ఇక్కడి వారి కష్టాలను స్వయంగా వినండి
ప్రధానికి రాహుల్ విజ్ఞప్తి
బాధితులను ఓదార్చిన విపక్షనేత
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో కొన్ని నెలల క్రితం రావణకాష్టంగా రగిలిపోయిన మణిపూర్‌కు ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి ఇక్కడి వారి కష్టాలను అర్థంచేసుకోవాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఘర్షణల్లో సర్వస్వ కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.
బీజేపీపాలిత రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఓదార్చారు. వారి బాగోగులను అడిగి తెల్సుకున్నారు. ‘‘ సోదరుడిగా ఇక్కడికొచ్చా. మీ బాధలు, కష్టాలు వింటా. ఇక్కడ శాంతి నెలకొనాల్సిన సమయం వచి్చంది. హింస ప్రతిఒక్కరినీ బాధిస్తోంది. వేల కుటుంబాలు కష్టాలబారిన పడ్డాయి. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. అమాయక జనం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు.
దేశంలో మరెక్కడా ఇంతటి దారుణాలు చోటుచేసుకోలేదు. మణిపూర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు, మీకు బాసటగా నిలిచేందుకు, మీ సోదరుడిగా వచ్చా’’ అని బాధిత కుటుంబాలతో రాహుల్ అన్నారు. బాధితులను కలిశాక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ మణిపూర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మోదీకి తెలియాలి. అందుకోసం ఇక్కడికి రండి. ఇక్కడ ఏం జరుగుతోందో తెల్సుకోండి. ప్రజల కష్టాలు వినండి’’ అని పరోక్షంగా మోదీకి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌తో భేటీ
రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేను సైతం రాహుల్ కలిశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా సద్దుమణకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment