Goa beach
-
భార్య వేధింపులతో ఎంజాయ్ కోసం గోవాకు టూర్
యశవంతపుర: భార్య వేధింపులతో విసిగి వేసారిన ఓ కాంట్రాక్టర్ గోవాలో ఎంజాయ్ చేసేందుకు లక్షల రూపాయల నగదుతో వెళ్తూ దారి తప్పి తనిఖీ అధికారుల బారినపడ్డాడు. వివరాలు.. బెళగావి చెక్‌పోస్ట్‌లో ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన కారును సోదా చేశారు. అందులో రూ.28 లక్షల నగదు లభ్యమైంది. ఆరా తీయగా తాను ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టర్‌నని పేర్కొన్నాడు. ఇంత పెద్దమొత్తంలో నగదును ఎందుకు తీసుకెళుతున్నట్లు ప్రశ్నించగా భార్య పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఎంజాయ్ చేయటానికి గోవాకు వెళుతున్నట్లు తెలిపారు. అన్లైన్లో డబ్బు పంపితే భార్యకు తెలుస్తుందనే భయంతో నగదు తీసుకొని వెళుతున్నట్లు అంగీకరించాడు. గూగుల్ మ్యాప్ ఆధారంగా గోవా వెళ్తుండగా పొరపాటున బెళగావి రూట్లో వచ్చినట్లు తెలిపాడు. బెళగావి మార్కెట్ పోలీసులు నగదు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
గోవా బీచ్‌లో అందంతో ఫిదా చేస్తున్న స్రవంతి చొక్కారపు (ఫోటోలు)
-
గోవా బీచ్‌లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్..
-
గోవా బీచ్‌లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్.. కూతురితో కలిసి
Shriya Saran Memories With Her Daughter Radha In Beach: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. వివాహ అనంతరం నుంచి అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది శ్రియా. ఇటీవలే ఆమెకు కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది శ్రియా. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో గోవా బీచ్‌లో తన కూతురు రాధ చేతులు పట్టుకుని నడిపించడం శ్రియా తల్లి ప్రేమను చూపిస్తోంది. ఈ ఇన్‌స్టా స్టోరీలో శ్రియా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. కుమార్తెతోపాటు తన భర్త ఆండ్రీతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది శ్రియా. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్ చేస్తూ ఒక స్టోరీలో 'లవ్ అండ్ హ్యాపినెస్ టూ యూ ఆల్' అని 'గ్రేట్ఫుల్' అని స్మైలింగ్ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్ ఇచ్చింది. మరొక స్నాప్‌షాట్‌లో శ్రియా సరన్ ట్యాంక్ టాప్, షార్ట్ ధరించి కొబ్బటి చెట్టుపై వయ్యారంగా వాలుతూ ఫోజులిచ్చింది. అందులో నీలి సముద్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ స్టోరీని ఉద్దేశించి 'హ్యాపీ హాలీడేస్ గాయ్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చిందీ మదర్ బ్యూటీ. వీటితోపాటు మరికొన్ని స్టోరీలు షేర్ చేస్తూ ఈ ఏడాది డైవ్ చేద్దాం.. 2022 అందమైన జ్ఞాపకాలతో నిండి ఉండాలని కోరుకుందాం అని క్యాప్షన్స్ ఇచ్చింది శ్రియా సరన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్. -
షర్ట్ లేకుండా బాలీవుడ్ బ్యూటీతో విజయ్.. ఫోటో వైరల్
విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్‌కి అంతే రేంజ్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఈ రౌడీ స్టైల్‌కి పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇప్పటికే సారా అలీఖాన్, శ్రద్ధా, జాన్వీకపూర్‌లు విజయ్ తమ ఫేవరెట్ అని హీరోయిన్ అని స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ బ్యూటీ కియారా కూడా చేరిపోయినట్లుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండపై తన ఇష్టాన్ని తెలిపింది కియారా. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి దిగిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న విజయ్-కియారాల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటో ఎప్పుడు తీసుకున్నారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
మరోసారి బుక్కైన మిలింద్ సోమన్
పనాజీ: మొన్న వివాదాస్పద ఫోటోషూట్ వివాదంలో మోడల్ నటి పూనం పాండే, ఆమె భర్తపై కేసు నమోదు కాగా ఇలాంటి మరో వివాదంతో తాజాగా మరో మోడల్ నటుడు మిలింద్ సోమన్(55) బుక్కయ్యారు. ఈ నెల 4వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా గోవాలోని ఒక బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన ఫోటో వైరల్ కావడంతో మిలింద్ఫై శుక్రవారం కేసు నమోదైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోవా సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. (బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా..) అనంతరం మిలింద్ సోమన్‌కు బెయిల్ లభించింది. వీడియోలు లేదా చిత్రాలు, ప్రొఫెషనల్ షూట్ వారి వారి వ్యక్తిగత విషయాలు. అయినప్పటికీ, ఏదైనా అభ్యంతరం, ప్రజా ఆగ్రహం వ్యక్తమైతే తప్ప అశ్లీలం లేదా అనైతికమైనవిగా చెప్పలేమని, భావ వ్యక్తీకరణ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని బెయిల్ ఉత్తర్వులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కెనకోనా అభిప్రాయపడ్డారు. మరోవైపు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంపై మిలింద్ ఇంకా స్పందించలేదు. కాగా మోడలింగ్ రంగ సంచలనం మిలింద్ సోమన్‌కు వివాదాలు కొత్తేమీకాదు. ఈ తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ఇది రెండవసారి. తొలిసారి బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి చేసిన కండోమ్ యాడ్అప్పట్లో పెద్ద సంచలనమే. 1995లో మధుసాప్రేతో కలిసి నగ్నంగా కొండ చిలువను మెడలో వేసుకొని నటించడం సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ కేసులో14 సంవత్సరాల న్యాయ విచారణ తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. -
గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి
-
గోవా బీచ్‌లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి
జగ్గయ్యపేట: గోవా బీచ్‌కి వెళ్లిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వైద్యురాలు మంగళవారం మృత్యువాత పడింది. అలల తాకిడికి యువతి సముద్రంలోకి కొట్టుకుపోయింది. జగ్గయ్యపేటలోని మార్కండేయ బజార్‌కు చెందిన ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ కొంత కాలం క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె రమ్యకృష్ణ (25) ఎంబీబీఎస్ పూర్తి చేసి జగ్గయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత కాలం పని చేసింది. మూడేళ్ల క్రితం గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి -
గోవాలో బ్రిటన్ మహిళపై లైంగిక దాడి
పనాజి : గోవాలో బ్రిటన్ టూరిస్ట్‌పై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. గోవాలో గురువారం ఉదయం బీచ్ వద్దకు వెళుతున్న 48 సంవత్సరాల బ్రిటన్ పర్యాటకురాలిపై దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, లైంగిక దాడి అనంతరం ఆమె వస్తువులను అపహరించాడని పోలీసులు తెలిపారు. పనాజీకి వంద కిలోమీటర్ల దూరంలోని కనాకొన పట్టణంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నేరానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని దక్షిణ గోవా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు పాలోలెమ్ బీచ్‌కు వెళుతుండగా అడ్డగించిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన నిందితుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పంటపొలంలోకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి చెందిన మూడు బ్యాగులను దొంగిలించి పారిపోయాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు గత పదేళ్ల నుంచి తరచూ గోవాను సందర్శిస్తున్నారని తెలిపారు. -
గోవా బీచ్‌లో తాండూరు వాసి హత్య
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యక్తి గోవా బీచ్‌లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతడిని హతమార్చారు. తాండూరు సీతారాంపేట్‌కు చెందిన సచిన్ దూమాలే(37)కు 14 ఏళ్ల క్రితం సంగీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు నూతన్, ఆర్తీలు ఉన్నారు. సచిన్ పాత బట్టలను గోవా, ముంబై నుంచి సేకరించి తాండూరు మార్కెట్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తన వద్ద స్టాక్ లేకపోవడంతో పాత బట్టలను తీసుకువచ్చేందుకు జూన్ 20న గోవా వెళ్లాడు. గోవాకు వెళ్లిన సచిన్ ఐదు రోజులైన ఫోన్ చేయకపోవడంతో సంగీత ఆందోళనకు గురైంది. శనివారం గోవా పోలీస్‌స్టేషన్ నుంచి సంగీతకు ఫోన్ వచ్చింది. వాట్సాప్‌లో ఫొటో పంపిస్తున్నాం.. గుర్తు పట్టండి అంటూ మృతుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఫోన్ చేశారు. ఫొటోలు చూసిన సంగీత తన భర్త సచిన్ అని గోవా పోలీసులకు చెప్పింది. గోవా బీచ్‌లో మూడ్రోజుల క్రితం హత్యకు గురయ్యాడని తెలిపారు. దీంతో సచిన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబీకులు గోవాకు బయల్దేరారు. వీధినపడిన కుటుంబం.. తాండూరులో పాత బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే సచిన్ దూమాలే హత్యకు గురికావడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ స్థితి కావడంతో పెద్దదిక్కును కోల్పోయి భార్య, పిల్లలు అనాథలయ్యారు. సచిన్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. -
గోవా బీచ్‌లో అనూహ్య ఘటన
-
గోవాలో 11మంది పర్యాటకుల అరెస్ట్
పణాజి : గోవా పోలీసులు బుధవారం 11 మంది పర్యాటకులను అరెస్ట్ చేశారు. నార్త్ గోవాలోని బాగా బీచ్‌లో మైనర్‌పై వేధింపులకు పాల్పడినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఓ కుటుంబం మంగళవారం బాగా బీచ్‌కు వెళ్లింది. తల్లిదండ్రులు ఫుడ్ స్టాల్‌కు వెళ్లగా అన్నాచెల్లలు ఇద్దరు బీచ్‌లోనే కూర్చున్నారు. అటుగా వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను ఫొటోలను తీయడం ప్రారంభించారు. దీనిని ప్రశ్నించిన బాలిక సోదరుడిపై దాడికి దిగారు. అంతేకాకుండా బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు కలన్‌గుటే పోలీసులును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన పోలీసులు పర్యాటకులు రాష్ట్రం దాటి వెళ్లకముందే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని పూణెకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన 11 మందిలో ఇద్దరు మైనర్లు ఉండటంతో వారిని ప్రొటెక్షన్ హోంకు తరలించినట్టు పోలీసు అధికారి డాల్వి తెలిపారు. ఆ మైనర్ ఫొటోలను తీయడానికి వినియోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. -
స్నేహితుడి ఎదుటే దారుణం..ఇద్దరి అరెస్టు
పనాజి : ప్రేమ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. బీచ్‌లో సరదాగా గడుపుదామని స్నేహితుడితో వెళ్లిన ఇరవై ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గోవాలోని కోవ్లా బీచ్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. తన స్నేహితుడి ఎదుటే యువతిపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనను తమ సెల్ఫోన్లో వీడియో తీసిన నిందితులు విషయాన్ని బయటపెడితే ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ‘అత్యాచార నిందితులు సంజయ్ ధనంజయ్ పాల్ (23), రామ్ సంతోష్ భారియా (19)ను అరెస్టు చేశాం.మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశాం. వీరంతా ఇండోర్‌కు చెందినవారు. గోవా పర్యటనకు వచ్చి ఈ అకృత్యానికి పాల్పడ్డార’ని గోవా (పశ్చిమం) ఎస్పీ అరవింద్ గవాస్ తెలిపారు. పరిసర గ్రామం నుంచి తన స్నేహితుడితో కోవ్లా బీచ్‌కు వచ్చానని బాధితురాలు తెలిపింది. కాగా, యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. -
గోవా రేప్ కేసు నిందితుల విడుదల
పనాజీ: పదిహేనేళ్ల విదేశీ బాలిక రేప్, హత్య కేసులో ఇద్దరు బీచ్ వర్కర్లు శుక్రవారం నిర్దోషులుగా విడుదలయ్యారు. 2008లో బ్రిటన్ కు చెందిన స్కార్లెట్ కీలింగ్ అనే బాలికను గోవాలోని అంజునా బీచ్ లో ఇద్దరు వ్యక్తులు రేప్ చేసి అనంతరం హతమార్చారు. బాధితురాలి శరీరంలోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కించిన నిందితులు ఆమె మరణించే వరకూ హింసించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు బీచ్ లో పనిచేసే శాంసన్ డిసౌజా, ప్లసిడొ కర్వాల్హోలను అరెస్టు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ కేసును విచారించిన గోవా బాలల కోర్టు నిందితులు శాంసన్, ప్లసిడోలను నిర్ధోషులుగా తేల్చుతూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై స్పందించిన బాధితురాలి తల్లి .. తీర్పు తనను షాక్ కు గురిచేసినట్లు చెప్పారు. -
గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు
ఆ కుర్రాడి వయసు రెండున్నరేళ్లు. కానీ అప్పుడే గోవా బీచ్‌లలో షికార్లు కొడుతున్నాడు. మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. అతడెవరో కాదు.. అబ్రామ్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చిన్న కొడుకు. నిన్న కాక మొన్న గుజరాత్లో కొడుకుతో సరదాగా కింద కూర్చుని సందడి చేసిన షారుక్.. ఇప్పుడు అతగాడిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ క్వాడ్ బైక్ ఎక్కించి తిప్పుతూ కావల్సినంత వినోదాన్ని అందించాడు. అబ్రాం కూడా ఆ రైడ్‌ను ఎంతో ఆస్వాదించాడు. చక్కగా నల్లటి టోపీ పెట్టుకుని ఆ బైక్ మీద కూర్చుని కనిపించాడు. పనిలో పనిగా మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా వాళ్లిద్దరినీ వెంటనే తమ కెమెరాలలో బంధించారు. కొంతమంది షారుక్ అభిమానులు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఇంతకుముందు అబ్రాంతో ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి నటిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు వచ్చాయి. వాటికి ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. భవిష్యత్తులో వాళ్లిద్దరూ కలిసి నటిస్తామంటే.. తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు. -
గోవా బీచ్‌లో నగరవాసి మృతి
స్విమ్మింగ్ చేస్తూ మరణించిన ఇంటీరియర్ డిజైనర్ అపర్ణ సాక్షి, హైదరాబాద్: గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నగరవాసి మృతి చెందారు. కుటుంబంతో సహా కలిసి గోవాకు వెళ్లిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అపర్ణా కార్వీ (44) ఆదివారం మరణించారు. స్కూబా డైవింగ్, స్విమ్మింగ్‌లో పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న అపర్ణా చివరికి అదే స్విమ్మింగ్‌లో మృతి చెందడంపై ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లో నివాసముండే అపర్ణ సెలవులు రావడంతో కుటుంబంతో కలిసి గోవాకు వెళ్లారు. సోమవారం తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. బక్రీద్ సెలవు ఉండటంతో తిరుగు ప్రయాణం టికెట్ రద్దు చేసి కొని మరీ అక్కడే ఉండిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గోవాలోని అశ్వం బీచ్‌లో స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఒక్కసారిగా అలలు ఉధృతం కావడంతో తెప్ప మీద పడింది. దీంతో ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరి ఊపిరాడక అక్కడిక్కడే చనిపోయారు. సమయానికి అంబులెన్స్‌లు, లైవ్ జాకెట్లు లేకపోవడంతో మృతి నుంచి తప్పించుకోలేక పోయిందని అపర్ణ స్నేహితుడైన కిమ్స్ ఆస్పత్రి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ పీ రఘురాం ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని నివాసానికి అపర్ణా మృతదేహం వచ్చింది. బుధవారం ఉదయం వెస్పర్వ్యాలీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.