memories
-
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
పెద్దయ్య
మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు. ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి. రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు. అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట. వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు. పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు. మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు. టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్‌మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్‌మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్‌రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య. -
‘మెల్బోర్న్’ జ్ఞాపకాలు షేర్ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్! (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం సతీమణి 'రహస్య' పంచుకున్న గతేడాది తీపి జ్ఞాపకాలు (ఫోటోలు)
-
అమ్మా.. నేనూ నీతో వచ్చేస్తా...
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం! ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది. ‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు). ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు. ‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే. -
మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
-
మతి మరవండి.. మంచిదే!
రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్‌ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్‌ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పుమరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్డేషన్కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే. -
'లక్కీ భాస్కర్' జ్ఞాపకాలతో నటి గాయత్రి భార్గవి (ఫొటోలు)
-
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
విభజన టైంలో వీళ్ల ‘చేదు’ అనుభవాలు వింటారా?
1947లో భారతదేశ విభజన చాలా మందికి తమ పూర్వీకులను కోల్పోయేలా చేసింది. వారు పెరిగిన వాతావరణంలోని ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే.. ఈ విభజన చాలామందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒక్క రాత్రితో తమ జీవితాలనే మార్చేసిన విభజన అది. అలాంటి భాధనే ఎదుర్కొన్న నలుగురు వృద్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ టైంలో ఈ విభజన ఎలా తమ ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేసిందో వివరించారు. విభజన కారణంగా చెలరేగిన ఘర్షణలు, అల్లకల్లోలంతో రాత్రికి రాత్రే తమ పూర్వీకులను వదిలిపెట్టి భారత్‌లోకి లేదంటే పాక్‌లో వెళ్లిపోవాల్సి వచ్చింది. కొందరికి అది తీరని విషాదాన్ని కలిగించి, చేదు జ్ఞాపకాలుగా మిగిలింది. అది వారికి కేవలం తమ వాళ్లను మాత్రమే దూరం చేయలేదు, ఆఖరికి వారి ఆహారపు అలవాట్లను సంస్కృతిని ప్రభావితం చేసింది. అదెలాగో ఆ వృద్ధుల మాటల్లోనే చూద్దాం..!రషేదా సిద్ధిఖీ, 24 ఆగస్టు 1947"ఇది మాకు ఇష్టమైన వారిని వదులుకునేలా చేసింది. అలాగే సాంప్రదాయ వంటకాలకు, వివిధ పదార్థాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కొత్త పరిసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు పరిమితం కావడం ఓ సవాలుగా మారింది. ఉన్న వాటితో మా వంటకాలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుబాటులోని వనరులతోనే వంటలను చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాత ఢిల్లీ ఇప్పుడది లక్నో. తాము తినే తినుబండరాల దుకాణాలు, కేఫ్‌లు ఇప్పుడూ అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు రషేదా. అయితే ఇప్పుడు మరెన్నో అంతర్జాతీయ వంటకాలు, ఫాస్ట్ పుడ్స్ వంటివి చేరడం విశేషం." అన్నారు. శీలావంతి, 10 ఆగస్టు 1935కరాచీలో మాకు పొలాల నుంచి తాజా కూరగాయలు వచ్చేవి. కావాల్సినవి ఇష్టంగా తినేవాళ్లం. అలాగే నా తోబుట్టువులతో చిన్న చిన్న దుకాణాలకు వెళ్లేవాళ్లం. సింధీ రోటీ వంటివి తినేవాళ్లం. తాజాగా తినే ఫ్రూట్ సలాడ్స్ మిస్ అవుతున్నాం. మళ్లీ కరాచీ వెళ్లి పూర్వీకులను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు శీలావంతి. శిఖా రాయ్ చౌదరి, ఆగస్టు 14, 1939సరిగ్గా నాకు ఏడేల్లు వయసులో ఫరీద్పూర్(బంగ్లాదేశ్)లోని ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్‌ని, సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ కాలంలో గ్రామఫోన్‌లో పాటలు వినేవాళ్లం. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో రుచికరమైన అల్పాహారం అంటే మహా ఇష్టం. అవన్నీ మిస్సయ్యానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శిఖా రాయ్గౌరీ రే, ఆగస్ట్ 9, 1944"విభజన మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మా తాతల టైంలోనే బంగ్లాదేశ్‌ని విడిచి వచ్చేశాం. మాకు దుబ్రిలో వెదరుతో చేసిన ఇల్లు ఉండేది. అదీగాక నేనే కోల్‌కతా, డిళ్లీ రెండు నగరాల్లో పెరిగాను. స్కూల్ చదవంతా కోలకతాలో సాగగా, కాలేజ్ చదవంతా ఢిల్లీలో చదివాను. అలాగే మా కుటుంబం పార్క్ స్ట్రీట్ రెస్టారెంట్‌కి వెళ్లేది. అయితే అప్పట్లో థాయ్, కొరియన్, జపనీస్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్లు లేవు." అని చెప్పుకొచ్చారు గౌరీ రే.ఉమా సేన్, 1939"విభజన కారణంగా మేము భూమిని, ఇంటిని కోల్పోయాం. అలాగే మాకు ఇష్టమైన వంటకాలను, రుచులను మార్చుకోవాల్సి వచ్చింది. స్నేహితులను, పూర్వీకులు కోల్పోయాం. ఇప్పుడు మేమున్న ప్రదేశం రద్దీగా మారిపోయింది. అలాగే కొత్తకొత్త వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు". ఉమాసేన్.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
సామ్ జ్ఞాపకాల్లో చైతూ.. ఆ ఒక్క ఫొటో డిలీట్ చేయలేదుగా! (ఫొటోలు)
-
మరి ఆ రోజుల్లో... అలా.. మేడమీద చదువులు
రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేదిఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావిఅన్వర్, సాక్షి -
కాలాన్ని గెలిచినవాడు
గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గత సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతం తాలూకు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసులోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు.బలంగా ముద్ర వేసినదైతే చాలు. అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్ ’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు. అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది. ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు. సమకాలీన ఫ్రెంచ్ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు, ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్ గోప్నిక్. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు. ‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు! హోమర్లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్’ అంటారు డేనియల్ మెండెల్సన్ . కలిగిన ఫ్రెంచ్–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్ ప్రూస్ట్ (10 జూలై 1871– 18 నవంబర్ 1922). ఐఫిల్ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్ గుస్తావ్ ఐఫిల్... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. ప్యారిస్ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు. బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్ సెన్సిటివ్. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు. తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్ ప్రూస్ట్, రచయిత జాక్వెస్ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్ చనిపోయాక విడుదలైన మొదటి భాగం. ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటిషర్ అయిన సి.కె.స్కాట్ మాంక్రీఫ్ చేసినది. ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్ రైట్ నవల పేరును ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్ ఇల్లియర్స్ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు. 1971లో ప్రూస్ట్ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్ ప్రశ్నావళి’(ప్రూస్ట్ క్వశ్చనెయిర్) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్ ప్రపంచంలోకి వెళ్లాలి. -
వైఎస్సార్ కోసం చెప్పాలంటే... ఎంతైనా సరిపోదు
వైఎస్సార్ కోసం చెప్పాలంటే...కొన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు ఆయన కోసం మాట్లాడుకుంటే..ఆయన్ను అభిమానించే వారికి కొన్ని గంటల సమయం సరిపోదు ఎందుకంటే...వైఎస్సార్...ఓ లెజెండ్ భారతదేశ రాజకీయాల్లోనే ఓ ధ్రువ తార రాజకీయానికే రాజసం నేర్పిన మహానేత రాజనీతికి విశ్వసనీయతను నేర్పిన ప్రజానేత పేదల తలరాతలను మార్చిన విధాత ఒక్క మాటలో చెప్పాలంటే...వైఎస్సార్...అంటే పేరు కాదు....బ్రాండ్ ఆ బ్రాండ్ ఎంత గొప్పదంటే....ఈరోజు ఆయన మరణించి పదమూడేళ్లయినా... ఆయన కోసం తల్చుకోగానే మనందరి కళ్లల్లో కన్నీళ్ల సుడులు తిరుగుతాయి...అంత గొప్ప బ్రాండ్. వైఎస్సార్ అసలు వైఎస్సార్ ని ఎందుకు ప్రజలు ఇలా గుండెల్లో పెట్టుకుని దేవుడిలా పూజిస్తున్నారో...మనం ఆలోచిస్తే...ఆయన ఆదర్శవంతమైన ప్రస్థానమే అందుకు కారణం అని నేను చెప్పగలను 2004 వరకు ఈ రాష్ట్రంలోని...హిందువులు...క్రైస్తవులు...ముస్లింలు... ఇలా అన్ని మతాల వాళ్లు...రోజూ తమ దేవుళ్లకు పూజిస్తునే ఉండే వారు.. దేవుడా నా బిడ్డకు చదువునివ్వు...నా బిడ్డకు ఆరోగ్యాన్నివ్వు... ఈ ఏడాది నా పొలాన్ని పండించు... అని అన్ని మతాల పేదలు, రైతులు, ప్రజలు చేయని పూజలు లేవు... వాళ్ల పూజలన్నింటినీ విన్న దేవుళ్లు అందరూ కలిసి...తమ ప్రతినిధిగా వైఎస్సార్ ని పంపారేమో...అన్నట్టుగా..ఆయన పాలన సాగించారు... దేవుడు పాలన...రాముడి పాలన కోసం...చరిత్రలో విన్నాం...కానీ వై ఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే...ప్రత్యక్షంగా చూశాం.. ప్రతీ గడపకి...ప్రతీ గుండెకి తన పాలనను అందించిన ముఖ్యమంత్రి వైఎస్సార్ కనుకనే.. అందుకే దేవుడిలాంటి పాలన వైఎస్సార్...పాలన...అని ఇప్పటికీ...మనం చెప్పుకుంటాం... వైఎస్సార్...అంటే తెలుగు ప్రజల ఎమోషన్... వైఎస్సార్ అంటే తెలుగు ప్రజలకి ఎఫెక్షన్.. సెప్టెంబర్ 2....2009 న... తెలుగు ప్రజలకు...అభివ్రుద్ధి, సంక్షేమం అన్న కథను చెబుతూ...చెబుతూ...శాశ్వత నిద్రలోకి వై ఎస్సార్ వెళ్లిపోయారు... 10 కోట్ల మంది తెలుగు వాళ్లు...కట్టుకున్న ఆశల సౌధం...క్షణాల్లో కుప్పకూలిపోయింది.... ఈ దేశ చరిత్రలో....ఓ పెద్ద రాజకీయ విషాదం ....వై ఎస్సార్ మరణం... దేశంలోని ప్రతిపక్ష నాయకులను సైతం...కన్నీళ్లు పెట్టించిన గొప్ప యుగపురుషుడు...వైెఎస్సార్ వైఎస్సార్ కి మరణం లేదు... ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పేదోడికి జబ్బు చేస్తే. డబ్బు లేకుండా వైద్యం చేశారు రూపాయి డాక్టరున్నంత వరకు... ఒక్క రూపాయి అవసరం లేదని నిరూపించారు ఆరోగ్యశ్రీ తో కోట్ల మందికి ఆయుష్సు పోశారు చిల్లుపడ్డ చిన్నారుల గుండెలకు ప్రాణం పోశారు చావుతో పోరాడే ప్రతీ పేదోడిని గెలిపించారు గంజి నీళ్లకు గతిలేనోళ్ల గడపల్లో గ్రాడ్యువేట్లను ఇచ్చారు ఉన్నోడికే సొంతమైన ఉన్నత విద్యను ఊరందరికీ ఉచితంగా ఇచ్చారు ఆసరా లేని అవ్వా తాతలకు ఆదుకునేలా ఫించనిచ్చారు గుడిసెల్లో జీవితాన్ని గడిపేవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లిచ్చారు పావలా వడ్డీ తో అక్క చెల్లెల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు గడప గడపను...గుండె గుండెకు తన పథకాలతో పలకరించారు అంత గొప్ప ప్రజా నాయకుడికి మరణం ఉంటుందా...? ఆయన ప్రజల గుండెల్లో మాత్రం శాశ్వతంగా జీవించే ఉంటారని గర్వంగా చెప్పగలను ఇంత గొప్పగా పాలించి...పేదల తలరాతలను మార్చారు కాబట్టే వైఎస్సార్ మరణించారన్న వార్త వినగానే... కోట్లాది మంది ప్రజల ఊపిరి బరువైపోయింది... వైఎస్సార్ ని అభిమానించే గుండెలు పగిలిపోయాయి.. వైఎస్సార్ ఉన్నారులే అని ధీమాగా ఉన్న ప్రజల నమ్మకం నేలకొరిగిపోయింది... ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామి రాష్ట్రంగా నడిపిస్తున్న వై ఎస్సార్ ప్రయాణం ఆగిపోయింది... కానీ ఆ గుండెల్లో ధైర్యం నింపుతూ....మన నాయకుడు జగనన్న...తెలుగు ప్రజలకు అండగా నేనుంటాను అని ముందుకొచ్చారు పులి కడుపున పులే పుడుతుంది,...అన్నట్టు వైఎస్సార్ బిడ్డ...వైఎస్సార్ బ్లడ్...మన పులివెందుల పులి...జగనన్న మనందరి కోసం అండగా నిలబడ్డాడు తన తండ్రి ఆశయ సాధాన కోసం...ఎన్నో కష్టాలను, కక్ష సాధింపులను ఎదుర్కొన్నాడు వైఎస్సార్ మరణించాక....ఆ కుటుంబాన్ని సోనియా గాంధీ...నడి రోడ్డున పడేయాలని చూసింది... కానీ ఈ రోజు అదే కుటుంబం....అదే సోనియా గాంధీ...కళ్ల ముందే మళ్లీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి...ఇది గో వై ఎస్సార్ పాలన అని....తలెత్తుకుని నిలబడ్డాడు మన జగనన్న... ఢిల్లీ పెద్దలు....ఆంధ్రా గెద్దలు....కలిసి కుమ్మక్కై కుట్రలు చేసి...జగనన్నను అక్రమంగా జైలులో పెట్టారు... ఆ రోజే చెప్పాం.....జైలు గోడలు బద్దలు కొట్టి మరీ...వైఎస్సార్ పాలన తెచ్చుకుంటామని... ఈ రోజు...ఆ అక్రమ నిర్భంధాలను ఛేదించి....అక్రమంగా కేసులు పెట్టిన వాళ్లకు గూబ గుయ్యి మనేలా రీ సౌండ్ విక్టరీ ని సాధించి చూపించారు మన జగనన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలు...సోనియా గాంధీ కక్ష సాధింపులు...పరాకాష్టకు చేరిన సందర్భంలో.. అప్పుడు జగనన్న....ఒక మాట చెప్పారు... వైఎస్సార్ ని అభిమానించే ప్రతీ గుండె చప్పుడు ఒక్కటవుతుంది... ఓ ఉప్పెన పుడుతుంది...ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు....వీళ్లంతా....అని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు... నిజంగానే....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ల తరువాత...వై ఎస్సార్ ని అభిమానించే గుండెల చప్పుడు ఒక్కటయ్యింది... గత ఎన్నికల్లో ఓ రాజకీయ ఉప్పెన పుట్టించాయి.... అందుకే 151 ఎమ్మెల్యే సీట్లు...22 ఎంపీ సీట్లతో విజయ ఢంకా మోగించారు జాతీయ పార్టీలు కు సింగిల్ సీటు కూడా రాలేదు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి ి40 సీట్లు కూడా రానివ్వలేదు.. ప్యాకేజీ పార్టీల అధ్యక్షులకు సైతం అడ్రస్ లేకుండా చేశారు... దేశమంతా మోడీ గాలి వీస్తే...ఆంధ్రా లో మాత్రం...జగనన్న ఫ్యాన్ గాలి వీచింది... అదీ జగన్మోహన్ రెడ్డి పవర్....వైఎస్సార్ అభిమానుల పవర్... అందుకే గర్వంగా చెప్తున్నా....వైఎస్సార్ పాలన మళ్లీ వచ్చింది అని... వైఎస్సార్ మనమధ్య లేకపోయినా....వైఎస్సార్ వారసుడు మనతో ఉన్నాడు వైఎస్సార్ ప్రాణం మనతో లేకపోయినా...వైఎస్సార్ పాలన మనతో ఉంది స్వర్గంలో ఉన్న వైఎస్సార్ సైతం...గర్వపడేలా ఈరోజు జగనన్న 50 నెలల పాలన సాగింది వైఎస్సార్ మరణించినా...ఆయన ఆశయం..ఆయన సంకల్పం జగనన్న ఉన్నంత వరకు మరణించదని ఈ నాలుగున్నారేళ్ల పాలనతో నిరూపించారు మన జగనన్న One and only... Ysr....Forever ఇట్లు.. నిద్దాన సతీష్, వై ఎస్సార్ అభిమాని గాజులరేగ, విజయనగరం -
25 ఏళ్లకే కొడుకు ఆకస్మిక మరణం! సమాధిపై క్యూఆర్‌కోడ్‌తో తండ్రి నివాళి
జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎక్కడో ఒక చోట ఒక అగాధాన్నో లేక విషాధాన్నో ఒక పరీక్షలా పెడతాడేమో దేవుడు. మనిషి సహనానికి పరీక్ష లేక ఇంకేదైనా గానీ దాన్నుంచే కొత్త ఆలోచనలు లేదా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఒక్కొసారి. ఇక్కడ ఒక తండ్రి విషాధ గాథలో కూడా అలానే చోటు చేసుకుంది. అన్నింటిలోనూ అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు ఆకస్మిక మరణం తన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. అదే అతన్ని తన కొడుకు గురించి ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు పురిగొల్పింది. అందులోంచి పుట్టుకొచ్చిందే సమాధిపై క్యూఆర్‌కోడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన. అసలు ఏంటి ఇది? డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే క్యూఆర్ కోడ్ సమాధిపై ఎందుకు? ఎందుకోసం ఇలా అని అందరిలోనే ఆలోచనలు రేకెత్తించేలా చేశాడు కొడుకుని కోల్పోయిన తండ్రి. అసలేం జరిగిందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లా కురియాచిరాకు చెందిన ఫ్రావిన్స్ అనే వ్యక్తికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఒమన్‌లోని ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలు కేరళలోని కురియాచిరాలో ఉంటారు. ఐతే కొడుకు ఐవిన్ ప్రావిన్స్ చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటల్లోనూ, సంగీతంలోనూ టాపర్. ఏ కాంపిటీషన్లో పోటీ చేసిన ప్రైజ్ అతడిదే. ఎంబీబీఎస్ చేశాడు. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీలో జనరల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అలాగే కూతురు ఒక పెద్ద కార్పోరేటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..నెలకు లక్షరూపాయాల దాక సంపాదిస్తోంది. ఒక తండ్రికి ఇంతకంటే కావల్సింది ఏమి లేదు కూడా. ఇక అతను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చి సెటిల్ అయిపోవాలనుకున్నాడు. ఇక కూతురు పెళ్లి కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒకరోజు ప్రావిన్స్ తన బాస్‌తో మీటింగ్‌లో ఉండగా తన కూతురు ఎవెలిన్ ఫ్రాన్సిస్ నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. ఫ్రావిన్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్లీజ్ డాడీ అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టింది కూతురు. దీంతో మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి కాల్ చేయగా.. అన్నయ బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయాడని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఫ్రాన్సిస్. అతడి బాస్ ఈ విషయం తెలసుకుని అతడిని ఓదార్చి.. ఇండియా వెళ్లేందకు ఫ్లైట్ టికెట్టు ఏర్పాటు చేసి మరి పంపించాడు. ఎంతో హాయిగా సాగిపోతున్న తన జీవితంలో కొడుకు మరణం అతన్ని దారుణంగా కుంగదీసింది. కోలుకోవడానికే నెల పట్టింది. 25 ఏళ్లకే చిన్న వయసులో మరణించిన కొడుకు ఐవిన్ 100 ఏళ్లకు సాధించే అన్ని విజయాలను అతను సాధించాడు. తన కొడుకు ఐవిన్కి వచ్చిన అవార్డులు, రివార్డులు పెట్టడనినకి ఒక గది కూడా సరిపోదు. అలాంటి అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నాడు. వాస్తవానికి ఐవిన్ ఎంత ప్రతిభావంతుడంటే గిటార్ దగ్గర నుంచి బ్యాడ్మింటన్, కబడ్డీ వరకు అన్నింటిల్లోనూ టాపర్. కొత్త కొత్త ఆవిష్కరణలంటే అతనికి అత్యంత ఇష్టం. పైగా వ్యక్తుల ప్రోఫైల్స్తో క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేస్తాడు కూడా. అంతేగాదు తన తండ్రి పనిచేస్తున్న ఐబీఎం కంపెనీ కొత్త టెక్నాలజీని తీసుకురాకమునుపే తన తండ్రిని ఆ టెక్నాలజీ గురించి అప్రమత్తం చేసేవాడు. అలాంటి తన కొడుకు చిన్న వయసులో మరణించడం అనేది ఏ కుంటుంబానికైనా కోలుకోలేని వ్యధే. అందుకే అతడి గురించి, తన టాలెంట్ గురించి తెలసుకునేలా.. అతడి జీవితాన్నే సమాధిపై పొందుపర్చాలనుకున్నాడు ఫ్రాన్సిస్. ఒకవైపు సెయింట్ జోసఫ్ చర్చి వద్ద అతడి సమాధి నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అయితే అతడి గురించి, అతని సాధించిన విజయాల గురించి సమాధిపై రాయించడానికి ప్లేస్ సరిపోదని కూతురు ఎవెలిన్ చెప్పింది. అందుకని తన అన్నయ్య క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్‌తోనే ఇది చేయాలనే ఆలోచనకు వచ్చింది. దానికోసం అతడి అన్నయ్య ప్రోఫెల్తో వెబ్ పేజి క్రియేట్ చేసి..దాంట్లో అతడి సాధించిన విజయాలు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన క్షణాలన్నింటిని పొందుపరిచారు. ఈ వెబ్‌పేజిని క్యూఆర్ కోడ్‌కి లింక్ చేసి ఐవిన్ సమాధిపై ఏర్పాటు చేశారు అతడి కుటుంబ సభ్యులు. దీన్ని చూసిన అక్కడి వాళ్లంతా సమాధిపై క్యూఆర్ కోడ్ ఏంటి అని స్కాన్ చేసి చూసేందుకు ఆసక్తి కనబర్చడమే గాక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధిపై ఐవిన్ ఫోటో, దిగువన జనన, మరణ తేదిలు, కింద అడాప్ట్ అనే ఒక పదం దానికింద ఈ క్యూఆర్‌కోడ్ ఉంటుంది. అడాప్ట్ అంటే ఏదైనా కొత్త సాంకేతికను స్వీకరించడం అని అర్థం. అదే ఐవిన్ నినాదం కూడా. కొత్త సాంకేతికకు ఎప్పటికప్పుడూ అడాప్ట్ అయిపోతుండాలని ఐవిన్ చెబుతూ ఉండే వాడని అతడి తండ్రి ఫ్రాన్సిస్ చెబుతున్నారు. (చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్: నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల) -
బంగ్లా ఖాళీ చేయడంపై రాహుల్ లేఖలో ఏమన్నారంటే..
రాహుల్ గాంధీకి అనర్హత వేటు పడిన తర్వాత ఆయన నివాసముంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం న్యూఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ఉంది. రాహుల్ వాస్తవానికి జెడ్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 2005 నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత రాహుల్ లోక్‌సభ సెక్రటేరియేట్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆ బంగ్లాతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న వాటికి కట్టుబడి ఉంటాను అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ క్వాలిఫై అయ్యాను కాబట్టి, నిబంధనల మేరకు నడుచుకుంటానని, లోక్ సభ సభ్యత్వం ద్వారా సంక్రమించిన బంగాళాను ఖాళీ చేస్తానని తెలిపారు. అయితే బంగళా ఖాళీ చేయాలన్న లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, తుగ్లక్ లేన్ లో ఉన్న బంగ్లా ఖాళీ చేస్తే రాహుల్ తన తల్లితో కలిసి ఉండొచ్చని, లేదా తనకు కేటాయించిన బంగళా అయినా వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. అయినా రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే అన్నారు. (చదవండి: ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!: స్మృతి ఇరానీ) -
ఒంగోలును తాకిన ‘స్వాతి కిరణం’
పాపం పుణ్యం తెలియని ఓ అమాయకుడు నాటి మూఢ నమ్మకాలకు బలవుతున్న ఓ వితంతువు మెడలో తాళి కడతాడు. అదీ సీతారాముల కల్యాణోత్సవంలో, రాముల వారు కట్టాల్సిన తాళిని. ఈ ఒక్క సీన్ స్వాతిముత్యం కథలోని ఆత్మని ఘాడంగా ఎలివేట్ చేస్తుంది.. తాను సంగీత సామ్రాట్‌ని అని విర్రవీగే గురువు ఆత్మాభిమానాన్ని గౌరవించేందుకు పదేళ్ల బాలుడు ఆత్మత్యాగం చేస్తాడు. ఇది స్వాతికిరణం అనే మహాకావ్యంలో పేద తల్లిదండ్రులు.. గురువు భార్య పడే ఆవేదన ప్రేక్షకుల గుండెల్ని పిండి చేసి.. కన్నీటి ధారలు కారుస్తుంది.. ఒకటా రెండా ఇలాంటి సున్నితమైన అంశాలతో కళాఖండాలు సృష్టించిన కళా తపస్వి భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరుస్తూనే ఉంటారు. సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు ఒంగోలుతో ఎనిలేని బంధం ఉంది. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణకంకణ సన్మాన కార్యక్రమంలో.. ( ఫైల్) ఒంగోలు టౌన్: తెలుగు సినీ రుచిని ప్రపంచానికి చూపించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతితో ఒంగోలులోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. అయితే ఆ మహా రుషి ఒంగోలులో పర్యటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నలభై సంత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2న ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన రోజునే ఆయన నిష్కృమించడం కాకతాళీయం. శ్రీనళిని ప్రియ నృత్య నికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మహా దర్శకుడు ( ఫైల్) కాగా నాడు శంకరాభరణం సినిమా విడుదలైన సందర్భంగా నటీనటులతో కలిసి విశ్వనాథ్ తొలిసారిగా ఒంగోలు వచ్చారు. పాతికేళ్ల తరువాత 2015 జూలై 4న ఒంగోలులోని శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు హోటల్ సరోవర్‌లో వసతి సౌకర్యం కలి్పంచారు. కానీ ఎంతో నిష్టగా ఉండే ఆయన హోటల్ భోజనం తినేందుకు ఇష్టపడలేదు. అన్నవరప్పాడులోని పోతురాజు కాలనీలో నివాసం ఉండే నృత్య కళాశాల నిర్వాహకురాలు యస్వీ శివకుమారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. మరుసటి రోజు గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున రెండో రోజు కూడా ఆయన ఒంగోలులోనే గడిపారు. విశ్వనాథ్ అంతటి విఖ్యాత దర్శకుడు తమ ఇంటికి రావడం అదృష్టం అని, ఆయన మృతిని జీరి్ణంచుకోలేక పోతున్నామని శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని కళాపరిషత్ నిర్వాహకులు కల్లంగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలుకు వచ్చారు. ఆ సందర్భంగా నగరంలోని ముంగమూరు రోడ్డులో గూడ రామ్మోహన్ నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరా వేద పాఠశాలను సందర్శించారు. అక్కడి వేద విద్యార్థులతో వేదాలు, బ్రాహ్మణత్వం గురించి చర్చించారు. వేద విద్యార్థులకు వ్రస్తాలను బహూకరించారు. బ్రాహ్మణుడినై పుట్టి వేద విద్యను అభ్యసించలేక పోయాను అంటూ పండితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒంగోలులోని కళాకారులతో, సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న మహాకవి గుర్రం జాషువ వాక్యాలు విశ్వనాథ్ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఒంగోలు ముంగమూరు రోడ్డులోని డాక్టర్ దారా రామయ్య శా్రస్తికి విశ్వనాథ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన కూతురు, చిత్రకారిణి సి.హెచ్.శ్రీలక్ష్మి చెప్పారు. తాను గీసిన కృష్ణం వందే జగద్గురు చిత్రానికి వచ్చిన మిరాకిల్ బుక్ ఆఫ్ ఇండియా అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డులను విశ్వనాథ్ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పారు. సంప్రదాయ సంకెళ్లు తెంచిన విశ్వనాథుడు ఒంగోలు టౌన్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి రంగభూమి కళాకారుల సంఘం ఘనంగా నివాళి అరి్పంచింది. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళరి్పంచారు. సామాజిక సందేశంతో నిర్మించిన ఆయన సినిమాలు తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని పడమటి గాలి ఫేం పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సంప్రదాయ సంకెళ్లను తెంచిన సాంస్కృతిక విప్లవకారుడు విశ్వనాథ్ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన కవులు, కళాకారులు ప్రసాద్, ఏ.ప్రసాద్, వాకా సంజీవరెడ్డి, గుర్రం కృష్ణ, తాళ్లూరి శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ, నల్లమల్లి పాండురంగనాథం, ఎస్కే బాబు, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కె.రాఘవులు తదితరులు విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్ఫూర్తినిచ్చిన విశ్వనాథ్ సినిమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశ్వనాథ్ సినిమాలను చూస్తూ పెరిగా. మానవ సంబంధాలు, నైతిక పునాదులపై ఆయన సినిమాలు చర్చించేవి. సమాజం పట్ల బాధ్యతను తెలిపే ఆ సినిమాల ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఒంగోలులో నృత్య కళాశాలను ఏర్పాటు చేశా. ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నా. మా కళాశాల ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ఒంగోలుకు రావడం, తండ్రిలా మా ఇంటికి భోజనం చేయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయన మరణం కళాకారులకు తీరని లోటు. – యస్వీ శివకుమారి, శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్, ఒంగోలు మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా సినిమాలు చూస్తే పిల్లలు పాడైపోతారని పెద్దలు మందలించే వారు. అలాంటి పరిస్థితి నుంచి స్వయంగా పెద్దలే తమ పిల్లలను విశ్వనాథ్ సినిమాలు చూడమని ప్రోత్సాహించేలా ఆయన కళాఖండాలు రూపొందించారు. విశ్వనాథ్ మృతి తెలుగు సినిమా రంగానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. ఆయన వారసత్యాన్ని కొనసాగించే దర్శకులు నేడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచారకరం. – కల్లకుంట కృష్ణయ్య, అక్కినేని కళాపరిషత్, ఒంగోలు -
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్
Mahesh Babu Making Memories With His Family In Italy: సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో తెలిపాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా పూర్తయితే అయితే చాలు భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన 'మేజర్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఇంతకుముందు ఇటలీలో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు మహేశ్ బాబు. తాజాగా ఇటలీలోని మిలాన్ వీధుల్లో దిగిన సెల్ఫీ ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో కుమార్తె సితారతో కలిసి మహేశ్ బాబు ఫన్నీగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూడొచ్చు. ఈ ఫొటోలకు 'ఇప్పుడు.. ఇక్కడ.. జ్ఞాపకాలు రూపుదిద్దుకుంటున్నాయి. రోజులో ఒకసారి. నా కుటుంబం' అని క్యాప్షన్ ఇచ్చాడు మహేశ్ బాబు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
పండగ పూట... ఊరు పిలుస్తోంది
నను గన్న నా ఊరుకు వందనం. నా మాటలు విని నాకు మాటలు చెప్పిన రావిచెట్టు అరుగుకు వందనం. సైకిల్ టైరును కర్రపుల్లతో పరుగులెత్తించే వేళ నన్ను విమానం పైలెట్‌లా ఫీలయ్యేలా చేసిన ఊరి వీధులకు వందనం. కరెంటు స్తంబం దగ్గర రేగుపళ్లను అమ్మిన అవ్వకు వందనం. దొంగ కొంగలను అదిలించక చేపలకు భద్రం చెప్పిన చెరువుకు వందనం. అక్కా.. పిన్ని... బాబాయ్ పలకరింపులకు వందనం. తప్పు చేస్తే ఉమ్మడిగా కలిసి ప్రేమగా విధించిన దండనకు వందనం. పండగొచ్చింది. ఊరెళ్లాలి. కోవిడ్ సమయం ఇది. జాగ్రత్తగా వెళ్లాలి. సురక్షితంగా తిరిగి రావాలి. పొలిమేరల్లో అడుగుపెడుతూనే జిల్లున తండ్రి పేరు వినపడుతుంది. ‘ఏయ్యా... నువ్వు వెంకన్న కొడుకువే కదా’... ‘ఏమ్మా... రామారావు మేష్టారి చివరమ్మాయివేగా’... ఊరికి అందరూ తెలుసు. ఊరు తన మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులని. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనే అవే వీధులు. అవే ఇంటి పైకప్పులు. అవే డాబాలు. అవే చిల్లర అంగళ్లు. కొన్ని ఏవో మారిపోయి ఉంటాయి. పాత దగ్గర కొత్తవి వచ్చి ఉంటాయి. మేకప్ కొద్దిగా తేడా. ముఖం అదే. చిర్నవ్వు అదే. కళ్లాపి చల్లిన ముంగిళ్లు ఎదురు పడతాయి. వాటి మీద వేసిన ముగ్గులు తమ రంగులను లెక్కపెట్టమంటాయి. ఒక తల్లి ఎవరో ముసుగు తన్ని నిద్ర పోతున్న పిల్లలను లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద పాకిన గుమ్మడిపాదు తన కాయలను నీకివ్వను పో అంటూ ఉంటుంది. ఈ మనుషుల మధ్యే కదా బాల్యం గడిచింది అని గుండెలకు కొత్త గాలి ఏదో తాకుతుంది. పొద్దున్నే పాల కోసం గిన్నె పట్టుకుని వచ్చింది ఈ వీధుల్లోకే. అదిగో సుబ్బయ్య టీ అంగడి. మళ్లీ ఇస్తాలే అని తాగి మర్చిపోయిన ఒకటి రెండు టీల బాకీ గుర్తుకొస్తోంది. పుల్లట్లు వేసే కాంతమ్మ ఇంటికి కొంత దూరం నడవాలిలే. ఆ చట్నీ అంత రుచిగా ఎలా ఉంటుందో కెఎఫ్సి వాడికి తెలిసుంటే ఫార్ములా కొనుక్కొని వెళ్లేవాడు. పెద్ద శెట్టి అంగడి ఇంకా తెరవలేదు. పండక్కి అమ్మ చీటి రాసిస్తే ఈ అంగడిలోనేగా చక్కెర, బెల్లం, యాలకులు, సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి కొనుక్కుని వెళ్లేది. బెల్లం పొట్లం కట్టాక చేయి సాచితే కొసరు అందేది. బుగ్గ పండేది. అబ్బ. కచ్చేరి అరుగు. ఉదయం అక్కడే పేపర్ చదవాలి. మధ్యాహ్నం అక్కడే గోలీలాడాలి. సాయంత్రం అక్కడే ట్రాన్సిస్టర్‌లో పాటలు వినాలి. పులిజూదం ఆటలో ఒలింపిక్స్ మొనగాళ్లు మామూలు లుంగీల్లో అక్కడే తిరుగాడుతుండేవారు. ఊరి వార్తలు చెవిలో పడేసే మహా మహా జర్నలిస్టులు రాత్రి కూడు తినేసి పై కండువా సర్దుకుంటూ వచ్చేసేవారు. అందరికీ నీడనిచ్చే అరుగు చెట్టు వేల కొద్ది గువ్వలకు పురుళ్లు పోసి పోసి పండిపోయి ఉండేది. అది ఆకులు రాల్చి మోడుగా నిలిచే రోజుల్లో ఊరు చిన్నబుచ్చుకుని ఉండేది. నాన్న సైకిల్ ఈ దారుల్లోనే తిరిగేది. అమ్మ చేయి పట్టుకొని తొలాటకు ఇటుగానే వెళ్లేది. ఐసు బండి వస్తే ఏ రంగుది కొనుక్కోవాలో తెలియక రెండు మూడు నిమిషాలు నెత్తి గీరుకునేది. గెలిచిన గోలీలు దొంగలించిన శీనుగాడి మీద నాలుగైదు వారాలు పగబట్టేది. ఊళ్లోని మేనత్త మేమమామలు అసలు చుట్టాలుగా అనిపించకపోయేది. రైలు దిగి వచ్చే బాబాయి పిన్నే తమను కూడా వెంటబెట్టుకుని వెళతారని సంబరం కలిగిచ్చేది. పండగ సెలవుల్లో స్కూలు మైదానంలో గాలిపటాలు ఎగిరేవి. తోకలు లేని పిట్టలు తోకలు ఉన్న పటాల దారాలు లాగేవి. బిళ్లంగోడు దెబ్బకు బిళ్ల గిర్రున గాలిలో లేచేది. హరిదాసు చిడతలకు వాకిట్లో ఇల్లు గుమిగూడేది. బుడబుడల డమరుకానికి పాత బట్టలనీ వెలికి వచ్చేది. గంగిరెద్దుల సన్నాయికి ఒక్కటే పాట వచ్చు. కొమ్మదాసులు చెట్టెక్కి దిగకపోయేది. పిట్టలదొరల కోతలకు పంట చేలు కూడా అచ్చెరువొందేవి. కోలాటానికి మోత ఫెళ్లుఫెళ్లున మోగేది. పులేషగాళ్లు నిమ్మకాయను పళ్లతో కొరికి భయపెట్టేవాళ్లు. తప్పెట్లు తాటాకు మంటల చివరలకు బెదరక సెగ పొందేవి. ఊరి దేవత ఊరేగింపు సంబరంగా జరిగేది. పిండి వంటలు లేని ఇల్లు ఎక్కడ? కనిపెట్టిన వారికి బహుమానమండోయ్. ఈ ఇంటి మనుబూలు.. ఆ ఇంటి అరిసెలు... పొరుగింటి లడ్లు... ఇరుగింటి పాయసం. పెద్దవాళ్లు అడక్క పోయినా పిల్లలకు సినిమాకు చిల్లర ఇచ్చేవారు. కొత్త సినిమాల పోస్టర్లు టైమ్ మొత్తం తినేసేవి. ఊరు వదిలి ఉపాధి కోసం వచ్చేశాము. ఊరు గుండెల్లోనే ఉంది. పండగ వచ్చిందంటే అది జాబు రాయకనే పిలుస్తుంది. ఊరిని చూడాలి. మళ్లీ బతకాలి. నేస్తుల్ని కలవాలి. ఊసులను రాసి పోయాలి. ఊరికి బయలుదేరుతున్నా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. దూరం పాటిస్తా. పిల్లలను గుంపులో వెళ్లకుండా చూసుకుంటా. ఈ పండగను వదలుకోలేను. ఊరికి వెళతాను. కాని ఊరిని నా నుంచి నన్ను ఊరి నుంచి సురక్షితంగా ఉంచేలా వెళతాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. -
గోవా బీచ్‌లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్..
-
గోవా బీచ్‌లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్.. కూతురితో కలిసి
Shriya Saran Memories With Her Daughter Radha In Beach: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. వివాహ అనంతరం నుంచి అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది శ్రియా. ఇటీవలే ఆమెకు కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది శ్రియా. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో గోవా బీచ్‌లో తన కూతురు రాధ చేతులు పట్టుకుని నడిపించడం శ్రియా తల్లి ప్రేమను చూపిస్తోంది. ఈ ఇన్‌స్టా స్టోరీలో శ్రియా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. కుమార్తెతోపాటు తన భర్త ఆండ్రీతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది శ్రియా. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్ చేస్తూ ఒక స్టోరీలో 'లవ్ అండ్ హ్యాపినెస్ టూ యూ ఆల్' అని 'గ్రేట్ఫుల్' అని స్మైలింగ్ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్ ఇచ్చింది. మరొక స్నాప్‌షాట్‌లో శ్రియా సరన్ ట్యాంక్ టాప్, షార్ట్ ధరించి కొబ్బటి చెట్టుపై వయ్యారంగా వాలుతూ ఫోజులిచ్చింది. అందులో నీలి సముద్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ స్టోరీని ఉద్దేశించి 'హ్యాపీ హాలీడేస్ గాయ్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చిందీ మదర్ బ్యూటీ. వీటితోపాటు మరికొన్ని స్టోరీలు షేర్ చేస్తూ ఈ ఏడాది డైవ్ చేద్దాం.. 2022 అందమైన జ్ఞాపకాలతో నిండి ఉండాలని కోరుకుందాం అని క్యాప్షన్స్ ఇచ్చింది శ్రియా సరన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్. -
దేశంలో దొంగలు పడ్డారు
వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా? ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్ ఫ్రూట్ అబ్బాయి ‘ఐస్... పాలైస్’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్ బెంజ్ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష) ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు. అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో? – సి.ఎన్.ఎస్.యాజులు -
జ్ఞాపకాల వాన
రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలను చీల్చుకుంటూ, భగ భగమని మండే గ్రీష్మతాపాన్ని వెక్కిరిస్తూ, నల్లటి మబ్బులు ఆకాశమంతా పహారా కాసే దృశ్యం ఓ అద్భుతం. ఎండవేడికి ఎడారిలా మారిన నేలతల్లిని ఆకాశం చూరు నుండి జారిపడ్డ వాన నీటి బొట్టు ముద్దాడే వేళ... గతజన్మను గుర్తు చేసే మట్టి పరిమళం.. ఎండాకాలపు కష్టాలన్నింటినుండీ విముక్తం చేసే ప్రకృతి మంత్రం. ఆకాశపు జల్లెడ నుండి కురిసే వర్షపు నీటి ధారలు చూస్తుండగానే పిల్లకాలువలై, ఏటి వాగులై, నదీ నదాలై... పరుగులు పెట్టే చల్లదనపు ప్రవాహం వర్షాకాలపు తొలి సంతకం. వాన చినుకు పడితే చాలు... ఈ రోజు బడికి సెలవిచ్చే స్తారన్న ఆనందాన్ని అనుభవించని బాల్యం ఉంటుందా అసలు? మాస్టార్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయని రోజున ఈ ఒక్కరోజుకు వర్షం పడితే బాగుండునని దేవుడికి కోటి మొక్కులు మొక్కే చిన్నారుల ఆకాంక్షలు మేఘాలూ వింటాయి. విని చల్లటి వానతో మురిపించి బడికి సెల విప్పించిన వానాకాలపు చదువురోజులు అనుభవంలోకి రానివారెంతమంది? బడికెళ్లేటపుడు వాన లేకపోయినా, బడికెళ్లిన వెంటనే తరగతి గదిలో ఏ అప్పారావు మాస్టారో సుమతీ శతకపు పద్యాన్ని వల్లెవేయించేటపుడు పెంకుటింటి బడి పైకప్పుపై అమాంతం పెద్ద వాన పడి... పిల్లల పుస్తకాలపై వాన నీటి బొట్లు టపటపా రాలి పడుతుంటే.. అవే ముత్యాలుగా ఏరుకుని సెలవు పిలుపు ప్రకటించే బడిగంట కోసం ఆత్రుతగా ఎదురు చూసే చిన్ని చెవుల్లో ఇక పద్యాలు వినపడని హాయిని అందరూ చూసిన వాళ్లమే కదా. సెలవిచ్చి ఇంటికి రాగానే ఇంటి చూరు నుంచి నయాగరా జలపాతాల్లా జారిపడే వర్షపు నీటి చప్పుడుకు లయబద్ధంగా దానికి కోరస్ పాడే కప్పల బెక బెక కచేరీలను ఆలకిస్తూ... లోకాన్ని మర్చిపోవడం ఎంత గొప్ప జ్ఞాపకం. వాన నీటి కాలువలో... కాగితపు పడవలు వేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే... టైటానిక్ షిప్ యజమానుల వలే గర్వంగా నవ్వుకునే బాల్యం ఆనందాన్ని ఎవరైనా కొలవగలరా అసలు? అలా గమ్యం తెలియని తీరానికి వెళ్లే పడవ కాస్తా ఏ బుల్లి సుడిగుండంలోనో చిక్కుకుని మునిగి పోతే... మనసంతా బాధతో నిండిపోయి... ఏడుపొచ్చేసి కంటి చూరు నుంచి జారిపడే కన్నీటి బొట్లు బుగ్గలను ఓదారుస్తూ కిందకి జారిపోయే తియ్యటి బాధలు మళ్లీ మళ్లీ వస్తే బాగుండునని అనుకునే ఉంటారు కదా. వర్షం తగ్గాక ఇంటి కెదురుగా మోకాల్లోతు నీటిలో ఆడుతూ పాడుతూ తిరగడం ఎంత ఆనందం? ఆ తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో చూసి వీపు విమానం మోత మోగిస్తే... ఉక్రోషంతోనూ... తమ రాజ్యం నుంచి తమని బలవంతంగా గెంటివేసిన శత్రుసైన్యంలా అమ్మానాన్నలపై మనసులోనే కోపంతో రగిలిపోయే ఆక్రోశం గుర్తొస్తే ఇపుడు నవ్వొస్తుంది కదూ. వానలో తడిసి ముదై్ద తల సరిగ్గా తుడుచుకోక ముతక వాసన వేయడం.. తడిసిన తల సరదాగా జలుబు తెచ్చి పెట్టడం.. ముక్కు కారుతూ ఉంటే ఎగపీల్పులతో... వర్షంతో పోటీ పడ్డం పిల్లలకు ఓ ఆటే. కానీ పెద్దాళ్లకు మాత్రం... వెధవా చెబితే విన్నావు కాదు... అంటూ ఓ టెంకిజెల్ల ఇచ్చుకుని... బల వంతంగా పొగలు కక్కే మిరియాల కషాయంతో పనిష్ మెంట్ ఇచ్చే చేదు జ్ఞాపకాలకూ కొదవుండదు. కషాయం తాగించడం కోసమే బెల్లం ముక్క తాయిలాన్నీ చేతిలో పెట్టుకునే పెద్దాళ్ల గడుసుతనం... ఆ బెల్లం ముక్క తీపిని ఊహించుకుంటూనే కారపు కషాయాన్ని అమాంతం గుటకేసి తాగేసే బాల్యం... ఇంటింటా ఓ అద్భుత చిత్రమే. ఎక్కడో శత్రు సేనలు గొడవ పడుతున్నట్లుగా వర్షా కాలంలో ఉరుములు చేసే బీభత్సం... మెరుపులు సృష్టించే భయానక వాతావరణం... కాసేపు భయపెట్టినా.. వాన చిను కులు పడుతుండగానే మళ్లీ ప్రత్యక్షమయ్యే ఎండను వాన ముద్దాడినపుడు ఆకాశంపై ఈ మూల నుండి ఆ మూలకి వయ్యారంగా వంగి మెరిసే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏ దేవుడు గీసిన రంగుల బొమ్మో? లేదా ఏ చిత్రకారుడు నేలపై కోపంతో ఆకాశంపై గీసిన చిత్రకళాఖండమో? తేల్చుకోవడం కష్టమే. ఆకుపచ్చ దనాన్నీ, హాయిదనాన్నీ అందరికీ అందించే ప్రకృతి ఖజానా ...వాన. వానాకాలపు జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధురంగానే ఉంటాయి. ప్రతీ వాన చుక్కకీ ఓ అనుభవం. నైరుతీ చుట్టాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుషారుగా తిరిగేస్తున్నారు. వానాకాలం చల్లగా వచ్చేసింది. దాన్ని సాదరంగా స్వాగతించి... ఈ వానాకాలమంతా ఎన్నో జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారనే ఈ పాత జ్ఞాపకాల వానను మీ ముందుంచింది. – సి.ఎన్.ఎస్. యాజులు -
తొలిసారి తిరువారూర్‌కు సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరువారూర్‌కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తన తండ్రి దివంగతనేత కరుణానిధి జన్మస్థలం తిరుకువళైకు వెళ్లారు. అక్కడి గృహంలోని అవ్వ, తాత, తండ్రి విగ్రహాలకు నివాళులర్పించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తన తండ్రి జన్మస్థలం తిరుకువళైకు సతీమణి దుర్గా స్టాలిన్, తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. తిరుచ్చిలో సీఎంకు పార్టీ నేతలు, అధికారులు ఆహ్వానం పలికారు. అక్కడ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి ఆవరణలో శిశుసంక్షేమ, ప్రసూతి వైద్యకేంద్రాన్ని ప్రారంభించారు. దీన్ని రూ.12 కోట్లతో నిర్మించారు. అక్కడి వసతులను ఆరోగ్యమంత్రి సుబ్రహ్మణ్యన్, అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా కరోనా టీకాలు వేయడంలో తొలిస్థానంలో నిలిచిన కాట్టూరు గ్రామ సర్పంచ్ విమల ప్రభాకర్, తిరువారూర్జిల్లా కలెక్టర్ గాయత్రిని సత్కరించారు. అలాగే తనను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కేఎన్ నెహ్రూ, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్.. కుటుంబ సమేతంగా తిరుకువళైకు వెళ్లిన సీఎం స్టాలిన్ అక్కడ తన తండ్రి ఇంటికి వెళ్లారు. తన తండ్రి బాల్యంతో పాటుగా రాజకీయ పయనానికి ముందుగా పూర్తి కాలం ఇదే ఇంట్లో ఉన్న విషయాన్ని మనవళ్లు, మనువరాళ్ల దృష్టికి తెచ్చే రీతిలో సీఎం స్టాలిన్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. -
Tripuraneni Gopichand: ఆయన ఎవ్వరినీ నొప్పించేవారు కాదు..
త్రిపురనేని గోపీచంద్.. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు... పలు చిత్రాలకు సంభాషణలు రచించారు.. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా... వంటి నవలల ద్వారా సాహితీ లోకానికి సుపరిచితులు... త్రిపురనేని రామస్వామి కుమారుడిగా కాకుండా... త్రిపురనేని గోపీచంద్‌గా ప్రసిద్ధులయ్యారు.. తండ్రిగా పిల్లలతో ఎలా ఉండేవారో వారి రెండో కుమార్తె రజని సాక్షికి వివరించారు.. నాన్నగారు 1910, సెప్టెంబరు 8 వినాయక చవితి రోజున చౌటుపల్లిలో పుట్టారు. త్రిపురనేని రామస్వామి, పున్నమాంబలు తల్లిదండ్రులు. నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తాతగారు విప్లవ రచయిత, నాన్నగారు అభ్యుదయ రచయిత. ఇంకా చెప్పాలంటే నాన్నగారి రచనలలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. నాన్నగారి 22వ ఏట శకుంతలాదేవితో వివాహమైంది. అమ్మ ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు గారి ‘శారదా నికేతనం’లో.. తెలుగులో విద్వాన్ , హిందీలో విశారద చదువుకున్నారు. అమ్మను బాగా చదువుకున్నవారికి ఇవ్వాలనుకున్నారు. అందువల్ల నాన్నగారి చదువు చూసి వివాహం నిశ్చయించారు. నాన్నగారు చాలా ఇష్టపడి ఈ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఇంటలెక్చువల్ కంపానియన్ షిప్. అనుకూలమైన దాంపత్యం. నాన్నగారు అమ్మకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. అమ్మనాన్నలకు మేం ఆరుగురం పిల్లలం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ప్రమీలా దేవి, రమేశ్‌బాబు, రజని (నేను), రామ్‌గోపాల్, నళిని, సాయిచంద్ (సినిమా నటుడు). మా చదువుల గురించి బాగా శ్రద్ధ తీసుకున్నారు. పెద్ద అన్నయ్య రమేశ్ డాక్టరు చదివాడు. ఇంగ్లండ్ కూడా వెళ్లాడు. నాన్నగారు పోయేనాటికి మా చిన్నతమ్ముడు సాయి చంద్ వయస్సు ఆరు సంవత్సరాలు. వాడిని చూస్తుంటే, తన బాల్యం గుర్తుకు వస్తోందనేవారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ, మా ఇంట్లో సాయి ఒక్కడే నాన్నగారి సినిమా వారసత్వం అందుకున్నాడు. సినిమాలు – ఆకాశవాణి నాన్నగారు గూడవల్లి రామబ్రహ్మం గారి ఆహ్వానం మీద మద్రాసు వెళ్లి, రైతుబిడ్డ చిత్రానికి రచయిత, సహకార దర్శకుడిగా పనిచేశారు. మాయాలోకం, చిత్రానికి కూడా వారి దగ్గరే రచయితగా పనిచేశారు. ఆ తరవాత వచ్చిన గృహప్రవేశం చిత్రానికి కథమాటలుస్క్రీన్ప్లే సమకూర్చారు. ఆ రోజుల్లో ఆ చిత్రం కొత్త తరహాలో రూపొందింది. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జగ్గయ్యగారిని ప్రియురాలు చిత్రంలో హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత పి.పుల్లయ్యగారు, కె. వి. రెడ్డిగారు నాన్నగారు కలిసి ధర్మదేవత చిత్రానికి స్క్రీన్‌ప్లే చేశారు. అది పెద్ద హిట్. అక్కడ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే బెజవాడ గోపాలరెడ్డిగారి ఆహ్వానం మీద ‘సినిమాలు వదిలేసి, ఆంధ్ర రాజధానిగా కొత్తగా ఏర్పడిన కర్నూలుకి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్‌గా వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాక, ఆలిండియా రేడియోలో గ్రామస్థుల కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ‘కలిమి లేములు’, దుక్కిపాటి మధుసూదనరావు గారి చదువుకున్న అమ్మాయిలు చిత్రాలకు... సంభాషణలు రాశారు. మల్లెపువ్వులా ఉండేవారు.. ఉదయం నాలుగు గంటలకు లేచి, కాఫీ తాగేసి, తన పనిలో నిమగ్నమైపోయే వారు. ఎంత పనిలో ఉన్నా కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు. తెల్లటి పట్టు పంచె, లాల్చీలో నాన్న గారు మల్లెపువ్వులా ఉండేవారు. కర్నూలులో ఉన్న రోజుల్లో షేర్వాణీ వేసుకునేవారు. అప్పుడప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునేవారు. వస్త్ర ధారణ విషయంలో శ్రద్ధ ఉండేది. ఎక్కడకు వెళ్లినా అమ్మకు, అక్కకు మైసూర్ క్రేప్ సిల్క్ చీరలు తెచ్చేవారు. మేం వేసుకున్న దుస్తులు గమనించేవారు. ఒకసారి అమ్మ మాటల మధ్యలో నాన్నగారితో నా గురించి, ‘రజనికి మీ అందం రాలేదు’ అంది. అందుకు, ‘దానికి జుట్టు, పాదాలు నావే వచ్చాయి కదా’ అన్నారు, ఎంతో ఆప్యాయంగా నా వైపు చూస్తూ. ఆయనకు ఎవ్వరి మనసు నొప్పించటం ఇష్టం ఉండదు. మాతో సన్నిహితంగా... ఎప్పుడైనా మేం ఆడుకుంటే పడిపోతే ఆయనకు నచ్చేది కాదు. చిన్న దెబ్బ వేసి, ‘ఎందుకు పడిపోతూ దెబ్బలు తగిలించుకుంటారు’ అని సున్నితంగా మందలించేవారు. ఆయన మాటల్లో ఎంతో తాత్త్వికత ఉండేది. నాన్నగారితో క్యారమ్ బోర్డు ఆడటం మాకు సరదాగా ఉండేది. నాన్నగారి స్ట్రయికింగ్ చూడాలనిపించేది. ఆడుకునేటప్పుడు తగవులు, అల్లరిచిల్లరిగా కొట్టుకోవటం తెలీదు. వాకింగ్ చేస్తూ, మా వయసుకి తగ్గట్టుగా కథలు, మాటలు చెప్పేవారు. అప్పుడప్పుడు షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు. రాత్రి పూట భోజనాలయ్యాక కాసేపు బయటికి తీసుకువెళ్లి నడిపిస్తూ.. పల్లీలు, పండ్లు కొనేవారు. నాన్నగారి మీద ఆత్మీయతతో కూడిన గౌరవం ఉండేది. మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. శాకాహారులే... తాతగారు శాకాహారులు కావటం వల్ల ఇంట్లో అందరూ శాకాహారమే తినేవారు. నాన్నగారు కొన్నాళ్లు మాంసాహారం తినేవారు. సాయిబాబా భక్తులయ్యాక వెజిటేరియన్ అయిపోయారు. అమ్మ శారదా నికేతనంలో పెరగటం వల్ల ఇంట్లో వంటకాలన్నీ ఇంగువ వాసన వచ్చేవి. చేకోడీలు, మురుకులు వంటివి అమ్మ చాలా బాగా చేసేది. నాన్న తిండి ప్రియులే కానీ, మితంగా తినేవారు. ఒక్కోసారి చేతిలో ఉన్న టిఫిన్ నోటి దాకా కూడా వెళ్లేది కాదు. పెన్నులో నీళ్ళు పొయ్యమనేవారు ఒకరోజున ఒక సంఘటన జరిగింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ మా హృదయంలో తడి ఆరకుండానే ఉంది. చేతితో పెన్ను పట్టుకుని, వంటగదిలోకి వచ్చి, ‘అమ్మా! ఈ పెన్నులో నీళ్లు పొయ్యి’ అన్నారు. ‘నీళ్లా’ అని నవ్వుతుంటే, ‘చాల్లే, ఇంకు ఇవ్వు!’ అన్నారు. నిరంతరం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు. నాన్నగారు రాస్తున్నప్పుడే చదివేస్తూ ఉండేదాన్ని. మేం కొత్త పెన్ను కొనుక్కుని నాన్నగారికి ఇచ్చేవాళ్లం. ఆయన రోజంతా రాసుకుని పాళీ బాగా స్మూత్ అయ్యాక మాకు ఇచ్చేవారు. అప్పుడు ఆ పెన్ను మేం వాడేవాళ్లం. ఇల్లు నిరంతరం కళాకారులు, రచయితలతో సరస్వతీ పీఠంలా ఉండేది. అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతుండేవి. మృదుహృదయ సంస్కారం.. ఉద్యోగరీత్యా మేం కర్నూలులో ఉంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇప్పటికీ మేం మర్చిపోలేం. మా పొరుగు వాళ్లింట్లో ఒక పెద్దాయన గతించారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావటానికి ఇంటివారు ఒప్పుకోకపోతే, నాన్నగారు ‘మా ఇంటికి తీసుకువచ్చి కార్యక్రమం చేసుకోండి’ అన్నారు. చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నాన్నగారు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చేశారు. రావూరి భరద్వాజ నాన్నగారిని ‘అన్నదాత’ అన్నారు. ఆయనకు ఆకాశవాణిలో ఉద్యోగం నాన్నగారే వేయించారు. ఆయనకు ఆ కృతజ్ఞత ఉండిపోయింది. అరుదైన గౌరవం.. తెలుగు సాహిత్య చరిత్రలో నాన్నగారు అందుకున్న అరుదైన గౌరవం ఒకటి ఉంది. నాన్నగారు రాసిన ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఒక తెలుగు నవలకు ఈ అవార్డు దక్కటం అదే మొదలు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తెలుగు వారి స్టాంపులు విడుదల కావటం కూడా విశేషమే. తాతగారిది, నాన్నగారిది... ఇద్దరివీ విడుదల చేశారు. రచయిత విహారి, నాన్నగారి నవలల గురించి, ‘సాధారణంగా కనిపించే అసాధారణ జ్ఞాన గంగ’ అన్నారు. బాధపడేవారు... అమ్మ నాన్నగారితో సమానంగా సాహితీవేత్త. అమ్మ పరిజ్ఞానమంతా నిరుపయోగం అయిపోతున్నందుకు నాన్న గారు బాధపడినట్లు ఒకచోట రాసుకున్నారు. నాన్నగారు బిఏబియల్ చదివారు. తాతగారు కూడా లా చదివారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోకి వెళ్లలేదు. తాతగారు 56 సంవత్సరాలకే గతించారు. తాతగారి సాహితీ వారసత్వంతో పాటు జీవన వారసత్వం కూడా వచ్చిందేమో!! నాన్నగారు 52 సంవత్సరాలకే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయనకు తెలుసేమో... నాన్నగారు పోవటానికి ముందు రోజు అంటే నవంబరు 1న ‘భార్యా విలాపం’ నవల మొదలు పెడతానన్నారు. మరుసటి రోజు అంటే నవంబరు 2 న రమేశ్ అన్నయ్య మందులు తీసుకుని వచ్చాడు. అప్పుడు నాన్నగారు చేత్తో ఛాతీ మీద రాసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తున్నారు. నాన్నగారికి ఏదో తెలిసినట్లుగా, ‘ఈ మధ్యనే మా స్నేహితుడు కృష్ణారావు ఇంజక్షన్ ఇవ్వగానే పోయారు’ అన్నారు.నాన్నగారి మాటలు వింటూనే, డాక్టర్‌గారు నాన్నగారికి ఇంజక్షన్ ఇచ్చారు. అదేం చిత్రమో తెలియదు కానీ, ఇంజక్షన్ చేసిన ఐదు నిమిషాలకే నాన్న కన్ను మూశారు. అమ్మ ఒంటరిగా విలపించింది. నాన్నగారి మీద బెంగ పెట్టుకుని, ఆయన పోయిన నాలుగు సంవత్సరాలకే అమ్మ కూడా తనువు చాలించింది. మేం కర్నూలులో ఉండగా ఒక జ్యోతిష్కుడు వచ్చి నాన్నగారితో ‘మీకు ఆయుష్షు తక్కువ. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఆ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ యాదృచ్చికమే కావొచ్చు. కాని నాన్నగారి విషయంలో అన్నీ వాస్తవం అయ్యాయి. అందువల్లే ఈ విషయాలు మాకు పదేపదే గుర్తుకు వస్తుంటాయి. మా జీవితాలు ప్రారంభిస్తున్న రోజుల్లోనే అంత గొప్ప తండ్రిని పోగొట్టుకున్నామన్న బాధ ఇప్పటికీ మా మనసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నది నాన్నగారి సాహిత్యమే. ఏ సమస్య వచ్చినా నాన్నగారి పుస్తకాలే మాకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఆయనకు పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. గోపీచంద్రుడు అనేవారు... విశ్వనాథ సత్యనారాయణ గారికి నాన్నగారి మీద పుత్ర వాత్సల్యం ఉండేది. ఎంతో ప్రేమగా ‘గోపీచంద్రుడు’ అని పిలిచేవారు. నాన్నగారు పోయినప్పుడు, ‘అతని అకాల మరణమునకు నేను పొందుచున్న దుఃఖమునకు చిహ్నముగా’ అని ఆయన రచించిన ‘గంగూలీ ప్రేమకథ’ నవలను నాన్నగారికి అంకితం చేశారు. నాన్నగారు పోయేటప్పటికి... యమపాశం, చీకటి గదులు, ప్రేమోపహతులు.. మూడు రచనలు అసంపూర్ణంగా ఉండిపోయాయి. అవి అసంపూర్ణంగానే ముద్రితమయ్యాయి. -
Actor Sai Kiran: నేను భయపడుతుంటే, కూల్‌గా ఎలా ఉన్నారు?
శారదా నను చేరగా.. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు.. ఎదగడానికెందుకురా తొందరా... శివ శివ శంకర భక్తవశంకర... ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు.. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా... పాండురంగ నామం.. వినరా వినరా.. విలక్షణ గాత్రం.. వైవిధ్యమైన భావం... ఎన్నో పాటలకు తన గళంలో ప్రాణం పోశారు.. సినీ గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు వి. రామకృష్ణదాసు.. ‘ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరించారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు కుమారుడు సాయి కిరణ్... కళలకు పుట్టినిల్లయిన విజయనగరంలో పుట్టారు నాన్న. తండ్రి రంగసాయి, తల్లి రత్నం. పది మంది సంతానంలో నాన్న ఇంటి పెద్ద. ఇంట్లో నాన్నను దాసు అని పిలిచేవారు. అన్నదమ్ములను జాగ్రత్తగా చూసుకోవటం, చెల్లెళ్లకు జడలు వేయటం, ఇంటి పనుల్లో సహాయం చేయటం.. ప్రయోజకుడైన పెద్ద కొడుకులా ఉండేవారట. తాతగారి కంటె నాన్నను బాగా చూసేవారట. అన్ని విషయాల్లోనూ అమ్మకు సహాయంగా ఉండేవారట. అలా మొదలైంది... స్కూల్లో చదువుకునే రోజుల్లో బాగా పాడే వారట. ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణ రావు నాన్న పాటలు విని, ‘సినిమాల్లో పాడొచ్చుగా’ అన్నారట. నాన్న మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఎస్.సి వరకు చదువుకున్నారట. ప్రభుత్వం వారి కుటుంబ నియంత్రణ ప్రకటన కోసం పాడిన పాట విన్న అక్కినేని, నాన్న గురించి సమాచారం సేకరించారట. ‘విచిత్ర బంధం’లో పాడే అవకాశం వచ్చింది. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో ‘భక్త తుకారాం’ చిత్రంలో మంచి పాటలు పాడారు. హుందాగా ఉండేవారు.. నాన్నది ప్రేమ వివాహం. ఆయన మ్యూజిక్ షోస్‌కి వెళ్లేవారు. అప్పుడే అమ్మ జ్యోతి కూడా అదే ఆర్కెస్ట్రాలో పాడేవారు. వాళ్ల పెయిర్ బాగా హిట్ అయ్యింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది, వివాహం అయింది. రెండు కుటుంబాల అంగీకరిం చటానికి కొంత కాలం పట్టింది. నాన్నకు నేను, చెల్లాయి లేఖ ఇద్దరం పిల్లలం. ఎప్పుడూ తిట్టడం కూడా తెలియదు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గురించి చెప్పేవారు. మా చదువు విషయంలో నాన్న చాలా పర్టిక్యులర్‌గా ఉండేవారు. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజున ‘హీరో అవుతాను’ అంటే, బాగా కేకలేశారు. ఒకసారి పని మీద రజనీకాంత్ గారి దగ్గరకు వెళితే, ఆయన నాన్నతో, ‘మీ అబ్బాయి నటుడా’ అని అడిగారు. నాన్న మౌనంగా వచ్చేశారు. ‘నేను నటుడిని అవ్వాలనుకుంటుంటే, మీరే నన్ను ఎదగనివ్వట్లేదు’ అని కోపంగా అన్నాను. ‘నువ్వు డిగ్రీ పూర్తి చెయ్యి. తరవాత చూద్దాం’ అన్నారు నాన్న. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసి, గోల్డ్ మెడల్ సాధించాను. చెల్లెలు బి.సి.ఏ. చేసి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. డిగ్రీ పూర్తి కాగానే మళ్లీ సినిమాల గురించి అడిగాను. వెంటనే నా ఫోటోలు అందరికీ ఇచ్చారు. మొట్ట మొదటగా ఒక చానెల్‌లోను, ఆ తరవాత వారి బ్యానర్లోను నటించే అవకాశం వచ్చింది. నన్ను తెర మీద చూడగానే నాన్న కళ్లలోని ఆనంద బాష్పాలు ఇప్పటికీ మనసులో పదిలంగా ఉన్నాయి. అందరూ ఎగతాళి చేశారు.. నేను సినిమాలలోకి రావటం చూసి, ‘పిల్లల్ని చెడగొడుతున్నావు’ అని అందరూ నాన్నను మందలిస్తుంటే, ‘నేను తప్పు చేస్తున్నానా’ అని నాన్న బాధపడేవారు. ‘ఒక ఏడాది ప్రయత్నిద్దాం, సక్సెస్ సాధించకపోతే ఉద్యోగంలోకి వెళ్లిపోవాలి’ అన్నారు. అప్పుడు చదువు విలువ తెలిసింది నాకు. జీవితమే అన్నీ నేర్పుతుందని అర్థమైంది. నాన్న చనిపోయాక తల్లిదండ్రుల విలువ తెలిసింది నాకు. లైఫ్ సైన్సెస్ నాన్న పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. పనివారైనా సరే వయసులో పెద్దవారైతే ‘మీరు’ అనాలనేరు. ‘దర్శకుడు వయస్సులో మన కంటె చిన్నవాడైనప్పటికీ, తండ్రి స్థానంలో చూడాలి, కాలి మీద కాలు వేసుకోకూడదు, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదు’ అంటూ చాలా విషయాలు చెప్పారు. రాముడితో పాటు రావణుడు కూడా గొప్పవాడని, కొన్ని చెడ్డ లక్షణాల వల్లే దుర్మార్గుడయ్యాడని చెబుతూంటే, ఆ టీనేజ్‌లో చాలా ఇరిటేటింగ్‌గా ఉండేది. ఇప్పుడు నాలో ఆధ్యాత్మిక ధనం బాగా పెరిగింది. పురాణాలు, కథలు అన్నీ తెలిసినందుకు సంతోషంగా ఉంటోంది. ఈ జీవిత ప్రయాణంలో నాన్న చెప్పిన విషయాలు మెదడులో చేరిపోయాయి. ఎప్పుడైనా తెలియక తప్పు చేస్తే, ‘సారీ చెప్పు’ అని లోపల నుంచి మనసు హెచ్చరిస్తుంది. నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కారణం నాన్న నేర్పిన సత్ప్రవర్తన. నాన్న నన్ను అక్కినేని గారి దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు, ఆయన నాకు ‘అక్కినేని అఆలు’ పుస్తకం ఇస్తూ, ‘ఊబిలోకి దిగుతున్నావు, జాగ్రత్త!’ అని సూచించారు. ఆ తరవాత నాన్న కూడా ‘మానసికంగా బలంగా ఉండాల్సిన రంగంలోకి దిగుతున్నావు. నచ్చితే సింహాసనం మీద కూర్చోపెడతారు లేదంటే తోసేస్తారు’ అని చెప్పారు. సినిమా పరిశ్రమ అంటే ‘మెంటల్ రోలర్ కోస్టర్ మీద రైడ్’ అని అర్థమైంది. మంచి జ్ఞాపకం... బాపు గారు తీసిన ‘వెంకటేశ్వర వైభవం’ లో వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించాను. ఒకరోజున బాపుగారిని కలిసినప్పుడు నాన్నతో, ‘పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టిఆర్ లాంటి కుమారుడిని కని ఇచ్చావు, థాంక్స్ రామకృష్ణా’ అన్నారట. ‘ప్రేమించు’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాలు గారు, నాన్నకు ఫోన్ చేసి, ‘నీ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో నేను పాడుతున్నాను’ అని చెప్పారట. ఈ రెండు సంఘటనలూ నాన్న ఎంతో ఆనందంగా నాకు చెప్పారు. నా అదృష్టం.. ‘శ్రీశ్రీశ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’ పాటల రికార్డింగ్‌కి వెళ్లాను. ఎన్టీఆర్ నన్ను చూస్తూనే, ‘దానవీరశూరకర్ణ సినిమా సమయంలో పుట్టినవాడేనా’ అన్నారు. ఆ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో నాన్న చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఇంతలో ‘అబ్బాయి పుట్టాడు’ అని ఫోన్ వచ్చిందట. వెంటనే ఎన్టిఆర్ అందరికీ స్వీట్స్ పంచారట. అలా ఆయన నా గురించి గుర్తు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ నటించిన రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, శివుడు.. పాత్రలు నేను కూడా చేయడం యాదృచ్ఛికం కావొచ్చు. ఎన్నటికీ మరచిపోలేను... ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమా క్లైమాక్స్ సీన్ రాజమండ్రిలో వేసవి కాలంలో జరిగింది. నాతో పాటు నాన్నను తీసుకువెళ్లాను. షూటింగ్ అయిపోయాక మరో రెండు రోజులుండి, పడవ మీద నాన్నను లంక గ్రామాలలోకి తీసుకువెళ్లాను. గోదావరి స్నానం చేశాం. మరోసారి వీరబ్రహ్మంద్రస్వామి మఠానికి వెళ్లాం. ఆయన సమాధి అయిన చోట నమస్కరిస్తుండగా, నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను అక్కడకు తీసుకు వెళ్లినందుకు సంతోషించారు. ఒకసారి హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణి స్తున్నాం. రాత్రి 10.30 ప్రాంతంలో ‘ఈరోజు మహాలయ అమావాస్య కదా, శివుడిని దర్శించుకోవాలి’ అన్నారు నాన్న. మహాలయ అమావాస్యనాడు శివుడు శ్మశానంలోనే ఉంటాడని అంటారు. ఆ దారిలో ముందుకి వెళితే శ్మశానం వస్తుంది. అక్కడ పెద్ద శివుడి విగ్రహం,వీర భద్రుడు, హరిశ్చంద్రు డి బొమ్మ ఉంటాయి. అక్కడకు రాగానే ‘ఇక్కడికి ఎందుకు’ అన్నారు. ‘నువ్వు గుడికి వెళ్తాను అన్నావు కదా’ అని కొబ్బరికాయ కొట్టించాను. నాన్న భక్తిపారవశ్యంతో ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని, ‘జయ జయ మహాదేవ’ పద్యం గట్టిగా చదువుతుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. అందరికీ శివుడిని చూసిన అనుభూతి కలిగి, ఒళ్లు పులకరించి, కళ్లలో నీళ్లు తిరిగాయి. పరవశించిపోయాం. ఈ సంఘటనలు నా జీవితంలో నేను మర్చిపోలేను. సరదాగా ఉండేవారు.. నాన్న చాలా సర దాగా ఉండేవారు. హోటల్లో బాగా తినేసి, కదలలేని స్థితిలో ‘ఏంట్రా అస్సలు తినలేకపోతున్నాం’ అనేవారు. ‘ఎదగడానికి ఎందుకురా తొందర..’ పాట నన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు పాడేవారు. దేవుడి దయవల్ల నా వృత్తిలో సక్సెస్ అయ్యాను. కోయిలమ్మ సీరియల్లో నటిస్తున్నప్పుడు ‘నాన్న బతికి ఉంటే బావుండేది. చూసి సంతోషపడేవారు’ అనుకున్నాను. నాన్న నేర్పిన జీవిత పాఠాలు నా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ నాన్న నా వెంట ఉండి నడిపిస్తున్నట్లే మనసులో భావించుకుంటాను. చాలా కూల్‌గా ఉంటారు.. ఒకసారి నాన్న, నేను కారులో రాయలసీమలో ప్రయాణిస్తుండగా, ఒక చోట ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. గన్ పేలుస్తున్నారు. నాకు భయం వేసింది. నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా, కారు పక్క రోడ్డులోకి తిప్పు అన్నారు. ఆ రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఆ రోడ్డులోకి వెళ్లి చూస్తే, దూరం నుంచి వారి గొడవ కనిపించింది. ‘నేను భయపడుతుంటే, నువ్వు అంత కూల్‌గా ఎలా ఉన్నావు’ అని అడిగితే, ‘వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు, మన జోలికి రారు వాళ్లు, నువ్వు టెన్షన్ పడకు’ అన్నారు. ఏం జరుగుతున్నా దేనికీ భయపడరు, తొణకరుబెణకరు. - సంభాషణ: వైజయంతి పురాణపండ ఇక్కడ చదవండి: రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..! 'జయప్రద నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంది' ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
రకరకాల డైరీలు.. జ్ఞాపకాలను దాచేయండి
సాక్షి, కడప కల్చరల్: ప్రతిరోజు ఓ జ్ఞాపకం.. ఏడాది పొడవునా మనసును తాకిన సంఘటనలన్నీ స్మృతి నుంచి జారిపోకుండా జ్ఞాపకాల దొంతరగా పేర్చుకునేందుకు మంచి అవకాశం. ఏరోజుకారోజు మనసును కదిలించిన సంఘటనలు.. కమ్మని జ్ఞాపకాలు.. ఉద్వేగాలు.. విషాదాలు.. ఇలా అన్నింటినీ క్లుప్తంగా, పదిలంగా దాచుకునే చోటు డైరీ. ఆ తర్వాత ఎప్పుడో తీరిక వేళల్లో ఒక్కొ పేజీ తిరిగేస్తుంటే ఆ జ్ఞాపక పుటల్లో సంతోషాలు, భావోద్వేగాలు ఇలా ఎన్నెన్నో తియ్యని గాయాలు, మూడ్ వచ్చినపుడు రాసుకునే చిన్న గేయాలు, మధురమైన జ్ఞాపకాలు అన్నీ మనసుకు ప్రతిబింబాలు. రోజువారి జీవితంలో జరిగే సంఘటనలను వరుసగా క్రమపద్ధతిలో రాసుకునేందుకు డైరీ ఎంతగానో పనికి వస్తుంది. జరిగిన విషయాలేగాక వాటి పట్ల మన ప్రతి స్పందనను కూడా పొందుపరచవచ్చు. వర్తమానం గతమై, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేందుకు డైరీ మంచి మిత్రుడిగా ఉపయోగపడుతుంది. ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలను డైరీ పంచుకోవచ్చు. తీపి జ్ఞాపకం ఓ మోస్తరు డబ్బు ఉన్న వాళ్ల నుంచి అతంత్య ధనికులైన వారికి మాత్రమే పరిమితమై ఉండిన డైరీ ఆ తర్వాత మధ్యతరగతి వరకు వచ్చింది. మొన్నమొన్నటి వరకు ఆధునిక జీవితంలో డైరీలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో ఇటీవల జోరు తగ్గినా నేటికీ వీటిని వాడేవారి సంఖ్య తక్కువేమి కాదు. అందులో బరువు దించుకుంటేగానీ మనసు తేలిక పడదని భావించే వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు గతం పేజీలు తిరిగేస్తే డైరీల్లో మనం రాసుకున్న విషయాలు రాసింది మనమేనా అని ఆశ్చర్యం వేస్తోంది. కావాల్సినపుడు తిరిగేసుకుని ఆ జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు డైరీలను వీలైనంత ఎక్కువకాలం ఓ మధురమైన నిధిలా దాచుకుని ఆనందిస్తుంటారు. ఎన్నో రకాలు డైరీలను పలు రకాలుగా వాడేవారు కూడా ఉన్నారు. తమ అనుభూతులను భావుకంగా కవితల్లా రాసుకునే వారు ...అడ్రసులు, ఫోన్ నంబర్లు రాసుకునే వారు, చివరికి లాండ్రి పద్దు రాసుకునే వారు కూడా లేకపోలేదు. మొత్తంపై డైరీ రాయడం హుందాతనానికి గుర్తుగా భావిస్తారు. కొన్నేళ్ల తర్వాత మనం రాసిన విషయాలు మనకే గమ్మత్తుగా అనిపిస్తాయి. అందుకే పలువురికి నేటికీ డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఎందరో మహానుభావులు అలా రాసిన ఆ డైరీలు తర్వాత కొన్నేళ్లకే మంచి గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక గ్రంథాలుగా మారి చరిత్ర సృష్టించాయి. డైరీ రాసే వారి కోసం సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లలో రకరకాల, రంగురంగుల డైరీలు కళకళలాడుతాయి. ఎన్ని రకాల డైరీలున్నా టీటీడీ డైరీకి మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇటీవల కేవలం టీటీడీ అనుబంధ సంస్థల కౌంటర్లలోనే విక్రయిస్తున్నారు. ఖరీదైన లెదర్, రెగ్జిన్ లెదర్ బైండింగ్ గలవి, పర్సు, పెన్ స్టాండ్, గడియారం, క్యాలికులేటర్లు సౌకర్యం గలవి కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద నగరాలలో 8జీబీ పెన్‌డ్రై వ్, గడియారం, క్యాలిక్యులేటర్, పెన్, కంపాస్ సెట్ తదితరాల కాంబినేషన్లో కూడా లభిస్తున్నాయి. పెట్టెలలాగా తాళం వేసుకునే అవకాశం గల డైరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశదేశాల మ్యాపులు, సమయాలు, రాజధానులు, పిన్‌కోడ్, ఫోన్ కోడ్ నెంబర్లు, పోస్టల్, రైల్వే సమాచారం, ప్రకృతి, ఆధ్యాత్మికం, సామాజిక సేవ, ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ అంశాలను దాదాపు ప్రతి పేజీలో పొందుపరిచిన డైరీలు కూడా లభిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వైద్యులు తదితర ఉద్యోగాల్లో ఉన్న వారికి అసవరమైన సమాచారంతో కూడిన డైరీలు కూడా లభిస్తుండడం విశేషం. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, కంపెనీలు నూతన సంవత్సర కానుకగా డైరీలు అందజేస్తున్నాయి. ఉద్యోగుల్లో సంఘాల ద్వారా కూడా తమకు సంబంధించిన వివరాలు, జీఓలతో ప్రత్యేకంగా డైరీలను రూపొందిస్తున్నారు. మంచి హాబీని మనం కొనసాగిస్తూ పిల్లలకు కూడా అలవాటు చేద్దాం! -
ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు!
నాన్న ఏ కూతురికైనా ఎన్నాళ్లు గడిచినా మనసులో నిలిచి ఉంటాడు. మరి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో తన పాటతో వినిపించే ఘంటసాల వంటి తండ్రికి పుట్టిన కూతురు ఆ నాన్నను ఎలా మరచిపోగలదు? ఘంటసాల పెద్ద కుమార్తె శ్యామల నేడు ఆయన జయంతి సందర్భంగా సాక్షితో పంచుకుంటున్న జ్ఞాపకాలివి ఆమె మాటల్లోనే... ‘మీ నాన్నగారు అంత గొప్ప గాయకులు, సంగీత దర్శకులు కదా! మరి ఇంట్లో మీ అందరితో ఎలా ఉండేవారు? మామూలుగా మాట్లాడేవారా?’ – ఇవి మేము కొన్ని వందలసార్లు అడిగించుకున్నాం. ఇవేం ప్రశ్నలు? ఎవరింట్లోనైనా నాన్న అనే వ్యక్తి అందరితో మామూలుగా మాట్లాడక మరొకలా ఎలా ఉంటారబ్బా? మనమూ అందరిలాంటి వాళ్లమే కదా? మరెందుకు అంత కుతూహలంగా అడుగుతున్నారు? అని ఆశ్చర్యంగాను, తికమకగాను ఉండేది. అప్పట్లో బాగా చిన్న వాళ్లం అవడం వల్ల నాన్నగారి ప్రత్యేకత తెలిసేది కాదు’’ సాదాసీదాగా నాన్నగారు సినిమా పరిశ్రమకి చెందినవారైనా మా ఇంట్లో ఆ ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. అందరం నేల మీద చిరుచాపలు పరచుకుని కూర్చునే భోజనం చేసేవాళ్లం. హాల్లో కింద కూర్చుని ఎవరి స్కూలు పెట్టి వాళ్లు ఒళ్లో పెట్టుకుని హోమ్‌వర్కు రాసుకునేవాళ్లం. రాత్రివేళ వరుసగా నవారు మంచాలు వేసుకుని పడుకునేవాళ్లం. వేసవి కాలమైతే డాబా మీద చాపలు వేసుకుని నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ, నిద్రలోకి జారుకునేవాళ్లం. ఏ రోజైనా ఉదయం ఆరు గంటలకి పక్కలు తీసి సర్దిపెట్టాలిసిందే. పెద్దవాళ్లకి మాత్రం కాఫీ, టిఫిను. పిల్లలకి ఊరగాయ, పెరుగు కలిపి చద్దన్నమే. ఎనిమిదిన్నరకల్లా పిల్లల సెక్షన్ పని పూర్తి. వేసవి సెలవులకి పిన్నిగారి పిల్లలు, మావయ్యగారి పిల్లలు వచ్చేవారు. సంగీతరావుగారి పిల్లలు, మేము అందరం కలిపి దాదాపు పదిహేనుమంది ఉండేవాళ్లం. పెద్ద ఆవరణలో ఇంటి చుట్టూ పరుగెత్తడానికి కావలసినంత చోటుండేది. దొంగ పోలీసు, దాగుడు మూతలు, ఏడు రాళ్లు, చెడుగుడు, ప్లేబాల్, బొంగరాలు, గోళీలు, స్కిప్పింగ్, రింగ్, షటిల్‌కాక్... అబ్బ! ఎన్ని ఆటలు ఆడేవాళ్లమో.. అప్పుడప్పుడు నాన్నగారు విశ్రాంతిగా ఇంట్లో పడుకున్నప్పుడు దాక్కోవటానికి ఆయన మంచం కింద దూరేవాళ్లం. అమ్మ వచ్చి, ‘బయటికిపోయి ఆడుకోండి’ అని కసిరేది. నాన్నగారు మాత్రం నిద్రపోతున్నట్లు నటించేవారు. కానీ ఆయనలో తన్నుకు వస్తున్న నవ్వు మెలకువగా ఉన్నట్లు పట్టించేసేది. అంతమంది కలిసి బిగ్గరగా అరుచుకుంటూ, పరిగెత్తుతూ, కొట్టుకుంటూ, అలుగుతూ, గోలగోల చేస్తుంటే నాన్న ఎంత సంబరంగా చూసేవారో!! అన్నీ ఇంట్లోనే.. నాన్నగారికి విడిగా ఆఫీసు లేదు. ఎవరినైనా ఇంటికే రమ్మనేవారు. అందువల్ల ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుండేవారు. సముద్రాల, కృష్ణశాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి, కొసరాజు, కోట సత్య రంగయ్య శాస్త్రి వంటి సాహిత్య మూర్తులతో పాటు, ఆర్కెస్ట్రా వాళ్లు, సంగీత దర్శకులు, గాయకులు.. అందరితో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరం పాటల పోటీలు, నాటకాలు – చాలా బిజీగా ఉండేవాళ్లం. ప్రైజు సాధించుకుని వచ్చేవాళ్లం. మొదటిసారి నా పన్నెండవ ఏట రేడియో నాటకానికి చెక్కు ఇచ్చారు. ఆ తరువాత చిన్నన్నయ్యకి చెక్కు వచ్చింది. ఆ రోజు నాన్నగారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘నా పిల్లలు కేవలం గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, అప్పుడే సంపాదనపరులు కూడా అయ్యారు’ అంటూ పొంగిపోయేవారు. అప్పటికప్పుడు స్వీట్లు తెప్పించేవారు. పండుగలకు పాటలు.. వినాయకచవితి నాడు పూజ పూర్తయ్యాక అందరం కలిసి పాటలు పాడడం, దసరాకి బొమ్మల కొలువులు, పేరంటాలు, దీపావళికి ఇంట్లో చిచ్చుబుడ్లు, మతాబులు చుట్టించడం, సంక్రాంతికి ముందు నెలరోజులు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలని తీర్చడం, భోగిమంటలు – ఇవి మాత్రమే పండుగలు కావు – నాన్నగారితో గడిపిన ప్రతీ క్షణం ఒక పండగలాగే గడిచిపోయింది. చుప్పనాతి దేవుడు నాన్నగారిని మాకు కనిపించకుండా లాక్కుపోయాడు గానీ, ఆయన జ్ఞాపకాలని, ఆయన ఉనికిని, మాటని ఆలోచనలని మాత్రం ఈ నాటికీ అంగుళమైనా కదిలించలేకపోయాడు. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ నాన్న మంచి నేర్పారు.. ‘చిన్న పెద్ద అని వయోభేదం గానీ, స్థాయీ భేదం గానీ చూడకుండా ఎవరికి యివ్వవలసిన ప్రాధాన్యాన్ని వారికి ఇవ్వాలి, మన అభిప్రాయాలు మనకి ఉన్నట్లే అందరికీ ఉంటాయి, వాటిని గౌరవించాలి, ఎక్కడ ఎలా ఉన్నా లోపాలు ఎన్నక అందరినీ కలుపుకుని పోవాలి, ఏది కావాలన్నా దానికి కృషి చేయడమే మన వంతు. ఫలితం అనుకూలంగా వస్తే మరొక లక్ష్యం వైపు దృష్టి పెట్టు, ప్రతికూలిస్తే మళ్లీ ప్రయత్నించు. ఎలాగో అలా మరమనిషిలా బ్రతికేయడం కాదు, బుద్ధితో మనసుని అనుసంధానం చేసి జీవించు, అలా చేయగలిగినప్పుడే ఆనందం, తృప్తి నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయి’ అని నాన్న నిరంతరం చెబుతుండేవారు. కానీ ఈ రోజుల్లో కాలం విలువ నేర్పే పెద్దలకి తీరిక లేదు. పిల్లలకి సమయమూ లేదు. – ఘంటసాల శ్యామల (ఘంటసాల పెద్ద కుమార్తె) -
జ్ఞాపకాలనే గుర్తించుకోవాలన్న కరీనా..
ముంబై: జబ్ వీ మెట్ ఫేమ్ కరీనా కపూర్ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే తాను గతంలో ఓ రెస్టారెంట్లో ఆస్వాదిస్తున్న క్షణాలను నెటిజన్లకు ఫోస్ట్ చేసింది. కాగా కరీనా రెస్టారెంట్లో చదువుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలపై కరీనా స్పందిస్తు.. మీకు ఏదైనా రెస్టారెంట్ అద్భుతంగా అనిపిస్తే, కేవలం వాటి జ్ఞాపకాలను మాత్రమే గుర్తించుకోవాలని, కేలరీలను కాదని నెటిజన్లకు సూచించింది. కరీనా అభిప్రాయంపై నెటిజన్లు ఫిదా అయ్యారు. కరీనా విభిన్న అభిరుచిని, ప్యాషన్, స్టైల్‌ను నెటిజన్లు కొనియాడారు. మరోవైపు ఓ అభిమాని కరీనాను రాణిగా కీర్తించడం విశేషం. ప్రస్తుతం కరీనా అమీర్‌ఖాన్‌తో లాల్‌సింగ్ చద్దా, వీరే ది వెడ్డింగ్ సీక్వెల్, తక్త్ అనే సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. కరీనా వివిధ పోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల కరీనా తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోను నెటిజన్లకు పోస్ట్ చేసింది. చదవండి: చాలా ఏళ్ల తర్వాత జంటగా సైఫ్-కరీనా..! -
అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. వినోద రంగంలోకి తాను అడుగుపెట్టి 20 ఏళ్లు పూరైన తరుణంలో.. ఇది వేడుక జరుపుకోవాల్సిన సమయని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన ప్రయాణంలోని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నట్టు తెలిపారు. ఈ జర్నీలో తన పక్షాన నిలవడం, మద్దతు అందించడం ఎంతో విలువైనదని కూడా చెప్పారు. అందులో భాగంగా 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా 2000 విజేతగా నిలిచిన అద్భుతమైన క్షణాల్ని ప్రియాంక గుర్తుచేసుకున్నారు. (పవర్ స్టార్‌పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ) ఆ సమయంలో తన డ్రెస్సింగ్, హెయిర్, స్టేజ్‌పై తాను చెప్పిన సమాధానాలు.. ఇలా పలు అంశాల గురించి వివరించారు. మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన చిన్నపాటి వీడియోను కూడా షేర్ చేశారు. ‘నేను మిస్ ఇండియా 2000 పోటీలో నా వీడియోను చూస్తున్నాను. ఇదంతా జరగడాని అదే మూలం. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఈ వీడియో చూసి ఉండకపోతే.. ఇది మీకు కొంత ట్రీట్ లాంటింది’ అని పేర్కొన్నారు. ప్రియాంక మిస్ ఇండియా వేదికపై ఏ దుస్తులు ధరించానో గెస్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు తనకు చాలా హెయిర్ ఉండేదని అన్నారు. కానీ అది ఎప్పుడూ కోల్పోయానో తెలియదని అన్నారు. మిస్ ఇండియా స్టేజిపై ఎదురైన ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పానని.. తన తెలివిపై తానే ప్రశంసలు కురిపించుకున్నారు. తనను విజేతగా ప్రకటించిన క్షణాలను చూసుకుని మురిసిపోయారు. అలాగే తనకు 16 ఏళ్ల వయసులో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ అడుగే.. నన్ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిందని చెప్పారు. (కంగనకు సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు) ‘ఇది చాలా క్రేజీ. నేను గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దీంతో ఇది అయినా వెంటనే తిరిగి వెళ్లి బోర్డు ఎగ్జామ్స్ రాయడానికి.. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ నన్ను ఆ కిరీటం వరించింది. ఇది చాలా క్రేజీ. 20 ఏళ్లు గడిచిపోయాయి... ఇప్పటివరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అని ప్రియాంక ఆ వీడియోలో పేర్కొన్నారు. View this post on Instagram Alright guys, we’re doing this! I’m watching footage from my Miss India pageant in 2000! This is where it all began... If you’ve never seen these before, you are in for quite a treat. 😅 #20in2020 @missindiaorg A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jul 23, 2020 at 2:07pm PDT -
అయ్యా నిజం చెప్పమంటారా...!
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాలను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ‘పీవీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నాను. అనేకసార్లు వివిధ ప్రజా సమస్యల మీద వారికి పలు వినతిపత్రాలు ఇచ్చాను. ఏపీలో పొగాకు రైతుల సమస్య తీవ్రంగా ఉండేది. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయకపోవడంతో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులం.. టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సీపీఎం నుంచి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, సీపీఐ నుంచి ధర్మభిక్షం, బీజేపీ నుంచి నేను పీవీని కలిశాం. ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి రష్యాకు ఎగుమతి చేయాలని వినతి పత్రం ఇచ్చాం. ఆయన మొత్తం చదివి మమ్మల్ని చూసి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మీరు మంత్రిగా పనిచేశారు. మీకు పరిస్థితులు బాగా తెలుసు. దత్తాత్రేయకు మంత్రిగా అనుభవం లేదు గనుక వారికి తెలియక పోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదుగదా అన్నారు. అప్పుడు నేను ‘మీరు తెలుగు బిడ్డ. మీరు తలుచుకుంటే ఎందుకు వీలుకాదని’అన్నాను. దానికి వారు చిరునవ్వుతో ‘అయ్యా నిజం చెప్పమంటారా? అంటూ.. ఇంతకు ముందు మనం ఎగుమతిచేసిన పొగాకు డబ్బే రష్యా నేటి వరకు మనకు ఇవ్వలేదు. ఇప్పుడు అది పతనావస్థలో ఉంది. మళ్లీ అక్కడకు పొగాకు పంపితే మనకు డబ్బులు రావు. అందుకే ఇది సాధ్యం కాదని సమాధానమిచ్చారు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి నిక్కచ్చిగా చెప్పే పీవీ.. స్థితప్రజ్ఞులు. సాధారణంగా వారి జవాబు మౌనం. కానీ దాన్ని వీడి మాకు వాస్తవాన్ని విశదీకరించారు. ప్రధాని కారుకు అడ్డం పడినా.... ఒకసారి ప్రధాన మంత్రిగా పీవీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను, జి.పుల్లారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం అల్ కబీర్ సంస్థను నిషేధించాలని వినతిపత్రం ఇవ్వడానికి రాజ్ భవ¯Œ కు చేరుకున్నాం. మాకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది గేటు వద్దనే ఆపారు. అప్పుడు ప్రధాని విమానాశ్రయానికి బయలుదేరి వెళుతూ.. వారు రెండో కారులో ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. నేను వారి కారుకు అడ్డంగా వెళ్లాను. ప్రధాని కారుకు అడ్డుపడినపుడు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే అవకాశం ఉన్నప్పటికీ నేను ముందుకు కదిలాను. పీవీ నన్ను గమనించి.. కారును ఆపి నన్ను తన కారులో కూర్చోబెట్టుకున్నారు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అప్పాయింట్మెంట్ దొరకలేదేమోనని నన్ను సమాధానపరిచి, కారులోనే ఎయిర్పోర్ట్ వరకు తోడ్కొని వెళ్లి సమస్యను సాంతం విని, దానిపై చర్చించి నానుండి మెమొరాండం తీసుకున్నారు. 1998 లో నేను తొలిసారి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత మర్యాదపూర్వకంగా నేను పీవీని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లా.. వారు పుస్తక పఠనం చేస్తున్నారు. నన్ను ఆప్యాయంగా పలకరించి.. మీరు చాలా కష్టపడి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మీ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి లో ‘శ్రీ రామానంద తీర్ధ‘సంస్థ ఉంది. దానికి చెందిన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారు. భూమిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలకోసం మాజీ మంత్రి కేవీ కేశవులు కలుస్తారని తెలిపారు. నేను వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగింపజేసి ప్రహరీని కట్టే ఏర్పాటు చేయించాను. తరువాత పీవీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మాట నిలుపుకున్నారు దత్తాత్రేయ .. అని ప్రశంసించారు. పీవీ మేధావి. బహు భాషా కోవిదులు, రాజకీయ దురంధరుడు, దేశం విపత్కర సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి గాడిన పెట్టిన తొలి ప్రధాని. తెలుగు బిడ్డ, తెలంగాణవాది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ప్రత్యేక ముద్ర వేశారు..’అని బండారు దత్తాత్రేయ తన అనుభవాలను పంచుకున్నారు. -
లాహోర్ బిడ్డ
నవంబర్ 12న గురునానక్ జయంతి. ఇండో–పాక్ సరిహద్దుకు ఆవల ఉన్న గురుద్వారా సందర్శనకు రెండు దేశాలు కలసి తలపెట్టిన కర్తార్‌పూర్ కారిడార్ ఈ నెల 9న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో.. దేశ విభజన సమయంలో లాహోర్ నుంచి ఇండియాకి వచ్చి, పెళ్లితో హైదరాబాద్‌కి వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయి, మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న 84 ఏళ్ల రవీందర్ కౌర్‌తో మాటామంతి. 1947. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. సరిగ్గా ఆ సమయంలో కోటీ ఇరవై లక్షల మంది శరణార్థులు.. విడిపోయిన భూభాగం నుంచి కట్టుబట్టలతో వచ్చి భారత్‌ను ఆశ్రయించారు. వాళ్లలో ఓ పన్నెండేళ్ల అమ్మాయి రవీందర్ కౌర్. లాహోర్ నుంచి సరిహద్దు రేఖ దాటి ఇండియాలో అడుగుపెట్టింది. ఇది జరిగిన పదేళ్లకు ఆమె పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్‌కు వచ్చింది. బస్తీ నానమ్మ రవీందర్ కౌర్ నివాసం హైదరాబాద్, దేవర కొండ బస్తీలో. ఆమె రోజూ సాయంత్రం బస్తీ పిల్లలకు ట్యూషన్ చెప్తుంటారు. కౌర్ ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసిన తర్వాత పిల్లలు ‘‘ఇక చాయ్ తాగుతాం’’ అని సొంత నానమ్మను అడిగినట్లే ఆమెను తడుతూ అడుగుతుంటారు. ఫీజు తీసుకోకుండా చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు చాయ్ బిస్కెట్ ఇవ్వడం కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చుకున్నారు కౌర్. ‘‘గురునానక్ చెప్పిన సూక్తులతో నన్ను నేను ఇలా మలుచుకున్నాను’’ అంటారు రవీందర్ కౌర్. దేశం కోసం పోరాటం ‘‘ఇండియా విభజన ముందు ఏడవ తరగతి వరకు లాహోర్‌లో ఉన్నాం. మా తాత భగవాన్‌దాస్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి. ఆయన పేరు మీద లాహోర్‌లో వీధి కూడా ఉంది. నాన్న వైపు ముత్తాత ఖడక్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పేరుతో ఢిల్లీలో ఇప్పటికీ బాబా ఖడక్ సింగ్ మార్గ్ ఉంది. దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను అంకితం చేసిన కుటుంబాలు మావి. తీరా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఫలాలను అందుకోవాల్సిన తరుణంలో బతుకుజీవుడా అని పారిపోవాల్సి వచ్చింది. కారులో స్కూలుకెళ్లిన బాల్యం గుర్తుంది. విభజన తర్వాత కాందిశీకుల్లా ఇండియాకి వచ్చిన తర్వాత కొత్త షూస్ కొనుక్కోలేక పగిలిపోయిన బూట్లతోనే స్కూలుకెళ్లిన బాల్యాన్నీ మర్చిపోలేను. బీఎస్సీ, బీఈడీ వరకు స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏ పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నా భర్త మన్మోహన్ సింగ్‌ది కూడా పార్టిషన్ సమయంలో పొట్ట చేత పట్టుకుని వచ్చిన కుటుంబమే. వాళ్లు కొన్నాళ్లు నార్త్‌లో ఉండి తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను పెళ్లితో హైదరాబాద్ కోడలినయ్యాను. నానక్ నాకు స్ఫూర్తి నాకు చదువుకోవడం, చదువు చెప్పడం రెండూ ఇష్టమే. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురిని పోగేసి చెప్పేదాన్ని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తగారింట్లో వాళ్లకు చదువు చెప్పాను. ఆర్థిక అవసరాలు చుట్టుముట్టినప్పుడు సంపన్న వర్గాల పిల్లలకు ట్యూషన్ చెప్పాను. నా పిల్లలు ముగ్గురూ బాగా చదువుకుని పెద్ద పొజిషన్లో స్థిరపడ్డారు. నా భర్త ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. డబ్బు అవసరం తీరింది. అయినా నేను పని చేయడం మాత్రం మానలేదు. ఓ ముప్పై ఏళ్ల కిందట హైదరాబాద్‌లో బస్తీల్లో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆ స్కూళ్లకు, పిల్లలకు చేయాల్సింది ఎంతో ఉందనిపించింది. గురునానక్ చెప్పిన తొలి సూక్తి ‘షేర్ అండ్ కేర్’. నాకున్న నాలెడ్జ్‌ని షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆ పిల్లల పట్ల కేరింగ్‌గా ఉండడంతో ప్రభుత్వ అధికారులు నాకో బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం స్కూళ్ల కోసం రూపొందించిన పథకాలు అమలవుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ‘ఎదుటి వారిని సంతోషంగా ఉంచడానికి నీకు చేతనైన పని చెయ్యి’ అని చెప్పారు నానక్. ఆయన సూక్తిని ఆచరణలో పెట్టడానికి నాకు అవకాశం అంది వచ్చినట్లయింది. నా బాధ్యతలను సమర్థంగా సమన్వయం చేసినందుకు 2010లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను. ఖైరతాబాద్‌లోని నిష్షుల్క్, బంజారాహిల్స్ బస్తీల్లో ఉన్న మరో రెండు స్కూళ్లలో ఇప్పటికీ వారానికి ఒకటి రెండుసార్లు వెళ్లి పిల్లలకు కొత్త టాస్క్‌లు ఇస్తున్నాను. స్కూళ్ల వరకు ఫర్వాలేదిప్పుడు. కానీ అంగన్వాడీల్లో చేయాల్సిన పని ఇంకా ఉంది. నాకిప్పుడు శక్తి తగ్గింది. చురుకైనవాళ్లు ముందుకు రావాలి’’ అని ముగించారు రవీందర్ కౌర్. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేష్ కుమార్ మంచి అనే మొక్కలు గురునానక్ సమాజంలో స్త్రీ స్థానాన్ని చాలా గొప్పగా చెప్పారు. సమాజాన్ని నిలబెట్టే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని చెప్పారు. ఇతరుల కోసం పనిచేసే ఆసక్తి ఉన్న స్త్రీలు ఇంటి గుమ్మం దాటి బయటకు రావాలి. ఆడవాళ్ల నిర్వహణలో ఉన్న సమాజంలో అకృత్య భావనలు అంకుర దశలోనే అంతరించిపోతాయి. ఆయన సూక్తులను ఉర్దూ, ఇంగ్లిష్‌లో కవితలు రాసి పిల్లలకు నేర్పిస్తున్నాను. నా వంతుగా సమాజంలో మంచి అనే మొక్కలను కొన్నింటిని నాటుతున్నాను. – రవీందర్ కౌర్ -
వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి
అమావాస్య రోజు శ్రీకృష్టం జననం లాగా అమావాస్య రోజున దివ్వెల తోరణాలతో..వెలుగు పువ్వుల కొలువు దీపావళి. నరకాసుర వధ, బలి చక్రవర్తి రాజ్యదానం, వనవాసం అనంతరం రాముడు అయోధ్యకు తిరిగిరావడం, విక్రమార్కుడి పట్టాభిషేకం...ఇలా కథలూ,కారణాలూ ఎన్ని ప్రాచుర్యంలో ఉన్నా నులివెచ్చని చలికాలంలో దేశవ్యాప్తంగా జరుపుకునే దివ్వెలపండుగ. అయితే దీపావళి పండుగ ప్రజాహితంగా, పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామా? ఈ పండుగ వేళ కాలుష్య కాసారంలా మారిపోతున్న పుడమి తల్లికి మరింత భారమేనా? ఢమాల్...ఢమాల్ అంటూ విపరీతమైన శబ్దాలతో.. అక్షరాలా ఆ లక్ష్మీదేవినే (అతి ఖరీదైన టపాసులను) అగ్నికి ఆహుతి చేయడమేనా దీపావళి పరమార్థం....దిక్కులు పిక్కటిల్లేలా భరించలేని శబ్దాలతో..బిక్క మొహం వేసే పసిపిల్లల తల్లుల అవస్థలు ఎవరికీ పట్టవా? ఇలా ప్రతీ దీపావళికి నా మదిని తొలిచేసే ప్రశ్నలు. కానీ చిన్నతనంలో ఒక వేడుక మాత్రం నాకిప్పటికీ గుర్తే.. అదే 'దిబ్బు దిబ్బు దీపావళి..' పొడవాటి గోగు కర్రలు, కొత్త తెల్లటి వస్త్రంతో చేసిన నూనె వత్తులు....దీపావళి ఎంతైనా బాలల పండుగే కదా.. అందుకే బాల్యం నాటి జ్ఞాపకాలు భూచక్రాల్లా గిర్రున నన్ను చుట్టుకున్నాయి. నా జీవితంలో నాకెంతో ఇష్టమైన రేడియోలో పండుగ రోజు గంటపాటు నాదస్వరంతో నిద్ర లేవడం ఎంత గుర్తో. వణికించే చలిలో మందార ఆకులు వేసి నానబెట్టిన కుంకుడు కాయల రసంతో తలంటూస్నానాలు.. అందులోనూ ఆడపిల్లలు ముందు చేయాలి. నాన్న స్వయంగా పొటాషియం, గంధకం కలిపి తయారు చేసే చిచ్చుబుడ్లు, మతాబులు, సిసింద్రీలూ, అన్నయ్యలకోసం ప్రత్యేకంగా తయారుచేసే తిప్పుడు పొట్లం...చిన్న రేకు తుపాకి, దానికోసం గుళ్ల ఎర్ర రీళ్ల బుల్లి డబ్బాలు, కంపుకొట్టే పాముబిళ్లలు, వెన్నముద్దల వెలుగులు ఒక్క క్షణం నన్ను ఆవరించాయి. ఇపుడు నాన్నా లేరు..ఆ మట్టి వాసనల వెలుగులూ లేవు.. అంతా ప్లాస్టిక్ మయం. పర్యావరణ హితం అన్నది ఉత్త మాటలకే పరిమితమైపోయింది. కాంక్రీట్ జంగిల్ అపార్ట్మెంట్లలో పోటా పోటీగా ఎవరు ఎంత ఎక్కువ టపాసులు (డబ్బులు తగలేసారనేదే) కాల్చారనేదే లెక్క. అంతేకాదు అందరూ సద్దుమణిగాక మరీ, మందుగుండు సామగ్రితో సర్జికల్ స్ట్రైక్ చేసేంత శాడిజం నన్ను మరింత భయపెడుతుంది.. నిజం.. 'దిబ్బు దిబ్బు దీపావళి..' సంబరం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది..దీపావళి రోజు సాయంత్రంపూట జరిగే వేడుక ఇది. గోగు మొక్కలు లేదా గోగుకర్రలు పొడవాటివి తీసుకొని వీటిపై అంతకుముందే తయారు చేసుకుని నువ్వుల నూనెలో తడిపి వుంచుకున్న తెల్లని నూలు గుడ్డల వత్తులు వేలాడదీస్తారు. ఒక్కొక్కరు రెండు మొక్కల జత పట్టుకుని వరుసగా నించుని ఆ కుటుంబలోని పిల్లలందరి మొహాలు కొత్త బట్టలు, పూల (పిలక) జడలతో నిండు పున్నమి వెలుగుల్లా వెలిగిపోతూ వుంటే.. అమ్మో..అమ్మమ్మో...నాన్నమ్మో..మేనత్తో.. వాటిని వెలిగిస్తారు. అపుడు ఆవిష్కృమవుతుందో కమనీయదృశ్యం. దీపాల కర్రలను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ- 'దిబ్బు దిబ్బు దీపావళి.. మళ్లీ వచ్చే నాగుల చవితి' అని పాడుతూ దీపం ఆరిపోతున్న సమయంలో నేలమీద మూడుస్లార్లు కొట్టాలి. అది అయిపోయాక.. పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి అమ్మ పెట్టే అరిసె తినాలి. ఇక తొందరగా అన్నం తినేసి కాల్చుకోవడానికి వెళ్లాలి.. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. కొత్త బట్టలుమార్చుకుని... పాత కాటన్ బట్టలు వేసుకోవాలి.. ఇహ మారాంలు మొదలు. అయితే ఈ విషయంలో ఇక్కడ మాత్రం అమ్మ, నాన్న ఇద్దరిదీ ఒకటే మాట..టపాసులు కాల్చుకోవాలంటే.. పొట్టి కాటన్ బట్టలు వేసుకోవాల్సిందే..! ఇవేనా..పెరుగుబంతి, కృష్ణ బంతిపూలు, కనకాంబరాలు దీపావళి నాటికి పూస్తాయా లేదా అని రోజు వాటి చుట్టూ తిరగడం, పెద్ద పెద్ద దండలు గుచ్చి వాటిని అన్ని గుమ్మాలకు వేలాడ దీయడం, మట్టి ప్రమిదలు, పొటాషియం, సూరేకారం, కొబ్బరిపొట్టు, బొగ్గు సేకరించడం.. చేటల్లో ఆరబెట్టడం...కళ్లల్లో పెట్టుకోవద్దు..చేతులు సరిగ్గా కడుక్కోలేదంటూ తిట్లూ.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. తెలిసీ తెలియక విసిరిన తారా జువ్వ తడిచి సరిగ్గా వెళ్లక పక్కనే ఉన్న టైలర్ వెంకటరావు మావయ్య ఇంటి చూరులో దూరడం..దీంతో అత్త తిట్ల దండకం.. ఇప్పటికీ గుర్తు.. టైలర్ మామ కుట్టిచ్చిన పూల పూల పట్టు కుచ్చుల గౌను సాక్షిగా..! తడిచి అంటే..గుర్తొచ్చింది...తయారు చేసుకున్న దీపావళి సామానులు రోజూ ఎండలో ఫెళఫెళమంటూ ఎండటం..దేవుడికి ఎంత వేడుకున్నా..సరిగ్గా దీపావళి రోజే వర్షం రావడం ఎలా మర్చిపోగలం..అయినా.. నాన్న చేతి చిచ్చుబుడ్డి అంతెత్తున ఎగిరి విసిరిన వెలుగు పువ్వులు...మతాబుల వెలుగులు జీవితానికి సరిపడా నాతోనే.. ‘‘పర్యావరణహిత దీపావళి సంతోషాల హరివిల్లు..పుడమి తల్లికి ఆనందాల విరిజల్లు’’ మీ నేస్తం.. -
రాజన్నా..నీ మేలు మరువలేం..
కరువుకోరల్లో చిక్కుకున్న జనానికి ఆపన్న హస్తం అందించావు.. ప్రకృతి కరుణించక.. సాగునీరు లేక.. బీడువారిన భూములను జలయజ్ఞంతో సస్యశ్యామలం చేశావు.. రుణాలు మాఫీ చేశావు.. విద్యుత్ చార్జీలు మాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించావు... వేలకువేలు ఖర్చుచేయలేక... అనారోగ్యం పాలైన రోగులకు ఆరోగ్యశ్రీతో అండగా నిలిచావు.. ఆర్థిక స్థోమత సహకరించక.. చదువులు సాగించలేని విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఊతమిచ్చావు.. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నావు... విజయనగరం జిల్లా అభివృద్ధికి బాటలు వేశావు... రాజన్నా... నిను మరువలేము... మా గుండెల్లో నీ గుడి కట్టుకున్నాం... ప్రతిరోజూ నిను తలచుకుంటున్నాం... సోమవారం జరిగే నీ వర్ధంతికి మనసారా అంజలి ఘటిస్తాం. సాక్షి, విజయనగరం: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాకు ఎనలేని అభివృద్ధి చేశారు. రైతులకు సాయం చేశారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు సాగునీరు అందించారు. సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జిల్లాకు చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ తోటపల్లి నుంచి సాగునీటి కాలువ ప్రారంభించి అన్నదాతల్లో కళ్లల్లో వెలుగులు నింపారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గంలో అభివద్ధి పరుగులు పెట్టించారు. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని బొబ్బిలి నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరు చేశారు. ఎస్‌కోట నియోజకవర్గంలోని వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దామంటూ హామీ ఇచ్చిన వైఎస్సార్ అతని హయాంలోనే నిధులు కొంతమేర మంజూరు చేశారు. తరువాత సాగర్ అభివృద్ధిని పట్టించుకున్న నాథుడు లేడు. ఖాయిలా పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. సుజలస్రవంతితో విశాఖ ప్రజల దాహార్తిని తీర్చి తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా సాగుకు విడిచిపెడతామంటూ హామీ ఇచ్చారు. ఆయన మరణంతో సుజలస్రవంతికి మోక్షం లేక, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాల పేరుతో తరలిస్తూ కోట్ల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలోనే మెంటాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లో అభివద్ధి ఎక్కువగా జరిగింది. గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి. మక్కువ మండలంలో మాత్రం సూరాపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అలాగే, వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ సంబంధించిన కాలువలు అభివద్ధి పనులు జరిగాయి. కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయర్‌కు వైఎస్సార్ నాంది పలికారు. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరుకు అస్కార లభ్యమైంది. దీంతో రైతులు కూడా ఎంతో ఊరటచెందారు. కొమరాడ మండలంలో జంఝావతి రబ్బర్ డ్యామ్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నిర్మాణానికి నాంది పలికారు. జంఝావతి ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి రబ్బర్‌డ్యామ్‌గా పేరుంది. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు రబ్బర్ డ్యామ్‌కు రూ.6 కోట్లు విడుదల చేశారు. నిరూపయోగంగా ఉన్న డ్యామ్‌కు రబ్బర్ డ్యామ్‌ను నిర్మించడం వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అప్పట్లో గిరి నియోజకవర్గంలో వేల మంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించి వేలాది మంది ప్రాణాలు నిలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 90 శాతం పనులు పూర్తిచేయించారు. గజపతినగరం నియోజకవర్గానికి తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. పేదలకు లక్షలాది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ కుల, మతాల తేడా లేకుండా పింఛన్లు మంజురు చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో యూత్ హస్టల్ ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. ఇక్కడి నాలుగు మండలాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తారకరామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం 2007లోనే సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. అయితే ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించి సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. ‘కోట’తో మహానేత బంధం మరువలేనిది.. శృంగవరపుకోట: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఎస్.కోట నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉంది. ఎన్నో దఫాలు ప్రతిపక్ష నేతగా, సీఎంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత 1998లో పీసీసీ అధ్యక్షుని హోదాలో, 1999 ఎన్నికల ప్రచారం, 2001 నాటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్.కోట వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. 2003 నాటి పాదయాత్రలో భాగంగా జిల్లాలో మొదటిగా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో అడుగుపెట్టారు. మా కన్నీళ్లు తుడిచి, మాకింత కూడు పెట్టిన మహానుభావుడు రాజన్న అంటూ భీమసింగి సహకార చక్కెర కర్మాగార కార్మికులు దివంగత రాజన్నను జ్ఞాపకం చేసుకుంటారు. అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని తెరిపిస్తానని ఇచ్చిన మాట ప్రకారం వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 సంవత్సరం నవంబర్ 15న చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభించారని, కర్మాగారానికి ఆప్కాబ్ నుంచి రూ.36కోట్లు రుణం ఇచ్చి, ఖాయిలా పడ్డ కర్మాగారం తెరిపించారని, 300 కార్మికులు జీవితాల్లో, వేలమంది రైతన్నల బతుకుల్లో వెలుగు నింపారని గుర్తుచేసుకుంటున్నారు. మహానేతా మనసాస్మరామి.. బాడంగి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఇందిరమ్మ చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొత్సవానివలసలలో మల్లునాయుడు చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెరువును బాగుచేసేందుకు కృషిచేశారు. వాసిరెడ్డి వరదరామారావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈ ప్రాంతాభివృద్ధికి కృషిచేశారని ఈ ప్రాంతీయులు చెబుతున్నారు. ఆయన వర్ధంతిని జరిపేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల మదిలో చెరగని ముద్ర.. దత్తిరాజేరు: నిత్యం రైతుల కోసం ఆలోచించి వారి అభ్యున్నతి గురించి పాటుపడిన వ్యక్తులు కొంత మందే ఉంటారు. అలాంటి వ్యక్తులలో రైతుల మదిలో చెరగని ముద్ర వేసుకన్న వ్యక్తి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ప్రజా సమస్యలను తెలసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో దత్తిరాజేరు రైతుల సాగు కష్టాలను గుర్తించారు. వర్షాధారంతో పంటలు సాగుచేసి ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలవుతున్న వైనాన్ని కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి ప్రాజెక్టు నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. అంతే... 2004లో గద్దెనెక్కిన వెంటనే తోటపల్లి నీటిని అందించేందుకు వీలుగా కాలువ తవ్వకాల పనులకు 2006లో పెదమానాపురం సంత వద్ద శంకుస్థాపన చేశారు. మండలంలోని చినకాదలో 785.08 ఎకరాలకు, పెదకాదలో 734.08 ఎకరాలకు, వంగరలో 627.47, గొభ్యాంలో 435.86, దాసపేటలో 233.75, కన్నాంలో 285.31, విజయ రామగజపతిపురానికి 58.23, వింద్యవాసిలో 118.42, వి.కృష్ణాపురంలో 203.54, పెదమానాపురంలో 643.12 ఎకరాలకు సాగునీటినందించేందుకు కాలువ తవ్వకాలకు అవసరమైన భూమిని సేకరించారు. అయితే, ఆయన మరణానంతరం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రైతుల సాగునీటి కష్టాలు యథావిధిగా మిగిలాయి. జలయజ్ఞ ప్రదాత.. గరుగుబిల్లి: జలయజ్ఞం పథకంలో భాగంగా నాగావళి నదిపై రూ.450.23 కోట్ల వ్యయంతో తోటపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పంటపొలాలకు సాగునీరు అందించారు. పాత ఆయకట్టు 64 ఎకరాలతో పాటు అదనంగా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారు. ఆయన కృషివల్లే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందంటూ రైతులు నిత్యం రాజన్నను తలచుకుంటారు. సంక్షేమ పథకాల రూపకర్త.. విజయనగరం ఫోర్ట్: ప్రకృతి కరుణించక.. పంటలు పండక.. ప్రభుత్వ సాయం అందక.. కరువుతో తినడానికి తిండలేక రైతులు వలస వెళ్లేపోయే పరిస్థితులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కదిలించాయి. పాదయాత్ర పూర్తిచేసి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమపథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. కరువు పరిస్థితులను రూపుమాపేందుకు కృషిచేశారు. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువు చేసి ఆర్థిక పుష్టికలిగించారు. విద్య, వైద్య సదుపాయాలతో పాటు రైతుల కష్టాలు తీర్చారు. విద్యుత్ చార్జీలు, పంట రుణాలు మాఫీ చేశారు. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించారు. రూ.2కే కిలో బియ్యం అందించారు. 108, 104 వాహనాలతో వైద్యాన్ని అక్కరకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో రూపాయి ఖర్చులేకుండా శస్త్రచికిత్సలు చేయించారు. ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించారు. రుణం మాఫీ చేశారు... నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కరువు పరిస్థితులతో బ్యాంకులో తీసుకున్న రూ.50 వేల రుణం తీర్చలేకపోయాను. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత అసలు రూ.50 వేలు వడ్డీ రూ.30 వేలు మొత్తం రూ.80 వేలు రుణమాఫీ చేశారు. మళ్లీ బ్యాంకులో రుణం కూడా ఇప్పించారు. సాగుకు ఊతమిచ్చారు. – ఎస్.సర్వదేముడు, రైతు ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. నాకు కడుపులో నొప్పి రావడంతో కేంద్రాస్పత్రిలో చేరాను. పైసా తీసుకోకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేశారు. నాకు వైద్యం చేయించిన వైఎస్సార్‌ను మరువలేను. – ఎస్.రాము, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు, పెదవేమలి గ్రామం అపర భగీరథుడు.. కొమరాడ: కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామం వద్ద 1976లో జంఝావతి రిజర్వాయర్ నిర్మించారు. ఒడిశాతో చిన్నపాటి వివాదంతో రిజర్వాయర్ అక్కరకు రాకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోయింది. దిగవంత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆస్ట్రియా టెక్నాలజీతో రూ.6 కోట్ల వ్యయంతో రబ్బర్డ్యాంను ఏర్పాటుచేశారు. సుమారు 12వేల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చి అపరభగీరథుడిగా పేరుపొందారు. ఆయన మేలును మరచిపోలేమని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్సార్ రైతుల పాలిటి దేవుడు.. మహానేత వైస్సార్ రైతుల పాటిట దేవుడు. ఎన్నోదశాబ్దాల కళను నిజం చేశారు. జంఝావతి నీటిని పొలాలకు మళ్లించారు. ఆయన చేసిన మేలు నా జీవితాంతం మరవలేను. – దాసరి నారయణరావు, రైతు, విక్రంపురంగ్రామం, కొమరాడ మండలం రాజన్న దయే... ఈ రోజు పంటలు పండి నాలుగు మెతుకులు తింటున్నామంటే అది వైఎస్సార్ దయే. బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసిన ఘతన వైఎస్సార్‌దే. జంఝావతి నీరు గంగారేగువలస పరిసర పాంతాలకు అందుతుందంటే ఆయన ఏర్పాటుచేసిన రబ్బరుడ్యామ్ వల్లే. – ద్వారపురెడ్డి జనార్దననాయుడు, గంగారేగువలస గ్రామం, కొమరాడ మండలం ఆయనుంటే మరింత మేలు జరిగేది.. మహానేత బతికుంటే జంఝావతి ప్రాజెక్టనుంచి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందేది. ఒడిశాతో వివాదం పరిష్కరించేవారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. – కెంగువ పోలినాయుడు, మాజీ సర్పంచ్, కొత్త కంబవలస, కొమరాడ విద్యా వెలుగులు.. సీతానగరం: సీతానగరం మండలంలో మహానేత వైఎస్సార్ విద్యావెలుగులు ప్రసరింపజేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత చేపట్టిన రాజీవ్ పల్లెబాటలో భాగంగా సీతానగరంలో పర్యటించిన ఆయన మండలంలోని ఆహ్లాదకర వాతావరణానికి ఆకర్షితులయ్యారు. జోగింపేట వద్ద పట్టు పరిశ్రమకేంద్రాన్ని ఏర్పాటుచేయించారు. అలాగే, గిరిజన ప్రతిభావిద్యాలయాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో గిరిజన ప్రతిభ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 6 జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోంది. గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఆనుకుని ఎస్సీకులాలకు చెందిన కుటుంబాల్లో విద్యాకుసుమాలు విలసిల్లాలనే ఉద్దేశ్యంతో 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.16 కోట్ల వ్యయంతో సాంఘిక సంక్షేమగురుకుల బాలుర విద్యాలయాన్ని ఏర్పాటు శ్రీకారం చుట్టారు. రెండు విద్యాలయాలకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చారు. రాజన్న మండలానికి రాకతోనే జోగింపేట గ్రామం విద్యలయాలకు నిలయమైందని ఈ ప్రాంతీయులు గుర్తుచేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీతో ఆదుకున్నారు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా కుటుంబాన్ని కాపాడింది. ముగ్గురు ఆడపిల్లలకు తండ్రినైన నాకు పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్ చేశారు. నిజంగా వైఎస్సార్ దేవుడు. గతంలో షర్మిల, జగన్ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని కలిసి ఇదే విషయాన్ని చెప్పాను. – అడబాల కృష్ణారావు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, మెట్టవలస ఎంబీఏ చదివా.... సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను గజపతినగరం సెయింట్ థెరీసా కళాశాలలో ఎంబీఏ చేశాను. నాకు రెండేళ్లకు రూ.60వేలు ఫీజురీయింబర్స్‌మెంట్ వచ్చింది. లేకుంటే నేను చదవలేకపోయేవాడిని. రాజశేఖర్‌రెడ్డి నాలాంటి ఎందరికో ఉన్నత విద్యావకాశాలను కల్పించి అమరులయ్యారు. – అరసాడ శంకరరావు, ఎంబీఏ పట్టభద్రుడు, మెట్టవలస బీసీల్లో చేర్చడంతో... ఓసిలో ఉన్న అయ్యరకలను బీసీలో చేర్చిన మహనీయుడు వైఎస్సార్ రాజశేఖరరెడ్డే. ఆయన దయతో మా కులంలో ఉన్న చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. బీసీ రిజర్వేషన్‌తో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. మా కులస్తులందరూ రాజశేఖరుడికి రుణపడి ఉన్నాం. – లెంక కనక తాతారావు, ఏఆర్ కానిస్టేబుల్, సుందరయ్యపేట గూడు గోడు తీర్చారు... ఇల్లులేక ఇబ్బంది పడుతున్న మా కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. రాజన్న అందించిన నిధులు రూ.50వేలతో ఇల్లు కట్టుకున్నాం. మాలాంటి ఎంతోమంది పేదలకు పక్కా ఇంటి భాగ్యం కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. – బల్లంకి శ్యామల, బొద్దాం, వేపాడ మండలం -
కదిలే రైలులో మెదిలే ఊహలెన్నో!
సాక్షి, కర్నూలు: రైలు ప్రయాణం చాలా మందికి సుపరిచితమే. అందులో అనుభూతులు మాత్రం కొందరికే. కౌంటర్లో టికెట్ తీసుకోవడంతో మొదలయ్యే జర్నీలో ప్రతి అంశాన్ని మనసుతో ఆస్వాదిస్తే మరచిపోలేని జ్ఞాపకాలెన్నో. అనౌన్స్‌మెంట్‌తో పాటు రైలు కూత వినడం.. పట్టాల మీద రైలు రాక చూడటం.. కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య సీటు పట్టుకోవడం, అది కిటికీ పక్కనే అయితే అంతులేని సంతోషం. ఎదురుగా ఆప్యాయంగా పలకరించే ప్రయాణికులు.. వారి మధ్య కబుర్లు.. చాయ్, సమోసా, పల్లీలు..అంటూ వ్యాపారుల అరుపులు, భిక్షాటకుల జానపద గేయాలు.. క్రాసింగ్ కోసం నిలిచే స్టేషన్లో కళ్ల ముందు దూసుకెళ్లే రైలు.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి వెనకు వెళ్లే చెట్లు.. ఆహ్లాదంగా కనిపించే పచ్చని పైర్లు.. నది వంతెన పైనుంచి కిందకు చూస్తే ప్రవహించే జల పరవళ్లు.. రైలు ప్రయాణంలో కమనీయ దృశ్యాలెన్నో. ప్రకృతిని ఆస్వాదించాంటే రైలు ఒక్కసారైనా ఎక్కాల్సిందే. కర్నూలు సమీపంలోని తుంగభద్ర నది వంతెన మీదుగా రైలు కర్నూలు స్టేషన్ వైపు చేరుకుంటున్న తరుణంలో కనిపించిన అందమైన దృశ్యం ఇది. -
రాజూ.. ఒక్కసారి వచ్చి పోరాదా!
ఆయన పలకరింపు ఓ ధైర్యం. ఆయన మాట ఓ భరోసా.. ఆయన నవ్వు మరిచిపోలేనిది.. ఆయనతో స్నేహం ఎంతో అదృష్టం.. అంటున్నారు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మిత్రుడు గుమ్మళ్ల అయ్యపురెడ్డి. సోమవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 44 ఏళ్ల అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో షికార్లు.. రాజకీయ జీవితంలో విశేషాలు.. ముఖ్యమంత్రి స్నేహితుడిగా గడిపిన క్షణాలు తన జీవితానికి మధురస్మృతులు అని.. మహానేత లేని లోటు ఎవరి భర్తీ చేయలేనిదని చెబుతున్నారు. మిగతా విషయాలు ఆయన మాటల్లో... వైఎస్‌తో నాకు 44 ఏళ్ల అనుబంధం నాకు వైఎస్ఆర్తో 44 సంవత్సరాల అనుబంధం ఉంది. చాలా డ్యాషింగ్‌గా ఉండేవాడు, ఒక్కోసారి ఆయనను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎవరు ఏ సహాయం కోరినా, చేసేవాడు. హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని వైఎస్ఆర్ యోగక్షేమాలను ఆయన తండ్రి రాజారెడ్డి నన్ను అడిగేవారు. ఎన్సీసీ అండర్ ఆఫీసర్‌గా వైఎస్ఆర్ ఒకరోజు పరేడ్‌లో నేను సక్రమంగా డ్రిల్ చేయకుంటే నన్ను తుపాకీతో కొట్టాడు. నేను రూంమేట్ అయినా, నన్ను కొట్టావు కదా, అని ఒక రోజంతా మాట్లాడకపోతే, మరుసటి రోజు నాకు స్వీటు ఇచ్చి దగ్గరకు తీసుకున్నాడు. నన్ను కొట్టడంతో ఇంకా క్లోజ్ అయ్యాడు. రాజుకు కాఫీ అంటే చాలా ఇష్టం. 2004 ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఎక్కడికైనా పోయి బిజినెస్ చేసుకుందామా అన్నాడు. అనంతరం 30 నిమిషాల తరువాత తప్పక విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. పాదయాత్రలో ఆయన పాదాలు పగిలి పుండ్లు అయింటే చూసి తట్టుకోలేక ఆయా ప్రాంతాల్లో ఉన్న మా స్నేహితులైన డాక్టర్లను పంపాము. ఫైనాన్స్‌లో కూడా అప్పట్లో కొంత కష్టంగా ఉండేది. ఒకానొక సందర్భంలో మీ ఫ్రెండ్‌ను కొంత కంట్రోల్ చేసుకోమ్మని, టెలిఫోన్ బిల్లు రూ.లక్ష వచ్చింది అని ఆయన తండ్రి రాజారెడ్డి నాతో చెబుతుండేవారు. ‘ రాజుకు ర్యాగింగ్ అంటే భలే కోపం ... విద్యార్థినిలను ఎవరైనా కామెంట్ చేస్తే ఓర్చుకునే వారు కాదు. శారీరకంగా ఎంత బలవంతుడినైనా ఆయనే ముందుగా దెబ్బకొట్టి మాట్లాడేవారు. గుల్బార్గా హెచ్‌కేఈఎస్ మెడికల్ కళాశాలలో హోరాహోరీగా జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎంఎన్ రాఘవేంద్ర గౌడపై గెలిచి లీడర్ అయ్యాడు. లీడర్షిప్ క్వాలిటీస్ వైఎస్ఆర్కు చాలా ఎక్కువ. చదువులో కూడా ఆయన ముందుండే వారు. మేమంతా పడుకున్న తరువాత ఆయన రాత్రంతా చదివేవారు. ఇంగ్లిషులో మంచి పట్టు ఉండేది. కమాండింగ్‌గా మాట్లాడే వాడు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఆయన లీడర్ అయ్యాడు. కేవీపీ మాకు జూనియర్ 1966లో పరిచయమయ్యాడు. కళాశాలలో అప్పట్లోనే గుంటూరు, విజయవాడ వాళ్ల డామినేషన్ ఉండేది. రాజశేఖర్‌రెడ్డికి కన్నడ, ఇంగ్లిషు, తెలుగు భాషలు బాగా వస్తుండడంతో విద్యార్థుల్లో మంచి పట్టు పెరిగేది. కుల, మతాలను అస్సలు పట్టించుకునే వారు కాదు... కేవీపీ కులం ఇప్పటికీ కూడా నాకు తెలియదు. ఆస్ట్రాలజిస్ట్ చెప్పిందే నిజమైంది.. ఎంబీబీఎస్ చదుతున్న సమయంలో మేము ఒకసారి (రాజు రాలేదు) బెంగళూరులో కృష్ణారావు అనే ఆస్ట్రాలజిస్టును కలిశాము. అప్పట్లో ఆయనకు వైఎస్ఆర్ వివరాలు చూపిస్తే ‘ హీ ఈజ్ బికంఏ చీఫ్ మినిష్టర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 ఆర్ 54 ’ అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే రాజా ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్కు ఎన్టీఆర్ సినిమాలంటే చాలా ఇష్టం. గుల్బార్గాకు సమీపంలోని షాబాద్‌లో ప్రతి ఆదివారం తెలుగు సినిమాలు ప్రదర్శించే వారు. మేము అక్కడికి వెళ్లి సినిమాలు చూసే వాళ్లం. వైఎస్ఆర్ను ఒరే అనే వ్యక్తి పార్థ ఒక్కరే, ఒక ముఖ్యమైన విషయం ఏమంటే రాజు మృతి చెందిన మూడు నెలలకే దిగులుతో పార్థ కూడా మృతి చెందాడు. సంజయ్‌గాంధీ అంటే వైఎస్ఆర్కు అప్పట్లో చాలా ఇష్టం. యూత్ కాంగ్రెస్‌లో ఏపీ నుంచి రాజశేఖర్‌రెడ్డి పేరును ఖరారు చేసి కేంద్రానికి పంపారు. వెంటనే కలెక్టర్‌ను పిలిపించి.. ఒక ముఖ్యమంత్రి ఎదుట 15 నిమిషాలు కూర్చున్నావు కదా? ఏమీ అడగవా అన్నాడు. అయ్యాను కదా? ప్రస్తుతం నేనున్న ప్రభుత్వ క్వార్టర్లో మరికొంత కాలం ఉండేందుకు కలెక్టర్ ద్వారా అనుమతిని ఇప్పించాలని కోరాను. వెంటనే హ్హ హ్హ హ్హ... అని బిగ్గరగా నవ్వి ఒక ముఖ్యమంత్రిని కోరాల్సిన కోరికనా, ఇది అన్నాడు. నీవు కోరుకో అన్నావు, నేను కోరుకున్నాను అన్నాను. వెంటనే సూరిని పిలిచి కలెక్టర్‌ను రమ్మనమని చెప్పి, కలెక్టర్ అజయ్‌జైన్ రాగానే వెంటనే ప్రభుత్వ క్వార్టర్ సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. మనిషికి చాలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఇప్పటికీ ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేనిది. రాజు ... ఒక్కసారి వచ్చిపోరాదా? అని అనుకుంటూ ఉంటాను’.. అని మహానేత వైఎస్ఆర్తో ఉన్న జ్ఞాపకాలను అయ్యపురెడ్డి పంచుకున్నారు. -
వేసవి చినుకు
అమ్మ పేరు ఎంత అందంగా ఉంటుందో.. అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు రెట్టింపు అందంగా ఉంటాయి. రెట్టింపు ఎందుకు ఉండాలి? మామూలుగా ఉంటే చాలు కదా అంటారా! అలా అనడానికి కుదరదు. అమ్మమ్మలోను, నానమ్మలోను మూడేసి అక్షరాలు ఉన్నాయి. మరి వారు శివుడితో సమానం కాదూ! నిజమే. వారు శివుడితోనే సమానం. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలంతా చింతగింజలు పోగు పోసినట్లుగా అమ్మమ్మ / నానమ్మల ఇంటికి బిరబిర పరుగులు తీయడం ఇంకా పచ్చి జ్ఞాపకంగానే ఉండి ఉంటుంది అందరికీ. స్వేచ్ఛా విహంగాలు ఆకాశంలో విహరించినంత సంబరంగా ఉంటుంది. అక్కడ ఇంట్లో అడుగు పెడుతుండగానే.. ‘ఏమిరా పిల్లలూ, దొడ్లోకెళ్లి కాళ్లు కడుక్కుని రండి, చక్కగా ఆవకాయ అన్నం, మామిడి పండురసం, మజ్జిగ వేసి అన్నం తినిపిస్తాను’ అని ఆవిడ అంటుంటే, ఈ పిల్లల ముఖాలు చూడాలి! తుర్రుమంటూ దొడ్లోకి వెళ్లి, బావిలో నీళ్లు తోడుకుని, బావి గట్టు మీద ఎడాపెడా కాళ్లు కడుక్కుని వంట గదిలోకి దూరేసేవాళ్లు. అమ్మమ్మ బాదం ఆకులతో కుట్టిన విస్తర్లు వేసి అందరికీ ఆవకాయ పెచ్చులు, మామిడి పండు ముక్కలు వేసేది. వీళ్లు అన్నం తింటుంటే, కడుపునిండా ప్రేమతో వాళ్లకి కొసరి కొసరి వడ్డిస్తూ, ‘ఏరా పిల్లలూ! అన్నంలోకి చారు పొయ్యమంటారా’ అని అడిగేది. వాళ్లు మామిడి పండు ముక్కలు చీకుతూ, ‘మరికాస్త ఆవకాయ వెయ్యి అమ్మమ్మా! ఇంకో రెండు మామడిపండు ముక్కలు కూడా వెయ్యవా’ అని అడిగేవారు. అన్నం తింటున్నంతసేపు అమ్మమ్మ ఎన్ని కథలు చెప్పేది... ఎన్ని పద్యాలు చెప్పేది... ఎన్నెన్ని విషయాలు చెప్పేది... అబ్బో... అందుకే అమ్మమ్మ జ్ఞాపకాలు రెట్టింపుగా ఉంటాయి అన్నది.పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని పోతన రచించిన ‘పలికెడి భాగవతమట పద్యం..’ ఎంతోమంది అమ్మమ్మలు మనవల నోట పలికించారు కదా. ఇక్కడొక విషయం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో రామమూర్తిగారు అనే మహాపండితుడు ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో భారత ప్రవచనం చేయడంలో దిట్ట. నాలుగు రోడ్ల కూడలిలో మూడేసి గంటలు నిలబడి, భారత ప్రవచనం చెబుతుంటే, వేలల్లో జనం నిలబడి వినేవారు. గజారోహణం కూడా జరిగింది ఆయనకు. అంతటి పురాణ వాచస్పతి బ్రహ్మశ్రీ పురాణపండ రామమూర్తి తన మనవలని కూర్చోపెట్టుకుని, రామాయణం చెప్పేవారట. ఒకసారి ఆయనకు తీవ్ర జ్వరంగా ఉంది. మనవలందరూ ఆయన మంచం మీద కూర్చుని ఆయనకు కాళ్లు పడుతున్నారట. అంతలో అమాంతంగా లేచి కూర్చుని, ‘అమ్మాయీ దుర్గా (పెద్ద మనవరాలి పేరు) సీతమ్మ వారు వచ్చింది, పీట వెయ్యి’ అన్నారట. అంతే పిల్లలంతా మౌనంగా ఉండిపోయారట. ఆయనకు రామాయణమంటే అంత ప్రీతి. తాతయ్య అలా మాట్లాడటం పిల్లలకు భలే సరదాగా అనిపించిందట. వేడివేడిగా వచ్చే వడగాడ్పుల సమయంలో ఇటువంటి చల్లచల్లని జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే వేసవి ఒక చల్లటి జ్ఞాపకంగా మిగిలిపోదా! – వైజయంతి -
అచ్చం నాన్నలా..
చేతికి తండ్రి వాచీ.. నాడు ఆ మహానేత ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన పెన్నుతోనే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తొలి సంతకం.. వేదికపై ఆద్యంతం దివంగత వైఎస్సార్ శైలిలోనే హావభావాలు.. ప్రసంగం తీరు సైతం ఆయన్నే జ్ఞప్తికి తెస్తూ సాగిన వైనం పార్టీ శ్రేణులు, అభిమానులను ఆకట్టుకుంది. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ అడుగడుగునా తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చారు. సీఎం జగన్ హావభావాలు, మాట విరుపు, ప్రసంగం, తొలి సంతకం, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం.. ఇలా అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపించాయి.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారానికి, గురువారం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి మధ్య ఎన్నో సారూప్యతలు కనిపించాయి. పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వచ్చిన వైఎస్ జగన్ స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ గ్యాలరీలో కూర్చున్న అశేష అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు హర్షధ్వానాలు చేస్తుండగా ముకుళిత హస్తాలతో చిరునవ్వులు చిందిస్తూ స్డేడియం చుట్టూ కలియదిరిగారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఓపెన్‌టాప్ జీపుపై కలియదిరిగి అభివాదం చేసిన దృశ్యాలు అభిమానుల కళ్లల్లో కదలాడాయి. వైఎస్సార్ వాడిన వాచీని ఇన్నేళ్లూ ఎంతో అపురూపంగా పదిల పర్చుకున్న వైఎస్ జగన్ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టేవేళ గురువారం చేతికి కట్టుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. 2004 తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పైలుపై తొలి సంతకం చేశారు. అదే విధంగా ఇప్పుడు వైఎస్ జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో అమలుకే తొలి సంతకం చేశారు. నవరత్నాల్లో భాగంగా పేర్కొన్న అవ్వాతాతలు, వితంతువులకు ఫించన్‌ను దశలవారీగా నెలకు రూ.3 వేల వరకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో పింఛన్లను నెలకు రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేయడం విశేషం. కాగా, 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేసిన మాంట్బ్లాంక్ పెన్నునే గురువారం సీఎం జగన్ కూడా వాడటం విశేషం. సంక్షేమమే జెండా.. అజెండా పేదలకు మేలు చేసే విషయంలోపార్టీలు, రాజకీయాలు చూడకూడదన్నది మహానేత వైఎస్ నమ్మి, ఆచరించిన విధానం. టీడీపీకి చెందినవారితోపాటు అన్ని వర్గాల వారికి సాచ్యురేషన్ విధానంలో ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటను అనుసరించారు. అవ్వా తాతలు, వితంతువులకు పింఛన్లను నెలకు రూ.2 వేల నుంచి దశల వారీగా రూ.3 వేల వరకు పెంచేందుకు నిర్ణయించారు. అందులో తొలి దశగా రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేశారు. రానున్న మూడేళ్లలో వరుసగా రూ.2,500, రూ.2,750, రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ విషయంలో అర్హులే అజెండా అని చెప్పారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడం అని చెప్పారు. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపుతట్టి మరీ ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేస్తాం అని అశేష అభిమానుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ మాట తీరు చూసి.. ‘ఎంతైనా వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు కదా.. అందుకే అంతటి గొప్ప మనసు ఉంది’ అని సభికులు మాట్లాడుకోవడం కనిపించింది. నాన్న శైలిలోనే ప్రసంగం సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తొలి ప్రసంగం ఆసాంతం ప్రసంగించిన తీరు, హావభావాలు అన్నీ కూడా ఆ మహానేత శైలిలోనే ఉండటం అందర్నీ ఆకట్టుకుంది. ప్రసంగించేందుకు మైక్ వద్దకు రాగానే.. వైఎస్ మాదిరిగానే సీఎం జగన్ కూడా మైక్‌పై మెల్లగా టక్ టక్ టక్మని తడుతూ చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ కళ్లతోనే పలకరించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తన సహజశైలిలో ‘అవ్వలు, అక్కలు, చెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా’ అని అంటూ తన తండ్రి వైఎస్ శైలిలో రెండు చేతులు ఎత్తి నమస్కరించడంతో సభికులందరి కళ్ల ముందు ఒక్కసారి ఆ మహానేత సాక్షాత్కరించినట్లు అనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన హావభావాలు... రెండు చేతులు చాచి మాట్లాడటం.. అంతలోనే రెండు చేతులు ఎదురుగా చూపుతూ మాట్లాడటం పూర్తిగా వైఎస్‌నే జ్ఞప్తికి తెచ్చింది. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఆయన మనసులో స్వచ్ఛత, మాటల్లో స్పష్టత గోచరించాయి. స్వచ్ఛతతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది. -
అదే బాట.. అదే మాట
‘పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే.. నేను రెండడుగులు ముందుకు వేస్తాను.. అన్ని నిరుపేద వర్గాలకు అండగా ఉంటాను’.. ప్రజలకు భరోసా కల్పిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలికిన పలుకులివి. సాధారణ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా తాను ఎలా ముందుకు నడవాలి? రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసేలా ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అనే అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను జగన్ ఇప్పటికే రూపొందించుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే మాట తప్పని, మడమ తిప్పని విధంగా పోరాటం సాగించిన ఆయన ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేయనున్నారు. సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన చివరి రక్తపు బొట్టు వరకు సేవలందించిన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికలకు ముందు వరకు జవజీవాలు లేకుండా చేవచచ్చి పడి ఉన్న పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని మోశారు.. దానికి కొత్త ఊపిరిలూదారు. ఒక పక్క వర్షాలు లేక కరువుతో రాష్ట్రం దుర్భిక్షం కోరల్లో చిక్కుకొని ప్రజలు విలవిల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. రైతులపై కాల్పులు జరిపించి పలువురి ప్రాణాలు బలి తీసుకుంది. తమకు న్యాయం చేయాలని కోరడానికి వచ్చిన అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించి వాటర్ క్యాన్లతో వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారికి ఓదార్పునిస్తూ.. అండగా నిలిచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే శ్రీకారం చుట్టారు. చెప్పినవాటిని కాకుండే చెప్పనివాటిని నెరవేర్చారు. హామీలు ఇవ్వకపోయినా పేద ప్రజల మేలు కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. 2009 ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం పొత్తుల కోసం వెంపర్లాడినా కాదని ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి మహానేతగా ఆవిర్భవించారు. అదే ఏడాది ఆయన ఆకస్మిక మరణానంతరం పరిస్థితులు అధ్వానంగా మారాయి. పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు మెల్లగా నీరుగారిపోయాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని తుంగలో తొక్కి సొంత లాభం, స్వార్థమే పరమావధిగా పాలన సాగించారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి అప్రజాస్వామిక, నిరంకుశ పాలనతో ప్రజలను అన్ని రకాలుగా హింసించారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడ్డంకులు.. ఆటంకాలను దాటుకుని.. తన తండ్రిలానే ఇచ్చిన మాట, ప్రజా క్షేమం కోసం ఎంత దూరమైనా వెనుదీయక పోరాటం సాగించిన వైఎస్ జగన్ తన లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక ముందడుగు వేశారు. తన తండ్రి దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతి నిరాకరించింది. అయినా సరే నల్లకాలువ సభలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించడానికే నిర్ణయించుకున్న జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు పూర్తిగా తన తండ్రి ఆశయాలతో ముందుకు కదులుతూ పేదలకు అండగా నిలబడ్డారు. నాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రజా సమస్యలను విస్మరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌ని అణచివేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అన్ని మాయోపాయాలను పన్నింది. తాను గెలవలేనని తేటతెల్లం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు తెరతీశారు. కాంగ్రెస్ నాయకత్వంతో కలసి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి సీబీఐ విచారణ అంటూ 16 నెలల పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అక్రమంగా జైలులో పెట్టించారు. ఇలా ఎన్నో వే«ధింపులు.. మరెన్నో అవమానాలు ఎదురైనా వెరవక వాటన్నిటినీ ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ పోరాటం సాగించారు. తన తండ్రి పోరాటపటిమే స్ఫూర్తిగా ముందుకు సాగారు. మోసపూరిత, అబద్ధపు హామీలకు దూరంగా.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్ కూడా విలువలకు ప్రాణమిచ్చే వ్యక్తి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పెద్ద పీట వేసే నైజం. కష్టాల్లో ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తన వెంట నడవడానికి సిద్ధపడి ముందుకువచ్చినా వారిని ఆ పార్టీ పదవులకు రాజీనామా చేశాకే తన పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటి వారిని మళ్లీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ఉపఎన్నికల్లో గెలిపించుకున్నారు. 2012లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ సభ్యులను గెలిపించుకోవడమే కాకుండా ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ తాను చేయగలిగే వాటినే చెబుతానని, అబద్ధపు హామీలు ఇవ్వనని చెప్పి ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2014లోనూ మోసపూరిత హామీలిస్తే గెలిచే అవకాశాలున్నా వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి విలువలకే పెద్దపీట వేశారు. చంద్రబాబు నిరంకుశ చర్యలకు ఎదురొడ్డి.. 2014 ఎన్నికల్లో కేవలం 1.67 శాతం ఓట్ల తేడాతో వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారు. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేయని అరాచకం లేదు. తన తండ్రి మాదిరిగానే జగన్ కూడా వాటిపై రాజీ లేని పోరాటం సాగించారు. చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వాటిని తన తన అనుచరగణానికి, భారీగా కమీషన్లు ఇచ్చే వారికి కట్టబెట్టారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడిపోయినా పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు. రైతు రుణ మాఫీని, డ్వాక్రా రుణాల మాఫీని పక్కన పెట్టారు. భృతిని ఎన్నికల ముందు పంచారు. వీటన్నిటిపై వివిధ దీక్షలు, ఆందోళనలు, సభలు, ధర్నాల ద్వారా జగన్ అలుపెరగని పోరాటం సాగించారు. ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రజాసంక్షేమమేధ్యేయంగా నవరత్నాలు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా చేపట్టేలా నవరత్నాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడమే కాకుండా వేయి దాటితే దానికి ఆరోగ్యశ్రీ వర్తించేలా నవరత్నాల్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ అమలయ్యేలా విధంగా చర్యలు తీసుకోనున్నారు. వైఎస్సార్ హయాంలో ఫీజురీయింబర్స్‌మెంట్ కింద పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించగా చంద్రబాబు దాన్ని రూ.35 వేలకు కుదించారు. ఇప్పుడు జగన్ వైఎస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా చేయడంతోపాటు విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు అందించనున్నారు. అదేవిధంగా పిల్లలను బడికి పంపి ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు ఇవ్వడానికి నిర్ణయించారు. సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తారు. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికి నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. జలయజ్ఞం కింద పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జగన్ సంకల్పించారు. రైతులకు భరోసా ఇచ్చేలా వ్యవసాయ సీజన్‌కు ముందే రైతులకు వ్యవసాయ పెట్టుబడిని అందించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 నుంచి లక్ష వరకు ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్సార్ బాటలోనే పేదల కన్నీళ్లు తుడవడానికి.. నాడు వైఎస్సార్.. చంద్రబాబు అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మళ్లీ అదే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు గతంలో కంటే ఎన్నో రెట్ల ఇక్కట్లకు గురయ్యారు. బాధలు ఒక పక్క, వేధింపులొక పక్క వారిని వెంటాడాయి. తన తండ్రి వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జగన్ కూడా ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు, వారికి తానున్నానని భరోసా ఇవ్వడానికి అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేపట్టారు. 3,648 కిలోమీటర్ల మేర ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా అడుగడుగునా ప్రజల కన్నీళ్లను తుడుస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ప్రజల నుంచి జగన్‌కు విశేష ఆదరణ లభించింది. ఆయనకు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పట్టారు. ఎండనక, వాననక కాలినడక ద్వారా వేల కొద్దీ మైళ్లు ప్రయాణించి ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా ఒకరేమిటి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు తీరుస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ప్రజలు పడుతున్న బాధలు ఏమిటో ముందుగానే స్పష్టమైన అవగాహన ఉన్న జగన్ గుంటూరు పార్టీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించారు. -
చందమ్మమ్మ
మాకు దూరమై అప్పుడే ఏడాది అయిపొయింది. ఇవాళ ఎందుకో పదే పదే అమ్మమ్మ జ్ఞాపకాలు చుట్టుముడుతున్నయి. తెలియకుండానే కళ్ళనుండి జారిపోతున్న కన్నీళ్లు అమ్మమ్మను మరింత గుర్తుచేస్తున్నాయ్. గోడ గడియారం వైపు చుస్తే రాత్రి పావు తక్కువ రెండు అవుతుంది. దిగులుగా నిట్టూర్చి, ఎంతకీ నిద్ర పట్టని ఈ రాత్రి త్వరగా తెల్లారిపొతే బాగుండునని అనుకుంటూ ...మంచంపై నుండీ లేచి వెళ్లి బాల్కనీలో ఊయలలో కూర్చున్నా!పౌర్ణమిరోజు కావడంతో వెన్నెల వెదజల్లుతోంది.చల్లని వెన్నెలలో స్నానం చేసినట్లు మనసుకు ఒక్కసారిగా హాయిగా అనిపించిది. బాల్కనీలో గోడవారగా అమర్చిన కుండీలో నాకిష్టమైన విరజాజి తీగ ‘ఆకుపచ్చని ఆకాశంలా’ నిండుగా కనిపించింది. తీగల చివర మెరిసే నక్షత్రాల్లా అక్కడక్కడా తెల్లని జాజి పూలు. మరో పక్క గుత్తులు గుత్తులుగా విరబూసిన రాధాష్ణ పూలతీగ, తమ కమ్మటి సువాసనలతో నా మనోవేదన కాస్తయినా తగ్గించాలని ఆరాట పడుతున్నట్లున్నాయి పిచ్చివి.చిన్నప్పటి నుండీ వెన్నెలన్నా, వర్షంమన్నా, పువ్వులు, పక్షులూ సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ అన్నీ నాకు ఆత్మీయ నేస్తాల్లా కనిపిస్తాయి. అలా తదేకంగా....తన్మయత్వంగా, చందమామనే చుస్తూ కూర్చున్న నాకు, చందమామ నాకుదగ్గరగా వస్తున్నట్లు అనిపించిది. నమ్మలేనట్లు చూశాను. ఆశ్చర్యం! చందమామలో ‘అమ్మమ్మ’ ముఖం!ఆనందంతో మనసు కేరింతలు కొట్టింది. పసిపాపలా గెంతులు వేసింది. అచ్చం అదే ముఖం. వాడిపోయి ముడుతలు పడ్డ శరీరం, వంగిపోయిన నడుము, బో....సి చెవులు?? బోసి మెడ, చేతులూ...?? ఆశ్చర్యంతో రెట్టించిన ఆనందంతో చందమామను తడుముతూ అడిగాను, ‘‘అమ్మమ్మ ! నువ్ ఇప్పుడు చందమ్మమ్మవా.?... నువ్వేనా అస్సలు?? నమ్మలేకుండా ఉన్నానే’ని అడిగా సంబరంగా. చందమ్మమ్మ చల్లగా నవ్వింది. అటూ ఇటూ ఊగుతూ......‘‘అవును బిడ్డా! మీ అమ్మమ్మనేరా’’ అంది ప్రేమగా. చల్లగాలికి ఎగిరే నా ముంగురులు అమ్మమ్మ సవరిస్తూన్నదేమో అన్న భావన కలిగి అప్రయత్నంగా క్షణకాలం కళ్ళు మూసుకుని తెరిచా.అమ్మమ్మా! నిన్ను తలచుకుంటే వెంటనే నాకు గుర్తొచ్చేది నీ సాగిపోయిన చెవులకు ఉన్న నీ పెద్ద పేద్ద గంటీలే...నీ మెడలో మెరిసే బంగారు గుండ్లూ..చేతులకి వెండి కడియాలు...ఏమైనయే అవి? చిన్నప్పటి నుండీ ఎప్పుడూ నిన్నిట్ల బోసిగా చూడలేదే నేనూ’’ అంటుంటే... పక పకా నవ్వి అమ్మమ్మ ఇలా అంది... ‘‘పిచ్చి పిల్లా! అసలు మనిషి బతికి ఉంటేనే వాటి కోసంఆశగా చూస్తుంటరు. సచ్చినంక వదుల్తార్ర.?’’ అంటూ మళ్ళి నవ్వింది. నవ్వులో కూడా అమ్మమ్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర... ‘‘అది సరేగని బిడ్డా ఏందిరా? ఇవాళ పొద్దుగాళ్ సంధీ నన్నే యాద్జేస్తన్నవ్? అంత మంచిదే గదా బిడ్డా?’’ పిల్లలు గిట్ల మంచిగున్నార్ర?‘ అంటూ చందమ్మమ్మ ప్రేమగా అడిగే సరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు.‘‘హా! అందరూ బాగున్నారు.. చందమ్మమ్మా! ఇవాళ నువ్ చాల గుర్తోచ్చావు తెల్సా’’ అన్నాను ఏడుస్తూ.‘‘తెల్సు బిడ్డా! నీ మనసు నాకు తెల్వదా... అందుకే సముదాయిద్దం అని గిటొచ్చిన. ఊకె గిట్ల బాధపడతరా ఎవ్వళ్ళన్న?’’ మందలింపుతో కూడిన ప్రేమకి కదిలిపోయాను. ‘‘అదికాదు అమ్మమ్మా! నువు ఎప్పుడూ అనేదానివి గుర్తుందా! ‘ఇంత దూరంల ఉన్నవ్! నా సావుదలకైనా అందుతవో, లేదో’ అని. నువు అన్నట్లే అయింది కదానే. నిన్ను కడసారి చూడలేకపోయిన అని, ఇప్పటికీ ఎంత విల విల లాడిపోతున్ననో తెల్సా?’’ అంటూ మళ్ళి ఏడ్చాను.‘‘ఊకో బిడ్డా ఏడ్వకు‘అంటూ.....‘నిన్ను ఊకుండ బెట్టి పొదామనే నీ కండ్లకనవడ్డా...నీకు నేనంటే పాణం కాదా ర! అందుకే నన్ను నువు అట్లా ‘పాణం లేకుండా‘ చూడక పోవుటే నయమనిపిస్తది నాకైతే’’ అంది నన్ను బుజ్జగిస్టూ. ‘‘అయినా అమ్మమ్మా నీకు ఎప్పుడూ తొందరనేనే..యముడితో కూడా గొడవేనాయే నీకు? రమ్మంటే పదమన్నట్లు అలా వెళ్లిపోయావు? నువ్ ఉంటే బాగుండు అమ్మమ్మా’’....బెంగగా అంటున్న నా ముఖాన్ని ఒక్కసారిగా చల్లగా వెన్నెల తాకి వెలిగింది...అమ్మమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నదని ఊహించుకుని మురిసిపోయాను! కాసేపాగి అంది ‘‘పిచ్చి దానా! పండుటాకు రాలాలే.. కొత్త శిగురుపుట్టాలె....ఎక్కువ ఆశపడుడు కూడా బాధగాదే బిడ్డా! నువ్వే గిట్ల నళిబిళి అయితే ఎట్లచెప్పూ’’ అంది.‘అమ్మమ్మా! నేను నీ గురించి ఏవో రాయాలని..నీకు ఎన్నో చెప్పాలని అనుకున్ననే! కానీ నా ఆశ ఏదీ తీరలేదు’’ అంటుంటే అడ్డు తగిలి...‘‘ఎండ్ల రస్తవ్ బిడ్డా! పుస్తకంల రస్తవా? నా గురించి?? గొప్పోళ్ళ శరిత్రలే ఇయల్రేపూ సదవట్లేగదరా! నా గురించి రాస్తే సదువుతారే?’’ అంది.‘‘ఎవ్వరి కోసమో కాదే, నాకోసం రాసుకుంట... అచ్చంగా నా కోసం మాత్రమే రాసుకుంటా. నా పిల్లలకు కమ్మని కథలుగా చెప్పుకుంటా! అబ్బా చెప్పవానే ప్లీజ్ ప్లీజ్’’ అని అడిగా గారంగా.నవ్వుతూ...‘‘సరే ఎం శేప్పాలే చెప్పు.. ఐన నీకు తెలవందేముంది రా!’’ అంది ప్రేమగా.‘‘అమ్మమ్మా! నువ్వూ తాత రెక్కల కష్టంతో ఒక ఇంటికి తోడు మూడిల్లు కట్టినరు. తాత పోయిన తర్వాత ఆ ఇళ్ళను పంచిపెడ్తివి, చివరికి ‘జామచెట్టు’ కింద గుడిసెలో ఉంటివీ. అసలది గుడిసె అనడానికి కూడా కాదు. కంది కట్టే అడ్డుపెట్టి, పైన రేకుల కప్పు. మేం ఎమన్నా చేద్దాం అన్నా వద్దని మొండిగా అనే దానివి. చూసేటోల్లు నువ్వు మాకేదో ఇచ్చినవ్ అనుకుంటరు అనేదానివి. ఎండకు ఎండినవ్, వానకు తడిచినవ్. మాపటికి తిందామని దాచిన అన్నం, కుక్క తింటే కుక్కను కూడా తిట్టక నీళ్ళు తాగి పన్నవ్. నీకు ఎవ్వరిపై కోపం లేదా అమ్మమ్మా? అసలు రాదా చెప్పు?? పైగా నువ్వు ఆ గుడిసె ముందు కాలీ జాగాలో నాటే తోటకూర, దొడ్దు చిక్కుడూ...దొండ తీగా, కనకంబరాలూ...బొడ్డు మల్లె ఎంత బాగుండే....బాయి పక్కన నాటిన దానిమ్మ అచ్చం నీ ప్రేమ లెక్కనే మస్తు తీయగ ఉంటుండే. మేం కూడా ఆ జానెడు గుడిసెలో నీతోనే కలిసి ఉండడానికి ఇష్టపడితే నువ్ ‘ఏముందని వొస్తరే నా తాన’ అంటూ ఏడ్చే దానవూ. మేం నీకోసం తెచ్చిన ఐదురూపాయల తమలపాకుల కట్టను కూడా అపురూపంగా చూసే దానివి. అడిగినోళ్లకీ, అడగనోళ్లకీ అందరికీ మా ఎంకటి బిడ్డలు వచ్చిండ్రు అని చెప్పుకుని మురిసి పోయేదానవు. ఎంత హడావుడి చేసే దానవూ? ఉట్టిపైన ఉన్న చిన్న ముంతలో నెయ్యి తీసి గరంపెట్టి, ఇంత చింతతొక్కు తీసి కరివేపాకు, ఎండు మిర్చేసీ పొనికేసి, కట్టెల పొయ్యిపై ఉడుకు ఉడుకుగా అన్నం వండి పెట్టడాన్ని ఎంత సంబరంగా చూసేదాన్నో... నీ గుడిసెని మట్టి,పేడతో కలిపి అలికి ఎప్పుడూ ఎంత మంచిగ ఉంచేదానివి. ఆ చిన్న జాగాలో ఒక పక్కగా నీ మంచం. ఆ మంచానికి నువ్ స్వయంగా చేత్తో కుట్టిన మచ్చర్ధాన్, పైన చిన్న ఫ్యాను. ఓమూలన వరుసగా పేర్చిన నీ కష్టాలు దాచుకున్న సందుగలూ....గోడకు చెక్కపై పేర్చిన (నిన్ను కన్నెత్తి చూడని )నీ దేవుళ్ల పటాలు, దుమ్ము పేరుకొని ఉండేవి... అచ్చము మన బతుకుల్లాగే! కింద పడుకుంటే మాకు నేలపై గతుకుల గచ్చులోనుండీ పైకితేలిన రాళ్ళు గుచ్చుకుంటాయని ఎంతో బాధపడేదానివి. ముందుగాల సిమెంట్ పట్టాలతో కుట్టిన చాపలాంటిది పరిచి, తర్వాత మాకోసం ఉతికి సందుగలో దాచిన మెత్తని బొంత తీసుకువచ్చేదానివి. అది గమ్మత్తైన లైఫ్ బాయ్ సబ్బు వాసన వచ్చేది. ఇప్పటికి నాకు లైఫ్ బాయ్ సబ్బు చుస్తే నువ్వె గుర్తోస్తవ్ తెలుసా! నేల మీద బొంతతో పాటు నీ ప్రేమను కూడా పరుస్తావేమో...కదానే అమ్మమ్మా! పడుకోగానే నిద్ర పడ్తది. నీ ఆరాటం లో ఎంత ప్రేమ, గుడిసెలో ఉండడం, మేడలో ఉండడం అనే మాట అటుంచి మాకు నీతో ఉండడమే ఇష్టమే! కానీ...నీకు అలా ఉండాల్సివచ్చినందుకు ఎప్పుడూ బాధ వేయలేదా?? పైగా నా గుడిసే అని గర్వంగా చెప్పు కుంటావు? కాసేపు మౌనం తర్వాత అమ్మమ్మ మాట్లాడం మొదలు పెట్టింది ...‘గంతే కదానే బిడ్డా! మనకు లేదే అనుకుంటేనే అసలు రంథి...! మనకు ఉన్నది గిదే అనుకుంటే మనసుకు జర కుదార్థమైతది. ఆ గుడిసెలో ఒక దినమా, రెండు దినాలా ? పద్దెనిమిది ఏండ్లు ఉన్నకదానే....ముందు గా గుడిసె కూడా నాకు ఉండెనా??....మసీదులోనే ఒక మూలుంటననీ..ఆడనే ఇంత ఉడక బెట్టుకుంటనని చారెడు బియ్యం గింజలు,వొక గిన్నె చేతిలో పట్టుకు పోతుంటే గా గౌండ్లాయన, గదేనే .. మన ధమ్మంజయ్య పెద్ధబాపు లేదా గాయన తమ్ముడు గొల్లోల వాడకట్టుల వుంటడు ఆయన ఎదురోచ్చిండు....‘అమృతక్కా! ఏడికి పోతన్నవే...నీకీ గోస ఏందే...ఎం కర్మపాడైందే? మేంమంత లేమాయే నీకు? మాఇంట్ల ఉండని’ కొడుకు వాళ్ల ఇంటికి కొంచవోయిందు బిడ్డ.ఆడ వాళ్ళింట్లనే ఒక అరల ఎనిమిది నెలలున్న. గాడ ఇంత ముద్ద ఉంటే తిన్నా! లేదంటే కాళ్ళు కడుపుల పెట్టుకుని మళ్సూకొని పన్నా. గుప్పుడే మీ బాపు వచ్చిండు నా తానకి ‘అత్తమ్మా మాతో ఉండరాదే? ఇట్లా ఎన్నాళ్ళు ఉంటావ్?’ అని అన్నడు. నేను రాను అయ్యా ..నా బిడ్డను కూడా ్చలకు. నేనె ఒకరి ఇంట్ల ఉన్నా అని చెప్పి మర్లగొట్టినా. బిడ్డలు వచ్చేందుకు కూడా నోచని తల్లిని అంటూ గుప్పుడు మాత్రం మస్తు ఏడుసుకొన్నా బిడ్డా! నా గోస పగోనికి కూడా రావద్దు. అట్ల ఉన్నా తొంగిచూసినోడు లేడు నన్ను...చివరికి గా అన్నల్లోకి కల్సిన కిష్ఠప్ప చేయబట్టి నాకు ఆ గుడిసైనా తయారైంది...మేడల్లో ఉన్నా గదే..! గుడిసెలో ఉన్నా గదే!...బతికి ఉండగానే నడిచే శవం లెక్క తిరిగినా..! గివాళ నేను పైకి వచ్చినట్టే గా మేడలో ఉండే వాళ్లు అస్తరా ?రారా? చెప్పు ?’ అంది ఉబికే కన్నీరు ఆపుకుంటూ....తిరిగి తేరుకుని....‘‘నీకు ఇంకొ గమ్మత్తు ముచ్చట చెప్పన్నా! ఇంకానయం ఇక్కడకు నేనే ముందు అచ్చిన.....‘వాళ్లు’ గిట్ల ఇక్కడకు ముందు అచ్చుంటే నాకు ఈడ సూత జాగా లేకుండా చేశురో ఏమో గదానే’’....అంటూ అమృతం కురిసినట్లు ఒకటే నవ్వు......నిజంగా నీకు బాధ లేదా అమ్మమ్మా ? కానీ అమ్మమ్మా ! నేను చూడంగ సచ్చిన కొన్ని గంటలకే పాడె కట్టి, పండగ చేయుడు చూడలేదు..కనీసం నేను వచ్చే వరకు ఉంచమని ఆ ‘పెద్ద మనుషులని’ బతిమాలినా కూడా ఉంచలేదు నిన్ను..కన్నీరు కట్టలు తెగిన ప్రవాహం అయింది. చల్లని గాలి నా బుగ్గలు తడిమింది... అమ్మమ్మ చెయ్యి కాబోలు అనుకున్నా....! చందమ్మమ్మ ఒక క్షణం గంభీరమై మరుక్షణం ఇలా అంది....‘‘కడుపారా కనుకున్న తల్లిని కదానే బిడ్డా! శపించడం తెలవది నాకు. కానీ ...ఏనాడైనా ‘గట్ల జుశుండెడిది కాదు మా అవ్వని’ అనుకోక పోతారు?...ఆల్లకు పైసల్ ఉండొచ్చు రా...పైసల్ ఎం చేస్తాయ్! మా అంటేపాణాల్దీస్తయ్..గంతే! ‘రేపుగిట్ల వాళ్లు ఇక్కడికిసూత నాతానకి వచ్చినా, ఈడ సుత ఇంత జాగా ఇస్తనే నేనూ’’ అంది గర్వంగా!!.మరి ఇంకేం ‘అక్కడ’ కూడా ఓ ‘జామ చెట్టు’ నాటు మరి...ఎందుకైనా మంచిది ముందు ముందు పనికొస్తది.....అంటూ అల్లరిగా నవ్వాను, తేలిక పడ్డ మనసుతో..!అందంగా నవ్వి నుదుట ముద్దు పెట్టింది అమ్మమ్మ.....‘‘మరి నే బోవన్నా ఇగ’’ అంది చందమ్మమ్మ...‘‘నీ పేరుకు తగ్గ అమృతమ్మవేనే నువ్వు...ఇపుడు మాత్రం నాకోసం వచ్చిన చల్లని వెన్నెలవు’’ అంటూ గాల్లో ముద్దులు ఇచ్చాను.... చల్లని వెన్నెల్లో నిలువెల్లా తడిచిపోతూ. ∙శారదాదేవి -
సాహో జ్ఞాపకాలు
ఒక్కో సినిమాకు ఏడాది వరకూ సమయాన్ని కేటాయిస్తుంటారు స్టార్స్. ఆ ప్రయాణంలో ఆ సినిమా స్పెషల్‌గా మారుతుంటుంది. కొందరు ఆ సినిమాలో ఏదో వస్తువును ఆ ప్రయాణానికి గుర్తుగా దాచుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా సాహో జ్ఞాపకాలను ఓ కారు, బైక్‌లో చూసుకోనున్నారట. ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి చేసే యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్నో స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు ఈ చిత్రానికి ఉపయోగించిన సంగతి తెలిసిందే. చాలా శాతం వరకూ యాక్షన్ సన్నివేశాలను డూప్ సహాయం లేకుండా ప్రభాసే చేస్తున్నారు. ఈ సినిమాలో వాడిన ఓ బైకు, కారును ‘సాహో’ గుర్తుగా తన దగ్గర పెట్టుకోనున్నారట ప్రభాస్. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహాసన్ లాయ్. -
నాగమ్మ పెద్దమ్మ
బతికున్నప్పటి కంటే కొంతమంది చనిపోయాకే ఎక్కువ గుర్తుంటారేమో! అక్షరఙ్ఞానం లేకపోయినా తమ అనుభవాలతో జీవితాన్ని గడిపి ఆ శేషాన్ని ఙ్ఞాపకాలుగా మార్చి పోయినవాళ్లు ఇంకా బాగా గుర్తుంటారు. నాకు ఊహ తెలినసిన దగ్గర్నుంచి ఊరు విడిచిపెట్టే వరకూ నాగమ్మ పెద్దమ్మతో వున్న అనుబంధం కూడా అలాంటిదే. ఒంట్లో ఓపికున్నంత వరకూ కష్టపడాలని, ఇతరుల మీద అత్యవసరమైతే తప్ప ఆధారపడకూడదనే సత్యం నాగమ్మ పెద్దమ్మ నాకు నేర్పింది. సన్నగా, పొడుగ్గా, విశాలమైన నుదురు, నిటారుగా వుండే ముక్కుతో తెల్లగా కళగా వుండేది పెద్దమ్మ. తలంతా తెల్లబడి తలపైన ముగ్గుబుట్ట బోర్లించినట్లుగా వుండేది. నుదురునిండా కనిపించే ముడతలు కోనేటి దగ్గరున్న మెట్లను తలపించేవి. పట్టుకోకలు కట్టుకుని కోకచెంగును బొడ్డులో దోపుకునేది. నుదుటున బొట్టుండేది కాదు.బొట్టు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఇంటిముందున్న బూరుగుచెట్టు నుండి గాలికి రాలిపడిన బూరుగుకాయల్ని ముందేసుకుని వాటిలోని దూదిని వేరుచేస్తూ కనిపించేది పెద్దమ్మ. పసిపిల్లని సాకినట్లుగా ఒక్కో బూరుగుకాయనీ పగులకొట్టి అందులోనుంచి తీసిన దూది గాలికి ఎగరకుండా దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టిన దుప్పట్లో దాచిపెట్టేది. ఎప్పుడన్నా ఆడుకుంటూ పెద్దమ్మ ఇంటి వాకిట్లోకి వెళ్తే ‘కూర్చో’మన్నట్లుగా సైగచేసేది. ‘‘ఒక్కదానివే కదా ఇంట్లో వుండేది! కాసేపు పడుకోకుండా నడుము నొప్పెట్టేలా ఈ పనులెందుకు’’ అని అమాయకంగా అడిగేవాడిని. బోసినోటితో చిన్నగా నవ్వి నా బుగ్గలపైన సుతారంగా నొక్కి కణత దగ్గర మొటికలు విరిచి ముద్దు పెట్టుకునేది. తర్వాత లోపలికెళ్లి పండిన అరటిపండు తీసుకొచ్చి తినమని ఇచ్చేది. పెద్దమ్మ భర్త వ్యవసాయం బాగా చేసేవాడు. సొంతభూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పసుపు, అరటి పంటలు పండించేవాడు. అరటితోట కాపుకొచ్చినప్పుడు పండడానికి సిద్ధంగా వున్న గెలను తీసుకొచ్చి ఇంటి మధ్యలో వేళ్లాడదీసేవాడు. రోజుకు ఒకటో రెండో పండితే వాటిని తినడమో, పెరుగన్నంలో నంజుకుని తినడమో చేసేవాళ్లు. రెండో మూడో పాడిగేదెలుండేవి. గేదెల్ని పొలానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాక పాలుతీసి ఇంటింటికీ వెళ్లి ఖాతాల్లెక్కన పాలు పోసి వచ్చేది. పొరపాటున కూడా పాలల్లో నీళ్లు కలిపేది కాదు. ఎవరైనా వేళాకోళానికి ‘అందరూ పాలల్లో నీళ్లు కలిపి దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంటే... నువ్వేమో తీసిన పాలు తీసినట్లే పోస్తున్నావు’’ అని మాట్లాడితే ‘‘పాలూనీళ్లల్లా సంసారం సాగాలిగానీ వ్యాపారం చేయకూడదు..’’ అని సున్నితంగా మందలించేది. పెద్దమ్మకి పిల్లల్లేరు. లోపం ఎవరిదో ఆ భగవంతుడికే తెలియాలి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పిల్లల్లేరనే దిగులు లేకుండా జీవితం గడిపేవారు. అయినా లోపం లోపమే కాబట్టి తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచు కున్నారు. కడుపున పుట్టకపోయినా వాడిని ఏ పనీ చేయనివ్వకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా లేదన కుండా ఇవ్వడం, అతిగారాబం వల్ల వాడు చదువబ్బక జులాయిగా మారాడు. ఎటూ చదువబ్బడం లేదుకాబట్టి వ్యవసాయం నేర్చుకుంటాడని పొలానికి తీసుకెళ్తే తండ్రి చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. పిల్లలు కళ్లముందు ఎంత అల్లరిచేసినా అది తల్లిదండ్రులకు సంబరంగానే వుంటుంది. ఎప్పుడైనా ఇరుగుపొరుగు వాళ్లు వాడిమీదేమైనా చాడీలు చెప్తే ‘‘అల్లరి చేయకుండానే పెద్దవాళ్లు అయిపోయారా? పసితనం కదా... వాడే తెలుసుకుంటాడులే..’’ అని సర్ది చెప్పి పంపించేది. కాలం కలకాలం ఒకేలా వుండదు. మనిషి లెక్కలు మనిషికుంటే కాలం లెక్కలు కాలానివి. పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరిచివరి మామిడితోటలో వున్న దిగుడుబావిలో పడి చనిపోయాడు వాడు. పెద్దమ్మ గుండె పగిలిపోయింది. పిల్లాడిని పెంపకానికిచ్చిన తల్లి పెద్దమ్మను తీవ్రంగా తిట్టిపోసింది. ‘గొడ్డుమోతుదానివి, పేగుతెంచుకుని కంటే ఆ బాధ తెలుస్తుంది, పెంపకానికి తెచ్చుకుంటే పిల్లలపైన ప్రేమెలా పుడుతుంది, వాళ్లను కాపాడుకోవాలనే ఙ్ఞానమెలా వస్తుంది...’’ కడుపుమీద కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడ్తున్న ఆమెవంక విషాదంగా చూస్తుండిపోయింది పెద్దమ్మ. సొంత తల్లికాకపోయినా అంతకంటే ఎక్కువగానే సాకింది వాడిని. తన పెంపకంలో లోపం లేదు, తన ప్రేమలో లోటులేదు. అయినా అనుకోని విపత్తు జరిగితే లోకం దృష్టిలో ఎన్ని నిందలుపడాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది పెద్దమ్మకి. కాలం గాయాలు చేస్తుంది, ఓదార్పునూ ఇస్తుంది. కొన్నాళ్లు వాడి ఙ్ఞాపకాలతోనే భారంగా గడిచిపోయింది జీవితం. వాడి గుర్తులనుండి బయటపడి ఈ లోకంలోకి వస్తున్న పెద్దమ్మకి భర్తమరణం పిడుగులా మారింది. ఒకరోజు ఉదయాన్నే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన భర్త పాముకాటుకు గురై చనిపోయాడు. పెద్దమ్మకి పెళ్లైనప్పటి నుండీ వాళ్ళిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా వుండేవారో తెలిసిన వాళ్లు ఆమెను ఓదార్చారు గానీ బాధను తీసేయలేకపోయారు. భర్త పోయిన తర్వాత పంటనుండి వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చింది. పాలమ్మగా వచ్చిన ఆదాయాన్ని రోజువారీ ఖర్చులకోసం వాడుకునేది. రోజులు గడిచేకొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోవడం, గేదెలకు చాకిరీ ఎక్కువగా చేయాల్సి రావడంతో వాటిని అమ్మేసింది. ఇంటిచుట్టూ మట్టిగోడలు పడగొట్టించి ఇటుకలతో కట్టించింది. అరసెంటు స్థలం చుట్టూ వున్న పిచ్చిమొక్కల్ని తొలగించి కంచె పాతించింది. ఇంటిముందున్న సపోటా చెట్టుకిందో, జామచెట్టుకిందో మంచం వేసుకుని కూర్చునేది. ఇంటిముందునుంచి ఎవరెళ్తున్నా ‘ఎలా వున్నారం’టూ అందర్నీ ఆరాతీసేది. ‘కాసేపు కూర్చుని పోదువు రా’ అంటూ పిల్చేది. ‘‘నీకేమే పెద్దమ్మా... ఒంటరిదానివి. ఒక ముద్దొండుకుని తింటావు, నిద్రొస్తే పడుకుంటావు. నీకులాగా మాకెలా కుదురుతుందీ...’’ అంటూ దీర్ఘం తీసుకుంటూ వెళ్ళే వాళ్లవంక చూస్తూ ‘‘ఒక్కదాన్నే వుండడం ఎంత నరకమో నీకెంత చెప్పినా తెలియదులే...’’ నీళ్లను కళ్లల్లోనే దాచుకుని తనలో తనే గొణుక్కునేది పెద్దమ్మ. పొద్దున్నే లేచి చక్కగా ముఖం కడుక్కుని అద్దం ముందేసుకుని జామచెట్టు కింద కూర్చుని తలదువ్వుకునేది. ఒత్తుగా కొబ్బరినూనె రాసుకుని తలపై వున్న కాసిని వెంట్రుకలనే శుభ్రంగా దువ్వుకుని దానిలో సవరం పెట్టి అల్లుకుని పెద్ద ముడేసుకునేది. అటూఇటూ అద్దాన్ని తిప్పి కాసేపు చూసుకునేది. ‘‘ఇంత వయసొచ్చినా సోకు తగ్గలేదు నీకు... నిండా నాలుగెంట్రుకలు లేవు, పొద్దస్తమానం దువ్వుతూనే వుంటావు...’’ అనేవాళ్లని చూసి ‘‘నాతోపాటు పుట్టినయ్, పోయే దాకైనా జాగ్రత్త చేయాలిగా...’’ అంటూ ముసిముసిగా నవ్వుకునేది. పెద్దమ్మ ఎండుచేపలు అమ్మేది. ప్రతీ ఆదివారం తెల్లవారుజామునే లేచి పెద్ద గోనెసంచి తీసుకుని ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న సంతకి వెళ్లేది. ఎండురొయ్యలు, చీలికచేపలు, రొయ్యపొట్టు, ఉప్పుచేపలు తీసుకుని వెనక్కి వచ్చేది. బస్సుదిగి ఊర్లోకి నడిచివస్తుంటే ఆడోళ్లందరూ పెద్దమ్మ వెనకాలే వచ్చేవాళ్లు ఎండుచేపలకోసం. కనీసం మూట కూడా దించుకోనివ్వకుండా మీదకి ఎగబడేవాళ్లు. వాళ్లందర్నీ తోసి ‘ముసలిముండని... అంతదూరం నుండి ఇంత పెద్ద మూటేసుకుని పడతా లేత్తా ఇంటికొస్తే ఒక్కతన్నా గుక్కెడు మంచినీళ్లిచ్చిందా? చేపలో చేపలో అని నా గోచి లాగుతున్నారు, అవతలికి పొండెహే...’’ అంటూ తిట్టేది. గోనెసంచి ముడివిప్పగానే ఎండుచేపల వాసన గుప్పున వచ్చేది. ఈగల్లాగా అందరూ మూకుమ్మడిగా చేరి ‘నాకివి కావాలి, నాకవి కావాలి’ అంటూ ఎవరిక్కావలసిన చేపలు వాళ్లు పట్టుకెళ్లేవాళ్లు. తక్కెడ సర్ది లోపల దాచిపెట్టేది. గురువారం నుండి శనివారం వరకూ ఎవరికైతే చేపలు అప్పుగా ఇచ్చిందో వాళ్లదగ్గరకెళ్లి డబ్బులు వసూలుచేసేది. ఆ డబ్బులు లెక్కచూసుకుని మళ్లీ ఆదివారం సంతకి సిద్ధమయ్యేది. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునేది కాదు. ఒకవేళ కూర్చున్నా బూరుగుకాయల నుంచి దూది వడుక్కునేది. పొయ్యి వెలిగించుకుని నాలుగుగింజలు ఉడికించుకుని కాల్చిన ఎండుచేప నంజుకుని ఆ పూటకి భోజనం కానిచ్చేది. రెండుముద్దలు కాకులకోసం విసిరేది. ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చే వాటికి, ఏకాకిగా జీవితం గడుపుతున్న తనకీ పెద్దగా భేదం కనిపించేది కాదు. పిచ్చాపాటిగా ఎవరైనా ఎప్పుడైనా ‘‘ఒక ముద్దొండుకుని తిని ఇంట్లో కూర్చోకుండా ఎందుకే ఎండనపడి అంతదూరం వెళ్లి సుఖంగావున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావు? మధ్యదారిలో ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది...’’ అనేవాళ్ళు.దానికి పెద్దమ్మ ‘‘పోయే ప్రాణమే గానీ వచ్చే ప్రాణం కాదుగా... ఎప్పటికైనా పోవలసిందే! ఎంతసేపూ ఇంట్లోనే కూర్చుంటే ఇబ్బందిగా వుంటుంది. సంతకెళ్తే నాలుగు ముఖాలు కనిపిస్తాయి, నలుగురి మాటలు వినిపిస్తాయి. ప్రపంచంలో నా ఒక్కదానికే కష్టాలున్నాయనుకునేదాన్ని. సంతలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకం కష్టం. వాళ్లకంటే నేనే నయమనిపిస్తుంటుంది...’’ అని చెప్తూ సొట్టబుగ్గలు ఇంకా గుంటలుపడేలా పెద్దగా నవ్వేది. మళ్ళీ తనే నవ్వుతూ ‘‘ఇదిగో ఇంకో మాట చెప్తా విను... కాలూచెయ్యీ పడిపోయి మంచానపడి అందరిచేతా సేవ చేయించుకుంటూ తిట్టించుకుంటూ పోయేకంటే... ఈ చిలక ఎక్కడో ఒకచోట గుటుక్కున ఎగిరిపోతేనే బాగుంటుంది.... ఏమంటావు?’’ అంటూ నవ్వుకుంటూ లోపలికెళ్తున్న పెద్దమ్మ వంక ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు అయోమయంగా చూసేవాళ్ళు. అన్నట్టుగానే పెద్దమ్మ వెళ్లిపోయింది. ఎవరిచేతా మాటపడకుండానే, ఎవరితోనూ చేయించుకోకుండానే పడు కున్నది పడుకున్నట్లే నిద్రలోనే చనిపోయింది. అటువంటి మనిషి మళ్లీ పుట్టదని ఊరంతాఅనుకున్నారు. అటువంటి చావు ఎవరికీ రాదని కూడా అందరూ అనుకున్నారు. - డా. జడ సుబ్బారావు -
అడవివూరులో ఆ సాయంత్రం...
కోనాయపాలెంకు కొంచెం దూరంగా పడమటి భాగంలో అడవి ఉండేది. అందులో బిలుడు చెట్లూ, జాన చెట్లూ, కలేచెట్లూ, తునికిచెట్లూ, చంద్రచెట్లూ, మోదుగుచెట్లూ...మొదలైన చెట్లుండేవి. ఆ అడవిలో పెద్దపులులు లేవుకాని చిరుత పులులు ఉన్నట్లు వాడుక. ఒకోరోజూ రాత్రిపూట ఆ చిరుత పులులు కోనాయపాలెం ప్రవేశించి గాడిదలనో, కుక్కలనో చంపి తిని పోతుండేవి. ఉదయాన్నే చెప్పుకొనేవాళ్లు, రాత్రి చిరుతపులి వచ్చి కుక్కనో, గాడిదనో లేక రెంటినో తినిపోయిందని.ఆ ఊరుకు ఆంధ్రదేశ దివ్యక్షేత్రాలలో ఒకటైన వేదాద్రి ఆరుమైళ్లు మాత్రమే ఉంటుంది. అడవిలో గుండా, గుట్టల మీదుగా కురవలు దాటిపోవాలి వేదాద్రికి!మేమంతా ఒకరోజు ఎద్దులబండి మీద వేదాద్రి అనే నెపంతో అడవి చూడడానికి బయలుదేరాం. రోడ్డు లేదు సరికదా డొంక దారి కూడా లేదు. దారి నిండా రాళ్లూ, బండలూ. బండిలో కూర్చున్నవాళ్లు ఆ దడదడలకు ఎగిరిపడుతున్నారు. గ్రామంలో ఇళ్లుంటాయి, మనుష్యులుంటారు. చెట్లుంటాయి. మరి అడవిలో ఇళ్లుండవు. మనుషులుండరు. చెట్లు మాత్రమే ఉంటాయి. ఎంత దూరం చూసినా చెట్లేచెట్లు! చిన్న చెట్లు, పెద్దచెట్లు, కుంటిచెట్లు,పూలులేనిచెట్లు, పూలున్నచెట్లు, చచ్చిన చెట్లు... అయితే అడవిలో కూడా అక్కడక్కడ ఇళ్లూ, మనుషులూ ఉండకపోరు. అటువంటప్పుడు, ఆ ప్రదేశాన్ని ›గ్రామమే అంటారు కాని అడవి అనరు. అయితే దాన్ని అడవివూరు అనవచ్చు. లంబాడీలు పశువులను మేపుతూ అడవిలో అక్కడక్కడ కనబడసాగారు. కొంతదూరంలో కృష్ణానది గోచరిస్తుంది. సాయం సమయం కావస్తుంది. అది వసంతరుతువు. మోదుగుచెట్లు చాలా కనిపించినాయి.ఎర్రటిపూలతో అరణ్యం మంటలతో మండిపోతున్నట్టు కనిపించింది. అందుకే వీటిని ఇంగ్లీష్‌లో ‘ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్’ అంటారు. సంస్కృతంలో దీన్ని ‘కంశుకం’ అని, ‘పలాశం’ అనీ అంటారు.దీని పుష్పం ప్రజ్వలిస్తున్న అగ్నికణంలాగా ఎంతో రమ్యంగా ఉంటుంది. కాని ఏమి లాభం? దీనికి వాసనే ఉండదు. రూపం బాగుండి గుణం లేని మనిషిని అందుకే మోదుగుపువ్వుతో పోలుస్తారు. సంస్కృంతలో ఒక శ్లోకం ఉంది. ‘రూపయవ్వన సంపన్నా విశాలకుల సంభవాః విద్యాహీన విశోభంతే విర్గంధా ఇవకింశుకాః’రూపము, యవ్వనము, కులీనతా, సంపద... ఇన్ని ఉండి విద్య గనుక లేనిచో ఆ వ్యక్తులు మోదుగుపూలతో సమానమని.మా దారికంటే క్రిందుగా మోదుగుచెట్లున్నాయి. వాటి జ్వలంత రక్తకుసుమాల మీదుగా కృష్ణానదిలోని నీలహరిత నీటిపాయలు కనిపిస్తున్నాయి. మోదుగుపూల చూచి మండేకన్ను ఆవలకు చూస్తే కృష్ణాజలాల నీలహరితంతో చల్లబడుతుంది. అడివిని చూడడం, దగ్గరగా కొండలనూ, లోయలను చూడడం కూడా జీవితంలో అదే మొదలు.దూరాన్నుంచి కనిపించే నునుపూ, నీలము కూడా దగ్గరలో చూచినప్పుడు కొండలలో కనిపించకపోవడం చూచి ఆశ్చర్యపోయాను. హిమాలయపర్వతాల గురించి, ఆ ప్రాంతపు మహారణ్యాలను గురించి పుస్తకాలలో చదవడం జరిగింది. మేము ఇప్పుడు చూస్తున్నకొండలు హిమాలయాలంత ఎత్తు కొండలు కావని, ఈ అరణ్యం హిమాలయ ప్రాంతపు మహారణ్యంలాంటి గొప్ప అరణ్యం కాదని తరువాత తెలుసుకున్నాను.మిత్రులం అందరం బండి దిగి నడవసాగాము. చదరమైన భూమి నుంచి ఏటవాలుగా క్రమేణ ఎత్తుగా లేచి ఉన్న పర్వత సానువులను చూస్తుంటే ఏదో మధురానుభూతి కలిగేది.మేము నడిచే బాటకు ఒకవైపు ఎత్తు ప్రదేశం, మరోవైపు లోతులు గోచరించాయి.సంధ్యలోని రక్తారుణకాంతులు ముదిరి నలుపులోకి మారి చీకట్లు కమ్ముతున్న సమయానికి వేదాద్రి చేరుకున్నాం. ఆ రాత్రికి దేవాలయంలోని పులిహోర తిని కృష్ణలోని నీరుత్రాగి పడుకున్నాం. తెల్లవారిన తరువాత లేచిచూస్తే వేదాద్రి చాలా రమ్యంగా కనిపించింది. దేవాలయం దగ్గర నుంచి కృష్ణలోకి చాలా లోతు దిగి వెళ్లాలి. సోపానాల మీదుగా పై నుంచి కృష్ణలోకి క్రిందికి చూచినా, కృష్ణలో నుంచి దేవాలయం వైపుకు చూచినా, ఈ రెండు చోట్ల నుంచి ప్రక్కలకు చూచినా–ఎటుచూసినా ప్రదేశం రమ్యంగా తట్టసాగింది. – సంజీవదేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’ పుస్తకం నుంచి. -
మథనం
చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి. సుభద్ర కూర వండిన కళాయిని కట్టెల పొయ్యి మీద నుంచి పైకి తీసింది. దాన్ని బాగా శుభ్రం చేసి, తిరిగి పొయ్యి మీద పెట్టింది. అప్పుడే తెప్పించిన కవోయీ చేపల్ని పసుపు నీటితో కడిగింది. కళాయిలో వేడెక్కిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటిగా వేసింది. వాటి జీవకణాలు తప్పనిసరి మరణానికి వ్యతిరేకంగా పోరాడి ఓడిపోతున్నాయి. ఒక్కొక్కటే చిన్న విల్లు ఆకారాన్ని పొందుతున్నాయి. గతంలో ఆమె సోదరుడు కూడా సైనికుల కాల్పుల్లో చనిపోతూ ఇలాగే విల్లులా వొంగిపోయాడు.సుభద్ర చేపల్ని గరిటెతో ఇటూ అటూ తిప్పింది. వాటి చలనం క్రమంగా మందగించింది. బాగా వేగిపోయాయి. వాటిని కళాయిలోంచి తీసి ఒక ఇత్తడి పళ్లెంలో వేసింది. అవి నిర్జీవంగా పడి ఉన్నాయి. వాటి కళ్లు మాత్రం నిలబడిపోయి ఆమె వైపే చూస్తున్నట్లున్నాయి.గతంలో ఆమె తండ్రి కూడా సైనికుల బాయినెట్ల పోట్లకు నేల మీద వెల్లకిలా పడి చనిపోయాడు. అతని కళ్లు కూడా ఇలాగే నిలబడిపోయాయి.ఈ మధ్య ఈ చేపల్ని ఆమె అసలు తినలేకపోతున్నది. కాని అకోన్‌కు ఈ చేపలంటే ఇష్టం. కాస్తంత గోధుమ రంగు వచ్చేట్టు వేయిస్తే చాలా ప్రీతిగా తింటాడు.ఇంతలో తన ఇంటి గేటుని ఎవరో తెరుస్తున్నట్లయింది. బహుశా అకోన్ కావచ్చు అని భావించి తలుపు తెరిచి చూసింది. కాని కాదు. ఒక మేక తన కొమ్ములతో గేటుని తెరవడానికి ప్రయత్నిస్తున్నది. నిరాశతో తలుపు మూసేసింది. వేయించిన చేపలు గల పళ్లెం మీద మూతపెట్టింది. వరండాలో చిన్న బల్ల వేసుకుని కూర్చున్నది.గాఢాంధకారం నెమ్మదిగా ప్రపంచాన్ని అలముకుంటున్నది. ఇటువంటి కాళరాత్రే అప్పటికి ఎంతోకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆమె సోదరుడు ఆమెని చూడటానికి ఇంటికి వచ్చాడు. వెంటనే ఒక కప్పు టీ తయారు చేసింది. కాని ఆ టీని అతడు ఒక గుక్క కూడా తీసుకోకుండానే ఇంటి బయట విజిల్ మోగింది. తక్షణం అతడు చీకట్లో కలిసిపోవడానికి వీలుగా పెరటి ద్వారం గుండా పరుగెత్తాడు. వెనువెంటనే ఆమెకు తుపాకీ పేలిన శబ్దం వినపడింది. సోదరుడి బలమైన తొడలు ఈ చేపల్లాగే గిలగిలా కొట్టుకుని చచ్చుపడిపోయాయి.కొందరు పురుషులు బరువైన బూట్లతో భుజాల మీద తుపాకీలతో సుభద్ర వైపు రావటాన్ని ఆమె తండ్రి గమనించాడు. ఆమెకు అడ్డంగా నిల్చున్నాడు. వారు అతణ్ణి సులువుగానే ఈడ్చి నేల మీద పడేశారు. బాయినెట్ మొనలతో పొడిచి, బూట్లతో తన్ని తోసేశారు. అతడు వెల్లకిలా పడిపోయాడు. అతని నోటి నుంచి రక్తం స్రవించడాన్ని సుభద్ర చూసింది. అతడి కళ్లు కూడా నిలబడిపోయాయి. భయభ్రాంతురాలై పెరటి ద్వారం గుండా పరుగెత్తింది. కాని దుండగులు ఆమెని వెంబడించారు. పెరటి కొలను ఒడ్డున పొగడ చెట్టు కింద ఆమె వారికి చిక్కిపోయింది. వారు ఆమె పొడవైన జడని పట్టుకున్నారు. తప్పించుకుని పారిపోవడానికి శతవిధాల ప్రయత్నించింది. కాని విఫలమైంది. వారు ఆమె దుస్తుల్ని ఒలిచేశారు. సైనికులు ఒక పద్ధతి ప్రకారం ఆమె హృదయంలో ప్రేమగా పదిలంగా దాచుకున్న పవిత్రతని చీలికపేలికల్ని చేసి పోయారు.ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలీదు. కాని ఆస్పత్రిలో కళ్లు తెరవగానే మొదట చూసింది అకోన్ మెరుపు కళ్లనే. ఆమెలో విషాదం పెల్లుబికింది. తన సొంతమైన, రహస్యమైన, నిద్రాణమైన భావనా మహారణ్యంలోని వృక్షాలు ఒకదాని తర్వాత ఒకటి నేల కూలిపోసాగాయి. మధురమైన గీతాల్ని ఆలపించిన పక్షులు రెక్కలు తెగి ఇప్పుడే తను మాడ్చిన కవోయి చేపల్లా నేలపై నిర్జీవంగా పడిపోయాయి. ఆమె తనదనుకున్న సర్వమూ ఎడారిమయమైపోయింది. ఆమె ఆశలూ ఆశయాలూ కలలూ కోరికలూ పాతాళానికి కృంగిపోయాయి. చెప్పలేని, చెప్పుకోలేని బాధ ఆమెని ఆవహించింది. అకోన్ ఆమె చేతుల్ని పైకెత్తి పట్టుకుని కన్నీరు తుడిచాడు.బాధోదేవిని తులసి, త్రికంటక మొక్కల మధ్యనున్న ఒక సమున్నతమైన వేదికపై ప్రతిష్ఠించి, పవిత్రంగా పూజిస్తారు. సుభద్ర తన శరీరాన్ని అంతవరకు అంతే పునీతంగా అనాఘ్రాతంగా కాపాడుకున్నది. ఆ స్థితిలోనే అకోన్‌కు సమర్పించాలనుకున్నది. కాని ఆ కిరాతకులు ఆమె శరీరాన్ని ఒక దోసపండు మాదిరిగా చిదిమి నమిలేశారు. అకోన్‌కు ఏమీ మిగల్లేదనే వేదన ఆమెని బలంగా ఆవహించింది.అయినా అకోన్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలోకి ఆహ్వానించాడు. బోకుల్ పుష్పాల పరిమళం గల చుంబనని అందించాడు. కాని సుభద్ర గత పీడకల నుంచి విముక్తురాలు కాలేకపోయింది. అకోన్ ఆలింగనలో ఉన్నప్పుడు కూడా ఆమె వేడినూనెలో చుట్టుకుపోయిన చేపలాగే వంకర్లు తిరిగేది. ఆమె శరీరం తిరుగుబాటు చేసేది. అకోన్ సముదాయించేవాడు. కాని ఆమె అపరాధనాభావం నుంచి తప్పుకోలేకపోయింది. మనసులు ఒకటిగా ఉన్నా, శరీరాలు వేరుగా ఉండేవి. అకోన్ బోకుల్ పుష్పాల సువాసనని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించేది. కాని ఆనాటి వేడి నిట్టూర్పుల దుర్భరమైన దుర్వాసన ఆ సువాసనని తుడిచివేసేది. ఆమె భయాల్ని తొలగించడానికి అకోన్ ఎంతగానో ప్రయత్నించేవాడు. మృదువుగా తాకి లాలించి ఆలింగనం చేసుకునేవాడు. కాని ఆమెలో ఏమాత్రమూ స్పందన కలిగేది కాదు. అకోన్ విసిగిపోయాడు. ఒకవిధమైన అలసటా అసహాయతా ఆవరించాయి. ఆశాంతితో అల్లాడిపోయాడు.కాలం గడుస్తున్నది. గ్రీకు పురాణాల్లోని టాంటాలిస్లాగా చుట్టూ నీటిని పెట్టుకుని దాహంతో అలమటించేవారు.నెమ్మదిగా అకోన్‌కు సుభద్ర మానసిక వైకల్యం అర్థమైంది. అకోన్ భౌతికావసరాలు తీరడంలేదని ఆమెకూ తెలుస్తున్నది. ఇద్దరూ పక్కపక్కనే నిద్రపోయేవారు. వారి చేతి వేళ్లు అల్లుకునే ఉంటాయి. కళ్లు తెరుచుకునే ఉంటాయి. కాని రెండు శరీరాల మధ్య వేల మైళ్ల దూరం ఉన్నట్లుంటుంది.ఈ దశలో సుభద్ర ఎంతో ఆలోచించింది. అకోన్కి దీపాలీతో పెళ్లిని ప్రతిపాదించింది. అకోన్ వ్యతిరేకించాడు. కాని అతణ్ణి ఒప్పించింది. చివరికి అకోన్‌ని దీపాలీకి సమర్పించింది. ఈ ఏర్పాటు తప్పనిసరైంది.ఇప్పుడు సుభద్ర అకోన్‌ని గత ఐదు నెలలుగా చూడలేదు. అతడు ఎప్పుడూ ఇంతకాలం సుభద్ర నుంచి దూరంగా ఉండలేదు. ప్రతిరోజూ ప్రతిక్షణమూ అతని కోసమే ఎదురుచూస్తున్నది. చిన్న గాలి తెర కూడా ఆమెను ఉత్తేజితం చేస్తున్నది.ఎవరో గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అకోన్ కావచ్చు. ఒక్కసారిగా ఆమె సంతోషపు ఉద్వేగానికి లోనైంది. కాని ఆ మనిషి దగ్గరకు వచ్చేసరికి అకోన్ కాడని గుర్తించింది. బాపూ కోన్ అనే బంధువు నిన్నటి దినపత్రిక పట్టుకొని వచ్చి ఇచ్చాడు. వారికి నిన్నటి దినపత్రిక ఈరోజు సాయంకాలానికి వస్తుంది. ఆ ఊరికి పట్నం నుంచి వెళ్లే ఒకే ఒక్క బస్సు ఉన్నది. ఆ బస్సులోనే దినపత్రిక ఒక దినం ఆలస్యంగా వస్తుంది. ఆమె పేపరు అందుకొని పక్కన పెట్టేసింది. దాన్ని తిరగవెయ్యాలని ఆమెకు అనిపించలేదు.సుభద్ర పరుపుమీద చేరబడింది. ప్రపంచమే ఆమెకు శత్రువైనప్పుడు ఇంక చేసేదేముంది?ఈ మధ్య అకోన్ పరోక్షంలో ఆమె మనస్సు దేనిపైనా లగ్నం కావడం లేదు. ఏమీ ఆలోచించలేకపోతున్నది. ఏమీ చెయ్యలేకపోతున్నది. రోడ్డు పక్కన ఉన్న కాలువలో చేపలు పట్టడానికి స్నేహితురాళ్లతో కలసి వెళుతుంది. కాని వెదురు వల వైపు చేపల్ని రొప్పటం మరచి పరధ్యానంగా చూస్తూ ఉండిపోతుంది. కొన్నిసార్లు చేతికి దొరికిన చేపల్ని తన పక్కనున్న బుట్టలో వెయ్యడానికి బదులుగా తిరిగి వల వైపు పడవేస్తుంది. సాయంకాలమయ్యే సరికి అకోన్ ఇంటి వద్దకు వెళుతుంది. నేలకు ఒంగిన ఉసిరి కొమ్మల మధ్య నిలుచుంటుంది. దాని కాండంలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అకోన్ ఇంటి వద్ద ఉంటే ఆ కొమ్మ మీదనే ఎక్కువ కాలం కూర్చొని గడుపుతుంటాడు.‘‘సుభద్రా! నువ్వు తిన్నావా?’’ పినతల్లి పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చింది. ‘‘తిన్నాను’’ అబద్ధం చెప్పింది. ‘‘ఆకుకూర చేశాను. నీకు కావాలా?’’ సుభద్ర అడిగింది.‘‘ఇవ్వు. నాకూ ఇష్టమే’’ పినతల్లి ఉత్సాహంగా అడిగింది. సుభద్ర ఆమెకు ఆకుకూరతో పాటు వేయించిన చేపల్నీ ఇచ్చింది. ఎందుకంటే చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి.ఒక గ్లాసు మంచినీరు తాగి తలుపు మూసుకుని పరుపు మీదకు చేరింది. ‘‘అకోన్ తనని మరచిపోయాడా? ఈ భావం ఆమె తలను పదే పదే గుచ్చసాగింది. మానసికారణ్యంలో ఒకప్పుడు కూలిపోయిన చెట్లు ఇప్పుడు మట్టిలో కలసిపోయినట్లుగా భావిస్తున్నది. ఒకప్పుడు ఆ నేల కళకళలాడుతుండేది. కాని ఆ అవశేషాలు కూడా ఇప్పుడు శాశ్వతంగా మాయమయ్యాయి.దీపాలీతో పెళ్లికి అకోన్ను ఒప్పంచింది తనే. అతణ్ణి దీపాలీకి అప్పచెప్పింది తనే. మరి ఇప్పుడు అకోన్ దీపాలీతో సంతోషంగా ఉన్నాడనీ, తనకు దూరమైపోతున్నాడనీ విచారించడం, అసూయపడటం అర్థంలేని అంశం.విజయదశమి తర్వాత నిమజ్జనం చేసిన దేవతని తిరిగి ఆవాహన చెయ్యడం సాధ్యం కాదు.సుభద్ర తనని తానే సంభాళించుకున్నది. వృక్షరహిత శూన్య మహారణ్యం వంటి ఏకాంతాన్ని భరించడానికి సిద్ధపడక తప్పదు. తన వంటి వారికి సగం చచ్చిన జీవితమే లభిస్తుంది. ఆ స్థితి నుంచి తప్పించుకోలేరు.ఆనాటి వేడి దుర్గంధపూరితమైన నిశ్వాసాలు ఆమె ముక్కుకు అంటిపట్టేసి ఉన్నవి. చెరిగిపోవడం లేదు. నిజానికి ఆమె ఘ్రాణశక్తి పూర్తిగా చెడిపోయింది. ఎంత మంచి సువాసనైనా ఆమెకు ఆ దుర్వాసనలాగానే ఉంటున్నది. మంచు ముట్టుకున్నా వేడి నిశ్వాసాలే గుర్తొస్తున్నాయి.అయినా ఈరోజు అన్నీ మరచి, గతాన్ని విస్మరించి, ఉత్సాహంగా అకోన్ కోసం ఎదురు చూస్తున్నది. ఆమె పరిస్థితి తనని స్పృశించబోయే రంగు కోసం ఎదురు చూస్తున్న కాన్వాస్‌లా ఉన్నది.ఇది నిజంగా ఆమెకు సిగ్గుచేటైన విషయం. ఆమెకు ఇటువంటి తలపులు రానేకూడదు. జరగని దాన్ని అతడి నుంచి ఆశించడం, దీపాలీని బాధపెట్టడంలో ఏమాత్రమూ న్యాయం లేదు.సుభద్ర సోదరుడు ఉగ్రవాదిగా మారి ఒక రైలులోని అమాయకులైన వందలాది ప్రయాణికుల్ని బలి తీసుకున్నాడు. మరి వారికీ ఆశలూ ఆశయాలూ ఉండి ఉంటాయి. ఆ కారణం చేతనే సైనికులు వాణ్ణి మట్టుపెట్టారు.కాని సుభద్ర ఎవరికీ ఏమీ అపకారం చెయ్యలేదు. కనీసం కీడు తలపెట్టలేదు. అయినా ఆమె జీవితం నాశనమైపోయింది. సుభద్ర తండ్రి కూడా సాధారణ రైతు. అతడూ ఎవరికీ హాని చెయ్యలేదు. కాని వాళ్లు అతణ్ణి కూడా చంపేశారు. వారికి విచక్షణ లేదు.ఆమె చేసిన నేరమంతా సోదరుడికి కప్పు టీ ఇచ్చింది. ఆ కుమారుడికి తండ్రి కావడం వల్ల తన తండ్రి కూడా బాయినెట్ మొనకు జీవితాన్ని బలి చేసుకున్నాడు. అందరు అమ్మాయిల్లాగానే సుభద్ర కూడా చదువుకున్నది. తన జన్మభూమికి సంబంధించిన సంస్కృతీ సంపదల్నీ, నాగరికత ఔన్నత్యాన్నీ అధ్యయనం చేసింది. కాని ఆమె మిగిలిన అమ్మాయిల కంటే భిన్నమైనదిగా తయారైంది. ఆమె గుండె అవమాన భారంతోనూ నిష్ఫలత్వంతోనూ కొట్టుకుంటున్నది. ఇటువంటి అన్యాయానికి ఎవరైనా బదులు తీర్చుకోవాలి. ఆమె మనస్ఫూర్తిగా అకోన్‌ని అక్కున చేర్చుకుని ఆనందించలేకపోవడానికి బాధ్యులెవరు? అందరూ ఒకే దేశానికి చెందినవారమని చెబుతారు. మరి వారిలో తనూ, సోదరుడూ, తండ్రీ ఎందుకు లేరు?మట్టి గోడల రంధ్రాల్లోంచి సూర్యకిరణాలు ముఖం మీద పడగా సుభద్ర లేచింది. బాగా ఆకలి వేస్తున్నది. మొన్న మధ్యాహ్నం నుంచి ఆహారం ఏమీ తీసుకోలేదు. ‘అకోన్ వస్తున్నాడు’ అనే ఆలోచనే ఆకలి లేకుండా చేసింది. అది తర్వాత ‘అకోన్ రావడం లేదు’ గా మారింది. విషాదమూ, కన్నీరూ ఆకలిని మరచిపోయేట్టు చేశాయి. ఆమెలో ఒక శూన్యం ఏర్పడింది. ఈరోజు ఆదివారం. కాబట్టి తొందరేమీ లేదు.టీ చప్పరిస్తున్న సుభద్ర నిన్నటి పేపర్ని తిరగవేసింది. ‘చబుదా వద్ద కొందరు స్త్రీలపై సైనికులు అత్యాచారం చేశారు’ అన్న వార్త కంటపడింది. హఠాత్తుగా ఆపాదమస్తకమూ ఒక అగ్నికీల ఆమెలో వ్యాపించింది.గోడకు చేరబడి కనులు మూసుకున్నది. ఆ స్త్రీలు ఆమెకు స్పష్టంగా కనపడుతున్నారు. వారి ఆర్తనాదాలు అతి చేరువగా వినపడుతున్నాయి. వారి మనోవేదన అర్థమవుతున్నది.మానవజాతిలో కేవలం స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే దారుణమైన దౌర్భాగ్యం ఇది. ఈ భారాన్ని జీవితాంతం మోసుకు తిరగాలి. గత్యంతరం లేదు. తప్పించుకునే మార్గమే లేదు. ఇప్పుడు ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని నియమించి నిజ నిర్ధారణ చెయ్యమంటారు. కేవలం అదొక ప్రహసనం మాత్రమే. ఆ తర్వాత ఆ నివేదికలు బుట్టదాఖలవుతాయి. అటువంటి కాగితాలు ఆయా కార్యాలయాల్లో గుట్టలుగా పోగుపడి ఉంటాయి. అంతే! ఆ నిర్భాగ్య స్త్రీలు కంటి మీద కునుకు లేకుండా, సుదీర్ఘమైన దుర్భరమైన రాత్రుల్ని జీవితాంతం గడుపుతారు. దుర్గంధపు వేడి నిట్టూర్పులు వారి నాసికా పుటాలకు పట్టేసి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు వారి మనసుల్ని తూట్లు పొడుస్తూ ఉండగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఈ పరిస్థితే కొనసాగితే ఇలా నాశనమైన స్త్రీల గణనీయమైన వర్గం ఒకటి అస్సాంలో తయారవుతుంది. వీరందరూ ఏకమైతే ఆ కిరాతకుల్ని గొంతు పిసికి చంపగలరు. ‘‘బైద్యూ! మేమొచ్చాం.’’ సుభద్ర వద్దకు ట్యూషన్‌కు వచ్చే పిల్లల కేకతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ‘‘వెళ్లండి. చాప పరుచుకోండి’’ అంటూ తనూ ఒక చిన్న బల్ల తెచ్చుకుని కూర్చున్నది. ‘‘ఇవాళ మనం డిక్టేషన్ చెప్పుకుందాం’’ అన్నది. పుస్తకం తెరిచి అందులోని వాక్యాల వైపు చూసింది.‘‘భారతదేశం మా మాతృభూమి. ఇప్పుడు మేం స్వతంత్ర భారత పౌరులం. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరుస్తున్నవి. వీటిని కాపాడవలసిన బాధ్యత మనకున్నది. ఈ దేశంలో అత్యంత పురాతనమైన సంస్కృతీ నాగరికతలు వేలాది సంవత్సరాలుగా చోటు చేసుకున్నవి. ఇక్కడ పౌరులందరూ సమానమే..’’ సుభద్ర అంతరాత్మలోంచి ఏదో తిరుగుబాటు ధ్వని వినపడింది. నిజంగానే పౌరులందరూ స్వతంత్రంగానే జీవిస్తున్నారా? నిజంగానే దేశమాత తన అమృత దృక్కులతో ప్రజలందర్నీ సమానంగానే చూస్తున్నదా? తమ తల్లులూ సోదరీమణులూ అయిన స్త్రీలను ఈ దేశపు పురుషులే మానభంగాలు చేసే దేశం నాగరికమైనదేనా? మరి ఈనాటి ‘రేపటి పౌరుల’కు అబద్ధాలను బోధించడం సబబేనా?ఈ చిన్నారి బాసంతి ఈ పాఠాలన్నీ చదివి పెరుగుతుంది. చివరకు ఏదో ఒకరోజు తన తోటివారే తన జీవితాన్ని నాశనం చెయ్యగలరని తెలుసుకుంటుంది.ఈ చిట్టి గోకుల్ ఇవన్నీ చదివి యువకుడవుతాడు. తన ప్రజల్ని ఉద్ధరించాలనుకుంటాడు. సమస్యలనీ, దరిద్రాన్నీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రశ్నిస్తాడు. ఎవరూ పట్టించుకోరు. చివరికి నిరసన గళం విప్పుతాడు. వాణ్ణి తూటాలకు బలి చేస్తారు. ‘‘బైద్యూ! ఏమని రాయమంటారు?’’ అడిగారు పిల్లలు.‘‘పిల్లలూ! ఇప్పుడు రాయండి’’ సుభద్ర అన్యమనస్కంగా చెప్పసాగింది. సతత హరితమైన మా నేలలో ఉద్భవించిన లతల వలెనే మా శరీరాలు మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. మానవత్వాన్ని కాపాడటమే మా బాధ్యత. నాగరికమైన దేశం అని చెప్పుకుంటున్న ఈ నేల హత్యలనీ, మానభంగాలనీ భరించలేదు. అరణ్యాల సుకుమారమైన ఏకాంతాన్నీ నిశ్శబ్దాన్నీ తుపాకీ కాల్పులు భగ్నం చెయ్యలేవు. చెయ్యకూడదు. ఇక్కడ నిర్భయంగా జీవించడం మా జన్మహక్కు..’’సుభద్ర ఆగింది. బయటి నుంచి ముకుల్ అనే అబ్బాయి చేరువగా వచ్చి ఆమెకు ఒక ఉత్తరాన్ని అందించాడు. ‘‘అకోన్దా మీకిమ్మని పంపాడు’’సుభద్ర దాన్ని అందుకున్నది. ‘‘పిల్లలూ! ఇప్పుడు ఇళ్లకు వెళ్లండి. సాయంత్రం రండి’’ అని పంపేసింది.ఉత్తరాన్ని తెరిచింది. చదివింది. ‘‘దీపాలీకి ఒంట్లో బాగాలేదు. లేవలేకపోతున్నది. ఏమీ తినలేకపోతున్నది. చాలా ఇబ్బందిపడుతున్నది. అందుకే ప్రస్తుతం నేను రాలేకపోతున్నాను. కాబట్టి..’’ఆమె ఉత్తరాన్ని మడిచింది. అకోన్ దీపాలీని పెళ్లి చేసుకునే ముందు ఉత్తరం రాయవలసి వస్తే, ‘‘ప్రియమైన సుభద్రా!’’ అని మొదలుపెట్టి ‘‘నీ అకోన్’’ అని ముగించేవాడు. ఇప్పుడు అటువంటి పాటింపులు ఏమీ లేవు. ఉత్తరం బజారుకెళ్లేటప్పుడు రాసే జాబితాలాగా ఉన్నది. సుభద్రలో ఏదో తీవ్రమైన సంచలనం కలిగింది.తమ వివాహం తర్వాత అకోన్ బాధని కళ్లారా చూసింది. ఆమె కూడా ఖేదించింది. కానీ అతడికి సాంత్వన ఇవ్వలేకపోయింది. అందుకే గత్యంతరం లేక ఇష్టపూర్వకంగానే అతణ్ణి దీపాలీకి ఇచ్చివేసింది.త్యాగం చేసిన పదార్థం కోసం విచారించడం వివేకం కాదు.సుభద్ర ఎవరికీ చెందదు. ఈ నేలకూ చెందదు. ఈ గాలికీ చెందదు. ఏ వ్యక్తికీ చెందదు. అకోన్ దూరమవుతుండటంతో ఆమె మార్గం మరింత సుగమమవుతున్నది.ఒక్క అంశం మాత్రం మిగిలి ఉన్నది. ఆ దుర్మార్గుల్ని గుర్తించి, వారి లైంగికావయవాల్ని కత్తిరించి, వారిని కవోయి చేపల్లా మాడ్చి చంపాలి. ఇదొక్కటే ఆమె జీవిత ధ్యేయం.ఈ దేశంలో ఒకనాటి సువర్ణమయమైన గతాన్ని భవిష్యత్తులో వికసింపచెయ్యాలి. సుభద్ర గుండె వేగంగా కొట్టుకున్నది. ఇంతలో ఎవరో వచ్చిన సడి వినిపించింది.‘‘సుభద్రా! మా అబ్బాయి చేత ఏమిటిలా రాయించావు?’’ జతుల్ తండ్రి ఒక నోట్ పుస్తకాన్ని ఆమెకు అందించాడు. ‘‘మీ నాన్నా, సోదరుడూ సైనికుల తూటాల వల్లనే చనిపోయారు. అలా అయితే నువ్వు కూడా తొందర్లోనే జైలుకెళ్తావు. మా పిల్లవాడికి ఇలాంటి తిరుగుబాటు ధోరణులు తలకెక్కించదలచుకుంటే వాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు అనేసి చిరాగ్గా వెళ్లిపోయాడు.సుభద్ర ఆ నోట్ పుస్తకం వైపు చూసింది.నిజమే తన ఆలోచనల్నే డిక్టేషన్‌గా చెప్పింది.ఒకప్పుడు జతుల్ తండ్రి కూడా తన సోదరుడిలాగానే విప్లవ భావాలతో సాటి కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేవాడు. కాని ఆ మార్గం కంటకమయమని గ్రహించి, ఇప్పుడు పోలీసు శాఖలో చేరిపోయాడు. కత్తి మీద సాము చేస్తున్నాడు. ‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు సుభద్ర మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. సుదూరంగా మంచు నిండిన పర్వతశ్రేణుల్లో వేగిన కవోయి చేపల కళ్ల వంటి ఆమె తండ్రి నిర్జీవమైన నేత్రాలు కనపడుతున్నాయి. నేలకూలి గిలగిలా కొట్టుకుని స్తంభించిపోయిన తన సోదరుడి తొడలు కనపడుతున్నాయి. ఆ పర్వతసానువుల్లో మహావృక్షాలు నేలకు ఒరిగిపోతున్నాయి.‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు..’’ ఈ మాటలు ఆమె దీనస్థితిని సవాలు చేస్తున్నాయి.లేదు. నేను ఇక ముందు స్థిరంగా నిలబడాలి. పరిస్థితుల్నీ, జీవితాన్నీ ఎదుర్కోవాలి. ఇలా ఒక దృఢమైన నిశ్చితమైన వైఖరితో యోచించసాగింది. ‘‘నా ట్యూషన్లో ఎవరో ఒకరు చదవకపోయినా నష్టంలేదు’’ అనుకున్నది. అస్సామీ మూలం : ఫూల్ గోస్వామి అనువాదం: టి.షణ్ముఖరావు -
మన ఊరి కథలు
అల్లరి గడుగ్గాయి స్వామి. వాడికో ముఠా. అందమైన స్కూలు. పారే ఏరు. అమాయకమైన ఊరు. పాతకాలపు కమ్మని జ్ఞాపకాలు.‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ సాహిత్యంలో ఎంత ఆదరణ పొందాయో‘మాల్గుడి డేస్’ సీరియల్‌గా దూరదర్శన్‌లో అంతే అభిమానం పొందాయి.ఇటువంటి అందమైన కథలు మళ్లీ రాలేదు. అందుకే నేటికీ వీటిని చూస్తూ ఉంటారు. బహుశా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇవి ప్రతి ఊరి కథలు. ‘అనగనగా ఒక ఊరు.. ఆ ఊళ్లో..’ అంటూ బామ్మ తన మనవలకు కథ చెబుతూ ఉంటుంది. ఆ కథ ఎక్కడిదో.. ఎలా తన ఊహల్లో రూపుదిద్దుకుందో ఆ బామ్మకే తెలుసు. ఆమే దానికి స్క్రీన్ ప్లే డైరెక్టర్. ఆ కథ వింటున్న పిల్లలకు అందులోని ఊరు, ఆ వాతావరణం, పాత్రలు ఊహల్లో తిరుగుతూ ఉండగా కళ్లు విప్పార్చుకొని ‘ఊ’ కొడుతూ వింటుంటారు. అలా కథా శ్రవణం చేసే బామ్మలు ఇప్పుడైతే లేకపోవచ్చు గాని ‘మాల్గుడి డేస్’ మాత్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. టీవీ సీరీస్ రూపంలో నాటి రోజులను ఇంకా తలుపుకు తెస్తూనే ఉన్నాయి. 80ల కాలం నాటి పిల్లలను ‘మాల్గుడీ డేస్’తో తన ముందు తిష్టవేసుక్కూర్చునేలా చేసింది బుల్లిపెట్టె. రెండేళ్ల వయసు పిల్లలనుంచి నూట రెండేళ్ల బామ్మల వరకు ఆ మాల్గుడి వీధుల్లో ఏడాది పాటు సంబరంగా తిరిగారు. ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ ఊరు అందం.. మూటగట్టి తెచ్చిన మామిడిపండ్ల రుచి ఎంత గొప్పగా ఉంటాయో ‘మాల్గుడి డేస్’ కథలు అంత మధురంగా ఉంటాయి. ఆర్.కె.నారాయణ్ ఊహల్లో రూపుదిద్దుకున్న ఆ అందమైన పట్టణాన్ని కన్నడ దర్శకుడు, నటుడు శంకర్‌నాగ్ చిన్నతెర మీద ఆవిష్కరించాడు. మొత్తం 54 ఎపిసోడ్ల ప్రాజెక్ట్. అత్యంతసాహసమైన ప్రక్రియ. ఆర్కేనారాయణ్ ఊహల్లో దూరి ఒక్కో కథ ఆత్మను పట్టి అలవోకగా దృశ్యంగా మలచిన తీరు ఇప్పటికీ అబ్బురపరుస్తుంటుంది. మాస్టర్ మంజునాథ్, గిరీష్కర్నాడ్, అనంత్నాగ్లను మూడు దశాబ్దాలైనా ఇప్పటికీ మరవలేరు నాటి జనం. అప్పటి వరకు హిందీ సీరియల్స్‌లో ఉత్తరాదివారే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సీరియల్‌తో దక్షిణభారత ప్రతిభనూ దేశమంతా గుర్తించింది. మనలోనే మాల్గుడి మాల్గుడి అనేది నారాయణ్ ఊహల నుంచి పుట్టిన ఊరు. అలాంటి ఊరునూ, అందులోని వీధులనూ, కనిపించే జనాన్ని ఈ దేశంలో ఎక్కడైనా చూడచ్చు. ఆ పాత్రలతో మనకూ పరిచయముంటుంది. బహుశ అవి మనమే అయ్యుంటాం. మన కుటుంబంలోని వారే అయ్యుంటారు. మన ఊళ్లో, మన వాడలోని వారే అయ్యుంటారు. అందుకే అందరూ ఈ కథల్లో లీనమయ్యారు. ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు. ప్రతీపాత్ర ఏదో çసమస్యతో బాధపడుతూ ఉంటుంది. తనకు తానే పరిష్కరించుకుంటుంది. కొన్నిసార్లు రాజీపడుతుంది. మరికొన్నిసార్లు సమాధానపడుతుంది. మాల్గుడి డేస్లోని ఊరు ప్రపంచంలోని పాఠకులను ఎంత ప్రభావితం చేసిందంటే షికాగో యూనివర్శిటీ ప్రెస్ ఒక సాహిత్య పత్రాన్ని చిత్రించి, భారతదేశ చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్.కె.నారాయణ్ తన పుస్తకంలో రాసుకున్నారు. మాల్గుడి ప్లేస్ కోసం చాలా మంది వెతికారు. కొందరు తమిళనాడులోని కోయంబత్తూరు కావొచ్చునని, కర్ణాటకలోని లాల్గుడియే మాల్గుడి అని మరికొందరు అనుకునేవారు. కథల పందిరి ఎనిమిదేళ్ల స్వామి ఉదయాన్నే మేల్కొవడంతోనే మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ కథ అది. బుద్ధిగా ప్రార్ధన చేసి, స్కూల్‌కి వెళతాడు. అక్కడ టీచర్ భగవంతుడి గురించి చెప్పే విషయాల్లో టీచర్‌తో ఎదురు మాట్లాడతాడు. దాంతో టీచర్ బెత్తం పుచ్చుకుని దులిపేస్తాడు. టీచర్ దండించిన విధానం గురించి తండ్రికి చెబుతాడు స్వామి. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని హెడ్మాస్టర్కి ఉత్తరం రాస్తే దాన్ని తానే స్వయంగా తీసుకెళ్లి ఇస్తాడు స్వామి. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే తనకే ముందుగా చెప్పమంటాడు హెడ్మాస్టర్. భయం లేకుండా ఎదగడం ఎంత ముఖ్యమో స్వామి పాత్ర ద్వారా మన కళ్లకు కట్టిస్తారు రచయిత. స్నేహితులతో కలిసి ఆడిన బొంగరాల ఆట, నీళ్లలో వదిలేసిన కాగితపు పడవలు, బ్రిటిషర్ల హయాంలో ఉండే ఆజమాయిషీ.. ఈ ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఆ తర్వాతి ఎపిసోడ్లలో స్వామి అతని స్నేహితులు, కుటుంబం, బామ్మతో ముచ్చట్లు, స్వతంత్ర పోరాటం.. పోలీసుల దాడి ఘటనలు చూస్తాం. స్వామి స్నేహితుడి కారణంగా అడవివైపుగా వెళ్లి తప్పిపోయి, తిరిగి ఇల్లు చే రుతాడు. అయితే, ఏ స్నేహితుడి వల్ల అయితే తను తప్పిపోయాడో అతనే మాల్గుడి నుంచి దూరమైనప్పుడు చాలా బాధపడతాడు స్వామి. ఇలా ఎనిమిది ఎపిసోడ్స్ వరకు స్వామి అండ్ ఫ్రెండ్స్ మాల్గుడి డేస్‌ను ఆక్యుపై చేశారు. ఆ తర్వాతి 13 ఎపిసోడ్స్ అనంత్‌నాగ్ మాల్లుడి డేస్‌లో అంతటా తానై కనిపిస్తారు. ది వెండర్ ఆఫ్ స్వీట్స్, ది వాచ్‌మ్యాన్, మిస్సింగ్ నెక్లెస్, గేట్మెన్ గిప్ట్స్, ఎ హీరో, ఎ విల్లింగ్ స్లేవ్, గోల్డ్ బెల్ట్, నిత్య, ది ఎడ్జ్, సాల్ట్ అండ్ సాడస్ట్, ఆస్ట్రాలజర్స్ డే, నైబర్స్ హెల్ప్, ది హోర్డ్, ది మిస్సింగ్ మెయిల్, డాక్టర్స్ వరల్డ్, లీలాస్ ఫ్రెండ్.. వంటి కథలు మాల్గుడి డేస్‌లో చూడొచ్చు. మాల్గుడి స్వామి ఈ పేరు తలుచుకోగానే బాలనటుడు మంజునాథ్ కళ్లముందు దర్శనమిస్తాడు. అప్పటివరకు కన్నడ సినిమా ప్రేక్షకులకు మాత్రమే ఈ బాల నటుడు పరిచయం. మాల్గుడి డేస్ సీరియల్‌తో అతను దేశంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. (ఆ తర్వాత స్వాతికిరణం సినిమాలోనూ కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు) అంతేకాదు, మంజునాథ్ గొంతు, నటన ప్రపంచంలోని మాల్గుడి వీక్షకులందరినీ కట్టిపడేసింది. ఈ సీరియల్‌తో మంజునాథ్ అరడజను అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. దాంతోబాటు స్వామి, అతని స్నేహితుల వస్త్రధారణ కూడా అప్పటి రోజులకు తగినట్టుగా చక్కగా అమరింది. ఈ సీరియల్ గురించి మంజునాథ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ రోజూ స్కూల్‌కి వెళుతున్నట్టే ఉండేది. ఈ సీరియల్ పెద్ద హిట్ కావడంతో ఒక హోటల్లో పార్టీని ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. మిస్టర్ ఆర్కే నారాయణ్ అక్కడకు వచ్చారు. అక్కడున్నంత సేపు నాతో ఉన్నారు. నాతో మాట్లాడుతూ ‘మంజూ, నా ఊహల్లో స్వామిని కళ్లముందుకు తీసుకొచ్చావు’ అన్నారు. అది నా జీవితంలో అతి పెద్ద కాంప్లిమెంట్. దీనిని ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు. మాల్గుడి డేస్ సీరియల్ హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ వచ్చింది. ఆ విధంగా ప్రపంచ వీక్షకుల మన్ననలూ పొందింది. మీ పిల్లలు కథ చెప్పమని అడుగుతున్నారా.. పిల్లలకు కథ ఎలా చెప్పాలనే ఆలోచన మీకే వచ్చిందా అయితే.. ఆలస్యం చేయకుండా ‘మాల్లుడి డేస్’ టీవీ సీరిస్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ మాల్గుడి వీధుల్లో విహరించాల్సిందే. ‘మాల్గుడి డేస్’ స్వామి అండ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్లో స్వామిగా మాస్టర్ మంజునాథ్, స్నేహబృందం దాదాపు వందేళ్ల ఏళ్ల క్రితం మద్రాసులో జన్మించిన ఆర్కే నారాయణ్ 1943లో ‘మాల్లుడి డేస్’ పేరుతో కథల పుస్తకం రాశారు. 1982లో ఈ పుస్తకం పునర్ముద్రణ పొందింది. ఈ పుస్తకం పేరుతోనే 1987 మార్చ్ 18న రాత్రి 8:30గంటలకు దూరదర్శన్ సీరియల్‌గా ప్రసారమైంది. ప్రతి బుధవారం వచ్చే ఈ సీరియల్ మొత్తం 54 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. కన్నడ సినిమా డైరెక్టర్, నటుడు శంకర్‌నాగ్ 39 ఎపిసోడ్లుడైరెక్ట్ చేయగా ఆ తర్వాత సినీ దర్శకురాలు కవితా లంకేష్ 15 ఎపిసోడ్లు తీశారు. సీరియల్‌కి సంగీతాన్ని అందించింది కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎల్.వైద్యనాథన్. ∙ఆర్.కె.నారాయణ్ సోదరుడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఈ కథలకు స్కెచ్ ఆర్టిస్ట్.ఈ సీరియల్‌కి ప్రొడ్యూసర్లు టి.ఎస్.నరసింహన్, ప్రధాన నటుడు అనంత్నాగ్లు. ∙హిందీ భాషలో వచ్చిన ఈ సీరీస్‌లో చాలా వరకు కర్ణాటక షిమోగా జిల్లాలోని అగుంబే గ్రామంలో షూట్ చేశారు. కొన్ని ఎపిసోడ్లు బెంగళూరు, దేవరాయనదుర్గాలో తీశారు. మాస్టర్ మంజునాథ్, శంకర్‌నాగ్, గిరీష్ కర్నాడ్, అనంత్నాగ్లు ఈ సీరియల్‌తో దేశమంతా పరిచయం అయ్యారు. 2018లో కన్నడ మాల్గుడి డేస్ తెలుగులో అల్ట్రా టీవీలో ప్రసారమైంది. – ఎన్.ఆర్ -
వెలిసిన వర్ణాలు
సుదీప్ తల బొంగరంలా తిరుగుతున్నది. నవడలేకపోతున్నాడు. అద్భుతమైన ఆకుపచ్చ సౌందర్యం కళ్ల ముందు కదలాడుతున్నది. దాని వెనుకనే గుండెను పిండే బాధ, మనసును ముక్కలు చేసే జ్ఞాపకాలు తారాడుతున్నాయి. బిదిత వదనం అతడిని రేయింబవళ్లు వెంటాడుతున్నది. యూనివర్సిటీ చదువు అతనికి విషాదమే మిగిల్చింది. రబ్బరు సేకరించే కార్మికులు వదిలేసిన ఒక ముక్కని సుదీప్ తన చేతిలో నలుపుతున్నాడు. ఆ ముద్ద అతనికి తన దగ్ధ హృదయాన్ని గుర్తు చేస్తున్నది. అది తను చదువుకునే బల్లపై ఉంచితే ఒక జ్ఞాపికలాగా ఉంటుందని భావిస్తున్నాడు. కృతకమైన, క్రూరమైన నాగరికతకు అతి దూరంగా ఈ చిటగాంగ్ మహారణ్యం ఒక దుప్పటిలాగా అతడిని కౌగిలించుకుని తనలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అతడు ఇక్కడే ఊరట పొందగలడు. అతి కష్టం మీద తన ఉద్వేగాలను అదుపు చేసుకున్నాడు. నెమ్మదిగా కొండపైకి ఎక్కుతున్నాడు. అతడికి తెలియకుండానే తన వ్యథకు సంకేతంగా అతడు పదిలపరచుకున్న రబ్బరు ముక్క కింద పడిపోయింది. తన క్లాస్మేట్, తను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన బిదిత ఒక కృతనిశ్చయంతో చెప్పేసింది. ఆమె మాటలు సందీప్ చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ‘‘మనిద్దరి మధ్య అంతరాలు అడ్డుగోడలు ఉన్నాయి. మనం ఈ జన్మలో కలిసి జీవించడం సాధ్యం కాదు. నేను కోరుకున్న జీవితం వేరు.’’ అని తెగేసి చెప్పింది. ఆమె నిజాయితీని శంకించడానికి వీల్లేదు. ఆమె వెనుకనున్న పరిస్థితులు అటువంటివి. ఆమె సుదీప్‌ని మోసం చెయ్యలేదు. కానీ సుదీప్ కోణంలో చూస్తే మరపు అంత తేలికైనది కాదు. శుభప్రియొ ఆదివాసీ. సుదీప్ బెంగాలీ. ఇద్దరూ క్లాస్మేట్లు, రూమ్మేట్లు. బిదిత వియోగంతో సుదీప్ కుంగిపోతున్న స్థితిలో శుభప్రియొ అతని బాధను అర్థం చేసుకున్నాడు. పర్వతాల్లోని తన పురాతనమైన ఇంటికి వచ్చి, తన కుటుంబంతో కలసి ఉండమని కోరాడు. కొంత ఉపశమనాన్ని పొంది, మిత్రుడు గాయాన్ని మరచిపోగలడని భావించాడు. వారిది చాలా పెద్ద కుటుంబం. వివాహితులైన ఇద్దరు అక్కలు వేరే ఊర్లో ఉన్నారు. మూడో సోదరి కజోలికా పట్నంలో చదువుతూ హాస్టల్లో ఉంటున్నది. ప్రస్తుతం ఆమె సెలవులకని ఇంటికి వచ్చింది. పెద్దవాడు శుభప్రియొ. చిన్నవాడు పూర్ణచంద్ర పదేళ్ల వయసు వాడు. ఆ కుర్రవాడే ఇప్పుడు సుదీప్‌కు మిత్రుడూ మార్గనిర్దేశకుడూ అయ్యాడు. పూర్ణచంద్ర తనకు మాత్రమే తెలిసిన మహారణ్యాల అద్భుత రహస్యాలను చెబుతున్నాడు. అంత సుందరమైన నందనాన్ని చూసి సుదీప్ సంబరపడిపోయాడు.‘‘నీకెవరు బాబూ! ఈ పేరు పెట్టారు? పూర్ణచంద్రుడంటే నిండు పౌర్ణమి’ అడిగాడు సుదీప్.పూర్ణచంద్ర ముఖంలో హఠాత్తుగా రంగులు మారిపోయాయి. కన్నుల్లో క్రోధం కదలాడింది. ఒక్కసారిగా చలించిపోయాడు. ‘‘నాకీ పేరు ఠాకూర్‌దా పెట్టాడు’’ అంటూ బిగుసుకుపోయాడు. ‘‘ఆయన్ని వాళ్లు పొట్టన పెట్టుకున్నారు. నేను వాళ్లని చంపేస్తాను.’’ అన్నాడు. మిత్రుడు శుభప్రియొ గత సన్నివేశాల్ని పూసగుచ్చిట్టు వివరించాడు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఆ కుటుంబం వారంతా తల దాచుకునేందుకు కీకారణ్యం లోనికి వెళ్లబోయారు. వృద్ధుడు ఠాకుర్దా నడవలేకపోయాడు. అతడ్ని ఉన్న చోటునే వాళ్లు కాల్చి చంపేశారు. ఆ దృశ్యాన్ని చిన్నవాడైనా పూర్ణచంద్ర కళ్లారా చూసేశాడు. అప్పటి నుంచి పిల్లవాడు మనిషి కాలేకపోతున్నాడు. శుభప్రియొ తమ స్థితిని ఇంకా ఇలా వివరించాడు: ‘‘మేం ఒక యుద్ధ వాతావరణంలో బతుకులీడుస్తున్నాం. మా సమరానికి పగలూ రాత్రీ తేడా లేదు. బెంగాలీ వలస జనం మా నేలని ఒక్కొక్క అంగుళమూ ఆక్రమించుకుంటున్నారు.దాన్ని ఆదీవాసీలం మేం ప్రతిఘటిస్తున్నాం. వారు మమ్మల్ని చంపుతుంటుంటారు. మేం వారి జనావాసాల్ని తగలబెడుతుంటాం. మా జీవితాలు అతలాకుతలమయ్యాయి. ప్రశాంతతని నెలకొల్పడానికి సైనిక పటాలాలు వస్తాయి. అసలు చిక్కంతా వారితోనే. వారి చేతిలో తుపాకులుంటాయి. మా ఆడవారి మానప్రాణాలను వారు హరిస్తున్నారు. మా వారసత్వ సంపదనీ నాగరికతనీ ధ్వంసం చేస్తున్నారు. మా ఆర్థిక వనరుల్ని మట్టిపాలు చేస్తున్నారు...’’ ఈ ధోరణిలో ఇంకా చాలా చెప్పాడు. సుదీప్ నాడులు బిగుసుకున్నాయి. ఒకవైపు బిదిత వల్ల ఏర్పడిన సొంత విషాదముంది. రెండోవైపున సూర్యుడి కింద పిడికెడు నేల కోసం, అంగుళం నీడ కోసం ఈ అశేష ప్రజానీకం సాగిస్తున్న నిరంతర సంఘర్షణ ఉంది. రెండూ మనుగడ కోసం పోరాటాలే. కాని వీరి విషాదంతో పోలిస్తే తన వ్యక్తిగత దుఃఖం అత్యంత స్వల్పమైనది. వీరి ప్రయోజనం కోసం, వీరి పక్షాన నిలబడి, వీర్ని ఉద్ధరించడానికి పోరాటం సాగించడం గొప్ప అంశంగా భావిస్తున్నాడు. సుదీప్ ఒక మహావృక్షం కింద వెల్లకిలా చేరబడి స్తబ్దమవుతున్న తన పంచేంద్రియాలనూ కూడగట్టుకుంటున్నాడు. అంతలో ఒక ఉడుత చెట్టు కొమ్మ నుంచి కిందకు దిగింది. నెమ్మదిగా అతని మీదకు పాకడానికి ప్రయత్నించింది. ఆ పరిసరాలకు కొత్తగా ఉన్న ఆ శాల్తీ వైపు కొన్ని సెకన్ల పాటు చూసింది. సుదీప్ ఊపిరి బిగపట్టాడు. ఈ వన్యప్రాణి తన భగ్నహృదయానికి శాంతినివ్వగలడేమో అనుకున్నాడు. కాసేపు పరిశీలించిన తర్వాత ఉడుత ఈ నరజాతిని నమ్మడం సురక్షితం కాదని నిశ్చయించుకుంది. ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానూ చెట్టెక్కిపోయింది. సుదీప్ నవ్వుకున్నాడు. ఉడుత కూడా తనని తిరస్కరించినట్టు భావించాడు. ఈ స్థలం కూడా ప్రమాదరహితమైనది కాదు. ఏ వైపు నుంచి అయినా ఒక బుల్లెట్ దూసుకు రావచ్చు. పోరు భీకరంగా సాగుతున్నది. కానీ పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నది. మరోసారి బిదిత అమాయకమైన ముఖం అతని మనోఫలకం మీద కనపడి మాయమైపోయింది. ఇంతలో ఒక ధ్వని అతని దగ్గరగా వస్తున్నది. ఒక పక్షి ఆకుల మధ్య నుంచి గొంతు విప్పి అరుస్తున్నది.ఒక పిల్ల తెమ్మెర నెమ్మదిగా వచ్చి అతన్ని లాలించింది. పూర్ణచంద్ర పులిలాగా గాండ్రిస్తూ, పెంకెగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక పశువుల గంట ఉన్నది. ‘‘దీన్ని మీ మెడకు కడతాను’’ అన్నాడు. ‘‘నేను ఆవుని కాదే!’’‘‘మీకు ఈ స్థలం తెలియదు. ఒకవేళ దారి తప్పితే ఈ గంట మిమ్మల్ని గుర్తుపట్టడానికి సహాయం చేస్తుంది.’’‘‘పూర్ణా! నువ్వు నన్ను నమ్మగలవా?’’ సుదీప్ అడిగాడు.క్షణం ఆలోచించకుండా ఆ కుర్రవాడు ‘‘నమ్మను’’ అన్నాడు.‘‘ఎందుకని’’‘‘మీ బెంగాలీలు మా తాతయ్యని చంపారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘శుభప్రియొ దాదాకు మీరంటే ఇష్టం. మీకేదో ఆపద వచ్చిందని చెప్పాడు. అందుకనే బాబా, అమ్మా మీరు మాతో ఉండటానికి అంగీకరించారు. లేకుంటే ఉండనివ్వరు’’ఎంత ద్వేషం? ఎంత అపనమ్మకం? ఇవి సుదీప్ గుండె మూలలకు గుచ్చుకున్నాయి. ఈ పిల్లవాడు అభం శుభంతెలియనివాడు. వాళ్ల తాతని చంపడం స్వయంగా చూశాడు. ఇంకా ఎన్నో అకృత్యాల్ని చూసే ఉంటాడు. ఆ చిన్నారి మనసు కరడుగట్టిపోయింది. ‘‘మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. అప్పుడే మా జనం మీ గురించి గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని పర్వతాల మీద నుంచి కిందకు నెట్టెయ్యాలని అంటున్నారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘ఎందుకు?’’‘‘మీరు మా శత్రువర్గానికి చెందినవారు.’’‘‘ నేను ఎవరికీ శత్రువుని కాను. ఈ కొండల మీద నేను కూడా నివసించి నా సర్వస్వాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను.’’‘‘అదంతా నాకు తెలీదు. వాళ్ల మాటలు మీకు నేను చెబుతున్నాను. ఇక్కడ ఎక్కువ కాలం ఉండొద్దు.’’ పదేళ్ల పూర్ణచంద్ర స్వరంలోని తీవ్రత సుదీప్‌ని చకితుడ్ని చేసింది. మళ్లీ పూర్ణ ఇలా అన్నాడు: ‘‘బాబా మాటికీ గొణుగుతున్నాడు. మీరిక్కడే ఉంటే మిలటరీ వారికి అనుమానం వచ్చి మొత్తం మా పల్లెనే తగులబెట్టేస్తారట.’’ సుదీప్‌కి మరో దెబ్బ తగిలింది. ‘‘తన బాధ నుంచి విముక్తుడు కావడానికి ఇతరుల్ని బాధపెట్టాలా?’’ ఒకవైపు బిదిత వియోగం, రెండో వైపు ఆదివాసీల జీవన్మరణ సమస్య సుదీప్‌ని కుంగదీస్తున్నాయి. పూర్ణచంద్ర ఇలా అన్నాడు: ‘‘ఈ గంటను మీ మెడకు కట్టుకోండి’’ అంటూ ఇంకా ఇలా అన్నాడు. ‘‘దీదీ కజోలికా కూడా మీ ఉనికిని ఇష్టపడటం లేదు.’’‘‘అర్థమైంది. ఆమె... ఆమె.. ఎవర్నైనా ప్రేమిస్తున్నదా?’’‘‘ఔను. రేబొతీ దాదాను ప్రేమిస్తున్నది. అతడు శాంతిబాహినిలో చేరిపోయాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలీదు. అందుకే ఎప్పుడూ ఆమె విచారంగా ఉంటున్నది. త్వరలో ఆమె కూడా చేరబోతున్నది.’’‘‘పోరాటం చేస్తుందా?’’‘‘ఔను. మేం మిలటరీ వారిని మా నేలమీద నుంచి తగిలెయ్యాలి కదా!’’ అన్నాడు పూర్ణచంద్ర.సుదీప్ ఏమనగలడు? ఇక్కడికి రావడం వల్ల తన సొంత బాధ కన్నా మరింత అధికమైన భారం అతని భుజాల మీద పడుతున్నది. పట్నంలో ఉన్నప్పుడు కొండ ప్రాంతాల్లోని అశాంతిని గూర్చి లీలగా విన్నాడు.కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అంతలో ఒక పెద్దవృక్షానికి ఉన్న వేళ్లు కాళ్లకు తగిలాయి. కింద పడిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో చాలా తొందరగా వస్తున్న ఒక జీపు ధ్వని వినపడింది. వెంటనే పూర్ణచంద్ర కూడా సుదీప్ పక్కన నేల మీద బోర్లపడిపోయాడు. ‘‘మీరు కిందపడటం మంచిదైంది. అది మిలటరీ జీపు.’’ అని చెవిలో మెల్లగా అన్నాడు. అక్కడి వృక్షాలు పొదలు వారిని కనపడకుండా చేశాయి.జీపు దగ్గరగా వచ్చి ఆగింది. కాని కనపడలేదు. కొంతసేపటి తర్వాత వెళ్లిపోయిన శబ్దం వినపడింది. సుదీప్ మోకాలికి దెబ్బ తగిలింది. ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆ పిల్లవాడి ముఖంలో ద్వేషాగ్ని కీలల్ని చూసి మాట్లాడలేకపోయాడు. పూర్ణచంద్ర పిడికిలి బిగించాడు. ‘‘నేను మా మహారణ్యంలోని పచ్చని పచ్చికను పట్టి ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదో ఒక రోజున వార్ని చంపి పగ తీర్చుకుంటాను’’‘‘పూర్ణా! మీ దాదా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్లిపోతాను. నన్ను నమ్ము.’’‘‘శుభప్రియొ దాదా మరి చదువు కొనసాగించడు. శాంతిబాహినిలో చేరడానికి నిర్ణయించుకున్నాడు.’’ అంటూ పూర్ణచంద్ర ఇంకా ఇలా అన్నాడు: ‘‘దీదీ కజోలికా వెదురుపొదల వద్ద వేచి ఉంటుంది. మనం ఆమెను కలిసి ఇంటికి వెళ్లిపోదాం.’’‘‘వెదురు పొదల వద్ద ఎందుకు?’’‘‘రేబొతీ వస్తే అక్కడ కలుసుకుంటుంది.’’‘‘అతనెప్పుడొస్తాడో ఆమెకు తెలీదా?’’‘‘తెలీదు. ఆమె కూడా గంట కట్టుకునే ఉంటుంది. దాంతోనే మేం గుర్తుపడతాం. ఇది మా రహస్యం. నాకు దీదీ అంటే చాలా ఇష్టం.’’ఇద్దరూ ఇంకా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ‘‘ఈ ప్రాంతంలో ఏదైనా మిలటరీ ఆపరేషన్ ఉన్నదేమో!’’ అంటూ సుదీప్ పూర్ణచంద్ర భుజాల మీద చేతులు వేశాడు.‘‘కావచ్చు. వారికి దీదీ కనపడితేనే ప్రమాదం’’ పూర్ణచంద్ర కంఠం కటువైపోయింది ఇలా ఒంటరిగా తిరగొద్దని నేను దీదీకి చాలాసార్లు హెచ్చరించాను.’’సుదీప్ పూర్ణచంద్రను దగ్గరగా తీసుకున్నాడు. ‘‘భయపడకు. నేను నీతో ఉన్నాను. మీ దీదీకేమీ కాదు. ఇలాంటి రాత్రి మనకు చంద్రుడు కనిపిస్తాడు. జంతువులు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఇంత నిశ్శబ్దంలో మనం కజోలికా గంటను స్పష్టంగా వినగలం.’’ ‘‘మీరేమంటున్నారు? ఇది రాత్రి కాదు పగలు. ఈ చెట్లు సృష్టినే చీకటి చేసేస్తాయి. మీరు కొత్త ఈ ప్రదేశమంతా నాకు తెలుసు. అందుకే రాత్రి అనిపిస్తున్నది.’’ అని పూర్ణచంద్ర నవ్వాడు. అంతలోనే ఏదో కీడు శంకించిన వాడిలా నవ్వు ఆపేసి, సుదీప్‌ని వెనక్కు నెట్టి ‘‘దీదీ..’’ అని అరుస్తూ పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి సుదీప్ కూడా భయభ్రాంతుడయ్యాడు. పూర్ణ వెనుకనే సుదీప్ కూడా పరుగెత్తాడు. ఈ సరికి పూర్ణచంద్ర బిగ్గరగా ఏడుస్తున్నాడు. వారికి కజోలికా కనపడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్నది. ఆమె దుస్తులు చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె అనాచ్ఛాదితంగా ఉంది. కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవిస్తున్నది.పూర్ణచంద్ర ఆమె దగ్గరగా వెళ్లి అసహాయంగా చేతులూపుతూ అరుస్తున్నాడు ‘‘దీదీ... మాట్లాడ్డం లేదు. కదలడం లేదు. చనిపోయిందా? దీదీ... దీదీ’’అక్కడి మెత్తని నేల మీద జీపు టైలర్ల గుర్తులున్నాయి. జరిగిన క్రూరమైన కథ సుదీప్‌కు అర్థమైంది. కాని ఆ పసివాడికి ఎలా చెప్పగలడు? ఈ దారుణానికి తను ప్రత్యక్ష సాక్షిగా మిగిలాడు.‘‘దీదీకేమైంది? దీదీకేమైంది?’’ పూర్ణచంద్ర పదేపదే ఏడుస్తూ అరుస్తున్నాడు. కజోలికా బోర్లా పడి ఉంది. సుదీప్ తన చేతిని ఆమె వీపు మీద ఆనించాడు. శ్వాస ఆడుతున్నది. అంటే చనిపోలేదు. కాని తీవ్రంగా గాయపడింది. ‘‘పూర్ణా! మీ దీదీకి వెంటనే వైద్యం చేయించాలి. ఆమెను బతికించాలి’’పూర్ణ చెదిరి ఉన్న దుస్తుల్ని ఏరి సుదీప్ చేతికిచ్చాడు. ‘‘ఆమెకు దుస్తులు వెయ్యండి’’ అన్నాడు.‘‘మరి నువ్వేం చేస్తావు?’’‘‘నేను ఆ మృగాన్ని చంపే మార్గం కనుగొంటాను.’’కజోలికాకు ఆచ్ఛాదన ఏర్పరుస్తుండగా సుదీప్‌కు వేళ్లు వణికాయి. కజోలికాను పైకెత్తి భుజాల మీద వేసుకున్నాడు. ఆమెని కుటుంబానికి అందజేయాలి. వైద్యం చేయించాలి. బతికించాలి. ఇంటి వైపు బయల్దేరారు.ఒక్కసారిగా రేబొతీ, తుపాకులు ధరించిన అతని సహచరులూ ప్రత్యక్షమయ్యారు. సుదీప్‌ని అడ్డగించారు.‘‘రేబొతీ దాదా! మీరు ఆలస్యంగా వచ్చారు. వాళ్లు దీదీని చంపేశారు.’’‘‘ఎవరు.. ఎవరు?’’‘‘ఆ జీపులో వచ్చిన వాళ్లు’’‘‘నాకిప్పుడు అర్థమైంది’’ అంటూ రేబొతీ తన తుపాకీని సుదీప్ గుండెకు గురిపెట్టాడు.‘‘వొద్దు.. వొద్దు... ఇతడ్ని చంపొద్దు’’ అంటూ పూర్ణచంద్ర అరుస్తూ అడ్డుపడ్డాడు. ‘‘ఇతడేమీ చేయలేదు. ఇతడు దాదా స్నేహితుడు.’’సుదీప్ రానున్న పరిణామాలకు సిద్ధంగా ఉన్నాడు. ‘‘ముందు ఈమెకు వైద్యం చేయించాలి’’ అన్నాడు.రేబొతీ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. అతని మిత్రులు కూడా తుపాకులు దించి విషాదగ్రస్తులయ్యారు. ‘‘పగ తీర్చుకుంటాం’’ అని ప్రతిజ్ఞ చేశారు.సుదీప్ కజోలికాను ఆమె ఇంటి వైపు మోసుకెళ్లాడు. పూర్ణచంద్ర దుఃఖిస్తూ వెంబడించాడు. వారు చేరే సరికే జనం పోగై ఉన్నారు. శుభప్రియో తిరిగి వచ్చాడు. అతడూ విచక్షణ కోల్పోయాడు. స్నేహాన్ని జాతి విద్వేషం అధిగమించింది. అతని కళ్లు నిప్పు కణికల్లా ఉన్నాయి. సుదీప్ వైపు తిరిగి విషం చిమ్మాయి. ‘‘నువ్వు... నువ్వు... మీ జనం చేసినదానికి నువ్వే మూల్యం చెల్లించాలి..’’ అని అరిచాడు.సుదీప్ మౌనం వహించాడు. తన జాతి మొత్తం చేసిన అకృత్యాలకు సిగ్గుతో తల దించుకున్నాడు.శుభప్రియొ తండ్రి ఒక తాడుని తెచ్చాడు. సుదీప్ వారించలేదు. వారు అతడ్ని ఒక చెట్టుకు కట్టివేశారు. దాన్నీ నిశ్శబ్దంగా భరించాడు. వారి ప్రచండ క్రో«ధాన్ని అర్థం చేసుకున్నాడు. వారేం చేయగలరో అదే చేస్తున్నారు.శుభప్రియొ కూడా నిశ్చయుడైపోయాడు. ‘‘నీ ఒక్కడి బాధ మరచిపోవడం ముఖ్యం కాదు. ఒక నిజమైన బాధ... ఒక జాతి కన్నీటిగాథని నువ్వు తెలుసుకోవాలి... అనుభవించాలి.’’ సుదీప్ మౌనం వహించాడు. శిక్షని అంగీకరించాడు. తలవంచుకున్నాడు. ఒక పండు వెన్నెల రాత్రి నెమ్మదిగా నిబిడ గాఢాంధకారంగా మారింది. బంగ్లా మూలం : సెలీనా హుస్సేన్ అనువాదం: టి.షణ్ముఖరావు -
పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు
పాలకొల్లు అర్బన్: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ బుధవా రం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో జిల్లావాసులు, సినీ అభిమానులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ది గ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగుల నిమిత్తం హరికృష్ణ పలుమార్లు జిల్లాకు విచ్చేశారు. సీతయ్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆత్రేయపురం లాకుల వద్ద చిత్రీకరించారు. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ సినిమా షూటింగ్‌ను రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు జూనియర్ ఆర్టిస్ట్ సరఫరా కాంట్రాక్టర్ కె.అన్నపూర్ణ తెలిపారు. ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి షూటింగ్‌లకు వినియోగించే వ్యాన్‌ను చైతన్య రథంగా మార్చి రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో ఆ వాహనానికి డ్రైవర్‌గా నందమూరి హరికృష్ణ తొలిసారి పాలకొల్లు విచ్చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి ఆకివీడు, ఉండి, భీమవరం మీదుగా పాలకొల్లు వచ్చినట్టు అభిమానులు చెబుతున్నారు. అప్పుడు సామాన్య కార్యకర్తగా హరికృష్ణ గ్రౌండ్లో నిలబడి తండ్రి రామారావు ప్రసంగాన్ని ఆలకించారని ఆనాటి సీనియర్ టీడీపీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పాలకొల్లు కెనాల్ రోడ్డు మీదుగా మార్టేరు వెళుతుండగా చైతన్యరథాన్ని నడుపుతున్న హరికృష్ణను చూసినట్టు పట్టణానికి చెందిన రామా స్టూడియో నాయుడు తెలిపారు. తాను అప్పుడు ఆర్ఎంసీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నానన్నారు. ఎర్రవంతెన వద్ద చైతన్యరథం ఆపి కొబ్బరి జట్టు కార్మికులతో ఎన్టీఆర్ ముచ్చటించారని చెప్పారు. మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి పోడూరు మండలం వేడంగిపాలెం సర్పంచ్‌గా పనిచేస్తున్న తాను టీడీపీలో చేరినట్టు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. ఆ సమయంలో తొలిసారిగా హరికృష్ణను చూశానన్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలోనూ అన్న ఎన్టీఆర్ చైతన్యరథానికి హరికృష్ణ సారథిగా ఉండి రెండోసారి పాలకొల్లు వచ్చారు. లాహరి.. లాహిరి.. లాహిరిలో.. చిత్ర విజయోత్సవాలు పాలకొల్లు మారుతి థియేటర్లో నిర్వహించారని, ఆ వేడుకలకు హరికృష్ణ హాజరయ్యారని పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ సిలార్ చెప్పారు. స్ఫూర్తిప్రదాత.. హరికృష్ణ పాలకొల్లు సెంట్రల్: రథసారథిగా రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్‌ను సీఎం పీఠం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అనంతరం జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల్లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో రథయాత్రను కొనసాగించారు. ఆ రథయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇం టి వెంకటరెడ్డి అనే వ్యక్తి హరికృష్ణ యాత్రలో వె న్నంటి ఉండి విజయవంతం చేసినట్టు చెప్పారు. రథయాత్రను నరసాపురం నుంచి ఏనుగువానిలంక, యలమంచిలి, మేడపాడు ప్రాంతాల్లో తిరిగి అనంతరం పాలకొల్లు గాంధీబొమ్మల సెం టర్లో జరిగిన సభలో హరికృష్ణ మాట్లాడారు. మార్టేరు, పెనుమంట్ర మీదుగా వీరవాసరం వర కూ హరికృష్ణ యాత్ర కొనసాగింది. అన్న టీడీపీలో తనను జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అప్పట్లో హరికృష్ణ ప్రకటించినట్టు వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయనతో అనుబంధం స్ఫూర్తినిచ్చిందని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. 1996లో కురెళ్లగూడెంలో.. భీమడోలు: భీమడోలు మండలం కురెళ్లగూడెంలో 1996లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు. అప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం వైఎస్సార్ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. నాటి స్మృతులను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. పసలతో సాన్నిహిత్యం తాడేపల్లిగూడెం: హరికృష్ణకు టీడీపీ సీనియర్ నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లో ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు ఎన్టీఆర్‌కు విధేయుడిగా, హరికృష్ణకు సన్నిహితుడిగా మెలిగారు. 1995లో హరికృష్ణ టీడీపీ మంత్రి వర్గంలో మం త్రిగా ఉన్న సమయంలో పసల ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరికృష్ణతో కలిసి రాష్ట్రమంతా తాను పర్యటించానని, హరికృష్ణ మరణం తీరనిలోటని పసల కనకసుందరరావు అన్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు లండన్ నుంచి సంతా పం తెలిపారు. హరికృష్ణతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. -
అభిమాన సీతయ్య
ఈ వేలు మా నాన్నలో పవర్.. ఈ వేలు నాలోని పొగరు.. రండి రా.. రండి... నువ్వు చంపితే అన్ లీగల్.. నేను చంపితే లీగల్..’’ ‘‘అరవకు.. అరచి నీ ఆధిక్యాన్ని ప్రదర్శించకు’’ అంటూ పవర్ఫుల్ డైలాగులతో అదరగొట్టాలన్నా.. బస్కెక్కి వస్తాను.. బండెక్కి వస్తాను.. కారెక్కి వస్తాను.. లారెక్కి వస్తాను.. రాముడై వస్తాను.. భీముడై వస్తాను.. కాముడై వస్తాను.. కృష్ణుడై వస్తానూ.. అంటూ స్టెప్పులతో అభిమానులను ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో.. ఎక్కడికో తీసుకు వెళ్లడం ఆయనకే దక్కింది. ‘సీతయ్య’.. ఎవ్వరి మాటా వినడు.. అవును! నిజమే ఆయన ముక్కుసూటి మనిషి. అందుకే ఎవ్వరి మాటా వినేవారు కాదు. మనసులో ఏదనుకుంటే అదే. ఏ విషయంలోనూ నో కాంప్రమైజ్. అందుకే ఆయనంటే ఆ తారకరామారావుకు అమితమైన ఇష్టం. ఆయన చైతన్యరథానికి హరికృష్ణనే సారధిగా చేశారు. నందమూరి అభిమానులకు ఆయన ‘టైగర్’ హరిశ్చంద్ర ప్రసాదే.. తాతమ్మ కలతో సినీ కళారంగంలోకి అడుగుపెట్టిన ఆయన శ్రీరాములయ్యగా అందరి మన్ననలు పొందారు. దానవీరశూరకర్ణలోనూ నటించి.. సీతారామరాజు, శివరామరాజులతో జతకట్టి.. స్వామిగా శ్రావణమాసంలోనూ అలరించారు. సినీ ప్రముఖుడిగా, రాజకీయ వేత్తగా పేరొందిన నందమూరి హరికృష్ణతో జిల్లావాసులతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆయన తనయుడు జానకీరామ్‌కు కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకర చౌదరి కుమార్తెతో వివాహం జరిపించారు. హరికృష్ణ కుమార్తెను సైతం కాకినాడే ఇచ్చారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు జిల్లాలోనే చిత్రీకరించారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారన్న వార్తను జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. వేళంగిలో విషాదఛాయలు కరప: మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తనయుడు, మాజీ మంత్రి, సినీనటుడు నందమూరి హరికృష్ణ అకాల మరణంతో కరప మండలం వేళంగిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి వేళంగి గ్రామానికి అనుబంధం ఉంది. హరికృష్ణ తనయుడు జానకిరామ్ వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకరచౌదరి కుమార్తె ప్రభాదీపికను వివాహమాడారు. ఈ వివాహం కాకినాడలోని టీటీడీ కళ్యాణమండపంలో జరిగింది. అప్పటి నుంచి హరికృష్ణ కుటుంబ సభ్యులు వేళంగి వస్తూ, పోతూ ఉండేవారు. 2014లో డిసెంబర్లో జానకిరాం జిల్లాకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభాదీపిక, ఆమె ఇద్దరు కుమారులు తారక రామారావు, సౌమిత్ర ప్రభాకర్‌లు హరికృష్ణ కుటుంబం వద్దే ఉంటున్నారు. కాగా 2016లో డిసెంబర్ 24వ తేదీన మాజీ మంత్రి హరికృష్ణ, ఆయన సతీమణి, కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు వేళంగిలో నిర్వహించిన హరికృష్ణ మనుమల పంచెకట్టు కార్యక్రమంలో పాల్గొని వేళంగిలోనే గడిపారు. హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న బంధువులు అందరూ బుధవారం వేళంగి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హరికృష్ణ గ్రామానికి వచ్చి కలుసుకున్న సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమకూ వచ్చేవారు.. మామిడికుదురు: హరికృష్ణకు కోనసీమతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన ఇంటిలో ఏ శుభ కార్యక్రమమైనా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించేవారు. 2012లో జూనియర్ ఎన్టీఆర్ వివాహం కూడా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. హరికృష్ణ రెండు పర్యాయాలు కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. 2013లో ఇక్కడికి వచ్చిన సందర్భంలో రోడ్ల అధ్వాన పరిస్థితి గమనించి మొగలికుదురులో సిమెంట్‌రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.ఆరులక్షలు కేటాయించారు. 2013లో కోటేశ్వరరావు ఇంటికి వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : కోటేశ్వరరావు ‘‘హరికృష్ణ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాతోపాటు మా కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా మాట్లాడేవారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు కేన్సర్ రోగులను ఆయన సహకారంతోనే హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాం. ఆయన మరణం మాకు తీరనిలోటు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాను’’ అని కోటేశ్వరరావు ‘సాక్షి’కి వివరించారు. మండలానికి నిధులు.. కడియం: కడియం ప్రాంతంలో మాజీ మంత్రి నందమూరి హరికృష్ణకు అనుబంధముందని స్థానిక అభిమానులు, నాయకులు గుర్తు చేసుకున్నారు. మండలంలోని మురమండ గ్రాంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలుకు రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి రూ.ఎనిమిది లక్షలు కేటాయించారని టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి రామారావు తెలిపారు. అలాగే ఏఎంజీనగర్లోని కమ్యూనిటీహాలుకు ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా రూ.రెండున్నరలక్షల నిధులు మంజూరు చేశారని వివరించారు. 2010లో గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హరికృష్ణ వచ్చినప్పుడు పది ఎండ్లబళ్లను ఏర్పాటు చేసి, వాటిపై గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. చందన రమేష్ రూరల్ ఎమ్మెల్యేగా ఉండగా ఆ కార్యక్రమంలో ప్రస్తుత హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు తదితరులు కూడా పాల్గొన్నారని ప్రత్తిపాటి వివరించారు. అలాగే హరికృష్ణ రవాణా శాఖామంత్రిగా ఉన్న సమయంలో కడియం మండలం వెంకాయమ్మపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలు ఇరవై మంది వరకు మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి హరికృష్ణ చేరుకున్నారన్నారు. మృతులకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు, ఆర్టీసీ ద్వారా వారికి అందాల్సిన నష్టపరిహారం వేగంగా వచ్చేలా ఆయన చొరవతీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కడియం ప్రాంత నర్సరీ రైతులతో ఆయనకు పరిచయాలున్నాయని, పలు మార్లు ఆయన నర్సరీలను సందర్శించారని అభిమానులు తెలిపారు. గోదావరి జిల్లాతో హరికృష్ణ అనుబంధం రాజమహేంద్రవరం కల్చరల్: కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంతో హరికృష్ణకు అనుబంధం ఉంది. నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థా«పించినప్పుడు, ఆయన చైతన్యరథానికి సారధి హరికృష్ణ. 1982 జులై మూడో తేదీన ఎన్టీఆర్ కాకినాడకు వచ్చినప్పుడు ఆనందభారతి గ్రౌండ్స్‌లో బహిరంగసభ జరిగింది. ఆ సమయంలో హరికృష్ణ చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. హరికృష్ణ నటించిన సీతారామరాజు షూటింగ్ నగరంలో జరిగింది. లాహిరి లాహిరి.. లాహిరిలో, సీతయ్య సినిమాలు కూడా ఈ జిల్లాలోనే షూటింగ్ జరుపుకున్నాయి. ఎంతో హుందాగా ఉండేవారు. ‘‘నందమూరి హరికృష్ణ అకాలమరణం బాధాకరం. ఆయనతోపాటు‘ సీతయ్య’ సినిమాలో నటించాను. హరికృష్ణ ప్రవర్తన ఎంతో హుందాగా ఉండేది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అని జిల్లా సినీ జూనియర్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు, ‘మా’ కార్యవర్గసభ్యుడు, నటుడు, గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా తెలిపారు. నేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతం : హరికృష్ణ పిఠాపురం, కొత్తపల్లి: అచ్చుగుద్దినట్టు వివిధ కళారూపాలను నేత ద్వారా నేస్తున్న ఉప్పాడ చేనేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతమని ప్రముఖ సినీనటుడు హరికృష్ణ ప్రశంసించారు. ఆయన గత జనవరిలో కొత్తపల్లికి చెందిన చోడిశెట్టి చినబాబు ఉప్పాడలో ఏర్పాటు చేసిన భువనశ్రీ జాంధానీ చీరల విక్రయ కేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడికి వచ్చారు. తన కుమార్తె సుహాసినీని కాకినాడకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. సుహాసిని కుమారుడు హర్ష, చినబాబు కుమారుడు వినయ్ స్నేహితులు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హరికృష్ణ విచ్చేసి అభిమానులతో సందడిచేశారు. తన కుమారుడు జూనియర్ ఎన్టీర్ వివాహానికి తన కోడలికి ఇవ్వడానికి జాంధానీ చీరలనే కొనుగోలు చేసినట్టు ఆయన అప్పట్లో చెప్పారు. నందరాడలో ‘సీతారామరాజు’ చిత్రీకరణ రాజానగరం: నాగార్జునతో కలిసి హరికృష్ణ నటించిన సీతారామరాజు సినిమా గ్రామీణ నేపథ్యంలోనిది కావడంతో షూటింగ్ ఎక్కువగా నందరాడ, దోసకాయలపల్లిలో జరిగింది. 1998లో ఈసినిమా షూటింగ్ చూసేందుకు వచ్చే అభిమానులను ఇద్దరు హీరోలు ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. హరికృష్ణ మాత్రం ఏదో ఒక వరుస పెట్టి పలకరించడం ఈ ప్రాంతవాసులను కట్టి పడేసింది. నందరాడలోని రైస్ మిల్లు, పంట పొలాల్లో తీసిన సన్నివేశాల్లో స్థానికులు కూడా నటించడంతో హరికృష్ణ జ్ఞాపకాలను వారు నెమరువేసుకుంటున్నారు. విజయయాత్రలో భాగంగా కాకినాడకు.. కాకినాడ కల్చరల్: సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణంపై కాకినాడ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 2002లో విడుదలైన లహిరి లాహిరి లాహిరిలో చిత్రం విజయ యాత్రలో భాగంగా స్ధానిక చాణుక్య థియేటర్‌కు హరికృష్ణ విచ్చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలరించారని శ్రీలక్ష్మీ థియేటర్ మేనేజింగ్ పార్టనర్ పి.శ్రీనివాస్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. చిత్ర విజయవతం చేసిన ప్రేక్షకులకు,అభిమానులను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని ఆయన అన్నారు. చిత్ర బృందానికి హెలికాన్ టైమ్స్(నాగమల్లితోట జంక్షన్)లో వసతి ఏర్పాటు చేసామని తెలిపారు. అంతేకాకుండా హరికృష్ణ స్వయంగా చిత్ర బృందం ప్రయాణించే వాల్వో బస్‌ను డ్రైవ్ చేసి హెలికాన్ టైమ్స్‌కు చిత్రబృందాన్ని తీసుకెళ్లారని ఆయన తెలిపారు. హరికృష్ణతో గడిపిన కొద్దిపాటి సమయం కూడా తన జీవితంలో మరిచిపోలేనిదని పి.శ్రీనివాస్ తనకు హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’కి తెలిపారు. చిత్ర బృందంలో చిత్రం íహీరో ఆదిత్య ఓం, హీరోయిన్ సంఘవి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. హరికృష్ణ అకస్మిక మరణాన్ని నగరంలో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణం తీరలని లోటని వాపోతున్నారు. -
ఆ పలకరింపు మరువలేం...
లక్నో : లోక్‌సభ సభ్యుడిగా తాను ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్నో అంటే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధముంది. లక్నోకే ప్రతిష్టాత్మకంగా మారిన 24 కి.మీ ఔటర్‌రింగ్‌రోడ్డు లాంటి ’పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ హై’ను అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. అమరుల మార్గం (షహీద్ పథ్) పేరుతో నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ’షహీద్ పథ్ అనేది లక్నోకు వాజ్‌పేయికి ప్రత్యక్షంగా ఇచ్చిన పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగానూ స్వర్ణ చతుర్భుజిని నిర్మించింది ఆయనే. అంతకుముందు లక్నోలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తాను వాజ్‌పేయిని కలుసుకోవడం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని రతన్‌కుమార్ అనే వ్యాపారవేత్త చెప్పారు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా పలకరించడంతో పాటు, ఏ సమస్య మీద అయినా ఆయనను సులభంగా కలుసుకునేందుకు వీలుండేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ’పార్టీ అవసరాలు, ఫ్రస్తావన పక్కన పెడితే వాజ్‌పేయికి ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదు. ఈ రోడ్డుపై ఏ మతానికి చెందిన వారైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడగలరేమో చూపించండి ’ అని అక్కడి దుకాణదారు తేజ్‌బహదూర్ వ్యాఖ్యానించాడు.’ మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి ప్రభుత్వ పాలన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుత బీజేపీకి, వాజ్‌పేయి కాలం నాటి బీజేపీకి ఎంతో వ్యత్యాసముంది’ అన్నది పాత సామాన్ల కొనుగోలు వ్యాపారి షంషేర్ అలీ అభిప్రాయం. రాజకీయ ప్రత్యర్థులు వచ్చేవాళ్లు... చిన్న పిల్లాడిగా తన తండ్రి ద్విచక్రవాహనం లూనాపై లక్నోలో జరిగిన వాజ్‌పేయి ర్యాలీకి హాజరైన అనుభవాన్ని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్‌శర్మ గుర్తుచేసుకున్నారు. ’చలికాలం రాత్రి 11.30 గంటలకు వాజ్‌పేయి ప్రసంగం మొదలుకాగా, దుప్పటిలో ముఖాన్ని పూర్తిగా కప్పుకున్న ఓ వ్యక్తిని మా నాన్న గుర్తుపట్టి దానిని లాగేశారు. సిద్ధాంతాల రీత్యా జనసంఘ్‌ను వ్యతిరేకించే ఆ వ్యక్తి పేరున్న కమ్యూనిస్టు నేత, పైగా ముస్లిం. జనసంఘ్‌లో ఏమైనా చేరుతున్నారా అంటూ మా నాన్న అడిగిన ప్రశ్నకు అరే అటువైపు చూడండి ప్రముఖ సమాజ్‌వాది సిద్ధాంతకర్త కూడా వాజ్‌పేయి ప్రసంగం వినడానికి ముసుగు ధరించి వచ్చారు అంటూ అటువైపు చూపారు’ అని దినేశ్‌శర్మ తెలిపారు. సంఘ్ కార్యకలాపాలు, సిద్ధాంతాలు వ్యతిరేకించే ఇతర పార్టీల వారికి కూడా వాజ్‌పేయి ఎలా ఆమోదయోగ్యుడో తెలిపేందుకు ఈ ఉదంతం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. -
అరటి పువ్వు
తరచుగా పశ్చాత్తాపమనే భావన నన్ను కుదిపివేస్తుంటుంది. నాకేదో జబ్బు చేసినట్లుంది. నాలో జ్ఞాపకాలేవీ మిగలడం లేదు. అందుకే ఈ డైరీ రాయడం మొదలుపెట్టాను. నా స్మృతులు పూర్తిగా చెదిరిపోతే, ఈ రాతల నుండి నన్ను నేను కనుగొనవచ్చని నా ఆశ. అయితే ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో నాకు తెలియదు. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారంతో పోరాడేందుకు చేసే చిన్న ప్రయత్నమిది. అయినా ఒక్కోసారి నన్ను బాధ కమ్మేస్తుంది. ఈ విశాలమైన, రంగురంగుల లోకానికి నేను త్వరలో పాతకాలపువాడిలా, పనికిరానివాడిలా, దండగమారిలా మారిపోతానని ఆ బాధ నాకు చెబుతుంది. ఈ ప్రశ్నే జవాబు దొరికేవరకూ నా మెదడును తొలిచేసింది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం నాకు నేనే మాత్రం ఊహించని వ్యక్తి నుంచి దొరికింది. కూరల రామయ్య. చిన్న చెక్క బండి మీద కూరలు తెచ్చి అమ్ముతుంటాడు. మా ప్రాంతానికి ఎప్పటి నుండి వస్తున్నాడో నాకు గుర్తు కూడా లేదు. నాకు గుర్తున్నంతవరకు... మేం ఈ నగరానికి వచ్చి, ఈ అపార్టుమెంట్లో దిగినప్పటి నుంచి నేను అతన్ని చూస్తున్నాను. అంటే నా చిన్నప్పటి నుంచి! కూరల రామయ్య మా హౌసింగ్ సొసైటీ నివాసులకు అప్పటి నుంచి కూరలు అమ్ముతూనే ఉన్నాడు. అతని వయసు ఎనభైకి పైగానే ఉంటుందేమో, చాలా ఏళ్ళ నుంచి మాకు కూరగాయలు అమ్ముతున్నాడు మరి! అయితే నిన్నటి వరకూ కూరల రామయ్య వచ్చి వెళ్ళడం గురించి నేనేమీ పట్టించుకోలేదు. మా ఇంటి చుట్టూ జరిగే అనేకానేక సాధారణ వ్యవహారాల్లో ఇదీ ఒకటి అని వదిలేశాను. అతని గురించి పెద్దగా ఆలోచించను కూడా లేదు. నేను అతన్ని దాదాపుగా ప్రతీ రోజూ చూస్తుంటాను. కూరలు నిండిన అతడి బండిని రోజూ చూస్తుంటాను. కానీ నేనెప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఈ రోజు ఉదయం నేను కిటికీ దగ్గర నిలుచున్నప్పుడు కూరల రామయ్యని చూశాను. నాలో ఏదో వింత కుతూహలం కలిగింది. అతన్ని ఆగమని చెప్పి, కిందకెళ్ళాను. రామయ్యని ఎప్పుడూ ఇంత నిశితంగా పరిశీలించలేదు. ఈ రోజు పరిశీలించాను. మనిషి కొద్దిగా పొట్టిగా ఉన్నాడు. బహుశా ఐదున్నర అడుగుల ఎత్తుంటాడేమో. బక్క పలచని శరీరం. వయోభారాన్ని మోస్తున్న కారణంగా అతని చర్మం ముడతలు పడింది. అయితే అతని శక్తి, ఆ ఉచ్ఛ స్వరం ఆ వృద్ధుడి ప్రత్యేకతలుగా ఎంచాలి. వీధుల వెంట అరుస్తూ అమ్మేటప్పుడు అతని కదలికలు, అతని హావభావాల శక్తికి నేను అబ్బురపడ్డాను. ‘‘రామయ్యా, నేను నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ వయసులో నీ శక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అన్నాను.రామయ్య చిన్నగా నవ్వి, నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు. అతని బండిలోని కొన్ని కూరలని అటూ ఇటూ కదిపాను. అతనితో సంభాషణ కొనసాగించాలి కదా మరి! కొన్ని కూరలు కొన్నాను కూడా. అతని ముఖంలో తృప్తి లీలగా దర్శనమిచ్చింది. ఉన్నట్టుండి నాకది గుర్తొచ్చింది. ‘‘రామయ్యా! ఓ విషయం గురించి నాలో నేను తెగ ఆలోచిస్తుంటాను కానీ ఈ రోజు నేను నిన్ను అడిగేస్తాను. ఎందుకు నువ్వు రోజూ అన్ని అరటి పువ్వులు తెస్తావు? నాకు గుర్తున్నంత వరకూ నీ బండిని ఏ రోజూ అరటి పువ్వులు లేకుండా చూడలేదు నేను. దీనికేదైనా ప్రత్యేకత ఉందా?’’ అని అడిగాను. నాకేసి చూసి నవ్వాడు రామయ్య. సావకాశంగా మాట్లాడసాగాడు. ‘‘బాబూ, ఈ అరటి పువ్వు వెనకాల ఓ కథ ఉంది. అది కేవలం ఓ కూరగాయ కాదు. వినాలని ఉందా?’’నాకు సరదాగా అనిపించింది. ఒప్పుకున్నాను. రామయ్య తన చిన్న ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ‘‘బాబూ, అరటి పువ్వు మనకెన్నో నేర్పిస్తుంది! దాన్ని రోజూ నేను అమ్మడానికి మాత్రమే బండిలో ఉంచను, నాకు స్ఫూర్తినివ్వడానికి ఉంచుతాను. అరటి చెట్టు ఈ అరటి పువ్వు నుంచే పుడుతుంది. అరటి చెట్టు ఎన్నటికీ వృథా కాదు. అరటి చెట్టులోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడేదే! పోషక విలువలు కావచ్చు లేదా ఇంటి అవసరాలకు కావచ్చు! పైగా కొత్త చెట్ల పుట్టుకకి కారణం, ప్రతీ అరటి చెట్టుకు పూసే ఈ అరటి పువ్వే! తను పుట్టి మళ్ళీ ఇంకో చెట్టుకి జన్మనిస్తుంది.’’అతని మాటలకి నా పెదవులపై చిరునవ్వు మొలిచింది. నేను మౌనంగా వినసాగాను. ‘‘బాబూ, ఇప్పుడు నాకు ఎనభై ఏడేళ్ళు. నేను ఐదేళ్ళ వయసు నుంచి నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. మొదట్లో మా అమ్మ కోసం, తర్వాత నా భార్యా పిల్లల కోసం... ఇప్పుడు నా కొడుకు పిల్లల కోసం...’’ అంటూ ఒక్క క్షణం ఆపాడు. మళ్ళీ చెప్పసాగాడు ‘‘నా కొడుకు సముద్రంలో చేపలు పట్టేవాడు. ఓ రోజు సముద్రం వాడిని మింగేసింది. భార్యని, ఇద్దరు పసిబిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు. నా భార్య కిందటేడు చనిపోయింది. అయితే నేనిప్పుడు విశ్రాంతి తీసుకోడానికి కుదరదు. నన్ను నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి. నేను పనికిరాకుండా పోకూడదు. నేను అరటి పువ్వులా ఉండి నా కోడలికి, మనవలకి జీవిక కల్పించాలి. నా బండిలో ఉంచే అరటి పువ్వులు నాకు నిరంతరం శక్తినీ, స్ఫూర్తిని ఇస్తాయి. నేనింకా పనికిరాకుండా పోలేదని గుర్తు చేస్తాయి. నేనలా ఎప్పటికీ కాలేను....’’ కూరల రామయ్య తన బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ నేనక్కడే ఫుట్‌పాత్‌పై నిలబడి రామయ్య చెప్పినదాని గురించి ఆలోచిస్తున్నాను. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారమనే ప్రతికూల భావన ఇప్పుడు నా మనసులోంచి తొలగిపోయింది. రామయ్య కథ, అరటి పువ్వు స్ఫూర్తి నా కళ్ళు తెరిపించాయి. ‘ఏమైనా కానీ, నన్ను నేను వృథా చేసుకోను. చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. నేను కూడా అరటి పువ్వు లాంటి వాడినే. ఏం జరిగినా నిరుపయోగం కాను!’రోడ్డు చివర్లో రామయ్య ఆకారం, అతని బండి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అతని కీచుమనే దృఢమైన గొంతు మాత్రం స్పష్టంగా వినబడుతోంది. నేను చిన్నగా నవ్వుకున్నాను. తృప్తి నిండిన మనసుతో ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆంగ్లమూలం : ప్రసూన్ రాయ్ అనువాదం: కొల్లూరి సోమ శంకర్ -
గూఢచర్యంలో తీపి గుర్తులు
భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించుకుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి కీలక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోగల వనీ, మన ఊహకు అందని రీతిలో తరచూ అవి జరుగుతూ ఉంటా యనీ, ఆఖరికి ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనూ అలాంటి ఘటనలు సాధ్యమేననీ చెప్పే విధంగా గూఢచర్యం చరిత్ర రుజువులతో సహా నిండి ఉంది. వైరి శిబిరాల ప్రతినాయకులు కలుసుకున్నారు, చర్చించుకున్నారు, పరస్పరం గౌరవాభిమానాలను పెంపొందించుకు న్నారు. కొన్ని సమయాలలో వ్యక్తిగతంగా ప్రేమాభి మానాలు కూడా కురిపించుకున్నారు. మన దాయాది దేశాల గూఢచర్య వ్యవస్థల అధిపతులు– రా అధిపతి ఏఎస్ దౌలత్, ఐఎస్ఐ అధినేత అసద్ దురానీల మధ్య నమ్మితీరవలసిన రీతిలో జరిగినట్టు చెబు తున్న ఉమ్మడి కృషి గురించి వెల్లడించిన సంద ర్భంలో భారత్ పాకిస్తాన్ మీడియా ఆనందోత్సాహా లలో మునిగి తేలుతున్నది. ఈ వారం ఈ అపూర్వ మైన అంశం గురించి చర్చించడానికి కారణం అదే. చెప్పుకోదగిన ఇలాంటి చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన వారు పత్రికా రచయిత ఆదిత్య సిన్హా. నిజానికి ఈ రెండు దేశాల గూఢచారి వ్యవస్థల అధిపతులు (లేదా ఎన్ఎస్ఏలు) వివిధ అంశాల గురించి చర్చించడానికి సుదూర ప్రాంతాలలో (థాయ్‌లాండ్ అయితే సౌకర్యంగా ఉంటుంది) కలుసుకుంటూ ఉంటారన్నది తెలిసిన విషయమే. ఈ పుస్తకంలో కదలించే కథనం ఒకటి ఉంది. వీసా నిబంధనలను ఉల్లంఘించి, ముంబై విమానాశ్ర యంలో పోలీసులకు దొరికిపోయిన అసద్ దురానీ కుమారుడికి రా ఎలా సహాయ సహకారాలు అందిం చినదీ ఆ కథనం చెబుతుంది. అతడు ఐఎస్ఐ మాజీ అధిపతి కుమారుడన్న వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం కూడా వారు ఎవరికీ దక్కనీయలేదు. అప్పటికి దురానీ పదవీ విరమణ చేసి చాలా కాలమే అయింది. కానీ దౌలత్‌కు దురానీ అంటే ఎంతో గుడ్ విల్ ఉంది. దౌలత్ ఆనాటి రా సంస్థ అధిపతి రాజిం దర్ ఖన్నాతో మాట్లాడారు. మన గూఢచారి వ్యవస్థ అధిపతులు కొందరు పదవులలో ఉండగానే రహస్య సంభాషణలు జరిగాయి. రాజీవ్‌గాంధీ హయాంలో రా సంస్థ సంచాలకునిగా పనిచేసిన ఆనంద్వర్మ చని పోవడానికి కొంచెం ముందు ‘ది హిందు’ అభిప్రా యవేదికలో విభ్రాంతికరమైన నిజాలను వెల్లడిం చారు. అవి పేరుమోసిన లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్‌తో ఆయన జరిపిన రహస్య చర్చల వివరాలే. గుల్ అప్పటి ఐఎస్ఐ అధిపతి. ఈ చర్చలు ఎక్కు వగా విదేశాలలో జరిగినవే. తరువాత పబ్లిక్ ఫోన్ల ద్వారా జరిపినవి. సంకేత భాష, సంకేతాల సాయంతో ఆ చర్చలు జరిగాయి. ఈ చర్చలలో సియాచిన్, కశ్మీర్ వివాదాలలోని తీవ్రతను తగ్గిం చాలని ఆ ఇద్దరు అభిప్రాయపడ్డారు. గుల్ తన పట్ల నమ్మకం కుదిరేటట్టు చేయడానికి ఒక కోవర్ట్ ఆపరే షన్ కూడా నిర్వహించాడు. సిక్కు సైనిక పటాలా లకు చెందిన నలుగురుని అతడు భారత్‌కు అప్ప గించాడు. ఈ నలుగురు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత పాకిస్తాన్ వైపు ప్లేటు ఫిరాయించి భారత్‌లో తిరుగుబాటుకు ప్రయత్నించి నవారు. నిజానికి ఈ ప్రక్రియ రాజీవ్‌గాంధీ ఆశీస్సులతో జనరల్ జియా ఉల్ హక్ చొరవతోనే ఆరంభమైంది. మొదటి సమావేశంలో రాజీవ్‌గాంధీ జోర్డాన్ యువ రాజు హసన్ పలుకుబడిని ఆశించారని కూడా వర్మ రాశారు. యువరాజు రాజీవ్ వ్యక్తిగత మిత్రుడు (ఆ కాలంలో రాయల్ జోర్డాన్ ఎయిర్ లైన్స్‌ను దేశంలోకి అనుమతిస్తూ హక్కు కల్పించారనీ, అందుకు యువ రాజు రాజీవ్‌కు ఒక ఫ్యాన్సీ కారు బహూకరిస్తున్నా రనీ వివాదం చెలరేగింది). హసన్‌కు పాకిస్తాన్లో కూడా చాలా పలుకుబడి ఉంది (ఆయన భార్య పాక్ సంతతికి చెందినవారు). అయితే ఇదంతా జనరల్ జియా హత్యకు గురి కావడంతో నిలిచిపోయింది. ఈ శాంతి ప్రక్రియ పట్ల వ్యతిరేకంగా ఉన్న కొందరు జియా సైనిక సహచరులే ఆ హత్యకు పాల్పడ్డారని వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కలసి ఒక కుట్ర సిద్ధాం తాన్ని మన ముందు ఉంచుతాయి. నిస్సందేహంగా వర్మ అత్యంత జాగరూకత కలిగిన అధికారి. దాదాపు మూడు దశాబ్దాలు వేచి ఉండి అప్పుడు బహిర్గతం చేశారు. గుల్ వెల్లడించిన వివరాలే వర్మను ఆ రహ స్యాలను బయటపెట్టడానికి ప్రేరణ కలిగించి ఉండ వచ్చు. వర్మ తన జ్ఞాపకాల విషయంలో నిజాయితీగా ఉంటూవచ్చారని నేను నమ్ముతున్నాను. వరుసగా జరిగిన అలాంటి ట్రాక్–2 సమావేశాలకు నేను హాజ రయ్యాను. వీటిలో బలూసా గ్రూప్ పేరిట జరిగిన సమావేశానికి అమ్మాన్లో రాజు హసన్ ఆతిథ్యమి చ్చారు. ఈ భేటీలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.కౌల్, ఆయన సోదరుడూ, కేబినెట్ మాజీ సెక్రటరీ, అమెరికాలో భారత రాయబారి పి.కె. కౌల్ పాల్గొనేవారు. లెఫ్టినెంట్ జనరల్ సతీష్ నంబియార్, పాకిస్తాన్ మాజీ ఆర్మీ వైస్–చీఫ్ జనరల్ కె.ఎమ్. అరిఫ్, పాక్ ప్రముఖ పారిశ్రామికవేత్త బాబర్ ఆలీ ఈ సమావేశాల్లో సందర్భానుసారం పాల్గొనేవారు. ఈ బృంద సభ్యుల్లో అత్యంత నిజాయితీపరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ మహ్మద్ దురానీ. అత్యంత వివేచన, ఆశావాది, సైనికతత్వం కలిగిన ఇలాంటి పాకిస్తానీ జనరల్‌ని మీరు ఎన్నడూ చూసి ఉండరు. పాకిస్తాన్ మీడియాలోని కమాండో–కామిక్ తరహా వ్యాఖ్యాతలు ఈయనను ‘జనరల్ శాంతి’ అని అభివర్ణించేవారంటే ఆశ్చర్యం కలిగించదు. తర్వాత 2008లో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతల్లో ఉన్నప్పుడు, కసబ్ పాకిస్తానీ జాతీయుడే అని అంగీకరించడంలో ఎంతో సాహసాన్ని, నిజాయి తీని ప్రదర్శించారు. ఈ నిజాన్ని వ్యతిరేకించలేమని కూడా చెప్పారు. దానికి ప్రతిఫలం ఆయన పదవి ఊడిపోయింది. మహ్మద్ దురానీ నిజంగానే పాకిస్తాన్ దేశ భక్తుడు, దృఢసైనికుడు అనడంలో సందేహమే లేదు. సియాల్ కోట్ సెక్టర్లో ప్రత్యేకించి ఫిలోరా, చావిందా సమరాల్లో ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ నేతృ త్వంలో భారత మెరుపు దాడుల దళాలు భీకర పోరు సల్పుతున్నప్పుడు, దురానీ పాక్ తరపున యువ ట్యాంక్ కమాండర్‌గా పోరాడారు. ఆనాటి పోరాటాన్ని బుద్ధిహీనమైన తీవ్రపోరా టంగా ఆయన అభివర్ణించారు. భారత్ పక్షాన నిజంగా అద్భుతమైన, ఎత్తుగడల పరమైన సైనిక చర్య జరిగిందంటే దానికి లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపోర్ కారణమని చెప్పారు. తన సైనిక రెజిమెంట్‌ను తారాపోర్ అత్యంత దూకుడుగా ముందుకు నడిపించారని, కానీ ఆర్టిల్లరీ కాల్పుల్లో తాను మరణించాడని దురానీ చెప్పారు. ఆ యుద్ధంలో ప్రకటించిన రెండు పరమ వీర చక్ర అవార్డులలో ఒకటి తారాపోర్కే దక్కింది. నేలకొరి గిన తారాపోర్ మృతదేహాన్ని దురానీ యుద్ధ క్షేత్రంలో స్వయంగా చూశారు. ప్రత్యర్థికి చెందిన వాడైనా ఆ సాహస సైనికుడి పట్ల దురానీ నేటికీ అత్యంత గౌరవం ప్రదర్శిస్తారు. 1987–88లో భారత్ దాదాపు రెండుసార్లు విజ యానికి అతిచేరువలోకి వచ్చి వెనుకడుగు వేసిందని రక్షణ రంగ పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. మొదటిది 1987లో బ్రాస్ట్రాక్స్లో జరిగిన యుద్దం కాగా, రెండోది 1988లో జరిగిన శాంతి ప్రక్రియ. బహిరంగంగా ఇరుపక్షాలూ అధికారికంగా ప్రకటించ కున్నా, నిర్ధారించకపోయినా, సియాచిన్ ఒప్పందం దాదాపు ఖరారైందని అందరికీ అవగతమైంది. అది కూడా తెర వెనుక ఇలాంటి ప్రయత్నాలు, ఉద్రిక్తతల మధ్య కుదిరిన ఒప్పందాల వల్లే ఇది సాద్యమైంది. వీటివల్లే యుద్ధం నుంచి శాంతివైపుగా జరిగిన నాట కీయ పరిణామాలు, మళ్లీ యథాతథస్థితి నెలకొ న్నాయి. భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించు కుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి అధిక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. తాజా కలం : లండన్ కేంద్రంగా పనిచేసి ఇంట ర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజిక్ స్టడీస్ అధ్వ ర్యంలో మాల్దీవుల్లోని కురుంబా గ్రామ రిసార్ట్‌లో జరిగిన ట్రాక్–2 రకం భారత–పాక్ సదస్సులో నేను మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ అసద్ దురానీని కలిశాను. అది 1988 శీతాకాలం. అటల్ బిహారీ వాజ్ పేయీ, నవాజ్ షరీఫ్ పాలనలో భారత్–పాక్ సంబంధాల్లో కాస్త ప్రశాంతత నెలకొన్న సమయ మది. ఆ సమయంలో భారత్ వైపు నుంచి వాగాడం బరం నాటకీయంగా ఎందుకు తగ్గుముఖం పట్టిం దని దురానీ ఆశ్చర్యం వ్యక్తపర్చారు. కశ్మీర్లో పూర్తిగా సాధారణ స్థితి, శాంతి నెలకోవడమే దీనికి కారణమని నేను చెప్పాను. ఆ సమయంలో నేను జన రల్ దురానీ నుదురు ముడత పడటాన్ని, తీవ్ర దృక్కులను చూశాను. అప్పుడు దురానీ ఇలా చెప్పారు. ‘ఆ పరిస్థితి మారిపోవడానికి ఎంతోకాలం పట్టదు.‘ పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో మొదటిసారి చొరబాటు జరపడం ద్వారా ఇది నిజమైంది కూడా. ఆరు నెలల తర్వాత లేక ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 19 ఏళ్ల క్రితం ఇరుదేశాల సైన్యాలు అక్కడ యుద్ధం చేశాయి. ఆ తర్వాత ఐదేళ్లకు దురానీ రిటైరయ్యారు. అయినా సరే ఐఎస్ఐ బాస్‌గా ఆయనకు అన్ని వివ రాలూ తెలిసి ఉంటాయి. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
ఆ సినిమా సరిగా ఆడలేదు: దర్శకుడు
శ్రీదేవి, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రూప్ కి రాణి చోరోం కా రాజా’ చిత్రం ఏప్రిల్ 16, 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్నేహితుడు సతీశ్ కౌశిక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం దర్శకునిగా, నటుడిగా కొనసాగుతున్న సతీశ్ తన తొలి చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆ సినిమా జ్ఞాపకాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘25 ఏళ్ల క్రితం బోనీ కపూర్ నాకు ఈ చిత్రం ద్వారా బ్రేక్ ఇవ్వాలని చూశారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అందుకు బోనీకి క్షమాపణలు. అది నా మనస్సుకు ఎంతో దగ్గరయిన చిత్రం. ఈ చిత్రం గురించి తలుచుకుంటే శ్రీదేవి మేడమ్ గుర్తొస్తున్నారు’ అని సతీశ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రూప్ కి రాణి చోరోం కా రాజా చిత్రం విడుదలై 25 ఏళ్లు గడిచాయంటే నమ్మకలేకపోతున్నాను. ఈ చిత్ర నిర్మాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనప్పటికీ, ఇది ఒక మరచిపోలేని జ్ఞాపకం. ప్రతి రోజు రూప్ కి రాణిని మిస్ అవుతున్నామని అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. కొన్ని అపజయాల్లో కూడా గొప్ప విజయం ఉంటుంది అని అనుపమ్ ఖేర్ తన సందేశాన్ని తెలిపారు. అభిమానులు మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా.. ఇది ఒక మంచి చిత్రమని తమ స్పందన తెలియజేస్తున్నారు. -
తిరిగితే తిరిగావు కానీ...
ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు. గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎల్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు. కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, ‘నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను’ అన్నాడు. పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు. -
నీడ పీడ
అందంగా పుట్టక్కర్లేదు... ఆడపిల్లగా పుడితే చాలు! కళ్లతో కాల్చేస్తారు! బతికుండగానే చితి పెట్టేస్తారు. ఆ చితిలో... నేను, నా ఆశలు, నా కలలు.. నా కుటుంబం.. నా జీవితం.. అన్నీ బూడిదై పోతాయి. వెంటాడే ఆ చూపుల నీడ.. నన్ను వేధించే పీడ! దేవుడా.. నువ్వెక్కడ?! అద్దం ముందు నిలబడాలనిపించదు నాకు. కమిలిన శరీరం కలతపెడుతుంటుంది. భయంకర జ్ఞాపకాలు మనసును మెలి పెడుతుంటాయి. నా మనఃశరీరాల కల్లోల కథ చెప్పాలంటే హైస్కూలు రోజుల్లోకి వెళ్లాలి. అభద్ర వీధుల్లో అనుభవించిన నరకాన్ని మీ ముందుంచాలి. అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. బడి నుంచి తిరిగొస్తుంటే వెంటబడ్డాడు ఒక అగంతకుడు. కొద్ది రోజుల తర్వాత తెలిసింది వాడు మా ఊరు వాడేనని. మొదట అంతగా పట్టించుకోలేదు. కానీ వాడు తరచూ వెంటబడేవాడు. కాలేజీలో చేరాక వేధింపులు ఎక్కువయ్యాయి. వెకిలి చూపులు చూసేవాడు. బెదరగొట్టేవాడు. తట్టుకోలేకపోయేదాన్ని. బయటకు వెళ్లాలంటేనే భయం. ఒక్కోసారి కాలేజీకీ వెళ్లాలనిపించేది కాదు. చదువుపై మనసు పెట్టలేకపోయేదాన్ని. ఇంట్లో చెప్పలేకపోయేదాన్ని. చెబితే చదువు మాన్పించడం ఖాయం. నా నంబర్ ఎలా సంపాదించాడో తెలియదు.. ఓ రోజు మొబైల్‌కి మెసేజ్ పంపాడు. వాడి భాష ఎంత టెర్రరైజ్ చేసిందంటే.. అది చదివినప్పుడు నిలువెల్లా వణికిపోయా. మెసేజ్లతోనూ స్టాక్ చేయడం మొదలెట్టాక.. నా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. తిండి తినాలనిపించేది కాదు. ఓ గిల్టీ ఫీలింగ్ వెంటాడేది. అసలేమి జరుగుతోంది? రేపు నాకేమవుతుంది? ఊపిరాడకుండా చేసేవి ఇట్లాంటి అనేక ప్రశ్నలు. మనసు నిండా నిరంతరమూ ఆలోచనలే. ఆందోళనలే. వాటి ఒత్తిడి భరించడం చాలా చాలా కష్టమయ్యేది. ఆ దుర్మార్గుడు కన్నేసిన నా శరీరంపై నాకే అసహ్యమేసేది. వాణ్ణి ఏమీ చేయలేను. అలాగని నన్ను నేను కాపాడుకోలేను. మరేం చేయాలి? చచ్చిపోవాలి. నన్ను నేను తగలేసుకోవాలి. మెడ.. ఛాతి.. పొట్ట కాలిపోయాయి. ఒళ్లంతా మంటలు. ఓవైపు గాయాల సలపరం. ఇంకోవైపు మా అమ్మ దుఃఖం. కమిలిపోయిన నా ఒంటిని చూసినప్పుడు మరింత హెచ్చుతోంది ఆమె దుఃఖం. ఆ క్షణాల్లోనే నాలో గూడు కట్టిన భయమంతా వెళ్లగక్కేశాను. గుండె బరువు దించుకున్నాను.నా కారణంగా మా అమ్మానాన్నా చాలా డిస్టర్బ్ అయ్యారు. చాలా యాతన పడ్డారు. నా గాయాలు నాన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని మింగేశాయి. ఇల్లు కూడా మిగల్లేదు. నా కుటుంబాన్ని లేమిలోకి నెట్టేసినందుకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. ట్రీట్మెంట్ ఖర్చు ఇరవై లక్షల రూపాయలు దాటింది. పదకొండు మాసాల తర్వాత ఇంటికి చేరాం. మళ్లీ వెంటబడ్డాడు వాడు. మా నాన్న హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. ఇక భయపడదలచుకోలేదు. ‘షీ టీమ్స్’కి ఫిర్యాదు చేశా. నాతో వాడికి ఫోన్ చేయించారు ఎస్ఐ. అలా వలపన్ని వాణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. నన్ను దక్కించుకు నేందుకు ఆస్తులు కోల్పోయిన అమ్మానాన్నలకు మరింత భారం కాదలచుకోలేదు. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం చూసుకున్నాను. కమిలిన శరీరం పీడకల లాంటి గతాన్ని గుర్తు చేస్తుంటుంది. కాలిపోయిన చాతి నన్ను వెక్కిరిస్తుంది. పెళ్లి గురించిన ఆలోచనలు భయపెడుతుంటాయి. మౌనాన్ని వీడండి స్త్రీలు మౌనాన్ని వీడాలి. సపోర్ట్ సిస్టమ్స్‌ను వాడుకోవాలి. తమకు దగ్గరగా ఉండే ఎవరో ఒకరితో బాధను పంచుకోవాలి. హింసను భరిస్తూ పోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. డిప్రెషన్ బారిన పడే ప్రమాదముంది. విద్యాసంస్థల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విజయ లాంటి అమ్మాయిల్ని ఇలాంటి ఘోరాల నుంచి రక్షించుకోవచ్చు. ఉదాహరణకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీటీమ్స్ – ‘భూమిక విమెన్స్ కలెక్టివ్’ కలసి ‘షీ ఫర్ హర్’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జూనియర్, ఇంజనీరింగ్ కాలేజీలు సహా అన్ని కాలేజీల్లోనూ ఇద్దరు యువతుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నాయి. వేధింపులు ఎదురైతే ఏం చేయాలో, ఎవరికి కాల్ చేయాలో, షీటీమ్స్‌కి ఎట్లా లింక్ చేయాలో వివరిస్తున్నాయి. రకరకాల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. వాళ్లు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇలాంటివి ప్రతి చోటా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో హెల్ప్‌లైన్‌కి కాల్ చేసే అవకాశం కూడా బాధితులకు ఉండకపోవచ్చు. అసలు వాటి గురించి తెలియకపోవచ్చు కూడా. అలాంటి సందర్భాల్లో చుట్టూ ఉన్న ప్రజలు ఆమెకు సాయపడగల వాతావరణం రావాలి. రోడ్డు మీద ప్రమాదం జరిగితే 108కి కాల్ చేసి చెప్పే ప్రజలు.. ఒకమ్మాయిని వేధిస్తున్నప్పుడు కూడా స్పందించి సాయపడగలగాలి. షీటీమ్స్ వంటి వాటికి కంప్లయింట్ చేయగలగాలి. హింసను అరికట్టడంలో పౌరసమాజ పాత్ర చాలా కీలకం కాబట్టి ఈ దిశగా జనరల్ పబ్లిక్‌లో అవేర్నెస్ తీసుకురావాలి. – కొండవీటి సత్యవతి, వ్యవస్థాపక కార్యదర్శి, భూమిక విమెన్స్ కలెక్టివ్ మానసిక శక్తిని కూడగట్టుకోవాలి ఇంతకు ముందు ఆ అబ్బాయి వేధించిన ప్రదేశాల్లో తిరగలేకపోవడం, తిరిగితే డిప్రెసివ్‌గా అన్పించడం వంటి స్థితి విజయను బాధిస్తుండవచ్చు. మరోవైపు ఆమె బయటకెళ్లినప్పుడు ఒంటి మీద గాయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పరిస్థితి ఆమెకు అవమానకరంగా ఉండొచ్చు. రకరకాల భావనల మధ్య ఘర్షణతో ఆమె కొంత ఒత్తిడికి గురవుతుండవచ్చు. తనదైన మానసిక శక్తిని కూడగట్టుకోవడం ద్వారా ఆమె ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. కుటుంబం – దగ్గరి వాళ్లు గతాన్ని గుర్తు చేయకుండా ఆమెతో స్నేహపూర్వకంగా మెలగాలి. భవిష్యత్తు ఎంతో ఉందన్న విషయంపై విజయ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని సాయాల్నీ ఆమె పొందాలి. వెంటాడిన వాడి గురించి లోలోన భయపడిపోవడం వల్లే, ఎవ్వరికీ తన సమస్యను చెప్పుకోకపోవడం వల్లే విజయ ఈ పరిస్థితికి నెట్టబడ్డారు. ఇలాంటి పొరపాటు మరోమారు జరగకుండా ఆమె జాగ్రత్త పడాలి. – డాక్టర్ పాల్వాయి పద్మ, సైకియాట్రిస్ట్ (విజయ కేస్ స్టడీ) – హృదయ ఈ హెల్ప్‌లైన్ నంబర్లు ::: నోట్ చేసుకోండి... 181 విమెన్స్ హెల్ప్‌లైన్ (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) 18004252908 భూమిక హెల్ప్‌లైన్.. 1091 వేధింపులు సహా రకరకాల ప్రమాదకర పరిస్థితుల్లో ఏపీ స్త్రీలు – పిల్లలు డయల్ చేయాల్సిన నంబర్ 9490616555 హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ 24 గంటలూ పని చేస్తుంది. పిల్లలతో చాకిరి, బాల్య వివాహాలు, లైంగిక దాడులు / వేధింపుల వంటి వాటిపై ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి సహాయం పొందొచ్చు. -
శ్రీదేవికి ఇష్టమైన ఆహారం ఇదే!
అందానికి నిర్వచనం శ్రీదేవి.టాప్ హీరోకు ఉన్నంత స్టార్డమ్ అతిలోక సుందరి సొంతం.ప్రేక్షక లోకం ఆమె ప్రేమలో పడిపోతే..ఆమె మాత్రం నగరంపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు.హీరోయిన్గా సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి చనిపోయే దాకా ఆమె ఇక్కడకువస్తూపోతూ ఉండేవారు. చార్మినార్, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్ వంటి ప్రాంతాలుఎంతో ఇష్టమైనా అభిమానుల తాకిడి తట్టుకోలేక రాత్రి వేళ వెళ్లి చూసొచ్చేవారు. స్వతహాగా మాంసాహారి అయినా.. సిటీలో మాత్రం శాకాహారాన్నే ఇష్టంగా తినేవారు. ఆమెనుకలవాలని, ఒక్కసారైనా ఆ అందమైన కళ్లల్లో పడాలని ఎంతో మంది కలలుగంటే..ఆ అదృష్టం మాత్రం కొందరికే దక్కింది. ఆ జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: శ్రీదేవి హైదరాబాదుకు వస్తే సందడే సందడి..తాజ్‌బంజారా, పార్క్‌హయత్‌లో బస..టైముంటేట్యాంక్బండ్పై షికారు..ఉలవచారు రెస్టారెంట్లోఆకుకూర పప్పు..టమోటాచారు..అవర్‌ప్లేస్ హోటల్లోభోజనం.. ఇలా గడిపేవారు.. సీసీఎల్ మ్యాచ్‌లు ఉన్నపుడు స్టేడియంలో హుషారుగా కనిపించేవారు..ఇలా శ్రీదేవితో తమకు ఉన్నఅనుబంధం గురించి సాక్షితో పలువురు మాట్లాడారు. ఆ నవ్వు ఇక చూడలేం.. శ్రీదేవి నవ్వు నాకు చాలా ఇష్టం.. మహేశ్వరి ద్వారా పరిచయం కలిగింది. ప్రతిసారీ చిరునవ్వుతో నన్ను విష్ చేసేవారు.. చాలా తక్కువగా మాట్లాడేవారు.. ఇక ఆమె చిరునవ్వును చూడలేననే విషయం తలచుకుంటే బాధేస్తుంది. –వి.కవితరెడ్డి, ఆడీకార్ బ్రాండ్ కన్సల్టెంట్ సత్యభామ క్యారెక్టర్ బాగా ఇష్టపడేవారు ముంబైలో ఓ ప్రదర్శనలో శ్రీదేవి నా కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి అభినందించారు.అప్పటినుంచి ఆమెతో పరిచయం ఏర్పడింది. శ్రీదేవి చెల్లెలు మహేశ్వరీ నాకు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో పరిచయం మరింత పెరిగింది. భామాకలాపంలో నా నృత్యం శ్రీదేవికి చాలా ఇష్టం. – పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి ‘ఉలవచారు’లో ఆకు కూర పప్పు.. నగరంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఫిల్మ్‌నగర్‌లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్ ఫుడ్‌ని ప్రిఫర్ చేసేవారు. ఇక్కడ దొరికే ‘ఆకు కూర పప్పు, పప్పుచారు, టమోటా చారు’ అంటే చాలా ఇష్టం. అడిగి మరీ వండించుకుని పార్సిల్ తీసికెళ్లేవారు. సిటీకి వచ్చే ముందుఫోన్ చేసి మరీ చెప్పేవారు. –‘ఉలవచారు’ రెస్టారెంట్ యజమాని వినయ్ స్కూల్లో ఉండగానే పరిచయం నేను శ్రీదేవి చెల్లెలు శ్రీలత స్కూల్ ఫ్రెండ్స్. లంచ్ సమయంలో శ్రీలతకు బాక్స్ ఇచ్చేందుకు శ్రీదేవి మా కాన్వెంట్కు వచ్చేవారు.. అలా పరిచయమయ్యారు. కార్తీకదీపం సినిమా సమయంలో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మనమధ్యలో లేకపోవడం బాధగా ఉంది. – శైలజరెడ్డి, సెన్సార్‌బోర్డ్ మెంబర్ హాయ్.. రవీ అనేపిలుపు దూరమైంది నేను సీసీఎల్‌కు ఆరేళ్ల పనిచేశా.. అప్పుడు శ్రీదేవితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఏ చిన్న పని పడినా హేయ్ రవి.. హౌ ఆర్ యూ అనేవారు. ఫ్యామిలీ ఎలా ఉంది?’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. హాయ్ రవి అనే పిలుపు దూరమైందంటే చాలా విచారకరంగా ఉంది. –రవి పనాస, ఆర్కే మీడియా ఫౌండర్, సీఈఓ గతంలో ఓసారి.. శ్రీదేవి ఓ రోజు రాత్రివేళలో చార్మినార్‌కు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకుంటున్నారు.ఆ సమయంలో అభిమానులు వచ్చారు. తరువాత భారీ సంఖ్యలోజనం గుమిగూడటంతో కష్టపడి కారులోకిచేరుకున్నారు. ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సారధి స్టూడియోలలో షూటింగ్‌లకు హాజరయ్యేవారు. అవుట్డోర్ షూటింగ్‌లకు అభిమానుల తాకిడి ఎక్కువని, ఒప్పుకునేవారు కాదని, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో పాటు పని చేసిన ప్రొడక్షన్ అసిస్టెంట్ వాసుదేవరావు పేర్కొన్నారు. చికెన్, మటన్‌తో పాటు దక్షిణాది వంటకాల వైపే ఆమె మక్కువ చూపేవారని అవర్‌ప్లేస్ హోటల్ మేనేజర్ తెలిపారు. బోనీ కపూర్, అనిల్‌కపూర్‌తో కలిసి ఆమె తన ఇద్దరి పిల్లలతో తమ హోటల్‌కు వచ్చి విందారగించిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. సుమారుగా ఆమె 60 సినిమాల వరకు ఇక్కడ స్టూడియోల్లోనే షూటింగ్ జరుపుకున్నారు. – బంజారాహిల్స్ టీఎస్ఆర్ కుటుంబంతోఅనుబంధం కాంగ్రెస్ నాయకుడు ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కుటుంబీకులతో శ్రీదేవికి మంచి స్నేహం ఉంది. ఆయన కుమార్తె పింకిరెడ్డి మంచి స్నేహితురాలు. నగరంలో శ్రీదేవి ఎక్కడికి వెళ్లాలన్నా పింకిరెడ్డి వెంట ఉండాల్సిందే. సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. రసమయి అక్కినేని లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, స్వర్ణకంకణాన్ని 2004 సెప్టెంబర్ 20న జూబ్లీహల్లో రసమయి ఆధ్వర్యంలో శ్రీదేవికి అందజేశారు. టీఎస్సార్ షష్టిపూర్తి ముంబాయిలో చేసిన సందర్భంగా షణ్ముకానంద హల్లో శ్రీదేవికి సన్మానం చేశారు. అప్పుడు ముంబై వెళ్లిన పలువురు కళాకారులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. రసమయి సంస్థ నిర్వాహకులు ఎంకే రాము, వంశీ కళా సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజులు ఆమె ఆకస్మిక మృతికి సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
స్నేహమంటే ఇదేరా!
చిన్ననాటి స్నేహితులను కలసి మన జ్ఞాపకాలను పంచుకుంటే ఆ మధురమే వేరు. ఆ పాత స్మృతులను తలుచుకుంటూ ఒక్కసారిగా బాల్యంలోకి తొంగిచూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంటుంది. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లోనూ నేనున్నా అంటూ భుజం తడుతుంది ఆ స్నేహం. తన చిన్ననాటి ఓ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి చేరదీసి.. అతడిని మామూలు మనిషిని చేసి.. ఆహా అనిపించుకుంది. ఈ కథ మీకోసం.. కెన్యా దేశానికి చెందిన ప్యాట్రిక్ హింగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి.. దాదాపు జీవితం మొత్తాన్ని కోల్పోయాడు.. ఇదే సమయంలో అదృష్ట దేవత తలుపు తట్టింది. తనతో చిన్నప్పుడు చదువుకున్న వంజా వారా అనే అమ్మాయికి ప్యాట్రిక్ ఎదురయ్యాడు. అతడిని గుర్తుపట్టిన వారా ప్యాట్రిక్ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఎన్నో ఆస్పత్రులు తిప్పి కావాల్సిన చికిత్సలు చేయించి కంటికి రెప్పలాగా చూసుకుంది. చివరికి ప్యాట్రిక్ మామూలు మనిషి అవ్వడమే కాదు.. అన్ని దురలవాట్లకు దూరమై.. ఇప్పుడు బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడ్డాడు. ఇలాంటి ఓ మంచి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు జన్మ ధన్యం అయినట్లే కదూ! -
నా కథ
ఎప్పట్లాగే ఈరోజు కూడా గడిచిపోతుంది అనుకున్నా. సమాధిలా దాచిన జ్ఞాపకాలు తవ్వడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు కొంచెం కష్టంగానే వుంది. నిన్న ‘‘క్లాస్‌రూమ్‌లో అలా కన్నీళ్లు పెట్టుకున్నారేంటీ?’’ అని సంగీత అడిగినప్పట్నుంచీ ఇలాగే ఉంది. ‘‘దేవుడు అందరికీ పరీక్షలు పెడతాడు కానీ, కచ్చితంగా పరీక్షలకి తట్టుకొని నిలబడతారు అనే వాళ్లని మాత్రం పరీక్షిస్తూనే ఉంటాడు. వాటన్నింటికీ తట్టుకొని నిలబడ్డ వాళ్లే గొప్పోళ్లు’’ అమ్మ చెప్పిన ఈమాట నా మట్టి బుర్రకి అప్పుడు ఎక్కలేదు కానీ, ఇప్పుడు అది తలచుకోని రోజంటూ ఉండదు.ఇన్ని ఆలోచనల మధ్య కిందకి చూస్తే బకెట్లో నీళ్లు అయిపోయాయి. ‘అసలు మొహానికి సబ్బు రుద్దుకున్నానా?’ అనుమానమొచ్చింది. ఎందుకైనా మంచిదని ఇంకొన్ని నీళ్లు పట్టుకుని మొహం కడుక్కున్నా. దేవుడిని నమ్మను కాబట్టి పూజా కార్యక్రమాలు లేవు. హ్యాంగర్‌కి ఆల్రెడీ నిన్ననే తగిలించుకున్న నలుపు రంగు కుర్తా వేసుకున్నా. అద్దంలో చూసుకుంటే క్రాపుకి, బంగారు అంచు ఉన్న కుర్తా వింతగా ఉన్నట్టు అనిపించింది. చేతుల దగ్గర పైకి మడిచి అప్పుడు జుట్టు సర్దుకున్నా. చిన్నప్పట్నుంచీ ఓణీలు తప్ప ప్యాంటు చొక్కాల జోలికి పోలేదు. ఇప్పుడు ఈ టామ్‌బాయ్ లుక్ నాకే ఆశ్చర్యం అనిపించింది. నెక్ దగ్గర మొదటి గుండీ లేకపోవడం చివరిసారి వేసుకున్నప్పుడే గమనించాను. పిన్నీసు పెట్టుకుని అలాగే వెళ్ళిపోయా కానీ ఆరోజు స్టాఫ్ మీటింగ్‌లో ఆ వెధవ చూపులు ఇంకా గుర్తున్నాయి. బట్టలు మార్చుకుందామనుకున్నా. గడియారం తొమ్మిది గంటలు కొడుతోంది. ‘ఈరోజు రాగానే కుట్టుకుంటా’ అని గట్టిగా అనుకున్నా. ఆ వెధవ కళ్ల ముందు కదిలాడు. ‘చూడనీ.. ఈసారి అలాగే చూస్తే పిన్నీసు తీసి వాడి కళ్లలో పొడుస్తా!’ అనుకుని బండి కీ తీస్కొని బయల్దేరా. దారంతా రణగొణధ్వనులు. నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే.. ఎన్ని ఆలోచించినా, మనసెంత బాగోకపోయినా బండి నడిపేటప్పుడు మాత్రం మరేం ఆలోచించను. చిన్న చిన్న చిరాకులకు జీవితాన్ని రిస్కులో పెట్టడం నాకు నచ్చదు. పక్కన ఒకడు నా బండి రాసుకుంటూ పోయాడు. అప్పటికీ అరుస్తూనే ఉన్నా ఇయర్‌ఫోన్‌లో పాటలు వింటూ ప్రపంచాన్నే మర్చిపోయాడు పిల్ల వెధవ. తర్వాత వాడికోసం బండి కొంచెం స్పీడ్ పెంచా. సిగ్నల్ దగ్గర దొరికాడు. వాడి పక్కనే వెళ్లి బండి ఆపి చూద్దును కదా.. నా క్లాస్ కుర్రోడే! వాడి భుజం మీద తట్టాను. చెవిలోంచి ఆ ఇయర్‌ఫోన్ తీసి నా వంక చూసి భయంతో తలదించుకున్నాడు.‘‘ఏంట్రా ఆ స్పీడు?’’ అడిగాను. ‘‘శాంతి మేడం క్లాస్ మేడం!’’ అన్నాడు.‘‘అయితే ఇలా రోడ్డుమీదా హడావిడి చేసేది? ముందు చెవిలో అది తీయ్. మెల్లగా వెళ్లు..’’. ఆ వైర్లు తీసేసి బ్యాగ్‌లో పెట్టి ‘‘సారీ మేడం!’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో సంతకం చేసి టైం చూశా. సరిగ్గా పావు తక్కువ పది. హమ్మయ్య అనుకుని క్లాస్‌లోకి రిజిస్టర్ పట్టుకొని వెళ్లి కూర్చున్నా. నిన్న నేను క్లాస్‌లో కంటతడి పెట్టడం పిల్లలు అంత సులభంగా మర్చిపోరని తెలుసు. గట్టిగా గాలి పీల్చుకొని పాఠం మొదలుపెట్టా. ఒక్కసారి పాఠం మొదలెట్టగానే నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. మనసు తేలికపడింది. క్లాస్ అయిపోయాక వెళ్లి నా గదిలో కూర్చున్నా. కొంతసేపటికి సంగీత వచ్చి ‘‘మీతో మాట్లాడాలి!’’ అంది. ‘‘చెప్పమ్మా!’’ అన్నాను. ‘‘మీ గురించి తెలుసుకోవాలని ఉంది.’’ నాకు నా గతం తల్చుకోడం ఇష్టం లేదు. కానీ ఈరోజెందుకో సంగీతకి చెప్పాలనిపించింది. టీచర్ని కదా.. ప్రశ్నలకు బదులివ్వకుండా ఉండలేను. ‘‘మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేనొక్కదానినే కూతుర్ని. చిన్నప్పట్నుంచి నేను కొంచెం ముభావస్తురాలిని. బాగా సిగ్గు. బస్టాండ్‌కి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. పెళ్లి దాకా ఏ కష్టం లేకుండా పెరిగా. వాడు మనిషికి ఎక్కువ. మృగానికి తక్కువ. జీవితం అంటే అంత సులువైంది కాదు అని తెలిసేలా చేశాడు. దీనికి నేనెప్పుడూ వాడికి ఋణపడివుంటా. పెళ్లైన మొదటి రోజున సిగ్గుపడటం తప్ప, తర్వాత నవ్విన సందర్భాలు నాకు మొహమాటానికి కూడా గుర్తులేవు. నేనెప్పుడూ ఒకటి నమ్ముతాను. పెద్దలు కుదిర్చిన సంబంధంలో పెళ్లైన కొత్తలోనే మొదటిరాత్రి జరుపుకోవడం ఏ వ్యభిచారానికీ తక్కువ కాదు. సరిగ్గా ఒకరినొకరు తెలుసుకోకుండానే, ప్రేమ కలగకుండానే శరీరాన్ని తృప్తి పరచటం అంటే.. అదికాక మరేమిటి? కానీ ఆ రోజుల్లో ఈ మాట బయటకి చెప్పేంత ధైర్యం నాకు లేకపోయింది. తను ఏ రోజూ ప్రేమగా మాట్లాడటం నాకు కనిపించలేదు. రాత్రి పట్టుకున్నప్పుడు కూడా వాడి అవసరం, ఆనందం తప్ప అందులో ఆత్మీయత నాకెప్పుడూ కనిపించలేదు. ఇంట్లో అంత ముద్దుగా పెరిగిన నేను, ప్రతి కష్టం పంటిబిగువనే పెట్టుకున్నా. ఎవరికీ ఏం తెలియనివ్వలేదు. తర్వాత అద్భుతం జరిగింది. ఒకరోజు లెగిసి చూసేసరికి వాడు కనపడలా. వాడి బట్టలు కూడా మాయం. నాకు కొంతసేపు అసలేం అర్థం కాలేదు. బీరువాలో నా నగలు కూడా కనపడలా. పిచ్చిదానిలా ఇంటిచుట్టూ చూశా. ఇంట్లో ఉత్తరం లాంటిదేదైనా ఉందేమోనని వెతికాను కానీ వాడికి అంత ఆలోచనా? అదీ నా గురించి. ఛ ఛ! నా ఊహ కాక మరేమిటి కానీ, వాడు చేసిన పనుల్లోకల్లా గొప్ప పని ఏంటంటే నన్ను తల్లిని చెయ్యలేదు. లేదంటే నా బంగారు తండ్రి అన్యాయం అయిపోయి వుండేవాడేమో. ఇంట్లో వాళ్లకి అంతా చెప్పినప్పుడు వాళ్లకి ఏం చెయ్యాలో తెలియలేదు. తర్వాత వాడి మీద కేసు పెట్టి విడాకులు తీసుకున్నా నాకు ఆ నగలు వద్దని చెప్పా. పాతిక సంవత్సరాల కిందటి మాట ఇదంతా. ఇప్పుడున్న తెలివి అప్పుడుంటే కచ్చితంగా ఆ నగలు తీసుకొనేదాన్నేమో!’’ ఆ చివరిమాటకు సంగీత నవ్వింది. నేనూ నవ్వేశా. ‘‘తర్వాత ఏమైంది మేడం?’’ అని అడిగింది. ‘‘ఏముంది.. అప్పటినుంచి మా అమ్మా నాన్నల దగ్గరే ఉండిపోయా. ఇప్పుడు నేను మహారాణిని కాదు కానీ బాధ్యతలతో, బాధలతో నా రాజ్యాన్ని చూసుకుంటున్నా. నా వస్త్రధారణ అంతా మార్చేశా. హెయిర్‌కట్ చేసి ఈ టామ్‌బాయ్ లుక్‌లోకి వచ్చేశా. ‘నేను ఆడపిల్లని. అందుకే ఈ అడ్డంకులన్నీ’ అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నా. అలాగే ఉంటున్నా. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. చాలా కష్టంగా అనిపించింది. తర్వాత నా జీవితం మొత్తం నాన్నే. నెలక్రితం ఆయనా చనిపోయాడు. అందుకే నిన్న అలా..’’. సంగీత కళ్లలో ఒకలాంటి భావన కనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలీలేదు. ‘‘మేడం! మీరు కథలు రాస్తారు కదా.. మీకు బాగా ఇష్టమైన కథ ఏంటి?’’ అని అడిగింది. అవును! నా అన్ని కథల్లో నాకు నచ్చిన కథేంటీ? ఆ.. నా కథ. నా కథే!! రిషిత గాలంకి (పాండిచ్చేరి) -
‘ఇచ్చాపురపు’ జ్ఞాపకాలు
జీవన కాలమ్ ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపా యలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావుగారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. ఒక వయసు దాటాక మనిషి చిరాయువుగా ఉండటానికి కారణం శరీర ఆరోగ్యం కాదు. మానసిక ఆరోగ్యం. దానిని పుష్కలంగా పెంచుకుని జీవి తాన్ని కళగా జీవించిన అరు దైన మిత్రులు ఇచ్చాపురపు జగన్నాథరావు. కొందరు ఉన్న చోట ఉత్తుంగ తరంగంలాగ లేచి పడుతూంటారు. మరికొందరు ప్రశాంతమైన సరో వరంలాగ హాయిగా, గర్వంగా, తృప్తిగా, హుందాగా జీవిస్తారు. అలా ఆఖరి క్షణం వరకూ జీవించిన గొప్ప కళాత్మకమైన దృష్టి, దృక్పథమూ కలవారు జగన్నాథ రావు. ఆయన నోటి వెంట ఏనాడూ ‘నెగటివ్’ ఆలోచన రావడం ఎరుగను. జీవించడంలో నిర్దిష్టమైన స్పష్టత, ఆలోచనలో అతి నిలకడైన దృక్పథమూ కల ఆఫీసరు రావుగారు. ‘ఆఫీసరు’ని ముందు నిలపడానికి కారణం శషబిషలు లేని ఆలోచనా సరళి. ఒకసారి నాతో అన్నారు: ‘‘మారుతీరావుగారూ! మనం పోయాక మన పిల్లలు పది రోజులు బాధపడతారు. మన మీద ప్రేమ ఉంటే పది నెలలు బాధపడతారు. ఎల్లకాలం బాధ పడాలని మనం కోరుకోకూడదు. అది వారికే మంచిది కాదు. జీవితం సాగాలి. అలా సాగుతూనే ఉండాలి’’. నాకు అతి తరచుగా జోకులు, అందమైన, ఆలోచ నాత్మకమైన కథలు కంప్యూటర్లో పంపే వ్యక్తి రావు గారు. ఎప్పుడూ ‘హాస్యం’ వాటి ప్రధాన అంశం. సరిగ్గా ఆయన వెళ్లిపోవడానికి మూడు రోజుల కిందట జోక్ పంపారు. మొదటి వాక్యం చెప్పాలి: ‘‘నువ్వు రోజూ వ్యాయామం చెయ్యడంవల్ల లాభం– ఆరోగ్యంగా వెళ్లి పోవడానికి దగ్గర తోవ’’. తెల్లబట్టలు వేసుకుని, సూర్యోదయాన్ని చూస్తూ, వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటాయి ఆయన రచనలు. దేశ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటు– ఇలాంటి మాటలు తెలుగులో ఉన్నాయని కూడా ఆయ నకి తెలీదేమో. దాదాపు 28 సంవత్సరాల కిందట ఆయన చెన్నైలో కస్టమ్స్ కలెక్టరు. ఆయన చేత చాలా నాటికలు రాయించిన తృప్తి నాది. ఓసారి కథ రాయమని ఫోన్ చేశాను. ‘ఈ ఉద్యోగ రద్దీలో ఇతివృత్తం మనసులో లేదండీ’ అన్నారు. ‘మీ ముందు టేబిలు మీద ఏమేం ఉన్నాయి?’ అని అడిగాను. ఫైళ్లు, టెలిఫోన్, పిన్ కుషన్– ఇలా చెప్పారు. ‘గుండుసూది’ మీద కథ రాయ మన్నాను. ఆ కథ చాలా గొప్పది. ఏళ్ల తర్వాత విహారి ఆ కథని మెచ్చుకున్నారట. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈమెయిల్ పంపారు. ఆఖరి వాక్యాలివి. I recall your inspiration which resulted in a story which was bigger than me. If someone raves about a story a quarter of a century later, there must be something in it. Ego? No. I feel humbled.కృతజ్ఞత చాలా అరుదైన లక్షణం. స్వామిభక్తి, కృతజ్ఞతని– సగం మనిషి, సగం జంతువు ద్వారా మనకి నేర్పాడు వాల్మీకి– రామాయణంలో. (క్షమించాలి. నేను హనుమంతుడనే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పురాణాన్ని కించపరచడం లేదు. తీరా నా పేరూ అదే!) ఒక్క సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచు రించిన ‘సురభి’ మాస పత్రికలో నా ఒత్తిడి మేరకి ‘తగిన మందు’ అనే కథ రాశారు. తర్వాత ఏదైనా రాశారేమో నాకు తెలీదు. నా అభిమాన రచన వారి నవలిక ‘గులా బిముళ్లు’. దాన్ని ‘చేదు నిజం’ అనే పేరిట గంట నాట కంగా రేడియోలో ప్రసారం చేశాను. ఏదైనా సభల్లో మాట్లాడే విషయం కుదరనప్పుడు ఆ కథని అనర్గళంగా చెప్పి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, కొసమెరుపుగా ‘ఇది ఇచ్చాపురపు జగన్నాథరావుగారి రచన’ అని చెప్పడం రివాజు. ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపాయలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావు గారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. రావుగారు ఆయన షరతుల మీదే హాయిగా జీవిం చారు. ఆయన షరతులమీదే రచనలు చేశారు. 13వ తేదీ సాయంకాలం ఏడున్నరకి ఓ మంచి జోక్‌ని మా అంద రికీ పంపడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. 7.45కి తల వెనక్కు వేలాడిపోయింది. గుండెపోటు. తన షరతుల మీదే నిష్క్రమించారు. రావుగారు నిగర్వి. కానీ జీవించడంలో తన పరిధుల్ని ఎరిగి, ఆ చట్రం మధ్య అందమైన ముగ్గులాగ జీవితాన్ని పరుచుకుని ప్రశాం తంగా జీవించిన వ్యక్తి. ఆగస్టు 8న ఆ దంపతులని చూడటానికి వెళ్లాను. వృద్ధాప్యం ముసురుకున్న జీవితాల్ని డిగ్నిఫైడ్‌గా అలం కరించుకోవడం చూశాను. బయలుదేరుతూంటే దంప తులు గుమ్మందాకా వచ్చారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి నట్టు– ‘మీ ఇద్దరి ఫొటో తీసుకుంటాను’ అన్నాను. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు. ‘ఈమాటు వచ్చిన ప్పుడు తీసుకుందాం’ అని. మరో అవకాశం లేదని ఆనాడు తెలియదు. ఆనాడు తీసుకోని ఫొటో ఒక జీవితకాలం ఆలశ్యం అయి పోయింది. వ్యాసకర్త ప్రముఖ సినీ రచయత గొల్లపూడి మారుతీరావు -
పిల్లలూ..నేను వెళ్లిపోతున్నా!
గీసుకొండ(పరకాల): పిల్లలూ ఇక సెలవు..నేను వెళ్లిపోయే సమయం వచ్చింది. 65 సంవత్సరాలకు పైగా మీకు విద్యనందించిన నేను అలసి సొల శిథిలమైపోయే స్థితికి చేరుకున్నా. వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకుని భావి పౌరులుగా తీర్చిదిద్దానని, నా నీడన చదివిన వారెందరో ప్రయోజకులయ్యారనే తృప్తి నాకు ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, కండక్టర్లు, డ్రైవర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న నా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ధర్మారం చుట్టు పక్కల పది గ్రామాలకు చెందిన ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పింది నేనే అని చెప్పడానికి ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యే వరకు ప్రతిరోజు నావద్దే మీ చదువు, ఆటపాటలు సాగాయి. చదువులమ్మ ఒడినై మిమ్ములను కన్న తల్లిలా లాలించా. తండ్రిలా ముందుకు నడిపించా. ఇక నాకు వెళ్లిపోయే సమయం వచ్చిందని అధికారులు నిర్ధారించారు. రేకులు, డంగు సున్నంతో నిర్మించిన నా రూపాన్ని లేకుండా చేయడానికి వేలం పాట నిర్వహించారు. నన్ను కూల్చడానికి ఓ కాంట్రాక్టర్ రూ. 2.55 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. త్వరలోనే ఆయన తన పని ప్రారంభించి నన్ను నేలమట్టం చేస్తాడు. నేను లేనని మీరు బాధపడొద్దు. నా పునాదులపైనే కొత్తగా తరగతి గదులను త్వరలో నిర్మిస్తారు. మిమ్ములను వీడి కాలగర్భంలో కలిసి పోతున్నాననే బాధ నాకు లేదు. చాలా సంతోషంగా, సంతృప్తిగా వెళ్లిపోతా.. మీ జ్ఞాపకాలు చాలు నాకు..ఇక సెలవు..ప్రేమానురాగాలతో.. -
జ్ఞాపకాలు–2016
నిజామాబాద్ అర్బన్ : ఇందూరుకు 2016 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జిల్లాల పునర్విభజన, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.టనాలుగేళ్ల తర్వాత విస్తారంగా వర్షాలు కురియడంతో జిల్లా తడిసి ముద్దయింది. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ఆర్మూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ►వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ఆమె బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ►ఏప్రిల్ 29న మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ►మే 25న కామారెడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ►మే 26న ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ►సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిజామాబాద్, బాన్సువాడలలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 28న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేమలు ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి మృతి చెందడంతో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చోటు చేసుకుంది. ►ఇందూరు జిల్లాకు సంబంధించి గతేడాదిలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకమైనది జిల్లాల పునర్వ్యవస్థీకరణ. 36 మండలాలతో దశాబ్దాలుగా కొనసాగిన నిజామాబాద్ జిల్లా రెండుగా విడిపోయింది. దసరా రోజున కామారెడ్డి జిల్లా పురుడు పోసుకుంది. అదే రోజు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటయ్యాయి. ►జిల్లాలో మరో కీలక పరిణామం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. జిల్లాలోని అన్ని ఠాణాలను కలిపి కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి పోలీస్ కమిషనర్‌గా కార్తికేయ బాధ్యతలు స్వీకరించారు. ►నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటన ప్రభావంతో ఇందూరు ప్రజా బ్యాంకుల ముందు బారులు తీరింది. కొత్త నోట్లు రాక, నగదు చేతిలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు తెరుచుకోలేదు. డబ్బు దొరకక ప్రజలు ఆందోళనకు దిగారు. టనవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరుగడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెలిసింది. -
విశ్వసాహిత్యాన్ని మథించిన ‘పోతుకూచి’
ఆయన స్వీయచరిత్ర రాస్తే భావికి మేలు ‘జ్ఞాపకాలు’ ఆవిష్కరణలో ఎండ్లూరి రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతస్థాయిలో అధ్యయనం చేసిన అతి కొద్దిమందిలో పోతుకూచి సూర్యనారాయణమూర్తి ఒకరని తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు, పాత్రికేయుడు, రచయిత పోతుకూచి సూర్యనారాయణమూర్తి రచించిన ‘జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ సభ శనివారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశ్ నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎండ్లూరి మాట్లాడుతూ కాకినాడలో జరిగిన ఆంధ్రాభ్యుదయ ఉత్సవాలలో ఒక పెద్దమనిషి తనను అవమానించినట్టు మహాకవి జాషువా స్వీయచరిత్రలో పేర్కొన్నారని, అయితే ఆ సంఘటన పూర్వాపరాలను పోతుకూచి తన ‘జ్ఞాపకాలు’లో వివరించారని అన్నారు. సాక్షాత్తు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంతటి వాడి మాటలు జాషువాను మనస్తాపానికి గురి చేశాయని, ఈ సంఘటనను పోతుకూచి ‘జ్ఞాపకాలు’లో నిబద్ధతతో పేర్కొన్నారని ప్రశంసించారు. పోతుకూచి స్వీయచరిత్రను రాయాలని, అది ముందుతరాల వారికి ఉపకరిస్తుందని అన్నారు. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి ‘జ్ఞాపకాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నగరానికి తలమానికమైన న్యాయవాది పోతుకూచి అని ఆయన అన్నారు. పుస్తక సమీక్షకుడు బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ విఖ్యాత విజ్ఞాన దీపకళిక పోతుకూచి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు తెలియనివారు ఉండరన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ నిబద్ధత కలిగిన న్యాయవాది పోతుకూచి అని, ఆయన ప్రతిభను రాజమహేంద్రికి పంచిపెడుతున్నారని అన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పోతుకూచి ఏ విషయాన్ని అయినా వివరించేటప్పుడు ఆయనలో భావాలు ఉప్పెనలా తన్నుకు వస్తాయని, ఆయన నడిచే గ్రంథాలయమని కొనియాడారు. ఈ ఊరు ఆయనకు తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది చేబియ్యం వెంకట్రామయ్య మాట్లాడుతూ జీవిత సాఫల్యపురస్కారానికి పోతుకూచి పూర్తిగా అర్హులన్నారు. తన సొంత ఖర్చుతో పోతుకూచిని త్వరలో భారీస్ధాయిలో సత్కరిస్తానని తెలిపారు. పలువురు నగర సాహితీవేత్తలు పోతుకూచిని సత్కరించారు.కళాగౌతమి కార్యదర్శి ఫణి నాగేశ్వరరావు స్వాగత వచనాలు పలికారు. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి, డాక్టర్ డి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం, మధుర ఫాలశంకర శర్మ, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్, జి.సూర్యారావు తదితరులు హాజరయ్యారు. -
ఆమె ఒక ఆధ్యాత్మిక గీతం
సందర్భం ఉషా ఉతుప్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. పాడడం ఈ సుప్రసిద్ధ గాయనికి కొత్త కాదు కానీ, తాజాగా పాడిన పాట, ఆ అనుభవం మాత్రం మునుపెన్నడూ ఇవ్వనంత ఆనందం ఆమెకు ఇచ్చాయి. మొన్న ఆదివారం వాటికన్ సిటీలో జరిగిన ఉత్సవంలో మదర్ థెరిసాను ‘పునీతురాలు’గా ప్రకటించే కార్యక్రమంలో పాల్గొని, పాట పాడిన ఉషా ఉతుప్ ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఆమెకు పవిత్ర సేవామూర్తి మదర్ థెరెసాతో దాదాపు అయిదు దశాబ్దాల అనుబంధం. మాటల కోసం వెతుక్కుంటున్న వేళ ఉషా ఉతుప్ గొంతు పెగుల్చుకొని, ఆ మాతృమూర్తితో తన అనుబంధం గురించి చెప్పిన జ్ఞాపకాలు... ‘‘ఇప్పటికీ ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మదర్ థెరెసాతో నాది 47 ఏళ్ళ అనుబంధం. నేను తరచూ మాట్లాడిన వ్యక్తి, కలసి నడిచిన వ్యక్తి, కలసి పనిచేసిన మనిషి, అనుబంధమున్న వ్యక్తికి ఇవాళ ప్రపంచం మొత్తం ముందు ‘మహిమాన్వితురాలు’ హోదా (సెయింట్‌హుడ్) ప్రకటించడం ఆనందంగా ఉంది. అదీ కాకుండా, ఈ ఉత్సవంలో ‘పూరెస్ట్ ఆఫ్ ది పూర్’ అనే పాట పాడడం గాయనిగా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఆ పాట కూడా నా రచనే! ఇలాంటి రోజు నాకు మళ్ళీ రాదేమో! తొలిసారి... హోమియో క్లినిక్‌లో..! మురికివాడల్లోని అభాగ్యులకు నిస్వార్థంగా సేవలందించిన ‘అమ్మ’ థెరెసాతో నేను గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే! మొట్టమొదటిసారి నేను ఆమెను కలసినప్పటికి ఆమె ఒక సాధారణమైన నన్. అప్పట్లో నేను ఒక హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళేదాన్ని. క్రైస్తవ సన్యాసిని అయిన థెరెసా కూడా అక్కడికి తరచూ వస్తుండేవారు. అక్కడే మా తొలి పరిచయం జరిగింది. అలా జరిగిన మా పరిచయం ఏళ్ళు గడిచేకొద్దీ గాఢమైన స్నేహంగా మారింది. నేను ఆమె ప్రేమను పొందాను. ఆమెతో కలసి నడుస్తూ, నవ్వుతూ, తిరుగుతూ క్షణాలెన్నో! ఆ షరతు పెట్టారు! దాంతో కష్టమైంది! అప్పట్లో ఆమె నాకు కొన్ని నిర్ణీతమైన పనులు చెప్పేవారు. బీదవారి కోసం ఆహారం, దుస్తులు సేకరించడం నా ప్రధాన బాధ్యత. అయితే, మదర్ ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే, ‘మనం చేస్తున్నది ఏమిటో, ఎవరి కోసం చేస్తున్నామో ఎవరికీ చెప్పకూడదు. ఆర్భాటపు ప్రచారం చేయకూడదు.’ అమ్మ చెప్పినట్లే చేశాను. ఇలా చేయడం వల్ల వాలంటీర్లు చేస్తున్న పనిలోని అసలు సిసలు లక్ష్యం ఏమిటో అర్థం చేసుకుంటారు. మాకు తెలిసినవాళ్ళ దగ్గరి నుంచి, కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సామాన్లు సేకరించాం. ఇలా పాత దుస్తులు, మిగిలిపోయిన ఆహారం సేకరించడం నా గౌరవానికి భంగమని నేనెప్పుడూ అనుకోలేదు. ఆర్తుల కోసం ఇలాంటి పనులెన్నో చేసిన మదర్ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకొనేవారు కాదు. అది నాకు అబ్బురం అనిపించేది. ఒకసారి మాత్రం ‘అమ్మ’ చెప్పిన పని నాకు కష్టమైంది. పెళ్ళి విందుల్లో మిగిలిపోయిన ఆహారం సేకరించి, తెమ్మని చెప్పారు. అయితే, ఎప్పటిలానే - ఎందుకు, ఏమిటన్నది ఎవరికీ చెప్పకూడదు. కొద్దిగా కష్టమనిపించింది. కానీ, ‘బాహాటంగా ప్రకటించి చేసే సేవ ఎప్పటికీ సేవ కానే కాదు’ అని మదర్ అన్న మాటలు నా చెవుల్లో రింగుమన్నాయి. అంతే! ఆ పని చేసేశా! ఆ రెంటి ఖరీదూ ఎక్కువ! ఒక రోజున ఆమె కలకత్తాలోని నా స్టూడియోకు వస్తున్నారు. దోవలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అంతే! ఆమె ఉన్నట్టుండి కారు ఆపేసి, కిందకు దిగారు. ఆ మనిషి తాగి ఉన్నాడా, మరొకటా అని కూడా చూసుకోలేదు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ ఘటన కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విశ్వజనని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు... ‘నాకు డబ్బులు అక్కర్లేదు. ఆర్తుల సేవ కోసం కృతనిశ్చయంతో నిలిచి, సమయం వెచ్చించేవారు కావాలి’. డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా సంపాదించవచ్చు. కానీ, సేవా నిబద్ధత, సమయం వెచ్చించే సహృదయం - అంత సులభంగా దొరకవనీ, వాటి ఖరీదు చాలా ఎక్కువనీ ఆమెకు తెలుసు. నా దగ్గర నుంచి ఆమె కోరుకున్నవి కూడా - ఆ నిబద్ధత, సమయమే! అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం అంటే, గతంలో పండిట్ రవిశంకర్, జాకీర్ హుస్సేన్, అమ్జద్ అలీ ఖాన్ లాంటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత కళాకారులు పాల్గొన్నారు. సాధారణంగా మన సంస్కృతీ వారసత్వం అంటే భరతనాట్యం, కథకళి లాంటివే గుర్తుకొస్తాయి. కానీ, మన సంస్కృతి అక్కడికే పరిమితం కాదనీ, విశ్వజనీనమైన ప్రేమకు ప్రతిరూపమనీ, ప్రియతమ మదర్‌కు నివాళి ఇచ్చే నా పాట, ఆర్కెస్ట్రా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాను. నిజానికి, భౌతికంగా మన ముందున్న రోజుల్లోనే మదర్ థెరెసా పరమ పావని, మహాత్మురాలు. మూర్తీభవించిన ఆ మానవతా మూర్తికి ఇప్పుడు ఇలా ‘మహిమాన్వితురాలు’ అనే అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం కేవలం ఒక లాంఛనం. పవిత్ర చరిత్ర కలిగిన ఆ అమ్మతో నా అనుబంధం నా జీవితాంతం మరపురానిది. ఒక్క మాటలో చెప్పాలంటే, గడచిన శతాబ్దంలో ఆమె లాంటి అత్యంత గొప్ప మనిషినీ, కొన్ని కోట్ల మందిని స్పృశించి, వారి జీవితాలపై ముద్ర వేసిన వ్యక్తినీ మరొకరిని నేను చూడలేదు. ఆమెను చూసినవారెవరైనా సరే నా మాటలతో ఏకీభవిస్తారు. కోల్‌కతాలో మా ఇంటి నుంచి బయట కాలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ మాతృమూర్తి నడిచిన దారిలోనే నేనూ నడుస్తున్నాను, ఆమె పీల్చిన గాలే పీలుస్తున్నాను అని గుర్తుకొస్తుంది. అంతే! ఈ జీవితానికి అంతకు మించిన సంతృప్తి ఇంకేం కావాలి!’’ చిరిగిన స్వెట్టర్ చెప్పిన సంగతి! నన్ను కదిలించిన మరో సంఘటన చెప్పి తీరాలి. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ‘మదర్’ను కలిశా. ఆమె వేసుకున్న స్వెట్టర్ చిరిగిపోయి, రకరకాల మాసికలు వేసి ఉండడం గమనించాను. నాకెంతో బాధ అనిపించింది. ఆగలేకపోయా. ‘మదర్! కొత్త స్వెట్టర్ వేసుకోవచ్చుగా?’ అని అడిగేశా. దానికి, ఆమె ఇచ్చిన జవాబు ఒకటే - ‘ఉషా! ప్రపంచంలోని బీదలలో కెల్లా కడు బీదవారితో కలసి నేను జీవిస్తున్నా. కొత్తవి వేసుకొని తిరుగుతూ, బీదవారి కోసం జీవితం గడుపుతున్నా అని చెప్పుకుంటే ఎలా?’ అన్నారు. అంతే! నా నోట మాట లేదు. అందరికీ చెప్పడమే కాదు... చెప్పిందే ఆచరణలోనూ చేసే మనిషి మదర్ థెరెసా అని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. -
'ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలి'
► తెలుగు భాష వైతాళికులను మరవకండి ► బే-ఏరియా సభలో యార్లగడ్డ విజ్ఞప్తి శాన్ ఫ్రాన్సిస్కొ: తెలుగు భాష అభ్యున్నతికి బాటలు వేసి, తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేసిన వైతాళికులను మరిచిపోకుండా గుర్తుంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శుక్రవారం బే-ఏరియాలోని రాయల్ ప్యాలెస్ సమావేశ మందిరంలో తానా, బాటా, మన-పాఠశాల సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ మాతృభాషకు సేవ చేసిన వారి గృహాలు, వాడిన వస్తువులను పదిలపరిచి వాటిని ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాయని.. కానీ మనదేశంలో ఇలా జరగకపోవటం దారుణమని యార్లగడ్డ ఆవేదన చెందారు. భాషాభివృద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో త్యాగధనులను సరైన రీతిలో గౌరవించుకొవడానికి ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 1875 నుండి 2000 కాలం మధ్య తెలుగు భాష ప్రేమికులుగా, వైతాళికులుగా వెలుగొందిన 40మంది తెలుగువారి జాబితాను సభకు విడుదల చేశారు. ప్రతి ప్రవాసుడు తమ జేబులో నుంచి కేవలం 10డాలర్లు విరాళంగా అందిస్తే అటు మహానుభావులకు గౌరవమే కాకుండా భావితరాలకు ఓ అమూల్యమైన బహుమానం అందించిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని యార్లగడ్డ తెలిపారు. ఈ విధంగా పర్యాటక ప్రదేశాలుగా మారిన ఆయా గృహాలను సందర్శించే పర్యాటకులతో గ్రామాల అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన వెల్లడించారు. ఈ పిలుపుకు స్పందించిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి.. కృష్ణా జిల్లా బెజవాడలోని "కవిసామ్రాట్" విశ్వనాథ సత్యానరాయణ నివాస గృహ పరిరక్షణకు రూ.10లక్షలు ప్రకటించారు. ఈ సొమ్మును ఖర్చు చేసే బాధ్యతను అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పర్యవేక్షిస్తారని లకిరెడ్డి వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో డాక్టరేట్లు, గ్రాడ్యుయేట్లు అందుకున్న తెలుగువారు ఇక్కడ అమెరికన్ల ఆదరాభిమానాలు చూరగొనటమే గాక భారతదేశంలో కూడా కథానాయకులుగా గౌరవం పొందడం సంతోషించదగ్గ విషయమన్నారు. 10వతరగతి కూడా పూర్తి చేయని సినీహీరోల కోసం కులాలు, ప్రాంతాల పేరిట దెబ్బలాడుకోవడం హాస్యాస్పదంగా ఉందని యార్లగడ్డ తెలిపారు. అనంతరం యార్లగడ్డను నిర్వాహకుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోమటి జయరాం, వేమూరు సతీష్, తోట రాం, నందిపాటి హేమారావు, ఆసూరి విజయ, కుదరవల్లి యశ్వంత్, కోగంటి వెంకట్, తానా, బాటా, మనపాఠశాల సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
'గీతా' గానం చిరస్మరణీయం!
ఓ ప్రత్యేకమైన హస్కీ వాయిస్ తో పాటలు పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్. ఆమె మరణించడం ఎంతో విషాదకరం. ఆమె మృతిచెంది 44 సంవత్సరాలయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం అంటూ గాన కోకిల లతామంగేష్కర్ గుర్తు చేసుకున్నారు. జూలై 19న గీతా మరణించిన రోజు కావడంతో ఆమెను ఎంతో మిస్ అయ్యాం అంటూ లతా తన జ్ఞాపకాలను ట్వీట్ లో పంచుకున్నారు. గీతా దత్ ఎంతో మంచి గాయకురాలని, అభిమానుల మనసులో నిలిచిపోయిన 'హమ్ పంఛీ మస్తానే', 'అంకియాన్ భూల్ గయీహై సోనా', 'క్యా బతావూం మొహబ్బత్ హై క్యా' వంటి ఎన్నో యుగళ గీతాలను ఆమెతో కలసి పాడానని గీతా పుణ్యతిథిరోజున లతా మంగేష్కర్ గుర్తుకు తెచ్చుకున్నారు. గీతా లేకుండా 44 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటూ లతా ట్వీట్ చేశారు. 1947 నుంచి దత్ తనకు ఎంతో మంచి స్నేహితురాలని లతా మంగేష్కర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 86 ఏళ్ళున్న మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్.. 1959 లో విడుదలైన చిత్రం 'కాగజ్ కే ఫూల్' లో దత్ పాడిన పాట.. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' లింకు ను తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. గీతా దత్ జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడినవి మాత్రం అభిమానులు ఎన్నటికీ మరువలేనివే. ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. 1930 నవంబర్ లో పుట్టిన గీతా దత్.. 1972 జూలైలో లివర్ సిరోసిస్ తో మరణించారు. -
వాన జ్ఞాపకాలు ఎనిమ్ది
1. బడిగంటకు మబ్బు ముద్దు క్లాస్‌లో పాఠం ఆగిపోతుంది. అంతవరకూ గంభీరంగా పాఠం చెప్పిన మాస్టారు గడప దగ్గరకు వెళ్లి బయట కురుస్తున్న వానను చూస్తూ నిలబడి పైన ఆకాశం వంక చూసి ఇంకెంత వాన పడబోతుందో అన్నట్టుగా లెక్క వేస్తూ ఉంటాడు. పిల్లల తలలన్నీ కిటికీవైపు మళ్లుతాయి. బయట ప్లే గ్రవుండ్ తడుస్తూ ఉంటుంది. కచ్చితంగా ఒక వేప చెట్టు ఉంటుంది... అదీ తడుస్తూ ఉంటుంది. స్కూల్ అటెండర్ బాషా అంత వానలో గొడుగు వేసుకొని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కు సర్క్యులర్ ఏదో తీసుకువెళుతూ ఉంటాడు. ఉండి ఉండి ఒక జల్లు జివ్వున కొట్టి క్లాస్‌రూమ్‌లో దూరి మళ్లీ కంగారుగా వెనక్కు వెళ్లిపోతుంది. పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయన్న వంకతో పిల్లలు కెవ్వుకెవ్వున ఆటగా కేరింతలు కొడతారు. యూనిఫామ్స్ గ్యారంటీగా తడుపుకోవడానికి ఇంతకు మించిన అవకాశం ఉండదు. ఇక ఈ పూటకు బడిలేనట్టే. బయట గొడుగు విప్పి కుంపటి మీద విసనకర్ర విసురుతూ మొక్కజొన్న పొత్తులను కాల్చే ముసలవ్వ మనసులో మెదలుతుంది. వానతో పొత్తు... పొత్తుతో వాన... ఒక చిననాటి జ్ఞాపకం. 2.తడి సిన పోస్టర్ వాన పడితే జనం రారు అన్నది ఉత్త మాటే. రిలీజ్ రోజున ఎంత వాన ఉన్నా రావాల్సిన వాళ్లంతా వస్తారు. నిండాల్సిన క్యూలన్నీ నిండుతాయి. సినిమా హాలు పైకప్పున ఉన్న రేకుల మీద వాన జమాయించి కొడుతూ ఉంటుంది. బయట అంటించిన పోస్టర్ మీద హీరో సంగతి ఏమో కాని హీరోయిన్ తడిసి ముద్దవుతూ ఉంటుంది. అబ్బ... టికెట్ దొరికి లోపలికి దూరితే ఎంత వెచ్చన! కాళ్లు రెండూ దగ్గరకు చేర్చి సీటులో వొదిగి కూచుని బయట వాన పడుతూ ఉండగా లోన సినిమా చూడటం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్లో ఆరుబయట క్యాంటిన్‌కు తడుస్తూ వెళ్లాలి. వేడి వేడి బజ్జీలను కాగితం పొట్లంలో చుట్టుకు రావాలి. గాజు గ్లాసులో డికాక్షన్ టీ దొరికితే అది అమృతం. దొరికిన వాటితో లోపలికి వచ్చి కాసింత తిని సినిమా చూస్తూ వెచ్చటి టీని గుక్క గుక్కా తాగడం నిన్న మొన్నటి జ్ఞాపకం. 3. మాట్లాడే కిటికీలు వాన వస్తే కిటికీలకు మాటలు వస్తాయి. అవి టపాటపా మోతను చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. వాటి నోరు కట్టించాలని ఉంటుంది. కాని బిగించి పెడితే బయట వానను చూడలేమని బెంగగా ఉంటుంది. తమ్ముడో చెల్లాయో తడిసిన పాదాలతో అటూ ఇటూ పరిగెత్తి నేల మీద ముచ్చటైన ముద్రలు వేస్తారు. అమ్మ కయ్యిమంటుంది. ఊరుకో అని నాన్న ఆ అల్లరిని ఆహ్వానిస్తాడు. పలకరించడానికి వచ్చిన బంధువు తన గొడుగును వరండాలో మడిచి ఒక ధార గచ్చు మీద పారేలా చూస్తాడు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మ వంటగదిలో దూరి మిగిలిన దోసెల పిండిలో ఉల్లిపాయలు తరిగి వేడి చిరుతిండికి సన్నద్దం అవుతుంది. శ్లాబ్ మీద నుంచి దూకుతున్న ధారకు బకెట్ పెట్టడం ఒక ఆట. పారే నీటిలో మడిచిన కాగితపు కత్తి పడవను విడవడం ఆట. పక్కన ఉన్న పాత తాటాకుల ఇల్లు ధైర్యం అభినయిస్తుంది. ఎదురుగా ఉండే పెంకుటిల్లు మాత్రం ఓడిపోయి రెండు మూడు వాన ధారలను ఇంట్లోకి రానిస్తుంది. తడవని మనుషుల జ్ఞాపకాలు తడుస్తుంటాయి. తడిసే ఇళ్ల అనుభవాలు తడుస్తుంటాయి. తడవడం బాగుంటుంది. 4.రాజూ కూడా తడుస్తుంది అది ఇంటి కుక్క కాదు. కాని రాజూ అని పేరు పెట్టి అప్పుడప్పుడు అన్నం పెడుతుంటే వచ్చి పోతుంటుంది. వాన కురిసినప్పుడు మాత్రం సొతంత్రంగా గేటు నెట్టుకొని వచ్చి ఒళ్లంతా పెద్దగా దులపరించుకుని ఒక మూలన నన్ను వదిలేయండ్రా బాబూ అని కూలబడుతుంది. పెరట్లోని కోడి ఒక మోస్తరు వాన వచ్చేవరకు లెక్కలేనట్టుగా షికార్లు చేస్తుంది. ఆ తర్వాత పంచన చేరి బుట్ట దగ్గరకు పిల్లలను తోలుతుంది. జామచెట్టు కొమ్మ తడుస్తుంది. కొమ్మన ఉన్న కాకి తడుస్తుంది. మేత ముగించుకుని రెడ్డి గారింటికి చేరుకుంటున్న బర్రెగొడ్ల మందలో ఒకటి కదలక మెదలక నిలుచుని వానలో తన కొమ్ములను తడుపుకుంటూ ఉంటుంది. చీమలు గోడను పట్టుకొని వేగం పెంచి కవాతు చేస్తూ పోతూ ఉంటాయి. చీకటి పడ్డాక కప్పలు కచేరీ మొదలపెడతాయి. సకల సృష్టి తడుస్తుంది. అక్షులు పక్షులు తడుస్తాయి. కిటికీలో నుంచి చేయి బయటకు చాపితే తెల్లటి మన హస్తరేఖలు కూడా తడుస్తాయి. 5.మడమలు ప్రాప్తమవుతాయి దేవుడు చల్లగా చూస్తే కాలేజ్ వదిలే సమయానికే వాన పడుతుంది. చట్టాలు అరెస్టుల భయం లేకుండా అది ప్రతి ఆడపిల ్ల చేయి పట్టుకోవడానికి చూస్తుంది. ముంగురులు నిమురుతుంది. బుగ్గలు పుణుకుతుంది. నుదుటి బొట్టుకు చుక్కబొట్టు పెట్టడానికి ఉబలాట పడుతుంది. చుబుకాన జారుతుంది. కంఠాన ఆగనంటుంది. ఆడపిల్లలు భలే కిలాడీ పిల్లలు. వానకు అందకుండా పుస్తకాలు అడ్డం పెట్టుకుంటారు. వానకు చెందకుండా సైకిళ్లను పరుగుపెట్టిస్తారు. వాన ఎగుడు దిగుళ్లలోకి దూరకుండా గొడుగు విప్పి తమ శరీరానికి ఛత్రం పడతారు. కాని కింద పారే నీళ్ల ముందు వారు ఓడిపోతారు. అందమైన పావడాలను కొంచెం పెకైత్తి పట్టుకుని అంగలు వేస్తారు. అప్పుడు అబ్బాయిలకు వారి మడమలు ప్రాప్తమవుతాయి. అందమైన వాటి బరువు కింద తమ హృదయాలను పరుస్తారు. కొన్ని చితుకుతాయి. కొన్ని గెలుస్తాయి. తడిసే వానలో ఆడపిల్ల చేయి పట్టుకుని నడిచేవాడు ఆ పూటకు గ్రీకు చక్రవర్తిలా ఫీలైపోయి ఆ జ్ఞాపకాన్ని జన్మకు దాచుకుంటాడు. 6.ఖర్చులేని టోపీలు వానకు ఆకలి ఎక్కువ. ముసురు పట్టిన సాయంత్రం కాకాహోటళ్లన్నీ క్రిక్కిరిసి పోతాయి. సాదా దోసె... ఊతప్పం... ఆవిరి కక్కే ఇడ్లీ... సాంబార్ ఇష్టపడని వాడు కూడా వేడివేడి ఆ ద్రవంలో స్పూన్ ముంచి గొంతును ఘాటు చేసుకుంటాడు. ఒంట్లో వేడి నింపుకుంటాడు. వేయించిన పల్లీల బండికి గిరాకీ ఎక్కువ. ఇన్వర్టర్లు లేని కాలంలో పెట్రొమాక్స్ లైట్లే సలీసు ఇన్వర్టర్లు. కరెంటు లేని బజారులో కూడా తెలియని సందడి ఉంటుంది. గొడుగులు లేని వాళ్లంతా కొత్తకొత్త టోపీలు కనిపెట్టి కనిపిస్తారు. ఏ పూటకాపూట కొనుక్కునే దీనులు వాన పెరిగేలోగా నూకలతో ఇల్లు చేరాలని శెట్టిగారిని తొందర పెడుతుంటారు. వాన సాయంత్రాలు రేడియో వినబుద్ధి కాదు. గుడికి వెళ్లబుద్ధి కాదు. ఇంట్లో ఉండబుద్ధి కాదు. పుస్తకం ఉంటే సరే. వేడివేడి పకోడి ఉంటే సరే. అప్పుడు మూడో పార్ట్నర్గా వాన కలసి మన మూడ్ ఠీక్ చేస్తుంది. వాన ఒక్కోసారి బెంగ కూడా కలిగిస్తుంది. ఆ బెంగ తీయని నొప్పిలా కూడా ఉంటుంది. అవును.. ఇది తీయని జ్ఞాపకం. 7. వాయుగండం బంగాళాఖాతం అనే మాట తరచూ వినపడటం మొదలవుతుంది. వాయుగుండం అనే మాట కూడా. రానున్న నలభై ఎనిమిది గంటలు... ఇరవై ఎనిమిద గంటలు... ఈ అర్ధరాత్రికే... తుఫాను తీరం దాటుతుందట. అప్పుడు మాత్రం ఊరు కొంచెం కంగారుగా వార్తలు వింటుంది. పశుగొడ్లను భద్రం చేసుకుంటుంది. బలహీనమైన ఇళ్లవారిని బలమైన ఇళ్లలోకి ఆహ్వానం పలుకుతుంది. తీరంలోని పల్లెల్లో ఉన్నవాళ్లు ఊరి బడుల్లో ఆసరా పొంది క్లాస్‌రూముల్లో కొత్త స్టూడెంట్లలా కనిపిస్తారు. ఆకాశం మాత్రం అప్పుడు ఎందుకనో చాలా మూసుకుని వస్తుంది. గాలి ఎక్సిలరేటర్ని తెగ తొక్కుతూ ఉంటుంది. చెట్ల చొక్కాలు లేచిపోతాయి. కరెంటు దీపాలు కొండెక్కుతాయి. స్తంభాలు వానకు సలాము చేస్తూ నేలకు ఒంగుతాయి. వాయుగుండం పెద్ద గండం. కాని ఆ బీభత్సంలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది. అది భీతి గొలిపే సౌందర్యం. 8. అర్జునుడి రథం వాన రాత్రుళ్లు పరమాద్భుతంగా ఉంటాయి. పప్పు, రొట్టెలు అంత రుచిగా ఎప్పుడూ అనిపించవు. చారు, అప్పడాలు కూడా. కరెంటు పోతుందేమోనన్న భయంలో అన్నాలు త్వరగా ముగించి అమ్మ వెచ్చటి పక్కలు సిద్ధం చేస్తుంది. కప్పుకోను మందపు దుప్పట్లు అందిస్తుంది. బయట వాన. పైన ఎక్కడో ఉరుములు. నానమ్మ అది అర్జునుడి రథచాలనం అని అబద్ధపు నిజం చెబుతుంది. అర్జునా.. ఫల్గుణా.. పార్థా... కిరీటీ... శ్వేతవాహనా... అని మంత్రమేదో చెప్పి జపించమంటుంది. లూజ్ కనెక్షన్ ఉన్న ట్యూబ్లైట్లలా మధ్య మధ్య మెరుపులు మెరిసి మాయమవుతుంటాయి. దుప్పటి వెచ్చగా కప్పుకుని పడుకుంటే బయట వాన ఆగకుండా జోకొడుతూ ఉంటుంది. అంత పెద్ద హోరు ఏదో తెలియని ఉత్తేజం కలిగిస్తుంది. వాన బాగా కురిస్తే ఫలానావారి చెట్టు బాదం కాయలు రాలి దొరుకుతాయని ఆశ. జామకాయలు నేలన పడతాయని ఆశ. వాన పంట ఇస్తుంది. పిల్లలకు ఇదిగో ఇలా కాయలు ఇస్తుంది. ఆ దశను దాటి వచ్చిన వారికి జ్ఞాపకాలు ఇస్తుంది. వాన అంకురాన్ని సృష్టిస్తుంది. సృష్టిని అంకురింప చేస్తుంది. వాన ఆయుష్షు. వాన.. ఒక తలపుల కుమ్మరింత. - నెటిజన్ కిశోర్ -
అస్తమించని సౌందర్యం
నేడు సౌందర్య వర్థంతి వెన్నెల... ఆకాశంలోనే ఉంటుంది! ఆ పరిమళం మాత్రం పుడమినంటుకునే సాగుతుంది! సౌందర్య కూడా అంతే! స్వల్పకాలంలో ఆకాశమంత ఎత్తుకెదిగిపోయింది. మన దురదృష్టం. ఆకాశంలోనే ఉండిపోయింది. కానీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా మనల్ని తరుముతూనే ఉన్నాయ్ వాటిలో ఇవి కొన్ని... * ఫేమస్ రైటర్ త్రిపురనేని మహారథి కొడుకు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) ‘రైతు భారతం’ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. కృష్ణంరాజు (ఈ పాత్రలో తర్వాత కృష్ణ నటించారు), భానుచందర్ హీరోలు. కృష్ణంరాజు పక్కన వినయ ప్రసాద్ అనే ఆర్టిస్టుని బుక్ చేయడానికి బెంగళూరు వెళ్లారు చిట్టి. కనిష్క హోటల్లో రచయిత, దర్శక, నిర్మాత సత్యనారాయణ తారసపడి, వాళ్లమ్మాయి సౌమ్య స్టిల్స్ చూపించారు. చిట్టికి నచ్చి, భానుచందర్ పక్కన హీరో యిన్‌గా వెంటనే తీసేసుకున్నాడు. అప్పటికే సౌమ్య కన్నడంలో ‘గంధర్వ’ అనే సినిమా చేస్తోంది. ఆ సౌమ్యే మన సౌందర్య. * ‘రైతు భారతం’ ఒక షెడ్యూలు జరుగుతుంటే పి.ఎన్.రామచంద్రరావు తను తీస్తున్న ‘మనవరాలి పెళ్లి’లో హీరోయిన్గా సౌందర్యను తీసుకున్నారు. ముందు ఈ సినిమానే రిలీజైంది. ఆ తర్వాత ‘అమ్మోరు’ లాంటి సినిమాలు కమిట్ అయ్యిందామె. 11 ఏళ్లల్లో వందకు పైగా సినిమాలు చేసింది. * రాజీవ్ మీనన్ డెరైక్ట్ చేసిన ‘కండు కొండేన్ కండు కొండేన్’ (తెలుగులో ‘ప్రియురాలు పిలిచింది’)లో ఐశ్వర్యారాయ్ పాత్రకు మొదట సౌందర్యనే అడిగారు. * సౌందర్యకు ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో మీనాకుమారి, ‘ఫిజా’లో కరిష్మా కపూర్ చేసిన పాత్రల్లాంటివి చేయాలని ఉండేది. చెవిటి, మూగపిల్లగా నటించాలని కోరిక. అవకాశమొస్తే విలనీ కూడా చేద్దామను కున్నారు. గోవింద్ నిహలానీ, శ్యామ్ బెనగళ్ సినిమాల్లో చేయాలని ఎంతగా ఆశపడ్డారో! * కెరీర్ తొలినాళ్ల నుంచీ బంజారాహిల్స్‌లోని ‘ప్రశాంత్ కుటీర్’ అనే గెస్ట్‌హౌస్‌లోనే బస చేసేవారు. రూమ్ నం.10 ఆమెకు పర్మినెంట్. ఫైవ్‌స్టార్ ఫెసిలిటీ ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పినా, ఆమె ప్రశాంత్ కుటీర్‌ను వదల్లేదు. * గిరీశ్ కాసరవల్లి డెరైక్షన్‌లో ‘ద్వీప’ సినిమాను నిర్మించారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. * ‘తిలదానం’తో నేషనల్ అవార్డు సాధించిన కేఎన్టీ శాస్త్రి దర్శకత్వంలో ‘కమ్లీ’ సినిమా చేయాలని ఆమె ఎంతగానో ముచ్చటపడ్డారు. శాస్త్రిని రెండు, మూడుసార్లు బెంగళూరుకు పిలిపించుకుని స్టోరీ, బడ్జెట్ గురించి డిస్కస్ చేశారు. సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కన్నడంలో ‘ఆప్తమిత్ర’ సినిమా ఆఫర్ రావడంతో ‘కమ్లీ’ని రెండు నెలలు వాయిదా వేశారు. * సౌందర్య తొలి పారితోషికం ఎంతో తెలుసా? పాతిక వేల రూపాయలు. ‘రైతు భారతం’ సినిమాకి ఆమె తీసుకున్నది ఇంతే. ఆ తర్వాత ఆమె 50 లక్షల రేంజ్‌కు చేరుకున్నారు. * ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనుకున్నారామె. ‘శ్వేతనాగు’ ప్రొడ్యూస్ చేసిన సీవీ రెడ్డి, ఇందుకు సిద్ధమయ్యారు కూడా. * సౌందర్యకు వాటర్ ఫోబియా ఉంది. నీళ్లంటే భయం. సుడిగుండాలంటే మహా భయం. నీళ్ల బకెట్లో పడిపోతానేమోనని కూడా భయపడిపోయే వారట. చివరకు షవర్ బాత్ చేయడానికి కూడా టెన్షన్ పడిపోయేవారట. * ‘లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఆమెను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తండ్రి మరణం నుంచి కోలుకోవడానికి సౌందర్యకు ఈ పుస్తకమే సహకరించిందట. * సౌందర్య ఫాదర్ సత్యనారాయణకు జాతకాలు బాగా తెలుసు. తన కూతురు పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతుందని, అందరు హీరోలతోనూ నటిస్తుందని, 2004లో ఆమె కెరీర్ సమాప్తమవుతుందని ఆయన ముందే జోస్యం చెప్పారు. కానీ ఆమె కెరీర్ కాదు, లైఫే ఎండ్ అయిపోయింది. * 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తూ ఇలా తన ప్రయాణాన్ని అర్ధంతరంగా ముగించారు. * చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావు గురించి సౌందర్య ఇలా అన్నారు - ‘‘చావంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు చావు గురించి రక రకాలుగా ఆలోచించేదాన్ని. చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తామని, స్వర్గం ఆకాశంలో ఉంటుందని.. ఇలా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసేదాన్ని. విమానాల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ ల్లోంచి కనిపించే మేఘాలను చూస్తే మాత్రం చచ్చిపోయాక ఇక్కడకు వస్తామన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది.’’ -
నిన్నటి చరిత్ర... నేటి సాహస యాత్ర
రాజులు రాచరికాలు అంతరించినా... ఆ జ్ఞాపకాలు తలచుకోవడం, వాటిని గుర్తు చేసే ప్రదేశాలను సందర్శించడం ఇచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అలాంటి అనుభూతిని కోరుకునేవారికి, చిన్నపాటి సాహసయాత్ర చేయాలనుకునే వారికి కోయిలకొండ... ఓ చక్కని గమ్యం. - ఓ మధు అలనాటి గిరిదుర్గాలలో ఒకటయిన కోవెలకొండ కాలక్రమంగా కోయిలకొండ, కీలగుట్టగా మారింది. స్థానికులకు కూడా అంతగా పరిచయం లేని పురాతనకోట కోయిలకొండ కోట. కాసింత నిగూడంగా ఉండే ఈ చోటు చేరుకోవటం కూడా సాహసమే. చరిత్రకు భాష్యం... నిర్మానుష్యం... చాలా తక్కువ ప్రాచుర్యంలో ఉన్న ఈ కోట మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ కోటను కృష్ణదేవరాయల కాలంలో వడ్డేరాజులు నిర్మించారని, ఆ తర్వాత వెలమరాజుల ఆధీనంలో కొనసాగిందని, ఆ తర్వాత కాలంలో కుతుబ్షాహి సుల్తాన్ల వశం అయినట్లు చరిత్ర. దక్కన్ సుల్తాన్ల కాలంలో పన్ను వసూలు చేసే కేంద్రంగా ఉన్న ఈ కోట నేడు చాలా మందికి తెలియని చోటే. అడవిలో, కొండమీద ఉండే ఈ కోట చాలా వరకూ నిర్మానుష్యంగానే ఉంటుందని చెప్పవచ్చు. కోయిలకొండ గ్రామానికి దక్షిణంగా ఉండే ఈ కోటకు ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కోట ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చే ప్రదేశం. గతం వైపు స్వాగతించే హనుమాన్.. ఆంజనేయుడి బొమ్మ చెక్కి ఉన్న కొండ కనిపిస్తే కోటలోకి దారి కనిపించినట్లే. పొదలు, జారుడు బండలతో, ఎత్తై రాళ్లతో మలిచినమెట్లు కోటలో వాతావరణం ఇలా సాహసయాత్రకు కావలసిన అన్ని హంగులతో ఉంటుంది. కోటలో మొదటి పెద్ద ముఖ ద్వారాన్ని దాటుకుని వెళితే మరో నాలుగు ద్వారాలు అలా మొత్తం 7 ద్వారాలు దాటి వస్తే కోటపై భాగానికి చేరుకుంటారు.. పైకి ఎక్కి చూస్తే, కొండల మధ్య కోవెల, కోట నిర్మించడానికి కారణం అక్కడి ప్రకృతి రమణీయత, శత్రుదుర్భేద్యమైన సహజ పరిసరాలే అని అర్థమవుతుంది.. దూరంగా కనిపించే రిజర్వాయర్ నీరు, చుట్టూ అడవి, కొండగాలి ట్రెక్కింగ్ చేసే వారికి కావలసిన అందమైన బహుమతి దొరికినట్లే అనిపిస్తుంది. రాళ్లను పేర్చుతూ నిర్మించిన కోట గోడలు నాటి నిర్మాణశైలి పటిష్టతకు ప్రతీకగా కనిపిస్తాయి. గతంలో కోటకు వెళ్లిన వారి సహాయంతో ఇక్కడి వెళ్లటం ఉత్తమం. ఈ క్లిష్టమైన కోటలో మసీదు కొలను, అనేక ఆలయాలున్నాయి. దగ్గరలో వీరభద్రస్వామి, రాముని ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు వస్తుం టారు. ఇక కోటలో మొహరం పండుగ విశేషంగా జరుపుతారు. స్థానికులు మతభేదం లేకుండా పాల్గొంటారు. ఇలా వెళ్లండి... హైదరాబాద్‌కి దాదాపు 125 కి.మీ దూరంలో ఉన్న ఈ కోటను చేరుకోవడానికి ముందుగా ఎన్‌హెచ్.7 పై మహబూబ్‌నగర్‌కు బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల ద్వారా కోయిలకొండ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. కోట చూసాక సమయం చిక్కితే పెద్దవాగుపై నిర్మించిన కోయిల్‌సాగర్ డ్యామ్‌ని చూసి రావడం మరచిపోవద్దు. -
ప్రశాంత నగరం..
దేశంలో నివసించేందుకు అనువైన నగరాల్లో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్విస్తుంటా. నాకు ఈ సిటీ ఎన్నో ఇచ్చింది. ఆ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచిపోలేనివి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సిటీ... భిన్న ప్రాంతాలు, సంస్కృతుల ప్రజలకు ఆశ్రయమిచ్చింది. అందరూ ఎంతో సఖ్యతతో ఉండడం చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచీ ఇక్కడే పెరిగా. ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడ్డమన్నా, చార్మినార్‌ను చూడ్డమన్నా భలే ఇష్టం. ఇక్కడి బిర్యానీ, హలీం రుచులు ప్రపంచ ప్రజల మనసు దోచాయి. నెక్లెస్ రోడ్డులో తిరుగుతుంటే ఆ ప్రశాంతతే వేరు. - నాగశౌర్య -
2015 జ్ఞాపకాలు
-
ఆ ముగ్గురిలో.. హరి బతికే ఉన్నాడు..
అతను లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలుండాలని.. కొందరికైనా ప్రాణ దానం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ కుటుంబ సభ్యులు భావించారు. మనస్ఫూర్తిగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం.. అనే నానుడిని నిజం చేస్తూ.. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం నుంచి అవయవాలను మ్రుగ్గురికి దానం చేసి తమ త్యాగాన్ని చాటుకున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్.. అన్న మాటలకు వాస్తవ రూపమిచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు అవయవాలను ఆయన కుటుంబ సభ్యుల ఆంగీకారం మేరకు వేలూరు సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకు తరలించారు. బంగారుపాళెం: వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందిన వ్యాపారి హరికృష్ణమనాయుడు(55) అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. అతని గుండె, కిడ్నీలను వేలూరు నుంచి చెన్నైకి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. బం గారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు గత నెల 28న బంగారుపాళెం-అరగొండ రహదారి ఎంపీడీవో కార్యాలయం సమీపం లో మోటారు సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన సరోజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు హరికృష్ణమ నాయుడుకు బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతి అనంతరం అతని అవయవాలు దానం చేసేందుకు ముం దుకొచ్చారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు. గుండెను చెన్నైలోని మలర్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని మియట్ ఆసుపత్రికి, మరొక కిడ్నీని గునాపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీం తో శుక్రవారం ఉదయం 9.25 గంట లకు వేర్వేరు అంబులెన్స్ ద్వారా అవయవాలను చెన్నైకి తరలించారు. అవయవాలను తీసుకెళ్లే సమయంలో ఎ లాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వేలూ రు నుంచి చెన్నై కార్పొరేషన్‌లోని ఆసుపత్రి వరకు అంబులెన్స్‌లకు ముందుగా పెలైట్ వాహనాలు వెళ్లడంతో ఉదయం 11.10 గంటలకు బయలుదేరిన అంబులెన్సులు చెన్నైకి 1.45 గంటల సమయంలోనే చెన్నై ఆసుపత్రికి చేరాయి. అనంతరం మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను అమర్చారు. అదే విధంగా రెండు కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులకు అందజేశారు. అలాగే కళ్లు, లివర్‌ను సీఎంసీ ఆసుపత్రికి దానంగా అందజేశారు. అవయవాలు దానంగా పొందిన కుటుంబ సభ్యులు.. హరికృష్ణమనాయుడు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇతని భార్య రాణియమ్మ. కుమార్తె జాన్సీప్రియ. ఈమె పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోంది. కుమారుడు అజయ్ విదేశాల్లో ఇంజినీర్‌గా పని చే స్తున్నాడు. -
కంప్యూటర్ గేమ్స్‌తో అవాంఛిత జ్ఞాపకాలు దూరం
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. -
మా ఇంటి కత్తిపీట...
నేల మీద నీరు మీద బ్రతకగల ఏకైక ప్రాణి కప్ప. అందుకే దానిని ఉభయ చరము అంటాం. అదే విధంగా మాంసాహారుల్ని, శాకాహారుల్ని సంతృప్తి పరచగల ఏకైక తెలుగువారి వంటకం!! మామిడికాయ పచ్చడి. దీనికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ముద్దపప్పు, మామిడికాయ, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్‌కి మరో ప్రత్యామ్నాయం లేదంటే నమ్మండి. మందు కొట్టిన వాడికి మంచింగ్లో కొరకటానికి, అన్నం తినేటప్పుడు పెరుగన్నంలో నంజుకీ ఉపయోగపడే బహుళార్ధకసాధకం మామిడికాయ పచ్చడి.నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊరు నుండి మామిడి కాయలు వచ్చేవి. వాటిని కడిగి, శుభ్రంగా గుడ్డతో తుడిచి కత్తిపీట కిందపెట్టి, పైన కత్తిని వుంచి, పిడి మీద ఒక గుద్దు గుద్దితే, ఆకాయ రెండు ముక్కలైపోయేది, మరల ఆ రెండు ముక్కల్ని నాలుగు ముక్కులు, ఆ తర్వాత 8 ముక్కలు... ఇలా చేస్తే ఒకకాయకి 16 ముక్కలు వచ్చేవి, ఈలోపు పిల్లలు అటుగావచ్చి ఒక ముక్క, ఇటుగా వచ్చి ఒక ముక్క తీసుకునే వాళ్ళం. కొరికితే పుల్లగా వుండేవి.... అయినా ఇష్టంగా తినేవాళ్ళం... తర్వాత ఆవపిండి కలిపి, నునెలో వేసి జాడీలలోకి పట్టి, వాటిని మచ్చు (అటక) మీద పెట్టి రెండు నెలల తర్వాత తీస్తే, ముక్కలు బాగా నూనె పీల్చుకుని, పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లల్లా తయారయ్యేవి. ఇక పోతే ఆ కత్తి కింద మామిడి ముక్కల్ని కొడితే అది సిక్సర్ కోసం పరిగెత్తే బంతిలా వెళ్లి అటుగా వస్తున్న మా మావయ్య కణతకి తగిలిందొకసారి.... లక్ష్మణస్వామి మూర్చిల్లినట్టుగా అయింది మావయ్య పని. ఆయనకి ఫస్ట్‌ఎయిడ్ చేసి, మరల ఆయన్ని మామూలు మనిషిని చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. ఈ కత్తి పీట చాలా ప్రత్యేకమైనది, చాలా పడుచుగా ఉంటుంది. పొరపాటున వ్రేలు దానికింద పడితే వేలు కట్ అయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. ఎవరు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్నా కత్తిపీట మాదే... ఇంట్లో అందరూ తలా ఒకరికి మాట ఇస్తే, తేడాలు వస్తున్నాయని, ఆ బాధ్యత మా నాయనమ్మకి అప్పగించారు. ఆమె ఎవరికి ఏ రోజు ఇస్తానని మాట ఇచ్చిందో, దానిని క్యాలెండర్ మీద రాసుకునేది... అంటే ఇప్పుడు హీరోయిన్ కాల్షీట్లు చూసే మేనేజర్‌లాగా అన్నమాట... ఒక రోజు మా స్కూల్లో వేసే నాటకానికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సివచ్చింది. ఉత్సాహంగా పేర్లు ఇచ్చాం చాలామంది. అందర్నీ స్క్రూటినీ చేసి ఇద్దరి ఫైనల్స్‌కి వచ్చాం. నేనూ... ఇంకో ఫ్రెండ్...నా దురదృష్టం, ఆ రోజు వాడింట్లో మామిడికాయ పచ్చడి పట్టారు. వాడు వాళ్ల అమ్మని, నాన్నని తీసుకుని రాత్రికి రాత్రే మాస్టారి ఇంటికి వెళ్ళి మామిడికాయ జాడీ మాస్టారికి ఇచ్చారు. అంతే రెండో రోజు స్కూల్లో ఆ వేషానికి వాడిని తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. తర్వాత తెలిసింది నాకు ఇదంతా మామిడికాయ పచ్చడి మహత్యం అని... అదీ నాకు తెలిసిన మామిడికాయ పచ్చడి గురించిన జ్ఞాపకాలు... - శివ నాగేశ్వరరావు -
అక్షరాలతో కట్టిన గుడి...
సుప్రసిద్ధ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశర్మ కథలు ఎంత ప్రసిద్ధమో ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ అంతే ప్రసిద్ధం. శ్రీపాద జీవితం తెలుసుకోవడం కోసం మాత్రమే గాకుండా ఒకనాటి తెలుగు సమాజపు పోబడికీ, పలుకుబడికీ దర్పణంగా కూడా ఈ ఆత్మకథను చూస్తారు. దీనిని చదివి ఎందరెందరో గొప్పవాళ్లు ప్రశంసలు కురిపించారు. మహా పండితులు వేలూరి శివరామశాస్త్రి ఏమన్నారో చూడండి.... మీ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివాను. చదివించాను. ఆ చదివినవారూ నేనూ కూడా ఒక్క గుక్కలో చదివాం. ఇంకా ఇది (చదవాలని కుతూహలపడి తీసుకువెళుతున్నవారి వల్ల) వేయిళ్ల పూజారిగానే ఉంది. తెలుగు గుడి కట్టాలి కట్టాలి అని పరితపించిన శ్రీరామచంద్రశాస్త్రిగారు గనక బతికి ఉంటే అక్షరాలతో కట్టిన ఈ తెలుగు గుడికి ఎన్ని గోపురాలు ఎన్ని సోపానాలు కట్టి ఉండేవారో కదా. తెలుగువారిలో తెలుగుదనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది. ‘అది ఎప్పుడో ఉండేది’ అని కూడా మన తెలుగు పిల్లలెరగరు. ‘నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెద వాండ్రా’ అని నేను సుమారు నలుబది ఏండ్ల క్రితం ప్రశ్నించాను. మీ పుస్తకమున్నూ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆంధ్ర పురాణమున్నూ వచ్చినవి. చాలు-కాలో హ్యయం నిరవధి ద్విపులా చ పృధ్వీ. ఈ సంపుటంలో అంతరంగా ఉన్న తెలుగుదనమూ దానికి చాలకమైన స్వయంకృషీ వీనికి దేవతలు కూడా సంతోషిస్తారు. తెలుగువారిలో తెలుగుదనం ఉన్నదని ఈ పుస్తకం కళ్లు తెరిపిస్తుంది. ప్రతి హైస్కూలులోనూ ప్రతి కాలేజీని ప్రతి తెలుగు వ్యక్తినీ ఈ పుస్తకం చదవమని అనురోధిస్తాను. ‘తెలుగుభాష’ ఆడవాళ్లలో ఉన్నదని రాశారు. ‘కాంతా సమ్మితతయా ఉపదేశయుజే’ అని చెప్పినవాడు తెలియకుండా మీ నోట్లో నుంచి ఊడి పడ్డాడు. దానికీ కొంత తేడా లేకపోలేదుగాని తరచి చూస్తే ఈ రెండూ ఒకదాని అవతారాలే. భేష్. -
వీబీ రాజేంద్రప్రసాద్ స్మృతులు
-
ఎన్నో దేశాలకు చేదు జ్ఞాపకాలు
పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం... 2014లో ప్రపంచ దేశాలకు ఓ పెద్ద సవాల్‌గా మిగిలింది. ఎబోలా వైరస్ వేలాది మందిని బలితీసుకున్నదీ ఈ ఏడాదిలోనే. వీటికి తోడు విమాన ప్రమాదాలు... ఇలా 2014లో ఎన్నో విషాద ఘటనలను ప్రపంచం ఎదుర్కొన్నది. ఉక్రెయిన్‌లో ప్రజాగ్రహం... తిరుగుబాటు ఉక్రెయిన్ ప్రజలు యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను ఆశిస్తుంటే, అధ్యక్ష స్థానంలో ఉన్న యానుకోవిచ్ రష్యాతో సంబంధాలను కోరుకోవడంతో సంక్షోభం రగిలింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో వంద మందికిపైగా మృతిచెందారు. యానుకోవిచ్ ఫిబ్రవరి 22న రష్యాకు పరారయ్యారు. తర్వాత రష్యన్లు 60 శాతం ఉన్న క్రిమియాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్చి 1న తమ సైన్యాన్ని ఉక్రెయిన్ చుట్టూ మోహరించి, క్రిమియాను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రిఫరెండమ్‌లో 97 శాతం క్రిమియన్లు రష్యాలో ఉండేందుకు ఓటేయడంతో అది రష్యాలో కలిసింది. విమాన విషాదాలు అత్యధిక విమాన ప్రమాదాలు జరిగిన సంవత్సరంగా 2014 చరిత్రలో నిలిచిపోనుంది. హా మార్చి 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానం గమ్యాన్ని చేరకుండానే అదృశ్యమైపోయింది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. హా జూలై 17న 298 మందితో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం-17 ఉక్రెయిన్‌లో కూల్చివేతకు గురైంది. అందరూ మృతి చెందారు. హా జూలై 24న 116 మందితో బుర్కినాఫాసో నుంచి అల్జీరియాలోని అల్జీర్స్‌కు వెళుతున్న ఎయిర్ అల్జీర్ విమానం మాలిలో కూలిపోగా ఒక్కరూ బతికి బయటపడలేదు. హా డిసెంబర్ 28న ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ వెళ్తున్న ఎయిర్ఆసియా విమానం ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎబోలా సవాల్ ఎబోలా అనే ప్రాణాంతక వైరస్ ఈ ఏడాది ప్రపంచ దేశాలను వణికించింది. 2013 డిసెంబర్లో గినియాలో కళ్లు తెరచిన ఈ మహమ్మారి ఈ ఏడాది ఆఫ్రికా దేశాలపై బలమైన పంజా విసిరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 7,645 మందిని బలితీసుకోగా, 19 వేల కేసులు నమోదయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఇరాక్, సిరియాల్లోని చిన్నచిన్న ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)గా ఏర్పడ్డాయి. ఇది తన పేరును ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా మార్చుకుంది. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంది. పలు దేశాల వారిని బందీలుగా చేసుకుని వారి తలలు నరికి ఆ వీడియోలను విడుదల చేసింది. ఐఎస్ చెరలో 39 మంది భారతీయులు ఉన్నారు. పెషావర్ మారణహోమం పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఉన్న సైనిక పాఠశాలలోకి డిసెంబర్ 16న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు చొరబడి 133 మంది విద్యార్థులను కాల్చి చంపారు. మరిన్ని ముఖ్యమైన పరిణామాలు.. హా నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు ఏప్రిల్ 14న ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి 276 మంది విద్యార్థినులను అపహరించుకుని పోయారు. హా ఇజ్రాయెల్ దాడుల్లో 2,100 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు హా బ్రిటన్‌తోనే కలిసుండాలా లేక స్వాతంత్య్రం కావాలా? అన్న అంశంపై సెప్టెంబర్‌లో స్కాట్లాండ్లో జరిగిన ఓటింగ్‌లో... బ్రిటన్‌తోనే కలసి ఉంటామంటూ మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. -
2014 మెమోరీస్!
-
కొత్త చోటు
వేటాడే జ్ఞాపకాల నుంచి ఎందాక పారిపోగలవు వెంటాడే నీడల నుంచి ఎట్లా తప్పించుకుపోగలవు...? ఇక్కడ అవే నది నీళ్లు కొత్తగా అరుచిగా అనామోదితంగా ఇక్కడ అదే ఊరి గాలి పరాయిగా, పరాకుగా,అయిష్టంగా.... ఎక్కడో పోగొట్టుకున్నది వేరెక్కడో వెతుకుతున్నట్టు ఎప్పుడూ కోల్పోనిదాన్ని ఇప్పుడు అనునిత్యం పోగొట్టుకుంటున్నట్టు పరాధీన జీవనం పావన మౌనంలో తడిచి ముద్దయిపోతున్నట్టు ఎవ్వరూ ఎన్నడూ వినని గంట యేదో ఎవరూ కొట్టకుండానే చెవులలో మోగుతున్నట్టు. కాళ్లు నేల మీద ఆనడం లేదేమిటో ఏమిటో కళ్లు చూపుకి తగిలిన దేనినీ చూడటం లేదు రుచుల జాడ మరిచిన నాలుక సుఖం సోయి మరిచిన శరీరం అవే మాటలు, అవే రణగొణలు ఇప్పుడేమిటో కొత్తగా ధ్వనిస్తున్నాయి ముందుకు దొర్లిపోవలసిన శకట చక్రాలు వెనక్కి బలవంతంగా తిరిగిపోతున్నట్టు ఎక్కడో పెరిగిన చెట్టును పెకలించుకు వచ్చి ఇక్కడ కొత్త మట్టిలో మొక్కగా మార్చి పాతుతున్నట్టు జ్ఞాపకాలు చిరిగిన జెండా ముక్కలై తలో దిక్కుకు నాలుకలు చాచి యెగురుతున్నట్టు పారిపోతున్న నన్ను పట్టుకుని ఇక్కడ కుర్చీలకీ మంచాలకీ కట్టిపడేస్తున్నట్టు వేటాడే నీడల నుంచి ఎందాకా పారిపోగలనో ఏ దిశగా మారిపోగలనో - దేవీప్రియ -
ఐ డోంట్ వాంట్!
‘టిప్ టిప్ బర్సా పానీ...’ అంటూ ఆనాడు టెంపరేచర్ రైజ్ చేసిన రవీనాటాండన్ ఉన్నట్టుండి ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంది. తాను ఎంత స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసినా ఏ నాడూ అనవసరపు సంచలనాలకు పోలేదని గుర్తు చేసుకుంది. ఇప్పుడు కూడా ఆ అవసరం లేదంటోండి. ‘నా భర్త బిజినెస్‌మ్యాన్. బాగా సంపాదిస్తాడు. సినిమాలు చేయకపోయినా ఇబ్బంది లేదు. మా అబ్బాయి ఊడిపోయే పళ్లు చూసుకొంటూ అయినా కాలం గడిపేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది రవీనా. ఈ సొట్ట బుగ్గల అమ్మడు ప్రస్తుతం ‘బాంబే వెల్వెట్’లో చేస్తోంది. -
తిమిరంపై సమరం
దీపావళి జ్ఞాపకాలు ఆనందదాయకంగానే ఉండాలి కానీ... దేహం మీద గాయాలను చూసుకుని ఫలానా ఏడాది దీపావళి టపాకాయలు కాలుస్తున్నప్పుడు అంటూ... చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పరిస్థితి రాకూడదు. అందుకే తగిన ముందు జాగ్రత్తలతోబాటు, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు నిపుణుల సూచనలు, సలహాలు ఇవి... దీపావళి గాయాలకు ప్రధానంగా దీపాలు, టపాకాయలు, ఇంటికి మంటలంటుకోవడం అనే మూడు కారణాలు ఉంటాయి. వెలుగుతున్న దీపానికి దుస్తులు తగిలి మంటలు వ్యాపిస్తాయి. అలాగే టపాకాయలు, కాకరపూల వంటి వాటి నుంచి వచ్చే నిప్పురవ్వలు దుస్తులమీద, ఒంటి మీద పడి ఒళ్లు కాలడం సాధారణంగా సంభవించే ప్రమాదం. ఇక కొన్ని సందర్భాల్లో వెలుగుతున్న దీపం ప్రమిద లేదా కొవ్వొత్తి ఒలికి పోయి కర్టెన్లు, సోఫాల వంటివి అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంటుంది. వీటి బారిన పడకుండా కొన్ని ముందు జాగ్రత్తలు... టపాకాయలు కాల్చేటప్పుడు లో దుస్తులతోపాటు మొత్తం నూలు దుస్తులనే ధరించాలి. పట్టు వస్త్రాలు, నైలాన్వంటి సింథటిక్ దుస్తులను ధరించరాదు. వదులుగా విచ్చుకున్నట్లు ఉండే గాగ్రాలు వేసుకోరాదు. చీరలకు పల్లును నడుముకు చుట్టుకోవాలి. ఒళ్లు కాలిన వెంటనే దుస్తులను తొలగించాలి. అపార్ట్మెంట్ల దగ్గర నివసించే వాళ్లు రాకెట్లను కాల్చకూడదు. అవి దిశ మార్చుకుని ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. టపాకాయలు కాల్చే వేళలో ఎవరూ దుస్తులు బయట ఆరవేయకూడదు. నిప్పురవ్వలు పడి మంటలు వ్యాప్తి చెందవచ్చు. చిచ్చుబుడ్లు, బాంబులు ఇతర ఏ రకమైన టపాకాయ అయినా ఒకసారి కాల్చినప్పుడు వెలగకపోయినా, ఒత్తి వరకు వెలిగి ఆరిపోయినా దగ్గరగా వెళ్లి ఊదడం, కదిలించి చూడడం వంటి ప్రయత్నాలు చేయకూడదు. టపాకాయలు కాల్చేటప్పుడు పాదరక్షలు ధరించాలి. ప్రథమ చికిత్స గాయపడిన వాళ్లు భయంతో పరుగెడుతుంటారు. కానీ ఉన్నచోటనే నిలబడాలి. పరుగెత్తితే అగ్నికి వాయువు తోడయినట్లే. గాలిలోని ఆక్సిజన్ గాయాల తీవ్రతను పెంచుతుంది. గాయం మీద పదిహేను నిమిషాల పాటు నీటిని (చన్నీరు, వేడి నీరు పోయరాదు) ధారగా పోయాలి లేదా నీటి కుళాయి కింద పెట్టాలి. గాయమైన అరగంట లోపల ఈ చికిత్స జరగాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గిపోతుంది. గాయం తీవ్రత తగ్గుతుంది. చర్మం మీద వేడి ఎక్కువ సేపు ఉంటే గాయం తీవ్రత పెరుగుతుంది. గాయం మీద నీటిని పోయడం అనే చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల గాయం తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. గాయాన్ని శుభ్రం చేసి బర్నాల్, సోఫ్రామైసిన్, సిల్వర్ ఎక్స్ వంటి ఆయింట్మెంట్లు కానీ, స్వచ్ఛమైన తేనె, కొబ్బరి నూనె (ఏదో ఒకటి) రాసి నూలు వస్త్రంతో కప్పాలి. కాలిన గాయం బొబ్బలెక్కినట్లయితే పరిశుభ్రమైన సూదితో గుచ్చి బొబ్బల్లో నీటిని తొలగించాలి. నీరు తొలగించకపోతే గాయానికి ఇన్ఫెక్షన్ చేరుతుంది. గాయానికి జన్షన్ వయొలెట్, టూత్ పేస్టులను రాస్తుంటారు. ఇందులోని రసాయనాలు గాయం తీవ్రతను పెంచుతాయి. గాయం తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతుంది. గాయపడిన వారికి గాలి విసురుతుంటారు. ఇలా చేస్తే నరాల చివర్లు (నర్వ్ ఎండింగ్స్) చైతన్యవంతమై నొప్పి పెరుగుతుంది. ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి? చేతులు, ముఖం మీద గాయమైనా, పొగను ఎక్కువగా పీల్చినా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ చేత చికిత్స చేయించుకోవాలి. అయితే చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మాత్రం చిన్నపాటి గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. - డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్లాస్టిక్ సర్జన్, కేర్ ఆసుపత్రి అపోహ కాలిన గాయం మీద నీటిని పోయరాదు. నీటిని పోస్తే బొబ్బలొస్తాయి. వాస్తవం నీటిని పోయడం వల్ల గాయం వేడి తగ్గి తీవ్రత తగ్గుతుంది. గాయం త్వరగా మానుతుంది. కళ్లకు గాయం అయితే... కంటికి చువ్వలాంటిది తగిలి గాయం అయినప్పుడు వెంటనే చేత్తో కంటిని రుద్దుతారు. ఇది చాలా ప్రమాదం. చేతికి అంటిన రసాయనాలు కంటికి తగిలి గాయం తీవ్రత పెరగడానికి, గాయం విస్తరించడానికి కారణం అవుతాయి. కంటికి గట్టిగా కట్టు కట్టకూడదు. ఇలా చేస్తే కంట్లో గుచ్చుకున్న నలుసు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాయమైన కంటిని కప్పు లేదా షీల్డుతో కప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. రసాయనాలు కంట్లో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కంటిని రుద్దకుండా దోసిలితో నీటిని తీసుకుని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి. తీవ్రమైన గాయాలే కాక కంటికి ఏ చిన్న గాయమైనా సరే దానిని నిర్లక్ష్యం చేయరాదు. ఒకసారి కంటి వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స చేయించుకోవాలి. ఈ చిన్న గాయం భవిష్యత్తులో దృష్టిలోపానికి దారి తీయకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. పెద్దవాళ్లు దగ్గరుండి పిల్లల చేత టపాకాయలు కాల్పించాలి. చిన్నపిల్లల చేత చిచ్చుబుడ్లు, భూచక్రాలు, బాంబుల వంటి ప్రమాదకరమైన టపాకాయలను కాల్పించకూడదు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాల దగ్గర టపాకాయలు కాల్చకూడదు. టపాకాయలు కాల్చేటప్పుడు నీటి బకెట్‌ని కానీ, ఇసుక తొట్టెని కానీ దగ్గర ఉంచుకోవాలి. కాకరపూలు కాల్చిన వెంటనే ఆ ఇనుప కడ్డీలను నీటిలో లేదా ఇసుకలో వేయాలి. విశాలమైన ఖాళీ ప్రదేశంలోనే కాల్చాలి. ఇలా చేయడం వల్ల టపాకాయల నుంచి వెలువడిన పొగ త్వరగా గాలిలో కలిసిపోతుంది. క్లోజ్డ్ ఏరియాలో కాల్చినప్పుడు పొగ ఆ ఆవరణలోనే తిరుగుతూ ఉండడం వల్ల ఆ గాలినే పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తలెత్తవచ్చు. ముఖ్యంగా చంటి పిల్లలకు, వృద్ధులకు, ఆస్త్మా పేషెంట్లకు ఇది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఫస్ట్ డిగ్రీ బర్న్స్‌కి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. అవుట్ పేషెంటుగానే చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. చెవికి వాటిల్లే ప్రమాదాలు బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే శబ్దం, పొగ, రసాయనాలు రకరకాల దుష్ర్పభావాలకు కారణాలవుతుంటాయి. ఇతర ప్రభావాలెలా ఉన్నా శబ్దం ప్రతి ఒక్కరినీ బాధించే దుష్పరిణామం. ఇది స్వయంగా కాల్చే వారినే కాకుండా దూరంగా ఉన్న వారినీ వదలదు. శబ్దం వల్ల చంటిబిడ్డలు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతుంటారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దాన్ని విన్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని ఇంపల్స్ సౌండ్ ఎఫెక్ట్ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే... అకస్మాత్తుగా చెవి దిబ్బడ పడినట్లు ఉండడం (ఇయర్ బ్లాక్) చెవిలో నొప్పి, గుయ్ మంటూ శబ్దం వినిపించే టినిటస్ వంటివి రావచ్చు నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం ఇయర్ డ్రమ్ దెబ్బతినవచ్చు టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్... ఈ స్థితిలో తాత్కాలికంగా వినికిడి లోపిస్తుంది. 16 - 48 గంటల్లో దానంతట అదే సర్దుకుంటుంది. ఈ కాలవ్యవధిలో తగ్గకపోతే చికిత్స తప్పనిసరి. జాగ్రత్తలు ఇలా! చెవిలో దూది పెట్టుకోవడం వల్ల ఏడు డెసిబుల్స్‌ను మాత్రమే నియంత్రించవచ్చు. దీపావళి టపాకాయల శబ్దం 100-120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కాబట్టి దూది వల్ల పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. చెవిలో ఏర్పడిన అసౌకర్యం తగ్గడానికి నూనెలు, నీళ్లు, ఇయర్ డ్రాప్స్ వేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఇఎన్‌టి నిపుణులను సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలు చేసి చికిత్స చేయాల్సి ఉంటుంది. బాణాసంచా కాల్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకుని గార్గిలింగ్ చేయాలి. పిల్లలు టపాకాయలను కాల్చిన చేతులతోనే ముక్కు, చెవులు, కళ్లను రుద్దుకుంటారు. ముక్కు దగ్గర రుద్దితే రసాయనాల ప్రభావం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్ కుమార్, ఈఎన్టీ నిపుణులు