ఖమ్మం జెడ్పీసెంటర్: చిన్నారుల్లో సైన్స్‌పై అవగాహన పెంచాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకుడు అందె సత్యం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జేవీవీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో రోజురోజుకూ పెరిగి పోతున్న మూఢ విశ్వాసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచాలని సూచిం చారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్‌లో మత భావాలను పెం పొందించేలా ప్రసంగాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శికి సహాయకారిగా బి.సీతారాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఐపీఎస్‌ఎన్ జాతీయ కోశాధికారి అలవాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కస్తూరి, మల్లెంపాటి వీరభద్రయ్య, బి.సీతారాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రాఘవయ్య, టి.శివనారాయణ, జిల్లా బాధ్యులు ఆర్.శ్రీరాములు, పి.సీతారామారావు, నామా పురుషోత్తం, టి.కృష్ణవేణి, పురుషోత్తం, కిరణ్, లింగమూర్తి, వంజాకు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం కమిటీ ఎన్నిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్.వెంకటేశ్వర్లు, ప్రభుసింగ్, కోశాధికారిగా ఎం.మోహన్‌రావుతో పాటు ఏడుగురు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
సైన్స్‌పై అవగాహన పెంచాలి
Published Mon, Jan 9 2017 3:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
Advertisement
Advertisement