నే పి తా : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలమైంది. ఖాయ్హ్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడి మృతుల సంఖ్య మంగళవారానికి 17కి చేరగా... మరో ఆరుగురి జాడ తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్వత ప్రాంతంలోని దాదాపు 60 నివాసాలపై కొండ చరియులు విరిగిపడ్డాయి.
నిరాశ్రయులు అయిన వారిని స్థానికంగా ఉన్న రెండు పాఠశాలలు పునరావాస శిబిరాలుగా మార్చినట్లు.. దీంతో వారందరిని అక్కడికి తరలించినట్లు చెప్పారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు.