జోకర్‌ నాయకుడైతే చూసేది సర్కస్‌ మాత్రమే.. ప్రకాష్‌ రాజ్‌ సెటైర్లు | Prakash Raj Satirical Comments Over Modi Government | Sakshi
Sakshi News home page

సర్కారుపై ప్రకాష్‌ రాజ్‌ సెటైర్లు.. జోకర్‌ నాయకుడైతే చూసేది సర్కస్‌ మాత్రమే..

Published Sat, Aug 12 2023 8:26 PM | Last Updated on Tue, Aug 29 2023 8:56 PM

Prakash Raj Satirical Comments Over Modi Government - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభ శనివారం జరిగింది. ఈ సభను సినీనటుడు, రచయిత,సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా సమూహ లోగోను ఆవిష్కరించారు.

లౌకిక ప్రజాస్వామిక విలువలకోసం రచయితలు అందరూ సంఘటితమైనదే సమూహా. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలు అందరి ఉమ్మడి స్వరమే సమూహ. సహనశిలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక సమూహా’. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ‘కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గుతాయి.. కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గలేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరికే కూర్చోలేను. 100 రోజుల నుండి మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంట్‌లో నువ్వా నేనా అన్నటు నడిచారు. రాజకీయం తప్ప సమస్య మీద స్పందన లేదు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయం తప్ప  ప్రజల సమస్యలపై చర్చించలేదు.

జోకర్‌ని నాయకుడు చేస్తే మనం చూసేది సర్కస్‌ మాత్రమే. మనలో ఐక్యత లేదు. మొదట మనలో మార్పు రావాలి. 70ఏళ్ల తర్వాత మనం రియలైజ్‌ అయ్యాం.. ఎక్కడ తప్పు జరిగిందని చూసుకోవాలి. మొదటిసారి ఇలాంటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం బాధగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: గులాబీలో సీటు హీటు.. కేటీఆర్‌, కవిత మధ్య పొలిటికల్‌ పోరు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement