Biscuit packets
-
బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
ప్రకటించిన బరువు కంటే తక్కువ బరువున్న బిస్కెట్ ప్యాకెట్లను విక్రయించినందుకు ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా సంస్థకు భారీ జరిమానా విధించిన సంఘటనలో కేరళలో జరిగింది. రూ.60,000 నష్టపరిహారం చెల్లించాలని కేరళలోని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బ్రిటానియా ఇండస్ట్రీస్, స్థానిక బేకరీని ఆదేశించింది.వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బేకరీ నుంచి 300 గ్రాముల బరువున్న "బ్రిటానియా న్యూట్రి ఛాయిస్ థిన్ యారో రూట్ బిస్కెట్స్" రెండు ప్యాకెట్లను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ పాకెట్ల బరువుపై అనుమానం వచ్చిన వినియోగదారుడు వాటిని తూకం వేయగా ప్యాకెట్లు వరుసగా 268 గ్రాములు, 248 గ్రాములు ఉన్నాయి.ప్యాకెట్ ప్రామాణిక బరువు కంటే చాలా తక్కువ ఉండటంతో వినియోగదారుడు త్రిస్సూర్ లోని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన అధికారులు సైతం బిస్కెట్ పాకెట్ల బరువు తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. వినియోగదారుల రక్షణ చట్టం, 2009 లీగల్ మెట్రాలజీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దోపిడీ, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి విముక్తి పొందే వినియోగదారుడి హక్కును బ్రిటానియా కంపెనీ, స్థానిక బేకరీ ఉల్లంఘించాయని కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాదుదారుడికి నష్ట పరిహారం కింద రూ.50 వేలు, అతను భరించిన లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
ఈ ట్రిక్ వాడారో 'కరకరలాడే బిస్కెట్లు' ఇక మీ సొంతమే!
'మనం తినేవాటిలో అనేక పదార్థాలుంటాయి. అందులో మెత్తవైనా ఉండొచ్చు, గట్టివిగానూ ఉండొచ్చు. అయితే అప్పడాలు, బిస్కెట్లలో చాలామటుకు కరకరలాడే వాటినే ఇష్టపడుతుంటాం. బిస్కెట్లను తీసుకున్నట్లయితే వీటిలో కూడా చాలా రకాలుంటాయి. మనకు ఇష్టమైనటువంటి కొన్ని రకాల బిస్కెట్లలో ఈ కరకరలాడే బిస్కెట్లు తోడైతే ఆ రుచి, అనుభూతియే వేరు. మరెందుకు ఆలస్యం వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!' కరకరలాడాలంటే.. బిస్కెట్లు మెత్తగా అవ్వకుండా కరకరలాడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! • ప్లాస్టిక్, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. • గాలి చొరబడకుండా పెడితే ఎక్కువరోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యుపేపర్లు వేసి తరువాత బిస్కెట్లు పెట్టాలి. • బిస్కెట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యూపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. • ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. • జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. • గాలి చొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. • అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో ఉంచి వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి, వీటిని కూడా నిల్వచేసుకోవచ్చు. ఇవి కూడా చదవండి: చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి? -
Cyber Fraud: పాప పేరుతో తీయని మాటలు.. ఆపై..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): సైబర్ నేరగాళ్లు తీయని మాటలతో అమాయకులను దోచేస్తున్నారు. బిస్కెట్ కంపెనీ పిల్లలకు నిర్వహిస్తున్న కమర్షియల్ స్టార్ అనే పోటీలో అవకాశమిప్పిస్తామని రూ.16.7 లక్షలు కైంకర్యం చేశారు. వైట్‌ఫీల్డ్ వాసి అమిత్ తల్వార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనీస్, రిషి కపూర్ అనే ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. అమిత్ తల్వార్‌ను సంప్రదించిన ఈ ఇద్దరూ మీ పాపను ప్రముఖ బిస్కెట్ కంపెనీ నిర్వహిస్తున్న కమర్షియల్ స్టార్ అనే పోటీలో విజేత అయ్యేలా చూస్తామని, ఖరీదైన బహుమతులు లభిస్తాయని నమ్మించారు. వారి పాప, కుటుంబం ఫోటోలను ఈమెయిల్లో తీసుకున్నారు. కొన్నిరోజులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఎంపికైందని, రెండో రౌండ్‌కు వెళ్లాలని పాప నృత్యం చేసే వీడియోలు తీసుకున్నారు. ఫీజు పేరుతో రూ.1.4 లక్షలు వసూలు చేశారు. ఇలా ఫోటోషూట్, ఫ్యాషన్ సామగ్రి కొనుగోలు పేర్లతో పలుదఫాలు రూ.16.7 లక్షల బదిలీ చేసుకున్నారు. చివరకు బాధితునికి అనుమానం వచ్చి ఆరా తీయగా అటువంటి పోటీలు ఏవీ లేవని తేలింది. దీంతో వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. చదవండి: విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య -
పల్లీల్లో పచ్చనోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. -
పల్లీల్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ..
-
వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ పాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ పాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అయితే మురాద్ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరిన మంత్రి
-
బిస్కెట్స్ విసిరిన మంత్రి.. కనీస మర్యాద లేదా?
బెంగళూరు : వరుణుడి ప్రతాపానికి కర్ణాటక కూడా చిగురుటాకులా వణుకుతోంది. ముంచెత్తుతున్న వరదలతో సర్వస్వం కోల్పోయి సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు కర్ణాటక వాసులు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి మంత్రిగారు చేసిన పనిపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. కర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్డీ రేవన్న ఆదివారం సాయంత్రం హసన్ జిల్లా, రామాంతపూర సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులను సందర్శించేదుకు వచ్చారు. జనాలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్న రేవన్న అనంతరం అక్కడ ఉన్న ప్రజల మీదకు బిస్కెట్ ప్యాకెట్లను విసిరారు. మంత్రి చర్యలకు విస్తుపోయిన జనాలు ఆ బిస్కట్ ప్యాకెట్లను తీసుకోలేదు. అంతేకాక ‘మేము జంతువులం అనుకుంటున్నావా. కనీస మర్యాద లేకుండా బిస్కెట్ ప్యాకెట్లను విసురుతున్నావు’ అంటూ రేవన్నను విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ విషయం గురించి రేవన్న ‘నేను కాస్తా పని తొందరలో ఉండి అలా చేయాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్ష బీజేపీ పార్టీ మాత్రం ఈ చర్యను అమానవీయ రీతిలో ప్రచారం చేస్తోంది’ అంటూ మండి పడ్డారు. కొడుగు, హసన్ జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో రేవన్ననే ముందు స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి పాల ట్యాంకర్లను, ఆహార పదార్థాలను కొడుగు జిల్లాకు పంపించారు. -
బిస్కెట్ అందుకోబోయి..
నల్లగొండ, మోత్కూరు (తుంగతుర్తి) : బుడి బుడి అడుగులు.. ముద్దు.. ముద్దు మాటలతో నవ్వులొలికించే ఆ చిన్నా రి కాసేపట్లోనే కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మోత్కూరు మండలం ధర్మాపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల సత్తయ్య–కమలమ్మ కూతురు హేమలత డెలవరీకి మూడు మాసాల క్రితం తల్లిగారింటికి వచ్చింది. రెండు రెండు నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది. మొదటి కూతురు యేడాదిన్నర చిన్నారి రిశ్విత ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమ్మమ్మ ఇంటిలోపల పనుల్లో ఉన్నారు. రిశ్విత ఆడుకుంటున్న సమయంలో తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చిన్నారి రిశ్విత పడి అక్కడికక్కడే మృతిచెందింది. కాసేపటి తర్వాత చిన్నారి గురించి ఆరా తీయగా నీటి సంపులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు హేమలత–మల్లేష్, అమ్మమ్మ–తాత కమలమ్మ, సత్తయ్యలు రోదనలు మిన్నంటాయి. -
కొరీస్.. పేరు కాదు, బ్రాండ్!
ఐదేళ్ల వయసులో రోడ్డు పక్కన బిస్కెట్ ప్యాకెట్లు అమ్మిన ఇతడు... పదేళ్లు వచ్చే సరికి తన పేరు మీదనే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఆ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదే మిస్టర్ కొరీస్ కంపెనీ. న్యూజెర్సీలోని నల్లజాతి కుటుంబానికి చెందిన వాడు కొరీ. ఐదేళ్ల వయసులోనే అతనికి తండ్రి దూరమయ్యాడు. తల్లిది పోషించలేని పరిస్థితి. అప్పడు మన స్వగృహా ఫుడ్స్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఈ తల్లీకొడుకులు. అమ్మ తయారు చేసే కుకీస్ ‘కొరీ’కి చాలా ఇష్టం. వాటిని ఎవరైనా ఇష్టపడతారని ఆ పిల్లాడు నమ్మాడు. మరి వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక రోడ్డున వెళ్లే వాళ్లకు కుకీస్‌ను అమ్మడం మొదలు పెట్టాడు. తర్వాత కుకీస్‌ను షాపులకు వేశాడు. డిమాండ్ పెరిగి కొరీ మార్కెట్ విస్తరించింది. దాంతో వాటికి కూడా ఒక బ్రాండ్ నేమ్ తప్పనిసరిగా ఉండాలనుకున్నాడు కొరీ. ‘మిస్టర్. కొరీ’ అనే అర్థం వచ్చేలా ‘ఎమ్ఆర్.కొరీ’ పేరుతో లోగో చేయించాడు. తనే బ్రాండ్ అంబాసిడర్‌గా, తనే మార్కెటింగ్ ఎనలిస్టుగా మారి అమ్మకాల్లో ప్రగతి సాధించాడు. ఇప్పుడు న్యూజెర్సీలో ‘ఎమ్ఆర్. కొరీ’ కుకీస్‌కు మంచి గిరాకీ. ఈ వ్యాపారంతో కోట్లు సంపాదించక పోయినా... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మ సిటీ బస్సులు ఎక్కి ప్రయాణించడాన్ని చూడలేక ఆమెకో కారును బహుమతిగా ఇచ్చాడు. కొరీ ఐదేళ్ల వయసులో వ్యాపారం మొదలు పెట్టి... మరో ఐదేళ్లకే ఇంతగా ఎదగడం చాలామందిని ఆశ్చర్యపరించింది. అమెరికన్ టెలివిజన్ చానళ్లకు ఇతడో సెలబ్రిటీ అయ్యాడు. ‘మీ వ్యాపార విజయ రహస్యం ఏమిటి?’ అని అడిగితే ‘ప్రెజెంటేషన్ ఈజ్ ది కీ టు సక్సెస్’ అంటాడు. పదేళ్లకే ఇంత ప్రావీణ్యం సంపాదించిన ఇతడు భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్త కాగలడని విశ్లేషకుల అభిప్రాయం. కొరీ కష్టాన్ని, తెలివితేటలను చూస్తే ఆ అభిప్రాయం నిజమయ్యే అవకాశాలే ఎక్కువ.