సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ ఎదుర్కొంటున్న లోటుపాట్లు, లోపాలను అధిగమించి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. శనివారం నుంచి మూడురోజుల పాటు మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ప్రధానంగా పార్టీ నిర్మాణం, విస్తరణ, కేడర్‌ను క్రియాశీలం చేయడంపై దృష్టి నిలపనుంది. ఈ మహాసభలను శనివారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఈ మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారు. సభల్లో డి.రాజా, సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా, తదితరులు ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. మహాసభల చివరిరో జైన 24న పార్టీ నాయకత్వ ఎన్నిక ఉంటుంది. మళ్లీ రాష్ట్ర కార్యదర్శిగా చాడ ఎన్నికయ్యే అవకాశాలున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment