
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు.
జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు.
(చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment