jana vignana vedika
-
చాగంటి కోటేశ్వరరావు నియామకం సరికాదు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలనే నేర్పుంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచన చేయండి..’ అని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్‌గా సభ నిర్వహించారు. 72 మంది విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ విలువలు ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదిగా ఉండే విలువలు ఆధునిక జీవితానికి అవసరం. మన భవిష్యత్ తరాన్ని పురాణయుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో ప్రభుత్వం గుర్తించాలి. సంకుచిత కుల, మత, ప్రాంతీయ దృక్పథాలకతీతంగా భావితరం ఎదిగినప్పుడే మనం గొప్పగా చెప్పుకొంటున్న లక్ష్యాల్ని చేరుకోగలం. దీనికి తగినట్టుగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తాయో ఆలోచించాలి..’ అని లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్సంతకాలు చేసినవారిలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా, అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావు, ప్రజాశక్తి సంపాదకుడు శర్మ, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకుడు బుడ్డిగ జమిందార్, మ్యూజిక్ అకాడమీ అవార్డు గ్రహీత ద్వారం దుర్గాప్రసాదరావు, విద్యావేత్తలు ప్రొఫెసర్ అంజయ్య, రమేష్ పట్నాయక్ తదితరులు ఉన్నారు. చదవండి: రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలొద్దు.. ఏపీ హైకోర్టు -
సమాజానికి దిక్సూచి కావాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్గించి మెరుగైన సమాజం నిర్మించే దిక్సూచిలా జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జన విజ్ఞాన వేదిక 4వ జాతీయ మహాసభ జరిగింది. సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య నియంత్రణ ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తాను అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమాల్లో జనవిజ్ఞాన వేదిక సభ్యులతో కలిసి పాల్గొన్నానని చెప్పారు. ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ మూఢ నమ్మకాలను పారద్రోలి సమాజ శ్రేయస్సు కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తమ వేదిక తరఫున ప్రజలకు అనేక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుందే కానీ.. వ్యతిరేకం కాదన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్.కృష్ణాజీ, జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ రావు మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏపీ అధ్యక్షుడు జంపా కృష్ణ కిషోర్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్, కోశాధికారి సుగాలి గోపాలనాయక్, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ అశ్లీలతా ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఈదర గోపీచంద్, ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య, సమాచార హక్కు ప్రచార వేదిక అధ్యక్షుడు యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావుతోపాటుగా జనవిజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. సభకు ముందుగా మూఢ నమ్మకాలను నమ్మవద్దంటూ కళాకారులు గీతాలను ఆలపించారు. మహాత్మాగాంధీ ఆత్మకథతో పాటుగా మూఢ నమ్మకాలు, అశ్లీలతకు వ్యతిరేకంగా ప్రచురించిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. జనవిజ్ఞాన వేదిక నూతన కమిటీ జనవిజ్ఞాన వేదిక మహాసభ అనంతరం నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. వేదిక గౌరవ అధ్యక్షులుగా పి.రామ్మోహనరావు, వి.బ్రహ్మారెడ్డి, కె.నాగేశ్వరరావు, అధ్యక్షుడిగా ఆకునూరి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా జంపా కృష్ణకిషోర్, కోశాధికారిగా వై.చలపతితో పాటుగా పది మంది ఉపాధ్యక్షులు, పది మంది కార్యదర్శులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. -
సూర్యగ్రహణం: అటు సందడి.. ఇటు చైతన్యం
సాక్షి, విజయవాడ/తిరుపతి: సూర్య గ్రహణం సందర్బంగా తిరుపతి సైన్స్ సెంటర్లో విద్యార్థులు సందడి చేశారు. ఉదయం నుంచి గ్రహణం ముగిసేవరకు అక్కడే ఉండి ప్రత్యేక గ్లాసెస్ ద్వారా ఈ అంతరిక్ష అబ్బురాన్ని వీక్షించారు. చాలా అరుదుగా వచ్చే సూర్యగ్రహణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. సైంటిస్టులు మాత్రం గ్రహణం సందర్బంగా సూర్యుడిని డైరెక్ట్ గా చూడకూడదని, ప్రత్యేక గ్లాసుల ద్వారా చూడటం వల్ల కళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల్లో చైతన్యం నిపేందుకు గురువారం విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రహణాల విషయంలో ఉన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించి.. ఈ విషయంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసింది. సోలార్ ఫిల్టర్ క్లిప్స్‌తో గ్రహణం వీక్షణ చేపట్టింది. సోలార్ పరికరాలతో గ్రహణాన్ని చూడండి.. మూఢనమ్మకాలు వీడండి అంటూ ఈ సందర్భంగా నినాదాలు ఇచ్చింది. -
దెయ్యం.. ఒట్టి బూటకం
సి.బెళగల్: హాస్టల్లో దెయ్యం ఉందనేది ఒట్టి బూటకమని జన విజ్ఞానవేదిక (జేవీవీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. సి.బెళగల్ మోడల్ బాలికల హాస్టల్లో కొన్ని రోజులుగా నెలకొన్న దెయ్యం బూచిపై విద్యార్థినులకు జిల్లా జేవీవీ నాయకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దెయ్యం పట్టుకుందాం...వస్తారా...? పేరుతో రాత్రి బస నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మంగళవారం రాత్రి హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం వారు శాస్త్రీయ నిరూపణ కార్యక్రమాలు చేపట్టారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ దెయ్యాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమేనని, ఎవరైనా దెయ్యాని పట్టిస్తే వారికి రూ.లక్ష బహుమతిగా అందజేస్తామన్నారు. ఐక్య మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో.. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బేతంచెర్ల మండల అధ్యక్షురాలు సరస్వతి, సభ్యులు మంగమ్మ, అలివేలు, లక్ష్మీదేవి తదితరులు హాస్టల్‌ను చేరుకుని హాస్టల్ చుట్టూ పరిసరాలను, విద్యార్థినుల గదులను సందర్శించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. -
12 నుంచి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 14 వరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ ఆదినారాయణ, శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ తదితరులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. -
బాబు గోగినేనిపై కేసు కక్ష వేధింపు చర్యే
-
మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాలి
వనపర్తి విద్యావిభాగం: రాష్ట్రంలో మూఢనమ్మకాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మూఢనమ్మకాల నిరోధన చట్టాన్ని ప్రవేశపెట్టాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కోశాధికారి జితేందర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో జనవిజ్ఞాన వేదిక వనపర్తి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని విడుదల చేయాలని వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎదుగుతున్నా మూఢనమ్మకాలను పాటించడంలో తగ్గడం లేదన్నారు. నేటికీ రాష్ట్రం నలుమూలలా ఎక్కడో ఒకచోట చేతబడి, బాణామతి, మంత్రాలు, క్షుద్రపూజలు వంటివి కొనసాగుతూ దాడులు, హత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మూఢనమ్మకాలతో జరుగుతున్న సంఘటనలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి శ్మశానంలో తిరిగి.. అక్కడే తిని
సాక్షి, సిద్దిపేట : కాలం మారింది.. పెద్ద ఎత్తున టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్లో బలంగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి శ్మశానం వైపు వెళ్లకూడదు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడానికి జన విజ్ఞాన వేదిక నడుంకట్టింది. వాటిపై ప్రజల్లో ఉన్న భ్రమలను, భయాలను తొలగించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసుల సహకారంతో అభ్యుదయ వాదులు అర్ధరాత్రి సమయంలో సిద్దిపేట బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో గురువారం( అమావాస్య) రాత్రి అక్కడే గడిపారు. పోలీసులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అర్ధరాత్రి వేళ శ్మశాన వాటికలో కలియ తిరిగారు. అంతేకాకుండా శవాలను తగుల పెట్టే చోట అల్పాహారం తిన్నారు. అమావాస్య, పౌర్ణమిలు అంటే ఖగోళంలో వచ్చే మార్పులేనని, వాటిని నమ్మి మూఢనమ్మకాలకు పోవద్దని ప్రజలకు వివరించారు. మనుషులు శాస్త్రీయ పద్ధతుల్లో జీవించాలని అంతేకానీ, మూఢనమ్మకాలు జోలికి నమ్మొద్దంటూ సూచించారు. -
అర్ధరాత్రి స్మశానంలో తిరిగి.. అక్కడే తిని
-
సైన్స్‌పై అవగాహన పెంచాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: చిన్నారుల్లో సైన్స్‌పై అవగాహన పెంచాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకుడు అందె సత్యం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జేవీవీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో రోజురోజుకూ పెరిగి పోతున్న మూఢ విశ్వాసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచాలని సూచిం చారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్‌లో మత భావాలను పెం పొందించేలా ప్రసంగాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శికి సహాయకారిగా బి.సీతారాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఐపీఎస్ఎన్ జాతీయ కోశాధికారి అలవాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కస్తూరి, మల్లెంపాటి వీరభద్రయ్య, బి.సీతారాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రాఘవయ్య, టి.శివనారాయణ, జిల్లా బాధ్యులు ఆర్.శ్రీరాములు, పి.సీతారామారావు, నామా పురుషోత్తం, టి.కృష్ణవేణి, పురుషోత్తం, కిరణ్, లింగమూర్తి, వంజాకు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కమిటీ ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్.వెంకటేశ్వర్లు, ప్రభుసింగ్, కోశాధికారిగా ఎం.మోహన్‌రావుతో పాటు ఏడుగురు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. -
రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్
-
రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: రైతులకు ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించకుండా, పరిహారం ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి కారణాలు అన్వేషిస్తారని.. దేశానికి వెన్నుముఖ అయిన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడింది. రైతు ఆత్మహత్యలపై జనవిజ్ఞాన వేదిక దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరిట భవిష్యత్తులో ప్రకృతి వినాశనం తప్పదని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జి.విజయకుమార్ హెచ్చరించారు. ఆదివారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో జన విజ్ఞాన వేదిక జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేరిట పరిశ్రమల స్థాపన కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తారని, ఇది పర్యావరణ విఘాతానికి దారి తీస్తుందన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు అవినీతి ముసుగులో ఖనిజ సంపదను వెలికి తీసి అపారమైన జంతుజాలం నాశనానికి కారణమయ్యాయన్నారు. జన జీవనానికి భంగం క లగకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అటు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం గానీ ఇప్పటికీ నూతన రాష్ట్రానికి దిశానిర్దేశం చేయకపోవడం శోచనీయమన్నారు. అనంతరం రాష్ట్ర విభజనతో జన విజ్ఞాన వేదిక పేరు మార్పు చేయాలా? వద్దా? అని జిల్లా సమితి నిర్ణయాన్ని తెలుసుకుని రాష్ట్ర కమిటీకి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గురువయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.రామచంద్రయ్య, పీఎల్.నరసింహులు, డీ.వెంకటేశ్వర్లు, అచార్య డీవీ.రమణ, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.బలరాం, సీఎన్.క్షేత్రపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురంలో వింత ఆచారం