అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు! | 1st Day Seva Days Program Under Auspices Of TTA Conducted Great Enthusiasm | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు

Published Thu, Dec 14 2023 3:59 PM | Last Updated on Thu, Dec 14 2023 3:59 PM

1st Day Seva Days Program Under Auspices Of TTA Conducted Great Enthusiasm - Sakshi

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని రెడ్ క్రాస్ గవర్నమెంట్‌ స్కూల్ మసాబ్ టాంక్‌లో సేవా డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్‌సీసీ బృందంతో టీటీఏ సభ్యులను సాదరంగా “గాడ్ ఆఫ్ ఆనర్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. టీటీఏ సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిన్నారుల పాటలు ఆహుతులను ముఖ్యంగా టీటీఏ సభ్యులను ఆకట్టుకుంది.

ఇక ఈ విద్యార్థులకు టీటీఏ నుంచి నగదు బహుమతి అందించారు. జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిందన చిన్నారికి టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి 5వేల నగదు బహుమతి అందించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్‌లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ అందజేశారు. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి. అందుకే టీటీఏ వారి ఆరోగ్యం పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. ఇక డెంటల్ హెల్త్‌తో పాటు ఉమన్ హెల్త్, న్యుట్రిషన్ గురించి పిల్లలకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి మేమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు.

(చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement