Tenth class
-
స్కూళ్లలో ‘ఇంటర్నల్’ దందా!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి(Tenth class) అంతర్గత మార్కులపై ప్రైవేటు,(Private schools) కార్పొరేట్ విద్యా సంస్థలు దందా మొదలుపెట్టాయి. ఎక్కువ ఇంటర్నల్ మార్కులు వేసే పేరిట అదనపు వసూళ్లు మొదలు పెట్టాయి. ఇలా ఎక్కువ మార్కులు వేస్తే, మొత్తంగా మార్కులు పెరి గి... జీపీఏ ఎక్కువగా వస్తుందని ఒత్తిడి చేస్తున్నాయి. ఇంటర్నల్ మార్కుల(internal marks) తనిఖీలకు వచ్చే బృందాలకు కొంత ముట్టజెబుతున్నాయి. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకూ అందులో వాటాలు వెళుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.‘ఇంటర్నల్స్’వసూళ్ల దందా దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఓ అధికారి కనుసన్నల్లో ఇదంతా నడుస్తున్నట్టు విద్యాశాఖ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. ప్రతీ జిల్లాకు టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు పెద్ద ఎత్తున ‘ఇంటర్నల్స్’ఖర్చు పెడుతున్నాయి. విద్యార్థుల జీపీఏ పెంచుకోవడం, దాన్ని ప్రచారానికి వాడుకోవడం, తద్వారా మార్కెట్ పెంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశంకాగా.. ఈ అక్రమాలకు విద్యాశాఖ అధికారులు సహకరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం మార్కులూ వేసుకుని.. టెన్త్ క్లాస్‌లో ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. 80 మార్కులు థియరీ పరీక్షల ద్వారా వస్తాయి. ఇంటర్నల్ మార్కులు 20. విద్యార్థులకు ఈ మార్కులు వేయడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. సంవత్సరంలో నిర్వహించే అంతర్గత పరీక్షలన్నింటినీ కొలమానంగా తీసుకోవాలి. స్లిప్ టెస్టులకు 5 మార్కులు, ప్రాజెక్టు వర్క్‌కు 5, టెక్ట్స్‌బుక్స్ రైటింగ్, రీడింగ్‌కు 5, పుస్తక సమీక్షకు 5 మార్కులు వేయాలి. ప్రతీ ప్రైవేటు పాఠశాల ఈ మార్కులను మొత్తం 20కి 20గా వేసుకుంటున్నాయి. నిజానికి ఈ మార్కుల శాస్త్రీయతను జిల్లా విద్యాశాఖ నేతృత్వంలోని కమిటీలు పరిశీలించాలి.డీఈవో నేతృత్వంలో ప్రతి మండలానికి కొన్ని కమిటీలను వేస్తారు. జిల్లావ్యాప్తంగా 60 నుంచి వంద కమిటీల వరకూ వేస్తుంటారు. ఒక్కో కమిటీలో ఒక గెజిటెడ్ హెచ్ఎం, నాన్–లాంగ్వేజ్, లాంగ్వేజ్ టీచర్ కలిపి ముగ్గురు ఉంటారు. వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి.. విద్యార్థులకు వేసిన ఇంటర్నల్స్ మార్కులు సరిగానే ఉన్నాయా? లేదా? పరిశీలిస్తారు. తర్వాత మార్కులను డీఈవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ రాష్ట్రస్థాయి పోర్టల్‌లో ఈ మార్కులను ఫీడ్ చేస్తారు.థియరీ పరీక్షల్లో మార్కులను, ఇంటర్నల్ మార్కులను కలిపి తుది ఫలితాన్ని ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు వేసిన మార్కులు సరైనవేనని తనిఖీ కమిటీలు నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు 14కు మించని పరిస్థితి ఉంటే.. ప్రైవేటు బడుల్లో మాత్రం కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 20 వరకు వేసినా కమిటీలు ఆమోదం చెబుతున్నాయి.జరుగుతున్న తంతు ఇదీ... ⇒ ప్రైవేటు స్కూళ్లలో ఇంటర్నల్ అసెస్మెంట్పై తనిఖీ బృందాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా యి. ఎక్కడా శాస్త్రీయత లేదని సభ్యులు పేర్కొంటున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడం వల్ల తామేమీ చేయలేపోతున్నా మని అంటున్నారు. తనిఖీ బృందాలు ఇచ్చి న ఫీడ్ బ్యాక్ ప్రకారం కొన్ని ఉదాహరణలివీ.. ⇒ హైదరాబాద్‌లోని నాలుగు ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్ అందరిదీ ఒకే రకంగా ఉంది. దాన్ని గూగుల్ నుంచి కాపీ కొట్టినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు విద్యార్థులను ఆ ప్రాజెక్టు వర్క్‌పై ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేకపోయారు. ⇒ ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూల్లో వంద మంది విద్యార్థుల రికార్డులు ఒకే రకంగా ఉన్నాయి. అవి కూడా ఎవరో రాసినట్టు తెలుస్తోంది. కొన్ని పదాలు పూర్తిగా ఆన్లైన్ నుంచి తీసుకున్నట్టుగా ఉంది. భాష కఠినమైన, పొంతనలేని తరహాలో ఉంది. దీనిపై విద్యార్థులకు ఏమాత్రం అవగాహన లేదు. ⇒ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో అంతర్గత పరీక్షలకు హాజరవని విద్యార్థులకూ ఇంటర్నల్ మార్కులు వేశారు. పరీక్ష పేపర్లు ఎక్కడో పోయినట్టు వారు పేర్కొనడం గమనార్హం. ఓ రాజకీయ నాయకుడి బంధువు స్కూల్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.రూ.వంద కోట్ల దందా.. రాష్ట్రంలో ఈ సంవత్సరం 5,09,391 మంది టెన్త్ పరీక్షలు రాయనున్నారు. అందులో రెగ్యులర్‌గా రాసేవాళ్లు 4,97,341 మంది, గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు మరో 12,050 ఉన్నారు. 11,544 ప్రైవేటు స్కూళ్ల నుంచి ఈ ఏడాది 2,36,674 మంది టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది ఓ నాలుగైదు కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన వారేనని అంచనా. ఇంటర్నల్ మార్కులు ఎక్కువ వస్తే జీపీఏ పెరుగుతుందని ఆ స్కూళ్లు చెబుతున్నాయి. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి స్కూల్ స్థాయిని బట్టి రూ.5 వేలు మొదలు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్నల్ మార్కుల కోసం అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని.. ఈ మొత్తం రూ.వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రతీ స్కూల్ కూడా తనిఖీ బృందాల్లో ముగ్గురికి రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారని.. ఎంఈవోలు, డీఈవోలు, రాష్ట్ర విద్యాశాఖలోని ఉన్నతాధికారులకూ ముడుపులు వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్కూళ్లు వేసిన మార్కులు సరికాదని తెలిసినా.. కమిటీలు తూతూమంత్రంగానే తనిఖీ చేసి ఆమోదించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.విచారణకు ఆదేశిస్తాం ఇంటర్నల్ మార్కుల తనిఖీ వ్యవహారంపై విచారణ జరిపిస్తాం. అనుమానమున్న జిల్లాలు, ప్రాంతా ల్లోని పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశి స్తాం. ఇంత వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో పరిశీలించి, అలాంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్దగ్గరుండి పరిశీలిస్తున్నాం ప్రైవేటు స్కూళ్లలో అంతర్గత మార్కులను తనిఖీ బృందాలు పరిశీలించిన తర్వాత.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మరోసారి పరిశీలన చేస్తున్నాం. ఎక్కడైనా అనుమానం వస్తే స్వయంగా వెళ్లి పరిశీలిస్తాం. బృందాలు ఇంకా మార్కులు ఫీడ్ చేయలేదు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఉంటుంది. – సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మంఇలా చేయడం దారుణం.. తనిఖీ బృందాలకు ముట్టజెప్పాలనే పేరుతో ప్రైవేటు స్కూళ్లు డబ్బులు వసూలు చేయడం దారుణం. దీనికి టీచ ర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. దీనిపై సమ గ్ర విచారణ జరిపించాల్సి ఉంది. అంతర్గత మార్కులు పెంచేందుకు అన్యాయంగా అనుమతిస్తే.. సంబంధిత తనిఖీ బృందాల్లోని టీచర్లపై చర్య లు తీసుకోవాలి. – ఆర్.రాజగంగారెడ్డి, గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడురూ.10 వేలు అడిగారు ఇంటర్నల్ మార్కులు జీపీఏ పెరగడానికి కీలకమని కరస్పాండెంట్ చెప్పారు. అధికారులను మేనేజ్ చేయాలని, అందుకోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే మార్కులు తగ్గిస్తారని చెప్పారు. అందరూ ఇస్తున్నారు కాబట్టి భయంతో మేం కూడా ఇచ్చాం. – హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి -
మార్చి 15 నుంచి పది పరీక్షలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి.. పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు. -
టెన్త్ ఫీజు రాయితీకి ని‘బంధనాలు’!
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ అందడం లేదు. ఇందుకు ఏళ్ల కిందట రూపొందించిన నిబంధనలే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై తగిన మార్పుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించడం లేదని వారంటున్నారు. రాయితీ నిబంధనలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, నగర విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. రాయితీ పొందాలంటే.. ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థులంతా ఫీజులు చెల్లించే పనుల్లో నిమగ్నమయ్యారు. నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి పరీక్ష రుసుం కింద రూ.125 చెల్లించాలి. వంద శాతం రాయితీ పొందాలంటే విద్యార్థులు వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని సమరి్పంచాలి. హైదరాబాద్ నగరంతో సహా శివారు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 1.18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. వీరి కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉంటేనే వంద శాతం ఫీజు రాయితీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ నిబంధన చాలా ఏళ్ల కిందట రూపొందించారు. ఇప్పుడు సగటున వార్షిక ఆదాయం రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విద్యారి్థకీ రాయితీ లభించడం లేదు. ఆదాయ పరిమితిని సవరిస్తేనే ఫలితం ఉంటుందని టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ ఇలా అపరాధ రుసుం లేకుండా గడువు: ఈ నెల 28 వరకు రూ.50 అపరాధ రుసుం: డిసెంబరు 2 రూ.200 అపరాధ రుసుం: డిసెంబరు 12 రూ.500 అపరాధ రుసుంతో: డిసెంబరు 21 వరకు.. -
వదిలెళ్లిపోయావా బిడ్డా...
స్టేషన్‌ఘన్‌పూర్/చిల్పూరు: బాగా చదువుకుని మమ్మల్ని ఉద్దరిస్తావనుకుంటే వదిలెళ్లిపోయావా అంటూ శుక్రవారం వంగాలపల్లి రైల్వేగేట్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి రాజు, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కొడారి రాజ్‌కుమార్(15) స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి సెయింట్థామస్ హైస్కూల్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. అతడి తమ్ముడు కూడా అదేపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా శుక్రవారం ఉదయం హాస్టల్లో విద్యార్థి కనిపించలేదు. దాంతో పాఠశాల ప్రిన్సిపాల్.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో విద్యార్ధి రాజ్‌కుమార్ వంగాలపల్లి రైల్వేగేటు సమీపాన విగతజీవిగా పడి ఉన్నట్లు మధ్యాహ్నం సమయంలో తెలిసింది. అయితే సెయింట్థామస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాజ్‌కుమార్ మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే పాఠశాల హాస్టల్‌కు కనీసం వాచ్‌మన్ లేకపోవడం ఏంటని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం బయటి వ్యక్తులు రాజ్‌కుమార్‌పై పాఠశాలలో దాడి చేశారని, బయటి వ్యక్తులు పాఠశాలలో విద్యార్థిపై దాడి చేస్తే మాకు చెప్పరా.. అని ప్రశ్నించారు. విద్యార్థి నాలుగు రోజులుగా మూడీగా ఉంటున్నట్లు తెలిసిందని, సమాచారం ఇవ్వలేదన్నారు. రాజ్‌కుమార్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన గత్యంతరం లేదని వాపోయారు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల వద్దకు మృతిచెందిన విద్యార్థి రాజ్‌కుమార్ బంధువులు, ఉప్పుగల్లు గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకుని పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో సెయింట్థామస్ స్కూల్ వద్ద శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ వేణు.. ఎస్సైలు, ఏఎస్సై, పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే విద్యార్థి రాజ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని వారి బంధువులు పాఠశాల యాజమాన్యంతో రాత్రి వరకు చర్చలు జరిపారు. కాగా, ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి లోకేశ్ అనే డిగ్రీ విద్యార్థి సైతం వంగాపల్లి రైల్వేగేటు సమీపంలో 13 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న రాజ్‌కుమార్‌కు లోకేశ్ వరుసకు బాబాయి.ఉదయమే గుర్తించాం..విద్యార్థి పాఠశాల నుంచి పారిపోయినట్లు శుక్రవారం ఉదయం గుర్తించాం. రోజూ మాదిరిగానే ఉదయం టిఫిన్ సమయానికి ముందు హాజరు తీసుకుంటాం. ఉదయం రాజ్‌కుమార్ లేకపోవడంతో ఇతర విద్యార్థులను విచారించి పాఠశాల నుంచి పారిపోయినట్లు గుర్తించాం. పేరెంట్స్‌కు సమాచారం అందించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. విద్యార్థి మృతిచెందడం చాలా బాధాకరం.– పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్‌బన్నీ -
టెన్త్, ఇంటర్లో భారీగా రీ అడ్మిషన్లు
-
నియోజకవర్గ ప్రతిభావంతులకు నేడు సత్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. నియోజకవర్గస్థాయిలో విద్యార్థులను గురువారం సత్కరించేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలో విద్యాసంస్థలున్నాయి. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులు 662 మంది ఉన్నారు. విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. నియోజకవర్గస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఇంటర్మీడియట్లో గ్రూప్ టాపర్‌కు రూ.15 వేలు చొప్పున ఇస్తారు. 20న రాష్ట్రస్థాయిలో.. రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యాలను ఈనెల 20న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించనున్నారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన 42 మందిని, ఇంటర్లో మొదటి స్థానంలో నిలిచిన 28 మందిని ఆయన సన్మానించనున్నారు. పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండోస్థానంలోని వారికి రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ఇంటర్ టాపర్స్‌కు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. 17న జిల్లాస్థాయిలో.. జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఈ నెల 17న ఆయా జిల్లా కేంద్రాల్లో సన్మానించనున్నారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలోని సంస్థల్లో ఒక్కో మేనేజ్మెంట్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులను సన్మానిస్తారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాస్థాయిలో పదో తరగతి విద్యార్థులు 606 మందిని, ఇంటర్ టాపర్స్ 392 మందిని సత్కరించనున్నారు. పదో తరగతిలో జిల్లా టాపర్‌కు రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.15 వేలు నగదు బహుమతి అందిస్తారు. ఇంటర్లో ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తారు. -
మా నాన్న ఒక మెకానిక్.. ఈరోజు నాకు 10వ తరగతిలో 594 మార్కులు వచ్చాయి
-
టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రభుత్వ సత్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు బొత్స ప్రకటించారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు చెప్పారు. విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రోత్సహించేందుకే.. ఈ నెల 23న నియోజకవర్గ స్థాయిలో సత్కార వేడుక నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని బొత్స తెలిపారు. మే 27న జిల్లా స్థాయిలో సత్కారంలో విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు నగదు అందచేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తామని వెల్లడించారు. ఈనెల 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆర్.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని చెప్పుకోవాలి
‘‘మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సం పాదన మా చదువులకు సరిపోదని విశాఖ వచ్చి పూర్ణామార్కెట్‌లో కలాసీగా పనిచేస్తున్నారు. నాకు మంచి మార్కులు వస్తున్నాయని, బాగా చదివించమని మా ఉ పాధ్యాయులు చెప్పడంతో నాన్న ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. చాలీచాలని సం పాదనతో ఎలా చదివించాలన్నదే ఆయన ఆందోళన. అలాంటి సమయంలో నేను 8వ తరగతిలో ఉండగా మొదటిసారి అమ్మ ఒడి అందింది. వరుసగా మూడేళ్లు ఆ పథకం వల్ల లబ్ధి ΄పొందడం వల్ల నా చదువు ఎలాంటి భారం లేకుండా సునాయాసంగా సాగిపోయింది. మా పాఠశాల ఉ పాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధతో నన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది’’ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థిని కామిరెడ్డి హేమశ్రీ మనోగతమిది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుల సరస్వతిగా నిలిచింది. తల్లిదండ్రులకు, ఉ పాధ్యాయులకు మంచి పేరు తెచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన టెన్త్ టాపర్లు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పుట్టుకొచ్చారు. అలాంటి టాపర్లలో ఈమె ఒకరు. ఆమెతో ‘సాక్షి’ సంభాషించింది. హేమశ్రీ ఎలా ఈ స్థాయికి చేరుకుందో ఆమె మాటల్లోనే.. నాన్న మాటలే స్ఫూర్తి ‘‘అమ్మ గోవిందమ్మ, మా నాన్న శ్రీనివాసరావు. నాన్న పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్. ప్రస్తుతం విశాఖలోని పూర్ణా మార్కెట్లో కలాసీ. ఓ రకంగా నాన్నే నా విజయానికి స్ఫూర్తి. తను బాగా చదవలేకపోవడం వల్లే టెన్త్ ఫెయిలయ్యారు. కలాసీగా రాత్రీపగలూ కష్టపడుతున్నారు. అదే మాకు పదేపదే చెప్పేవారు. తానెన్ని కష్టాలుపడ్డా.. అదంతా నా కోసం, నా తమ్ముడి కోసమేనని గుర్తు చేసేవారు. మా చదువులకు డబ్బులు అవసరమవుతాయనే ఆరేళ్ల క్రితం దేవరాపల్లి నుంచి విశాఖ వచ్చేశారు. నాన్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప వేరే ధ్యాసలేకపోయింది. అదే నన్ను పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులతో టాపర్‌గా నిలిపింది. చదువంతా సర్కారీ స్కూల్లోనే.. ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ మా స్వగ్రామం దేవరాపల్లి మండలం కొత్తపెంటలోని మండల పరిషత్ ్ర పాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలో 92 మార్కులు సాధించా. దీంతో అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (గరల్స్)లో సీటు వచ్చింది. నా జీవితంలో నేను సాధించిన తొలి విజయమది. ఐదోతరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే. అమ్మానాన్నల కష్టం తెలియడంతో వారికి ఏ రోజూ నా చదువు భారం కాకూడదనుకున్నాను. ఎంత బాగా చదివితే.. నా చదువుకు అంత తక్కువ ఖర్చవుతుందని తెలుసుకున్నాను. దీనికి నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత తెలియడం ఒక కారణమైతే, మా స్కూల్ టీచర్లు మరో కారణం. ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు అంతా దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అందుకే మా టీచర్లు చదువు విలువ తెలిసేలా, పరీక్షల భయం పోయేలా నిత్యం మమ్మల్ని ్రపోత్సహించారు. వసతులు పెరిగాయి సాధారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లు మిగిలిన ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి. అయితే నా వ్యక్తిగత అవసరాలకు మొదటి మూడేళ్లు ఇంటి నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చేదాన్ని గత మూడేళ్లుగా పరిస్థితి చాలా మారింది. వసతులు మరింత మెరుగయ్యాయి. పర్యవేక్షణ పెరిగింది. పుస్తకాలు, యూనిఫాం, షూస్.. ఇలాంటి వాటి కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగే అవసరం లేకుండా పోయింది. మూడుసార్లు అమ్మ ఒడి అందుకున్నా. సీఎం జగన్ మామయ్య ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంజినీర్ కావడమే లక్ష్యం ఇంజినీర్ కావాలన్నది నా కల. అందుకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టే స్థోమత నా కుటుంబానికి లేదు. బాగా చదవడమే ఖర్చులేని దారని నాకు తెలుసు. అందుకే టీచర్లు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకునేదాన్ని. అర్థంకాని విషయాల్ని ఎప్పుడు అడిగినా, టీచర్లు ఓపిగ్గా విడమరిచి చెప్పేవారు. నా తమ్ముడు సందీప్ ప్రస్తుతం 7వ తరగతి పూర్తి చేసుకున్నాడు. మా అమ్మానాన్నలకు మేం భరోసాగా నిలవాలన్నదే నా కోరిక. దాన్ని నెరవేర్చేందుకు చదువు తప్ప, నాకు వేరే మార్గం తెలియదు. ఇంజినీర్‌గా స్థిరపడి నాలాంటి వారికి ఆసరాగా నిలవగలిగితే చాలు. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని నలుగురూ చెప్పుకుంటే.. మా నాన్న కళ్లలో కనిపించే ఆనందాన్ని చూడాలి.. అంతే..!’’ మిట్టు.. సూపర్ హిట్టు టెన్త్‌లో 594 మార్కులు శ్రీకాకుళం జిల్లా (ఆంధ్రప్రదేశ్) పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన మిట్టు మహా పాత్రో 600కు 594 మార్కులు సాధించాడు. పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారిలో వీరి ఇల్లు. మహా పాత్రో తండ్రి దుర్గాప్రసాద్ మహా పాత్రో ద్విచక్రవాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు. తల్లి మమత మహా పాత్రో గృహిణి. మిట్టు పాఠశాల సెలవుల్లోను, ఇంటి వద్ద ఉన్నప్పుడు సైకిల్‌కు, బైక్‌లకు పంక్చర్లు వేయడంలో తండ్రికి సహాయం చేస్తుండేవాడు. ఒడియా బ్రహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబం వీరిది. మిట్టుకు పదో తరగతిలోఅత్యధిక మార్కులు రావడంతో ఆ కుటుంబంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాతపట్నంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అత్యధిక మార్కులు మాత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మిట్టు సాధించాడు. తన కుమారుడికి పదో తరగతిలో జిల్లా మొదటి స్థానం రావడంతో ఆనందంగా ఉందని తండ్రి దుర్గా ప్రసాద్ తెలి పారు. మిట్టు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ్ర పాథమిక ఒడియా పాఠశాలలో చదివాడు. – రవి కుమార్, సాక్షి పాతపట్నం ఇంజినీర్ అవుతా... అమ్మ, నాన్న, ఉ పాధ్యాయుల ్రపోత్సాహంతో పదో తరగతిలో మంచి మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీ చదివి, ఇంజినీర్ అవుతా. – మిట్టు మహా పాత్రో – లోవరాజు, సాక్షి, అనకాపల్లి. -
టెన్త్ స్పాట్‌కు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ వేసినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు. ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆన్లైన్ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్ వాల్యూయేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? ♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ♦ మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. ♦ ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ♦ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు టీచర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. పొరపాటున మరో వాట్సాప్ గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని, అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్‌కు కారణమైన ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్), నాగరాజు(ఔట్ సోర్సింగ్)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
ఆదిలాబాద్: ఊట్నూర్లో పదో తరగతి ఆన్సర్‌షీట్లు మిస్సింగ్
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్‌షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె. ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్ పేపర్ అవుట్! -
ఆమె వయసు 39, అతనికి 21.. ‘సంబంధం’పై తండ్రి హెచ్చరించడంతో..
చిత్తూరు అర్బన్: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని కొడుకు భరత్ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి. ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్.. మహిళకు వీడియోకాల్ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్ ఆన్‌లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) -
AP: టెన్త్.. నో టెన్షన్
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన సంస్కరణల వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్ కీలక మలుపు. పదో తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో ఎక్కడాలేని భయం. ఈ భయాన్ని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. నెల్లూరు (టౌన్): టెన్త్ పరీక్షలంటే.. ఇక నో టెన్షన్. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో విద్యార్థులపై చదువులు, ర్యాంక్‌లు, మార్కులు ఒత్తిడి తగ్గనుంది. తద్వారా నాణ్యమైన విద్య ప్రమాణాలు అందనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లనే ఉండడంతో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 420 వరకు ఉన్నాయి. వీటిల్లో 35 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. హిందీ మినహా మిగిలిన ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా గతేడాది çపది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మార్కులు కేటాయించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి పది పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు భారం తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిల్లో హిందీకి తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మోడల్ పేపర్లను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందజేశారు. చదువుకునేందుకు ఎక్కువ సమయం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లకు తగ్గించడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ రోజులు పరీక్షలు జరగకుండా నూతన పరీక్ష విధానం వల్ల పరీక్షలు కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోతాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులు టెన్షన్‌ను పక్కన బెట్టి రాసేందుకు సిద్ధమవుతారు. – పి. రమేష్, డీఈఓ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లో తక్కువ పేపర్లు నిర్వహించడం వల్ల చదువుకునేందుకు సమయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు టెన్షన్ కూడా తగ్గుతుందంటున్నారు. నూతన జిల్లాల్లోనే పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు. -
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 79 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 79.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యాయి. పాసయిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో (97.99 శాతం) ఉంటే, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (53.11 శాతం)లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆగస్టు 1 నుంచి 10 వరకూ జరిగిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెగ్యులర్‌గా జరిగిన పరీక్షల్లో కూడా ఈసారి 90 శాతంపైనే ఫలితాలు వచ్చినట్టు దేవసేన తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు లేకపోయినా, ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు. నేటి నుంచి రీ కౌంటింగ్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్‌లో విద్యార్థి పేపర్‌ను ఉపాధ్యాయులే తిరిగి పరిశీలిస్తారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తే, విద్యార్థి రాసిన సమాధాన పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. దీంతో విద్యార్థి స్వయంగా పరిశీలించుకునే వీలుంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం: దేవసేన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన తెలిపారు. కాగా, రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు మొదటి విడత యూనిఫాంలు పంపామని, రెండో విడత కూడా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ పిల్లలను క్రమంతప్పకుండా స్కూళ్లకు పంపే విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, టీచర్ల నియామకం గురించి ప్రభుత్వానికి వినతి పంపామని ఆమె వివరించారు. -
ఏపీ: పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు
-
పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ.. -
10 పాసైతే చాలు కోర్సులో చేరిపోవచ్చు.. అదిరేటి రుచులతో ఆదాయం మీ సొంతం
వంట చేయడం గొప్ప కళ. ఆ కళను ఉపాధి మార్చుకుని అదిరేటి రుచులు అందించే వారే ఆధునిక నలభీములు. ఆతిథ్య రంగంలో చెఫ్‌లకు అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికత, కొత్త ఆవిష్కరణలతో రాణిస్తే.. కాకా హోటల్ నుంచి కార్పొరేట్ కిచెన్ వరకు విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. పాకశాస్త్రంలో సిద్ధహస్తులను తయారు చేస్తున్న సంస్థలెన్నో ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఒక్కటే ఉంది. అదే విశాఖలో నిర్వహిస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. ఈ నలభీముల తయారీ సంస్థకు 35 ఏళ్లు పూర్తయింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో దేశ, విదేశాల్లో చెఫ్‌లుగా రాణిస్తూ.. ఆహా అనిపించే కమ్మని రుచులను అందిస్తున్నారు. విశాఖపట్నం: నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని రూరల్ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. అతి తక్కువ ఫీజుతో ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్కు 35 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఏకైక ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కనీస అర్హత 10వ తరగతి ఈ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కనీస అర్హత పదో తరగతి. 25 ఏళ్లు లోపు ఉండాలి. దీన్ని ఈ ఏడాది నుంచి 30 ఏళ్లకు పెంచాలని వినతులు వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కోర్సు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇక్కడ మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన ల్యాబ్ (ప్రయోగశాల)ను ఇటీవల ఆధునికీకరించారు. ప్రైవేట్ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లకు దీటుగా ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని రకాలైన వంటకాల్లోనూ తరీ్ఫదు ఇచ్చి వారితోనే తయారు చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు తయారు చేస్తున్న వంటకాలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఎప్పటికప్పుడు రుచులు చూసి.. మరింత మెరుగు కోసం సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ అందించే కోర్సులివే.. ప్రస్తుతం ఇక్కడ ఫుడ్ ప్రొడెక్షన్ అండ్ పెటిసరీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, ఫుడ్ సరీ్వస్ ఆపరేషన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఏడాదిన్నర కాల వ్యవధి గల కోర్సులు. ఏడాది పాటు థియరీ, ఆరు నెలల పాటు ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా నగరంలో స్టార్ హోటళ్లలో ఇండ్రస్టియల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. ఇక్కడ ప్రయోగశాలలో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడ విశాలమైన వంట గది(ప్రయోగశాల) ఉంది. ఇందులో శిక్షణ పొందే వారికి వివిధ రకాల వంటకాలు తయారు చేయడంలో తరీ్ఫదు ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ వంటకాలు, దక్షిణ, ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి వంటకాలు చేయడం నేర్పుతారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు నగరంతో పాటు వివిధ ముఖ్య పట్టణాలు, దేశ విదేశాల్లోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య రంగంలో ఉపాధి పొందుతున్నారు. షిప్‌ల్లో కూడా పనిచేస్తున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ.. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి ఇక్కడ తక్కువ ఫీజుతో కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇదొక్కటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. అందుకే ఇక్కడ కోర్సులకు డిమాండ్ ఉంది. 10 తరగతి చదువుకుని 25 ఏళ్ల వయసు లోపు వారికి ప్రవేశాలు కలి్పస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి విదేశాల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే 25 ఏళ్లు దాటిన వారు కూడా శిక్షణ కావాలని కోరుతున్నారు. కనీస అర్హత 30 ఏళ్లకు పొడిగిస్తే మరింత మంది శిక్షణ తీసుకుని అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభిస్తాం. ప్రవేశాలు పొందాలనుకునే వారు నేరుగా వచ్చి ఇన్స్టిట్యూట్లో సంప్రదించవచ్చు. – రవి, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ -
టెన్త్ క్లాస్ కుర్రాడికి అమెరికా బంపరాఫర్,భారీ ప్యాకేజ్‌తో పిలుపు..అంతలోనే
అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. పైసా ఖర్చులేకుండా భారత్ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలుపు అందింది. కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ అంతలోనే సదరు సంస్థ ఆ కుర్రాడికి భారీ షాకిచ్చింది. నాగపూర్‌కు చెందిన రాజేష్, అశ్వనీ దంపతుల కుమారుడు వేదాంత్ డియోకటే (15) 10వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే టెన్త్ క్లాస్ చదివే వేదాంత్ ఆన్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్లో డజన్ల కొద్ది కోడింగ్ కోర్స్‌లు నేర్చుకున్నాడు. రెండు రోజుల్లో ఈ తరుణంలో తల్లీ అశ్వినీకి చెందిన ల్యాప్‌ట్యాప్‌లో వేదాంత్ ఇన్‌స్ట్రాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా..వెబ్సైట్ డెవలప్మెంట్ కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరైనా పాల్గొన వచ్చంటూ ఓ లింక్ కంట పడింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ 15ఏళ్ల కుర్రాడు కోడింగ్ కాపింటీషన్లో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో హెచ్‌టీఎంఎల్,జావా స్క్రిప్ట్,వర్చువల్ స్టూడియో కోడ్ (2022) 2,066 రాశాడు. దేశ వ్యాప్తంగా 1000మంది పాల్గొన్న ఈ కోడింగ్ కాంపిటీషన్లో వేదాంత్ తనకిచ్చిన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. ఖండాంతరాలు దాటిన ప్రతిభ ఈ కాంపిటీషన్లో వేదాంత్ చూపించిన ప్రతిభ ఖండాంతరాలు దాటింది. అమెరికా న్యూజెర్సీకి చెందిన యాడ్ ఏజెన్సీ సంస్థ ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తామని, సంవత్సరానికి రూ.33లక్షల ప్యాకేజీ ఇస్తామని పిలిచింది. తీరా వేదాంత్ ఎడ్యుకేషన్‌తో పాటు వయస్సు చాలా చిన్నది కావడంతో తాము ఇస్తామన్న ఆఫర్‌ను విరమించుకుంటున్నామని.. విద్యార్ధిగా సాధించిన విజయాలు ఇంకా ఉన్నాయంటూ యూఎస్ కంపెనీ తెలిపింది. వేదాంత్ ప్రతిభ అమోఘం ఈ కుర్రాడి ప్రతిభ అమోఘం, అనుభవం, ప్రొఫెషనలిజం, అప్రోచ్ అయ్యే విధానం చాలా బాగుంది. వేదాంత్‌కు జాబ్ ఇప్పుడు ఇవ్వలేకున్నా.. ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత అతను కోరుకున్న జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చంటూ అమెరికన్ యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. -
తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై తోటి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులతో సహా మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. వివరాలు.. కడలూరు జిల్లాకు చెందిన విద్యార్థి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత నెల 22వ తేదీ ఆమెతో చదువుతున్న మరో విద్యార్థి పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన విద్యార్థి సమీపంలో సంబంధిత విద్యార్థిని నిలబడి ఉండగా ఆమె పక్కకు వచ్చిన విద్యార్థులు ముగ్గురు ఆ విద్యార్థినికి తెలియకుండా ఆమెతో సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు.తర్వాత ముగ్గురు తరచూ ఆ ఫొటోను చూపెడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. పాఠశాల వెనకాల ఉన్న తన ఇంటికి రావాలని లేదంటే సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. జూలై ఒకటో తేదీన విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోలు చూపెట్టి తిరిగి బెదిరింపులకు పాల్పడడంతో విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ముగ్గురు విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విద్యార్థినిని అరెస్టు చేశారు. నలుగురిని కోర్టులో హాజరుపరచి కడలూరు జువైనల్ హోమ్‌కు తరలించారు. చదవండి: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్ మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన కామాంధుడు, అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్‌కు చెందిన శ్రీనివాసన్ టీ దుకాణంలో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య దివ్య (24). వీరికి కుమారుడు (7), మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. దివ్య ఇటుకల బట్టిలో పనిచేస్తుంది. అక్కడ ఆమెకు జగన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శ్రీనివాసన్ భార్యను హెచ్చరించాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయారు. దివ్య జగన్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గత 30వ తేదీ జగన్ బాలికపై లైంగిక దాడి చేశాడు. స్పృహ తప్పిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న విరాలిమలై పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి మృత దేహాన్ని శవ పరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లైంగిక దాడి చేసిన జగన్, అతని స్నేహతుడు పలని యప్పన్‌ను, చిన్నారి తల్లి దివ్యను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
Andhra Pradesh: టెన్త్ విద్యార్థులకు తీపి కబురు
AP SSC Improvement Exams 2022: టెన్త్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలిసారి టెన్త్ విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే బెటర్మెంట్ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్మెంట్ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్మెంట్ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది. -
పది పాస్‌కు ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్‌లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్మెంట్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ పాస్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్క్ట్స్లో ఫెయిల్ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్క్ట్ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. – ఆర్వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
'టెన్'షన్ వద్దు!
మదనపల్లె సిటీ: కోవిడ్ మహమ్మారితో రెండు సంవత్సరాలుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. అనంతరం మూల్యాంకనాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కసరత్తు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు 153 కేంద్రాల్లో నిర్వహించగా 23,752 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలవుతుండటంతో పిల్లలకు మార్కులు ఎలా వస్తాయోనని తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరో వైపు జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అ«ధికారుల్లో సైతం ఆసక్తి నెలకొంది. గతంలో పరీక్షలలో మార్కులు తగ్గాయంటూ చాలా మంది పిల్లలు అ«çఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలూ లేకపోలేదు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చిన సందర్భాలు కనిపించేవి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్యనిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితాలు ర్యాంకులే జీవితం కాదు జీవితంలో పరీక్షా ఫలితాలు వాటి ర్యాంకులే ముఖ్యం కాదు. కాలం, ప్రాణాన్ని మించి ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓటమి గెలుపునకు తుదిమెట్టు అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలి. ఫలితాలు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుంది. క్షణికావేశానికి లోనుకావద్దు పది పరీక్షల ఫలితాలు వచ్చిన సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకూడదు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగితే జీవిత లక్ష్యాలను చేరుకోవచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయి. ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి పలు మార్గాలు లభిస్తాయి. –ఎల్.బి.మహేష్‌నారాయణ, విద్యావేత్త, మదనపల్లె భయాందోళనకు గురిచేయవద్దు పది ఫలితాల వ్యత్యాసం చూపుతూ పిల్లల్ని భయాందోళనలకు గురి చేయరాదు. విద్యార్థులు కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పది పరీక్షలే జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. –డాక్టర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె ప్రోత్సహించండి మార్కులు తక్కువ వచ్చాయని అఘాయిత్యాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఉద్యోగాలు సాధించేందుకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్కులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. –ఎం.జయకుమార్, సైకాలజిస్టు, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
ఉరుకులు పరుగులతో ‘స్పాట్’
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యంకనం గురువారం మొదలైంది. మొత్తం 12 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూల్యాంకన విధు ల్లో మొత్తం 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ నెల 11 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేయాలని టెన్త్ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ ఇచ్చింది. ప్రతీ ఉపాధ్యాయుడు విధిగా రోజుకు 40 పేపర్లు మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. ఇది పూర్తయిన వెంటనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాధాన పత్రాలను స్కాన్ చేసి, మార్కులను క్రోడీకరిస్తారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయనేది స్పష్టంగా తెలుస్తుంది. తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి రావడంతో టీచర్లు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
లీకేజ్ నారాయణ ఎక్కడ ??
-
తగ్గేదేలే.. 58 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే
భువనేశ్వర్: ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ పొలం పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫుల్బణి ఎమ్మెల్యే అంగద కన్హర్(58) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విద్యార్థులతో కలిసి మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయడం రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్ మారింది. కందమాల్ జిల్లా ఫుల్బాణి మండలం పితాబరి గ్రామంలోని రుజంగి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఆయన పరీక్షకు హాజరయ్యారు. 1978లో అర్ధాంతరంగా విద్యాభ్యాసం ముగించిన ఆయన.. ఇన్నాళ్లకు పునఃప్రారంభించడం విశేషం. కుటుంబ పరిస్థితులతో అప్పట్లో చదువు కొనసాగించలేక పోయానని, 50 ఏళ్లు పైబడిన వారు కూడా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులైనట్లు ఇటీవల వార్తల్లో విన్నానని తెలిపారు. ఉన్నత అభ్యాసానాకి వయస్సు అడ్డు కాదన్నారు. ఇదే ఉత్సాహంతో పరీక్షలకు హాజరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎస్‌ఐఓఎస్) వర్గం కింద ఈ ఏడాది 63మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కేంద్రం పరిశీలకురాలు, హెచ్ఎం అర్చనా బాస్ వెల్లడించారు. ఇందులో ఎమ్మల్యే అంగద తోపాటు లుయిసింగి పంచాయతీ సర్పంచ్ సుదర్శన్ కంహర్ కూడా ఉన్నారని ప్రకటించారు. 1985లో క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించిన అంగద కన్హర్.. వరుసగా 3సార్లు కెరండిబాలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. మరో సారి పొకారి పంచాయతీ నుంచి ఎన్నికయ్యా రు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. ఫిరింగియా మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజాభిమానాన్ని సంపాదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం ఫుల్బాణి నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు జరగక పోవడంతో రాయలేక పోయానని చెప్పిన ఎమ్మెల్యే.. శుక్రవారం సాధారణ విద్యార్థిగా ప్రవేశ ద్వారం వద్ద హాల్ టికెట్ చూపించి, కేంద్రంలోకి ప్రవేశించారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్షకు రాగా.. వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం. చదవండి: King Cobra: కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో.. -
మితిమీరి.. దిగజారి
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, సర్కారును ఇరకాటంలో నెట్టేందుకు ‘కొందరు’ టెన్త్ పరీక్షలను కూడా వాడుకుంటున్నారు. మితిమీరిన ‘స్వామి భక్తి’ చూపడానికి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వేల మంది విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు బ్రేకింగ్ వార్తలు, కథనాలను వండి వార్చేశారు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటిదేమీ లేదని తేలింది. దీంతో ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులను కూడా విచారిస్తున్నారు. జిల్లాలోని సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రి కేంద్రాల నుంచి గురువారం హిందీ ప్రశ్న పత్రం లీకైందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారం చేసింది. స్క్రోలింగ్‌లను ఇచ్చింది. ఈ వా ర్తలు చూసి విద్యాశాఖాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే విద్యాశాఖ, సమగ్ర శిక్ష, రెవెన్యూ అధికారులు, పోలీసులు పరీక్ష కేంద్రానికి చేరుకుని దీనిపై ఆరా తీశారు. కలెక్టర్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. స్థానిక పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎవరూ లేరు. పేపర్ లీకేజీ అంటూ వస్తున్న కథనాన్ని చూపించి పరీక్ష కేంద్రంలోని పర్యవేక్షణాధికారులను ప్రశ్నించగా, అలాంటి అవకాశమే లేదని బదులిచ్చారు. పోలీసు స్టేషన్ల నుంచి నేరుగా ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసు కొచ్చామని, పరీక్షలు మొదలుపెట్టామని, ఇన్విజిలేటర్ల నుంచి సెల్ఫోన్లను డిపాజిట్ చేసుకున్నామని వివరించారు. కావాలనే చేశారు.. పరిశీలన పూర్తయ్యాక లీకేజీ కట్టుకథేనని అధికారులు తేల్చారు. ఈ వదంతులు పుట్టించిన వారిపై మండిపడ్డారు. అటు విద్యాశాఖను, ఇటు ప్రభుత్వా న్ని అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది వ్యక్తు లు పనిగట్టుకుని చేసిన దుశ్చర్యగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయమై ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈఓ పగడాలమ్మ, సమగ్రశిక్ష ఏపీసీ డా క్టర్ జయప్రకాష్లు మీడియాకు వివరించారు. ప్రశ్న పత్రం లీకేజీ అంటూ తప్పుడు కథనాలు, వార్తను ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై, అందుకు సహకరించిన వ్యక్తులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా రు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు లుకూడా నమోదుచేయాలని కలెక్టర్ నిర్ణయించారు. రెండో రోజు 179 మంది గైర్హాజరు.. జిల్లాలో గురువారం 248 కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు 36,124 మంది (ఒక విద్యార్థి పెరిగారు) హాజరుకావాల్సి 179 మంది గైర్హాజరయ్యారు. ఆర్జే డీ, జిల్లా పరిశీలకులు ఎం.జ్యోతికుమారి జీహెచ్‌స్కూల్ పోలాకి, విశ్వశాంతి స్కూల్ పోలాకి, జెడ్పీ జీహెచ్ స్కూల్ పోలాకి, జెడ్పీహెచ్‌స్కూల్ సారవకోట కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ జి.పగడాలమ్మ శ్రీకాకుళం, నరసన్నపేట, సరుబుజ్జిలి ప్రాంతాల్లో 5 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్, స్క్వాడ్ బృందాలు కలిపి 58 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి. టెన్త్ పరీక్షలో విద్యార్థి డిబార్ రణస్థలం: రణస్థలం మండలంలోని పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హిందీ పరీక్ష రాసిన ఓ విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూ పరింటెండెంట్ శంకర శాస్త్రి తెలిపారు. క్వశ్చన్ పేపర్‌ను కిటికీలో నుంచి బయట వ్యక్తులకు అందిస్తున్న సమయంలో పహారా కాస్తున్న పోలీసు విద్యార్థిని పట్టుకున్నారు. గోడ దూకి వచ్చిన బయట వ్యక్తి పరారైనట్లు ఆయన తెలి పారు. విద్యార్థి నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకుని డిబార్ చేసినట్లు తెలిపారు. చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం -
విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..?
వికారాబాద్: పదో తరగతి విద్యార్థిని హత్య ఘటనలో విస్మయకర విషయాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా అంగడి చిట్టెంపల్లిలో పదిహేనేళ్ల విద్యార్థినిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగుచూసిన విషయం తెలి సిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందా లుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఆ విద్యార్థినితో ప్రేమ పేరిట సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ప్రధాన నిందితుడిగా భావిస్తూ దర్యాప్తు చేపట్టారు. అతనితోపాటు మరో స్పేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం విద్యార్థిని తల్లిని, ఆమెతో సన్నిహితంగా ఉండే మరోవ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు హైదరాబాద్ నుంచి రప్పించిన క్లూస్ టీం ద్వారా మంగళవారం మరోసారి ఆధారాలు సేకరించారు. ఆ యువకుడే హత్య చేశాడా?: కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమపేరిట వేధిస్తున్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని తెలుస్తోంది. సోమవా రం తెల్లవారుజామున 3–00 గంటల ప్రాంతంలోనేవిద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన యువకుడు అప్పటికే పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టు, మరోసారి బలవంతంగా లైంగిక దాడికి యత్నించగా విద్యార్థిని అంగీకరించకపోవటంతో హత్య చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థినిని తీసుకువెళ్లటానికి ముందే అతడు స్నేహితుడితో కలసి మద్యం తాగినట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే లైంగికదాడికి పాల్పడింది అతడొక్కడేనా.. అతడి స్నేహితుల పాత్ర కూడా ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు వెల్లడించిన విషయాలకు సాంకేతికతను జోడించి సరిపోల్చి నిర్ధారణకు వచ్చేందుకే కొంత సమయం తీసుకుంటున్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ ఎస్పీ రషీద్, డీఎస్పీ శ్రీనివాస్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుండగా సీఐ వెంకటరామయ్య, ఎస్ఐ శ్రీశైలం ఇతర పోలీసు బృందాలతో కలసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బుధవారం కేసు విషయాలు వెల్లడించే అవకాశముంది. -
మూడేళ్ల తర్వాత‘పది’ పరీక్షలు
సాక్షి హైదరాబాద్: కరోనా ప్రభావంతో మూడేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల షెడ్యూలు విడుదల కావడంతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రక్రియ ప్రారంభించారు. సర్కారు బడుల్లో మాత్రం సిలబస్ పూర్తి కాలేదు. మరోవైపు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీసం ఉత్తీర్ణత మార్కులతో గట్టెక్కేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు.. కరోనా నేపథ్యంలో 2021– 22 విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్‌తోనే పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపే సిలబస్ పూర్తిచేయాల్సి ఉండగా సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత కరోనా థర్డ్‌వేతో సర్కారు బడుల్లో సిలబస్ పెండింగ్‌లో పడిపోయింది. సైన్స్, మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల సిలబస్ దాదాపు పూర్తి కావచ్చిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడో తరగతి తర్వాత.. కరోనా కంటే ముందు ఏడో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులంతా తాజాగా టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 2018– 19లో 7వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆ తర్వాత కరోనా ఎఫెక్టుతో 8, 9 పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థులు సైతం వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. తాజాగా పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. సర్కారు బడుల్లో అంతంతే... సర్కారు బడుల్లో పదో తరగతి వార్షిక పరీక్షపై ప్రత్యేక శ్రద్ధ అంతంత మాత్రంగా తయారైంది. గతంలో ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షలకు సమాయత్తం చేసేలా చర్యలు చేపట్టేవారు. ఈసారి మాత్రం మౌఖిక ఆదేశాలు ఆచరణలో అమలు లేకుండా పోయింది. ప్రతి రోజు అదనంగా ఉదయం గంట, సాయంత్రం గంట ప్రత్యేక తరగతుల నిర్వహిస్తే తప్ప సిలబస్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సబ్జెక్టు టీచర్ల కొరత కూడా వెంటాడుతోంది. -
టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు వీలుగా కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కరోనా వల్ల జరి గిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. గురువారం ఆమె డీఈవోలు, వివిధ శాఖల ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. సిలబస్‌ను 70 శాతానికి పరి మితం చేయడం, పరీక్షా సమయాన్ని పెంచడం, చాయిస్ పెంచడం, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం వంటి మార్పులపై విద్యార్థులకు అవగా హన కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు–మనబడి, ఇంగ్లిష్ మీడి యం విద్య రాబోయే కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆమె అన్నారు. స్కూళ్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఇంజనీర్లకు సూచిం చారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండి పార్థసారథి పాల్గొన్నారు. -
ఆ అభ్యర్థికి టెన్త్‌లో 600 మార్కులట!
సాక్షి, కాకినాడ: పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో ఆ అభ్యర్థి ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురిని అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం ఉద్యోగాల్లో చేరారు. మెరిట్ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్ఎస్సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు. చదవండి: (విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..) -
అతి తెలివి: తొమ్మిదో తరగతి చదవకుండానే నేరుగా టెన్త్ క్లాస్
సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్‌వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వయసు ఉంటేసరి... పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది. సిలబస్ అంతంతే.. పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం. సుమారు 2.90 లక్షల మంది.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి. పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
ఏప్రిల్‌లో టెన్త్ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలను ఈసారి షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం కష్టమ య్యేలా కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వల్ల విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసు కోకపోవడం, ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొద లవ్వడం, సిలబస్ పూర్తవ్వక పోవడంతో పరీక్షలు కొంత ఆలస్యమయ్యే వీలుందని అధికారులు భావిస్తున్నారు. దీని దృష్ట్యా మార్చిలో కాకుండా ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించే వీలుందని సంకేతాలు వస్తున్నాయి. 50% సిలబస్ పూర్తి.. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి చివరి నాటికి 60% సిలబస్ పూర్తవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 50% పూర్త యినట్టు అధికారులు చెబుతున్నారు. స్కూళ్లు రీ ఓపెన్ చేసినా ఫిబ్రవరి రెండో వారం వరకు క్లాసులు జరిగే అవకాశం కన్పించట్లేదు. సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులు తేలికగా పరీక్షలు రాయగలరు. సిలబస్ పూర్తవక పోవడం, సంక్రాంతి సెలవుల ప్రభావం పరీక్షలపై పడొచ్చని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఫీజు గడువు ఈ నెల 29నే ముగియాల్సి ఉన్నా.. టెన్త్ పరీక్ష ఫీజు గడువును పొడిగించేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంగీకరించినట్టు తెలిసింది. వాస్తవానికి జనవరి 29తోనే గడువు ముగుస్తున్నా సంక్రాంతి సెలవులు పొడిగించడంతో టీచర్లు అందుబాటులో ఉండరన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫీజు గడువును ఫిబ్రవరి మొదటి వారం వరకూ పొడిగించే వీలుంది. పరీక్షలకు కొంత సమయం అవసరం గతేడాదితో పోలిస్తే ఈసారి టెన్త్ విద్యార్థుల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. కాకపోతే స్కూళ్లు ఆలస్యంగా మొదలవడం, సెలవులు పొడిగింపు వల్ల సిలబస్ అనుకున్నమేర పూర్తి కాలేదు. ఇకపై రెగ్యులర్‌గా స్కూళ్లు నడిస్తే ఇది పెద్ద సమస్యేమీ కాదు. కాకపోతే పరీక్షలకు విద్యార్థులకు కొంత సమయం అవసరం. – పి.రాజభాను చంద్రప్రకాశ్ (హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు) -
AP: ఇంటి దగ్గరే ‘ప్రాక్టికల్స్’
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్ ప్రయోగాల (ప్రాక్టికల్స్)లోనూ మార్పులు చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్‌లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది. ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటినుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాక్డౌన్ కారణంగా ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఓల్యాబ్స్టో’ ద్వారా సీబీఎస్ఈ కరిక్యులమ్‌ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మాన్యువల్ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అందుబాటులో ఉండే వనరులతోనే ప్రయోగాలు విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్ దీక్షా పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్‌ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్ఈలో ప్లస్ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది. -
పెళ్లి పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి..
చెన్నై: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పదో తరగతి విద్యార్థిని పెళ్లి చేసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు గత సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వార్దిదరు తమ ఇంట్లో నుంచి పారిపోయి మనప్పరైలోని ఓ దేవాలయంలో ఆగస్టు 15న వివాహం చేసుకున్నారు. అనంతరం వాళ్లు మధురైలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల అదే పాఠశాలలో మరో 16 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక మైనర్ కావడంతో ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..? -
పట్టు వదలక.. పది పరీక్షకు హాజరైన మాజీ సీఎం
చండీగఢ్: చదువుకోవడానికి వయసుతో పని లేదని నిరూపిస్తూ 86 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశాడు. అలా రాసింది ఎవరో కాదు ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్మెంట్ కేసులో 2013లో ఆయనకు 10ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. చౌతాలా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు కూడా రాశారు. అయితే అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు. ఆ తర్వాత హర్యానా ఓపెన్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు రాగా చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న ఆయన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని తెలిపింది. దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... తాను ప్రస్తుతం విద్యార్థినని, రాజకీయాలకు సంబంధించినవి మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, చౌతాలా ఓ సహాయకుడిని పెట్టుకోవడానికి బోర్డును అభ్యర్థించి అనుమతి పొందీ పరీక్ష పూర్తి చేశారు. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4 శాతం మార్కులు సాధించారాయన. -
ఏపీ: టెన్త్ మార్కుల మెమోలు విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి ఫలితాలు, మార్కుల మెమోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. ఏ విద్యార్థికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్లతో పాటు 2019-20 గ్రేడ్లు కూడా ప్రకటించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి : https://www.sakshieducation.com/Results2021/Andhra-Pradesh/SSC/2021/ap-ssc-10th-class-results-2021.html కాగా, గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరించారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇచ్చారు. -
After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్!
కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైన దశ. అందుకే టెన్త్ను ‘టర్నింగ్ పాయింట్’ అంటారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థికి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందా.. సైన్స్‌లో మంచి మార్కులు వచ్చాయా.. అతని స్కిల్ సెట్ ఏంటి అనే దానిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా ఏ కోర్సులో చేరాలో, ఏ కెరీర్ ఎంచుకోవాలో సలహా ఇస్తుంటారు. పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు/ ఇంటర్మీడియట్లో చేరే గ్రూప్.. భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ మార్గాలపై ప్రత్యేక కథనం.. ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవాలని; ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. కొందరు డాక్టర్, మరికొందరు ఇంజనీర్, ఇంకొందరు లాయర్.. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్.. ఇలా ఎన్నో కలలు కంటారు. ఈ కలలు సాకారం అవ్వాలంటే.. లక్ష్య సాధనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం! ఆ టర్నింగ్ పాయింటే.. పదో తరగతి!! పదో తరగతి తర్వాత విద్యార్థుల ముందు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఐటీఐ కోర్సులు కనిపిస్తాయి. వీటిలో ఒక కోర్సు ఎక్కువ.. మరో కోర్సు తక్కువ కాదు. అన్నింటికీ చక్కటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే, విద్యార్థి తన భవిష్యత్ లక్ష్యం ఏమిటి.. ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకొని.. దాన్ని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నాలుగు గ్రూపులు ► పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే మార్గం.. ఇంటర్మీడియట్. వారివారి ఆసక్తులకు అనుగుణంగా గ్రూపులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. ► ఎంపీసీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు చేరుతుంటారు. వీరు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్‌లు రాసి ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్లో బీటెక్/బీఈలో ప్రవేశం పొందొచ్చు. ఇక ఏపీ/టీఎస్ ఎంసెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో చేరవచ్చు. ► బైపీసీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే.. ఈ గ్రూప్ చదివినవారు ‘నీట్’ ఎంట్రన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్,ఫార్మసీ, ఫిజియోథెరఫీ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ► సీఈసీ/ఎంఈసీ: కామర్స్ అంటే ఇష్టపడేవారు; చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు ఈ గ్రూపులు ఎంచుకుంటారు. ఇందులో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ► హెచ్ఈసీ: టీచింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారు, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చేయాలనుకునేవారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాయాలనుకునే వారు ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్ ఎంచుకుంటారు. ఇంటర్లో ఈ నాలుగు గ్రూపులతోపాటు రెండేళ్లు, ఏడాదిన్నర కాలవ్యవధి గల పలు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకేషన ల్ కోర్సులు పదో తరగతి తర్వాత సంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సులే కాకుండా.. సత్వర ఉపాధికి అవకాశం కల్పించే ఒకేషనల్ కోర్సుల్లో కూడా చేరొచ్చు. ► అగ్రికల్చర్ విభాగం: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డెయిరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్ కోర్సులు. ► బిజినెస్ అండ్ కామర్స్ విభాగం: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్. ► ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ. ► హోమ్‌సైన్స్ విభాగం: కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్. ► వీటితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా సంబంధిత పాలిటెక్నికల్ కోర్సు రెండో ఏడాదిలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉపాధికి భరోసా–ఐటీఐ ► ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్(ఐటీఐ).. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి అందుబాటులో ఉన్న కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా» టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్(మెకానికల్) ఇంజనీరింగ్ » డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్ (సివిల్) ఇంజనీరింగ్ » పంప్ ఆపరేటర్ » ఫిట్టర్ ఇంజనీరింగ్ » మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్ » టర్నర్ ఇంజనీరింగ్ » మ్యానుఫ్యాక్చరర్ ఫుట్‌వేర్ ఇంజనీరింగ్ » రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్ » మెషినిస్ట్ ఇంజనీరింగ్ » హెయిర్ అండ్ స్కిన్ కేర్ » ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ » సర్వేయర్ ఇంజనీరింగ్ » షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు ► పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. పాలిటెక్నికల్. ఈ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదం చేస్తాయి. మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు పూర్తికాగానే కంపెనీల్లో సూపర్వైజర్ స్థాయి కొలువులు దక్కించుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి ఉంటే.. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు. ► పాలిసెట్‌తో ప్రవేశాలు: తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ పాలిసెట్/ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. ► పాలిటెక్నిక్ కోర్సులివే: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డెయిరీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, గ్లాస్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్ అండ్ డిజైన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్, డిప్లొమా ఇన్ హోమ్‌సైన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ తదితర పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
గుడ్‌న్యూస్: పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్
సాక్షి, ఎడ్యుకేషన్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం...స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ మొదలైనవి www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sakshieducation.com/TCLASS/Index.html -
ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: వారసత్వంగా తన తండ్రికి చెందాల్సిన ఆస్తిని..ఇవ్వడం లేదన్న మనస్తాపంతో టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కొడంగల్ పట్టణానికి చెందిన కాంసన్‌పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్‌పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్‌లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం! -
ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులపై ఇంటర్మీడియట్ విద్యా శాఖ దృష్టి సారించింది. అనేకమంది ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి నేర్చుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కోడింగ్ తదితర పది కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీటిని షార్ట్ టర్మ్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పలు వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. అవి కాకుండా 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్ టర్మ్ కోర్సులుగా వీటిని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కోడింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులను ప్రవేశ పెట్టనుంది. జేఎన్టీయూ నేతృత్వంలో ఇండస్ట్రీ, సబ్జెక్టు నిపుణలతో వీటికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కోర్సుల కాల వ్యవధిని నిర్ణయించనుంది. ఈ కోర్సుల్లో 40 శాతం విద్య బోధన రూపంలో ఉండనుండగా, 60 శాతం ప్రాక్టికల్ రూపంలోనే విద్యను అందించనుంది. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పైగా ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఇచ్చే సర్టిఫికెట్‌కు విలువ ఎక్కువగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోర్సులుగా వాటిని ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి వచ్చే స్పందనను బట్టి పూర్తి స్థాయి వృత్తి విద్యా కోర్సులుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
నా చావుకు కారణం.. రమేశ్ సార్!
కుల్కచర్ల: ఉపాధ్యాయుడు మందలించాడన్న కారణంతో ఓ పదో తరగతి విద్యార్థి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలెపల్లి పెంటయ్య కుమారుడు హరికృష్ణ(15) సాల్వీడ్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో 2న హరికృష్ణ పాఠశాలకు వెళ్లాడు. క్లాస్ టీచర్ రమేశ్ విద్యార్థులంతా అంగీకారపత్రాలు తీసుకురావాలని సూచించారు. గతంలో హరికృష్ణ పాఠశాలకు సక్రమంగా వెళ్లేవాడు కాదని, ప్రస్తుతం పదో తరగతి కావడంతో క్రమం తప్పకుండా స్కూలుకు రావాలని ఉపాధ్యాయులు మందలించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరికృష్ణ దూలానికి ఉరి వేసుకుని మృతి చెందాడు. కొద్దిసేపటికి కుటుంబీకులు వచ్చిచూడగా ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘నా చావుకు కారణం రమేశ్ సార్.. రమేశ్ సార్ నన్ను పాఠశాలకు రావొద్దని బెదిరించాడు. ఇంటి వద్దే ఉండి టీవీలో పాఠాలు విని పరీక్షలు రాయాలి.. స్కూల్‌కు వస్తే కొడతాను. ఇంటి వద్ద ఉంటే స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతున్నారు.. నా చావుకు రమేశ్ సార్ కారణం’అని సూసైడ్ నోట్లో విద్యార్థి హరికృష్ణ రాశాడు. తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. వివరాలు సేకరించిన డీఈఓ విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి హరికృష్ణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
టెన్త్ చదివి.. డాక్టర్‌నంటూ వైద్యం
నరసాపురం: పదో తరగతి చదివి కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సునంద శనివారం తనిఖీ చేశారు. డాక్టర్ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్ (35)ను సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని కోరారు. తనకు పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా లేదని, పదో తరగతి వరకు చదివానని సతీష్ చెప్పడంతో వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి అక్కడ ఉన్న హైపవర్ యాంటీ బయోటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న అక్రమ వైద్యం చేస్తున్న పీఎంపీ, ఆర్ఎంపీలు కొందరు తమ వైద్యశాలలు మూసేసి పరారయ్యారు. -
టెన్త్‌కు రెగ్యులర్ తరగతులు!
సాక్షి, అమరావతి: కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌పై ప్రతిపాదనలు అందించనున్నారు. రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు. -
టెన్త్ తర్వాత ఎలా?
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులు (ఆల్‌పాస్) అయినట్లు విద్యాశాఖ ప్రకటించగా తదుపరి చదువులకు సంబంధించి ప్రవేశాలపై కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పబ్లిక్ పరీక్షలు జరగనందున విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు పరిగణించి గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు జారీ చేశారు. దీంతో వీరికి పై కోర్సుల్లో మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం పెద్ద సమస్యగా మారింది. గ్రేడ్లు లేనందున మెరిట్ నిర్ణయించడం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా రాజీవ్‌గాంధీ యూని వర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐ ఐటీలతో పాటు ఇంటర్మీడియెట్ జూనియర్ కాలేజీలలో ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయిం చాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతోంది. ప్రవేశ పరీక్షలు సాధ్యమేనా..?.. ► టెన్త్ తరువాత ఇంటర్, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు చేరుతుంటారు. ఈసారి గ్రేడ్లు లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటిస్తూ జీవో జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ట్రిపుల్ ఐటీలు, ఇతర కోర్సుల్లో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్షలు లాంటివి నిర్వహించుకోవచ్చని సూచించినా ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అరకొర సిబ్బందితో పరీక్షలు ఎలా? ► టెన్త్‌లో 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పెద్ద ఎత్తున సిబ్బంది ఉన్న పాఠశాల విద్యాశాఖకే పబ్లిక్ పరీక్షల నిర్వహణ సాధ్యం కానప్పుడు కేవలం నాలుగే విభాగాలున్న ( ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రీపుల్ ఐటీలు) తాము అంతమందికి ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహించగలుగుతామని ట్రిపుల్ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ► గ్రామీణ పేద విద్యార్థులను దష్టిలో పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను మెరిట్ ఆధారంగా రిజర్వేషన్లను అనుసరించి మండలాల వారీగా గ్రామీణ పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలంటే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ అవసరం. అంతర్గత మార్కులతో మరో సమస్య.. ► 8, 9, 10వ తరగతుల్లో అంతర్గత పరీక్షలు, ప్రాజెక్టువర్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి మెరిట్‌ను పరిశీలించి ప్రవేశాలు కల్పించాలని ఆర్జీయూకేటీ భావించింది. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఆర్జీయూకేటీ ప్రవేశాల విషయంలో ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. విద్యార్థుల మెరిట్‌ను నిర్ణయించేలా ప్రవేశ పరీక్ష నిర్వహించడం ఇందులో ప్రధానమైనది. ఇంటర్‌కు మెరిట్ సమస్య... ► ఇంటర్మీడియెట్ కాలేజీలు, ఇతర రెసిడెన్సియల్ కాలేజీల్లోనూ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. అన్ని కాలేజీలలో సీట్ల కేటాయింపును పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆన్లైన్లో కేటాయించేలా బోర్డు చర్యలు చేపట్టింది. అయితే టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు లేకపోవడంతో మెరిట్ నిర్ధారణ సమస్యగా మారింది. ఈ ¯నేపథ్యంలో కాలేజీల వారీగా విద్యార్థులు ఆప్షన్లు ఇస్తే కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా సీట్లు కేటాయింపు చేయాలన్న యోచనలో ఉన్నట్లు బోర్డువర్గాలు వివరించాయి. ► కొన్ని రెసిడెన్షియల్ కాలేజీలు లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు చేయాలన్న అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ర్యాండమ్‌గా కానీ, లాటరీ విధానంలో కానీ సీట్లు కేటాయింపు చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యావేత్తలనుంచి వ్యక్తమవుతోంది. ’మా అబ్బాయి ప్రభుత్వ స్కూళ్లో చదివి పదో తరగతి పాస్ సర్టిఫికెట్ పొందాడు. టెన్త్ మార్కులు, గ్రేడ్లు లేకపోవడం వల్ల నవోదయ విద్యా సంస్థలో ఆన్లైన్లో చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.చివరకు హాల్‌టిక్కెట్ నెంబర్‌తో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ట్రిపుల్ ఐటీకి కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ మెరిట్లో ఉండే మా అబ్బాయికి సీటు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నాం’ – గంటా మోహన్, మదనపల్లె, చిత్తూరు జిల్లా ’మాది అనంతపురం జిల్లాలోని ఓడీ చెరువు మండలం ఈ. గొల్లపల్లి గ్రామం. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదివి ముందు వరుసలో ఉండే మా అబ్బాయిని ఇడుపులపాయలోని ఐఐఐటీలో చేర్చాలని కోరుకుంటున్నాం. గతంలో మార్కుల ఆధారంగా సీట్లు దక్కేవి. ఇప్పుడు ప్రవేశాలు ఎలా కల్పిస్తారో తెలియడం లేదు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఎలా పంపగలం?’ – రమీజా, ఈ. గొల్లపల్లి, ఓడీసీ మండలం, అనంతపురం జిల్లా. ‘ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పదో తరగతి చదివా. కష్టపడి చదివినా ఇతరులతో సమానంగా ప్రకటించారు. గ్రేడింగ్ ఇవ్వకపోవడం వల్ల సీట్లను ఎలా భర్తీ చేస్తారో అని ఆందోళనగా ఉంది. గత ఏడాదిలో జరిగిన పరీక్షల మార్కుల ఆధారంగా భర్తీచేయాలి’ – బెహరా గుణకర్పాత్రో, పదోతరగతి, వైఎస్ఆర్నగర్, విజయనగరం. ‘గ్రేడింగ్, మార్కులు లేకుండా పదో తరగతి ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం వల్ల మంచి కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కోల్పోతున్నా. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో గ్రేడింగ్ ప్రమాణాలకు అర్హత సాధించలేకపోతున్నాం. ట్రిబుల్ ఐటీ కళాశాలల సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా పదో తరగతి మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలి’ – పిల్లా పృథ్వీరాజ్, పదో తరగతి, బీసీకాలనీ, విజయనగరం. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలపైనా ఆందోళన... ► కేంద్ర విద్యా సంస్థలైన నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటు సీబీఎస్ఈ పరిధిలో 10+2 అమలు చేస్తున్న విద్యాసంస్థల్లో ఇంటర్ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ► మార్కులు, గ్రేడ్లు అప్లోడ్ చేయాలని తొలుత సూచించిన నవోదయ ఆ తరువాత ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు టెన్త్ హాల్‌టిక్కెట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలన్న ఆప్షన్ ఇచ్చింది. వెబ్సైట్లో మెరిట్ ప్రాతిపదికన కేటాయింపు అని పేర్కొని దరఖాస్తు ప్రింటవుట్‌లో మాత్రం ఎంట్రన్స్ టెస్టు ద్వారా కేటాయింపు అని ఉండటంతో అయోమయం నెలకొంది. గ్రామీణ విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రవేశాలు.. ’ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం మెరిట్ ప్రాతిపదికన గ్రామీణ విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా మండలాల వారీగా సీట్ల కేటాయింపు చేయాలి. లేదంటే గ్రామీణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. పాఠశాలల్లో విద్యార్థుల అంతర్గత మార్కులను పరిశీలించాం. అవి సరిగా లేనందున వాటి ఆధారంగా కేటాయిస్తే ట్రిపుల్ ఐటీల ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటుంది. విద్యార్థులకు ఓఎమ్మార్ షీట్లతో ప్రవేశ పరీక్ష నిర్వహించడం తదితర సూచనలతో ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ట్రిపుల్ ఐటీల్లోప్రవేశాలపై ముందుకు వెళతాం’ – ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ఆర్జీయూకేటీ చాన్సలర్ -
హైస్కూళ్లలో ఇక ఇంటర్ విద్య
కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి చదివిన చోటే ఇంటర్మీడియెట్‌ను పూర్తి చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత తమ పిల్లలను ఏ కళాశాలలో చేర్పించాలన్నది తల్లిదండ్రులకు పెద్ద సమస్య. ‘ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తుందా.. వచ్చినా ఎంత దూరం వెళ్లి చదువుకోవాలి.. ఒత్తిడి విద్య, ఫీజుల భారం’ లాంటి కారణాలతో చదువును ఆపేసి.. ఇంటికే పరిమితమైపోవడం వంటి వాటకి చెక్ పడనుంది. మండలాలు దాటే పరిస్థితికి చెక్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ కోసం మండలాలు దాటాల్సిన అవసరం లేదు. మండల కేంద్రంలోని హైస్కూల్లోనే ఇంటర్మీడియెట్ విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా మంది ఇంటర్మీడియెట్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. కాలేజీ దూరాభారం వల్లే సమస్య తలెత్తుతోందని దాదాపు అందరూ అంగీకరించినట్లు తెలిసింది. పదో తరగతి తర్వాత ముఖ్యంగా ఎక్కవ మంది బాలికలు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌గా మారుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా పై చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక విద్యకు దూరమౌతున్నారు. ఇక హైస్కూల్స్‌లో ఇంటర్ విద్యను ప్రవేశ పెడితే బాలికల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతికి చెందిన వారు విద్యావంతులుగా మారే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 32 హైస్కూల్స్‌ను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీటిలో చదివే వారంతా ఇక ఇంటర్ విద్యను కొనసాగించనున్నారు. జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలలు జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ, 20 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 10 మోడల్ స్కూల్స్, 10 సోసియల్ వేల్ఫేర్, 10 కేజీబీవీలల్లో జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది నుంచి మరో 19 కే జీబీవీల్లో ఇంటర్ విద్యను అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఏడాది నుంచి కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్ తరగతులు బోధించడం వల్ల గ్రామీణ ప్రాంతానికి చెందిన అనేక మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంది. జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే.. జిల్లాలోని బి కోడూరు, బ్రహ్మంగారిమఠం, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, చిన్నమండెం, చిట్వేలి, దువ్వూరు, గాలివీడు, కమలాపురం, కాశినాయన, ఖాజీపేట, కొండాపురం, లింగాలలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే ముద్దనూరులో రెండు, మైలవరం, నందలూరు, ఓబులవారిపల్లె, పెద్దముడియం, పెనగలూరు, పెండ్లిమర్రి, రాజుపాళెం, సిద్దవటం, సింహాద్రిపురంలో రెండు, తొండూరులో రెండు, వల్లూరు, వీరపునాయునిల్లె, వేంపల్లిలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
తెరుచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు
పాల్వంచ రూరల్: కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన సంక్షేమ వసతి గృహాలు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. మార్చిలో వాయిదా పడిన ‘పది’ పరీక్షలు తిరిగి ఈనెల 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మొత్తం 66 హాస్టళ్లను సోమవారం పునః ప్రారంభించారు. రేపటి(గురువారం) నుంచి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతిస్తారు. గతంలో హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాయడం క్షేమం కాదని, భోజన సౌకర్యం లేకుంటే ఇబ్బంది పడతారని భావించిన ప్రభుత్వం.. హాస్టళ్లను తెరవాలని నిర్ణయించింది. పరీక్షలకు 3,298 మంది హాస్టళ్ల విద్యార్థులు.. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 39 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 23 బాలుర, 16 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే బాలురు 1,253 మంది కాగా, బాలికలు 1,630 మంది ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు బాలురకు 11 ఉండగా 180 మంది, 5 బాలికల హాస్టళ్లలో 55 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లుబాలికలకు 4, బాలురకు 7 ఉన్నాయి. వీటిలో 93 మంది బాలురు, 87 మంది బాలికలు పదో తరగతి చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 66 హాస్టళ్లకు 3,298 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గదికి నలుగురే.. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులంతా హాస్టళ్లలోనే నివాసం ఉండాలి. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదిలో నలు గురు విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. హాస్టళ్లకు వచ్చే ముందే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అందరికీ మాస్క్‌లు అందజేస్తారు. భౌతికదూ రం పాటించేలా వార్డెన్లు అవగాహన కల్పిస్తారు. పరీక్ష రాసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్ ఏర్పాటు చేస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్ తెలిపారు. ప్రతిరోజూ ఆల్పాహారంగా ఇడ్లీ, లేదా కిచిడీ పెడతామన్నారు. ఉదయం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, రాగి జావ అందిస్తామని, బుధ, ఆది వారాల్లో చికెన్‌తో భోజనం, ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి ఆరు రోజులు ఆరటిపండు, శనివారం స్వీట్ అందజేస్తామని వివరించారు. విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు భోజనంతో పాటు బూస్ట్ పాలు, బిస్కెట్లు అందించనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ పీఎంఓ రమణయ్య తెలిపారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీ సంక్షేమాధికారి సురేందర్ తెలిపారు. -
‘పదో తరగతి విద్యార్ధులు సిద్ధంగా ఉండాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9.50 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల వ్యాల్యుయేషన్ ప్రక్రియ మొదలైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యాయి. విద్యా సంవత్సరాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. 33 సెంటర్లలో మే 12వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. (కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..) ఇక వాల్యుయేషన్ ప్రక్రియలో అన్ని జాగ్రత్తులు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తామని అమె తెలిపారు. 856 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఒక పరీక్ష మిగిలిపోయిందని, ఆ పరీక్షను 18వ తేదీన నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పదో తరగతికి సంబంధించిన 8 పరీక్షల నిర్వహణ కోసం కోర్టు అనుమతి తప్పనిసరి అని, అందుకు కోర్టుకు అఫిడవిడ్ దాఖలు చేస్తామని ఆమె తెలిపారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. (‘కాంగ్రెస్ నేతలు నిజంగా జోకర్లు, బ్రోకర్లు’) -
కోవిడ్-19 : దేశవ్యాప్తంగా టెన్త్ పరీక్షలు లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తితో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇక సీఏఏ అల్లర్లతో అట్టుడుకిన తూర్పు ఢిల్లీలో మాత్రం వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. చదవండి : కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం 📢Attention class X students! No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi. An adequate time of 10 days will be given to all students for the preparation of exams.#EducationMinisterGoesLive pic.twitter.com/x4QJAInvtT — Ministry of HRD (@HRDMinistry) May 5, 2020 -
పదోతరగతి విద్యార్థిని చున్నీతో..
ముషీరాబాద్: శిక్షపడితే జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాంనగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన ఎస్.మహేంద్ర(20) వాటర్‌క్యాన్ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. గత ఏడాది కృష్ణానగర్ బస్తీకి చెందిన ఓ అమ్మాయి తనను వేధిస్తున్నాడని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ట్రయల్ వచ్చే నెల ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానుంది. కేసు నిరూపణ అయితే 7 నుంచి 14 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని ప్రచారం కావడంతో ఆందోళన చెందిన మహేంద్ర శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు బస్తీ అధ్యక్షుడు కాదాసి నర్సింగ్‌రావు తెలిపారు. కేపీహెచ్‌బీకాలనీ: పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌పటేల్ నగర్‌కు చెందిన కావూరి శ్రీనివాస్ కూతురు మెహర్ గాయత్రి దేవి (14) పదోతరగతి చదువుతోంది. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తన కుమార్తె బెడ్రూంలోంచి బయటకు రాకపోవటంతో తలుపులను బలవంతంగా తెరిచి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
క్లాస్మేట్స్.. స్నేహ హస్తాలు
లక్ష్మిస్ నాయక్ పదహారేళ్ల కుర్రాడు. బెంగళూరు, రాజాజీ నగర్‌లోని ఈస్ట్–వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లోపదవ తరగతి చదువుతున్నాడు.ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లక్ష్మిస్ నాయక్ మాత్రంఆ స్కూల్‌కి ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే... పదేళ్లుగా ఒక అందమైన దృశ్యానికి ఆ స్కూల్ ప్రత్యక్షసాక్షిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతోపాటే మనసును తాకే ఆ దృశ్యం కూడా కనుమరుగు కాబోతోంది. ఒక స్నేహబృందం చెల్లాచెదురు అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత పిల్లలు ఎవరికి ఇష్టమైన కోర్సుల్లో వాళ్లు చేరతారు. లక్ష్మిస్ నాయక్ స్నేహబృందంలోని కుర్రాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్‌లో చేరిపోతారు’’ అంటూ.. ఆ స్కూలుకే ప్రత్యేకమైన లక్ష్మిస్ నాయక్ గురించి స్కూల్ టీచర్ గ్రేస్ సీతారామన్ తెలిపారు. అంతా టెన్త్‌కి వచ్చేశారు లక్ష్మిస్ నాయక్‌ను ఇప్పటివరకు స్నేహితుల హస్తాలే నడిపించాయి. నాయక్ ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. తనకై తాను నడవలేడు. మొదట్లో వాళ్ల అమ్మానాన్న రోజూ స్కూల్లో దించేవాళ్లు. ఆ తర్వాత నాయక్ స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. అందరూ చిన్న పిల్లలే. కానీ అందరిదీ పెద్ద మనసు. ఏడెనిమిది మంది పిల్లలు రోజూ నాయక్‌ను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళ్తారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి స్కూలు ఆవరణంతా తిప్పుతారు. చేతులతో ఎత్తి పై అంతస్థులోని క్లాస్ రూమ్‌కు తీసుకెళ్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు వాళ్లంతా పదవ తరగతికి వచ్చారు. పరీక్షలైపోగానే విడిపోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పై అంతస్తులోని తరగతి గది నుంచి లక్ష్మిస్ నాయక్‌ను కిందికి తీసుకొస్తున్న స్నేహితుడు వాడిని వదిలేసి వెళ్లలేం ఓ రోజు ఓ టీచర్ ఆ పిల్లల్ని ‘‘రోజూ ఇలా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం కష్టంగా అనిపించడం లేదా’’ అని అడిగారు. అప్పుడు ఆ కుర్రాళ్లు చెప్పిన మాట ‘‘అందరం షేర్ చేసుకుంటాం. కాబట్టి బరువు అని కానీ, కష్టం అని కానీ అనిపించదు. వాడిని తీసుకెళ్లకుండా మేము ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా వాడే గుర్తుకు వస్తుంటాడు’’ అన్నాడు ఆ స్నేహబృందంలోని సిద్ధార్థ. మరో స్టూడెంట్ మయూర్ అయితే... ‘‘మేము వాడిని మోసుకు పోవడమే కనిపిస్తుంది. వాడు మాకు ఎన్ని సబ్జెక్టుల్లో సహాయం చేస్తాడో తెలుసా? క్లాస్‌లో మాకు అర్థం కాని సందేహాలను వాడు చక్కగా క్లియర్ చేస్తాడు. నాయక్ కామర్స్ చదవాలనుకుంటున్నాడు. నేను ఏదైనా డిప్లమో కోర్సులకు వెళ్లాలనుకుంటున్నాను. వేరే వేరే కాలేజీలకు వెళ్లక తప్పదు’’ అని ఆవేదన చెందాడు. ‘నాకూ దిగులేస్తోంది’ ‘‘నాయక్ ఫిజికల్లీ చాలెంజ్డ్ అని బయటి వాళ్లు అనుకోవాల్సిందే తప్ప మాకు అలా అనిపించదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మా అందరితోపాటు నాయక్ కూడా ఉంటాడు’’ అన్నారు కుర్రాళ్లందరూ ముక్తకంఠంతో. నాయక్ మాత్రం ‘‘ఇప్పటి వరకు నన్ను చేతుల్లో పెట్టుకుని చూసుకున్న నా స్నేహితులకు దూరం కావాల్సి వస్తోంది. ఒకరి సహాయం లేకుండా కృత్రిమ సాధనాల సహాయంతో నడవడానికి నేను సిద్ధమే. కానీ పదవ తరగతి పరీక్షల తర్వాత ఎదురయ్యే ఒంటరితనం ఇప్పటి నుంచే గుర్తుకొస్తోంది’’ అని దిగులుగా అంటున్నాడు.– మంజీర -
‘పది’ ఫెయిలైతే..మీదే బాధ్యత!
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి ఫలితాలు ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా సబ్జెక్టుల టీచర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ లెటర్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్టు టీచరే బాధ్యత వహించేలా వారి నుంచి లెటర్ తీసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ, ఉపాధ్యాయుల్లో బాధ్యత పెంచేందుకు..మెరుగైన ఫలితాలు సాధించడానికి ఒకింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే పూర్తయిన సిలబస్‌లను మరోసారి పునశ్ఛరణ చేయడంతో పాటు వీకెండ్ పరీక్షలతో విద్యార్థులను సన్నద్ధులను చేస్తున్నారు. చదువుకునే విద్యార్థులపైనే కాదు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులపైనా ఒత్తిడి పెంచుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో మొత్తం 75 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలోమొత్తం 49 వేల మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 40 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, వీరిలో పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జిల్లా వెనకబడుతూ వస్తుంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని భావించిన జిల్లా విద్యాశాఖ ఆ మేరకు ఉపాధ్యాయుల పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తుంది. అధ్యాపకులపై అనధికారిక ఆంక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్‌పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేక పోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్‌ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. గత ఏడాది ఫలితాలు కొంత మెరుగుపడినప్పటికీ...ర్యాంకుల సాధనలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ 31వ స్థానంలో నిలిచింది. 20 పాఠశాలల్లో 40 శాతం లోపే ఫలితాలు వచ్చాయి. కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే 10/10 జీపీఏ సాధించారు. ఏ రకంగా చూసిన హైదరాబాద్ జిల్లా ఫలితాలు నిరాశజనకంగా మారాయి. ఈ పరిస్థితి నుంచి జిల్లాను గట్టెక్కించాలనే విద్యాశాఖ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతుంది. ఉత్తీర్ణతలో వెనుకబడిన పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నుంచి సబ్జెక్టుల వారిగా అండర్ టేకింగ్ లెటర్లను సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థి ఫెయిలైతే..సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంది. అయితే అండర్ టేకింగ్ లెటర్ల విషయంలో ఖచ్చితమైన నిబంధనలంటూ ఏమీ లేవని, మెరుగైన ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు, బాధ్యతలను గుర్తు చేసేందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కొంత కఠినంగా వ్యవహరిస్తున్నాం డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో అభ్యాస పరీక్షలు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. మరో గంట అదనంగా వారితో సాధన చేయిస్తున్నాం. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయుల పట్ల కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్రపుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్‌ఫోన్ వంటివాటిని దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. – బి.వెంకటనర్సమ్మ,జిల్లా విద్యాశాఖాధికారి, హైదరాబాద్ -
ఫిబ్రవరి 11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆర్జేడీఈలను, డీఈవోలను ఆదేశించింది. నిర్ణీత తేదీల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 24, 25 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏప్రిల్ 7 నుంచి 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలను (ఎస్ఏ–2) నిర్వహించాలని తెలిపింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఫలితాలను ప్రకటించి, విద్యార్థులకు జవాబు పత్రాలను అందజేయాలని, 20వ తేదీన పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించాలని సూచించింది. -
‘పది’కి సన్నద్ధం
సాక్షి, అమరావతి: అది విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ హాస్టల్. సమయం సాయంత్రం ఆరున్నర. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంతో హాస్టళ్లలో విద్యార్థులు పట్టుదలతో చదువుతున్నారు. నిశ్శబ్ద వాతావరణంలో పుస్తకాలలో లీనమైపోయారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్టడీ అవర్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు సరఫరా చేశారు. అలాగే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్, హిందీ, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపునకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థుల చదువుపై పర్యవేక్షణతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. హాస్టళ్లలో, స్కూళ్లలో ప్రత్యేక పాఠాలు.. హాస్టళ్లలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు చెప్పిస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు అభ్యసన సమయాలు కేటాయిస్తున్నారు. పిల్లలు ఎలా చదువు పరిశీలనకు డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు విజిట్స్ నిర్వహిస్తున్నారు. నిరంతరం స్లిప్ టెస్ట్‌లు పెడుతూ.. విద్యార్థుల మార్కుల ద్వారా వారి అభ్యసన తీరును పరిశీలిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. బృంద చర్చలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక స్కూలు ముగిసిన తరువాత ఒక గంటపాటు స్టడీ అవర్ కొనసాగిస్తున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 759 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 13,070 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం 1,066 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో వీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 8,071 మంది బాలురు, 4,999 మంది బాలికలు ఉన్నారు. తెలుగు మీడియంలో ఎక్కువ మంది చదువుతున్నారు. -
ట్యూషన్లో మృగాడు
హొసూరు: దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుండగా మరో వైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. విద్య కోసం తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ కన్నేసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కీచకున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈఘటన హొసూరు సమీపంలో నెల్లూరు వద్ద చోటు చేసుకుంది. నెల్లూరు వద్ద మీన అనే మహిళ హాస్టల్ నిర్వహిస్తోంది. ఇక్కడ ఏ నెల్లూరు గ్రామానికి చెందిన తిమ్మన్నగౌడ కొడుకు ఆనంద్ ట్యూషన్ చెబుతుండేవాడు. ఈక్రమంలో 10వ తరగతి చదివే బాలికపై ఆనంద్ కన్నేశాడు. బుధవారం ఆ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై అక్కడకు చేరుకొని ఆనంద్‌ను బంధించారు. అనంతరం హాస్టల్ నిర్వాహకురాలు మీనా హొసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొనిన ఆనంద్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
పది పాసైతే చాలు
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను ఇంటర్ నుంచి పదవ తరగతికి ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు కనీస విద్యార్హతగా మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పదవ తరగతిగా ఉంది. అప్పట్లో మొత్తం 1,92,964 మంది గ్రామ వలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1,83,290 మంది విధులలో చేరారు. మిగిలిన 9,674 పోస్టులను మైదాన, గిరిజన ప్రాంతం రెండింటిలోనూ పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయడానికి అనుమతి తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నవంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారమిచ్చి, వారికి 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. -
పదవ తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం
సాక్షి, మహబూబ్‌నగర్ : కొన్ని సంవత్సరాలుగా జిల్లా పదవ తరగతి ఫలితాల్లో 28వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది పక్కా ప్రణాళికను రచించి అందరి సహకారంతో జిల్లాను ముందంజలో నిలుపుదామని డీఈఓ ఉషారాణి కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా డీఈఓ ఉషారాణి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. టెన్త్ ఫలితాలపై శ్రద్ధ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుటుంన్నాం. మరీ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను ప్రిపరేషన్‌కు సిద్ధమయ్యేలా ఆదేశిస్తాం. సైన్స్, గణిత ఉపాధ్యాయులకు ఈనెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి సబ్జెక్టుపై అవగాహన పెంచుతాం. విద్యానైపుణ్యాలు పెంచేలా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివిధ సబ్జెక్టు పరంగా నైపుణ్యాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా త్రీఆర్స్ కార్యక్రమం గతంలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఏబీసీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 60 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. వివిధ సబ్జెక్టులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి అనేక రకాల అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. నాణ్యతగా మధాహ్న భోజనం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి నాణ్యమైన భోజనం అందిం చే విధంగా చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా మెనూ పాటించేలా మండల విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత, శుభ్రతను పాటించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థలు తీరుమార్చుకోవాలి జిల్లాలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న వివిధ ప్రైవేటు సంస్థల వివరాలను, గుర్తింపు లేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారుల నుంచి సేకరిస్తాం. పూర్తి ఫీజులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకోవాల్సి ఉం ది. ఇక గుర్తింపు లేని పాఠశాలలకు గుర్తింపు తీ సుకునే విధంగా నోటీసులు జారీ చేస్తాం. పూర్తి స్థాయిలో సిబ్బంది, వసతులు, అనుమతుల గు రించి సమీక్షిస్తాం. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. ఆ ఉపాధ్యాయులపై చర్యలు గతంలో పలువురు ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చిన విషయం గురించి తెలుసుకున్నాం. తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయి. -
ర్యాగింగ్ పేరుతో డబ్బులు వసూలు!
చైతన్యపురి: ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు డబ్బు వసూలు చేశారని మనస్తాపంతో ఓ టెన్త్ వి ద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యం గా వెలుగులోకి వచ్చి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు రవికిరణ్ కర్మన్‌ఘాట్‌లోని నియో రాయల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా డు. గత బుధవారం రవికిరణ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు హు టాహుటిన అతడిని సమీపంలోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స అం దించారు. ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత రవికిరణ్ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. పాఠశాలలో కొంద రు విద్యార్థులు ర్యాగింగ్ చేసి డబ్బులు తేవాలని బెదిరించడంతో రూ.6 వేలు తీసుకెళ్లి వారికి ఇచ్చినట్టు అందులో రవికిరణ్ రాశాడు. ఈ నేపథ్యంలో నే అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్టు భా వి స్తు న్నారు. కాగా, రవికిరణ్ వద్ద స్టేట్ మెంట్ తీసుకు న్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలి.. నియో రాయల్ పాఠశాలలో ర్యాగింగ్‌కు గురై టెన్త్ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం దుర దృష్టకరమని ఏపీ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యా సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ర్యాగింగ్‌కు పాల్పడకుండా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ర్యాగింగ్ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పుత్రికోత్సాహం
అనంతపురంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి విజయగర్వంతో అడుగులు వేస్తున్న కుమార్తెను చూసి ఓ తండ్రి ముసిముసినవ్వులు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ‘అనంత’ సత్తా చాటింది. 95.55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కాగా.. జిల్లాలో 2,971 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. గతేడాది 2,200 మందివిద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా.. ఈసారి 771 మంది పెరిగారు. బాలురు, బాలికల మధ్య పోటీ నెలకొన్నా బాలికలు స్వల్ప ఆధిక్యత సాధించారు. బాలురకంటే 0.85 శాతం ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్రంలోనూ మన జిల్లా గతేడాదికంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఒకస్థానం పైకి ఎగబాకి 7వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 95.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 0.32 శాతం తగ్గింది. మొత్తం 50,507 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 48,066 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 25,861 మంది బాలురకు గాను 24,504 మంది 94.75 శాతం ఉత్తీర్ణత సాధించగా, 24,646 మంది బాలికలకు గాను 23,562 మంది 95.6 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఎదురుచూపు ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారని రెండు రోజుల ముందే అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, స్కూళ్ల యాజమాన్యాలు ఉదయం నుంచే ఎదురు చూశారు. ఎట్టకేలకు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలు ప్రకటించగానే విద్యార్థులు, తల్లిదండ్రులు నెట్‌సెంటర్ల వద్ద, మొబైళ్లలో ఫలితాలు చూసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రైవేట్ స్కూళ్లలో 2,542 మంది 10/10 పాయింట్లు అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 2,971 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే 2,542 మంది ఉండడం విశేషం. అలాగే ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 19 మంది, బీసీ గురకుల పాఠశాలల్లో 16 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 31 మంది, కేజీబీవీల్లో 40 మంది, మునిసిపల్ పాఠశాలల్లో 63 మంది, మోడల్ స్కూళ్లలో 41 మంది, రెసిడెన్షియల్ స్కూళ్లలో 13 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 14 మంది, గిరిజన గురుకుల పాఠశాలల్లో ముగ్గురు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 189 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు. 508 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత మొత్తం 975 స్కూళ్ల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 508 మంది స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేట్ స్కూళ్లు 362కు గాను 263 స్కూళ్లు ఈ ఘనత సాధించాయి. జిల్లా పరిషత్ స్కూళ్లు 437కు గాను 157 వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ఎయిడెడ్ స్కూళ్లు 2, బీసీ గురుకుల పాఠశాలలు 6, ప్రభుత్వ పాఠశాలలు మూడు, కేజీబీవీలు 42, మున్సిపల్ పాఠశాలలు 8, మోడల్ స్కూళ్లు 15, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 2, సాంఘిక సంక్షేమ స్కూళ్లు 9, ఒక గిరిజన గురుకుల పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. కలిసొచ్చిన ఇంటర్నల్ మార్కులు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం కావడంతో విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 80 మార్కులకు మాత్రమే పరీక్ష రాశారు. తక్కిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు. అంటే ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులు, నోట్స్, ›ప్రాజెక్ట్ వర్క్, పుస్తక సమీక్ష ఆధారంగా ఆయా పాఠశాలల యాజమాన్యమే ఈ 20 మార్కులు వేసింది. ఈ విధానం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దాదాపు విద్యార్థులందరికీ 18–20 మార్కులు వేసినట్లు తెలుస్తోంది. 10/10 పాయింట్లు సాధించేందుకు ఇంటర్నల్ మార్కులు దోహదపడ్డాయి. జూన్ 6 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు జూన్ 6 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. అలాగే రీకౌంటింగ్ కోరే విద్యార్థులు రూ. 500, రీ వెరిఫికేషన్, జిరాక్స్ ప్రతులు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తులను ఈనెల 30లోపు హెచ్ఎంలకు అందజేయాలని డీఈఓ జనార్దనాచార్యులు వెల్లడించారు. ‘అనంత సంకల్పం’ కలిసొచ్చింది పదో తరగతి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు బాగా కష్టపడ్డారు. వారి కృషి, 40 రోజుల ‘అనంత సంకల్పం’ కార్యక్రమం అమలు బాగా కలిసొచ్చింది. కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఎవరూ కుంగిపోవద్దు. నైతిక స్థైర్యం కోల్పోవద్దు. మరో ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. – జనార్దనాచార్యులు, డీఈఓ -
సర్కార్ స్టూడెంట్స్ సూపర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మెరుగుపడింది. 2017–18 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 6,693 మంది పరీక్ష రాయగా 4,752 మంది (71.0శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2018–19 విద్యా సంవత్సరంలో 7,013 మంది పరీక్ష రాయగా 5,816 మంది (82.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2017–18లో ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 62,693 మంది పరీక్ష రాయగా 47,966 మంది (76.51శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక 2018–19లో 63,311 మంది పరీక్షకు హాజరు కాగా, 52,598 మంది(83.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇద్దరికి 10 జీపీఏ హైదరాబాద్ జిల్లా పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హై స్కూల్‌కు చెందిన టి.లక్ష్మి స్థితప్రజ్ఞ (రోల్నెంబర్ః1922168514), ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన మాదాసు శ్రావ్య (రోల్నెంబర్ః 1922172268)లు 10 జీపీఏ సాధించారు. మాదన్నపేట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థి ఎం.భరద్వాజ్ సహా మలక్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కుప్పల విష్ణువర్థన్‌తో పాటు ఉప్పునూతల అనిల్, కుల్సుపుర ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నిఖిల్ ఖడ్గేకర్, కాచిగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జి.సింధూజ, హైదర్‌గూడలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ విద్యార్థిని అంజలిగుప్తా, హిమాయత్‌నగర్‌లోని ప్రభుత్వ బీహెచ్ఎస్ స్కూలు విద్యార్థి ఎన్.అవినాశ్, హిల్‌స్ట్రీట్ ప్రభుత్వ బోయ్స్ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ పవన్‌కుమార్‌లు 9.8 జీపీఏ సాధించారు. మరో 21 మంది 9.7 జీపీఏ సాధించగా, 29 మంది 9.5 జీపీఏ, 36 మంది 9.3 జీపీఏ, 41 మంది 9.2 జీపీఏ, 71 మంది 9.0 జీపీఏ సాధించారు. అమీర్‌పేట్ ఫస్ట్..సికింద్రాబాద్ లాస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో మండలాల వారిగా ఫలితాల సరళిని పరిశీలిస్తే...అత్యధిక ఉత్తీర్ణత అమీర్‌పేట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రథమ స్థానంలో నిలువగా, సికింద్రాబాద్ మండల పరిధిలోని పాఠశాలలు చివరిస్థానంలో నిలిచాయి. జిల్లాలో మొత్తం 7013 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 5816 మంది ఉత్తీర్ణత సాధించారు. అమీర్‌పేట్ మండల పరిధిలో 186 మంది విద్యార్థులకు 165 మంది(88.71 శాతం), బహుదుర్పురాలో 764 మందికి 632 మంది(82.72 శాతం), బండ్లగూడలో 551 మందికి 468 మంది(84.94 శాతం), చార్మినార్‌లో 433 మందికి 327 మంది (75.52శాతం), గొల్కొండలో 1252 మందికి 930 మంది(74.28శాతం), హిమాయత్‌నగర్‌లో 456 మందికి 409 మంది(89.69 శాతం), ఖైరతాబాద్‌లో 1061 మందికి 906 మంది(85.39 శాతం), మారేడ్ పల్లిలో 661 మందికి 571 మంది (86.38శాతం), ముషీరాబాద్‌లో 320 మందికి 284 మంది(88.75శాతం), నాంపల్లిలో 419 మందికి 322 మంది 76.85 శాతం), సైదాబాద్‌లో 420 మందికి 376 మంది(89.52శాతం), సికింద్రాబాద్‌లో 490 మందికి 426 మంది ఉత్తీర్ణత సాధించారు మౌనిక పేరెంట్స్ హ్యాపీ బంజారాహిల్స్: పట్టుదల... ఏకాగ్రత.. క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం అన్ని కలగలిపితే ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి. మౌనిక అవుతుంది. ఒక స్వీపర్ కూతురు ఇంగ్లీష్‌మీడియంలో చదివి ఆ స్కూల్‌కే టాపర్‌గా నిలిచి వన్నె తీసుకొచ్చింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ పాఠశాలకు చెందిన మౌనిక 9.5 జీపీఏతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఫిలింనగర్‌లోని బద్దం బాల్‌రెడ్డి నగర్లో నివసించే మౌనిక తండ్రి శంకరయ్య దినసరి కూలీకాగా తల్లి హంసమ్మ బంజారాహిల్స్‌లో జీహెచ్ఎంసీ స్వీపర్‌గా పని చేస్తున్నది. కష్టపడి కూతురిని చదివించినందుకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. 100 % పాస్ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అంతా ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక గ్రేడింగ్ 9.2 నమోదైంది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో 24 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. 9.5 గ్రేడింగ్‌తో ఇంగ్లీష్ మీడియంకు చెందిన రాజేష్ అనే విద్యార్థి టాపర్‌గా నిలిచాడు. తెలుగు మీడియంలో 9.2 జీపీఏతో గోపి టాపర్‌గా నిలిచాడు. గతేడాది 86శాతం ఉత్తీర్ణులు కాగా ఈ సారి వందశాతం సాధించి రికార్డు సృష్టించారు. -
నో... హాలిడేస్ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘వేసవి సెలవుల్లో జూనియర్ కళాశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదు. మే నెలాఖరులో ఇంటర్లో ప్రవేశాలకు బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం’ ఇవి ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన నిబంధనల సారాంశం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే ఇంటర్æ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల హడావుడితో అలసినవిద్యార్థులు సేద తీరేదెన్నడు ? ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకూ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 93,932 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 59 వేల మంది హాజరయ్యారు. ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమై పరీక్షల హడావుడి, ఆందోళనతో అలసిపోయి సెలవులతో సేద తీరాల్సిన సమయంలో ఊపిరి తీసుకునే సమయం లేకుండా ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తో పాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు నగర శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులకు జూన్ నెలలో ప్రవేశాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు అకడమిక్ కేలండర్లో పొందుపర్చగా, కాలేజీల యాజమాన్యాలు ఇందుకు కొత్త భాష్యాన్ని చెబుతున్నాయి. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన దృష్ట్యా వేసవి సెలవులను ఎంజాయ్ చేయడం వల్ల విద్యార్థులు వెనుకబడి పోతారని తల్లిదండ్రులకు నమ్మబలికి, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రథమ సంవత్సర పరీక్షలు రాసినవిద్యార్థులకు సైతం... సీనియర్ ఇంటర్ విద్యార్థులను జేఈఈ–అడ్వాన్స్డ్, నీట్ శిక్షణ పేరుతో క్యాంపస్‌లలో పెట్టి రుద్దుతున్న కాలేజీల యాజమాన్యాలు ప్రథమ సంవత్సర విద్యార్థులను సైతం వదలడం లేదు. టెన్త్ విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం కళాశాలలు ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించాయి. దీనికి బ్రిడ్జి కోర్సు, ఐఐటీ కోచింగ్ అంటూ రకరకాల పేర్లు పెట్టారు. జిల్లాలో ఈ విధంగా టెన్త్ పూర్తి చేసిన, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు జరుగుతున్నా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇంటర్ తరగతులను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు ఇంటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆర్ఐవో జెడ్.ఎస్ రామచంద్రరావుకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సాంబశివపేటలోని ఆర్ఐవో కార్యాలయంలో రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకూ వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, గుంటూరు నగరంతో పాటు జిల్లా వివిధ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అడ్మిషన్లు ప్రారంభించి రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలకువిరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపైకఠిన చర్యలు చేపట్టని పక్షంలో ఎస్ఎఫ్ఐఆధ్వర్యంలో కళాశాలల వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఆర్ఐవోను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.కిరణ్, రాజేష్ తదితరులున్నారు. తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. మే నెలాఖరులో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు ఆటవిడుపు లేకుండా తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై దాడులు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు చేపడతాం.– జెడ్.ఎస్ రామచంద్రరావు,ఇంటర్‌బోర్డు ఆర్ఐవో -
ఫలితాలు రాకముందే ప్రవేశాలా?
కర్నూలు సిటీ: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కాకముందే మోడల్ స్కూళ్లలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. అలాగే మే రెండో వారంలో పది ఫలితాలు రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తులకు ఆఖరు ప్రకటించడం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఫలితాలు రాకముందే ఎలా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీని ఎలా ముగిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పది మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఆలస్యం కావడంతో ఈనెల 15వ తేదీనుంచి మొదలైంది. ఇలా పది రిజల్ట్ ప్రకటించక ముందే దరఖాస్తు తేదీని ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు గత నెల 31వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలను విడుదల చేశారు. 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఫలితాలు రాకముందే ఈనెల 15న షెడ్యుల్ జారీ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 7,8,9 తరగతుల ప్రవేశాలపై స్పష్టత కరువు.. జిల్లాలో ఉన్న 36 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు మొదట ప్రకటించిన ప్రకారం నేడు ఆఖరి రోజు. అయితే ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు జూన్‌లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెడితే బాగుంటుందని విన్నవించడంతో డీఈఓతో చర్చించి ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ ఇటీవల సూచించారు. ప్రవేశ పరీక్షను ముందు తరగతిలోని అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఐచ్ఛిక విధానంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు అయితే ఈ నెల 20న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆరోజు సమ్మెటివ్–2 పరీక్షలు ఉండడంతో 21వ తేదీ జరపాలని నిశ్చయించినా కుదరకపోవడంతోనే ప్రవేశ పరీక్ష ఏర్పాటుపై నేటికీ స్పష్టత రాలేదు. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. ఆన్లైన్లో దరఖాస్తూలు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీలు రూ.60, ఇతరులు అయితే రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 30వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో కానీ, మీ సేవ ద్వారా దరఖాస్తు పంపించాలి. మే 25న ఎంపిక జాబితా ప్రదర్శించి, 26వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ‘మోడల్’లో అందుబాటులో ఉండే కోర్సులివే.. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో విభాగానికి 20 సీట్ల చొప్పున ఒక ఆదర్శ పాఠశాలలో నాలుగు విభాగాలకు మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటి ప్రవేశాలకు విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. -
టెన్త్ సోషల్ నుంచి 5 చాప్టర్ల తొలగింపు
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్ఈ తెలిపింది. -
163 మంది టీచర్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు బాధ్యతారాహిత్యంగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది. అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం. -
స్కూల్ యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరుగనుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతుండగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర బంధువులు, స్నేహితులు వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పి.. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని హితబోధ చేస్తున్నారు. స్కూల్ యూనిఫాంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను లోనికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా సివిల్ డ్రెస్‌లో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు నిర్ధేశిత సమయం ముగిసిన తర్వాత ఐదు నిమిషాల లోపు 9.35 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లను నిరాకరించే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎలాంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
సామర్థ్యానికి పరీక్ష
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో స్టూడెంట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే(శ్లాస్) పరీక్షను నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్షలను జిల్లా కామన్ ఎగ్జామ్‌బోర్డు(డీసీఈబీ) పర్యవేక్షణలో మండల రీసోర్స పర్సన్లు పరీక్షలను నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోదన సంస్థ) సూచనల మేరకు రాష్ట్రస్థాయిలో ఉన్న స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్ష నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 238 పాఠశాలల ఎంపిక శ్లాస్ పరీక్ష నిర్వహణకు జిల్లాలోని 48 మండలాల్లోని 238 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 9వ తరగతికి 34 స్కూళ్లకు 930 మంది విద్యార్థులు, 6వ తరగతికి సంబంధించి 39 స్కూళ్లకు 1030 మంది, 4వ తరగతికి సంబంధించి 17 స్కూళ్లకుగాను 480 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 9వ తరగతి 26 స్కూళ్లకు 710 మంది, 6వ తరగతి సంబంధించి 26 స్కూళ్లకు 690 మంది, 4వ తరగతికి సంబంధించి 13 స్కూళ్లకు 280 మంది విద్యార్థులు ఉన్నారు. తెలుగు మీడియంకు సంబంధించి 9వ తరగతిలో 19 స్కూళ్లకు 520 మంది, 6వ తరగతిలో 31 స్కూళ్లకు 720 మంది, 4వ తరగతిలో 33 స్కూళ్లకు 560మంది ఉన్నారు. మొత్తం 5920 మంది విద్యార్థులపై ప్రయోగం చేయనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 122 మంది సీఆర్పీలను ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహణ ఇలా శ్లాస్ పరీక్షలు 4,6,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఇందులో 26న 9వ తరగతి విద్యార్థులకు, 27న 6వ తరగతి విద్యార్థులకు, 28న నాల్గో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించనున్నారు. ఇందులో ఉదయం తెలుగు లేదా ఇంగ్లిస్, మధ్యాహ్నం గణిత సబ్జెక్టు పరీక్షను నిర్వహిస్తారు. భవిషత్తు ప్రణాళిక కోసం గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ ఎరియాల్లో ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకు శాస్ల పరీక్ష నిర్వహిస్తున్నందున ఏ ప్రాంత విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారనేది తెలిసిపోతుంది. పరీక్ష అనంతరం నిపుణుల సూచనలతో ఎన్సీఈఆర్టీ వారికి నివేదిక అందజేయనున్నారు. పాఠ్యాంశాల్లో మార్పులు, చేర్పులు చేయాలా? లేక మరేదైనా కొత్త విధానాన్ని అమలు చేయాలా అనేదానిపై ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
ఇష్టారాజ్యానికి చెక్ పడేనా..?
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను ఇష్టమొచ్చినట్లు వేసుకునే కార్యక్రమానికి ఇక చెక్ పడే విధంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతేడాది పది ఫలితాల్లో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు అధికంగా పదికి పది గ్రేడ్లు వచ్చాయి. ఇంటర్నల్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా మార్కులను వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది కమిటీలను నియమించి ప్రైవేటు, కార్పొరేట్ దూకుడుకు కళ్లెం వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పదవ తరగతి ఇంటర్నల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుని, అత్యధికంగా పదికి పది గ్రేడ్స్ సాధిస్తున్నాయి. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో ఎక్కువ జీపీఏ వచ్చిన పాఠశాలలపై విచారణ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీంతో పాటు ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తారనే ప్రచారం జరిగినా విద్యాశాఖ ఈ ఏడాది కూడా ఇంటర్నల్ మార్కులను కొనసాగిస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిటీల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో కమిటీలు వేయడంతో తూతూ మంత్రంగా పనిచేశారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శలకు కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరిలోనే కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈనెల 9న విద్యాశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మూడు విభాగాలుగా కమిటీలు.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మండలం, డివి జన్, జిల్లాస్థాయిలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సమ్మెటివ్–1, ఫార్మెటివ్‌కు సంబంధించి 1,2,3,4 పరీక్షల మార్కులను కమిటీలు పరిశీలించనున్నాయి. మండలస్థాయి కమిటీలో ఎంఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, డివిజినల్ స్థాయి కమిటీ చైర్మన్లో డిప్యూటీ ఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారి, జిల్లాస్థాయి కమిటీలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల సహాయక కమీషనర్, డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. నివేదికలు ఇలా.. మండలస్థాయిలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వ రకు పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించి డివిజినల్ స్థాయికి కమిటీకి నివేదిక అం దించాలి. అయితే వీటిలో 80 శాతం ప్రైవేటు, అన్ ఎ యిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే డివిజినల్ స్థాయి కమిటీ ఫిబ్రవరి 5 నుంచి 13లోపు పరిశీలన పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటిటీ నివేదిక అం దించాలి. వారు 5 నుంచి 13లోపు మార్కులను పరిశీ లించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిక అందించాలి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించకుండానే పరిశీలన.. ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ఇంతవరకు పాఠశాలల్లో ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించలేదు. ఇది నిర్వహించకుండా మార్కుల పరిశీలన ఏవిధంగా జరుపుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఏ–1, పార్మెటివ్–1,2,3 పరీక్షలు మాత్రమే జరిగాయి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి 280 మార్కులకు 20 మార్కులుగా ఇంటర్నల్ మార్కులను వేయడం సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితిలో కమిటీలు ఇంటర్నల్ మార్కులను ఎలా తనిఖీ చేస్తారో తెలియాలి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహిస్తాం ఇప్పటి వరకు జరిగిన సమ్మెటివ్–1 ఫార్మెటివ్ 1,2,3 పరీక్షలకు సంబం ధించి మార్కులను కమిటీలు పరిశీలిస్తాయి. ఫార్మెటివ్– 4 పరీక్షను త్వరలో నిర్వహిస్తాం. పరీక్ష ముగియగానే అవసరమైతే ఆ మార్కులను కూడా పరిశీలిస్తారు. ఫార్మెటివ్–4 కాకుండా మిగతా వాటిని పరిశీలించగానే పరిస్థితి అర్థమవుతోంది. – జీవీ నారాయణరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ పారదర్శకంగా తనిఖీలు గతేడాది కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పదవ తగరతిలో ఇంటర్నల్ మార్కులను ఇస్టానుసారంగా వేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిటీలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 28లోపు కమిటీలను ఏర్పాటు చేసి పారదక్శంగా తనిఖీలు చేపడతాం. ఎవరికైనా వాస్తవ మార్కుల కంటే ఎక్కవ మార్కులు వేసినట్లు గురిస్తే చర్యలు తీసుకుంటాం.– పి. శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి. -
టెన్త్ ‘అంతర్గత’ మార్కులపై తనిఖీలు
పశ్చిమగోదావరి , నిడమర్రు: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదుపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వెళ్లనుంది. గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కులు 20కి 20కి వేసుకోవటంతో టెన్త్ జీపీఏలు వారికే ఎక్కువగా వచ్చాయనే అభియోగాల నేపథ్యంలో ఈ సంవత్సరం పాఠశాల విద్యాశాఖ ముందుగానే అప్రమత్తమైంది. సమ్మెటివ్–1 పరీక్షతో పాటు నాలుగు ఫార్మెటివ్ పరీక్షలు పాఠశాల స్థాయిలో జరుగుతాయి. వీటిల్లో విద్యార్థులకు మార్కులు ఎలా వేశారో ప్రత్యక్షంగా విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను పరిశీలన చేయనుంది. ఈ పరిశీలన పూర్తిగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్ హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు, ఎస్ఎస్ఏ సెక్టోరల్ అధికారులు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో సాగుతుంది. మొత్తం మూడు స్థాయిల్లో ఈ పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో కూడా ఏమైనా లోపాలు ఉంటే మరో కమిటీ గుర్తించి ఆ మేరకు అప్రమత్తం చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది 20 శాతం పరిశీలన జిల్లాలో ఈ ఏడాది 50,184 మంది ఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. వీరికి నిర్వహించిన సమ్మెటివ్–1 పరీక్షకు 10 మార్కులు, ఒక్కో ఫార్మెటివ్ పరీక్షకు రెండున్నర మార్కులు చొప్పున నాలుగు ఫార్మెటివ్లకు 10 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులను కుదించి నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఎలా పరీక్షలు రాశారు. వారి అభ్యసన సామర్థ్యాలు ప్రాజెక్టు వర్క్, మౌఖిక ఇంటర్వ్యూలు, స్లిప్ టెస్ట్‌లో మార్కులు, క్రమశిక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్ మార్కులు సంబం ధిత పాఠశాల ఉపాధ్యాయులే కేటాయిస్తారు. అయితే ఈ మార్కుల కేటాయింపులో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు చాలావరకు టెన్ జీపీఏలే ధ్యేయంగా చదివినా, చదవకున్నా, క్రమశిక్షణ లేమి ఉన్నా 20కు 20 వేసి ఉదారతను చాటుకుంటున్నాయని గతేడాది ఫలితాలు ఆధారంగా ఒక అంచనాకు విద్యాశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్గత మార్కుల నమోదు తనిఖీలకు వెళ్లటానికి జిల్లా విద్యాశాఖ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బృందాలు సంక్రాంతి సెలవుల అనంతరం కార్యాచరణకు దిగుతాయి. 20 శాతం పేపర్లు తనిఖీలకు వెళ్లిన ప్రతి చోటా మొత్తం విద్యార్థుల్లో 20శాతం మంది పేపర్లు తీసి ఈ బృందం సభ్యులు పరిశీలన చేస్తారు. ఈ పరిశీలనలో ఏమైనా తప్పిదాలు దొర్లినా మరో కమిటీ గుర్తిస్తుంది. నిజంగా విద్యార్థులకు రాసిన సమాధానాలు ఆధారంగా మార్కులు వేసి వాటినే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీఎస్ఈ) వెబ్సైట్లో మార్కులు నమోదు చేశారా లేక ఇక్కడ ఏమైనా హెచ్చుతగ్గులుగా నమోదు చేశారా అనేది కూడా వీరు పరిశీలిస్తారు. విద్యార్థుల సమాధాన పత్రాలపై నమోదు చేసిన మార్కులు, సీఎస్ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మార్కులు రెండూ ఒకేరకంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ కమిటీలు ధ్రువీకరించాలి. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా మార్కులు వేస్తే చర్యలు ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అక్రమంగా మార్కులు వేసినట్టు పరిశీలనతో బహిర్గతమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 13 వరకూ అన్నిస్థాయిల్లో అంతర్గత మార్కుల పరిశీలన బృందాల నివేదికను రాష్ట్ర అధికారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి కమిటీల్లో సభ్యులు వీరే.. ♦ మండల స్థాయి కమిటీల్లో ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఆ మండలంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులు సభ్యులు. ♦ డివిజన్ స్థాయిలో డీవైఈవో, మండలంలో సీనియర్ హెచ్ఎం, ఎస్ఎస్ఏ నుంచి సెక్టోరియల్ అధికారి. ♦ జిల్లాస్థాయిలో డీఈవో, అసిస్టెంట్ కమిషనర్(ఎగ్జామినేషన్), డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులు ♦ మండలస్థాయిలో ఈ నెల 28న ప్రారంభించి, పిబ్రవరి 4తో ముగించాలి. ♦ డివిజన్ స్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు ♦ జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు పరిశీలన చేయాలని కమిషనర్ షెడ్యూల్ జారీ చేశారు. -
ప్రణాళిక ఫలించేనా?
కర్నూలు సిటీ/ఆదోని అర్బన్: విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కీలకమైనవి. వీటిని గట్టెక్కేందుకు తీవ్రస్థాయిలో కష్టపడతారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యాశాఖ కూడా ఇందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ విద్యా సంవత్సరం ఆశించిన మేరకు ఫలితం వస్తుందా..లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, ఏపీ ఆదర్శ స్కూల్స్, కస్తూర్బా స్కూళ్లతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు 34,576 మంది, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన 17,885 మంది... మొత్తంగా 52,461 మంది విద్యార్థులు 2019 మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు మరో 79రోజులు మాత్రమే గడువు ఉంది. పది ఫలితాల్లో గత ఏడాది జిల్లా 96.12 శాతం ఉత్తీర్ణత సాధించి.. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఏడాది ఈ ప్రాంతంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇవీ అడ్డంకులు.. ♦ ఇప్పటికే బోధన ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక తరగతుల ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే పాఠ్యాంశాల బోధనే నత్తనడకన సాగుతోంది. ♦ భాషోపాధ్యాయులు డిమాండ్ల పరిష్కారం కోసం 20 రోజులు సమ్మెబాట పట్టారు. దీంతో విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల బోధన కరువైంది. ♦ కొన్ని పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు లేరు. దీనికి తోడు ప్రత్యేక తరగతుల శిక్షణ కానరావడం లేదు. ♦ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం చాలీచాలని పుస్తకాలు అందించింది. పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఒకరికి ఇస్తే ఇంకొరికి ఇవ్వలేదు. చాలా చోట్ల పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ చేయలేదు. ♦ వెనకబడిన విద్యార్థులకు పది పరీక్షలో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం కరదీపికలకు ఇస్తోంది. అయితే ప్రతి పాఠశాలకు ఒక పుస్తకాన్ని అందస్తోంది. ప్రతి విద్యార్థికి అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ♦ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని పాఠ్య పుస్తకాలు లేవు కొన్ని పాఠ్యపుస్తకాలు లేనందున చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను. కరదీపిక పుస్తకాలు కూడా ఇవ్వలేదు. పాఠశాలకు ఒకటే ఇచ్చారు. ఎలా చదువుకోవాలి. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. ఒత్తిడి పెరుగుతోంది. –రుచిత, పదో తరగతి విద్యార్థిని ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించి మెరుగైన బోధన ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా రానున్న ఎన్నికలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారే కాని విద్యార్థుల చదువుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు విద్యాశాఖ కూడా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో పూర్తిగా వెనకబడింది.–నాగరాజు, ఏబీవీపీ నాయకుడు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పదో తరగతిలో ఈ ఏడాది 100 శాతం ఫలితాలు సాధించడంకోసం 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను తయారు చేశాం. ప్రతి సబ్జెక్టులో కూడా విద్యార్థులకు సులువైన విధానంలో భోధన చేసేందుకు టీచర్లకు శిక్షణ ఇచ్చాం. ముందుగా ఈ ఏడాది స్టడీ మెటిరియల్‌ను విద్యార్థులకు అందజేశాం. కరువుతో వలస వెళ్లిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నాం. వచ్చే నెల 2వ తేదీ నుంచి రివిజన్ టెస్ట్‌లు మొదలు కానున్నాయి.–తాహెరా సుల్తానా, డీఈఓ -
ప్రత్యేక తరగతులేవీ?
ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల చదువుపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా నిర్వహించే ప్రత్యేక తరగతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలను ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేలిగ్గా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 241, మోడల్ స్కూళ్లు 9 ఉండగా.. వీటిలో సుమారు 16 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే టెన్త్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చేయడమే ప్రత్యేక తరగతుల ఉద్దేశం. అయితే, గతేడాది ఆగస్టులోనే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఈ ఏడాది జిల్లా విద్యాశాఖాధికారి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజూ టీచర్లు బోధించిన సబ్జెక్టు, అంశాలు, హాజరైన విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా రిజిస్ట్రర్ కూడా నిర్వహించాలి. ఈమేరకు జూలై నెలాఖరులో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి ఈమేరకు చెప్పినట్లు సమాచారం. అధికారికంగా ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. దీన్ని ఆయా హెచ్ఎంలు తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సింహభాగం పాఠశాలల్లో తూతూ మంత్రంగా తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒక్కపూటకే ప్రత్యేక తరగతులు పరిమితం అయ్యాయి. దీంతో పాటు రికార్డుల నిర్వహణను విస్మరించారు. తరగతుల నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇన్చార్జి ఎంఈఓలు ఉన్నా.. ఆ బాధ్యతలు వారికి అప్పగించ లేదని సమాచారం. దీంతో వారూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా దిక్సూచి లేని ప్రయాణంలా ప్రత్యేక తరగుతులు కొనసాగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్ 60 శాతమే.. ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి బోధన అరకొరగానే జరుగుతోంది. పలు అడ్డంకులు ఎదురవడంతో బోధన వెనుకబడింది. వేసవి సెలవుల అనంతరం జూన్ ఒకటిన పాఠశాలలు పునఃప్రారంభమవగా.. కొన్ని రోజుల పాటు టీచర్లు బడి బాట కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారు. అనంతరం అదే నెల 6న టీచర్ల బదిలీల ఉత్తర్వులు వెలువడడంతో... ఉపాధ్యాయులంతా అదే చర్చలో పడ్డారు. బదిలీల ప్రక్రియ జులై 15న ముగిసింది. ఇలా దాదాపు నెలన్నర సమయం వృథా అయింది. ఈ ప్రభావం బోధనపై పడింది. వచ్చేనెల ఒకటి నుంచి 8 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం –1 (ఎస్ఏ) పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటిరవకు లక్షిత సిలబస్‌లో 60 శాతం పాఠ్యాంశాల బోధన మాత్రమే పూర్తయింది. మరో పది రోజుల్లో మిగిలిన 40 శాతం సిలబస్ పూర్తి కావడం కష్టమే. ఆ తర్వాత వచ్చేనెల 9 నుంచి 21వరకు దసరా సెలవులు. ఇలా పుణ్య కాలమంతా గడుస్తున్నా యంత్రాంగం పకడ్బందీగా పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణలో విఫలమవుతున్నారు. ఈ విషయమై డీఈఓ కె.సత్యనారాయణ రెడ్డి వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. గణితం, సైన్స్‌లోనే అధికంగా> ఫెయిల్.. గతేడాది ఆగస్టు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. పదో తరగతి ఫలితాల్లో జిల్లా 87.13 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో జిల్లా నిలిచింది. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల్లో అధిక శాతం మంది గణితం, సైన్స్‌లోనే తప్పారు. సగటున మ్యాథ్స్‌లో 10 శాతం, సైన్స్‌లో ఏడు శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈమేరకు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఆ స్థాయిలో ఫెయిలవడం గమనార్హం. ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఇప్పటికైనా విద్యాశాఖ మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఉన్నట్టా.. లేనట్టా!
నెల్లూరు(టౌన్): పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు విద్యార్థులు, ఉపాధ్యాయులను అయోమయంలో పడేసింది. గత రెండేళ్లుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 80 మార్కులకే నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా కలుపుతున్నారు. అయితే ఈ ఏడాది 100 మార్కులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పాఠశాలలను పునఃప్రారంభించి 3 నెలలు పూర్తయినా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎన్ని మార్కులు ఉంటాయన్న దానిపై ఇప్పటికీ జిల్లా విద్యాశాఖకు స్పష్టత రాలేదు. పరీక్షల్లో ఎన్ని మార్కులకు పేపరు ఉంటుందన్న ఆందోళన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో నెలకొంది. గత రెండేళ్లుగా పరీక్షల్లో మార్పులు చేస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు మాత్రం పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉండాలని మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. స్పష్టత లేక అమోమయం జిల్లాలో మొత్తం 694 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 348 ప్రభుత్వ, 346 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 35,478 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 21799 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 10254 మంది బాలురు, 11538 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 13679 మంది విద్యార్థులు చదవుతున్నారు. వారిలో 7825 మంది బాలురు, 5854 మంది బాలికలు ఉన్నారు. ప్రతి ఏటా మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే పది పరీక్షలు ఎన్ని మార్కులకు నిర్వహిస్తారో ఇప్పటికీ విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు 100 మార్కులకు పరీక్ష నిర్వహించే వారు. గత రెండేళ్లుగా ఒక్కో సబ్జెక్ట్‌కు 80 మార్కులకే పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులకు పాఠశాలల్లో నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుని మార్కులు వేస్తున్నారు. ఏడాదికి 4 ఫార్మేటివ్‌లు, 3 సమ్మెటివ్ అసెస్మెంట్లు నిర్వహించాల్సిఉంది. అయితే 2017–18లో తొలి సమ్మెటివ్ అసెస్మెంట్ పేపర్ లీకు కావడంతో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసి రెండు అసెస్‌మెంట్‌లనే నిర్వహించారు. 2016–17 విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలకు సంబంధించి వచ్చిన మార్కుల ఆధారంగా 8వ తరగతిలో 10 మార్కులు, 9వ తరగతిలో 10 మార్కులు తీసుకుంటామని ప్రకటించారు. కానీ కేవలం 10వ తరగతిలో 4 ఫార్మేటివ్‌లు రెండు అసెస్‌మెంట్‌ల్లో వచ్చిన 360 మార్కులను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్ మార్కులను కలిపారు. అయితే 2017–18 సంవత్సరంలో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు వేశారు. అయితే సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు. మార్కులపై గందరగోళం పదో తరగతి మార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. పదిలో 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా దీనిపై జిల్లా విద్యాశాఖకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికి తొలి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షను నిర్వహించగా, ప్రస్తుతం రెండో ఫార్మేటివ్ పరీక్ష జరుగుతోంది. తొలి సమ్మెటివ్ పరీక్షను దసరా సెలవుల అనంతరం అక్టోబర్ చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల్లో 80 మార్కులు ఉండడం ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రయోజనమని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రం ఉండడం వల్ల లీక్ చేయడం పరిపాటిగా మారింది. గతేడాది సమ్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడం వల్ల ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. కార్పొరేట్ వాళ్లదే.. పదిలో ఇంటర్నల్ మార్కుల కోసం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు లాభసాటిగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు తమకు ఇష్టం వచ్చిన విధంగా విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎక్కువగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు 10కి 10 జీపీఏ రావడం సులభతరమైందంటున్నారు. దీంతోనే పదిలో ఇంటర్నల్ మార్కులు తప్పనిసరిగా ఉండాలని కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు పట్టుబడుతున్నారు. ఈ విషయంపై మంత్రి నారాయణ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పదో తరగతికి ఇంటర్నల్ మార్కులు ఉండవని, 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ప్రకటించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. -
పోర్న్ వీడియోలు.. చెల్లెలిపైకి ఉసిగొల్పాయి
సాక్షి, నర్సీపట్నం : పోర్న్ వీడియోల ప్రభావం ఓ బాలుడిని నిందితుడిగా మార్చాయి. అతనికి వరుసకు సోదరి అయిన బాలికపై లైంగికదాడి చేసేందుకు పురిగొల్పాయి, ఆపై హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో ఆ బాలిక ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి(బీకే పల్లి) గ్రామంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం విశాఖపట్నం జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. పోర్న్ వీడియోల ప్రభావంతో సోదరిపైనే అత్యాచారానికి తెగబడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడిది ఒకే ఇంటి పేరు. పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇటీవల పదో తరగతి పాస్ అయ్యాడు, బాధితురాలు ఏడు నుంచి 8వ తరగతిలోకి వస్తోంది. పక్కపక్క ఇళ్లు కావడంతో ఎప్పుడు సరదాగా ఆడుకుంటారు. ఎప్పుడూ మాదిరిగానే 10వ తేదీన ఐదుగురు పిల్లలు ఆడుకున్నారు. వర్షం వస్తుండడంతో ముగ్గురు పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. తమ ఇంటి నిర్మాణానికి తీసుకువచ్చిన సిమెంట్ బస్తాలు వర్షానికి తడవకుండా ఉండేందుకు కవర్ కప్పేందుకు బాధితురాలు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు పాకలో ప్రవేశించి వెనుక నుంచి ఒక్కసారిగా బాలికను పట్టుకున్నాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది. నలుగురు వస్తే పరువుపోతుందని భావించిన నిందితుడు బాలిక మెడలో ఉన్న చున్నీతో పాక రాటకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహతప్పడంతో, పాకలో సిమెంట్ బస్తాలు అమ్మాయిపై పడినట్టు సీన్ క్రియేట్ చేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి చెల్లెలు సిమెంట్ బస్తా కిందపడి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు ఆరోజు నుంచి ఊరిలో కనిపించలేదు. అతనిని పట్టుకుని విచారించగా వీడియోల ప్రభావంతో ఎవరైనా అమ్మాయితో అలా ప్రవర్తించాలని అనిపించేదని, కళ్లెదురుగా సోదరి కనిపించడంతో అలా ప్రవర్తించానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి, మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు. ఈ సమావేశంలో కోటవురట్ల ఎస్ఐ మధుసుధన్‌రావు పాల్గొన్నారు. -
నలుగురికి 499 మార్కులు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదవ తరగతి ఫలితాల్లో నలుగురు విద్యార్థులు 500కి అత్యధికంగా 499 మార్కులు సాధించారు. మంగళవారం వెలువడిన ఈ ఫలితాల్లో మొత్తంగా 86.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 85.32 శాతం, బాలికల్లో 88.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గుర్గావ్కు చెందిన ప్రాకార్ మిత్తల్, యూపీలోని బిజ్నూర్కు చెందిన రిమ్జిమ్ అగర్వాల్, షమ్లీకి చెందిన నందినీ గార్గ్, కొచ్చి అమ్మాయి శ్రీలక్ష్మిలు 500కి 499 మార్కులు సాధించారు. మరో ఏడుగురికి 498మార్కులు, 14 మందికి 497 మార్కులొచ్చాయి. ఉత్తీర్ణతా శాతం పరంగా చూస్తే తిరువనంతపురం (99.6 శాతం), చెన్నై (97.37 శాతం), అజ్మీర్ (91.86 శాతం) రీజియన్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. దేశం మొత్తం మీద 27,426 మంది విద్యార్థులు 95 శాతానికిపైగా మార్కులు తెచ్చుకున్నారు. అంగ వైకల్యం కలిగిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 92.55 కాగా, గుర్గావ్కు చెందిన అనుష్క పండా, ఘజియాబాద్‌కు చెందిన సాన్యా గాంధీలు 489 మార్కులు పొందారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని సీబీఎస్ఈ రద్దు చేశాక జరిగిన తొలి పరీక్షలివే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మనో నిబ్బరంతో ఉండాలని కోరారు. 12వ తరగతి టాపర్లను కలిసిన కేజ్రీవాల్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలో టాపర్లుగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు విద్యార్థుల ఇళ్లలోనే కలిశారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన సిసోడియాతో కలసి కేజ్రీవాల్.. టాపర్లు భారతీ రాఘవ్, ప్రిన్స్ కుమార్, ప్రాచీ ప్రకాశ్, చిత్రా కౌశిక్‌ల ఇళ్లకు వెళ్లారు. అలాగే 12వ తరగతి వొకేషనల్ విద్య విభాగంలో టాపర్‌గా నిలిచిన షహనాజ్‌ను కలిసేందుకు దర్యాగంజ్ ప్రాంతంలో ఉన్న అనాధశ్రమాన్ని కూడా వారిరువురూ సందర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులను రెండింతలు చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అది డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం కాదనీ, పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని మంగళవారం అన్నారు. సీబీఎస్ఈకి లీకు వీరుల జాబితా సీబీఎస్ఈ పరీక్షల్లో 10వ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్న పత్రాలు లీకయ్యి సంచలనం సృష్టించడం తెలిసిందే. అలా ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను పోలీసులు సీబీఎస్ఈకి సమర్పించారు. లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పోలీసులు కొందరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారి నుంచి వివరాలను రాబట్టి, ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకున్న విద్యార్థుల జాబితాను పోలీసులు సీబీఎస్ఈకి పంపారు. -
పది చదువు..ఆపై కొలువు
పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనే కోర్సుల్లో పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు ప్రధానంగా ఉంది. ఈ డిప్లొమా కోర్సును తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో 7 కళాశాలలు ఏర్పాటు చేయగా ఇందులో రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. పది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో చేరి డిçప్లొమా కోర్సును పూర్తి చేస్తే పశుసంవర్థక శాఖలో వెటర్నరీ సహయకుల ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రైవేటు డైయిరీల్లోనూ ఉపాధి అవకాశాలను అందిపుక్చుకోవచ్చు. రాపూరు: గ్రామీణ ప్రాంతంలో పదోతరగతి వరకే పరిమితమవుతున్న పేద విద్యార్థులకు పశువైద్యంలో ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థక శాఖ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోర్సులను బోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కళాశాలలను నిర్వహిస్తుంది, రాపూరు (నెల్లూరు జిల్లా), రామచంద్రాపురం (పశ్చిమగోదావరి), పలమనేరు (చిత్తూరు), మడకశిర (అనంతపురం), బద్వేల్ (కర్నూల్), గడివిడి (విజయనగరం) ప్రాంతాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబం«ధించి రాపూరుకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న బొజ్జనపల్లి సమీపంలో సుమారు 30 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలతో పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుచేయడం జరిగింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 సంవత్సరం జూన్ 3వ తేదీన రాపూరులో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2007–2008 విద్యాసంవత్సరం నుంచి రాపూరు బాలికల ఉన్నత పాఠశాలలోని మూడుగదుల్లో తరగతులను ప్రారంభించారు.అనంతరం బొజ్జనపల్లి వద్ద కళాశాలను సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించారు. బాలుర, బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు, ప్రిన్సిపాల్ వసతి, వాచ్‌మేన్ గది, సీసీరోడ్లు, విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రక్షణగా 9 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. 2006 నుంచి 2014 వరకు ఏటా 20 సీట్లు కల్పిస్తు వచ్చారు.ఇందులో చేరేందుకు గ్రామీణ విద్యార్థులనుంచి ఆసక్తి పెరగడంతో 2015 నుంచి అదనంగా 10 సీట్లు పెంచి మొత్తం 30 సీట్లలో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. వసతి సౌకర్యంరెండేళ్ల కోర్సుకాలంలో విద్యార్థులు వసతిగృహాల్లోనే ఉండేలా అన్ని వసతులు కల్పించారు.రాపూరులో కళాశాల ప్రక్కనే విద్యార్థిని, విద్యార్థులకు వేరువేరుగా చక్కటి వసతి గృహ భవనాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తు చేసుకునేదిలా.. రాపూరు ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల్లో 30 సీట్లు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కోర్సులో చేరాలంటే ఎస్సీ, ఎస్టీలకు 10వ తరగతిలో55శాతం, ఓసీ, బీసీలకు 60 శాతం మార్కులు ఉండాలి. కోర్సులో చేరేవారికి 22సంవత్సరాల లోపు ఉండాలి. డబ్ల్యూడబ్ల్యూ .ఎస్‌వివియు.ఈడీయు.ఇన్ ఆన్లైన్లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని శ్రీవెంకటేశ్వర పశుసంవర్థక కళాశాల, తిరుపతికి దరఖాస్తు చేసుకుంటే వారు కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్ మాసంలో పత్రికా ప్రకటనద్వారా లేదా ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉపాధి అవకాశాలిలా.. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల ఉద్యోగాలకు అర్హులవుతారు.ప్రైవేటు రంగంలో డైరీ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమ వృద్ధి చెందుతోంది. పాల ఉత్పత్తుల్లో రెండంకెల వృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యుల కొరత తీవ్రంగా ఉన్నా నేపథ్యంలో పశువైద్యసేవలతో స్వయం ఉపాధి పెంపొందించుకోవచ్చు . ఇంటర్ ఆపై తరగతులు చదివే స్తోమత లేని విద్యార్థులు పదోతరగతి ఉతీర్ణతతో ఈ కోర్సులో చేరితే త్వరగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు మెండు వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా పాడిపరిశ్రమ పురోభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ పశుసంర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేసినప్పుడు సులభంగా ఉద్యోగవాకాశాలు పొందవచ్చు. రాపూరు కళాశాల్లో సీట్ల భర్తీకి శ్రీవెకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి త్వరలో ప్రకటన వెలువడనుంది. – పి. వెంకటేశ్వరావు, ప్రిన్సిపాల్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, రాపూరు -
‘పది’లో ఉర్దూ తడాఖా !
జిల్లాలో ఉర్దూ పాఠశాలలు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత తీర్చకపోయినా, తగినన్ని వసతులు కల్పించకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఇతర పాఠశాలలకు తీసిపోని విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాయి. జిల్లాలో 28 ఉర్దూ ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 16 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. మదనపల్లె సిటీ: పదో తరగతిలో జిల్లాలో ఉర్దూ పాఠశాలలకు ఉత్తమ ఫలితాలు లభించాయి. మారుమూల ప్రాంతాలైన పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని వి.కోట ఉర్దూ మెయిన్, నడిపేపల్లి, కొంగాటం, మండల కేంద్రాలైన రామకుప్పం, బైరెడ్డిపల్లె, రొంపిచెర్ల, పీలేరు, బి.కొత్తకోట, యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్, మదనపల్లె రూరల్ మండలం బాలాజీనగర్, పెద్దతిప్పసముద్రం, ,పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 22 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి ఆధిక్యతను చాటుకున్నాయి. ఉన్న టీచర్లపైనే భారమంతా ... ఉర్దూ పాఠశాలల్లో డీఎస్సీ నియామకాలు జరిగినప్పుడల్లా టీచర్ పోస్టులు భర్తీ చేస్తూనే ఉన్నారు. కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 50 శాతానికి పైగా పోస్టులు ఎస్సీ,ఎస్టీ, బీసీ–ఏ,సీ,డీ కేటగిరీలకు కేటాయిస్తుండటంతో అభ్యర్థులు లేక అవి చాలాకాలంగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉర్దూ పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లే భారమంతా మోస్తూ నెట్టుకొస్తున్నారు. వి.కోట మండలంలోని కొంగాటం ఉర్దూ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, రామకుప్పం మెయిన్ పాఠశాల ఒక ఉపా«ధ్యాయుడితోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. అలాగే తిరుపతిలోని నెహ్రూ నగర్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు కూడా లేకున్నా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలు, ఓ తెలుగు ఉపాధ్యాయునితో 95 శాతం ఫలితాలు సాధించారు. మెరుగైన వసతులు కల్పించి , పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఇతర పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉర్దూ పాఠశాలలు ఫలితాలు సాధిస్తాయనడంలో సందేహం లేదు. -
జీవితాలతో చెలగాటం
అనంతపురం ఎడ్యుకేషన్: గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేశారు. చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా.. పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ పదో తరగతి పరీక్షలకు హాజరై ఇంటర్నల్(అంతర్గత) మూల్యాంకనంలో మార్కులు నమోదు కాని విద్యార్థులకు సంబంధించి ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో ఈ మార్కులు నమోదు కాని విద్యార్థుల వివరాలు వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్, అమరావతి నుంచే సమాచారం చేరవేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి స్థానిక కేఆస్‌ఆర్ బాలికల పాఠశాలలో ఈ నెల 7 నుంచి గురువారం.. అంటే నాలుగు రోజల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత మార్కులు నమోదు చేస్తూ వచ్చారు. నమోదు కాని 32 మందివిద్యార్థుల మార్కులు జిల్లాలో 137 స్కూళ్ల నుంచి 2121 మంది విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయాల్సి ఉందంటూ రాష్ట్ర అధికారుల నుంచి జాబితా వచ్చింది. గడువు ముగిసే సమయానికి 130 స్కూళ్ల నుంచి 2,089 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఇంకా ఏడు స్కూళ్ల నుంచి 32 మంది విద్యార్థుల మార్కులను నమోదు చేయాల్సి ఉంది. ఈ స్కూళ్లన్నీ కూడా ప్రైవేట్‌వే కావడం గమనార్హం. అనంతపురంలో రెండు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, మడకశిరలో ఒక్కో స్కూలు ఉంది. ఇంటర్నల్ మార్కులు నమోదు చేయని అన్ని స్కూళ్లకు మోమోలు జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అవకాశం ఇచ్చినా మార్కులు నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
మా బడి బంగారం
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి నాంది పలికారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి తిరుగుతూ కరపత్రాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మీడియం వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు దీటైన ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొంటున్నారు. టక్కు, టైలు చూసి మోసపోవద్దని, ఆడంబరాలకు పోయి ఇల్లుగుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు. బంగారం లాంటి మా బడిలో ఒత్తిడి లేని విద్యనందిస్తామని, పిల్లల సంపూర్ణ వికాసానికి మాదీ హామీ అంటూ భరోసా ఇస్తున్నారు. చీమకుర్తి రూరల్:ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంతోపాటు నూరుశాతం ఫలితాల సాధనలోనూ ఉత్తమ ప్రదర్శన కనబర్చాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్సాహంతో ఉన్నారు. పట్టణాలు, పల్లెల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించండని తల్లిదండ్రులకు నచ్చచెప్తున్నారు. ప్రైవేటు బడికి, ప్రభుత్వ బడికి తేడాలను వివరిస్తున్నారు. వేసవి సెలవులను సైతం పట్టించుకోకుండా కొంతమంది ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తున్న తీరు చూసి గ్రామస్తులు మార్పు మంచికే అంటున్నారు. టెన్త్‌లో సత్ఫలితాలు.. ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో సంతనూతలపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో 38 ప్రభుత్వ హైస్కూళ్ళు ఉంటే వాటిలో 31 హైస్కూళ్ళలోనూరు శాతం ఉత్తీర్ణత సాధించటం ఇంకాస్థ ధీమాను పెంచింది. 1825 మంది విద్యార్థులు హాజరైతే 1816 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి విద్యార్థులు సరాసరి 95 శాతం ఉత్తీర్ణత సాధించటం విద్యార్థుల తల్లిదండ్రులలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మన ఊరు–మన బడి, జ్ఞానధార వంటి కార్యక్రమాలు, రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఎస్ఎస్ఏ కార్యాచరణ కూడా కొంత మేర ధీమా కలిగించేందుకు దోహదపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితేరూ.30 వేలు మిగులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కింద కట్టాల్సిన రూ.10 వేలు నుంచి రూ.15 వేలు మిగిలినట్లే. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు రూ.2500 విలువ చేసే రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇస్తారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రూ.7 వేల విలువ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలను అందిస్తున్నారు. వ్యాను ఫీజు, వార్షికోత్సవం ఫీజుల పేరుతో ప్రైవేటు పాఠశాలలకు ఏడాదికి చెల్లించాలసిన దాదాపు రూ.10 వేలు మిగిలినట్టే. గతేడాది వరకు మధ్యాహ్న భోజనంలో విద్యార్థికి వారానికి మూడు గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. కాని ఈ విద్యాసంవత్సరం నుంచి వారానికి ఐదు కోడిగుడ్లును అందించనున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి కుటుంబానికి ఏడాది మొత్తం మీద ప్రయివేటు స్కూళ్లకు చెల్లించే రూ.30 వేలకు పైనే మిగిలినట్లేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించి చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాప్రమాణాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధన ఎంతగానో తోడ్పడుతుందని పిల్లల కుటుంబాలకు నచ్చచెప్పి పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేరాలని ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను గ్రామాలలోని ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. -
‘పది’లో పతనం
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పతనమైంది. గతేడాది నాలుగో స్థానాన్ని చేజిక్కించుకున్న జిల్లా ఈ ఏడాది క్షీణించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలచింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 97.93 శాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలవగా 80.37 శాతం సాధించి నెల్లూరు జిల్లా చివరి స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు మొత్తం 32,854 మంది హాజరయ్యారు. వీరిలో 26,404 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 16,964 మంది హాజరు కాగా 13,570 మంది ఉత్తీర్ణులై 79.99 ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 15,890 మంది హాజరు కాగా 12,834 మంది పాసై 80.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 0.78 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. 1001 మందికి పదికి పది జీపీఏ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 1001 మంది 10కి 10 జీపీఏ సాధించారు. గతేడాది 1008 మంది పదికి పది జీపీఏ సాధించారు. ఈ దఫా ఉత్తీర్ణత శాతం, జీపీఏ తగ్గినా కేవలం నాణ్యత మీద దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేఎన్నాఆర్ మున్సిపల్ స్కూల్లో ఆర్.హరిచందన, ఇ. జాషువాహడ్‌సన్‌కు 10కి10 పాయింట్లు వచ్చాయి. ప్రభుత్వ సెక్టార్ పాఠశాలల్లో 40 మందికి 10 జీపీఏ ప్రభుత్వ సెక్టార్‌ల్లోని పాఠశాలల్లో చదువుతున్న 40 మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు, మున్సిపాలిటీ స్కూల్స్‌లో ఏడుగురు, ఏపీ మోడల్స్ స్కూల్స్‌లో ఐదుగురు, ఏపీ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఇద్దరు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో 21 మంది 10కి 10 జీపీఏ సాధించారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం తండ్రి వెంకటేశ్వర్లు బియ్యం వ్యాపారి. తల్లి కవిత గృహిణి. కేఎన్నార్ మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి చదివి పది ఫలితాల్లో 10కి10 జీపీఏ సాధించడం గర్వంగా ఉంది. ఇంటర్లో మంచి మార్కులు సాధించిన జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సాధించాలన్నదే లక్ష్యం.– ఆర్ హరిచందన, నెల్లూరు, బంగ్లాతోట -
టెన్త్ తర్వాత ఉపాధికి మార్గం..పాలిటెక్నిక్
నిడమర్రు : పదో తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, త్వరగా ఉపాధి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సు. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది 50,424 మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాశారు. పదో తరగతి తర్వాత టెక్నికల్ కోర్సులు చేసి టెక్నికల్ అంశాలపై పట్టు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించడం. పాలిసెట్–2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలిటెక్నిక్ కోర్సులు, అర్హతలు, పరీక్షా విధానం తదితర సమాచారం తెలుసుకుందాం. పాలిసెట్ నిర్వహించేది.. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్)ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ/ప్రైవేట్/ఎయిడెడ్/అన్ ఎయిడెడ్/ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులు ఇలా.. మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్, మెకానికల్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్. మూడున్నరేళ్ల కోర్సులు కెమికల్(సాండ్విచ్) ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఉన్న కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈసీఈ, ఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ) అర్హతలు :ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించిన పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదో తరగతి కంపార్ట్మెంట్లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకునే ముందు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. పరీక్షా విధానం.. ♦ ఈ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు 2 గంటల సమయం ఉంటుంది. ♦ పరీక్ష పేపరు ఒకటే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ మాదిరి ప్రశ్నలకు 120 మార్కులు కేటాయిస్తారు. ♦ పదో తరగతి స్థాయిలోని గణితంలో 60 ప్రశ్నలు, భౌతికశాస్త్రంలో 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రానికి సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. ♦ మొత్తం 120 మార్కులకు 36 మార్కులను ఈ కోర్సుకు క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయిస్తారు. ♦ ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరిల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఉన్నత విద్యాచదువులకు మంచి అవకాశం.. ♦ పాలిటెక్నిక్ కోర్సులు (మూడు/మూడున్నరేళ్ల డిప్లొమా) పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ‘ఈ సెట్’ నిర్వహిస్తారు. దీని ద్వారా బీటెక్/బీఈ నేరుగా రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ ద్వారా) ప్రవేశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు ♦ ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో డిప్లొమా చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సబ్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్‌గా అవకాశాలు ఉంటాయి. జెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా ♦ https://appolycet.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయి పదో తరగతి లేదా తత్సమాన కోర్సుకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, పాస్/హాజరైన సంవత్సరం నమోదు చేస్తే కనిపించే దరఖాస్తు ను పూరించాలి, ఆన్లైన్లోనే ఫీజు రూ.350 కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేదా జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో దరఖాస్తులను అప్లోడ్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: ఏప్రిల్ 15 ♦ పరీక్ష నిర్వహించే తేదీ: ఏప్రిల్ 27 (ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ) జిల్లాలోని హెల్ప్‌లైన్ సెంటర్స్: ♦ ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్, తణుకు ♦ సీఆర్ఆర్ పాలిటెక్నిక్, ఏలూరు ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం ♦ శ్రీమతి సీతా పాలిటెక్నిక్, భీమవరం ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం పరీక్షా కేంద్రాలు: తణుకు, ఏలూరు, భీమవరంమరిన్ని వివరాలకోసం 91333 99677/91333 99677/ 91333 99688/ 91333 99699 నంబర్లకు సంప్రదించవచ్చు.