి టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి 5వేల నగదు బహుమతి అందించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్‌లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ అందజేశారు. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి. అందుకే టీటీఏ వారి ఆరోగ్యం పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. ఇక డెంటల్ హెల్త్‌తో పాటు ఉమన్ హెల్త్, న్యుట్రిషన్ గురించి పిల్లలకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి మేమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. (చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు) -
TS: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం?
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం కావడంపై కలకలం రేగుతోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను డీసీపీ సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ.. ప్రశ్నించగా, ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావొస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేయడం జరిగిందని వివరించారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ తెలిపారు. ఇదీ చదవండి: TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో.. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మాసబ్ ట్యాంక్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్ నెం1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి . విషయం తెలుసుకున్న ట్రాఫఙక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తోశారు. ట్రాఫిక్ క్లియన్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫైఓవర్ నుంచి ఆయిల్ కిందకి పడిపోతుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
మాసబ్ చెరువును చెరబడుతున్న రియల్ మాఫియా.. మట్టికొట్టినా లెక్కలే!
సాక్షి, సిటీబ్యూరో: మాసబ్ చెరువుపై రియల్ మాఫియా ముప్పేట దాడి చేస్తోంది. చుట్టూ ప్రైవేటు సైన్యాన్ని పహారాగా ఏర్పాటు చేసి చెరువును చెరబట్టేస్తోంది. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో స్థానికులే చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి రాత్రింబవళ్లూ కాపలా కాస్తున్నారు. అయినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మట్టి తరలింపు లారీలను లోనికి రాకుండా స్థానికులు ప్రధాన రోడ్డు వైపు నిఘా పెడితే .. అర్ధరాత్రి చెరువు వెనుక భాగం నుంచి పూడ్చివేతను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు నిత్యం ఈ చెరువుకట్టపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కానీ.. వీరిలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై స్థానికులు ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. రెండు నెలలుగా పూడ్చివేతలు.. తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో 495 ఎకరాల విస్తీర్ణంలో మాసబ్ చెరువు విస్తరించి ఉంది. దీనిలో ప్రభుత్వ భూమి 342.32 ఎకరాలు. మరో 152.38 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములు. ఈ భూములన్నీ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. బఫర్‌జోన్‌లో మరో 31.35 ఎకరాలు ఉంది. బఫర్‌జోన్‌లో 9.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 22.5 ఎకరాల పట్టా భూమి ఉంది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న పట్టా భూములను ఏక్ ఫసల్ భూములుగా పిలుస్తుంటారు. చెరువులో నీరు తగ్గినప్పుడు మాత్రమే ఈ భూములను సాగు చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ ఇప్పటికే ఇక్కడ ఎఫ్టీఎల్ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలు వెలిశాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు భారీగా వచ్చి చెరువులోకి చేరింది. దీంతో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములన్నీ నీటమునిగాయి. ప్రభుత్వ శిఖం భూమిని ఆనుకుని ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న ఈ పట్టా భూములను కొనుగోలు చేసిన కొంత మంది రియల్టర్లు రెండు నెలలుగా పూడ్చివేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. కళ్లుగప్పి.. లారీల్లో మట్టి తరలించి.. చెరువు ఆనవాళ్లను దెబ్బతీస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంత మంది స్థానికులు మున్సిపల్ కమిషనర్, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా కలెక్లర్కు ఫిర్యాదు చేశారు. అప్పటికే శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా మట్టిని నింపారు. రియల్టర్లు నింపిన ఆ మటిని మళ్లీ ఎత్తిపోయించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవైపు స్థానిక మున్సిపల్ అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఈ విషయాన్ని గమనించిన సదరు రియల్టర్ కోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు మరో రియల్టర్ నక్షబాటను లక్ష్యంగా చేసుకుని చెరువు పూడ్చివేతకు పాల్పడుతున్నారు. కాగా.. సదరు కోర్టు స్టేటస్ కో విధించినట్లు సమాచారం. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ ప్రధాన రహదారి వైపు ఏర్పాటు చేసిన గేటుకు ఓ నోటీసును కూడా అతికించారు. గేటుకు అతికించిన నోటీసు బోర్డును చూసి అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. ● కళ్ల ముందే చెరువు శిఖం కబ్జాకు గురవుతుండటం, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు వెలుస్తుండటాన్ని జీర్ణించుకోలేని స్థానికులు వాట్సాప్ గ్రూప్ వేదికగా ఒక్కటయ్యారు. గత పదిహేను రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. మట్టి లోడుతో కూడిన లారీలు లోపలికి వెళ్లకుండా రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే కాపు కాస్తున్నా రు. ప్రధాన రహదారిపై నిఘా పెరగడంతో రియల్టర్లు ప్రత్యామ్నాయంగా, గతంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు గుర్రంగూడ నుంచి ఏర్పాటు చేసుకున్న నక్షబాటను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. అందరి కళ్లుగప్పి శనివారం అర్ధరాత్రి దాటాక పెద్ద ఎత్తున మట్టి డంప్ చేస్తుండటంతో చెరువు పరిరక్షణ సమితి సభ్యులు టిప్పర్లను అడ్డుకుని, మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటాం స్థానికుల ఫిర్యాదుతో ఆదివారం పూడ్చివేతలను పరిశీలించాం. నక్షబాట పేరుతో పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లను వేసి పూడ్చివేస్తున్న వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చెరువు పరిసరాల్లో రెవెన్యూ, పోలీసు నిఘా పెంచుతాం. – గంగమ్మ, ఏఈఈ, ఇరిగేషన్ -
విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు. ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. -
నియోజకవర్గానికో ఉచిత కోచింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గానికి ఒకటి చొప్పున శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గో పాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, జేడీ అలోక్ కుమార్ డీడీఆశన్న, ఎస్ఈ కార్పో రేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో జర భద్రం!) -
పాదయాత్రతో ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని, తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్న మార్పు తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతి పాలనను కూకటివేళ్లతో పెకిలించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేయాలనే లక్ష్యంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామని పాదయాత్ర ప్రారం భిస్తున్నామన్నారు. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు సమరశంఖం పూరిస్తున్నామన్నారు. ఉచితంగా యూరియా ఇవ్వ లేని దుర్మార్గపు సీఎం, రైతు రుణమాఫీ చేయలేని దగా ముఖ్యమంత్రి, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేని.. కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అమరుల ఆశయ సాధన కోసం.. దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం.. ఈ యాత్ర సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ ప్రజాస్వామిక తెలంగాణను, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిజమైన హిందువైతే భాగ్యలక్ష్మి అమ్మవారున్న చోటు నుంచే వినాయక నిమజ్జన శోభాయాత్రను, హనుమాన్ జయంతి యాత్రను నిర్వహించే దమ్ముందా అని సంజయ్ సవాల్ విసిరారు. పాతబస్తీ ఎవరి అడ్డా కాదు.. ఈ రాష్ట్రం మాది.. ఏ గల్లీకైనా వస్తామని పేర్కొన్నారు. తాలిబన్ భావజాలమున్న పార్టీని, ఆ పార్టీకి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. లక్ష ఇళ్లు కూడా కట్టలేదు... రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామని.. లక్ష కూడా కట్టలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ధ్వజమెత్తారు. ఆలీబాబా 40దొంగల మాది రిగా రాష్ట్రంలో కుటుంబ, దోపిడీ పాలన సాగుతోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్ పేర్కొన్నారు. ఈ పాదయాత్రతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ చెప్పారు. ప్రజా సం గ్రామ యాత్రను అరుణ్ సింగ్, తరుణ్‌ఛుగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, మునుస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ నేతలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్.కుమార్, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపింది. ప్రారంభ కార్యక్రమం, బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభ చిత్రాలను, వీడియోలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం పోలీసులు,కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. సంజయ్ విజ్ఞప్తి మేరకు ఇరు వర్గాలు శాంతించాయి. కేసీఆర్ పీఠాలు కదలడం ఖాయం టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల ఆధిపత్య, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి.. బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పాలనను తెచ్చుకోవాల్సి ఉందన్నారు. సంజయ్ యాత్రకు ఊరూవాడా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌ను గద్దె దించే ఉద్యమమన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ లక్షల కోట్ల అప్పులకుప్పగా, మాఫియా రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా.. లేదా.. అని ప్రశ్నించారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పి ఆఖరికి వారికి మెట్రో రాకుండా చేశారని, ఎంఐఎంకు కేసీఆర్ వంతపాడుతూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. -
నగరంలో హలీమ్ సందడి...
-
'మరో 10 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తాం'
సాక్షి, హైదరాబాద్ : జిల్లాలో ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు, పనితీరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లతో పాటు ప్రస్తుతం 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాల లో అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు. -
మాసబ్‌ట్యాంక్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదాయపన్ను శాఖ బిల్డింగ్ ఎనిమిదవ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మధ్యం మత్తులో ఇద్దరు మద్య ఘర్షణ
-
రిటైర్డ్ నేవీ ఆఫీసర్‌పై తల్వార్లతో దాడి
-
మాసబ్‌ట్యాంక్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్ వద్ద దుండగులు కత్తులు, తల్వార్లతో వీరంగం సృష్టించారు. అపార్ట్మెంట్ సెల్లార్లోకి జొరబడిన దుండగులు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్ ఖలీమ్‌పై కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. దీంతో ఇక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భూవివాదాలే ఈ దాడికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్‌లో ఈ సంఘటన జరిగింది. -
బీహార్ లో తుపాకీ కొని..
హైదరాబాద్: కేబీఎస్ బ్యాంకు సీఈవోపై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత ఆదివారం మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీ దుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో నివసించే కేబీఎస్ బ్యాంకు సీఈవో మన్మథ్ దాలియా ఇంటికి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన నలుగురిలో షేక్ అబ్దుల్ రహీం, నరేష్, రాజేందర్ లను పట్టుకున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. నాలుగో నిందితుడు వెంకటరత్నం ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులందరూ రాజమండ్రికి చెందనివారేనని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు తుపాకీ కొనుగోలు చేసేందుకు బీహార్ వెళ్లినట్లు తెలిపారు. తుపాకీ కొనుగోలు తర్వాత ప్లాన్ ప్రకారం.. దాలియాపై దాడి చేసి డబ్బు దోచుకునేందుకు ఆయన ఇంటి వద్దకు వెళ్లి కాల్పులు జరిపినట్లు చెప్పారు. ప్లాన్ విఫలం అవడంతో అక్కడి నుంచి పరారయ్యారని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మొత్తం పది ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో రెండు రోజుల్లోనే పురోగతి సాధించినట్లు తెలిపారు. -
డబ్బు కోసమే బ్యాంకు సీఈవోపై కాల్పులు
-
మాసబ్ ట్యాంకు కాల్పుల కేసులో పురోగతి
హైదరాబాద్:ఇటీవల మాసబ్ ట్యాంకులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొన్నిరోజుల క్రితం బ్యాంకు సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులకు పాల్పడిన నిందితుల్ని రాజమండ్రికి చెందిన యువకులుగా గుర్తించారు. బ్యాంకు సీఈవో వద్ద డబ్బులుంటాయని భావించి వారు దోపిడీ యత్నం చేశారు. బ్యాంకు సీఈవో డ్రైవర్ సాయంతో ఆ యువకులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. గత ఆదివారం కృష్ణ భీమ సమృద్ధి లోకల్ ఏరియా (కేబీఎస్) బ్యాంక్ ఎండీ, సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మాసబ్ ట్యాంక్‌లోని శాంతినగర్‌లో శ్రీదుర్గ కనుముల్లి అపార్ట్మెంట్లో మన్మథ్‌దలాయ్ తన కుటుంబంతో ఉండగా దోపిడీకి యత్నించిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం కావడంతో మరికొన్ని రోజుల్లో సృష్టత వచ్చే అవకాశం ఉంది. సీఈవోపై కాల్పులు జరిపిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు సాగుతోంది. -
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
-
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
హైదరాబాద్ : నగరంలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీదుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మన్మథ్ దాలియా అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి కేబీఎస్ బ్యాంకు సీఈవోగా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం దుండగుడు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను సంప్రదించి మన్మథ్ ఇంట్లోకి ప్రవేశించాడు. మన్మథ్తో దుండగుడు పది నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మన్మథ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే అతడ్ని వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నోట్ల మార్పిడియే కాల్పులకు కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
మాసబ్‌ట్యాంక్: చిన్నారుల ఆట పాటల నడుమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయిశుక్రవారం నాదేర్గుల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందుంటుందన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ సినీ నటుడు లోహిత్ కుమార్ మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఏఎస్ఎల్ అసోసియేషన్ డెరైక్టర్, అగ్ని ఫైవ్స టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ కేఆర్ గుప్తా, ఇబ్రహీంపట్నం ఏసీపీతో పాటు పాఠశాల చైర్మన్ మల్క కొమరయ్య, వైస్ చైర్మన్ భీమసేన్, డెరైక్టర్ పల్లవి, అకాడమిక్ డెరైక్టర్ డాక్టర్ సుధ, పాఠశాల కోశాధికారి శ్రీ ప్రనరుు, సునీతారావు, పద్మ జ్యోతి పాల్గొన్నారు. -
ఉన్నత విద్యామండలికి స్థాన చలనం!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మండలిని ప్రస్తుతం మాసాబ్‌ట్యాంకులో ఉన్న భవనంలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో ఉంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవనంలోని కొన్ని గదులను ప్రాథమికంగా పరిశీలించాలని నిర్ణయించా రు. సుప్రీంకోర్టు ఏపీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తెలంగాణ ఉన్నత విద్యామండలి అధీనంలో ఉన్న తమ కార్యాలయంలోకి వెళ్లటంపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే మండలి కార్యకలాపాలు సాగించేలా వేరే చోట కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మాసాబ్‌ట్యాంకులోని కార్యాలయంలో ఏపీకి చెందిన రికార్డులు, ఇతర ఫైళ్లు ఉన్నందున వాటిని అప్పగించాలని కోరుతూ తెలంగాణ మండలికి లేఖ రాయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. యంత్రాంగం మొత్తాన్ని తెలంగాణ మండలి తన పరిధిలోకి తెచ్చుకోవడంతో ఏపీకి సిబ్బంది లేకుండా పోయారు. దీనిపైనా అధికారులు చర్చలు సాగిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడారు. విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రాను కలసి తాజా పరిణామాలపై చర్చించారు. -
కార్యాలయాన్ని ఖాళీ చేయండి!
* ఏపీ ఉన్నత విద్యామండలికి జేఎన్‌ఏఎఫ్‌యూ లేఖ * ముదిరిన విద్యా వివాదం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తమ భవనాన్ని సత్వరమే ఖాళీ చేయాలని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ) మంగళవారం లేఖ రాసింది. తరగతుల నిర్వహణకు వసతి చాలక ఇబ్బందిగా ఉందని, త్వరగా ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. 2015-16 విద్యాసంవత్సరానికి ఎంసెట్ సహా అన్ని సెట్లను ఉమ్మడిగా నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జేఎన్‌ఏఎఫ్‌యూ భవనాన్ని ఖాళీ చేయాలని లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఏర్పాటైన తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని, రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించే అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నాయి. నెలకు రూ.3 లక్షల అద్దె ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 1988లో ఉమ్మడి ఏపీ చట్టం ప్రకారం ఏర్పాటైంది. తొలుత దీన్ని లక్డికాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. 2005లో మాసబ్‌ట్యాంకులో ఉన్న జేఎన్‌ఏఎఫ్‌యూ ఆవరణలోని మూడంతస్తుల భవనంలోకి తరలించారు. కరెంటు, నీటి చార్జీలతోపాటు ప్రతి నెలా రూ.3 లక్షలు ఈ భవనం కోసం మండలి వెచ్చిస్తోంది. మొదటి అంతస్త్థులో ఏపీ మండలి ఉండగా, రెండో అంతస్తులో తెలంగాణ మండలి ఉంది. -
రేపు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నెల 8న హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. గ్రామస్థాయి నుంచి రాష్ర్టస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతనెల 26వ తేదీన జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు జనక్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం మహానేత వైఎస్ చేపట్టిన పథకాలకు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారనే విషయంపై భేటీలో చర్చిస్తామన్నారు. రైతులు, వివిధవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలోని సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. -
హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలబెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ ధరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు ‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ.. నబాబుగారు పార్టీ నుంచి ఇంట్లోకి అడుగు పెట్టారు! స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీల కోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేల రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది! నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట! నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా! అలా సాగనంపాను! నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను! ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి -
హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ : నబాబుగారు పార్టీనుంచి ఇంటిలోకి అడుగు పెట్టారు! స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీలకోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేలా రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది! నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట! నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా! అలా సాగనంపాను! నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను! ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి -
దావత్ల దరహాసాలు!
ఆరో కుతుబ్‌షాహీ భార్య హయత్ బక్షీబేగంను ‘మా సాహెబా (అమ్మగారు)’ అని నగర ప్రజలు పిలుచుకునేవారు. ఆమె పేరుతో తవ్వించిన చెరువును మా సాహెబా తలాబ్ అనేవారు. చెరువు కనుమరుగై ‘మాసాబ్ ట్యాంక్’ మిగిలింది! మాసాబ్‌ట్యాంక్‌లో మా సమీప బంధువు నివసించేవారు. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో కజిన్ ఇంట్లో కొన్నాళ్లున్నాం. మా పొరుగు ఇల్లు ఓ నవాబుగారిది. నిజాం పాలనలో ఉన్నతాధికారులను, వారి బంధువులను, సామాజికంగా ఉన్నత కుటుంబీకులను నవాబులుగా వ్యవహరించేవారు. నిజాం హయాం గతించినా, ఓడలు బండ్లు అయినా.. నవాబులు తమ సోషల్ స్టేటస్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చేవారు. narendrayan - 4 డేట్ దేఖో.. వఖ్త్ నహీ! నగరం డిన్నర్ పార్టీలకు పెట్టింది పేరు. నిజాం హయాంలో అధికారిక విందు కార్యక్రమాలను గుర్తు చేస్తూ ‘దావత్ -ఎ-నిజాం’ పార్టీలు నిర్వహించేవారు. తిరస్కరించకూడని గౌరవనీయుల నుంచి ఆహ్వానాలొచ్చేవి. దావత్‌కు కారణాలు ఏమిటి? అని లోతుల్లోకి పోకూడదు. ‘బహానా(సాకు)’లు ఒకోసారి చిత్రంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా దావత్‌కు పిలిచారనుకోండి. ఏ రోజు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ సమయం అని గుర్తుంచుకోకూడదు. ఫలానా సమయం అన్నారు కదా అని ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్లారా? ‘తప్పు’లో కాలేసినట్లే! నగరానికి వచ్చిన తొలిరోజుల్లో అమాయకంగా ఓ పార్టీకి వెళ్లా, చెప్పిన టైంకు! దావత్ తాలూకూ అలికిడి కన్పించలేదు. ఆహ్వానించిన పెద్దమనిషి కన్పించలేదు. ఆదుర్దాతో పనిమనిషిని వెన్యూ గురించి అడిగాను. ‘రావాల్సిన చోటికే వచ్చారు. డిన్నర్‌కు రావాల్సిన వారు, సాయంత్రం టీ వేళకు వ చ్చారు’ అని జాలిపడ్డాడు. ఓ గంట తర్వాత మధువులొలకడం మొదలైంది. రాత్రి 11 గంటలైంది. నా కడుపులో సెకనుకో ఆకలి గంట మోగుతోంది.చివరికి తెగించి అడిగేశాను. అయ్యా భోజనం పెట్టించండి అని! హోస్ట్ ఆశ్చర్యపోయారు. ‘అదేంటి..అప్పుడే భోజనమా? ఆహ్వానించిన వారిలో చాలామంది రానే లేదు’ అన్నారు. ఆయన దయాశీలి! నా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను తెలివి తెచ్చుకున్నాను. ఏ పార్టీకి వెళ్లినా చెప్పిన టైంకు కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ‘బేగం’ దావత్! త్వరగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలనుకున్నా, లేదా పార్టీ ముగిసేంతవరకూ ఉండి రావాలనుకున్నా.. హైద్రాబాద్ పార్టీలకు భోంచేసి వెళ్లడం మంచిది. నిజాంకు అత్యంత సన్నిహిత కుటుంబీకులు పైగాలు. ఆ వంశానికి చెందిన వలీ ఉద్ దౌలా నిజాంకు ప్రధానిగా పనిచేశారు. ఆయన శ్రీమతి(బేగం) ఓసారి తమ స్వగృహం విలాయత్ మంజిల్ (బేగంపేటలోని ఇప్పటి కంట్రీ క్లబ్)లో డిన్నర్‌కు పలిచారు. టైంకు వెళితే బావుండదు కదా! కొంచె ఆలస్యంగానే వెళ్లాను! ఇదిస్వీకరించండి, అది స్వీకరించండి అనే మర్యాదల నేపథ్యంలో తేలిన విషయం ఏమిటయ్యా అంటే, అందరిలో నేనొక్కడినే శాకాహారిని! మళ్లీ కడుపు కాలింది. బేగంగారు ఇతర ముఖ్యులు శ్రద్ధతో వాకబు చేశారు. యురేకా! ‘పుడ్డింగ్’! ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
ఫైనల్స్‌లో సీసీఓబీ జట్లు
బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ అండర్-12, 14 కేటగిరీల్లో సీసీఓబీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన అండర్-12 సెమీఫైనల్లో సీసీఓబీ జట్టు 21 పరుగుల తేడాతో ఎస్సీఎఫ్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీసీఓబీ 8 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 99 పరుగులు చేసింది. జునైద్ (56), అస్లాం (22) రాణించారు. లక్ష్యఛేదనలో ఎస్సీఎఫ్ 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అండర్-14 సెమీఫైనల్లో సీసీఓబీ జట్టు 8 వికెట్ల తేడాతో గోవిందరాజ్ క్రికెట్ అకాడమీ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవిందరాజ్ సీఏ 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం సీసీఓబీ 5.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 74 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. బాబర్ (41 నాటౌట్), అక్షయ్ (21) రాణించారు. అండర్-16 కేటగిరిలో జరిగిన మరో సెమీఫైనల్లో ఎస్సీఎఫ్ (తులసీ లార్డ్స్) జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్క్యాట్స్పై విజయం సాధించింది. సూపర్క్యాట్స్ జట్టు 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగా, ఎస్సీఎఫ్ (తులసీ లార్డ్స్) 5.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసి గెలిచింది. ఫైనల్స్‌లో సీసీఓబీ జట్లు అండర్-12లో సూపర్క్యాట్స్తో, అండర్-14లో ఎస్సీఎఫ్ గ్రీన్స్‌తో తలపడనున్నాయి. -
హాంఫట్
73 చెరువులు మాయం ! తాజా సర్వేలో నిగ్గుతేలిన నిజం క్షేత్రస్థాయిలో కన్పించని ఆనవాళ్లు నగరం చుట్టూ 48 చెరువుల గల్లంతు సంరక్షణపై హెచ్ఎండీఏ మీనమేషాలు సాక్షి, సిటీబ్యూరో: సువిశాల చెరువులతో విలసిల్లిన భాగ్యనగరి నేడు కాంక్రీట్ నిర్మాణాల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది. నాడు సాగు, తాగునీరు అందించిన నగర చెరువులు నేడు పూర్తిగా మాయమయ్యాయి. జల వనరులు ఉండాల్సిన చోట జనం నిండిపోయారు. గతంలో మాసబ్ ట్యాంకు అనేది ఓ పెద్ద చెరువు. ఇప్పుడక్కడ చెరువే లేదు..! దానిస్థానే పార్కు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు సాగునీటి కుంటగా పేరున్న నల్లకుంటలో ఇప్పుడు ఆకాశహార్మ్యాలు వెలిశాయి. జలచరాలకు ఆవాసంగా ఉన్న నాటి నాగమయ్య కుంట నేడు బడుగు, బలహీన వర్గాల ఆవాసాలతో కిక్కిరిసిపోయింది. వాస్తవానికి రాష్ట్ర రాజధాని నగరం, దానిచుట్టుపక్కలా గతంలో 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవని అంచనా. ఎంతపెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. అయితే... నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో కొందరు అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. దీంతో పెద్ద చెరువులు కాస్త చిన్న చెరువులుగా, చిన్న కుంటలు తటాకాలుగా కుంచించుకుపోయాయి. ఇప్పటికే నగరంలోని అనేక జలాశయాలు మాయమైపోవడం ఆక్రమణల తీరురు అద్దం పడుతోంది. సరస్సులు కళ్ల ముందే కనుమరుగవుతున్నా సర్కార్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తుండటం గమనార్హం. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని 5 జిల్లాల్లో సుమారు 73 చెరువులు మాయమైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల్లో ఆయా చెరువుల పేర్లున్నా... క్షేత్రస్థాయిలో వాటి ఆనవాళ్లు కూడా లేవని రెవెన్యూ యంత్రాంగం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు లేక్ సర్వే నివేదికను హెచ్ఎండీఏకు అందించారు. రెవెన్యూ అధికారులు ‘సాక్షి’కిచ్చిన వివరాల ప్రకారం.. నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో చుట్టుపక్కల అనేక చెరువులు కబ్జా కాటుకు గురై కాలనీలుగా వెలిశాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 40 చెరువులు కనుమరుగవ్వగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 8, నల్లగొండ జిల్లాలో 20, మహబూబ్‌నగర్ జిల్లాలో 5 చెరువులు గల్లంతయ్యాయి. వెరసి రాష్ట్ర రాజధాని వేదికగా చుట్టుపక్కల 73 చెరువులు కాలగర్భంలో కలిసిపోవడం ఆక్రమణల తీరుకు అద్దంపడుతోంది. ఒకప్పుడు జలదుర్గంగా పేరొందిన భాగ్యనగరం చుట్టూరా ఇప్పుడు కాగడా పట్టి వెదికినా కనుచూపు మేరలో నీటి వనరులు కన్పించట్లేదు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలో 325, గ్రేటర్ పరిధిలో 176, మొత్తం 501 చెరువులు ఉన్నట్లు హెచ్ఎండీఏ ఇటీవలి వరకు ఢంకా మోగిస్తూ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఆ సంఖ్యను న్యాయస్థానాలు, లోకాయుక్త, ప్రభుత్వానికి సైతం అధికారులు నివేదించారు. అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మాయమైనవి మచ్చుకు కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి, న ల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువులను లెక్క తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ప్రకారం సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పరిశీలించగా 73 చెరువులు భౌతికంగా లేవని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో బతుకమ్మకుంట (నల్లకుంట), యూసుఫ్‌గూడ చెరువు (కృష్ణకాంత్ పార్కు), ఆసీఫ్‌నగర్ చెరువు, అఫ్జల్‌గంజ్ చెరువు తదితర 8 చెరువులు మాయమైపోయినట్లు రె వెన్యూ సర్వేలో తెలింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని కనకయ్య కుంట, జాల్ల కుంట, కుత్బుల్లాపూర్ మండలంలోని మొగుళ్ల కుంట, సర్కారీ శిఖం చెరువు, ఇబ్రహీంపట్నం మండలంలోని రెడ్డికుంట, మేలం కుంట, మొయినాబాద్ మండలంలోని కుంటకింది చలక, గొల్లబావికుంట తదితర 40 చెరువులు భౌతికంగా కనుమరుగైనట్లు తేల్చారు. నల్లగొండ జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో సుమారు 20 చెరువుల ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు చెరువు, దేవుని చెరువు, పోచంపల్లి మండలంలోని కొత్తకుంట, ఊరకుంట శిఖం, వందమాని చెరువు, భువనగిరి మండలంలోని కొంగల కుంట తదితర నీటివనరులు గల్లంతైన జాబితాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని 5 చెరువులు మాయమయ్యాయి. వీటిలో తాళ్లకుంట, కౌలుబావికుంట, మల్లెవాని కుంట, చెక్కలవాని కుంట, చెలివెందులగూడ చెరువులున్నాయి. అయితే... మెదక్ జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువులు మాత్రం క్షేత్రస్థాయిలో యథాతథంగా ఉన్నట్లు తేల్చారు. కబ్జాలపై చర్యలేవీ? నగరంలో చాలా చెరువులు కబ్జాల వల్ల సహజ స్వరూపాన్నే కోల్పోయాయి. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సుమారు 240 చ.కి.మీ. పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో కూకట్పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు కాలనీలు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి. ముఖ్యంగా కూకట్పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగథాముని చెరువులు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. అలాగే శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగారం పెద్దచెరువు, మదీనాగూడ చెరువు, చందానగర్ వద్ద బచ్చుకుంట, మల్లయ్య కుంట, మియాపూర్ పటేల్‌చెరువు, గోపన్‌పల్లి వద్ద నల్లకుంటలో పెద్ద ఎత్తున ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. బాలానగర్ మండలాన్ని పరిశీలిస్తే దీని పరిధిలో 16 చెరువులున్నట్లు రెవెన్యూ రికార్డులు సూచిస్తున్నాయి. అయితే సున్నం చెరువు, కాజాకుంట, ఈదుల కుంట, భీముని కుంట, అలీ తలాబ్, నల్లచెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. అంబరు చెరువులోనైతే.. ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది. సరూర్‌నగర్ చెరువులో ఇప్పటికీ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్లచెరువులు చాలావరకు ఆక్రమణదారుల పాలయ్యాయి. ప్రస్తుతం ఉన్న చెరువులనైనా సంరక్షించేందుకు హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీలు మీనమేషాలు లెక్కిస్తుండటం జల వనరులపై అధికారులకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. -
బందోబస్తుల భారంతోనే రిక‘వర్రీ’లు
=సవాళ్లు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొన్నాం =మహిళలపై నేరాల కేసులు పెరిగాయి =నగర కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ‘జనవరి నుంచి డిసెంబర్ వరకు పండుగలు, ఉద్యమాలు, రాజకీయ కార్యకలాపాల బందోబస్తుల భారం నేపథ్యంలో కేసుల దర్యాప్తులో నగర పోలీసులు పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోయారు. ఫలితంగానే రికవరీల శాతం గత ఏడాది కన్నా తగ్గింది’ అని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో శనివారం ఏర్పాటు చేసిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర పోలీసులకు సాధారణ డ్యూటీలకు అదనంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని అనురాగ్ శర్మ అన్నారు. నగర పోలీసు టెలిఫోన్ డెరైక్టరీతో పాటు క్యాలెండర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన నగరంలో నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు. ఆద్యంతం వీధుల్లోనే విధులు... రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 13 నుంచి డిసెంబర్ 19 వరకు మూడు దశల్లో 34 రోజులు జరిగాయి. చలోరాజ్‌భవన్, అ సెంబ్లీ తదితర పిలుపులు, వివిధ రాజకీయ పార్టీల సమావేశాలు, బహిరంగ సభలు, జనవరిలో వచ్చిన మిలాదున్నబీ నుంచి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వరకు వరుసపెట్టి బందోబస్తుల నేపథ్యంలో పోలీసులు అత్యధిక శాతం రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. కేసుల్లో తగ్గుదల...కొన్ని నేరాల్లో పెరుగుదల... గతేడాది నగరంలో 18,744 కేసులు నమోదు కాగా... ఈ సంఖ్య ఈ ఏడాది 18,013గా ఉండి తగ్గుదల కనిపించింది. దోపిడీ, బందిపోటు దొంగతనం, ఇళ్లల్లో చోరీలు, దాడులు వంటి కేసుల్లో తగ్గుదల ఉన్నా... సాధారణ చోరీలు, కిడ్నాప్‌లు, లైంగికదాడులు పెరిగాయి. మొత్తమ్మీద ఈ ఏడాది రూ.42,66,50,191 విలువైన సొత్తు చోరీ కాగా... కేవలం రూ.16,30,84,642 మాత్రమే రికవరీ అయింది. గతేడాది రికవరీల శాతం 51.26 శాతం ఉండగా ఈ ఏడాది 38.22 శాతానికి పడిపోయింది. మహిళలూ ముందుకొచ్చి ఫిర్యాదు... సైబరాబాద్‌లో మహిళలు బాధితులుగా ఉన్న నేరాల సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగింది. 2012లో 1823 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 2124కు చేరింది. మహిళల్లో పెరిగిన అవగాహనతో పాటు పోలీసుస్టేషన్లలో లేడీ హోమ్‌గార్డుల్ని రిసెప్షనిస్టులుగా నియ మించడం తదితర చర్యల కారణంగా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే ఈ సంఖ్యలో పెరుగుదల కనిపిం చిందని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. సైబర్ నేరాల్లోనూ 360 శాతం పెరుగుదల న మోదు కావడానికీ అవగాహనే కారణమన్నారు. సిబ్బంది సంఖ్యతో ఇబ్బందే... నగర కమిషనరేట్‌కు కేటాయించిన పోస్టుల సంఖ్య 12,401 కాగా ప్రస్తుతం 8554 మందే అందుబాటులో ఉన్నారు. మిగిలిన 3847 (32 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బందోబ స్తు, లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు తోడు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల రిక్రూట్మెంట్ చేసుకున్న 2070 మంది అభ్యర్థులు మరో ఏడాదిలో శిక్షణ పూర్తి చేసుకుని వస్తే ఈ సమస్య కొంత వరకు తీరనుంది. భద్రత కోసం సీసీసీ, సేఫ్ సిటీ ప్రాజెక్ట్... నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీసీఎస్ అధికారులు నేరాలు నిరోధించడానికి, కేసులు కొలిక్కితేవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని కొత్వాల్ చెప్పారు. సిటీ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏడాదిలో 41,579 ప్రాంతాల్లో తని ఖీలు చేయడంతో పాటు 43 బోగస్ ఫోన్‌కాల్స్ కూ స్పందించారన్నారు. భద్రతా చర్యల్లో భా గంగా నగర కమిషనరేట్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఏర్పాటు చేసి నగరంలోని 335 సీసీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు కిందా అనేక ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపామన్నారు. తగ్గిన ప్రమాదాలు, మరణాలు... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యా గణనీయం గా తగ్గిందని కమిషనర్ చెప్పారు. జరిమానా మొత్తాల్ని పెంచి వసూలు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతోంద న్నారు. ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో అత్యధికంగా 1181 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు. ఇదీ విజన్ 2014... ప్రజలకు మరింత చేరువై, ఆశించిన విధంగా పని చేయడమే వచ్చే ఏడాది తమ లక్ష్యమని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. నేరాల్ని త్వరిగతిన పరిష్కరించడం పైనే దృష్టి పెట్టామన్నారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు మతసామరస్యాన్ని కాపాడతామన్నారు. ప్రతి జోన్‌కు ఓ మహిళా ఠాణా ఉండేలా మరో రెండింటి కోసం ప్రయత్నిస్తామని, పెండింగ్‌లో ఉన్న కొత్త ఠాణాల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటంపైనా దృష్టి పెడతామన్నారు. -
అసెంబ్లీ ముట్టడి యత్నం భగ్నం
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల అరెస్టు హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మాసబ్‌ట్యాంక్ నుంచి అయోధ్యా జంక్షన్ మీదు గా అసెంబ్లీ వద్దకు వెళుతున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తోపాటు మరో 40 మంది నిరసనకారులను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ సమావేశం పూర్తయిన అనంతరం వారిని విడిచిపెట్టారు. తెలంగాణ బిల్లు చట్టబద్ధమైనది కాదని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుపై అసెంబ్లీలో డ్రామాలాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జేఏసీ నాయకులు కార్తీక్, రవి, డేవిడ్, ప్రభాకర్‌రెడ్డి, ఉత్తన్న, పి.శ్రీను, ఓబన్న, యశ్వంత్, నాగార్జున తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
‘యువతరంగం’జోష్
మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూలో శనివారం సాయంత్రం జరిగిన ‘యువతరంగం’జోష్ నింపింది. విద్యార్థులు చిత్ర, విచిత్ర విన్యాసాలతో ఆహూతులను మెప్పించారు. -
గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభానాగిరెడ్డి, రెహ్మాన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు హామీయిచ్చారు. మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ తరపున లక్ష రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్టు మేయర్ ప్రకటించారు. -
మాసబ్‌ట్యాంక్ విజయ్‌నగర్ కాలనీలో కూలిన భవనం
-
మసాబ్ ట్యాంక్ లో హుక్కా సెంటర్లపై దాడి, 70 మంది అరెస్ట్
నగరంలోని హుక్కా సెంటర్లపై గత కొద్దికాలంగా పోలీసులు నిరవధిక దాడులు జరుపుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా నగరంలోని మాసాబ్ ట్యాంక్ లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేసి భారీ సంఖ్యలో యువతీ, యువకులను పట్టుకున్నారు. సుమారు 70 మందికి పైగా యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.