ఆట ‘ఝమ్మంది నాదం’ ఫైనలిస్ట్‌లు వీరే! | ATA Jhummandi Naadam Juniors Finalists | Sakshi
Sakshi News home page

ఆట ‘ఝమ్మంది నాదం’ ఫైనలిస్ట్‌లు వీరే!

Published Mon, Jul 20 2020 11:24 AM | Last Updated on Mon, Jul 20 2020 12:06 PM

ATA Jhummandi Naadam Juniors Finalists - Sakshi

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఝుమ్మంది నాదం’ జూనియర్స్ నాన్ కాసికల్ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్ లైన్‌లో జూమ్ ద్వా రా నిర్వహించింది. దాదాపు 80 మంది గాయని గాయకులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. శ్రీరామక్రిష్ణా రెడ్డి ఆల బోర్డు ఆఫ్‌ ట్రస్టీ, శ్రీమతి శారదా సింగిరెడ్డి ఝమ్మంది నాదం చైర్‌ కార్యక్రమ నిర్వహకులుగా  వ్యవహరించారు.  సంగీత దర్శ కులు రాజశేఖర్‌ సూరిబొట్ల, శ్రీని ప్రభల, ప్లే బ్యాక్‌ సింగర్‌ సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు నిహాల్‌ కొండూరి, సంగీత దర్శకులు కార్తీక్‌ కొడకండ్ల, ప్లే బ్యాక్‌ సింగర్‌ నూతన మోహన్‌, ప్రవీణ్‌ కొప్పోలు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. 

ఆటా సంస్థ జూనియర్స్‌ నాన్‌ క్లాసికల్‌ కేటగిరీ గాయనీ, గాయకులు అభిజ్ఞ ఎనగంటి, అభిరాం తమన్న, ఆదిత్య కార్తీక్‌ ఉపాధ్యాయుల, అదితి నటరారజన్‌, అంజలి కందూర్‌, హర్షిని మగేశ్‌, హర్షిత వంగవీటి, లాస్య ధూళిపాళ, మల్లిక సూర్యదేవర, మేధ అనంతుని, ప్రణీత విష్ణుభొట్ల, రోషిని బుద్ధ, శశాంక ఎస్‌.ఎన్‌, శ్రియ నందగిరి, ఐశ్వర్య నన్నూర్‌ ఫైనలిస్ట్‌లుగా ఎంపికయ్యారు. ఆటా ప్రెసిడెంట్ పరమేష్‌ భీం రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ భువనేశ్‌ రెడ్డి భుజాల, బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్స్‌, రీజనల్‌ డైరెక్టర్స్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్‌  టీం, ఝమ్మంది నాదం టీం,  సోషల్‌ మీడియా టీం ఫైనలిస్ట్‌లందరికి అభినందనలు తెలిపారు. పోటీలో  పాల్గొన్న గాయని గాయకులకు, వారి తల్లి దండ్రులకు, ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణీతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందటం గర్వకారణమన్నారు. ‘ఆటా ఝమ్మంది నాదం’ సెమీఫైనల్స్‌ ఆగస్టు 2, 2020న జరుగుతాయన్నారు. ఫైనల్స్‌ ఆగస్టు8, 2020 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

ఆటా సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్నేషనల్‌, టీవీ 5, జీఎన్‌ఎన్, ఏబీఆర్‌ ప్రొడక్షన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియో, టోరి రేడియో, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఝమ్మంది నాదం’ పాటల పోటీ విజయవంతంగా నిర్వహించిన ఆటకార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీం రెడ్డి ప్రశంసలు తెలిపారు. 

చదవండి: ఆటా 'ఝుమ్మంది నాదం' పాట‌ల పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement