
హైదరాబాద్: 70 ఏళ్ల వయసుకు పైబడిన వాళ్లకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో సైతం ఇది అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి 1 వతేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా అందించనుంది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన ఒక జాబితాను రాష్ట్ర వైద్య అధికారలు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కుటుంబలోని వయో వృద్ధులకు రూ. 5 లక్షల వరకూ ఉచిత వైద్యం పొందే అవకాశం ఏర్పడింది.