
Shriya Saran Memories With Her Daughter Radha In Beach: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్‌గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. వివాహ అనంతరం నుంచి అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది శ్రియా. ఇటీవలే ఆమెకు కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్‌లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది శ్రియా. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుంది.
ఈ క్రమంలో గోవా బీచ్‌లో తన కూతురు రాధ చేతులు పట్టుకుని నడిపించడం శ్రియా తల్లి ప్రేమను చూపిస్తోంది. ఈ ఇన్‌స్టా స్టోరీలో శ్రియా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. కుమార్తెతోపాటు తన భర్త ఆండ్రీతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది శ్రియా. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్ చేస్తూ ఒక స్టోరీలో 'లవ్ అండ్ హ్యాపినెస్ టూ యూ ఆల్' అని 'గ్రేట్‌ఫుల్' అని స్మైలింగ్ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్ ఇచ్చింది. మరొక స్నాప్‌షాట్‌లో శ్రియా సరన్ ట‍్యాంక్ టాప్, షార్ట్ ధరించి కొబ్బటి చెట్టుపై వయ్యారంగా వాలుతూ ఫోజులిచ్చింది. అందులో నీలి సముద్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ స్టోరీని ఉద్దేశించి 'హ్యాపీ హాలీడేస్ గాయ్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చిందీ మదర్ బ్యూటీ.
వీటితోపాటు మరికొన్ని స్టోరీలు షేర్ చేస్తూ ఈ ఏడాది డైవ్ చేద్దాం.. 2022 అందమైన జ్ఞాపకాలతో నిండి ఉండాలని కోరుకుందాం అని క్యాప్షన్స్ ఇచ్చింది శ్రియా సరన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్‌లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్.
Comments
Please login to add a commentAdd a comment