1947లో భారతదేశ విభజన చాలా మందికి తమ పూర్వీకులను కోల్పోయేలా చేసింది. వారు పెరిగిన వాతావరణంలోని ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే.. ఈ విభజన చాలామందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒక్క రాత్రితో తమ జీవితాలనే మార్చేసిన విభజన అది. అలాంటి భాధనే ఎదుర్కొన్న నలుగురు వృద్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ టైంలో ఈ విభజన ఎలా తమ ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేసిందో వివరించారు.
విభజన కారణంగా చెలరేగిన ఘర్షణలు, అల్లకల్లోలంతో రాత్రికి రాత్రే తమ పూర్వీకులను వదిలిపెట్టి భారత్‌లోకి లేదంటే పాక్‌లో వెళ్లిపోవాల్సి వచ్చింది. కొందరికి అది తీరని విషాదాన్ని కలిగించి, చేదు జ్ఞాపకాలుగా మిగిలింది. అది వారికి కేవలం తమ వాళ్లను మాత్రమే దూరం చేయలేదు, ఆఖరికి వారి ఆహారపు అలవాట్లను సంస్కృతిని ప్రభావితం చేసింది. అదెలాగో ఆ వృద్ధుల మాటల్లోనే చూద్దాం..!
రషేదా సిద్ధిఖీ, 24 ఆగస్టు 1947
"ఇది మాకు ఇష్టమైన వారిని వదులుకునేలా చేసింది. అలాగే సాంప్రదాయ వంటకాలకు, వివిధ పదార్థాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కొత్త పరిసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు పరిమితం కావడం ఓ సవాలుగా మారింది. ఉన్న వాటితో మా వంటకాలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుబాటులోని వనరులతోనే వంటలను చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాత ఢిల్లీ ఇప్పుడది లక్నో. తాము తినే తినుబండరాల దుకాణాలు, కేఫ్‌లు ఇప్పుడూ అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు రషేదా. అయితే ఇప్పుడు మరెన్నో అంతర్జాతీయ వంటకాలు, ఫాస్ట్ పుడ్స్ వంటివి చేరడం విశేషం." అన్నారు.
శీలావంతి, 10 ఆగస్టు 1935
కరాచీలో మాకు పొలాల నుంచి తాజా కూరగాయలు వచ్చేవి. కావాల్సినవి ఇష్టంగా తినేవాళ్లం. అలాగే నా తోబుట్టువులతో చిన్న చిన్న దుకాణాలకు వెళ్లేవాళ్లం. సింధీ రోటీ వంటివి తినేవాళ్లం. తాజాగా తినే ఫ్రూట్ సలాడ్స్ మిస్ అవుతున్నాం. మళ్లీ కరాచీ వెళ్లి పూర్వీకులను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు శీలావంతి.
శిఖా రాయ్ చౌదరి, ఆగస్టు 14, 1939
సరిగ్గా నాకు ఏడేల్లు వయసులో ఫరీద్‌పూర్(బంగ్లాదేశ్)లోని ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్‌ని, సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ కాలంలో గ్రామఫోన్‌లో పాటలు వినేవాళ్లం. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో రుచికరమైన అల్పాహారం అంటే మహా ఇష్టం. అవన్నీ మిస్సయ్యానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శిఖా రాయ్
గౌరీ రే, ఆగస్ట్ 9, 1944
"విభజన మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మా తాతల టైంలోనే బంగ్లాదేశ్‌ని విడిచి వచ్చేశాం. మాకు దుబ్రిలో వెదరుతో చేసిన ఇల్లు ఉండేది. అదీగాక నేనే కోల్‌కతా, డిళ్లీ రెండు నగరాల్లో పెరిగాను. స్కూల్ చదవంతా కోలకతాలో సాగగా, కాలేజ్ చదవంతా ఢిల్లీలో చదివాను. అలాగే మా కుటుంబం పార్క్ స్ట్రీట్ రెస్టారెంట్‌కి వెళ్లేది. అయితే అప్పట్లో థాయ్, కొరియన్, జపనీస్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్లు లేవు." అని చెప్పుకొచ్చారు గౌరీ రే.
ఉమా సేన్, 1939
"విభజన కారణంగా మేము భూమిని, ఇంటిని కోల్పోయాం. అలాగే మాకు ఇష్టమైన వంటకాలను, రుచులను మార్చుకోవాల్సి వచ్చింది. స్నేహితులను, పూర్వీకులు కోల్పోయాం. ఇప్పుడు మేమున్న ప్రదేశం రద్దీగా మారిపోయింది. అలాగే కొత్తకొత్త వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు". ఉమాసేన్.
(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!)
Comments
Please login to add a commentAdd a comment