Mahesh Babu Shares Lovely Pics With His Family From Italy Trip, Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu Italy Trip Pics: ఇక్కడ జ్ఞాపకాలు రూపుదిద్దుకుంటున్నాయి: మహేశ్‌ బాబు

Published Thu, Jun 16 2022 8:24 PM | Last Updated on Fri, Jun 17 2022 8:40 AM

Mahesh Babu Making Memories With His Family In Italy - Sakshi

Mahesh Babu Making Memories With His Family In Italy: సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో తెలిపాడు సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు. సినిమా పూర్తయితే అయితే చాలు భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఇటీవల మహేశ్‌ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన 'మేజర్‌' మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. 

అలాగే ఇంతకుముందు ఇటలీలో దిగిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు మహేశ్‌ బాబు. తాజాగా ఇటలీలోని మిలాన్‌ వీధుల్లో దిగిన సెల్ఫీ ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ ఫొటోల్లో కుమార్తె సితారతో కలిసి మహేశ్‌ బాబు ఫన్నీగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూడొచ్చు. ఈ ఫొటోలకు 'ఇప్పుడు.. ఇక్కడ.. జ్ఞాపకాలు రూపుదిద్దుకుంటున్నాయి. రోజులో ఒకసారి. నా కుటుంబం' అని క్యాప్షన్‌ ఇచ్చాడు మహేశ్‌ బాబు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement