
అభివాదం చేస్తున్న ప్రకాశ్‌రాజ్
కవాడిగూడ: ప్రధాని మోదీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం కంటే ముందు దేశంలో ఉన్న నిరుద్యోగులు, ఆకలి చావులు, రైతు ఆత్యహత్యల లెక్కలను తేల్చాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ప్రజాతీర్పు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. డిగ్రీ పత్రాలు కూడా లేనివారు ‘పరీక్షా పే చర్చ’పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జర్మనీలో హిట్లర్ ఏం చేశాడో ఇప్పుడు భారతదేశంలో అదే జరుగుతోందన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ఉపసంహరించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీయాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment