సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మండలిని ప్రస్తుతం మాసాబ్‌ట్యాంకులో ఉన్న భవనంలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో ఉంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవనంలోని కొన్ని గదులను ప్రాథమికంగా పరిశీలించాలని నిర్ణయించా రు. సుప్రీంకోర్టు ఏపీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తెలంగాణ ఉన్నత విద్యామండలి అధీనంలో ఉన్న తమ కార్యాలయంలోకి వెళ్లటంపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
హైదరాబాద్ కేంద్రంగానే మండలి కార్యకలాపాలు సాగించేలా వేరే చోట కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మాసాబ్‌ట్యాంకులోని కార్యాలయంలో ఏపీకి చెందిన రికార్డులు, ఇతర ఫైళ్లు ఉన్నందున వాటిని అప్పగించాలని కోరుతూ తెలంగాణ మండలికి లేఖ రాయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. యంత్రాంగం మొత్తాన్ని తెలంగాణ మండలి తన పరిధిలోకి తెచ్చుకోవడంతో ఏపీకి సిబ్బంది లేకుండా పోయారు. దీనిపైనా అధికారులు చర్చలు సాగిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడారు. విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రాను కలసి తాజా పరిణామాలపై చర్చించారు.
ఉన్నత విద్యామండలికి స్థాన చలనం!
Published Fri, May 15 2015 4:06 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement