
వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఆటా ప్రతినిధులు
గన్‌ఫౌండ్రీ: ఈ నెల 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆటా వేడుకలను నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్ తెలిపారు. ఆదివారం అబిడ్స్‌లోని స్టాన్లీ కళాశాలలో ఆటా వేడుకల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 6వ తేదీన వనపర్తిలో వెటర్నరీ వైద్యశాల ప్రారంభం, 7వ తేదీన నల్లగొండలో వైద్య శిబిరం, 8వ తేదీన భువనగిరిలో ఆరోగ్య, నేత్ర శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
డిసెంబర్ 18వ తేదీన తిరుపతిలో ఆటా సాంస్కృతిక కార్యక్రమం, రెండు తెలుగు రాష్ట్రాల సాహితీవేత్తలతో సదస్సు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 26వ తేదీన రవీంద్రభారతిలో ఆటా మహోత్సవం, వివిధ రంగాల నిపుణులకు సత్కారం, జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు మధు, వేముల శరత్ బొద్దిరెడ్డి అనిల్, ఎర్రం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment