American Telugu Association (ATA)
-
కన్హా ఆశ్రమంలో దాజిని కలిసిన ఆటా ప్రతినిధులు!
రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలో గల కన్హా శాంతి వనంను ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ డి పటేల్(దాజీ) ని కలిశారు. ఇదే సందర్భంలో ఆశ్రమంలో యోగ చేసి, యోగ వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూదిని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, అడ్వైసర్ కరుణాకర్ అసిరెడ్డి, ఆటా మాజీ ప్రెసిడెంట్లు భీమ్ రెడ్డి పరమేష్, కరుణాకర్ మాధవరం, ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహ రెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు, శివ గీరెడ్డి వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో అంతర్జాతీయ సాహితీ సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి ప్రారంభించగా, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ సభ అధ్యక్షత వహించారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్లు ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ వుందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాస పత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ తెలుగు పై వారికి వున్న ప్రేమకి నిదర్శనం అని అన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత ఆటా దేనని అన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉన్నదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం అనే అంశంపై ప్రముఖ రచయిత కాసుల ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించగా టీవీ ప్రసారాలు అప్పుడు-ఇప్పుడు అనే అంశంపై శాంతి స్వరూప్, శ్రోతల జీవితాన్ని నిర్దేశించిన రేడియో అంశంపై అయినంపుడి శ్రీ లక్ష్మి, నూతన మాధ్యమాలు సత్యసత్యాలు అంశంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, ఇవాళ్టి తెలుగు పరిశోధకులకు మార్గదర్శనం అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్, సాంకేతిక యుగంలో సాహిత్య పాత్ర అంశంపై స్వామి ముద్దం తమ భావనలను వివరించారు. అనువాదం, నాటకం అవధానం అనే అంశంపై రూప్ కుమార్ డబ్బికార్ అధ్యక్షతన రెండవ సమావేశం నిర్వహించగా, అనువాదంలో చిక్కులు సమస్యలు అంశంపై జే.ఎల్ రెడ్డి, అనువాద సాహిత్యం-అవశ్యకత అంశంపై నలిమెల భాస్కర్, తెలుగు నాటకం తీరు తెన్నులు అంశంపై దెంచానాల శ్రీనివాస్, పరిశోధన, విమర్శ, సమాలోచనలు అంశంపై కొలకలూరి మధుజ్యోతి, అవధానంలో చమత్కారం అంశంపై నరాల రామ్ రెడ్డి వారి ఆలోచనలను పంచుకున్నారు తెలుగు కథలు, నవల, విశ్లేషణ అనే అంశంపై వెల్దండి శ్రీధర్ అధ్యక్షతన 3వ సమావేశం నిర్వహించగా జీవన స్రవంతి నవల-అనుభవాలు అనే అంశంపై టేకులపల్లి గోపాల్ రెడ్డి, నవల సాహిత్యంలో కొత్త పోకడలు అంశంపై మధురంతకం నరేంద్ర, యువతపై నవల సాహిత్య ప్రభావం అంశంపై మధుబాబు, తరాల తెలుగు కథ అంశంపై పెద్దింటి అశోక్ కుమార్, తెలుగు సాహిత్యంలో నవల ప్రాధాన్యత అంశంపై సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి, కథల్లో కొత్తదనం అనే అంశంపై మొహమ్మద్ గౌస్, కథ-సమాజం అంశంపై హుమాయూన్ సంఫీుర్ తమ భావనలను వివరించారు. ఆధునిక కవితా పరిణామాలు అనే అంశంపై కవి యాకూబ్ అధ్యక్షతన 4వ సమావేశం నిర్వహించగా ఎస్.వి సత్యనారాయణ, మువ్వా శ్రీనివాస్ రావు, నాలేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందారపు హైమవతి, కొండపల్లి నిహరిని, కందుకూరి శ్రీరాములు, పద్య కవితా శిల్ప సౌందర్యం అంశంపై జిల్లేపల్లి బ్రహ్మం తమ భావాలు వివరించారు. గేయ సాహిత్యం అనే అంశంపై రవీందర్ పసునూరి అధ్యక్షతన 5వ సమావేశం నిర్వహించగా ప్రముఖ గేయ రచయితలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాసు, కాసర్ల శ్యామ్ తమ పాటలతో ఉర్రూతలూగించారు. సినిమా సాహిత్య మేళవింపు అనే అంశంపై సినీ నటుడు తనికెళ్ళ భరణి అధ్యక్షతన 6వ సమావేశం నిర్వహించగా జనాభా దృశ్య కళా రూపాలు-ప్రదర్శన పద్దతులు అనే అంశంపై తప్పెట రామ్ ప్రసాద్ రెడ్డి, సినిమాల్లో జానపద కళారూపాలు అంశంపై బలగం వేణు, దృశ్య మాధ్యమంలో చారిత్రక అంశాలు అంశంపై అల్లని శ్రీధర్, సినిమా విమర్శ అంశంపై మామిడి హరికృష్ణ, దృశ్య మాధ్యమంలో తెలుగు కవిత్వం అంశంపై మొహమ్మద్ షరీఫ్ తమ భావనలను వివరించారు. ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విసి టి.కిషన్ రావు సభ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాజీ తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జులురు గౌరీశంకర్, మాజీ బాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆటా చేస్తున్న సాహిత్య సేవ మరువలేనిది అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసిన ఆటా వారికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కె రన్!) -
టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కే రన్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 5కె రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ 'రన్ ఫర్ హెల్త్ అంటూ' టీటీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని, ప్రసంగించారు. 5కె రన్ కార్యక్రమాన్ని టీటీఏ టీమ్‌తో కలిసి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ప్రారంబించారు. టీటీఏ సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమికి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన టీటీఏ సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు సుధీర్ రెడ్డి. ఈ 5కె రన్ కార్యక్రమం గురించి సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా డేస్‌తో పాటు టీటీఏ సాధించిన విజయాలను సంస్థ అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల వివరించారు. ప్రతి రెండేళ్ల ఒకసారి చేసే టీటీఏ సేవా కార్యక్రమం.. ఇక నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డితో పాటు పలువురిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందించారు. ఈ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందిరని ఆకట్టుకున్నాయి. జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాలేజ్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన, మణిపూర్ సంప్రదాయ కర్ర ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆద్యంతం ఉత్సహబరితంగా సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. (చదవండి: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా) -
టీటీఏ సేవా డేస్.. గజ్వేల్ లో ట్రై సైకిల్ లు పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్‌లో భాగంగా ఐదవ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన టీటీఏ బృందం.. గజ్వేల్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్ లు పంపిణీ చేశారు. సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, విజేంద్ర భాష, రోటరి క్లబ్ ఖమ్మంతో వారి సహాయంతో పాటు దాతాల సహకారంతో ట్రై సైకిల్, వీల్ చైర్లు పంపిణీ చేసినట్లు టీటీఏ టీమ్ తెలిపింది. అలాగే అవసరమైన వారికి కృత్రిమ అవయవాలకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహాకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీఏ చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలను పలువురు కొనియడారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని రెడ్ క్రాస్ గవర్నమెంట్ స్కూల్ మసాబ్ టాంక్‌లో సేవా డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్సీసీ బృందంతో టీటీఏ సభ్యులను సాదరంగా “గాడ్ ఆఫ్ ఆనర్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. టీటీఏ సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిన్నారుల పాటలు ఆహుతులను ముఖ్యంగా టీటీఏ సభ్యులను ఆకట్టుకుంది. ఇక ఈ విద్యార్థులకు టీటీఏ నుంచి నగదు బహుమతి అందించారు. జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిందన చిన్నారికి టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి 5వేల నగదు బహుమతి అందించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్‌లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ అందజేశారు. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి. అందుకే టీటీఏ వారి ఆరోగ్యం పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. ఇక డెంటల్ హెల్త్‌తో పాటు ఉమన్ హెల్త్, న్యుట్రిషన్ గురించి పిల్లలకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి మేమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. (చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు) -
అరిజోనాలో కనుల విందుగా రెట్రో నేపథ్య సంగీత వేడుక!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీ కనులవిందుగా ప్రారంబమైంది. అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగిన ఈ మనోహరమైన సంగీతం ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేడుక భారతీయ సినిమా స్ఫూర్తిని, చలనచిత్ర వాతావరణాన్ని తీసుకువచ్చింది. భారతదేశం గొప్ప సంస్కృతి, వినోదాన్ని జరుపుకోవడానికి అన్ని వర్గాల నుంచి అతిథులు హాజరయ్యారు. 300 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సినీ సంగీతం, ఫ్యాషన్ షో అలరించింది. అద్భుతమైన అలంకరణ, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నేపధ్య సంగీతంతో గుర్తువుండిపోయే వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలతో మారుమ్రోగింది. నటి లయ, గాయకుడు రఘు కుంచె తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. హాజరైన ప్రేక్షకులు భారతీయ వంటకాలు, పానీయాలను ఆస్వాదించారు. ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘు ఘాడీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని జరుపుకోవడం కోసం ఈ సందర్భంగా ప్రణాళికలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కోఆర్డినేటర్లు చెన్నయ్య మద్దూరి, వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, సునీల్ అన్నపురెడ్డి, ఫరితొష్ పొలి, మహిళా చైర్ శుభ, బింద్య,నివేదిత ఘాడీ, తదితరులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ ఆటా టీమ్ ధన్యవాదాలు తెలిపింది. (చదవండి: న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు) -
Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్..
సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్ క్లాసెస్ ఆఫర్ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. అమెరికా.. రియల్ ఎస్టేట్ డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను. తెలుగు మహిళల కోసం.. అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం. మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి) పుట్టిన గడ్డకు సాయం అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
ఆటాలో కూచిపూడికి పట్టం
తెలుగు వారి సాంప్రదాయ భారతీయ నాట్యం కూచిపూడికి ఆటా వేదికపై పట్టం కట్టించారు న్యూజెర్సీలోని సెంటర్ ఫర్ కూచిపూడి. ఇటీవల వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ మహాసభల్లో సెంటర్ ఫర్ కూచిపూడి కళాకారిణులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి కూచిపూడి నృత్యం అభ్యసించి.. అమెరికాలో సెంటర్ ఫర్ కూచిపూడి ఏర్పాటు చేశారు ఇందిరా శ్రీరాం రెడ్డి దీక్షిత్. న్యూజెర్సీ కేంద్రంగా గత 20 ఏళ్లుగా ఎంతో మందికి కూచిపూడిని నేర్పిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నారు ఇందిరా శ్రీరాం దీక్షిత్. అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభల్లో ఇందిరా టీంలోని సభ్యులు సాంప్రదాయ కూచిపూడితో పాటు కోలాట నృత్యాలు చేసి అలరించారు. -
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
17వ ఆటా మహా సభలు.. తొలిరోజు(ఫోటోలు)
-
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. వాషింగ్టన్ డీసీ జూలై 1 నుంచి 3 వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు. చదవండి: (గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు) -
ఘనంగా ఆటా వేడుకలు
గన్‌ఫౌండ్రీ: ఈ నెల 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆటా వేడుకలను నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్ తెలిపారు. ఆదివారం అబిడ్స్‌లోని స్టాన్లీ కళాశాలలో ఆటా వేడుకల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 6వ తేదీన వనపర్తిలో వెటర్నరీ వైద్యశాల ప్రారంభం, 7వ తేదీన నల్లగొండలో వైద్య శిబిరం, 8వ తేదీన భువనగిరిలో ఆరోగ్య, నేత్ర శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 18వ తేదీన తిరుపతిలో ఆటా సాంస్కృతిక కార్యక్రమం, రెండు తెలుగు రాష్ట్రాల సాహితీవేత్తలతో సదస్సు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 26వ తేదీన రవీంద్రభారతిలో ఆటా మహోత్సవం, వివిధ రంగాల నిపుణులకు సత్కారం, జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు మధు, వేముల శరత్ బొద్దిరెడ్డి అనిల్, ఎర్రం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా ప్రవాసీ అనిల్ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డికి నవంబర్ 28 నాడు తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు, మిత్రులు స్వాగతం పలికారు. అనిల్ బోదిరెడ్డి ప్రస్తుతం 'ఆటా' వేడుకలకు కో-చైర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(GATES) చైర్‌గా, ఇండియన్ ఫ్రెండ్స్ అఫ్ అట్లాంటా చైర్‌గా సేవలందించారు. సౌత్ ఆఫ్రికాలోని గాటెంగ్‌లో 'గ్రోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(GOPIO)' కార్యదర్శి వీ లక్ష్మణ్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్(COTA)' (ప్రవాసీ తెలంగాణ సంఘాల విశ్వవేదిక) చైర్మన్ ముళ్ళపూడి వెంకట అమ్రీత్లు అనిల్ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. -
ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా
న్యూజెర్సీ: అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయల్గ్రాండ్ మ్యానర్‌లో జరిగిన ఈ వేడుకలకు న్యూజెర్సీ పరిసర ప్రాంతాలకు చెందిన వెయ్యికి మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను న్యూజెర్సీ కాన్సులేట్ జనరల్ విజయ్ కృష్ణన్, ప్రారంభించారు. ఈ సందర్భంగా అటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అటా మెగా సదస్సుకు రావాల్సిందిగా ప్రతీ ఒక్కరిని ఆహ్వానించారు. అటా తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ దసరా వేడుకల్లో వివిధ తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
షికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), షికాగో టీం ఆధ్వర్యంలో అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్ కాంగ్రెసు మాన్ బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ౩5౦ మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల మధ్యన కాంగ్రెస్ మాన్ బిల్ ఫాస్టర్ జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రoగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారన్నారు. మిలియన్‌కి పైగా జనాభా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ సంస్కృతి, పండుగలు అమెరికాలో నిర్వహించడం శ్లాఘనీయమన్నారు. బతుకమ్మ, దసరా వేడుకలను పురస్కరించుకుని మహిళలు, పిల్లలు సంద్రయాద దుస్తులు ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. కోలాటం, డోలు వాయిద్యాల హోరు మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మి పూజ నిర్వహించి అందరికి ప్రసాదాలు అందించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెజరర్, ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల తోడ్పాటుని అందించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్రామిరెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి, సుచిత్ర రెడ్డిలు సహకారం అందించారు. వీరితో పాటు చల్మారెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు, భీమి రెడ్డిలు కూడా తమ వంతు కృషిని అందించారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా,నాష్విల్లే) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్దంగా గణపతి, దుర్గమాతలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్నారై మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆటపాటల మధ్య బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఆటా నాష్విల్లే మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాలతో పాటు మధు బొమ్మినేని, ఆలా రామకృష్ణారెడ్డి, నూకల నరేందర్‌రెడ్డి, గూడూరు కిశోర్, సుశీల్ చందా, రాధికారెడ్డి, లావణ్య నూకల, మంజు లిక్కి, శ్రీలక్ష్మీ, బిందు మాధవి, శిరీష కేస తదితరులు సహయ సహకారం అందించారు. చదవండి : లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
తానా ఆధ్వర్యంలో ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు'
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు' జరిగాయి. ఆగస్ట్ 30న అట్లాంటా, జార్జియా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో శ్రీ గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగస్ట్ 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయి వర్చువల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య తన ప్రసంగంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రముఖులకు సాదరంగా ఆహ్వానం పలికారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య మాధవపెద్ది సీతాదేవి దంపతుల కుమార్తె,ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి- సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా. శశి పంజాను సభకు పరిచయం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వారే అయినా కలకత్తాలో స్థిరపడి రాజకీయాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ఓ వైపు డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ..ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడం వల్ల తెలుగు నేలకు దూరమే అయినా...ఇంట్లో కుటుంబసభ్యులు తెలుగులోనే మాట్లాడుకుంటామని అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని పునరుద్ఘాటించారు. తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేసారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను, వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు. ఈ సభలో అతిధిగా పాల్గొన్న ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన చెందారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందిస్తున్న సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తి గా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది సాహితీవేత్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని, పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. పాల్గొన్న ప్రముఖులు తుమ్మల శ్రీనివాసమూర్తి, మనోరమ (రాయప్రోలు) కానూరి, డా. కొండవీటి విజయలక్ష్మి, వర ముళ్ళపూడి, గొల్లపూడి రామకృష్ణ, డా. ఉమర్ ఆలీ షా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా మునిమనవడు గుర్రం పవన్ కుమార్, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు శ్రీమతి రేవతి అదితం, గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న సతీమణి హైమవతీ భీమన్న, గురజాడ అప్పారావు మునిమనవరాలు అరుణ గురజాడ, గుంటూరు శేషేంద్రశర్మ కుమారుడు గుంటూరు సాత్యకి, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని,పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ మనవడు విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు కోడలు లక్ష్మి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి -
తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఆగస్టు 28 ఆదివారం రోజున నిర్వహించింది. గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఫ్లోరిడాలోని గైనెస్విల్లేలోని స్టోన్ వాల్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటుచేసింది. ఈ టోర్నమెంట్లో ప్లేయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ కోసం నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రుచికరమైన వంటకాలను అందించారు. షార్ట్‌గన్ ఫార్మాట్లో సుమారు 28 జట్లు పాల్గొన్నాయి. కిషోర్ చెన్పుపాటి, దినకర్ కుడుం, రిషి సుందరేశన్, సుండు వెంకటరమణి బృందం 58 టై బ్రేక్ స్కోర్‌తో ఫ్లెట్ 1 లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చంద్ర ద్యామంగౌదర్, అనుప్ గుప్తా, సమీష్ చావ్లా, ప్రకాశ్ కృష్ణమూర్తి బృందం నిలిచింది. ఫ్లైట్ 2 లో కరణ్ చిలుకూరి, శశి రంగనాథన్, దురై నటరాజన్, వికాస్ కాలే బృందం 68 టై బ్రేక్ స్కోరుతో మొదటిస్థానంలో నిలిచారు. క్రిష్ రామయ్య కృష్ణమూర్తి, గోవింద్ జగన్నాథన్ ,సుందర్‌తో కూడిన బాలపెరుంబాల బృందానికి రెండవ స్థానం లభించింది. క్లోజెస్ట్ టూ ది పిన్ కెటగిరీలో హోల్-4లో సుందు వెంకటరమణి, హోల్-12లో సకీత్ వెంనూరి విజేతలుగా నిలిచారు. లాంగెస్ట్ డ్రైవ్స్ విభాగంలో విక్రం కల్లెపు(హోల్-6), చంద్ర ద్యామన్ గౌడ్ (హోల్-18 ) విజేతలుగా నిలిచారు. సురేందర్ యెదుల్లా, ప్రసాద్ తుములూరి, రాజా శ్రీనివాసన్, విక్రమ్ కల్లెపు పర్యవేక్షణలో గోల్ఫ్ టోర్నమెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేష్ బూజాలా మాట్లాడుతూ.. టోర్నమెంట్లో పాల్గోన్న బృందాలను అభినందించారు. 2022 జూలై 1,2,3 తేదిల్లో వాషింగ్టన్ డీసీలో వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ సమావేశానికి ప్రతి ఒకరిని ఆహ్వానించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-ఆర్డినేటర్ రవి చల్లా వాలంటీర్లను స్పాన్సర్లైన సోమిరెడ్డి లా సంస్థ, సురేష్ సరిబాల, సురేందర్ యెదుల్లా, విజయ్ ఖేతర్పాల్ , లూర్డ్స్ మెక్‌మైఖేల్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు అభినందించారు. -
ఆటాకు ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించిన అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సభ్యులకు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ ధన్యవాదాలు అన్నారు వైవీ సుబ్బారెడ్డి. కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారు: శివ భరత్ రెడ్డి మేమంతా కలిసి తెలుగు ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించాము. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము కూడా సాయం చేస్తున్నాము అని ఏపీ ఆటా ప్రతినిధి శివ భరత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళమిచ్చిన ఆటా -
ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళమిచ్చిన ఆటా
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో ఏపీకి ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) తమ వంతు సాయం అందించింది. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద అందించారు. ప్రాథమికంగా 50 కాన్సంట్రేటర్స్‌ను అందించిన ఆటా మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు భువనేష్ భుజాల, కార్యదర్శి హరిప్రసాద్ లింగల తదితరులు పాల్గొన్నారు. -
ఆట ‘ఝమ్మంది నాదం’ ఫైనలిస్ట్‌లు వీరే!
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఝుమ్మంది నాదం’ జూనియర్స్ నాన్ కాసికల్ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్ లైన్లో జూమ్ ద్వా రా నిర్వహించింది. దాదాపు 80 మంది గాయని గాయకులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. శ్రీరామక్రిష్ణా రెడ్డి ఆల బోర్డు ఆఫ్ ట్రస్టీ, శ్రీమతి శారదా సింగిరెడ్డి ఝమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వహకులుగా వ్యవహరించారు. సంగీత దర్శ కులు రాజశేఖర్ సూరిబొట్ల, శ్రీని ప్రభల, ప్లే బ్యాక్ సింగర్ సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు నిహాల్ కొండూరి, సంగీత దర్శకులు కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్ నూతన మోహన్, ప్రవీణ్ కొప్పోలు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరీ గాయనీ, గాయకులు అభిజ్ఞ ఎనగంటి, అభిరాం తమన్న, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అదితి నటరారజన్, అంజలి కందూర్, హర్షిని మగేశ్, హర్షిత వంగవీటి, లాస్య ధూళిపాళ, మల్లిక సూర్యదేవర, మేధ అనంతుని, ప్రణీత విష్ణుభొట్ల, రోషిని బుద్ధ, శశాంక ఎస్.ఎన్, శ్రియ నందగిరి, ఐశ్వర్య నన్నూర్ ఫైనలిస్ట్‌లుగా ఎంపికయ్యారు. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్, రీజినల్ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్లందరికి అభినందనలు తెలిపారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులకు, వారి తల్లి దండ్రులకు, ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణీతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందటం గర్వకారణమన్నారు. ‘ఆటా ఝమ్మంది నాదం’ సెమీఫైనల్స్ ఆగస్టు 2, 2020న జరుగుతాయన్నారు. ఫైనల్స్ ఆగస్టు8, 2020 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆటా సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్నేషనల్, టీవీ 5, జీఎన్ఎన్, ఏబీఆర్ ప్రొడక్షన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, టోరి రేడియో, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఝమ్మంది నాదం’ పాటల పోటీ విజయవంతంగా నిర్వహించిన ఆటకార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి ప్రశంసలు తెలిపారు. చదవండి: ఆటా 'ఝుమ్మంది నాదం' పాటల పోటీలు -
'ఆటా' అధ్వర్యంలో పాటల పోటీలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్వర్యంలో "ఝుమ్మంది నాదం" జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 80 మంది గాయని గాయకులు అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ.రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీమతి.శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ. శ్రీని ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ మరియు నందిని అవార్డు గ్రహీత శ్రీమతి. సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు శ్రీ..కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులు, 1.అభిజ్ఞ ఎనగంటి, 2.అభిరాం తమన్న, 3.ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, 4.అదితి నటరాజన్, 5.అంజలి కందూర్, 6.హర్షిని మగేశ్, 7.హర్షిత వంగవీటి, 8.లాస్య ధూళిపాళ, 9.మల్లిక సూర్యదేవర, 10.మేధ అనంతుని, 11.ప్రణీత విష్ణుభొట్ల, 12.రోషిని బుద్ధ, 13.శశాంక ఎస్.యెన్, 14.శ్రియ నందగిరి, 15.ఐశ్వర్య నన్నూర్లను వర్జీనియా, న్యూ జెర్సీ, జార్జియా, కాలిఫోర్నియా, మసాచూట్స్, మిచ్చిగన్, వాషింగ్టన్ , టెక్సాస్, మిన్నిసోటా తదితర రాష్ట్రాల నుంచి ఫైనలిస్ట్స్గా ఎంపిక చేసారు. ఆటా ప్రెసిడెంట్ శ్రీ..పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల , బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్స్ అందరికి అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం. ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలు ఆగష్టు 2, 2020 వరకు ఫైనల్స్ ఆగష్టు 8, 2020 నుంచి ఆగష్టు 9 వరకు కొనసాగిస్తారు. ఆటా సంస్థలకు లైవ్ ప్రచారం చేస్తున్న వివిధ టీవీ చానళ్లకు, జి.యెన్.యెన్, ఏ.బి.ఆర్ ప్రొడక్షన్స్, అలాగే తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీలు విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ .పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు. -
ఆటా 'ఝుమ్మంది నాదం' పాటల పోటీలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” పాటల పోటీలను జూన్ 28 నుంచి ఆగష్టు 2 వరకు నిర్వహిస్తోంది. అందులో భాగంగా జూన్ 28న సబ్‌జూనియర్స్ నాన్ క్లాసికల్, జూలై 4, 5 తేదీలలో జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను ఆన్లైన్లో జూమ్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 82 మంది గాయనీ గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణా రెడ్డి ఆల బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుంచి కర్నాటిక్ మ్యూజీషియన్ వాసగోపినాధ్ రావు, సంగీత దర్శకులు శ్రీని ప్రభల, సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ మానస ఆచార్య, ప్లే బ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. (ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు) ఆటా సంస్థ అయిదు రీజియన్స్.. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ల నుంచి సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీమణులు.. అమ్రిత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి ఓత్ర, మిత్ర చెబియ, పర్జిక వుల్లగంటి, శరణ్య ఎస్, తన్వి గొంగల, వైష్ణవి రెండుచింతలను ఫైనలిస్ట్స్గా ఎంపిక చేశారు. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్, కాన్ఫరెన్స్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం అమెరికాలో ఉన్న గాయనీగాయకుల నైపుణ్యతను ప్రదర్శించడానికి ఆటా సంస్థ ఏర్పరిచిన ఈ గొప్ప సదవకాశాన్ని ఉపయోగించుకుని సంగీత విద్వాంసుల ముందు వారి సంగీత ప్రతిభను చూపిస్తున్న గాయని గాయకులందరికీ అభినందనలు తెలియజేశారు. ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న టీవీ చానళ్లకు, అలాగే తెలుగు ఎన్నారై రేడియో, టోరీ రేడియో, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రశంసలు తెలిపారు. (ఆటా అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు) -
ఆటా ‘జుమ్మంది నాదం’ పాటల పోటీ
న్యూయార్క్ : డిసెంబర్, 2020లో జరగనున్న కన్వెన్షన్‌ను పురష్కరించుకుని ‘అమెరికన్ తెలుగు అసోషియేషన్’ ( ఆటా) ‘జుమ్మంది నాదం’ పేరిట ఆన్లైన్ సోలో పాటల పోటీ నిర్వహించనుంది. అమెరికాలో ఉంటున్న వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు. మొదటి రౌండ్‌ను యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ఫాంలో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా ఆడిషన్స్ పంపాల్సి ఉంటుంది. ఫైనల్, సెమీ ఫైనళ్లు జూమ్ ద్వారా నిర్వహించబడతాయి. విజేతలను ప్రముఖుల చేతుల మీదుగా ఆటా టైటిల్‌తో సత్కరించనున్నారు. పోటీలోని ఆరు విభాగాలు : వయసు పరిమితి 1) క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 2) క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 3) క్లాసికల్ : సీనియర్స్ ( 15 పైబడిన వారు) 4) నాన్ క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 5) నాన్ క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 6) నాన్ క్లాసికల్ : సీనియర్స్ ( 15 సంవత్సరాల పైబడిన వారు) రిజిస్ట్రేషన్ చివరి తేదీ : జూన్ 7, 2020 రిజిస్ట్రేషన్ కోసం : https://tinyurl.com/ATA-JN2020 క్లిక్ చేయడి. మరిన్ని వివరాల కోసం : https://tinyurl.com/ATA-JN-Details ను సందర్శించండి.