గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు | shahrukh khan seen with abram in goa beach | Sakshi
Sakshi News home page

గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు

Published Sat, Feb 20 2016 3:51 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు

గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు

ఆ కుర్రాడి వయసు రెండున్నరేళ్లు. కానీ అప్పుడే గోవా బీచ్‌లలో షికార్లు కొడుతున్నాడు. మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. అతడెవరో కాదు.. అబ్రామ్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చిన్న కొడుకు. నిన్న కాక మొన్న గుజరాత్‌లో కొడుకుతో సరదాగా కింద కూర్చుని సందడి చేసిన షారుక్.. ఇప్పుడు అతగాడిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ క్వాడ్ బైక్ ఎక్కించి తిప్పుతూ కావల్సినంత వినోదాన్ని అందించాడు. అబ్రాం కూడా ఆ రైడ్‌ను ఎంతో ఆస్వాదించాడు. చక్కగా నల్లటి టోపీ పెట్టుకుని ఆ బైక్ మీద కూర్చుని కనిపించాడు.

పనిలో పనిగా మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా వాళ్లిద్దరినీ వెంటనే తమ కెమెరాలలో బంధించారు. కొంతమంది షారుక్ అభిమానులు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్  చేశారు. కాగా, ఇంతకుముందు అబ్రాంతో ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి నటిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు వచ్చాయి. వాటికి ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. భవిష్యత్తులో వాళ్లిద్దరూ కలిసి నటిస్తామంటే.. తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement