relief camps
-
Rahul Gandhi: మోదీజీ.. మణిపూర్‌కు రండి
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో కొన్ని నెలల క్రితం రావణకాష్టంగా రగిలిపోయిన మణిపూర్‌కు ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి ఇక్కడి వారి కష్టాలను అర్థంచేసుకోవాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఘర్షణల్లో సర్వస్వ కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. బీజేపీపాలిత రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఓదార్చారు. వారి బాగోగులను అడిగి తెల్సుకున్నారు. ‘‘ సోదరుడిగా ఇక్కడికొచ్చా. మీ బాధలు, కష్టాలు వింటా. ఇక్కడ శాంతి నెలకొనాల్సిన సమయం వచి్చంది. హింస ప్రతిఒక్కరినీ బాధిస్తోంది. వేల కుటుంబాలు కష్టాలబారిన పడ్డాయి. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. అమాయక జనం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. దేశంలో మరెక్కడా ఇంతటి దారుణాలు చోటుచేసుకోలేదు. మణిపూర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు, మీకు బాసటగా నిలిచేందుకు, మీ సోదరుడిగా వచ్చా’’ అని బాధిత కుటుంబాలతో రాహుల్ అన్నారు. బాధితులను కలిశాక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ మణిపూర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మోదీకి తెలియాలి. అందుకోసం ఇక్కడికి రండి. ఇక్కడ ఏం జరుగుతోందో తెల్సుకోండి. ప్రజల కష్టాలు వినండి’’ అని పరోక్షంగా మోదీకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేను సైతం రాహుల్ కలిశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా సద్దుమణకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. -
శిబిరంలో 50,000 మందికి నాలుగే టాయిలెట్లు... గాజాలో దుర్భర పరిస్థితులు
న్యూయార్క్: గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్ తెలిపింది. అక్కడ సురక్షితమైన ప్రదేశమంటూ లేదని వెల్లడించింది. యుద్ధభూమి నుంచి బయటపడి అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ ఆమె చూసిన భయానక విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. గాజాలో 50,000 మంది ఒకే సహయక శిబిరంలో తలదాచుకున్నామని కల్లహన్ తెలిపింది. అక్కడ కేవలం నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండగా.. కేవలం నాలుగు గంటలే నీరు అందుబాటులో ఉండేదని తాము అనుభవించిన దుర్భర పరిస్థితులను బయటపెట్టింది. అమెరికాకు చేరి తన కుటుంబాన్ని కలుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన ఎమిలీ కల్లాహన్.. గాజాలో గాయపడిన వారికి చికిత్స చేస్తున్న పాలస్తీనా డాక్టర్లు నిజమైన హీరోలని కొనియాడింది. "26 రోజుల్లో ఐదుసార్లు మకాం మారాల్సి వచ్చింది. కమ్యూనిస్టు ట్రైనింగ్ సెంటర్లో 35,000 మందిమి తలదాచుకున్నాం. అక్కడ కొంతమంది పిల్లలకు చర్మం కాలిపోయి ఉంది. ఆస్పత్రులు నిండిపోయాయి. బంధువులు కోల్పోయిన బాధలో డాక్టర్లపైనే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను అమెరికన్ అని గుర్తిస్తూ అరబ్‌లా నటిస్తున్నావని అరిచారు. మా బృందాన్ని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పాలస్తీనా సిబ్బంది నిత్యం మా వెంటే ఉన్నారు. స్థానిక స్టాఫ్ మమ్మల్ని రక్షించకపోతే ఖచ్చితంగా చనిపోయేవాళ్లం." అని అక్కడి భయనక విషయాలను కల్లాహన్ బయటపెట్టారు. మా సిబ్బంది అక్కడి అధికారులతో మాట్లాడి రఫా సరిహద్దు గుండా ఈజిప్టుకు బస్సుల్లో తరలించారని కల్లాహన్ వెల్లడించింది. అక్కడ సిబ్బంది మాకోసం ఎంతో త్యాగం చేశారని ఆమె తెలిపారు. దేశం విడిచి రావడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదని.. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం కోసమే వారు ప్రధాన్యతనిచ్చారని తెలిపింది. ఇదీ చదవండి: Israel-Palestine War Updates: గాజాలో ఆగని వేట -
మణిపూర్‌లో ఇండియా
ఇంఫాల్: కొంతకాలంగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల పర్యటన శనివారం మొదలైంది. ఇందుకోసం కాంగ్రెస్‌తో పాటు పలు పారీ్టలకు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కనిమొళి (డీఎంకే), సుష్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్), ఆర్జేడీ, ఆరెల్డీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ తదితర పారీ్టల ఎంపీలు వీరిలో ఉన్నారు. రాజకీయాలు చేసేందుకు రాలేదని అధీర్ స్పష్టం చేశారు. ‘‘కేవలం బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడమే మా ఉద్దేశం. సమస్యకు పరిష్కారానికి అన్ని పారీ్టలూ చిత్తశుద్ధితో కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మణిపూర్ కల్లోలం దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందన్నారు. శనివారం తొలి రోజు ఇంఫాల్‌తో పాటు మొయ్రంగ్, విష్ణుపూర్ జిల్లాలతో పాటు తాజాగా హింసాకాండ చెలరేగిన చౌరాచంద్‌పూర్‌లో కూడా ఎంపీల బృందం పర్యటించింది. కుకీ తెగకు చెందిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వారికి ధైర్యం చెబుతూ గడిపింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేలా ఒత్తిడి తేవాలని బాధితులు వారిని కోరారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింసాకాండ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న కుట్ర ఫలితమేనని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అ«దీర్ దుయ్యబట్టారు. ‘‘మమ్నల్ని పార్లమెంటులో నోరెత్తనివ్వడం లేదు. అందుకే నేరుగా ప్రభావిత ప్రాంతాలకే వచ్చి, బాధితులతో మమేకమవుతున్నాం. వారు అనుభవించిన చిత్రహింసలకు సంబంధించిన దారుణ గాథలను వారి నోటే విని చలించిపోయాం’’ అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో బృందం పర్యటన సాగింది. ఆదివారం వారు గవర్నర్ అనసూయా ఉయికెను కలిసి సమస్యపై చర్చిస్తారని సమాచారం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఇరు తెగత వారితోనూ చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. శనివారం చౌరాచంద్‌పూర్‌లో పునరావాస శిబిరాన్ని ఆమె సందర్శించారు. భారీ ర్యాలీ విపక్ష ఎంపీలు మణిపూర్‌లో అడుగు పెట్టిన రోజే రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వేలాది మంది కుకీ తెగ ప్రజలు ఇంపాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ నినదించారు. మణిపూర్ సమగ్ర సమన్వయ కమిటీ సారథ్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. భర్త, కొడుకుల మృతదేహాలు చూపించండి తన కుమారుడు, భర్త మృతదేహాలనైనా చూపించండంటూ అత్యాచార బాధితురాలు విపక్ష ఎంపీలను కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ప్రత్యర్థి తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగించడం తెలిసిందే. వారిలో ఒక మహిళను ఎంపీలు కనిమొళి (డీఎంకే), సుషి్మతాదేవ్ (టీఎంసీ) కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ Mýఆమె భర్తను, కొడుకును చంపడంతో పాటు ఆమె కూతురిపై కూడా అత్యాచారనికి ఒడిగట్టారన్నారు. ఈ కేసు విచారణను శనివారం సీబీఐ చేపట్టింది. మణిపూర్ హింసపై ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ గొంతులు అప్పుడేమైనట్టు: బీజేపీ మణిపూర్‌లో విపక్ష ఎంపీల పర్యటన ఫక్తు రాజకీయ నాటకమని బీజేపీ దుయ్యబట్టింది. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ భగ్గున మండి నెలల తరబడి స్తంభించినప్పుడు వీరంతా పార్లమెంటులో కనీసం నోరైనా ఎత్తలేదెందుకని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలను ఇండియా బృందం తిప్పికొట్టింది. ‘‘ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష బృందం మణిపూర్‌లో పర్యటిస్తే అందులో ఆనందంగా భాగస్వాములం అయ్యేవాళ్లం. కానీ అందరికంటే ముందుగా, ఎక్కువగా స్పందించాల్సిన ఆయన అసలు సోదిలో కూడా లేకుండాపోయారు’అంటూ దుయ్యబట్టింది. -
AP: ఉదారంగా వరద సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలన్నారు. కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని, మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. శిబిరాల్లో మంచి సదుపాయాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు.. మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్.. ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. సచివాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్స్‌కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తాగునీటి కొరత లేకుండా.. తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలి. ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. వరద తగ్గాక పంట నష్టం నమోదు వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి
దిస్పూర్: ఎడతెరిపి లేని వర్షాలు అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #India Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods 💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS — ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022 ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. #WATCH | Assam: Efforts to airdrop relief material were initiated in Haflong amidst the #AssamFloods on May 18; will continue today, May 19. pic.twitter.com/jEnaQFGBlj — ANI (@ANI) May 18, 2022 వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. తిరగబడ్డ రైలు బోగీలు వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
కేరళలో ఆగని వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది. అన్ని విధాలా అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరిన మంత్రి
-
బిస్కెట్స్ విసిరిన మంత్రి.. కనీస మర్యాద లేదా?
బెంగళూరు : వరుణుడి ప్రతాపానికి కర్ణాటక కూడా చిగురుటాకులా వణుకుతోంది. ముంచెత్తుతున్న వరదలతో సర్వస్వం కోల్పోయి సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు కర్ణాటక వాసులు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి మంత్రిగారు చేసిన పనిపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. కర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్డీ రేవన్న ఆదివారం సాయంత్రం హసన్ జిల్లా, రామాంతపూర సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులను సందర్శించేదుకు వచ్చారు. జనాలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్న రేవన్న అనంతరం అక్కడ ఉన్న ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరారు. మంత్రి చర్యలకు విస్తుపోయిన జనాలు ఆ బిస్కట్ ప్యాకెట్లను తీసుకోలేదు. అంతేకాక ‘మేము జంతువులం అనుకుంటున్నావా. కనీస మర్యాద లేకుండా బిస్కెట్ ప్యాకెట్లను విసురుతున్నావు’ అంటూ రేవన్నను విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ విషయం గురించి రేవన్న ‘నేను కాస్తా పని తొందరలో ఉండి అలా చేయాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్ష బీజేపీ పార్టీ మాత్రం ఈ చర్యను అమానవీయ రీతిలో ప్రచారం చేస్తోంది’ అంటూ మండి పడ్డారు. కొడుగు, హసన్ జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో రేవన్ననే ముందు స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి పాల ట్యాంకర్లను, ఆహార పదార్థాలను కొడుగు జిల్లాకు పంపించారు. -
ఆ గ్రామస్తులకు సీఎం భరోసా..
పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ భరోసా ఇచ్చారు. భారత ఆర్మీ ఇటీవల చేపట్టిన నిర్దేశిత దాడులపై ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్న నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతిస్తామన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పఠాన్ కోట్ జిల్లాల్లోని సహాయక శిబిరాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంలో నిర్వహించిన సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రైతులు తమ పంటను పిల్లలకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారన్నారు. సరిహద్దు ప్రాంత రైతులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సహాయంతో పంటలను కోసి ఇంటికి తెచ్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లకోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి కోరినట్లు బాదల్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే రైతులంతా నిజమైన దేశ భక్తులుగా బాదల్ అభివర్ణిచారు. శత్రుభయంతో రోజువారీ తలపడే సరిహద్దు ప్రాంతాల్లోని రైతులంతా మాతృభూమికి నిజమైన సేవకులన్నారు. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, సరిహద్దు గ్రామాలను వదిలి వెడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు గ్రామాలను ఖాళీచేయించడంతోపాటు, సహాయక శిబిరాల్లో ఏర్పాట్లపై క్రమం తప్పకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపడతారని చెప్పారు. సహాయక శిబిరాల ఏర్పాట్లపై పోలీసు, మరియు జిల్లా యంత్రాంగాలను ప్రశంసించిన బాదల్.. ఈ పరిస్థితుల్లో ప్రతి అధికారీ ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. బార్త్ సాహిబ్, బమియాల్ శిబిరాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి ప్రజల సంరక్షణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. -
మయన్మార్‌లో 17కి పెరిగిన మృతుల సంఖ్య
నే పి తా : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలమైంది. ఖాయ్హ్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడి మృతుల సంఖ్య మంగళవారానికి 17కి చేరగా... మరో ఆరుగురి జాడ తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్వత ప్రాంతంలోని దాదాపు 60 నివాసాలపై కొండ చరియులు విరిగిపడ్డాయి. నిరాశ్రయులు అయిన వారిని స్థానికంగా ఉన్న రెండు పాఠశాలలు పునరావాస శిబిరాలుగా మార్చినట్లు.. దీంతో వారందరిని అక్కడికి తరలించినట్లు చెప్పారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. -
ముజఫర్‌నగర్ అల్లర్ల అనంతర ఘటనల పై రిపోర్ట్