ర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవన్న ఆదివారం సాయంత్రం హసన్ జిల్లా, రామాంతపూర సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులను సందర్శించేదుకు వచ్చారు. జనాలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్న రేవన్న అనంతరం అక్కడ ఉన్న ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరారు. మంత్రి చర్యలకు విస్తుపోయిన జనాలు ఆ బిస్కట్ ప్యాకెట్లను తీసుకోలేదు. అంతేకాక ‘మేము జంతువులం అనుకుంటున్నావా. కనీస మర్యాద లేకుండా బిస్కెట్ ప్యాకెట్లను విసురుతున్నావు’ అంటూ రేవన్నను విమర్శించారు.