old age
-
ఏజ్.. ఇక్కడ జస్ట్ నంబరే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి / జహీరాబాద్: జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు మూడు పదుల వయసు వచ్చేసరికే బీపీ, షుగర్, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ, కొన్ని గ్రామీణ ప్రాంతాలు నేటికీ ఆరోగ్య సిరులతో విలసిల్లుతున్నాయి. పది పదుల వయసు దాటిన వృద్ధులు సైతం నవ యువకుల్లా పనులు చేసుకుంటున్నారు. తమ ఆహారపు అలవాట్లే అందుకు కారణమని వారు చెబుతున్నారు. చిరు ధాన్యం మహాభాగ్యండెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) స్వచ్ఛంద సంస్థ 4 దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో 5 వేల మంది మహిళా రైతులను సంఘటితం చేసి సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. కొర్రలు, సామలు, అండుకొర్రలు, పచ్చ జొన్నలు, సాయిజొన్నలు, కంది, మినప, పెసర వంటి పంటలు సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. ఇందులో పోట్పల్లి, మోడ్ తండా గ్రామాలూ ఉన్నాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సిరిధాన్యాల (మిల్లెట్స్)ను సాగు చేయడంతో పాటు, వాటినే నిత్యం ఆహారంగా తీసుకుంటున్న ఆ గ్రామాల వాసులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏటా జరిగే పాత పంటల జాతర నేపథ్యంలో ఝరాసంఘం మండలం పోట్పల్లి, జహీరాబాద్ మండలం మోడ్ తండా గ్రామాల్లో ‘సాక్షి’బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాత పంటల జాతరఈ ప్రాంతంలో ఏటా నిర్వహించే పాత పంటల జాతర ఈ నెల 14న న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగుస్తుంది. జాతర 24 గ్రామాల్లో జరగనుంది. ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాధాన్యత గురించి ఈ జాతరలో ప్రచారం చేస్తున్నారు.విలేజ్ ప్రొఫైల్స్.. గ్రామం: పోట్పల్లి (ఝరాసంఘంమండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా:2,263 ప్రధాన వృత్తి: వ్యవసాయం (సుమారు 90 శాతం) బీపీ, షుగర్ ఉన్నవారు సుమారు పదిమంది లోపే..గ్రామం:మోడ్ తండా (జహీరాబాద్ మండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా: 192 ప్రధాన వృత్తి : వ్యవసాయం బీపీ, షుగర్ ఉన్న వారు కేవలం ఇద్దరే.వారికి రోగాలు తక్కువే.. పోట్పల్లి, ఎల్గొయ్ గ్రామాల్లో వ్యాధుల బారిన పడినవారి సంఖ్య చాలా తక్కువ. వీరు నిత్యం జొన్నరొట్టె, కందిపప్పుతో పాటు, కొర్రలు, సామలు తింటుంటారు. అందుకే వయసు మీదపడినా ఆరోగ్యంగా ఉంటున్నారు. – ఆలీస్, ఏఎన్ఎం, ఎల్గొయ్ సబ్ సెంటర్అత్తల నుంచి కోడళ్లకు బదిలీ చిరుధాన్యాల సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అత్తల నుంచి కోడళ్లకు వ్యవసాయాన్ని బదిలీ చేయించుకున్నాము. వేయి మందికి పైగా కోడళ్ల సంఘంలో సభ్యులు ఉన్నారు. భూమి కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో సాయిజొన్న పంట వేసుకున్నా. –మొగులమ్మ, పోట్పల్లి, కోడళ్ల సంఘం అధ్యక్షురాలుఈయన పేరు బోంగూరు స్వామిదాసు. సంగారెడ్డి జిల్లా పోట్పల్లికి చెందిన స్వామిదాసు వయసు 75 ఏళ్లు. దశాబ్దాలుగా తన పొలంలో పాత పంటలు (మిల్లెట్స్) సాగు చేస్తూ, వాటినే ఆహారంగా తీసుకుంటుండటంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నానని చెబుతున్నారు. కొర్రబువ్వ, జొన్నరొట్టెను ఆహారంగా తీసుకుంటున్నానని చెప్పారు.వందేళ్ల వయసు దాటిన ఈయన పేరు గర్మూనాయక్. భార్య జాలీబాయికి కూడా తొంౖభైæ ఏళ్లు ఉంటాయి. మోడ్ తండాకు చెందిన ఈ దంపతులు ఇప్పటికీ స్వయంగా మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్ననాటి నుంచి పచ్చజొన్న, సాయిజొన్న, సజ్జరొట్టెలు, తైద అంబలి, కంది, మినప పప్పు తినడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు.ఇంటి ముందు సానుపు (కల్లాపి) చల్లుతున్న ఈ వృద్ధురాలు మన్నెల్లి దానమ్మ. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈమెకు సంతానం లేదు. ఇప్పటికీ తన పని తాను చేసుకుంటోంది. చిన్నప్పటి నుంచి కొర్రబువ్వ, సామలు, తైద అంబలి, సాయిజొన్న రొట్టెలు తినటం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతోంది. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఓల్డేజ్.. ఓల్టేజ్..
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి. వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్‌లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ.. అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్‌కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్‌పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.నృత్యం ఆరోగ్యకరం.. ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్‌కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.ఇవీ తెలుసుకోండి.. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది. 👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం. 👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్.. వంటివి చేయవచ్చు. 👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది. 👉బాల్ రూమ్ డ్యాన్స్‌నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది. 👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. 👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్‌లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్‌లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్‌లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
విభజన టైంలో వీళ్ల ‘చేదు’ అనుభవాలు వింటారా?
1947లో భారతదేశ విభజన చాలా మందికి తమ పూర్వీకులను కోల్పోయేలా చేసింది. వారు పెరిగిన వాతావరణంలోని ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే.. ఈ విభజన చాలామందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒక్క రాత్రితో తమ జీవితాలనే మార్చేసిన విభజన అది. అలాంటి భాధనే ఎదుర్కొన్న నలుగురు వృద్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ టైంలో ఈ విభజన ఎలా తమ ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేసిందో వివరించారు. విభజన కారణంగా చెలరేగిన ఘర్షణలు, అల్లకల్లోలంతో రాత్రికి రాత్రే తమ పూర్వీకులను వదిలిపెట్టి భారత్‌లోకి లేదంటే పాక్‌లో వెళ్లిపోవాల్సి వచ్చింది. కొందరికి అది తీరని విషాదాన్ని కలిగించి, చేదు జ్ఞాపకాలుగా మిగిలింది. అది వారికి కేవలం తమ వాళ్లను మాత్రమే దూరం చేయలేదు, ఆఖరికి వారి ఆహారపు అలవాట్లను సంస్కృతిని ప్రభావితం చేసింది. అదెలాగో ఆ వృద్ధుల మాటల్లోనే చూద్దాం..!రషేదా సిద్ధిఖీ, 24 ఆగస్టు 1947"ఇది మాకు ఇష్టమైన వారిని వదులుకునేలా చేసింది. అలాగే సాంప్రదాయ వంటకాలకు, వివిధ పదార్థాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కొత్త పరిసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు పరిమితం కావడం ఓ సవాలుగా మారింది. ఉన్న వాటితో మా వంటకాలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుబాటులోని వనరులతోనే వంటలను చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాత ఢిల్లీ ఇప్పుడది లక్నో. తాము తినే తినుబండరాల దుకాణాలు, కేఫ్‌లు ఇప్పుడూ అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు రషేదా. అయితే ఇప్పుడు మరెన్నో అంతర్జాతీయ వంటకాలు, ఫాస్ట్ పుడ్స్ వంటివి చేరడం విశేషం." అన్నారు. శీలావంతి, 10 ఆగస్టు 1935కరాచీలో మాకు పొలాల నుంచి తాజా కూరగాయలు వచ్చేవి. కావాల్సినవి ఇష్టంగా తినేవాళ్లం. అలాగే నా తోబుట్టువులతో చిన్న చిన్న దుకాణాలకు వెళ్లేవాళ్లం. సింధీ రోటీ వంటివి తినేవాళ్లం. తాజాగా తినే ఫ్రూట్ సలాడ్స్ మిస్ అవుతున్నాం. మళ్లీ కరాచీ వెళ్లి పూర్వీకులను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు శీలావంతి. శిఖా రాయ్ చౌదరి, ఆగస్టు 14, 1939సరిగ్గా నాకు ఏడేల్లు వయసులో ఫరీద్పూర్(బంగ్లాదేశ్)లోని ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్‌ని, సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ కాలంలో గ్రామఫోన్‌లో పాటలు వినేవాళ్లం. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో రుచికరమైన అల్పాహారం అంటే మహా ఇష్టం. అవన్నీ మిస్సయ్యానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శిఖా రాయ్గౌరీ రే, ఆగస్ట్ 9, 1944"విభజన మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మా తాతల టైంలోనే బంగ్లాదేశ్‌ని విడిచి వచ్చేశాం. మాకు దుబ్రిలో వెదరుతో చేసిన ఇల్లు ఉండేది. అదీగాక నేనే కోల్‌కతా, డిళ్లీ రెండు నగరాల్లో పెరిగాను. స్కూల్ చదవంతా కోలకతాలో సాగగా, కాలేజ్ చదవంతా ఢిల్లీలో చదివాను. అలాగే మా కుటుంబం పార్క్ స్ట్రీట్ రెస్టారెంట్‌కి వెళ్లేది. అయితే అప్పట్లో థాయ్, కొరియన్, జపనీస్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్లు లేవు." అని చెప్పుకొచ్చారు గౌరీ రే.ఉమా సేన్, 1939"విభజన కారణంగా మేము భూమిని, ఇంటిని కోల్పోయాం. అలాగే మాకు ఇష్టమైన వంటకాలను, రుచులను మార్చుకోవాల్సి వచ్చింది. స్నేహితులను, పూర్వీకులు కోల్పోయాం. ఇప్పుడు మేమున్న ప్రదేశం రద్దీగా మారిపోయింది. అలాగే కొత్తకొత్త వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు". ఉమాసేన్.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
Video: మెట్రోలో సీటు ఇవ్వలేదని.. యువతిపై వృద్దుడి దౌర్జన్యం
చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న కోపంలో 50 ఏళ్ల వృద్దుడు ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బీజింగ్ సబ్వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు తన కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. తన సీటు అడగడంలో తప్పేముందని చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భయం లేదు అంటూ దబాయించడం వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.Beijing China 🇨🇳- Young woman refused to give her seat to the old man. pic.twitter.com/ybCgv8oY6j— Githii (@githii) June 26, 2024 -
కొడుకులు బువ్వ పెడ్తలేరు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. -
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
Us: బైడెన్ వయసు.. హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమస్య వైట్ హౌస్ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించారు. ఇదీ చదవండి.. అమెరికాలో చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
రాష్ట్ర వృద్ధుల్లో 31.6 శాతం మందికి ఆరోగ్య బీమా
సాక్షి, హైదరాబాద్: వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6 శాతంగా ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2 శాతం కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటం గమనార్హం. మిజోరంలో దేశంలోనే అత్యధికంగా 66.5 శాతం మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉండగా అతితక్కువగా జమ్మూకశ్మీర్‌లో 0.2 శాతం మందికే ఉంది. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్–2023 నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించగా కేంద్ర సామాజిక, సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మేఘాలయా, అస్సాం, గోవా, రాజస్తాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4 శాతం వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడంలేదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేటు ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55 శాతం వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహన లేదు. తెలంగాణలో రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నవారు 30.7 శాతం మంది ఉన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 10 శాతం ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2021లో 11 శాతం వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుంది. 60 ఏళ్లకు పైబడినవారిలో జీవన ఆయుర్ధా యం 2015–19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3 శాతం, పురుషుల్లో 17.3 శాతం. 75 ఏళ్ల తర్వాత తెలంగాణలో సగటున అదనంగా 8.7 ఏళ్లు జీవిస్తున్నారు. తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారిలో పనిచేయలేని స్థితిలో ఉన్నవారు 14.6 శాతం మంది. ఇండియాలో 23.8 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8 శాతం, ఇండియా 21.7 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో ఎలాంటి ఆదాయం లేనివారు తెలంగాణలో 11 శాతం ఉన్నారు. ఇండియా 18.7 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే వృద్ధులు ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఎక్కువ కాలం బతుకుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండటం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కనీ్వనర్, తెలంగాణ -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
ఈ పొరపాటు చేస్తే.. ఏజ్డ్ పర్సన్‌లా కనిపించడం ఖాయం!
ఇటీవలకాలంలో చాలామంది ఏజ్ పరంగా చూస్తే చిన్నవాళ్లే అయినా వారిని చూస్తే ఏజ్డ్లా కనిపిస్తారు. వాళ్లు చెబతేగానీ మనకు తెలయను కూడా తెలియదు. దీంతో ఒకరకంగా వారు కూడా సమాజంలో కాస్త ఇబ్బందిగా ఫీలవ్వడమే గాక ఆత్మనూన్యత గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేసే వాటికి దూరంగా ఉండి వీలైనంతలో కొద్దిపాటు జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య మీ ధరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకూడదంటే.. కొందరూ చూస్తే ఎంత ఏజ్ వచ్చినా కూడా స్మార్ట్‌గా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర అంటున్నారు డాక్టర్ పాల్విన్. మంచి నిద్ర మన ముఖవర్చస్సు కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. సుఖమైన నిద్ర మనిషి ఏజ్‌ని దాచేస్తుందంటున్నారు. ఎప్పుడూ నిద్ర విషయంలో అస్సలు అశ్రద్ధ కనబర్చకూడదట. ఇదే అన్ని రకాల వ్యాధులు అటాక్ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందని కూడా చెబుతున్నారు. ఈ నిద్ర మన జీర్ణవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతుందంటున్నారు. కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావట. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి అవసరమయ్యే నిద్రను మిస్ చేయకండని వార్నింగ్ ఇస్తున్నా డాక్టర్ పాల్విన్. ఇలా ఒక నెలపాటు వేళకు భోజనం చేస్తూ..కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవడానికి యత్నించి చూస్తే మీకే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం స్వస్థత చెందడమేగాక మీకు తెలియకుండానే మీలో జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో మీ పడకగది కూడా మీరు వెళ్లగానే పడుకోవాలనిపించేంత ఆహ్లాదంగా పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్ తదితర చెడు అలవాట్లను సాధ్యమైనంత తొందరగా వదిలేయాలి. రోజువారి జీవనశైలిలో కొద్ది మార్పులు చేసి నిద్రకు సక్రమంగా షెడ్యూల్‌ని కేటాయించేలా చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని అంటున్నారు. ఈ విధానం పాటిస్తే కచ్చితంగా ఏజ్డ్ పర్సన్‌లా కనిపించరని, ఆయుః ప్రమాణం పెరిగి మీరు చిన్నవారిలానే కనిపిస్తారని డాక్టర్ పాల్విన్ చెబుతున్నారు. (చదవండి: చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!) -
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
35 ఏళ్ల తర్వాతా... ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే?
గత కొన్నేళ్ల కిందటి వరకు గర్భధారణకు పెరిగే వయసు లేదా పెద్దవయసు కాస్త ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చనీ, సాధారణంగా 28 లేదా 30 ఏళ్లలోపే గర్భధారణ జరగడంతో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే ఆస్కారం ఎక్కువనే మాటలు వినిపించేవి. అంతేకాదు... 35 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భధారణ జరిగితే పిల్లల్లో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని అనర్థాలు కనిపించే అవకాశాలూ ఎక్కువేనంటూ ఆందోళన నిండిన సలహాలూ వచ్చేవి. అయితే ఆ మాటల్లో కొద్దిపాటి నిజాలున్నప్పటికీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. మెడికల్ పుస్తకాల్లో చెప్పినట్లుగా 35 వయసు దాటాక పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు అరుదుగా ఉంటాయి. వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదంటూ డాక్టర్లు చెబుతున్న సంగతులివి.... ఇటీవల కాలం అనేక మార్పులను తెస్తోంది. యువతులు సైతం బాగా చదువుకుంటూ, కెరియర్లో స్థిరపడిన తర్వాతే పిల్లలను కోరుకుంటున్నారు. దాంతో గర్భధారణ, పిల్లలు కలగడంలో ఆలస్యం సాధారణమవుతోంది. వయసు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగిన కేసుల్లో గర్భస్రావాలు జరిగే రేటు ఎక్కువనీ, ఆలస్యంగా గర్భధారణ జరిగినప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే జన్యుసమస్యలు వస్తాయనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండేవి. అందులో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండవచ్చేమోగానీ... అదే అక్షరసత్యమనీ, ఆ మాటలే శిలాక్షరాలని అనుకోడానికి వీల్లేదని వైద్యపరిశోధనలు వెల్లడిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అందుకే ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’, ‘జీరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ అనే పదాలను విని, చదివి కంగారు పడవద్దని చెబుతున్నారు. ఆలస్యపు గర్భధారణలో అనర్థాలు ఎందుకంటే..? ముప్ఫై ఐదేళ్ల తర్వాత జరిగే గర్భధారణల వల్ల పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి... ► అండాశయం వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగడానికి అవకాశం తక్కువ. అండం నాణ్యతా తగ్గుతుంది. అంటే గర్భధారణకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని కాదు. కానీ ఆలస్యపు గర్భధారణ విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ► అబార్షన్స్ రిస్క్ ఎక్కువ. ∙వయసు పెరుగుతున్న కొద్దీ అండంలో జరిగే కణవిభజన అంత సక్రమంగా ఉంకపోవచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరకపోవచ్చు. ఇతర సమస్యల విషయానికి వస్తే... ► మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపవచ్చు. ► పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ సమస్యలూ, ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం జరగవచ్చు. ► పెద్ద వయసు మహిళలకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశముంది. ► 35 ఏళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవపు అవకాశాలు తగ్గి, సిజేరియన్‌కే అవకాశాలు ఎక్కువ. ఇటీవల ఆలస్యంగా కెరియర్లో స్థిరపడ్డ తర్వాత, అప్పటికీ స్వాభావికంగా గర్భధారణ జరగకపోతే 35 దాటిన తర్వాతే కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటిబిడ్డ పుట్టే కేసులే చాలా ఎక్కువ. ఇందుకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. కొంత రిస్క్ ఉన్నా... ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం... ఒకవేళ మహిళకు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలి. అవి... ► సెల్–ఫ్రీ డీఎన్ఏ స్కీనింగ్ పరీక్ష ∙మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్ (అయితే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత సూచనాత్మకంగా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి). ► న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్టీ) స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి. ► గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించాలి. భవిష్యత్తుకోసం అండాల సంరక్షణ... రోజులు గడుస్తున్న కొద్దీ విడుదలయ్యే అండాల నాణ్యత, అందులో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికీ ఇప్పడు అవకాశం ఉంది. అన్నీ అనువుగా ఉన్న సమయంలో ఆ అండాలను గర్భధారణకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే మెనోపాజ్ రావడం లేదా ఏవైనా క్యాన్సర్లకు గురై అండాశయాలను తొలగించాల్సిన పరిస్థితులు రావడం వంటివి జరిగితే... ముందుగా సేకరించి పెట్టుకున్న ఆరోగ్యకరమైన అండాల సహాయంతో అటు తర్వాత కూడా ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణకు ఇప్పుడు అవకాశాలున్నాయి. చివరగా... 35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే సరైనరీతిలో డాక్టర్ సలహాలు పాటించడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనవైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ çసూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణకు వయసు ఒక అంకె మాత్రమే. గర్భధారణ కంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భం ధరించాలనుకున్న కాస్త పెద్ద వయసు మహిళ గర్భధారణ కంటే ముందునుంచే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. ► తమ సాధారణ ఆరోగ్యం, జీవనశైలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి డాక్టర్‌కు విపులంగా వివరించాలి. ► అప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ల వివరాలు తెలపాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా అని వాకబు చేయాలి. జీవిత భాగస్వామి (భర్త) వారి వైపు ఆరోగ్య వివరాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి. (వయసు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ కోరుకున్న మహిళలందరూ ఈ సూచనలు పాటించాలి.) ► డిప్రెషన్, హైబీపీ, మధుమేహం (డయాబెటిస్) లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌కు వివరించాలి. ► ప్రతిరోజూ 400 మైక్రోగ్రాములకు తగ్గకుండా ఫోలిక్ యాసిడ్‌తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడాలి. (పిండం పెరుగుదల సమయంలో ఈ పోషకాలన్నీ ప్రతి కణానికీ కావాలి. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టబోయే చిన్నారికి గ్రహణం మొర్రి వంటి సమస్యలతో పాటు వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారితమవుతాయి. ► గర్భధారణ సమయంలో ఉండాల్సిన బరువు కంటే... మరీ ఎక్కువ బరువు ఉండటం, అలాగని బరువు తక్కువగా ఉండటం ఈ రెండూ కొన్ని ముప్పులను ఆహ్వానిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉండాల్సినంత బరువు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ► గర్భధారణ సమయంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ► పనిచేసే చోట లేదా ఇతరత్రా ప్రదేశాలలో హానికారకమైన రసాయనాలకు దూరంగా ఉండాలి. ఇలా హానికర రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. (ఉదాహరణకు కెమికల్ లేదా పెయింట్స్ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారి కోసం ఈ జాగ్రత్తలు). ► ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. హాయిగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించాలి. గర్భధారణ సమయమప్పుడు ఈ సూచనలు... ► అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉన్నామని ఫీలవుతున్నప్పటికీ... డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం క్రమం తప్పకుండా వారి ఫాలో అప్‌లో ఉండాలి. ► గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల వివరాలు (ఫ్లూ షాట్ వంటివి) తెలుసుకుని, వాటిని తప్పక తీసుకోవాలి. ► ఆ సమయంలో డాక్టర్లు సూచించిన చికిత్స ప్రణాళికను పూర్తిగా అనుసరించాలి. ఇది తల్లి, కడుపులోని బిడ్డ... ఈ ఇరువురూ పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ► సమతులాహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అంటే... క్యాల్షియమ్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–డి వంటి అన్ని పోషకాలందేలా చూడాలి. శరీరానికి శ్రమ కలగని రీతిలోనే వ్యాయామం చేస్తూ, రోజంతా చురుగ్గా ఉండాలి. డాక్టర్ వరలక్ష్మి కె.ఎస్. సీనియర్ గైనకాలజిస్ట్ -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్‌రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) -
వరల్డ్ ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డు!
నిండునూరేళ్లు బతకమని ఆశీర్వదిస్తుంటారు.. కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్‌కు చెందిన ఓ డాక్టర్. ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్ హోవర్డ్ టక్కర్ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు. తన 100వ బర్త్‌డే తరువాత జూలైలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్‌లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించిన టక్కర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన... చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్ సైకోఎనలిస్ట్ అయిన టక్కర్ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది. (చదవండి: ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్) -
వైఎస్సార్ పెన్షన్ కానుక.. అవ్వా తాతలకు పండగ
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు సూర్యోదయానికి ముందే.. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి... సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు -
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
బీజింగ్: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది. -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ
జెరూసలేం: అలనాటి నాజీ మారణహోమం భయాందోళనలను భరిస్తూ జీవనం సాగించిన మహిళలను గౌరవించే నిమిత్తం రూపొందించిన వార్షిక ఇజ్రాయెల్ అందాల పోటీల్లో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్ విజేతగా నిలిచి "మిస్ హోలోకాస్ట్ సర్వైవర్" కిరీటాన్ని గెలిపొందారు. ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్వ్యాక్తో సందడి చేశారు. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) ఈ మేరకు కుకా పాల్మోన్ మాట్లాడుతూ.."హోలోకాస్ట్‌లో గడిపిన తర్వాత నేను నా కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్ళు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు. ఈ వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచకోవడం అద్భతమైన విషయం వర్ణించలేనిది". అంటూ చెప్పుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి నాజీల మారణహోమం కారణంగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో యువతను కోల్పోయింది. అప్పటి భయానక పరిస్థితులను భరిస్తూ ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది యూదు మహిళలను గౌరవించే నిమిత్తం ఈ అందాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఇజ్రాయెల్ అందాల పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా మహమ్మారి దృష్ట్యా గతేడాది నిర్వహించ లేకపోయినట్లు తెలిపారు. (చదవండి: ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్‌మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్‌కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్‌లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్‌ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్‌చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం
సాక్షి, మల్లాపూర్(కరీంనగర్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామంలో బాలిక(16) ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలిక రెండ్రోజుల క్రితం కిరాణానికి సరుకుల కోసం వెళ్లింది. అదే సమయంలో వృద్ధుడు(60) అక్కడికి వచ్చి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనకు గురైన బాలిక కేకలు వేసింది. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఇంటికి వెళ్లిన బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు బాలికతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిసింది. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): మోటాపురంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోటాపురానికి చెందిన భార్యాభర్తలు బుధవారం తమ ఆరేళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి కూలీ పనికి వెళ్లారు. ప్రతీరోజు ఇలాగే వెళ్తుండగా పాప చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునేది. దీనిని ఆసరాగా చేసుకుని వారి ఎదురు ఇంట్లో ఉండే దీప్లానాయక్(60) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనులకు వెళ్లొచ్చాక ఆమె తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవటంతో గ్రామం అంతా వెతికారు. అయినా దొరకపోవడంతో విలపిస్తూ అనుమానంతో దీప్లానాయక్ ఇంట్లోకి వెళ్లి చూడగా వివస్త్రగా పడి ఉంది. దీంతో విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సీడీపీఓ బాలాత్రిపుర సుందరికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నేలకొండపల్లి ఎస్సై జి.అశోక్‌రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
80 ఏళ్ల బామ్మః జ్యూస్ స్టాల్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు. అమృత్‌సర్‌లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్‌కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
క్రమం తప్పకుండా ఆదాయం
వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ. ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్‌డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్‌లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్‌పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే.. కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్ రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది. అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ఐడీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు. ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్‌డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపిక ఎలా? ఎంపిక చేసుకున్న ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్‌కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్లైన్ నుంచే ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్‌డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్సీ, ఎల్ అండ్‌టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్‌డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్‌డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది. పన్నుల విషయానికి వస్తే... మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్‌డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది. ఇక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. -
డీఎన్ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!
వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును సరిచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరు మందగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. మైటోకాండ్రియల్ డీఎన్ఏ పొడవు తగ్గుతున్న కొద్దీ మధుమేహం, వృద్ధులకు వచ్చే నాడీ సంబంధ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా దశాబ్ద కాలంలో మనిషి మైటోకాండ్రియల్ డీఎన్ఏలో నాలుగు కాపీలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశారు. యాంటీబయాటిక్‌ల ద్వారా వాటి మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గిపోయేలా చేసినప్పుడు కొన్ని వారాల్లోనే వెంట్రుకలు రాలిపోవడంతోపాటు, చర్మం ముడుతలు పడటం మొదలైంది. ఇవన్నీ వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలే. కాకపోతే వేగంగా చోటు చేసుకున్నాయి. యాంటీబయాటిక్‌లను నిలిపివేసిన వెంటనే పరిస్థితి చక్కదిద్దుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్య లక్షణాలకు, మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గుదలకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేశవ్‌సింగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
ఓ గొప్ప మజిలీ
జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. రెండు రోజుల్లో నేను 80. చాలా కారణాలకి ఇది చాలా గొప్ప మజిలీ. ఈ దేశంలో గొప్పతనా నికి మన్నిక లేకపోవచ్చుకానీ వయస్సుకి ఉంది. అది సుఖ వంతమైన జీవితానికి పెట్టు బడి. ఈ వయస్సులో శషబి షలు చెల్లిపోతాయి. ఇచ్చకా లకు కొత్త అర్థం వస్తుంది. ఎవరినయినా, ఎప్పుడైనా నిరంతరాయంగా విమర్శించవచ్చు. నచ్చితే మెచ్చుకుం టారు. నచ్చకపోతే ‘పాపం, ఆయనకి వయస్సు మీద పడిందయ్యా’ అని పక్కకి తిరిగి నవ్వుకుంటారు. నడకలో హుందాతనం పెరుగుతుంది. కుర్చీ లోంచి చక్రవర్తిలాగా ఠీవిగా లేవవచ్చు. అవి కీళ్ల నొప్పు లని మనకి తెలుస్తాయి. హుందాతనమని చూసినవారు సరిపెట్టుకుంటారు. తెలిసి తెలిసి తప్పులు చెయ్య వచ్చు. వయస్సు కనుక అందరూ అర్థం చేసుకుం టారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్ప వచ్చు. చాలామంది ముఖాలు గుర్తున్నా మరిచిపోయి నట్టు నటించవచ్చు. ‘నువ్వు వెంకటరావు కొడుకువి కదా?’ అని తెలిసి తెలిసి పలకరిస్తే– ‘కాదండీ. నేను చిన్నారావు మనుమడినని’ ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది. కుర్రకారుని ‘మీకేం తెలీద’ని అదిలించ వచ్చు. ఇదివరకులాగా ఆ మనిషి కోపం తెచ్చుకోడు. మనసులో ‘పిచ్చి ముండాకొడుకు’ అనుకున్నా బయ టికి చిరునవ్వు నవ్వుతాడు. వాడు అలా అనుకుంటు న్నాడని నీకు తెలుసు. అనుకున్నా వాడిని తిట్టగలిగినం దుకు నీకు ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ల కోరిక అదో! ఇది పాత ‘మచ్చ’ని తడువుకునే పిచ్చి సుఖం. పచ్చి సుఖం. ముసలివాడులెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థ మవుతూ ఉంటుంది. ఏ సమస్యమీదయినా నీ అభి ప్రాయాలను గుప్పించవచ్చు. చెల్లితే అనుభవం. చెల్లక పోతే ముసలితనం దిగజారుడు.వయస్సు మీద పడింది లెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థమ వుతూ ఉంటుంది. నీ ఆలోచనల అవసరం లేకుండా నీ అభిప్రాయాలను విరివిగా గుప్పించవచ్చు. అవి నీ ‘అమోఘమైన’ ఆలోచనతో చెప్పే హితవులాగా అందరూ వింటారు. కానీ వాళ్లు తలలూపుతున్న గొర్రె లని నీ మనస్సు చెప్తూంటుంది. నీ మనస్సు నవ్వు కుంటుంది. వాళ్ల మనస్సూ ఆ పనే చేస్తోందని నీకు తెలుస్తూంటుంది. రెండురకాల ‘ఆత్మవంచన’ వ్యాయామానికి ఈ దశ ప్రారంభం. ఇష్టంలేని వాళ్ల ముఖంమీద చెడామడా తిట్ట వచ్చు. నీ పెద్దరికం కారణంగా కడుపులో రగులు తున్నా ‘పోండి సార్! మీరు మరీనూ!’ అని పిచ్చి నవ్వు నవ్వుతారు. ఆ పిచ్చి నీకు కిర్రెక్కిస్తుంది. వయస్సులో నువ్వు చేసిన తప్పిదాలను నీ భార్య సరిపెట్టుకుంటుంది. ఇప్పుడిక చేసేది లేదు కనుక. అది కేవలం సరిపెట్టుకోవడమేనన్న నీ ‘వంకర’ బుద్ధి నిన్ను ‘చక్కిలిగింత’ పెడుతుంది. పాత జ్ఞాపకం– గుర్తొచ్చిన ‘దురద’ లాంటిది. మరోసారి గోకినా ‘సుఖం’గానే ఉంటుంది. ‘ఈ కుర్రకారు తగలబడి పోతోందని’ తరచుగా పెదవులు విరవొచ్చు. ఆ కుర్ర కారు చస్తే మారదని నీకూ తెలుసు. ఇది పాత ‘దురద’ని లేకపోయినా గోక్కోవడం లాంటిది. రాసిన ప్రతీ విషయాన్నీ– ఇప్పుడు– ఎవరూ సీరి యస్‌గా తీసుకోరు. బాగులేని కథని చదివి ‘ముస లాడిలో సరుకయిపోయిందనుకుంటూ’ ‘ఆహాహా! మీరు కాకపోతే ఎవరు రాస్తారు సార్ ఇది!’ అని లుంగలు చుట్టుకుపోతాడు. ఇంకాస్త జుత్తుంటే ‘గండ పెండేర మంటారు. సగమయినా ఊడితే రెండు యూని వర్సిటీల ‘డాక్టరేట్లు’ంటాయి. మరీ జుత్తు పండి– ఇంకా బతికుంటే ఓ ‘పద్మా..’ అవార్డ్ మొహంమీద పారేస్తారు. ఎనభయ్యో పడిలో కదలలేకపోయినా మోసుకెళ్లి రెండు మూడు సన్మానాలు– మీ కోసం కాదు– ఆయా సంస్థల గొప్పతనం కోసం– చేస్తారు. రచనలన్నీ వెదికి వెదికి పునర్ముద్రణలు చేస్తారు. నువ్వే మరిచిపోయిన గతాన్ని తవ్వి అలనాడు బట్టలు ఎండేసే తాడుమీద వాలిన కాకి నీలో ఎలా మొదటి కవితా వైభవాన్ని మేలుకొలిపిందో ఓ కవి గానం చేస్తాడు– ఆవేశంగా కన్నీటి పర్యంతం అవుతూ. ఇంతకూ ఏం జరిగింది? ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవని వాళ్లకి నమ్మకం కుదిరింది. ‘నువ్వు పోయే కాలం వచ్చిందని వాళ్లకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవడం ‘వారి’ అభిరుచిగా తర్జుమా చేసుకుంటారు. ఇది ‘సాహిత్య పరిణామ కంపు’. గతాన్ని అటకెక్కించే గౌరవ వందనం. అయ్యో! ఈ 80 ఏళ్ల వయస్సు ఏ 40 ఏళ్లకిందటో వచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. ముందుకు వెళ్తున్న ప్రతీ క్షణమూ మళ్లీ తెరుచుకోని తలుపుల్ని ఒక్కొక్కటే మూసుకుంటూ ముందుకు సాగిపోయే ప్రస్థానంలో గంభీరమైన మజిలీ–80. గొల్లపూడి మారుతీరావు -
వన్.. టు.. త్రీ.. గో!
లైఫ్ ఈజ్ ఎ ఛాయిస్! స్వేచ్ఛ ఉంటుంది. నిగూఢంగా.. సంకోచాల మధ్య దాగి ఉంటుంది. సంకోచాలు పొరల్లాంటివి.ఆత్మగౌరవాన్ని, జీవితాన్ని, ధైర్యాన్ని కప్పేస్తాయి! జీవిత బంధం అందమైనదే... నిర్బంధం కానంత వరకు. నిర్బంధం అనిపించనంత వరకు. నిజానికి.. బంధం ఎవరితోనో కాదు.. ముందు మనకు మనతో ఉండాలి. మనల్ని మనం నిర్బంధించుకోకూడదు. అనుమానం, అవమానం, అన్యాయాల నుంచి.. వన్.. టు.. త్రీ.. గో! బాల్యంలో, యవ్వనంలో, వైవాహిక జీవితంలో, వృద్ధాప్యంలో.. ఏ దశలోనూ స్త్రీకి ఛాయిస్ ఉండదు. అమ్మానాన్న చెప్పినట్లో, సమాజం నిర్దేశించినట్లో, భర్త ఆదేశించినట్లో, బిడ్డలు ఆశించినట్లో ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండా సాగిపోతుంది. ఇష్టాలు, అభిప్రాయాలు, ఆశయాలు, నిర్ణయాలు ఇవేవీ స్త్రీ జీవితంలో ఉండవు. అసలు తను జీవిస్తున్నది తన కోసమే కాదన్నంతగా ఆమె తన చుట్టూ ఉన్న బంధాల నిర్బంధనాలలో.. ముళ్లకంపపై చీరలా పరుచుకుంటుంది. ఎక్కడో కొందరు స్త్రీమూర్తులు మాత్రమే ఆ ముళ్లను విడిపించుకుని బయటికి వచ్చే ధైర్యం చేస్తారు. ‘హర్ఛాయిస్’ పేరుతో బీబీసీ భారతీయ భాషల విభాగం తాజాగా రూపొందించిన పన్నెండు నిజజీవిత కథలు.. అలా ముళ్లను విడిపించుకున్న మహిళలవే! వాటిలోని మూడు కథలివి. మై బిగ్ సీక్రెట్ పశువులా మీద పడటానికి వచ్చిన ప్రతిసారీ నా భర్తకు నేను ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట.. ఏదో ఒక అబద్ధం. ‘అయితే నాకేంటి?’ అని మీద పడేవాడు! అలా నా 20వ యేటకే నలుగురు పిల్లల్ని కన్నాను. పనేమీ చేసేవాడు కాదు. తాగొచ్చేవాడు. కొట్టేవాడు. మీద పడేవాడు. అదే పని. అమ్మకు చెబితే, ‘ప్రతి ఇంట్లోనూ ఉండే ముదనష్టమే’ అని బాధపడింది. భర్తను మాత్రం వదిలెయ్యొద్దంది. నేను ఒకరింట్లో పనిచేసేదాన్ని. నా గురించి ఆమెకు తెలుసు. ‘మళ్లీ గర్భం వస్తుందేమోనమ్మా..’ అని తరచూ నేను ఆమె దగ్గర అంటుండేదాన్ని.‘‘నేను చెప్పినట్లు చేస్తావా?’’ అన్నారు ఓరోజు ఆవిడ.. నా బాధను, భయాన్ని చూసి. చేస్తానన్నాను. ఏం చెయ్యాలో చెప్పారు ఆవిడ. ‘‘నా భర్తకు తెలిస్తే చంపేస్తాడేమోనమ్మా’’ అన్నాను. ‘‘నువ్వు చెబితేనే కదా తెలిసేది’’ అన్నారు. ఆవిడ చెప్పిన దాని గురించి చాలారోజులు ఆలోచించాను. నా భర్తకు తెలిస్తే ఏమౌతుంది? ఇంకా తాగుతాడు. ఇంకా కొడతాడు. అప్పటికి అయిపోతుంది. మళ్లీ మళ్లీ పిల్లల్ని కంటూ ఉండే నరకం తప్పుతుంది కదా అనుకున్నాను. ఒక నిర్ణయానికి వచ్చాను. పదేళ్లయింది ఇప్పటికి. నా భర్తకు తెలీదు, నా పిల్లలకూ తెలీదు.. నేను ఆపరేషన్ చేయించుకున్నానని. ఆ రహస్యం నాలోనే ఉండిపోయింది. నా భర్త ఇప్పటికీ తాగొస్తాడు. ఇప్పటికీ మీద పడతాడు. కానీ నాకొక ధీమా. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదని. నాకొక గర్వం. నా దేహం నా చెప్పుచేతల్లోనే ఉందని. ఓ పెద్ద రహస్యాన్ని నేను కడుపులో మోస్తున్నాను. ఆ రహస్యానికి నేనెప్పటికీ జన్మనివ్వను. బార్న్ అగైన్ అది మా ఫస్ట్‌నైట్. నా వయసు 35 ఏళ్లు. నేను కన్యను. అయితే ఆ ఫస్ట్‌నైట్ తర్వాత కూడా కన్యగానే ఉండబోతున్నానని నాకు తెలియదు. గదిలోకి వెళ్లాను. నా భర్త నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడని, నాపై ముద్దులు కురిపిస్తాడని ఎదురుచూస్తున్నాను. అటు తిరిగి పడుకున్నాడు! నిద్రపోయాడు! అయితే అది వచ్చిన నిద్ర కాదని, తెప్పించుకుంటున్న నిద్ర అని కొన్నాళ్ల తర్వాత నాకు తెలిసింది. ఫస్ట్‌నైట్ తెల్లారే అడిగాను. ఒంట్లో బాగోలేదన్నాడు. రెండో రాత్రి, మూడో రాత్రి, ఆ తర్వాతి రాత్రులన్నిట్లో అతడికి ఒంట్లో బాగోలేదు. సెక్స్ ఒక్కటే నా సమస్య కాదు. కనీసం అతడు నన్ను టచ్ చెయ్యడం లేదు! మాట్లాడ్డం లేదు. నా అనుమానం నిజమైంది. ఆ నిజాన్ని మా అత్తమామలు దాచిపెట్టి నా గొంతు కోసారు. దుఃఖం వేసింది. గది తలుపులు వేసుకుని బోరున ఏడ్చారు. మావాళ్ల దగ్గర కూడా. ‘‘ఊర్కో. ఏమీ జరగనట్లే ఉండు. నీ కర్మింతే అని సరిపెట్టుకో’’ అని సలహా ఇచ్చారు. నేను సరిపెట్టుకోలేక పోయాను. అర్థంలేని రిలేషన్ అది. మెడలో తాళి ఉన్నా, మదిలో మొగుడు లేని రిలేషన్ అది. పిచ్చి రిలేషన్. అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. భర్తని వదిలేస్తే తప్పు ఈ సమాజంలో. కానీ అతడు భర్తకూడా కాదే! వదిలేయొచ్చు. అమ్మకీ, నాన్నకీ చెప్పాను. ‘‘భర్తకు విడాకులిస్తే, నిన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వం’’ అన్నారు అమ్మానాన్న!నాకిక ఏ గడపా అక్కర్లేదనుకున్నాను. మెట్టినింటికి, పుట్టింటికి దూరంగా వచ్చేశాను. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఉమెన్స్ హాస్టల్లో చేరాను. ఉద్యోగం వెతుక్కున్నాను. విడాకులకు ఫైల్ చేశాను. నా భర్త, అత్తమామలు నన్ను దూషించారు. పరాయి పురుషులతో సంబంధాలను అంటగట్టారు. నేనేం బాధపడలేదు.ఇంపొటెంట్ భర్తతో ఏ సంబంధమూ లేకుండా ఒకే ఇంట్లో ఉండటం అంతకంటే పెద్ద బాధ. విడాకులు రావడానికి మూడేళ్లు పట్టింది. విడాకుల పత్రాలు చేతికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కడుపులోంచి మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఫ్రెష్‌గా. ఎవ్రీథింగ్ విల్బి ఆల్రైట్ ముస్తఫాతో నేను ప్రేమలో పడినప్పుడు ముస్తఫాది ఏ దేశమో, ముస్తఫాది ఏ మతమో, ముస్తఫాది ఏ కులమో నేను చూసుకోలేదు. ప్రేమించానంతే. నేను క్రిస్టియన్ని. నార్త్ ఈస్ట్‌లో మాది చిన్న ఊరు. ముస్తఫా ముస్లిం. ఆఫ్రికన్. ఇద్దరం కలిసున్నాం. అయితే కొన్నాళ్లే! మమ్మల్ని కలిపి ఉంచగల ఏ సామాజిక శక్తీ మాకోసం రాలేకపోయింది. అడ్డు మరి. కులం అడ్డు. మతం అడ్డు. దేశం అడ్డు. మా సహజీవనం తెగిపోయేనాటికి నాకు 21 ఏళ్లు. నా కడుపులో అతడి బిడ్డ. ‘తీయించుకో’ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. ‘ఉంచుకుంటాను’ అన్నాను. ‘ఎందుకా దరిద్రం!’ అన్నట్లు చూశారు. అంతకన్నా బాధించే మాట.. ముస్తఫా అన్నాడు! ‘నీ లోపల ఉన్నది నా బిడ్డే అని నమ్మకం ఏంటి? అని. ఆ క్షణమే అతడితో విడిపోయి వచ్చేశాను. కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటని నా తల్లిదండ్రులు బాధపడలేదు. ఈ భూమ్మీదకి తమది కాని వారసత్వాన్ని ఎక్కడ మోసుకొస్తానోనని భయపడ్డారు. కూతురికి నల్లటి ఆఫ్రికా శిశువు పుట్టబోతున్నాడంటేనే వాళ్లకు కంపరంగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు నన్ను వెలివేశారు. నేను, నాకు పుట్టబోయే బిడ్డ.. ఇద్దరమే ఒకరికొకరం తోడుగా ఈ మనుషుల మధ్య నిలబడిపోయాం. చేరదీసేవారు లేరు. గ్లాసు నీళ్లతో సేదతీర్చేవారూ లేరు. నాకొక మంచి ఉద్యోగం కూడా లేదు. ఒక్క ఫ్రెండు మాత్రం మిగిలింది. ‘జాగ్రత్తే’ అంది. తన మీద తలవాల్చి ఏడ్చేశాను. నొప్పులొచ్చే వరకు ఆ ఫ్రెండే నాకు తల్లి అయింది. దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి చూడగానే నా మనసు తేలికయింది. ఇప్పుడు నా వయసు 29 ఏళ్లు. నా బిడ్డ వయసు ఆరేళ్లు. ఈ ఆరేళ్లు నేను లోకానికి ఎదురీదాను. బలంగా తయారయ్యాను. నా బిడ్డకు బలాన్ని ఇవ్వాలంటే ఈ మాత్రం బలం నాకు ఉండాలి కదా. త్రీ స్టోరీస్: దివ్య ఆర్య, ఐశ్వర్య రవిశంకర్, సింధువాణి త్రిపాఠీ. / ఇలస్ట్రేషన్స్ : గోపాల్ శూన్య -
పించన్ కోసం వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
-
వృద్ధాప్యంలోను అద్భుతమైన డ్యాన్స్
-
వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య
నాగోలు: పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించని వారు సమాజాన్ని ప్రేమించలేరని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. వృద్ధాప్యం ఎవరికీ భారం కావొద్దని పేర్కొన్నారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రా, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్ నాగోలులో 264 జంటలకు సామూహిక షష్టిపూర్తి మహోత్సవం, వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడుతూ 60 సంవత్సరాల షష్టిపూర్తి చేసుకున్న వారు వంద సంవత్సరాలు హాయిగా జీవించాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున సామూహిక షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిలు మాట్లాడుతూ వైశ్యులు సేవారంగంలో ఎప్పుడూ ముందుంటారని, గ్రామాలలో ఏ ఒక్కరికీ ఇబ్బందులు వచ్చినా మొదటగా వెళ్లేది వైశ్యుల దగ్గరికేనని అన్నారు. ప్రభుత్వం తరపున వైశ్యులకు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు సమాజ దిక్సూచిలాంటి వారని, వారి దగ్గరి నుంచి సలహాలు తీసుకుని ముందుకు సాగాలన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వైశ్యులను అంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. 264 మంది జంటలు షష్టిపూర్తి మహోత్సవంలో పాల్గొనగా, 21 మంది అనాథ జంటలకు కూడా ఈ ఉత్సవంలో అవకాశం కల్పించారు. అనంతరం తులాభారం నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. 264 మందికి ఒకేసారి షష్టిపూర్తి నిర్వహించడంతో ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్‌లో స్థానం లభించిందని ఆ సంస్థ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు గంజి రాజమౌళిగుప్తా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎంపీ మల్లారెడ్డి, నిజామాబాద్, గోషామహల్ ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, రాజాసింగ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
యంగ్ ఏజ్‌లో ఓల్డ్ ఏజ్ చూడొచ్చు
మిచిగాన్: వృద్ధాప్య సమస్యలు మనకు తెలియనివికావు. వయసు మీద పడుతున్నాకొద్దీ కాళ్లు పీకుతుంటాయి. చేతులు లాగుతుంటాయి. మొకాళ్లు సలుపుతుంటాయి. నడుము వొంగదు. మెడ కదలదు. నాలుక తిరగదు. కాళ్లు ముందుకు పడవు. కాసేపు నడిస్తేనే అలసట. చేతులు సరిగ్గా ఆడవు. ముంచేతులు లాగుతుంటాయి. చూపు సరిగ్గా ఆనదు. గుడ్లు పీకుతుంటాయి. చెవులు సరిగ్గా వినిపించవు. బుర్ర సరిగ్గా పనిచేయదు. చుట్టుపక్కల గోలగోల ధ్వనులు. మొత్తంగా పరిస్థితి గందరగోళంగాను, బిత్తరబిత్తరగాను ఉంటుంది. యుక్త వయస్సులోనే ఇలాంటి పూర్తి అనుభూతులను మనకు కలిగించే ఓ సూట్‌ను ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ రూపొందించింది. కళ్లు గ్లూకోమా వచ్చినట్టు మసమసకగా కనిపించేందుకు గాగుల్స్‌ను, చెవులు సరిగ్గా వినిపించకుండా ఉండేందుకు హెడ్‌ఫోన్స్‌ను, మెడ సరిగ్గా తిరగకుండా ఉండేందుకు నెక్ బ్యాండ్‌ను, స్టిమ్యులేట్ చేయడానికి గ్లోవ్స్‌ను, కాళ్ల పిక్కలను పట్టి ఉంచేందుకు పట్టీలను రూపొందించి, వీటన్నింటితో కలిపి ఓ సూట్‌గా తయారు చేసింది. ఈ సూటను ఎవరు ధరించినా వందేళ్లకు పైబడిన వృద్ధుడిగా అనుభూతి పొందక తప్పదు. 36 ఏళ్ల రిచర్డ్ గ్రే అనే ఓ మిడియా రిపోర్టర్‌కు ఈ సూట్‌ను తొడిగి ఫోర్డ్ కంపెనీ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించింది. ఈ సూటును ధరించి రిపోర్టర్ ఓ పబ్లిక్ పార్కులో ప్రయాసపడి పరుగెత్తాడు. పైన ఉదహరించిన అనుభూతులన్నీ ఆయన అనుభవించినవే. రోజూ సునాయాసంగా పరుగెత్తే తాను ఆ సూటు ధరించాక రెండు కిలోమీటరు పరుగెత్తడం కూడా గగనమైందని, సూటు విప్పివేయగానే మళ్లీ 36 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేశానని ఆయన తన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ‘థర్డ్ ఏజ్ సూట్’ పేరు పెట్టిన ఈ సూటును కంపెనీ ఉత్పత్తుల ప్రచారకర్తగా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన 104 ఏళ్ల బ్రిటీష్ మారథాన్ రన్నర్ సిక్ ఫౌజా సింగ్‌ను మోడల్‌గా తీసుకొని రూపొందించారు. పడుచువాళ్లకు వృద్ధాప్య సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ సూటును తయారు చేయలేదు. నిజంగా వృద్ధుల సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అర్థం చేసుకొని వారికి అనుగుణంగా కార్లను, వాటిలోని డ్రైవింగ్ వ్యవస్థను రూపొందించడం కోసమే ‘ఫోర్డ్’ కంపెనీ ఈ సూటును రూపొందించింది. ఈ ప్రయోగం ద్వారానే వృద్ధులు ఇగ్నిషన్ కీ ద్వారా కార్టును స్టార్ట్ చేయలేరని భావించి, దాని స్థానంలో బటన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే కారు డోర్లు వేయడం, తీయడాన్ని మరింత సులువు చేసింది. వృద్ధులు సులభంగా కార్లను పార్కు చేసేందుకు కూడా అవసరమైన మార్పులు తీసుకొస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ముదిమిలో హాబీలతో మేలు
పరిపరి శోధన ముదిమి వయసులో ఏం చేయగలం... రామా కృష్ణా అని కాలక్షేపం చేయడం తప్ప అనుకుంటే తప్పే అంటున్నారు అంతర్జాతీయ వైద్య పరిశోధకులు. నిజానికి ఆ వయసులో కావలసినంత తీరిక దొరుకుతుందని, మనసుకు నచ్చిన హాబీలతో ఆ తీరికను సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. ఫొటోగ్రఫీ, కుట్లు, అల్లికలు, తోటపని వంటి హాబీలు అలవాటు చేసుకుంటే, ముదిమి వయసులో మెదడు చురుకుగా పనిచేస్తుందని, దానివల్ల డెమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవని తమ అధ్యయనంలో తేలినట్లు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ముదిమి వయసులో ఇలాంటి హాబీలలో నిమగ్నమైన వారికి మెదడుకు సంబంధించిన రుగ్మతలు తలెత్తే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వారు అంటున్నారు. -
ఆర్గస్-2.. వృద్ధాప్యంలో కాంతిరేఖ!
వృద్ధులకు వయసు మీద పడుతున్నకొద్దీ కంటిచూపు మందగించడం సాధారణమే. రెటీనా ఎక్కువగా దెబ్బతింటే కొందరిలో చూపు పూర్తిగా పోతుంది కూడా. అయితే, వయసు రీత్యా అంధత్వానికి గురయ్యే పండుటాకుల జీవితాల్లో ఇకపై వెలుగులు తిరిగి ప్రసరించనున్నాయి. దెబ్బతిన్న రెటీనా పనిచేసేలా ప్రేరేపించే ‘ఆర్గస్-2 రెటీనల్ ఇంప్లాంట్’ వృద్ధులకు కారుచీకట్లో కాంతిరేఖలా మారనుంది. ‘వయసు రీత్యా వచ్చే అంధత్వం(ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్-ఏఎండీ)’ సమస్యతో చూపు కోల్పోయిన ఓ వృద్ధుడికి మొట్టమొదటిసారిగా ఆర్గస్-2తో బ్రిటన్ వైద్యులు విజయవంతంగా చూపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరో మార్గం సుగమం చేశారు. రేమండ్ ఫ్లిన్. మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు. రెటీనా మధ్యభాగం దెబ్బతినడంతో ఏఎండీ వల్ల కొన్నేళ్ల క్రితమే పూర్తిగా చూపు కోల్పోయాడు. ఇన్నేళ్ల తర్వాత మాంచెస్టర్‌లోని రాయల్ ఐ హాస్పిటల్ వైద్యులు మళ్లీ అతడికి వెలుగులు ప్రసాదించారు. ఆర్గస్-2 ఇంప్లాంట్‌ను అమర్చి ఇటీవల మళ్లీ చూపును తెప్పించారు. సెకండ్ సైట్ సంస్థ రూపొందించిన ఆర్గస్-2 కృత్రిమ రెటీనా పరికరానికి 2013లోనే అమెరికాలో ఆమోదం లభించింది. రెటీనా దెబ్బతినడం వల్ల దృష్టిక్షేత్రంలో బయటివైపు ఖాళీ ఏర్పడే ‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’ అనే వ్యాధికి చికిత్స కోసమే దీనిని ఇంతవరకూ వినియోగించారు. అయితే, ఏఎండీకి కూడా దీనిని ఉపయోగించవచ్చని తొలిసారిగా బ్రిటన్ వైద్యులు నిరూపించారు. ఇంప్లాంట్‌తో సహా మొత్తం చికిత్సకు రూ. 79 లక్షల వరకూ ఖర్చయిందట. భవిష్యత్తులో ఇంప్లాంట్ ఖరీదు తగ్గే అవకాశాలున్నాయి. ఇలా పనిచేస్తుంది... * కంటిలో దెబ్బతినకుండా మిగిలిపోయిన రెటీనా కణాలు తిరిగి పనిచేసేలా ఆర్గస్-2 ఇంప్లాంట్ ప్రేరేపిస్తుంది. * కళ్లజోడులోని కెమెరా తొలుత దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఈ వీడియోలోని చిత్రాలను కంప్యూటర్ ప్రాసెసర్ విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. * విద్యుత్ సంకేతాలు వైర్‌లెస్‌గా కనుగుడ్డుకు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు చేరుతాయి. యాంటెన్నా నుంచి కేబుల్ ద్వారా రెటీనాపై ఇంప్లాంట్‌కు ఉండే ఎలక్ట్రోడ్‌కు చేరతాయి. * ఎలక్ట్రోడ్లు రెటీనాపై కణాలను ప్రేరేపిస్తాయి. మెదడుకు సమాచారం చేరి కాంతి తేడాల విశ్లేషణ జరుగుతుంది. * దీంతో పూర్తిగా కాకపోయినా కొంత మేరకు చూపు తిరిగి వస్తుంది. రోగి అస్పష్టంగా చూడగలుగుతాడు. * భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధిపరిస్తే చూపు మెరుగవుతుందని చెబుతున్నారు. -
సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ..
ముదిమి వయసు... బాల్యం లాంటిదనే మాటలను నిజం చేస్తున్నాడతను. మొదట హౌజింగ్‌బోర్డులో పనిచేసి... తరువాత టూరింగ్గైడ్గా మారిపోయిన ఉత్సాహం పేరు కాశీనాథ్‌రావు. ఎనిమిది పదుల వయసులోనూ ఎంప్లాయ్‌గా కొనసాగుతూ... 40 ఏళ్లు నిండితే నీరసించిపోతున్న నేటితరానికి సవాల్ విసురుతున్నాడు. విల్‌పవర్ ఉండాలే కానీ... వయసు మనసుకే కాదు, ఉద్యోగానికి అడ్డుకాదని నిరూపిస్తున్నాడు! ..:: పిల్లి రాంచందర్/ చార్మినార్ 80 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి ఏం చేస్తారు? ‘కృష్ణా.. రామా’ అంటూ ఏ తీర్థయాత్రలకో వెళ్తారు! కానీ పర్యటనలకు వెళ్లడం కాదు... ఎనభై పదుల వయసులో తానే టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నారు కంది కాశీనాథ్‌రావు. పాతబస్తీ చందూలాల్ బారాదరికి చెందిన కాశీనాథ్ బహుభాషా ప్రవీణుడు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ, అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్, జపనీస్, బెంగాలీ, సంస్కృత భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే నగరాన్ని చూసేందుకు వచ్చిన ప్రముఖులెవరైనా... గైడ్ మాత్రం ఆయనే. 50 ఏళ్లకిందట... అప్పటి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్రలూథర్.... కాశీనాథ్‌ను టూరిస్ట్‌గైడ్‌గా నియమించారు. 2003 జనవరిలో సింగపూర్ అధ్యక్షులు ఎస్. ఆర్. నాథన్, 2003 మార్చిలో జర్మనీ అధ్యక్షులు జోహన్స్, 2005 మేలో ఇరాన్ ఉపాధ్యక్షులు అలీ హష్మీ బహ్మనీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్.ఎస్. సర్కారియాతోపాటు ఎంతోమంది ప్రముఖులు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంలను సందర్శించడానికి వచ్చినప్పుడు టూరిస్టు గైడ్‌గా వ్యవహరించింది ఆయనే. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారో... ఇప్పుడూ అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నారాయన. 2013 ఏప్రిల్ 14న చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం చూసేందుకు వచ్చిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ కాలెబ్ రిఫయ్కూ గైడ్‌గా వ్యవహరించింది కాశీనాథే! ఇన్నేళ్లలో ఆయనకు వచ్చిన ప్రశంసలు అనేకం. పలుమార్లు బెస్ట్ టూరిస్ట్ గైడ్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ భాషలన్నీ నేర్చుకోవాలనే తపన కాశీనాథ్రావులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయప ఎంఫిల్ చేస్తున్నారు. ఈ వయసులో ఇంత యాక్టివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారంటే... ‘వాకింగ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారాయన!. -
పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి
మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే... పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని ‘హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి’ అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు! ఈ పరిస్థితుల్లో పెద్దతరానికి ఊరటనిచ్చేలా యువతరాన్ని మలిచేవారెవరు? కాల యవనిక మరోసారి జారింది. మరుక్షణం లేవడానికే కదా! కాలంతో పాటు పరుగెట్టలేని ఎందరెందరో మధ్యలోనే రాలిపోతుంటారు. జీవితం ఎంతో విసుగ్గా తాపీగా సాగుతుందన్నప్పుడూ, కష్టాలు మనిషిని కుంగ తీస్తున్నప్పుడు- ‘అయ్యో ఈ రోజులు త్వరగా ఎందుకు కదలవు’ అనుకున్నప్పుడు ఇనుపగుళ్లు కాళ్లకి కట్టుకున్నట్టు అడుగేయదు కాలం. అదే హాయిగా ఉన్నప్పుడెందుకలా పరుగులు తీస్తుందో నాకర్థం కాదు. పద్నాల్గు వస్తోందనుకునేలోగా ఆశ్చర్యంగా అయిపోయింది! హైద్రాబాదే ఇంతగా మారితే దేశం సంగతి ప్రపంచం సంగతి గురించి ఏం చెప్పాలి? నాకు ప్రపంచం అంతా ముసలివాళ్లతో నిండిపోయినట్టు అనిపిస్తోంది! ముసలితనంలోని ఒంటరితనం, అక్కరలేని తనం తల్చుకుంటూనే చాలామంది కృంగిపోతూ కనిపిస్తున్నారు! నిజమే వృద్ధాశ్రమాలు చాలా సౌకర్యాలతో వస్తున్నాయి. కాని ఒంటరితనం ఎందుకు బాధించాలి పెద్దవాళ్లని. ఆశలూ, ఆశయాలూ కొడుకుల్లోనే చూసుకుని సర్వం త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. అది వారి అత్యాశకాదు... అభిమానం. ఎదురుచూపు కాదు... ఒంటరిగా ఉండం అన్న ఆశ. పిచ్చా! కాలం మారిపోయింది. పైసాలో ప్రపంచం అని ఇది వరకు అంటే నవ్వేరోజులు పోయాయి. డబ్బు, సౌకర్యాలు సుఖ జీవితాన్నిస్తాయని, పిల్లలు వాటిని గుమ్మరిస్తున్నారు. పాపం వాళ్లు మటుకు ఏం చేస్తారు? ఉద్యోగాలు, పెళ్లాల కండిషన్లు, తమ పిల్లల భవిష్యత్తు వారికీ ముఖ్యం కదా! నేను హైదరాబాదు శాశ్వతంగా వచ్చేశాక ఎందుకో ఒంటరితనం పీడించలేదు! చాలా సాహితీ సంస్థలు, సమాజాలు, సమావేశాలు చాలా బాగుండేవి... కాని...? చూస్తుండగానే సీను పూర్తిగా మారిపోయింది. కారణం- సాహిత్యం చచ్చిపోలేదు. సంస్కారమూ చచ్చిపోలేదు. పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. నాకు ఈ మార్పు చాలా వింతగా అనిపిస్తుంది. నేను కాళోజీ అభిమానిని. దాశరథి నన్ను ఒదినగారు అని పిలిచేవారు. సినారే నాకు అభిమాన కవి. నా కెరీర్ ప్రారంభం నుంచీ తెలిసిన వాళ్లు వేరెలా అవుతారు. అభిమానించకుండా ఉండడం ఎలా? పి.టి.రెడ్డి వంటి చిత్రకారులతో గంటలు గడిపిన సరదాను ఎలా మరిచిపోగలను? కాలం ఇంత దారుణంగా ఎందుకు మారిపోయింది! మనుషులు కాదు పట్నం కూడా పూర్తిగా మారిపోయింది. టాంక్బండ్ విగ్రహాల గట్టున కూర్చుని వేరుసెనగలు, మొక్కజొన్న పొత్తులూ హాయిగా తినగల్గేవాళ్లం. పక్కన గట్టు మీద కూర్చుని వేడివేడిగా వాడివాడిగా సాహిత్య చర్చలు, కొత్త కవితలు గానాలూ....ఆహా! తిరిగిరాని రోజులు! హైద్రాబాదు ఇప్పుడు ఒంటరి ద్వీపం. ఇక్కడి మేధావులు కూడా ఒంటిస్థంభాల వాసులు! ఎవరి గోల వారిదే! ఏ ఎండకాగొడుగే - ‘అదొక్కటే కొనసాగడానికి దారి’ అన్నాడో మిత్రుడు. నిజమే కాలంతో పాటు ఊళ్లు కూడా పాతబడిపోతాయి. కాని అందాన్ని చెడగొట్టి లాభం ఏమిటి? అన్ని రకాలుగానూ హైదరాబాద్ అందం భయంకరంగా తయారైందని ఒక్కసారి తిరిగి చూస్తే అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా ఉట్టినే చూడడానికి ప్రయాణం చేయండి. సీటు బెల్టే కాదు- వీపుకి సపోర్టు, మెడకి కాలరు- అబ్బో అదిరేలాగా రోబోలాగా తయారవ్వాలి. ఏ రోడ్డులోనూ మీరు హాయిగా ప్రయాణం సాగించలేరు! ‘సిటీ బాగా పెరిగిపోయింది. ఇదిప్పుడు అందరూ తిరగ్గలిగినదీ బ్రతక్కలిగినదీ కాదమ్మా. బండి ఉన్నవాళ్లు, డబ్బున్నవాళ్లు- తప్పించి. వాళ్లకే రక్షణలేదు’’. ఎందుకంటే ఏమో! ఎక్కడ ఆపుతారో- ఎందుకు ఆపుతారో కూడా తెలియదు. ఇక ఆకాశమార్గాలు వస్తే- జనం సుఖంగా-! ఆగండి ఆగండి. తప్పదు అవి వచ్చేదాకా సామాన్యుడి జీవితం- అంపశయ్య! ‘‘ఇప్పుడు మనం మాట్లాడ కల్గిందేం లేదు. మౌనం- గొప్ప భూషణం. అర్థం చేసుకుని బ్రతకండి’’ అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు- తమని తామే హెచ్చరించుకుంటున్నారు. జీవితంలోని కలలు, ఆశలు, ఆదర్శాలు అన్నీ గుప్పిట పట్టుకుని వచ్చిన ఎంతోమంది ఎందుకో సామూహికంగా నిట్టూరుస్తున్నారు. మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే- పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు. పరిస్థితులు మౌనంగా ఉండమంటున్నాయి. బ్రతికి బట్టకట్టడానికి మౌనం నేడు గొప్ప భూషణం. నా కళ్లముందు ఎన్నో దేశాల్లో ముసలితనాన్ని చూశాను. చాలా చోట్ల కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నా తృప్తిగానే బ్రతుకుతున్నారేమో అనిపించింది. మనని చూసి ‘మీరు చాలా అదృష్టవంతులు. అక్కడ పెద్దలకి గౌరవం ఉంది’ అంటే... నేను ఔనౌను అని తలూపాను గాని ఏదీ ఆ గౌరవం? ఏదీ ఆ ఆప్యాయత? కనిపించడం లేదేం? జనం, ఊళ్లు, వాతావరణం పూర్తిగా మారిపోయాయి ఎందుచేత? నాకు ఆలోచనలు సాగడం లేదు. ఇప్పుడు ఆడామగా తేడా లేదు అంటారు. కాని ఆడవాళ్లంతా శరీరాల్లాగా కనిపిస్తున్నారెందుకు? మగవాళ్లంతా వేటగాళ్లలూ కనిపిస్తున్నారెందుకు? సంస్కారం అన్నదేమయిపోయింది. పిల్లల్ని చూసి కన్నవారు భయపడడం ఏమిటి? పెద్దల్ని ఈడ్చి పారేసే ఈ తరానికి జన్మనెవరిచ్చారు. అమ్మకాదే? పుట్టుక కాదే? ఎక్కడిది? సమాజం సగం చచ్చిలేదు. పూర్తిగా చచ్చి దుర్గంధం వెదజిమ్ముతోంది. సెంటు కొట్టి లాభం లేదు. దహన సంస్కారమే కొత్త నాంది అవుతుందా? ఏమో ఎలా ఈ యువతరానికి మంచి దారి చూపెట్టడం? -
వృద్ధాప్యంలో కీలక సమస్య ‘ఫాల్’
డాక్టర్ సలహా ఇటీవల పెద్దవయసు వారు బాత్‌రూమ్‌ల్లోనూ, మెట్ల దగ్గర పడిపోతున్న ఉదంతాలను ఎక్కువగా చదువుతున్నాం. ఇలా పడిపోయే అవకాశాలను ముందుగా తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? - సీహెచ్. సుదర్శన్‌రావు, మహబూబ్‌నగర్ ఫాల్ అంటే పడిపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చిన్నవయసు వారు పడిపోయి, ఫ్రాక్చర్ అయినా వారు కోలుకునే వ్యవధి తక్కువ. ఎముక అతుక్కునే తీరు కూడా వేగంగా జరుగుతుంది. కానీ పెద్దవారు పడిపోయి, ఎముక ఫ్రాక్చర్ అయితే అది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తాము పడిపోయే అవకాశాన్ని వృద్ధులు తమకు తామే పరీక్షించుకోవచ్చు. ముందుగా మీ కుడి చేతిని గోడకు ఆనించి నిలబడండి. దాన్ని గోడకు ఆనించి ఉంచే పిడికిలి బిగించి నేరుగా ముందుకు చాపండి. ఇలా కుడి చేతిని నిటారుగా ఉంచి ముందుకు కొద్దికొద్దిగా ఒంగుతూ... పడిపోకుండా గరిష్టంగా ఎంతమేరకు ఒంగగలరో చూడండి. ముందుకు ఒంగకుండా కేవలం కుడి చేయి చాచి ఉన్నప్పుడూ.... పడిపోకుండా ముందుకు ఒంగుతూ చాచిన చేతిని పొడిగించినప్పుడూ ఉన్న తేడా ఒక అడుగు (30 సెం.మీ.) ఉంటే అలాంటి వృద్ధుల్లో ‘ఫాల్’కు (పడిపోవడానికి) అవకాశం చాలా తక్కువ. అయితే ఒకవేళ ఇలా ఒంగుతూ చేతిని సాచినప్పుడు మీరు మీ చేతిని కేవలం 30 సెం.మీ లోపే సాచగలుగుతుంటే మాత్రం బాత్రూమ్లోనో లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడో లేదా ఇతరత్రా కార్యకలాపాల్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ అని గుర్తించండి. ఇలాంటి వాళ్లు నడిచేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. - డాక్టర్ బి. విజయకుమార్, సీనియర్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ -
‘ఆసరా’ దొరకదేమోనని..!
పింఛన్ బెంగతో 13 మంది మృతి సాక్షి నెట్వర్క్: పింఛన్ రాదేమోనని.. రాలేదన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో పదమూడు మంది మృతి చెందారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన చీకటి రామయ్య(80), కూసుమంచి మండలం గంగబండ తండ పంచాయతీలోని బోటిమీది తండాకు చెందిన బానోతు బాబు(75), కల్లూరులోని పుల్లయ్య బంజర్ రోడ్డుకు చెందిన వికలాంగుడు ఎస్కే కమ్లి(70)లకు గతంలో పింఛన్ వచ్చేది. వీరు అందరితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అర్హుల జాబితాలో వీరి పేర్లు రాలేదు. ఇప్పటి వరకు తమకు ఆసరాగా ఉన్న పింఛన్ ఇక రాదేమోనని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బెంగతో శనివారం రాత్రి చీకటి రామయ్య, ఆదివారం బాణోత్ బాబు, కమ్లిలు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన కొమ్ము ముత్తయ్య(72)కు కొన్నేళ్లుగా పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో బెంగపెట్టుకున్నాడు. ఉదయం ఆరు గంటలకు భార్య వెళ్లి చూడగా, చనిపోయి ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్ బస్తీకి చెందిన పున్నా ఎల్లయ్య(70) ఆదివారం ఉదయం ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ స్కూల్ వద్ద షేక్‌పేట మండలాధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అయితే పింఛన్లు ఇవ్వడం లేదని తెలుసుకొని నిరాశగా తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో గుట్టపై నుంచి వస్తూ పడిపోయి చనిపోయాడు. ఎల్లయ్య మృతదేహాన్ని షేక్‌పేట తహశీల్దార్ చంద్రకళ సందర్శించారు. అనారోగ్యంతోనే ఎల్లయ్య మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య రత్నమ్మకు పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5 వేలు సహాయం అందజేశారు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం గున్నెల్లికి చెందిన చిలకమారి అనసూర్య(70) పింఛన్ కోసం మూడు రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఆమెకు పింఛన్ రాలేదని అధికారులు చెప్పడంతో అన్నం తినకుండా బెంగ పెట్టుకుంది. ఆదివారం ఉదయం చూడగా, చనిపోయి ఉంది. తొర్రూరు మండలంలోని అరిపిరాలకు చెందిన గీత కార్మికుడు పూజారి సోమరాజులు(68) పింఛన్ల జాబితాలో పేరు రాకపోవడంతో బెంగ పెట్టుకున్నాడు. సమగ్ర కుటుంబ సర్వే ఫాం లేకపోవడంతో పింఛన్ రాలేదని అధికారులు వివరించారు. పింఛన్ రాలేదని బెంగతో రెండు రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం మృతి చెందాడు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌కు చెందిన పంగ లక్ష్మి( 80) పెన్షన్ రాలేదనే బెంగతో ఆదివారం వేకువ జామున మరణించింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఫాతిమాబేగం(75) పేరు పింఛన్ల జాబితా లో లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఆదివా రం సాయంత్రం చనిపోయింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన పెద్దబోయిన రాజవ్వ(80) పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడు రోజులుగా గ్రామపంచాయతీ చుట్టూ తిరిగింది. జాబితాలో పేరులేకపోవడంతో బెంగపడి కన్నుమూసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తికి చెందిన ఎండీ అక్బర్ అలీ(70) శనివారం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఉదయమే పంచాయతీ కార్యాలయానికి వెళ్లా డు. రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. అతని పేరు రాలేదు. జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై రాత్రి భోజనం సరిగా చేయకుండా పడుకున్నాడు. ఆదివారం ఉదయం చూడ గా, చనిపోయి ఉన్నాడు. ఇదే జిల్లా దుబ్బాకకు చెందిన అల్లం బాల్‌లక్ష్మి(50)కి గతంలో పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో పేరు లేకపోవడంతో మ నస్తాపంతో అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లామద్దూరుకు చెందిన నీలి బసప్ప(85) వృద్ధాప్య పింఛన్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. జాబితాలో తనపేరు లేకపోవడంతో కుంగిపోయి చివరకు ఆదివారం ఇంట్లోనే కన్నుముశాడు. -
పండుటాకు పదిలమిలా!
- ఈతరానికి తెలియజెప్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం - ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు న్యూఢిల్లీ: కనీ.. పెంచీ.. పెద్దచేసిన తల్లిదండ్రులకు ఈతరం యువతీయువకులు ఇస్తున్న గౌరవం అంతంతమాత్రమే. రెక్కలు రాగానే చదువులు, ఉద్యోగాలం టూ ఎక్కడికో ఎగిరిపోతున్నారు. దీంతో వృద్ధాప్యంలో చూసుకునేవారు లేక ఒం టిరి పక్షుల్లా బిక్కుబిక్కుమంటూ కాలం గడపుతున్నవారి సంఖ్య తక్కువేం కాదు. కొందరైతే కొడుకులు, బిడ్డలు ఉండి కూడా వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. అలా ఎందుకని అడిగితే తమను చూసుకోవడానికి పిల్లలకు సమయం లేదని చెబుతున్నారు. నగరంలో ఇలాంటి దుస్థితిలో ఉన్న పండుటాకులు ప్రతి గల్లీలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయి. పెద్దలపట్ల యువతీయువకుల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని, డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈతరం పిల్లలు మూలాలను మర్చిపోతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తోంది. వయోధికులపట్ల పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. పెద్దల విలువ చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా తెలిజెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. పెద్దల్లో ఎంతో మేధాశక్తి దాగుంటుందని, దానిని ఈనాటి యువత ఉపయోగించుకుంటే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని, ఎన్నో ఉపద్రవాలను నిరోధించవచ్చని చెబుతున్నారు ప్రభుత్వ మాజీ అధికారి భూరేలాల్. సాంఘిక సంక్షేమశాఖ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని భూరేలాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం నగరంలోని ప్రతి పదిమందిలో ఒకరు సీనియర్ సిటిజన్. ఇక ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్న వివరాల ప్రకారం... వయోధికులపై జరుగుతున్న దారుణాల్లో ఎక్కువగా సొంతవారే నేరస్తులుగా తేలుతున్నారు. సరిగా పట్టించుకోకపోవడం, వదిలించుకోవాలని చూడడం, అవసరమైతే హతమార్చాలని భావిస్తుండడం, ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టడం వంటి నేరాలకు సొంతవారు పాల్పడుతుంటే వృద్ధులు.. బలహీనులన్న అంశాన్ని అవకాశంగా చేసుకొని బయటివారు పండుటాకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు నగరంలో ఏటా పెరిగిపోతుండడంతో ఢిల్లీ సర్కార్ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. -
వృద్ధాప్యంలో ఆదరించేది ఆడపిల్లలే
కాకినాడ క్రైం : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించేది ఎక్కువగా ఆడపిల్లలేనని, అందువల్ల లింగవివక్ష చూపించి వారిని చిన్న చూపుచూడవద్దని కలెక్టర్ నీతూ ప్రసాద్ హితవు పలికారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి, కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదరించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న భార్యాభర్తలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్య శాఖపై ప్రశంసల జల్లు : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వైద్యసిబ్బంది కృతకృత్యులయ్యారని కలెక్టర్ ప్రశంసించారు. గతేడాది 34 శాతం మంది మాత్రమే ప్రసవాలకోసం ప్రభుత్వాస్పత్రులకు రాగా ఈ ఏడాది అది 46 శాతానికి పెరిగిందన్నారు. ఐసీడీఎస్, వైద్య శాఖ సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. వేసక్టమీ విభాగంలో తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐదు సీహెచ్‌సీల్లో స్కానింగ్ యంత్రాలు : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులతో జిల్లాలోని 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్‌సీ)లో ఇప్పటికే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామని, ఏజెన్సీలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నర్సింగ్ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ నీతూ ప్రసాద్ జండా ఊపి ప్రారంభించారు. సమావేశం అనంతరం వైద్య సేవల్లో ప్రతిభ కనబరిచిన వారికి, లక్కీడిప్ ద్వారా ఎంపికైన జంటలకు కలెక్టర్ నీతూ ప్రసాద్ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏజేసీ మార్కండేయులు, డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎంజే నిర్మల, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ ఎం. ప్రసన్న కుమార్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిత, జిల్లా ఫైలేరియా నియంత్రణాధికారి డాక్టర్ పి. శశికళ, సెట్రాజ్ సీఈఓ శ్రీనివాసరావు, సమాచార శాఖ ఏడీ ఫ్రాన్సిస్, డెమో ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులకు మాత్రమే .....
నాగోలు: ‘బ్రాహ్మణులకు మాత్రమే ప్లాట్లు అమ్ముతాం. వృద్ధాశ్రమం, వేదపాఠశాల, గోశాల, ఆలయం కట్టిస్తాం. అందరూ బ్రాహ్మణులు ఉండే అగ్రహారం’ అని నమ్మించి లక్షలాదిరూపాయల డబ్బులు కట్టించుకుని ప్లాట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడో ఓ రియల్ వ్యాపారి. దీంతో బాధితులు శుక్రవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం...ఎల్లాప్రగడ ప్రభాకర్‌శర్మ వేదగాయత్రి అగ్రహారం (రాఘవేంద్ర రియల్ఎస్టేట్) కార్యాలయాన్ని న్యూనాగోలుకాలనీ రోడ్‌నెం.2లో ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరి గ్రామం సర్వేనెం.698 నుంచి 713 వరకు సుమారు 30 ఎకరాల్లో ప్లాట్లను విక్రయించేందుకు వివిధ ఛానళ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. ప్రభాకర్‌శర్మ మాటలు నమ్మిన పలువురు రూ.లక్షల్లో చెల్లించి వేదగాయత్రిలో స్థలాలను కొనుగోలు చేశారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లను నిర్మించేందుకు సిద్ధం కావడంతో స్థానికులు వచ్చి ఆపేశారు. దాదాపు 30 ఎకరాల్లో 1700 మందికి ప్లాట్లు చేసి అమ్మాడు. ఇళ్లు కట్టించి రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదేమనడిగితే ప్రభాకర్‌శర్మ బెదిరిస్తున్నాడంటూ పలువురు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.10లక్షల వరకు చెల్లించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నీటిమూటలుగా సర్కారు హామీలు
-
వృద్ధాప్యంలో దర్జా జీవితం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యుగంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడటం చాలా తక్కువైపోతోంది. తల్లిదండ్రులతో కలిసుండే కుటుంబాల కన్నా ఉద్యోగాల రీత్యా, ఇతరత్రా కారణాల రీత్యా వేరువేరుగా ఉండేవారే ఎక్కువవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కోరుకుంటున్నదొక్కటే. మలిసంధ్యలో ఏ బాదర బందీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఇలా కోరుకునేవారికి పరిష్కారం చూపిస్తున్నాయి ‘రిటైర్మెంట్ హోమ్స్’. వృద్ధులకు ఆపన్నహస్తం అందించడానికి నిర్మాణ రంగంలో ఊపిరి పోసుకున్న ఈ సరికొత్త పోకడతో వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆరోగ్యం, ఆనందం, విలాసంతో పాటు శాంతి, భద్రతలూ దొరుకుతున్నాయి. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోల్లోనే ఈ రిటైర్మెంట్ హోమ్స్ ఉండేవి. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఈ గృహాలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ నిర్మాణ సంస్థలు, ప్రభుత్వం కూడా వృద్ధులకు సకల సౌకర్యాలతో కూడిన ప్రత్యేక ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇటీవలే కోవై సీనియుర్ కేర్ కన్స్ట్రక్షన్స్, వూక్ ప్రాజెక్ట్‌ల సంయుుక్త భాగస్వావ్యుంలో ‘సెరీన్ వూక్’ పేరుతో భారీ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్ ప్రారంభవుయింది. వీటిపై సాక్షి రియల్టీ ప్రత్యేక కథనమిది... ఆహారం నుంచి ఆరోగ్యం దాకా: వృద్ధాశ్రమాలకు, రిటైర్మెంట్ హోమ్స్‌కు మధ్య తేడా ఏంటంటే.. రిటైర్మెంట్ హోమ్స్‌లో ఫ్లాట్లు కొన్నవారు లేదా అద్దెకున్నవారు మాత్రమే నివసిస్తారు. నిర్వహణ రుసుము చెల్లించి అన్ని రకాల సౌకర్యాలూ పొందుతారు. అంటే సొంతింట్లో ఉంటూ వృద్ధాశ్రమాల్లో దొరికే సామాజిక జీవనం, నాణ్యమైన సౌకర్యాలను పొందవచ్చన్న మాట. రిటైర్మెంట్ హోమ్స్‌లో వృద్ధులు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లోనే మెస్ ఉంటుంది. ఉదయం ఐదు గంటల కల్లా టీతో మొదలై టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కట్లు, రాత్రి భోజనం ఇలా అన్నీ సరైన వేళల్లో అమరుస్తారు. మెస్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ప్రత్యేకించి ఫ్లాట్‌కే భోజనం సరఫరా చేస్తారు. అపార్ట్మెంట్లోనే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంటుంది. 24 గంటలు అంబులెన్స్, రెసిడెంట్ నర్సు, డాక్టర్ అందుబాటులో ఉంటారు. కొత్త జీవితానికి నాంది: రిటైర్మెంట్ హోమ్స్‌లో నివసించేవారంతా ఒకే వయసు వారు కాబట్టి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు. వ్యాయామం, కబుర్లు, ఆటలు, పాటలతో కాలక్షేపం చేయవచ్చు. హాబీ సెంటర్, కమ్యూనిటీ కిచెన్, స్విమ్మింగ్ పూల్, యోగా కేంద్రాలు, ఏటీఎం సెంటర్, సూపర్ మార్కెట్, గ్రంథాలయం.. ఇలా అన్ని రకాల సౌకర్యాలుంటాయి. ఫ్లాట్వాసులు బృందాలుగా ఏర్పడి సంఘ సేవ, గార్డెనింగ్ చేసుకోవచ్చు. వినోదం కోసం ఇండోర్ మినీ థియేటర్, ఓపెన్ థియేటర్లు సైతం ఈ రిటైర్మెంట్ హోమ్స్‌లో ఉంటాయి. ఫ్లాట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు: ఫ్లాట్ నిర్మాణం పూర్తిగా వృద్ధులకు తగ్గట్టే ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వారికి ప్రత్యేకమైన టాయ్‌లెట్స్ ఉంటాయి. బాత్రూమ్, బెడ్ రూమ్, కారిడార్లలో అత్యవసర ప్యానిక్ బజర్లు, గ్రాబ్ బార్స్ ఉంటాయి. గ్రాబ్ బార్స్ సహాయంతో వృద్ధులు సులువుగా నడుస్తారు, కూర్చుంటారు కూడా. ఒకవేళ కిందపడిపోతే ఫ్లాట్‌లో ప్యానిక్ అలారం సిస్టం ఉంటుంది. దీన్ని నొక్కితే చాలు సెక్యూరిటీ దగ్గర అలారం మోగుతుంది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై సంబంధిత ఫ్లాట్‌కు చేరుకొని వృద్ధులను రక్షిస్తాడు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పని మనుషులుంటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. 24 గంటలూ అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాలో అపార్ట్మెంట్ ఉంటుంది. విద్యుత్తు వినియోగం తగ్గించడం, వ్యర్థాలను మళ్లీ వాడటం, నీటిని శుద్ధి చేయడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. నగరంలో నిర్మిస్తున్న రిటైర్మెంట్ హోమ్స్ ఇవే... కోవై సీనియుర్ కేర్ కన్స్ట్రక్షన్స్, వూక్ ప్రాజెక్ట్‌ల సంయుక్త భాగస్వావ్యుంలో శ్రీశైలం హైవేలోని నాలెడ్జ్ సిటీకి చేరువలో 3 ఎకరాల్లో ‘సెరీన్ వూక్’ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 3 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ 30 నెలల్లో పూర్తవుతుంది. 732 చ.అ. నుంచి 1,519 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్లుంటాయి. రూ.20.86 లక్షల నుంచి ధర ప్రారంభమౌతుంది. కాప్రా కేంద్రంగా పనిచేస్తోన్న సాకేత్ గ్రూప్ 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రణామ్ పేరుతో రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవి మూడు బ్లాకులు. ఒక్కో బ్లాకులో తొమ్మిది అంతస్తులుంటాయి. ఏ-బ్లాక్‌లో 90, బీ-బ్లాక్‌లో 97, సీ-బ్లాక్‌లో 144 ఫ్లాట్లను నిర్మించారు. ఇక ధర విషయానికొస్తే ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ. 2,600లుగా ఉంది. {పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌లో 11 ఎకరాల విస్తీర్ణంలో ‘సెరెన్ ప్రగతి’ రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 112. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి రూ. 28 లక్షల నుంచి రూ. 90 లక్షల ధరలున్నాయి. బండ్లగూడ రాజీవ్ స్వగృహలో వృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేకించి 108 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఫ్లాట్ విస్తీర్ణం 653 చదరపు అడుగులు. ఫ్లాట్ ధర రూ.16.50 లక్షలు.