కాలిఫోర్నియా : అమెరికా తెలుగు సంఘం(ఆటా) సాంప్రదాయంగా నిర్వహించే కిక్‌ఆఫ్ డిన్నర్ 2020 కాన్ఫరెన్స్‌ను సెప్టెంబర్ 28న లాస్ ఏంజిల్స్ లోని ఇర్విన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సాంప్రదాయ కిక్ ఆఫ్ డిన్నర్‌లో సుమారు ఒక మిలియన్ డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వచ్చిన వారితో పాటు స్థానిక తెలుగు సంఘ నాయకులు, ఇతర మద్దతు దారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ.. 16వ ఆటా మహాసభలు వచ్చే ఏడాది జూలై 3 నుంచి 5 వరకు లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశానికి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(టాస్క్) స్థానిక అతిథిగా వ్యవహరించనుందని వెల్లడించారు. అదే విధంగా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్(లాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రై-వ్యాలీ(టాట్వా) సహకారం అందించడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు.
డిసెంబర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆటా వేడుకలకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ బూజల చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆటా బోర్డు 16వ మహాసభలకు సారధ్యం వహించేందుకు కన్వీనర్‌గా నర్సింహ ద్యాసాని, కో కన్వీనర్‌గా విజయ్ తూపల్లి, కోఆర్డినేటర్‌గా రిందా సామ, లోకల్ కోఆర్డినేటర్‌గా బయపా రెడ్డి, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా వెంకట్రామన మురారీ, కాన్ఫరెన్స్ కోడైరెక్టర్‌గా కాశప్ప మాధరం, కాన్ఫరెన్స్ కోడైరెక్టర్‌గా రవీందర్ రెడ్డి కొమ్మెర, అడ్వైజరీ చైర్‌గా మల్లిక్ బండా, కో-చైర్‌గా, మల్లిక్ బొంతు ను నియమించారు. ఈ సమావేశాలకు బంధు మిత్రులతో కలిసి రావాల్సిందిగా అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి ఆహ్వానించారు.
ఆటా మహాసభల అమలును పర్యవేక్షించడానికి బోర్డు కమిటీని నియమించారు. ఈ కమిటీలో పర్మేష్ భీంరెడ్డి-అధ్యక్షుడు, భువనేష్ బూజాలా ప్రెసిడెంట్-ఎలెక్ట్, కరుణకర్ అసిరెడ్డి గత అధ్యక్షుడు, నర్సింహ ధ్యసాని-కన్వీనర్, రిందా సమా-కోఆర్డినేటర్, వేణు సంకినేని-కార్యదర్శి, రవి పట్లోలా-కోశాధికారి, రఘువీర్ రెడ్డి, కృష్ణ ద్యాప, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, మరియు రామ్ అన్నాడి సభ్యులుగా ఉంటారు. అమర్ రెడ్డి మూలమల్లాను అంతర్జాతీయ సమన్వయకర్తగా నియమించారు.
ఆటా కార్యవర్గం లాస్ ఏంజిల్స్ బృందానికి ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు, సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహ ధ్యాసాని-కన్వీనర్, రిందా సామ - సమన్వయకర్త, రవీందర్ రెడ్డి కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్, ప్రాంతీయ సమన్వయకర్త అభినవ్ చిర్రా, రవీందర్ ద్యాప, స్టాండింగ్ కమిటీ చైర్, శ్రీనాథ్ పేరం స్టాండింగ్ కమిటీ కో-చైర్, కుమార్ తాళంకి గత ప్రాంతీయ డైరెక్టర్, ప్రవీణ్ నయని గత ప్రాంతీయ సమన్వయకర్త మరియు వాలంటీర్లు సునీల్ తోకల, నిరంజన్ చలాసాని, నాగరాజ్ గౌడ్, సాగర్ గాదె, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment