
మంచిర్యాల: తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఆరంభమైన తొలి రోజే జిల్లాలో గందరగోళం చోటు చేసుకుంది. ఒక ప్రశ్నా పత్రం ప్లేస్ లో మరొక ప్రశ్నా పత్రం ఇవ్వడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు(శుక్రవారం)ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇది రెండు పేపర్లు కింది విభజించారు. పార్ట్ 1(పేపర్ 1), పార్ట్ 2( పేపర్2) గా విడదీసి ఒకే రోజు జరపాలని షెడ్యూల్ చేశారు.
అయితే పేపర్ 1 ప్లేస్ లో , పేపర్ 2 ఇవ్వడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు పేపర్ 2 ఇచ్చిన విషయాన్ని అధికారులు గమనించలేనట్లు సమాచారం. . ఆ తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకుని నాలుక్కరుచుకున్న అధికారులు పేపర్ ను మార్చారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు అదనపు సమయం కేటాయించారు. అయితే బయట వేచి చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రలకు ఈ విషయం తెలియక పోవడంతో ఆందోళనకు గురయ్యారు,. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి తీసుకున్నారు. ఈ ఘటనపై డీఈవో, జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment