హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 14 వరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ ఆదినారాయణ, శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ తదితరులు ఇందులో పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment