కాలం మారింది.. పెద్ద ఎత్తున టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్లో బలంగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి స్మశానం వైపు వెళ్లకూడదు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడానికి జన విజ్ఞాన వేదిక నడుంకట్టింది. వాటిపై ప్రజల్లో ఉన్న భ్రమలను, భయాలను తొలగించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు.