mahasabhalu
-
అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు
-
శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశంలోనూ శ్రీలంక తరహా ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పుట్టుకొచ్చే ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించేందుకు వామపక్ష పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి. ఇందుకు సైద్ధాంతికంగా ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి..’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మతో న్మాద బీజేపీని ఎదుర్కొవాలంటే సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పని చేయాలని అన్నారు. ఇందుకు 2 పార్టీల జాతీయ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలి ‘నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైంది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై, ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రమైన అసహ నం, ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. మరోవైపు మోదీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారు. హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. మతోన్మాద బీజేపీని, దాని వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని రాజా పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ‘మోదీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెప్టినెంట్ గవర్నర్, గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమై పని చేయాలి..’ అని రాజా స్పష్టం చేశారు. ఐక్యత చాటుతాం: రామకృష్ణ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై వామపక్ష మేధావులంతా చర్చించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. అక్టోబర్‌లో విజయవాడ కేంద్రంగా నిర్వహించే జాతీయ మహా సభల సందర్భంగా వామపక్ష పార్టీలన్నీ భుజం భుజం కలిపి భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటి చెబుతాయని చెప్పారు. సీపీఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నా: తమ్మినేని సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూని స్టులంతా ఏకం కావాలనే సీపీఐ ప్రతిపా దనను సమర్థిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలి పారు. మతోన్మాద బీజేపీకి ప్రత్యా మ్నా య శక్తిగా నిలబడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్మాదంతో, ఉద్వేగంతో ప్రజలను రెచ్చగొడు తోందని, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమా దకారిగా మారిందని విమర్శించారు. సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదు: సురవరం తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి సంబంధమే లేదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా తామే పోరాటం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఈ పోరాటానికి పూర్తిగా కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని తెలిపారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
బీజేపీ పాలనలో స్వేచ్ఛలేదు.. ప్రజాస్వామ్యానికి ముప్పు: సీపీఐ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రధాని మోదీని, బీజేపీని ఎదిరించినా, ప్రశ్నించినా వారిపై సీబీఐ, ఈడీ, ఎన్ఐఏలను ప్రయోగించి ఇబ్బందిపాల్జేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. విశాఖ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం సీపీఐ 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజా మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో వివిధ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదని, అలాగే ఎవరికీ స్వేచ్ఛ లేదన్నారు. నేడు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చే పరిస్థితి ఎదురైందన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలో అన్ని పక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తే కేంద్రంలో బీజేపీని గద్దె దించవచ్చన్నారు. ఉనికి కోసం చంద్రబాబు పాట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా త్వరలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీకి, బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాలను శాసించిన చంద్రబాబు నేడు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ఎన్ మూర్తి సభకు అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీరాజా, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
నేటి నుంచి మంచిర్యాలలో సీపీఐ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ ఎదుర్కొంటున్న లోటుపాట్లు, లోపాలను అధిగమించి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. శనివారం నుంచి మూడురోజుల పాటు మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ప్రధానంగా పార్టీ నిర్మాణం, విస్తరణ, కేడర్‌ను క్రియాశీలం చేయడంపై దృష్టి నిలపనుంది. ఈ మహాసభలను శనివారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఈ మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారు. సభల్లో డి.రాజా, సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా, తదితరులు ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. మహాసభల చివరిరో జైన 24న పార్టీ నాయకత్వ ఎన్నిక ఉంటుంది. మళ్లీ రాష్ట్ర కార్యదర్శిగా చాడ ఎన్నికయ్యే అవకాశాలున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. -
లాస్ ఏంజిల్స్‌లో ఆటా 16వ మహాసభలు
కాలిఫోర్నియా : అమెరికా తెలుగు సంఘం(ఆటా) సాంప్రదాయంగా నిర్వహించే కిక్ఆఫ్ డిన్నర్ 2020 కాన్ఫరెన్స్‌ను సెప్టెంబర్ 28న లాస్ ఏంజిల్స్ లోని ఇర్విన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సాంప్రదాయ కిక్ ఆఫ్ డిన్నర్లో సుమారు ఒక మిలియన్ డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వచ్చిన వారితో పాటు స్థానిక తెలుగు సంఘ నాయకులు, ఇతర మద్దతు దారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ.. 16వ ఆటా మహాసభలు వచ్చే ఏడాది జూలై 3 నుంచి 5 వరకు లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశానికి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(టాస్క్) స్థానిక అతిథిగా వ్యవహరించనుందని వెల్లడించారు. అదే విధంగా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్(లాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రై-వ్యాలీ(టాట్వా) సహకారం అందించడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. డిసెంబర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆటా వేడుకలకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ బూజల చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆటా బోర్డు 16వ మహాసభలకు సారధ్యం వహించేందుకు కన్వీనర్‌గా నర్సింహ ద్యాసాని, కో కన్వీనర్‌గా విజయ్ తూపల్లి, కోఆర్డినేటర్‌గా రిందా సామ, లోకల్ కోఆర్డినేటర్‌గా బయపా రెడ్డి, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా వెంకట్రామన మురారీ, కాన్ఫరెన్స్ కోడైరెక్టర్‌గా కాశప్ప మాధరం, కాన్ఫరెన్స్ కోడైరెక్టర్‌గా రవీందర్ రెడ్డి కొమ్మెర, అడ్వైజరీ చైర్‌గా మల్లిక్ బండా, కో-చైర్‌గా, మల్లిక్ బొంతు ను నియమించారు. ఈ సమావేశాలకు బంధు మిత్రులతో కలిసి రావాల్సిందిగా అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి ఆహ్వానించారు. ఆటా మహాసభల అమలును పర్యవేక్షించడానికి బోర్డు కమిటీని నియమించారు. ఈ కమిటీలో పర్మేష్ భీంరెడ్డి-అధ్యక్షుడు, భువనేష్ బూజాలా ప్రెసిడెంట్-ఎలెక్ట్, కరుణకర్ అసిరెడ్డి గత అధ్యక్షుడు, నర్సింహ ధ్యసాని-కన్వీనర్, రిందా సమా-కోఆర్డినేటర్, వేణు సంకినేని-కార్యదర్శి, రవి పట్లోలా-కోశాధికారి, రఘువీర్ రెడ్డి, కృష్ణ ద్యాప, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, మరియు రామ్ అన్నాడి సభ్యులుగా ఉంటారు. అమర్ రెడ్డి మూలమల్లాను అంతర్జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆటా కార్యవర్గం లాస్ ఏంజిల్స్ బృందానికి ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు, సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహ ధ్యాసాని-కన్వీనర్, రిందా సామ - సమన్వయకర్త, రవీందర్ రెడ్డి కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్, ప్రాంతీయ సమన్వయకర్త అభినవ్ చిర్రా, రవీందర్ ద్యాప, స్టాండింగ్ కమిటీ చైర్, శ్రీనాథ్ పేరం స్టాండింగ్ కమిటీ కో-చైర్, కుమార్ తాళంకి గత ప్రాంతీయ డైరెక్టర్, ప్రవీణ్ నయని గత ప్రాంతీయ సమన్వయకర్త మరియు వాలంటీర్లు సునీల్ తోకల, నిరంజన్ చలాసాని, నాగరాజ్ గౌడ్, సాగర్ గాదె, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
12 నుంచి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 14 వరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ ఆదినారాయణ, శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ తదితరులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. -
హుస్టన్ వేదికగా ఆటా తెలంగాణ మహాసభలు
టెక్సాస్ : అమెరికా తెలంగాణ అసొసియేషన్ (ఆటా) రెండో తెలంగాణ మహా సభలను ఈ నెల 29నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నిర్వహణ బాధ్యతల కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశారు. 2016లో డెట్రాయిట్వేదికగా తొలి మహాసభలు జరగాయి. ఈ సంస్థ ఉత్తర అమెరికాలో నివసించే ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడి, అమెరికా అంతటా విస్తరించిన దాదాపు 40 తెలంగాణ సంఘాల్ని ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రవాసీ తెలంగాణ వాసులకి ఒక వారధి ఆటా. ఈ సారి వేడుకలను ప్రముఖ సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డికి అంకితం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది జూన్ 12న కన్నుమూసిన సినారెను, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను ఈ సభల్లో ప్రత్యేకంగా గుర్తు చేసుకోనున్నారు. "రైతే రాజు" నినాదంతో రైతు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా "రచ్చబండ" కార్యక్రమాన్ని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో నిర్వహించనున్నారు. భాషా సాహిత్యాల పరంగా కార్యక్రమాలు జరుగనున్నాయి. అష్టావధానంతో పాటు, సాహిత్య సదస్సులు, యువశక్తి అంశంపై చర్చలు నిర్వహించనున్నారు. మహాసభల్లో చివరిరోజు భద్రాచలం నుండి పూజారులు వచ్చి అక్కడి ఉత్సవ విగ్రహాలు, మరియు ప్రసాదముతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపి భక్తులకు స్వామివారి ఆశీస్సులందించనున్నారు. ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ‘తెలుగు భాష మరియు తెలంగాణ అభిమానులందరికి హృదయపూర్వక ఆహ్వానం. కొత్తగా ఏర్పడ్డ మన తెలంగాణ.. కోటి రతనాల వీణగా మారాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, సర్వాంగీణ వికాసం జరగాలి. ప్రవాస తెలంగాణ వాసుల ఆకాంక్ష ఫలితమే ఆటా-తెలంగాణా. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి, సంస్కృతి -సంప్రదాయాలు, భాష-యాస, ఆచారం, కట్టుబాట్లు , నడవడికల పరిరక్షణ ధ్యేయంగా, ప్రపంచంలోని తెలంగాణ సంఘాల సమ్మేళనంగా ఆటా ఏర్పడింది. ఇదే ధ్యేయంతో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నా. ప్రపంచం నలుమూలలలో విస్తరించిన ప్రవాస తెలంగాణ సోదర సోదరీమణులు ఈ వేదికగా కలుసుకోనుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. అనితర సాధ్యమైన బృహత్ లక్ష్యాన్ని ఆటా ధర్మకర్తలు, కార్యవర్గం మరియు కార్యకర్తల సమష్టి కృషితో, తెలంగాణ ప్రవాస మిత్రుల అండదండలతో, ఎన్నారై పారిశ్రామికవేత్తల ఆర్ధిక, హార్దిక వెన్నుదన్నుతో, ఘనంగా, వైభవంగా నిర్వహించబోతున్నామ’ని ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల తెలిపారు. ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం మాట్లాడుతూ.. ‘అమెరికా రాష్ట్రాల్లోని స్థానిక తెలంగాణ సంస్థల ఐక్యసమాఖ్య సంఘటిత శక్తి ఆటా. ప్రతి తెలంగాణ వాసి, తెలంగాణ బాగు కోరే ప్రతి ఒక్కరు మా సంస్థ లోకి ఆహ్వానితులే. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి, అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు వారధిగా ఉంటుంది. మేము చేసే ప్రతి మంచి పనికి మా వెంటే వుండే కార్య కర్తలకు, దాతలకు మా శుభాబి వందనాల’ను తెలిపారు. -
బీజేపీని ఓడించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద బీజేపీని ఓడించటమే పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై వివిధ రాష్ట్రాల సభ్యులు రెండ్రోజులపాటు చర్చించి, తుది అభిప్రాయాన్ని సభకు నివేదిస్తారు. ఈ సందర్భంగా కారత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో రాజకీయ వైరం పాటించాలని సూచించారు. పొత్తులతో పార్టీకి నష్టం జరిగిందని, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు, సామాజిక శక్తులను కలుపుకొని పోయేలా ఎన్నికల ఎత్తుగడ ఉండాలని సూచించారు. అత్యంత కీలకమైన ఈ తీర్మానాన్ని సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెడతారు. కానీ ఈసారి ప్రధాన కార్యదర్శి కాకుండా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టడం గమనార్హం. బహుశా ఇది జాతీయ మహాసభల చరిత్రలోనే మొదటిసారి కావొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారు’
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగి పోతుందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలలో పాల్గొన్న సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదన్నారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెడుతూ.. దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అన్నారు. మతోన్మాద శక్తులను అరికట్టి, వాటిని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాలు తెచ్చే సత్తా వామపక్ష పార్టీలకు ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు 22వ జాతీయ మహాసభలు దిశా నిర్దేశం చేస్తాయని సీతారాం ఏచూరి వివరించారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్ట్‌లు సహా సామాన్యులు హత్యకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నేడు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీలు.. రాజ్‌భవన్‌లని అధికార కేంద్రాలుగా వాడుకుంటుందని, గోవా, మణిపూర్లలో ఇదే నిరూపన అయిందన్నారు. ప్రస్తుత సమయంలో వామపక్ష పార్టీల ఐక్యత ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభం కాగా.. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకోనున్నారు. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం
హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మంటపంలో మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేశారు. తర్వాత సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్‌నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) దీపాంకర భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ శివశంకరన్, ఆర్ఎస్పీ మనోజ్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) దీపక్ భట్టాచార్య, సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు, తెలుగు రాష్ట్రానికి చెందిన వామపక్షనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ తీర్మానంతో పాటు 25 అంశాలపై చర్చలు సాగనున్నాయి. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభతో సీపీఎం జాతీయ మహాసభలు ముగుస్తాయి. -
18 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు: రాఘవులు
హైదరాబాద్: భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, ఇతర వామపక్షాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. మహాసభ సందర్భంగా నగరాన్ని ఎరుపురంగు తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. మహాసభలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 22న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని, సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్, ఎస్.రమ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో విద్యార్థుల మేథోసంపత్తి కీలకం
ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అనంతపురం : దేశాభివృద్ధిలో వి ద్యార్థుల మేధోసంపత్తి కీలక మని ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అన్నారు. రెండు రోజులు నిర్వహించే విశ్వవిద్యాలయ విద్యార్థుల మహాసభలు స్థానిక కమ్మ భవ¯న్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ము ఖ్య అతిథులుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రామ్మోహ¯ŒS, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరు రమేష్, బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధ¯ŒSరెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సీఆర్ఐటీ గ్రూప్ ఆఫ్ ఇన్Ü్టట్యూట్ కరస్పాండెంట్ చిరంజీవిరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు నేడు అరాచక, విద్రోహ శక్తులను, సంఘ వ్యతిరేక శక్తులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆందోâýæన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. యూనివర్శిటీల్లోని నిధులను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 3500 మందికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడంలేదన్నారు. పరిశోధనలకు నెలవు కావాల్సిన యూనివర్శిటీలు ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు. మహాసభలలో రాయలసీమ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగార్జున, జిల్లా కన్వీనర్ కష్ణ, ఎస్కేయూ ఇ¯ŒSచార్జ్ హరికష్ణలతో పాటు 18 యూనివర్శిటీల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
దళితులకు రాజ్యాంగ ప్రయోజనాలు దక్కాలి
మచిలీపట్నం (చిలకలపూడి): దళిత, గిరిజనుల సంక్షేమానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రయోజనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న మహాసభలు గురువారంతో ముగిశాయి. నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత గిరిజనులు ఐక్యంగా ఉండి అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల సాధనకు కృషి చేయాలన్నారు. దళితులు ఉన్నత పదవిలో ఉన్నారంటే దానికి కారణంగా అంబేడ్కరేనన్నారు. దళిత గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను అవగాహన చేసుకుని అమలు జరిగేలా కృషి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిలు వద్దు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో స్టేషన్ బెయిల్‌ను పూర్తిగా రద్దు చేయాలని, కింది కోర్టుల్లో కూడా బెయిల్ మంజూరు చేయరాదనే నిబంధనలు న్యాయస్థానాలు చిత్తశుద్ధితో అమలు జరపాలని ఆయన కోరారు. అనంతరం దళిత బహుజన పరిరక్షణ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొడాలి దయాకర్, కార్యదర్శిగా పీతల శ్యామ్‌కుమార్, కోశాధికారిగా విడియాల చినరామయ్యతో పాటు మరో 49 మంది కార్యవర్గ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. -
మానవహక్కుల వేదిక ఆరవ మహాసభలు
మానవ హక్కుల వేదిక 6వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కె.జి.ఎన్ ఫంక్షన్ హాలులో జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఆ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తలు హాజరు కానున్నారు. తొలిరోజు కాన్ఫరెన్సులో సమకాలీన ప్రాధాన్య అంశాలపై బహిరంగ సెషన్లో చర్చలు జరుగుతాయి. ఉదయం ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన రచయిత, హక్కుల కార్యకర్త సుభాష్ ఘటాడే ‘నయా ఉదారవాదం - హిం దూత్వ నమూనా’ అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఆంధ్రా విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.డి.సత్యపాల్ ‘అంబేడ్క రిజాన్ని బ్రాహ్మణీకరించే కుట్ర’ అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సెషన్లో ఢిల్లీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ ఉషా రామనాథన్ ‘ప్రభు త్వం- కొత్త భూస్వాహా పద్ధతులు’ అనే అంశంపైనా, హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్షులు ఎ. చంద్రశేఖర్ ‘అసమాన అభివృద్ధి-రాయలసీమ దుస్థితి’ అనే అంశంపై ప్రసం గించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు అనంతరం ఆదోని మునిసి పల్ హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుంది. అక్టోబర్ 11న సంస్థాగత కార్యక్రమం ఉంటుంది. సదస్సు ప్రతినిధులు సంస్థ కార్యక్రమాలను సమీక్షించి, చర్చించి రానున్న రెండేళ్ల పనికి సంబంధించి విధివిధానాలు నిర్ణయించుకుం టారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రశ్నించే గొంతుల అవసరం మరింతగా ఉందని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. అనేక వాగ్దానాలతో, ప్రజల్లో పలు ఆశలు రేకెత్తించి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ప్రతి పక్షంలో ఉండగా తాము తీవ్రంగా విమర్శించిన విధానాలనే చంద్రబాబు, కేసీఆర్‌లు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు నైవేద్యంగా సమర్పించి కమీషన్లు దండుకోవడా నికి ఇద్దరు సీఎంలూ పోటీపడుతున్నారు. ఉమ్మడి వనరులను ప్రజల మేలు కోసం వినియోగించాలనే రాజ్యాంగ ఆదేశిక సూత్రాన్ని అపహాస్యం చేస్తున్నారు. అభివృద్ధి అనేది లాభదాయకమైన పరిశ్రమగా మారిన నేపథ్యంలో అభివృద్ధి ఫలాల్లో సింహభాగం కార్పొరేట్ సంస్థలకు పోగా మిగిలిన భాగాన్ని పాలక పార్టీల నేతలూ, అనుచరగణం తమతమ స్థాయిలను బట్టి పంచుకుంటు న్నారు. మరోవైపున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయడంతో వందలాదిగా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. గత జూన్ 2 తర్వాత తెలంగాణలో 1,290 మంది రైతులు ఆత్మహత్యలు జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో అవి 400 దాటాయి. మనం నిలదీసి అడగకపోతే ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షకులు కారాదని కోరుతూ.. మా గొంతుకు మీ గొంతుల్ని కలపమని కోరుతూ ఆదోనిలో 10,11 తేదీల్లో జరిగే మానవ హక్కుల వేదిక ఆరవ సదస్సుకూ, మహాసభలకు రావలసిం దిగా అందరినీ అహ్వానిస్తున్నాం. ఎస్. జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక. మొబైల్: 98489 86286