jharasangam
-
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) -
శిథిలావస్థలో పురాతన ఆలయాలు
ఝరాసంగంరూరల్(జహీరాబాద్): చరిత్రకు ఆనవాళ్లు పురాతన కట్టడాలు. ఈ పురాతన కట్టడాలతోనే ప్రాంతాలకు, గ్రామాలకు పేర్లు కూడా వచ్చాయి. ఝరాసంగం మండలంలోని అనేక గ్రామాల్లో పురాతన గుళ్లు, గోపురాలు, బురుజులు, కందకాలు, స్వాగత తోరణాలున్నాయి. వందల సంవత్సరాలు క్రితం నిర్మితమైనా ఆయా కట్టడాలపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతున్నాయి. మండలంలో అనేకం.. మండలంలో అంతరించిపోతున్న పురాతన కట్టడాలు అనేక చోట్ల ఉన్నాయి. పొట్పల్లి గ్రామ శివారులోని సిద్దేశ్వరాలయం, ఝరాసంగంలో బసవణ్ణ మందిరాలు దాదాపు 400 సంవత్సరాలుకు పైగా చరిత్ర కలిగిన కట్టాడాలు. ఈ కట్టాడాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించి.. ఒక్కో ఆలయ అభివద్ధికి రూ.20 లక్షల చొప్పున నిధులు అవసరమున్నట్లు ప్రతిపాదనలు పంపించారు. ఐదు సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనట్టు అధికారులు అప్పట్లో తెలిపినా.. ఇప్పటి వరకు పనులు జరగలేదు. వీటితో పాటు జీర్లపల్లి, కుప్పానగర్, ఏడాకులపల్లి గ్రామాల్లో ఉన్న బురుజులు శిథిలావాస్థకు చేరాయి. మాచునూర్, కృష్ణాపూర్, పొట్పల్లి గ్రామాల్లో ఉన్న కందకాలు, స్వాగత తోరణాలకు సైతం మరమ్మతులు చేయకపోవడంతో కుంగిపోతున్నాయి. కొల్లూర్ రామేశ్వరాలయం కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆదరణకు నోచుకోని కుపేంద్ర పట్టణం ఝరాసంగంలో వెలసిన కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని చేపట్టిన అప్పటి కుపేంద్ర పట్టణ రాజు కుపేంద్ర భూపాలుడు ఏలిన రాజ్యం ప్రస్తుతం కుప్పానగర్‌గా వెలుగొందుతోంది. ఇప్పటికీ గ్రామ పరిసరాలలో దేవతల విగ్రహాలు, వస్తువులు, కట్టాడాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ పరిశోధనలు సైతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. దేవతా మూర్తుల విగ్రహాలు శిథిలమవుతున్నాయి. మరమ్మతులు చేపట్టాలి మండలంలో పలు గ్రామాల్లో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించడంతో పాటు వారి పరిరక్షణకు అధికారులు కృషి చేయాలి. కట్టడాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాట చేసి కూలిపోతున్న కట్టడాలను గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – నాగేశ్వర్ సజ్జన్ శెట్టి, ఝరాసంగం అభివృద్ధి చేయాలి కొల్లూర్ గ్రామ శివారులో అతి పురాతనమైన రామేశ్వరాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. కనుమరుగవుతున్న నాటి సంపదపై అధికారులు దృష్టి పెట్టాలి. – ఉమాకాంత్ పాటిల్, కొల్లూర్‌జిల్లా అధికారులకు నివేదించాం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పురాతన బసవణ్ణ మందిరాన్ని పురవస్తు శాఖ అధికారులు గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఈ సమస్యపై జిల్లా అధికారులకు తెలియజేసి మండలంలోని పురాతన ఆలయాలు, కట్టడాల అభివృద్ధికి కృషి చేస్తాం. – మోహన్‌రెడ్డి, కేతకీ ఆలయ ఈఓ -
భక్తుల పాదయాత్ర
న్యాల్కల్: కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు ఆదివారం భజనలు చేసుకుంటూ పాదయాత్రగా మండల కేంద్రమైన ఝరాసంగం కేతకి ఆలయానికి వెళ్ళారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తాము కోరిన కోర్కెలు తీరాలని కోరుతూ ప్రతిఏటా పాదయాత్రతో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా కర్నాటక, మహారాష్ట్రాలలోని అనేగావ్, నెట్టూరు, కోడ్‌గా, బరూర్, తాండ, అల్లిపుర్గి, జైనాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం న్యాల్కల్ మండలంలోని మల్గి, డప్పూర్, అత్నూర్, న్యాల్కల్, రుక్మాపూర్‌ల మీదుగా కేతకి సంగమేశ్వర ఆలయానికి తరలివెళ్లారు. భజనలు, నృత్యాలు చేస్తూ ఆయా గ్రామాల గుండా పాద యాత్రను కొనసాగించారు. నాలుగు రోజుల క్రితం పాదయాత్రగా బయలు దేరామని ఆదివారం రాత్రి ఆలయానికి చేరుకొని భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం పాదయాత్రన తరలి వెళున్న భక్తులకు అత్నూర్ గ్రామానికి చెందిన తుకారం పాటిల్-పరాగ్‌బాయి, బాబురావు-సుమిత్రబాయి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. కేతకీ ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రతి ఏటా అన్నాదానం నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాల్కల్ మీదుగా ముంగి వైపు వస్తున్న భక్తులకు ముంగి చౌరస్తా వద్ద పలువురు భక్తులకు టీ, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీదర్, నాయకులు ఎల్చల్ నర్సింహారెడ్డి, రాజు పాటిల్, శివాజీ పాటిల్, విజయ్ పాటిల్, విఠల్‌రెడ్డి, ఏక్నాథ్, దండేమహారాజ్, వీరారెడ్డి, న్యాల్కల్ శ్రీను సేఠ్ తదితరులు పాల్గొన్నారు. -------------- 14జడ్‌హెచ్‌ఆర్41:న్యాల్కల్ మీదుగా ఝరాసంగంకు పాద యాత్రన తరలి వెళ్లుతున్న భక్తులు