ఈసారి కెమెరాకు చిక్కింది ఆడ పులి
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): మంచిర్యాల జిల్లా ముల్కల్ల, పాతమంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని గఢ్‌పూర్‌లో పులులు కెమెరాకు చిక్కాయి. గఢ్‌పూర్ సఫారీ మార్గంలోని ఓ చెట్టుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు రెండుసార్లు వేర్వేరు పులులు చిక్కడం గమనార్హం. గత నెల 12న ఇదే కెమెరా మగపులి వెళుతున్న ఫొటోను తీయగా, తాజాగా బుధవారం ఉదయం ఇదే దారి వెంట వెళుతున్న ఆడపులి ఫొటోను తీసింది. అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పులిగా నిర్ధారించారు.
మిరప చేనులో పెద్దపులి
కౌటాల: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మిరప చేనులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడే నవీన్ మిరప చేనుకు గురువారం ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చేనులో పడుకుని ఉన్న పులిని చూసి భయపడి గ్రామానికి పరుగులు తీశాడు.
సమాచారం అందుకున్న కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో వినయ్‌కుమార్ సాహూ, అధికారులు పాదముద్రలు పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. మహారాష్ట్ర నుంచి వార్దానది దాటి వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment